top of page
Writer's picturePrasad Bharadwaj

🍀 06 - SEPTEMBER - 2022 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🍀

🌹🍀 06 - SEPTEMBER - 2022 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🍀🌹

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 06, మంగళవారం, సెప్టెంబరు 2022 భౌమ వాసరే Tuesday 🌹

*🍀. పరివర్తిని - పార్శ్వ ఏకాదశి మరియు బుధ గ్రహ జయంతి శుభాకాంక్షలు మిత్రులందరికీ 🍀*

2) 🌹 కపిల గీత - 66 / Kapila Gita - 66 🌹 సృష్టి తత్వము - 22

3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 105 / Agni Maha Purana - 105 🌹

4) 🌹. శివ మహా పురాణము - 621 / Siva Maha Purana -621 🌹

5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 240 / Osho Daily Meditations - 240 🌹

6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 403 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 403 - 3 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹06, September 2022 పంచాగము - Panchagam 🌹*

*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*

*🍀. పరివర్తిని - పార్శ్వ ఏకాదశి, బుధ గ్రహ జయంతి శుభాకాంక్షలు 🍀*

*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*

*ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : పరివర్తిని - పార్శ్వ ఏకాదశి, బుధ గ్రహ జయంతి, Parivartini’ or Paarsva Ekadasi and Budha Graha Jayanti 🌻*


*🍀. సంకట మోచన హనుమాన్ స్తుతి - 3 🍀*


*3. విజ్ఞాపయంజనకజా - స్థితిమీశవర్యం*

*సీతావిమార్గణ- పరస్య కపేర్గణస్య.*

*ప్రాణాన్ రరక్షిథ సముద్ర తటస్థితస్య*

*ర్జానాతి కో న భువి సంకట మోచనం త్వాం.*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : దేవతల కంటే రాక్షసులు బలవంతులు. ఎందువల్ల? ఈశ్వరుని క్రోధాన్నీ, శత్రుత్వాన్నీ ఎదుర్కొని భరించడానికి ఆయనతో వారు ఒప్పందం చేసుకున్నారు. దేవతలు సుఖప్రదమైన ఆయన ప్రేమానుగ్రహా అనందభారం వహించడానికి మాత్రమే అంగీకరించ గలిగారు.🍀*


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, దక్షిణాయణం,

వర్ష ఋతువు, భాద్రపద మాసం

తిథి: శుక్ల-ఏకాదశి 27:06:16 వరకు

తదుపరి శుక్ల ద్వాదశి

నక్షత్రం: పూర్వాషాఢ 18:10:26

వరకు తదుపరి ఉత్తరాషాఢ

యోగం: ఆయుష్మాన్ 08:15:04

వరకు తదుపరి సౌభాగ్య

కరణం: వణిజ 16:29:35 వరకు

వర్జ్యం: 04:56:12 - 06:24:24

మరియు 25:27:00 - 26:54:24

దుర్ముహూర్తం: 08:31:27 - 09:20:59

రాహు కాలం: 15:20:08 - 16:53:01

గుళిక కాలం: 12:14:22 - 13:47:15

యమ గండం: 09:08:36 - 10:41:29

అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:38

అమృత కాలం: 13:45:24 - 15:13:36

సూర్యోదయం: 06:02:51

సూర్యాస్తమయం: 18:25:54

చంద్రోదయం: 15:16:26

చంద్రాస్తమయం: 01:26:54

సూర్య సంచార రాశి: సింహం

చంద్ర సంచార రాశి: ధనుస్సు

మిత్ర యోగం - మిత్ర లాభం 18:10:26

వరకు తదుపరి మానస యోగం - కార్య లాభం


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🍀. పరివర్తిని - పార్శ్వ ఏకాదశి మరియు బుధ గ్రహ జయంతి శుభాకాంక్షలు మిత్రులందరికీ 🍀*

*ప్రసాద్ భరద్వాజ*


*🍀. Happy Parivarthini - Parsva Ekadasi and Happy Bhudha Graha Jayanthi to All 🍀*


