🌹🍀 07 - NOVEMBER - 2022 MONDAY ALL MESSAGES సోమవారం,ఇందు వాసర సందేశాలు 🍀🌹
🌹 07 - NOVEMBER నవంబరు - 2022 MONDAY సోమవారం, ఇందు వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 278 / Bhagavad-Gita -278 - 6వ అధ్యాయము 45 ధ్యాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 677 / Vishnu Sahasranama Contemplation - 677 🌹
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 639 / Sri Siva Maha Purana - 639 🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 356 / DAILY WISDOM - 356 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 255 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹07, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : దేవ దీపావళి, Dev Diwali🌻*
*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 5 🍀*
*9. మహాతపా ఘోరతపా అదీనో దీనసాధకః |*
*సంవత్సరకరో మంత్రః ప్రమాణం పరమం తపః*
*10. యోగీ యోజ్యో మహాబీజో మహారేతా మహాబలః |*
*సువర్ణరేతాః సర్వజ్ఞః సుబీజో బీజవాహనః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : ఉదాత్తత, ఉదారత - ఇవి జీవునకు సువిశాల విహాయసం వంటివి. ఇవి లేనివాడు చీకటి కూపంలోని కీటకంతో సమానుడు. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, శరద్ ఋతువు,
దక్షిణాయణం, కార్తీక మాసం
తిథి: శుక్ల చతుర్దశి 16:17:54 వరకు
తదుపరి పూర్ణిమ
నక్షత్రం: అశ్విని 24:39:40 వరకు
తదుపరి భరణి
యోగం: సిధ్ధి 22:35:14 వరకు
తదుపరి వ్యతీపాత
కరణం: వణిజ 16:19:54 వరకు
వర్జ్యం: 20:32:20 - 22:10:36
దుర్ముహూర్తం: 12:22:27 - 13:08:09
మరియు 14:39:33 - 15:25:14
రాహు కాలం: 07:42:34 - 09:08:15
గుళిక కాలం: 13:25:17 - 14:50:58
యమ గండం: 10:33:56 - 11:59:36
అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:21
అమృత కాలం: 17:15:48 - 18:54:04
సూర్యోదయం: 06:16:53
సూర్యాస్తమయం: 17:42:20
చంద్రోదయం: 17:00:55
చంద్రాస్తమయం: 05:04:19
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: మేషం
యోగాలు : రాక్షస యోగం - మిత్ర కలహం
24:39:40 వరకు తదుపరి చర యోగం
- దుర్వార్త శ్రవణం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 278/ Bhagavad-Gita - 278 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 45 🌴*
*45. ప్రయత్నాద్ యతమానస్తు యోగీ సంశుద్ధకిల్బిష: |*
*అనేకజన్మసంసిద్ధస్తతో యాతి పరాం గతిమ్*
🌷. తాత్పర్యం :
*సమస్త కల్మషముల నుండి శుద్ధిపడిన యోగి మరింత పురోగతి కొరకు శ్రద్ధతో యత్నించినపుడు బహుజన్మల అభ్యాసము పిదప పూర్ణత్వమును బడసి, అంత్యమున పరమగతి పొందును.*
🌷. భాష్యము :
పవిత్రము, సంపన్నవంతము లేదా ధర్మయుక్తమైన వంశమున జన్మించిన మనుజుడు యోగాభ్యాసమునకై తనకున్నటువంటి అనుకూల పరిస్థితులను గుర్తించి అసంపూర్ణముగా మిగిలిన తన కార్యమును తీవ్రనిశ్చయముతో ఆరంభించును. ఆ విధముగా అతడు సమస్త పాపముల నుండి తనను ముక్తుని గావించుకొనును. అతడట్లు అంత్యమున సర్వపాపముల నుండి విడివడినంతనే పరమ పూర్ణత్వమైనటువంటి కృష్ణభక్తిరసభావనము అతని ప్రాప్తించగలదు. అట్టి కృష్ణభక్తిరసభావనము సర్వవిధములైన కల్మషముల నుండి దూరమైన సంపూర్ణస్థితియై యున్నది. ఈ విషయము భగవద్గీత (7.28) యందే ఈ క్రింది విధముగా నిర్ధారింపబడినది.
