top of page
Writer's picturePrasad Bharadwaj

07 - JULY - 2022 THURSDAY MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 07, జూలై 2022 గురువారం, బృహస్పతి వాసరే Thursday 🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 228 / Bhagavad-Gita - 228 - 5- 24 కర్మ యోగము🌹

3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 627 / Vishnu Sahasranama Contemplation - 627🌹

4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 306 / DAILY WISDOM - 306🌹

5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 206 🌹

6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 145 చివరి భాగము. 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹





*🌹07, July 2022 పంచాగము - Panchagam 🌹*

*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*

*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*

*ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాస దుర్గాష్టమి, Masik Durgashtami🌻*


*🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రము - 1 🍀*


*జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం*

*ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ॥1॥*


గుర్రం యొక్క మెడ మరియు ముఖాన్ని కలిగి ఉన్న ఆ పరమాత్ముడిని మనం ధ్యానిస్తాము, అతనికి ప్రకాశవంతమైన, మచ్చలేని స్పటికం వంటిది మరియు అన్ని విద్యల నివాసం అయిన దివ్య శరీరం ఉంది. అది అన్ని జ్ఞానముల (దైవిక జ్ఞానం) మరియు ఆనందం యొక్క స్వరూపం.*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : ఈశ్వరుని దృష్టిలో అల్పమనునది లేదు. అట్లే నీ దృష్టిలోనూ ఉండ రాదు. ఒక మహా సామ్రాజ్య నిర్మాణానికి వెచ్చించి నంతటి దివ్య పరిశ్రమనే ఆయన ఒక నత్తగుల్ల నిర్మాణానికి సైతం వెచ్చిస్తూ వుంటాడు. 🍀*


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, ఆషాఢ మాసం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

తిథి: శుక్ల-అష్టమి 19:29:09 వరకు

తదుపరి శుక్ల-నవమి

నక్షత్రం: హస్త 12:20:27 వరకు

తదుపరి చిత్ర

యోగం: పరిఘ 10:38:43 వరకు

తదుపరి శివ

కరణం: విష్టి 07:42:28 వరకు

వర్జ్యం: 20:18:00 - 21:53:36

దుర్ముహూర్తం: 10:09:40 - 11:02:10

మరియు 15:24:42 - 16:17:12

రాహు కాలం: 13:59:23 - 15:37:50

గుళిక కాలం: 09:04:02 - 10:42:29

యమ గండం: 05:47:09 - 07:25:35

అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:46

అమృత కాలం: 06:11:15 - 07:49:35

మరియు 29:51:36 - 31:27:12

సూర్యోదయం: 05:47:09

సూర్యాస్తమయం: 18:54:43

చంద్రోదయం: 12:30:14

చంద్రాస్తమయం: 00:36:52

సూర్య సంచార రాశి: జెమిని

చంద్ర సంచార రాశి: కన్య

రాక్షస యోగం - మిత్ర కలహం

12:20:27 వరకు తదుపరి చర

యోగం - దుర్వార్త శ్రవణం


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹

#పంచాగముPanchangam

Join and Share


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹





*🌹. శ్రీమద్భగవద్గీత - 228 / Bhagavad-Gita - 228 🌹*

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద

📚. ప్రసాద్ భరద్వాజ


*🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 24 🌴*


*24. యోన్త:సుఖోన్తరారామస్తథాన్తర్జ్యోతిరేవ య: |*

*స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోధిగచ్ఛతి ||*


🌷. తాత్పర్యం :

*అంతరంగమందే ఆనందమును కలిగినవాడును, ఉత్సాహవంతుడై అంతరంగమందే రమించువాడును, అంతరంగమందే లక్ష్యమును కలిగినవాడును అగు మనుజుడే వాస్తవమునకు పూర్ణుడగు యోగి యనబడును. బ్రహ్మభూతుడైన అట్టివాడు అంత్యమున పరబ్రహ్మమునే పొందగలడు.*


🌷. భాష్యము :