*🌲. బుధ గ్రహ స్తోత్రము 🌲*


*ప్రియంగు గుళికా శ్యామం రూపేణా ప్రతిమం బుధం ।*

*సౌమ్యం సౌమ్య (సత్వ) గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం॥*


ధ్యానం |


భుజైశ్చతుర్భిర్వరదాభయాసి-

గదా వహంతం సుముఖం ప్రశాంతమ్ |

పీతప్రభం చంద్రసుతం సురేఢ్యం

సింహే నిషణ్ణం బుధమాశ్రయామి ||


పీతాంబరః పీతవపుః కిరీటీ చ చతుర్భుజః |

పీతధ్వజపతాకీ చ రోహిణీగర్భసంభవః ||


ఈశాన్యాదిషుదేశేషు బాణాసన ఉదఙ్ముఖః |

నాథో మగధదేశస్య మంత్ర మంత్రార్థ తత్త్వవిత్ ||


సుఖాసనః కర్ణికారో జైత్త్రశ్చాత్రేయ గోత్రవాన్ |

భరద్వాజఋషిప్రఖ్యైర్జ్యోతిర్మండల మండితః ||


అధిప్రత్యధిదేవాభ్యామన్యతో గ్రహమండలే |

ప్రవిష్టస్సూక్ష్మరూపేణ సమస్తవరదస్సుఖీ ||


సదా ప్రదక్షిణం మేరోః కుర్వాణః కామరూపవాన్ |

అసిదండౌ చ బిభ్రాణః సంప్రాప్తసుఫలప్రదః ||


కన్యాయా మిథునస్యాపి రాశేరధిపతిర్ద్వయో |

ముద్గధాన్యప్రదో నిత్యం మర్త్యామర్త్య సురార్చితః ||


యస్తు సౌమ్యేన మనసా స్వమాత్మానం ప్రపూజయేత్ |

తస్య వశ్యో భవేన్నిత్యం సౌమ్యనామధరో బుధః ||


బుధస్తోత్రమిదం గుహ్యం వసిష్ఠేనోదితం పురా |

దిలీపాయ చ భక్తాయ యాచమానాయ భూభృతే ||


యః పఠేదేకవారం చా సర్వాభీష్టమవాప్నుయాత్ |

స్తోత్రరాజమిదం పుణ్యం గుహ్యాద్గుహ్యతమం మహత్ ||


ఏకవారం ద్వివారం వా త్రివారం యః పఠేన్నరః |

తస్యాపస్మారకుష్ఠాది వ్యాధిబాధా న విద్యతే ||


సర్వగ్రహకృతాపీడా పఠితేఽస్మిన్న విద్యతే |

కృత్రిమౌషధ దుర్మంత్రం కృత్రిమాది నిశాచరైః ||


యద్యద్భయం భవేత్తత్ర పఠితేఽస్మిన్నవిద్యతే |

ప్రతిమా యా సువర్ణేన లిఖితా తి భుజాష్టకా ||


ముద్గధాన్యోపరిన్యస్త పీతవస్త్రాన్వితే ఘటే |

విన్యస్య విధినా సమ్యక్ మాసమేకం నిరంతరం ||


యే పూజయంతి తే యాంతి దీర్ఘమాయుః ప్రజాం ధనమ్ |

ఆరోగ్యం భస్మగుల్మాది సర్వవ్యాధి వినాశనమ్ ||


యం యం కామయతే సమ్యక్ తత్తదాప్నోత్య సంశయః ||

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. కపిల గీత - 66 / Kapila Gita - 66🌹*

*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*

*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 22 🌴*


*22. స్వచ్ఛత్వమవికారిత్వం శాంతత్వమితి చేతనః|*

*వృత్తిభిర్లక్షణం ప్రోక్తం యథాపాం ప్రకృతిః పరా॥*


*జలము తన స్వాభావిక స్థితియందు స్వచ్ఛముగా, వికార శూన్యముగా, శాంతముగా ఉండును. కాని, అదే జలము, మట్టి మొదలగు ఇతర పదార్ధముల కలయికచే మలినముగా, వికారముగా, అల్లకల్లోలముగా మారిపోవును. అట్లే చిత్తము కూడా తన సహజస్థితి యందు జలము వలెనే స్వచ్ఛము, వికారరహితము, శాంతముగా ఉండును. అయితే ఇది కూడా ఇతర వృత్తులతో కూడినప్పుడు ఆ చిత్తము మలినముగా, వికారముగా, అశాంతిగా మారిపోవును. ఇదియే చిత్తము యొక్క ముఖ్యలక్షణముగా చెప్పబడినది.*