యేషాం త్వన్తగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్ |
తే ద్వన్ద్వమోహనిర్ముక్తా భజన్తే మాం దృఢవ్రతా:
“బహుజన్మల యందు పుణ్యకర్మల నొనరించి సర్వపాపముల నుండియు మరియు భ్రాంతిమయమగు ద్వంద్వముల నుండియు విముక్తుడైనపుడు మనుజుడు శ్రీకృష్ణభగవానుని ప్రేమయుతసేవ యందు నియుక్తుడు కాగలడు.”
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 278 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 6 - Dhyana Yoga - 45 🌴*
*45. prayatnād yatamānas tu yogī saṁśuddha-kilbiṣaḥ*
*aneka-janma-saṁsiddhas tato yāti parāṁ gatim*
🌷 Translation :
*And when the yogī engages himself with sincere endeavor in making further progress, being washed of all contaminations, then ultimately, achieving perfection after many, many births of practice, he attains the supreme goal.*
🌹 Purport :
A person born in a particularly righteous, aristocratic or sacred family becomes conscious of his favorable condition for executing yoga practice. With determination, therefore, he begins his unfinished task, and thus he completely cleanses himself of all material contaminations. When he is finally free from all contaminations, he attains the supreme perfection – Kṛṣṇa consciousness. Kṛṣṇa consciousness is the perfect stage of being freed of all contaminations. This is confirmed in the Bhagavad-gītā (7.28):
yeṣāṁ tv anta-gataṁ pāpaṁ
janānāṁ puṇya-karmaṇām
te dvandva-moha-nirmuktā
bhajante māṁ dṛḍha-vratāḥ
“After many, many births of executing pious activities, when one is completely freed from all contaminations, and from all illusory dualities, one becomes engaged in the transcendental loving service of the Lord.”
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 677/ Vishnu Sahasranama Contemplation - 677🌹*
*🌻677. మహాయజ్ఞః, महायज्ञः, Mahāyajñaḥ🌻*
*ఓం మహాయజ్ఞాయ నమః | ॐ महायज्ञाय नमः | OM Mahāyajñāya namaḥ*
*మహాయజ్ఞో మహాంశ్చాసౌ యజ్ఞశ్చేత్యుచ్యతే హరిః ।*
*యజ్ఞానాం జపయజ్ఞోస్మిత్యుక్తేర్గీతాసు శౌరిణా ॥*
*ఈతడే యాజ్ఞములలోకెల్ల గొప్పదియగు యజ్ఞము. లేదా బహువ్రీహి సమాసముగనైతె గొప్పదియగు యజ్ఞము ఎవని విషయమున ఆచరించబడుచున్నదో అట్టివాడు మహాయజ్ఞః.*
:: శ్రీమద్భగవద్గీత - విభూతి యోగము ::
మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరమ్ ।
యజ్ఞానాం జపయజ్ఞోఽస్మి స్థావరాణాం హిమాలయః ॥ 25 ॥
*నేను మహర్షులలో భృగుమహర్షిని, వాక్కులలో ఏకాక్షరమగు ప్రణవమును, యజ్ఞములలో జపయజ్ఞమును, స్థిర పదార్థములలో హిమాలయ పర్వతమును అయియున్నాను.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 677🌹*
*🌻677. Mahāyajñaḥ🌻*
*OM Mahāyajñāya namaḥ*
महायज्ञो महांश्चासौ यज्ञश्चेत्युच्यते हरिः ।
यज्ञानां जपयज्ञोस्मित्युक्तेर्गीतासु शौरिणा ॥
*Mahāyajño mahāṃścāsau yajñaścetyucyate hariḥ,*
*Yajñānāṃ japayajñosmityuktergītāsu śauriṇā.*
*He is the greatest of the Yajñas. Or the divine name can also be interpreted as the One in whose honor greatest of Yajñas is performed.*
:: श्रीमद्भगवद्गीत - विभूति योगमु ::
महर्षीणां भृगुरहं गिरामस्म्येकमक्षरम् ।
यज्ञानां जपयज्ञोऽस्मि स्थावराणां हिमालयः ॥ 25 ॥
Śrīmad Bhagavad Gīta - Chapter 10
Maharṣīṇāṃ bhrgurahaṃ girāmasmyekamakṣaram,
Yajñānāṃ japayajño’smi sthāvarāṇāṃ himālayaḥ. 25.