అంతరంగమునందు ఆనందమును అనుభవించనిదే పైపై సుఖములను కలుగజేయు బాహ్యకర్మల నుండి మనుజుడెట్లు విరమింపగలడు? ముక్తపురుషుడైనవాడు సుఖమును యథార్థానుభవము చేతనే అనుభవించును. కనుక మౌనముగా ఎచ్చటనైనను కూర్చిండి అంతరంగమునందే అతడు సౌఖ్యమును అనుభవింపగలడు. అట్టి ముక్తపురుషుడు బాహ్యసుఖమును ఎన్నడును అభిలషింపడు. “బ్రహ్మభూతస్థితి” యని పిలువబడు అట్టి స్థితిని పొందినంతట మనుజుడు భగవద్ధామమును నిశ్చయముగా చేరగలడు.

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 228 🌹*

*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*

*📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 5 - Karma Yoga - 24 🌴*


*24. yo ’ntaḥ-sukho ’ntar-ārāmas tathāntar-jyotir eva yaḥ*

*sa yogī brahma-nirvāṇaṁ brahma-bhūto ’dhigacchati*


🌷 Translation :

*One whose happiness is within, who is active and rejoices within, and whose aim is inward is actually the perfect mystic. He is liberated in the Supreme, and ultimately he attains the Supreme.*


🌹 Purport :

Unless one is able to relish happiness from within, how can one retire from the external engagements meant for deriving superficial happiness? A liberated person enjoys happiness by factual experience. He can, therefore, sit silently at any place and enjoy the activities of life from within. Such a liberated person no longer desires external material happiness. This state is called brahma-bhūta, attaining which one is assured of going back to Godhead, back to home.

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹





*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 627/ Vishnu Sahasranama Contemplation - 627🌹*


*🌻627. శాశ్వతస్థిరః, शाश्वतस्थिरः, Śāśvatasthiraḥ🌻*


*ఓం శాశ్వతస్థిరాయ నమః | ॐ शाश्वतस्थिराय नमः | OM Śāśvatasthirāya namaḥ*


నోపైతి విక్రియాం శశ్వద్ భవన్నపి కదాచన ।

ఇతి కేశవశ్శాశ్వతః స్థిర ఇత్యుచ్యతే బుధైః ।

శాశ్వతస్థిర ఇత్యేకం నామాప్యభిమతం హరేః ॥


శాశ్వతుడూ, స్థిరుడు. ఎల్లప్పుడును ఉండెడివాడైనను ఎన్నడును తన స్వరూపాదులయందు మార్పును ఏమాత్రమును పొందువాడు కాదుగనుక శాశ్వతస్థిరః. శాశ్వతః స్థిరః అని రెండు పదములు కలిపి సవిశేషణైక నామమని శ్రీ శంకరులు పేర్కొనిరి.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 627🌹*


*🌻627. Śāśvatasthiraḥ🌻*


*OM Śāśvatasthirāya namaḥ*


नोपैति विक्रियां शश्वद् भवन्नपि कदाचन ।

इति केशवश्शाश्वतः स्थिर इत्युच्यते बुधैः ।

शाश्वतस्थिर इत्येकं नामाप्यभिमतं हरेः ॥


Nopaiti vikriyāṃ śaśvad bhavannapi kadācana,

Iti keśavaśśāśvataḥ sthira ityucyate budhaiḥ,

Śāśvatasthira ityekaṃ nāmāpyabhimataṃ hareḥ.


Eternal and unchanging. Though he existed and will exist forever, He is never subject to any change and hence Lord Hari is Śāśvatasthiraḥ. Śrī Śankara clarifies that as an epithet, the two names Śāśvataḥ and Sthiraḥ make up for one name i.e., Śāśvatasthiraḥ.