*ఏ వికారమూ లేనిది చిత్తం. వికారం ఏర్పడితే అంతఃకరణం లేదా బుద్ధి. ఇంకొంచెం వికారం ఏర్పడితే మనసు. అది మనసుగా మారితే సంకల్ప వికల్పాలు, అదే బుద్ధిగా మారితే, సంశయ నిశ్చయాలు, అహంకారముగా మారితే క్రోధమూ, అమర్షమూ వస్తాయి. వికారాలకు చిత్తం అతీతము.*


*సశేషం..*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Kapila Gita - 66 🌹*

*🍀 Conversation of Kapila and Devahuti 🍀*

*📚 Prasad Bharadwaj*


*🌴 2. Fundamental Principles of Material Nature - 22 🌴*


*22. svacchatvam avikāritvaṁ śāntatvam iti cetasaḥ*

*vṛttibhir lakṣaṇaṁ proktaṁ yathāpāṁ prakṛtiḥ parā*


*After the manifestation of the mahat-tattva, these features appear simultaneously. As water in its natural state, before coming in contact with earth, is clear, sweet and unruffled, so the characteristic traits of pure consciousness are complete serenity, clarity, and freedom from distraction.*


*The more one becomes materially contaminated, however, the more consciousness becomes obscured. In pure consciousness one can perceive a slight reflection of the Supreme Personality of Godhead. As in clear, unagitated water, free from impurities, one can see everything clearly, so in pure consciousness, one can see things as they are. One can see the reflection of the Supreme Personality of Godhead, and one can see his own existence as well. This state of consciousness is very pleasing, transparent and sober. In the beginning, consciousness is pure.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 105 / Agni Maha Purana - 105 🌹*

*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*

*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 33*


*🌻. పవిత్రారోపణ విధి - శ్రీధర నిత్యపూజా విధానము - 6🌻*


గణములు, సరస్వతి, నారదుడు, నలకూబరుడు, గురువు, గురుపాదుక. పరమగురువు, ఆతని పాదుక-వీటి పూజయే గురుపంక్తిపూజ. పూర్వసిద్ధ-పరసిద్ధ శక్తులను కేసరములపై పూజింపవలెను. లక్ష్మి, సరస్వతి, ప్రీతి, కీర్తి, శాంతి, కాంతి, పుష్టి-; తుష్టి-వీరు పూర్వసిద్ధశక్తులు, పూర్వాది దిక్కులలో క్రమముగ ఈ శక్తుల పూజ చేయవలెను.


ఇంద్రాదిదిక్పాలకులను గూడ వారి వారి దిక్కులందు పూజింపవలెను. వీరందరి మధ్యయందు శ్రీహరి విరాజిల్లుచుండును. ధృతి, శ్రీ రతి, కాంత్యాదులు పరసిద్ధశక్తులు. మూలమంత్రముచే అచ్యుతుని స్థాపింపవలెను. పూజాప్రారంభమున-

''ఓం అభిముఖో భవ''

పూర్వదిక్కున నా సమీపమున నుండు అని భగవంతుని ప్రార్థింపవలెను. ఈ విధముగ ప్రార్థించి స్థాపించిన పిమ్మట అర్ఘ్యపాద్యాదులను సమర్పించి, గంధాద్యుపచారముల ద్వారా మూలమంత్రముతో అచ్యుతుని పూజింపవలెను.


''భీషయ భీషయ హృదయాయ నమః''

''ఓం త్రాసయ త్రాసయ శిరసే నమః''

''ఓం మర్దయ మర్దయ శిఖాయై నమః

''ఓం రక్ష రక్ష నేత్రత్రయాయ నమః ''

''ఓం ప్రధ్వంసయ ప్రధ్వంసయ కవచాయ నమః''

ఓం హూం ఫట్‌ అస్త్రాయ నమః''


ఈ విధముగ ఆగ్నేయాదివిదిశలయందు క్రమముగా, మూలబీజములతో అంగముల పూజ చేయవలెను. తూర్పు, దక్షిణము, పశ్చిమము, ఉత్తరము ఈ దిక్కులందు మూర్త్యాత్మక ఆవరణముల పూజ చేయవలెను.


వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అని నాలుగుమూర్తులు. అగ్నేయాదివిదిశలయందు క్రమముగ శ్రీ, రతి, ధృతి, కాంతలను పూజింపవలెను. వీరు కూడ శ్రీహరి మూర్తులే. అగ్న్యాదికోణములందు క్రమముగ శంఖ-చక్ర-గదా-పద్మములను పూజింపవలెను. తూర్పు మొదలైన దిక్కులందు శార్‌జ్గ- మసల - ఖడ్గ - వనమాలలను పూజించవలెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Agni Maha Purana - 105 🌹*

*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *


*Chapter 33*

*🌻 Mode of investiture of the sacred thread for the deity and the installation of the deity - 6 🌻*


37. The attendant gods, Sarasvatī, Nārada (sage), Nalakūbara (son of Kubera), the preceptor, the sandals of the preceptor’s preceptor and of the preceptor have to be worshipped.