*Among the great sages I am Bhrgu; of words I am the single syllable (ॐ / Oṃ). Among rituals I am the ritual of Japa; of the immovables, the Himālaya.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
महाक्रमो महाकर्मा महातेजा महोरगः ।महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः ॥ ७२ ॥
మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః ।మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః ॥ 72 ॥
Mahākramo mahākarmā mahātejā mahoragaḥ,Mahākraturmahāyajvā mahāyajño mahāhaviḥ ॥ 72 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 639 / Sri Siva Maha Purana - 639 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 13 🌴*
*🌻. గణశుని పుట్టుక - 4 🌻*
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ మునీ ! ఆమె ఇట్లు పలికి ఆతనికి మిక్కిలి దృఢమగు కర్రను ఇచ్చెను. ఆమె ఆతని సుందర రూపమును గాంచి ఆనందించెను (27). ఆమె తన కుమారుడగు గణాధిపుని ముఖమును ప్రీతితో ముద్దాడి దయతో ఆలింగనము చేసుకొని చేతికి కర్రనిచ్చి తన ద్వారము నందు నిలబెట్టెను (28). కుమారా! అపుడు మహావీరుడగు దేవీపుత్రుడు పార్వతికి హితమును చేయు కోరికతో కర్రను చేతబట్టి ఇంటి ద్వారము నందు నిలబడెను (29). తన కుమారుడగు గణశుని తన ఇంటి ద్వారము వద్ద నిలబెట్టి ఆ పార్వతీ దేవి సఖురాండ్రతో గూడి స్నానమును చేయుచుండెను (30).
ఓ మహర్షీ! ఇంతలోనే అనేక లీలా పండితుడగు శివుడు ఉత్కంఠతో ద్వారము వద్దకు వచ్చెను (31). ఆయన శివప్రభుడని తెలియని గణాధిపుడు ఇట్లనెను : దేవా! తల్లి ఆజ్ఞ లేనిదే నీవిపుడు లోనికి పోరాదు (32). తల్లి స్నానమునకు వెళ్లినది. నీవు ఎచటకు వెళ్లుచుంటివి? ఇట్లు పొమ్ము. ఇట్లు పలికి ఆతడు ఆయనను నిలువరించుటకై చేతిలోనికి కర్రను తీసుకొనెను (33). వానిని చూచి శివుడిట్లు పలికెను : నీవు ఎవరిని అడ్డుచున్నావు? నీవు మూర్ఖబుద్ధివి. ఓరీ దుర్బుద్ధీ! నీవు నన్ను ఎరుంగవా? నేను శివుడను. సందేహము వలదు (34).
గణశుడు అనేక లీలలను ప్రదర్శించే మహేశ్వరుని కర్రతో కొట్టగా ఆయన కోపించి ఆ పుత్రునితో నిట్లనెను (35).