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka


उदीर्णस्सर्वतश्चक्षुरनीशश्शाश्वतस्स्थिरः ।भूशयो भूषणो भूतिर्विशोकश्शोकनाशनः ॥ ६७ ॥


ఉదీర్ణస్సర్వతశ్చక్షురనీశశ్శాశ్వతస్స్థిరః ।భూశయో భూషణో భూతిర్విశోకశ్శోకనాశనః ॥ 67 ॥


Udīrṇassarvataścakṣuranīśaśśāśvatassthiraḥ,Bhūśayo bhūṣaṇo bhūtirviśokaśśokanāśanaḥ ॥ 67 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹

#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹





*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 306 / DAILY WISDOM - 306 🌹*

*🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀*

*📝 .స్వామి కృష్ణానంద* *📚. ప్రసాద్ భరద్వాజ*


*🌻 1. మీరు సౌర వ్యవస్థ యొక్క పుత్రుడు 🌻*


*మన శరీరంలోని ప్రతి కణం-వాటిని కణాలు అని పిలవండి, లేదా ఎలాగైనా పిలవండి అవి - సౌర మరియు గ్రహాల ద్వారా మానవ వ్యక్తిత్వం అని పిలువబడే ఒక నిర్దిష్ట కేంద్రంపై ప్రయోగించబడిన కేంద్రీకరించిన శక్తి యొక్క శంఖుస్థాపనలు, వ్యక్తీకరణలు, ఘన రూపాలు అని చెప్పొచ్చు. కాబట్టి, మీరు సౌర వ్యవస్థ యొక్క పుత్రులు. మీరు ఏ తండ్రికి లేదా తల్లికి పుట్టలేదు; ఇవన్నీ మీ యొక్క సామాజిక వివరణలు, కానీ మీకు సౌర సంబంధాలు ఉన్నాయి. మీరు సౌర వ్యవస్థ యొక్క పౌరులు.*


*సూర్యుడు చాలా దూరంలో ఉన్నాడని, గ్రహాలు కళ్లకు కనిపించవని, నక్షత్రాలు ఇంకా చాలా దూరంలో ఉన్నాయనే భావనలో మనం ఉండకూడదు. ఇది అలాంటిదేమీ కాదు. సౌర వాతావరణంలోని ఈ విద్యుదయస్కాంత క్షేత్రంలో దూరం అనేది లేదు. ఈ మొత్తం వాతావరణాన్ని మనం 'విద్యుదయస్కాంత క్షేత్రం' గా వివరించగలం. ఇది భౌతిక కంటికి కనిపించదు. ఈ ప్రభావం ఎంత శక్తివంతమైనది అంటే అది వ్యక్తిత్వాలు అని పిలువబడే కొన్ని రూపాల్లో తనను తాను సంక్షిప్తీకరించు కుంటుంది. అవి వృక్ష జాతి, జంతు జాతి, లేదా మానవ జాతి యొక్క రూపాలు కావచ్చు.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 DAILY WISDOM - 306 🌹*

*🍀 📖 from Your Questions Answered 🍀*

*📝 Swami Krishnananda*

*📚. Prasad Bharadwaj*


*🌻 1. You are a Child of the Solar System 🌻*


*It has been well said that every particle of our body—call them cells, or whatever they are—are concretisations, manifestations, solid forms of the cumulative force exerted upon a particular centre called the human individuality by the total action of the planets and the Sun. So, you are a child of the solar system. You are not born to any father or mother; these are all social interpretations of your position, but you have a larger stellar relation. You are a citizen of the solar system.*


*We should not be under the impression that the Sun is so far away, the planets are invisible to the eyes, and stars are still further. It is nothing of the kind. There is no distance in this electromagnetic field of the stellar region, the solar atmosphere. ‘Electromagnetic field' is the description we can give of the manner in which the entire atmosphere works. It is not visible to the physical eye. So forceful, so powerful is this influence that it concretises itself in certain forms which are called individualities. They may be the forms of the plant kingdom or animal kingdom, or human kingdom.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹

#నిత్యప్రజ్ఞాసందేశములు


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹





*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 206 🌹*

*✍️. సౌభాగ్య*

*📚. ప్రసాద్ భరద్వాజ*


*🍀. నువ్వు మళ్ళీ జన్మించాలి. పునర్జన్మ పొందాలి. అహమన్నది నీపై బలవంతంగా రుద్దబడిందన్న సంగతి గుర్తించాలి. నువ్వు వేరు కాదని అనంతంలో భాగమని తెలుసుకోవాలి.🍀*


*మనల్ని పెంచిన సమాజం, నాగరికత, మతం యివన్నీ మనకొక తప్పుడు గుర్తింపు నిచ్చాయి. మనల్ని మోసగించాయి, వంచించాయి. మనల్ని మోసగించిన వాళ్లు చాలా బలమైన వాళ్ళు. అసలు వాళ్ళ అధికారమే మోసాన్ని ఆధారం చేసుకున్నది. శతాబ్ధాలుగా జరుగుతున్నదదే. వాళ్ళు రాజకీయాన్ని, మతాన్ని హస్తగతం చేసుకున్నారు. సత్యాన్ని గ్రహించే అన్ని మార్గాల్ని బంధించాయి. వాళ్ళ వ్యాపారమే జనాల్ని మోసగించడం. పసితనం నించే జనాల్ని మలుస్తారు. రాజీపడకుంటే జీవితం లేదని చెబుతారు. కాబట్టి జనం రాజీ పడటానికి అలవాటయ పోతారు.*


*సత్యానికి సంబంధించిన స్పృహ తలెత్తినప్పుడల్లా దాన్ని అదుపు చేస్తారు. ఆ విధంగా సత్యాన్ని అణిచి పెట్టడం అలవాటయి పెద్ద అయ్యే సరికి చైతన్యరహితంగా మారుతారు. ఆ స్థితి నించీ బయటకు తీసుకురావటం అసాధ్యమయి పోతుంది. సమాజం నీకు ఏమి చేస్తుందో అది చేయరానిది. నువ్వు మళ్ళీ జన్మించాలి. పునర్జన్మ పొందాలి. అ,ఆ ల నించీ ఆరంభించాలి. అహమన్నది నీపై బలవంతంగా రుద్దబడిందన్న సంగతి గుర్తించాలి. నువ్వు వేరు కాదని అనంతంలో భాగమని తెలుసుకోవాలి.*


*సశేషం ...*

🌹 🌹 🌹 🌹 🌹

#ఓషోరోజువారీధ్యానములు

#ఓషోబోధనలు #OshoDiscourse

#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹





*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 145 🌹*

*✍️. రచన : సద్గురు కె. పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*


*🌻 108. దేవ దానవులు -2🌻*


*మనిషి యందు అయస్కాంత శక్తి వెనుక గల బలము సంకల్పము, బుద్ధియే అని ఎరుగవలెను. మహాత్ముల యందు, సద్గురువుల యందు ఈ రెండు బలములు దర్శనమిచ్చుచుండును. జాతిపిత యని అందరిచే గౌరవింపబడిన మహాత్మా గాంధి యందు కూడ ఈ దివ్య శక్తులే ప్రవేశించి, కార్యమును నిర్వర్తించినవి.*


*సంకల్పశక్తి వాడియైన బాణముకన్న పదునైనది. దానిని దిశా నిర్దేశము చేయునది బుద్ధి. బుద్ధి అధ్యక్షతన సంకల్పము నిర్వర్తింప బడవలె ననుటకు సంకేతమే గణపతి గురుత్వము, కుమారుని శిష్యత్వము. బుద్ధి అధిష్ఠించి, సంకల్పము నిర్వర్తింపబడినచో మానవుడు దివ్యత్వము నొందుచుండును. బుద్ధి లోపించినచో మానవుడు దానవుడగును. రామ రావణులకు, కర్ణార్జునులకు ఇదియే భేదము.*


*చివరి భాగము*

*సమాప్తము.....* 🙏

🌹 🌹 🌹 🌹 🌹

#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #ChaitanyaVijnanam #PrasadBhardwaj


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Comentarios


Post: Blog2 Post
bottom of page