38-39. The perfections already accomplished and the later perfections, the female energies—Lakṣmī, Sarasvatī, Prīti, Kīrti, Śānti, Kānti, Puṣṭi, Tuṣṭi, Mahendrā etc. have to be worshipped in the middle. Hari, Dhṛti, Śrī, Rati, and Krānti etc. have to be invoked in the middle. Acyuta is established with the principal mystic syllable.


40. Having prayed by saying “Oṃ, have (your) face towards me and come near me,” and having placed the articles of worship and offered scents etc. one has to worship with the principal (mystic syllable).


41. Oṃ (you) frighten, (you) frighten. Again terrorise the heart and head. (You) pound the tuft, commencing with the flames and from the śastra[5] to the astra.[6]


42. (You) protect. (You) destroy. Salutations to the armour. Oṃ, hrūṃ, phaṭ. Salutations to the missile. (One should worship) the parts of the body with the principal mystic letter.


43-44. At first one should worship different forms of idols in the east, south, west and north. Vāsudeva, Saṅkaṛṣaṇa, Pradyumna, Aniruddha, Agni, Śrī, Dhṛti, Rati and Kānti (are) the forms of Hari. The conch, disc, mace, lotus and Agni (should be worshipped) in the east.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹 . శ్రీ శివ మహా పురాణము - 620 / Sri Siva Maha Purana - 620 🌹*

*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 09 🌴*

*🌻. దేవాసురసంగ్రామ వర్ణన - 3 🌻*


ఈతడు కృష్ణుడై వేదమార్గములను విడనాడు ఇతరస్త్రీలకు కులధర్మమును చెడగొట్టి తాను వివామమాడినాడు (24). మరల తొమ్మిదవ అవతారములో వేదమార్గమునను విరోధించే నాస్తిక మతమును స్థాపించి వేదమార్గమును నిందించినాడు (25). ఈ విధముగా ఎవడైతే వేదమార్గమును వీడి పాపమును చేసినాడో, అట్టివాడు ధర్మవేత్తలలో శ్రేష్ఠుడుగా పరిగణింపబడుచున్నాడు. అట్టివాడు యుద్ధములో విజయమునెట్లు పొందును? 926). ఆతని పెద్ద అన్నగారు, పాపాత్ముడు అగు ఇంద్రుడు మహాత్మునిగా పరిగణింపబడు చున్నాడు. వాడు స్వార్థము కొరకై అనేక పాపములను చేసియుండెను (27).


ఇతడు పచ్చి స్వార్థమును గోరి దితి గర్భమును నరికినాడు. గౌతముని భార్యను చెడగొట్టి, బ్రాహ్మణవంశములో పుట్టిన వృత్రుని సంహరించినాడు (28). బ్రాహ్మాణుడు, సోదరియొక్క కుమారుడు, గురువు అగు విశ్వరూపుని తలలను నరికి ఈతడు వేదమార్గమును భ్రష్టమొనర్చినాడు (29). ఇంద్రుడు, విష్ణువు అనేక పర్యాయములు అనేక పాపములను చేసి తేజస్సును, పరాక్రమమును పూర్తిగా పోగొట్టుకొనిరి (30). మీరు వారిద్దరి బలముతో యుద్ధములో విజయమును పొందజాలరు. మీరు మూర్ఖులై ప్రాణములను పోగొట్టు కొనుటకు ఇచటకు ఏల వచ్చితిరి ? (31)


స్వార్థముచే కలుషితమైన మనస్సు గల వీరిద్దరు ధర్మమునెరుంగరు. ఓ దేవతలారా! ధర్మ విహీనమైన కార్యములన్నియూ నిష్ఫలముగు (32). మిక్కిలి గర్వితతులైన వీరిద్దరు ఈనాడు శిశువును నా ఎదుట ఉంచినారు. నేనీ శిశువును వధించెదను. ఆ పాపమును కూడ వారిద్దరూ పొందగలరు (33). ప్రాణమలను రక్షించు కొన గోరి ఈ బాలుని ఇంత దూరము తీసుకొని వచ్చితిరా? అని ఇంద్ర విష్ణువులతో పలికి, ఆతడు వీరభద్రునితో నిట్లనెను (34). నీవు పూర్వము దక్ష యజ్ఞములో అనేక విప్రులను సంహరించితివి. ఓ పుణ్యాత్మా! ఆ కర్మ యొక్క ఫలములను నీకీనాడు చూపించెదను (35).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 SRI SIVA MAHA PURANA - 620🌹*