శివుడిట్లు పలికెను -
నీవు మూర్ఖుడవు. నేను పార్వతీపతియగు శివుడనని యెరుంగవు. ఓరీ బాలకా! నేను నా ఇంటికి వెళ్లుచుండగా నీవు నన్నేల అడ్డుకొనెదవు? (36) ఇట్లు పలికి లోపలకు ప్రవేశించుచున్న ఆ మహేశ్వరుని గణశుడు కోపించి మరల కర్రతో కొట్టెను. ఓ విప్రా! (37). అపుడు శివుడు మిక్కిలి కోపించి తన గణములను ఇట్లు ఆజ్ఞాపించెను: గణములారా! వీడెవడు? ఇక్కడ ఉండి ఏమి చేయుచున్నాడు? చూడుడు (38).
శివుడిట్లు పలికి ఇంటి బయట క్రోధముతో నిలబడి యుండెను. లోకాచారముల నిష్టపడే ఆ ప్రభుడు అనేక అద్భుత లీలలను ప్రదర్శించును (39).
శ్రీ శివమహాపురాణములో రుద్ర సంహితయందు కుమారఖండలో గణశుని పుట్టుక అనే పదమూడవ అధ్యాయము ముగిసినది (13).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 639🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 13 🌴*
*🌻 The birth of Gaṇeśa - 4 🌻*
Brahmā said:—
27. O sage, saying this, she gave him a hard stick. On seeing his handsome features she was delighted.
28. Out of love and mercy she embraced and kissed him. She placed him armed with a staff at her entrance as the gatekeeper.
29. Then the son of the goddess, of great heroic power, stayed at the doorway armed with a staff with a desire to do what was good to her.
30. Thus placing her son at the doorway, Pārvatī began to take bath with her friends, unworried.
31. O excellent sage, at this very moment Śiva who is eagerly indulgent and an expert in various divine sports came near the door.
32. Not knowing that he was lord Śiva, the consort of Pārvatī, Gaṇeśa said—“O sir, without my mother’s permission you shall not go in now.
33. My mother has entered the bath. Where are you going now? Go away” saying thus, he took up his staff to ward him off.
34. On seeing him Śiva said “O foolish fellow, whom are you forbidding? O wicked knave, don’t you know me? I Śiva, none else”.
35. Thereupon Gaṇeśa beat Śiva with the staff. Śiva expert in various sports became infuriated and spoke to his son thus.
Śiva said:—
36. “You are a fool, You do not know that I am Śiva, the husband of Pārvatī. O boy, I go in my own house. Why do you forbid me?”
Brahmā said:—
37. When lord Śiva tried to enter the house, Gaṇeśa became infuriated, O brahmin, and struck him with his staff once again.
38. Then Śiva too became furious. He commanded his own Gaṇas—“Who is this fellow here? What is he doing? O Gaṇas, enquire.”
39. After saying this, the furious Śiva stood outside the house. The lord, following the worldly conventions, is capable of various wonderful sports.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 356 / DAILY WISDOM - 356 🌹*
*🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀*
*📝. ప్రసాద్ భరద్వాజ్*
*🌻21. మనిషి యొక్క బలం విశ్వం యొక్క శక్తిపై ఆధారపడి ఉంటుంది🌻*
*ప్రాణం ప్రధానంగా కోరికల కారణంగా వ్యక్తిత్వంలో అసమానంగా పంపిణీ చేయబడుతుంది. మనిషి కోరికలతో నిండి ఉంటాడు. వాటి నుండి ఎవరూ విముక్తులు కాదు. కానీ, అవి ఆరోగ్యకరమైన కోరికలైతే, మీరున్న వాతావరణంతో సామరస్యంగా ఉంటే, అవి ఆందోళన కలిగించవు. కోరికలన్నీ చెడ్డవి కాదు. అలా అంటే ప్రపంచములో ఏది చెడ్డది కాదు. ఏదైనా వస్తువును , దానికి కేటాయించిన కక్ష్యలో ఉంటే, ప్రతిదీ సరిగ్గానే ఉంటుంది . దానికి అనవసరమైన అధిక ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు మాత్రమే, ముఖ్యంగా తీవ్రమైన ప్రేమ మరియు తీవ్రమైన ద్వేషం ఉన్నప్పుడు, ప్రాణం దాని కక్ష నుండి విసిరివేయ బడి శరీరంలో దాని సమానత లోపిస్తుంది.*