*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *


*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 09 🌴*


*🌻 Boasting of Tāraka and fight between him and Indra, Viṣṇu, Vīrabhadra - 3 🌻*


24. Incarnating as Kṛṣṇa he defiled the wives of others and forced them to violate the traditional virtues of the family. He contracted his marriages without any reference to the Vedic path.


25. Again in his ninth incarnation[7] he slighted the Vedic path and contrary to its principles, preached and established the atheistic philosophy called Buddhism.


26. How can he be considered an excellent, virtuous man, how can he be victorious in battle who has committed sin without caring for Vedic cult?


27. Indra, his elder brother, is a greater sinner. He has committed many sins for his self-interest.


28. To gain his selfish end, by him Diti’s foetus was destroyed;[8] the modesty of Gautama’s wife was outraged,[9] Vṛtra, the son of a brahmin, was killed.[10]


29. He beheaded the brahmin Viśvarūpa,[11] the nephew of Bṛhaspati. Thus he transgressed the Vedic path.


30. Doing such sinful acts frequently Viṣṇu and Śiva are already deficient in splendour and their prowess is spent out.


31. You will never gain victory in the battle by relying on them. Why then did you foolishly come here to lose your lives?


32. These two, always seeking selfish ends, do not know what is virtue. O gods, without virtue every rite becomes futile.


33. These two impudent fellows are presumptuous enough to place a child in front of me. Why? I will kill the child too. They too will have it.


34. But let the child leave from here and save his life.” After saying this, hinting at Indra and Viṣṇu he turned to Vīrabhadra and said.


35. “Formerly in the sacrifice of Dakṣa, many brahmins had been killed by you, O sinless one, I shall show you the fruit thereof.”


Continues....

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹






*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 240 / Osho Daily Meditations - 240 🌹*

*📚. ప్రసాద్ భరద్వాజ*


*🍀 240. ప్రేమ మరియు స్వేచ్ఛ 🍀*


*🕉. మానవులకి ఉన్న మొత్తం సమస్య ప్రేమ మరియు స్వేచ్ఛతోనే . ఈ రెండు పదాలు మానవ భాషలో అత్యంత ముఖ్యమైన పదాలు. 🕉*

*ఒకదాన్ని ఎంచుకోవడం చాలా సులభం - ప్రేమను ఎంచుకోవడం మరియు స్వేచ్ఛను వదులుకోవడం చేస్తారు. కాని అప్పుడు ఎల్లప్పుడూ స్వేచ్ఛ కావాలనే భావం మిమ్మల్ని వెంటాడుతుంది. మరియు అది మీ ప్రేమను నాశనం చేస్తుంది. ప్రేమ స్వేచ్ఛకు విరుద్ధమైన దానిలా కనిపిస్తుంది. కానీ ఒక వ్యక్తి స్వేచ్ఛను ఎలా విడిచి పెట్టగలడు? అది ప్రేమ కోసం కూడా వదిలి వేయబడదు. అలా చేస్తే మీరు ప్రేమతో విసిగిపోతారు మరియు మీరు ఇతర విపరీతమైన స్థితికి వెళ్లడం ప్రారంభిస్తారు. ఒక రోజు మీరు ప్రేమను విడిచిపెట్టి స్వేచ్ఛ వైపు పరుగెత్తుతారు. కానీ ఒకరు కేవలం స్వేచ్ఛగా మరియు ప్రేమ లేకుండా ఎలా జీవించగలడు? ప్రేమ చాలా పెద్ద అవసరం. ప్రేమించబడడం మరియు ప్రేమించడం దాదాపు ఆధ్యాత్మిక శ్వాస. శరీరం శ్వాస లేకుండా జీవించదు మరియు ఆత్మ ప్రేమ లేకుండా జీవించదు.*


*ఒక విధంగా ఇది ఒక లోలకం స్వింగ్ లాగా కదులుతుంది - స్వేచ్ఛ నుండి ప్రేమకు, ప్రేమ నుండి స్వేచ్ఛకు. ఈ విధంగా ఈ చక్రం అనేక జీవితాలకు కొనసాగుతుంది. ఇది ఇలాగే కొనసాగింది. దానిని జీవిత చక్రం అంటాము. ఇది తిరుగుతూనే ఉంటుంది: అదే చువ్వలు పైకి వస్తున్నాయి, క్రిందికి వెళ్తాయి. ప్రేమ మరియు స్వేచ్ఛ మధ్య సంశ్లేషణను పొందినప్పుడు విముక్తి వస్తుంది. రెండు విరుధ్ధతలనూ ఎంచుకోండి. కానీ ఒక దానిని ఎంచుకుని అది మీకు ఇచ్చిన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవద్దు. మొత్తం విరుద్ధతను ఎంచుకోండి. ఒకటి ఎంచుకోవద్దు, రెండింటినీ ఎంచుకోండి; కలిసి ఎంచుకోండి. ప్రేమలో కదలండి మరియు స్వేచ్ఛగా ఉండండి. స్వేచ్ఛగా ఉండండి, కానీ మీ స్వేచ్ఛను ప్రేమకు వ్యతిరేకం చేయకండి.*

*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations - 240 🌹*

*📚. Prasad Bharadwaj*


*🍀 240. LOVE AND FREEDOM 🍀*


*🕉. This is the whole problem of human beings-love and freedom. These two words are the most important words in the human language. 🕉*

*It is very easy to choose one--to choose love and to drop freedom--but then you will always be haunted by freedom, and it will destroy your love. Love will look as if it is against freedom, inimical to freedom, antagonistic to freedom. How can one leave freedom? It cannot be left, even for love. By and by you will become fed up with love, and you will start moving to the other extreme. One day you will leave love and rush toward freedom. But just to be free and without loving, how can one live? Love is such a big need. To be loved and to love is almost spiritual breathing. The body cannot live without breath, and the spirit cannot live without love.*


*This way one moves like a pendulum swings-from freedom to love, from love to freedom. This way the wheel can continue for many lives. This is how it has continued. We call it the wheel of life. It goes on rotating: the same spokes coming up, going down. Liberation comes when one attains a synthesis between love and freedom. Choose the paradox. Don't choose the alternatives that the paradox has given to you. Choose the whole paradox. Don't choose one, choose both; choose together. Move in love and remain free. Remain free, but never make your freedom anti-love.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 403 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 403 - 3 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*


*🍀 87. వ్యాపినీ, వివిధాకారా, విద్యాఽవిద్యా స్వరూపిణీ ।*

*మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ ॥ 87 ॥ 🍀*


*🌻 403. 'మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ ' - 3 🌻*


*మహాకామేశ్వరుడు తపస్సిద్ధుడు అగుటచే అతడు సహజముగ ఆనందమయుడు. ఆనందము అతనిని ఆశ్రయించి యుండును. అతడు అర్ధనిమీలిత నేత్రుడు. తపస్వి ఎప్పుడునూ కన్నులు మూసుకునే యుండును. అంతర్ముఖముగ విశ్వవిలాసమును గమనించుచు వికసితము, ప్రశాంతము అయిన ముఖము కలిగి యుండును.*


*అతడు కన్నులు సగము తెరచుటకు కారణము విశ్వవిలాసము శ్రీమాత రూపముగ ఎదురుగ నుండుటయే. అతడు అంతర్ముఖముగను, బహిర్ముఖముగను సృష్టి విలాసము దర్శించుటకు శ్రీమాతయే కారణము. ఆమె విలాసము అతనికి అతిశయించిన సుఖమును కలిగించును.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 403 - 3 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj*


*🌻 87. Vyapini vividhakara vidya vidya svarupini*

*Mahakameshanayana kumudahlada kaomudi ॥ 87 ॥ 🌻*


*🌻 403. 'Mahakamesha Nayana Kumudahlada Kaumudi' - 3 🌻*


*Mahakameswara is an penant and therefore he is naturally blissful. Bliss takes shelter in Him. His eyes are half closed. An ascetic will always close his eyes. He internally observes the beauty and dance of the universe and has a calm and serene face.*


*The reason why he half-opened his eyes was that Srimata, who is an embodiment of the universal dance is right before him. Sri Mata is the reason why he sees the dance of this creation both inwardly and outwardly. Her indulgence gives him inordinate pleasure.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Comments


Post: Blog2 Post
bottom of page