*ప్రేమ, వాస్తవానికి, మంచిది, మరియు మనిషి ప్రేమ ద్వారా మాత్రమే జీవిస్తాడు. అలా అని ఒక వ్యక్తి తన ప్రేమను ఒక నిర్దిష్ట వస్తువుపై మాత్రమే కురిపించాలి అని దీని అర్థం కాదు. అత్యల్ప స్థితి ఏమిటంటే, ఏకాగ్రతనంతా పరిమిత వస్తువుపై ఉంచి అదే సర్వస్వం అన్నట్లుగా ఉండడం. ప్రేమ మన జీవశక్తి, ఆరోగ్యం మరియు జీవనోపాధికి మూలం; కానీ ఒకే వస్తువుకు మాత్రమే ఉద్దేశించిన ప్రేమ ప్రమాదం. అక్కడ, ప్రాణం ఒక దిశలో మాత్రమే హానికరంగా నిర్దేశించ బడుతుంది, ఇతర వస్తువులతో దాని సంబంధాన్ని తెంచుకుంటుంది. మనిషి బలం విశ్వశక్తిపై ఆధారపడి ఉంటుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 356 🌹*
*🍀 📖 from The Philosophy of Religion 🍀*
*📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj*
*🌻21. Man's Strength Depends Upon the Energy of the Cosmos🌻*
*Prana gets irregularly distributed in the personality on account of desires, primarily. Man is full of desires. No one is free from them. But, if they are wholesome desires, harmonious with the atmosphere or the environment in which one is, they do not cause agitation. There is nothing devilish about desires as such, but, then, there is nothing devilish about anything in the world, ultimately. Everything is right, provided it is in its allotted place. Only when a thing is put out of context, when it is misplaced, or is given an excessive importance, especially when there is intense love and intense hatred, the prana is thrown out of gear, and there is a lack of its equidistribution in the body.*
*Love, of course, is good, and man lives only by love—certainly so. But it does not mean that one should pour one's love on a particular object only. The lowest kind of knowledge is that where there is concentration on a finite object, as if it is everything. Love is the source of our vitality, energy, health, and sustenance; but love directed exclusively to a single object is a danger. There, prana is directed unwholesomely in one direction only, cutting off its relationship with other objects. Man's strength depends upon the energy of the cosmos.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 255 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. మన సరిహద్దుల్ని మనం కోల్పోయిన క్షణం మనం మరణాన్ని కూడా కోల్పోతాం. అప్పుడు మనం శాశ్వతంలో భాగాలవుతాం. నువ్వు అనంత సంగీతంలో భాగం అయినపుడే ధ్యానం విజయం సాధిస్తుంది. 🍀*
*ప్రతిదీ గాఢంగా దాని విధానంలో అది సాగుతూ వుంటుందటే మనిషి ఆ సంగతి గుర్తించడు. అప్రమత్తత లేకపోవడమే అతని దుఃఖానికి కారణం. దాని గుండా వచ్చే పీడకలలు అతన్ని బాధిస్తాయి. లేని పక్షంలో జీవితం ఒక విజయోత్సవ మయ్యేది. మనం మరికొంత నిశ్శబ్దంగా మారాలి. అప్పుడా గమనాన్ని వినగలం. కనగలం. మనం నిశ్శబ్దంగా వుంటే మనం నిశ్శబ్దంలో లీనమైతే మనం మాయమవుతాం. అప్పుడు మనమీ సమస్త విశ్వ సమశృతిలో భాగమవుతాం. ఒక దృష్టిలో మనం మాయమవుతాం. అంటే ఒక వ్యక్తిగా, ఒక అహంగా మాయమవుతాం. మరో వేపు సమస్తంలో భాగమవుతాం.*
*మంచు బిందువు సముద్రంలో మాయమై సముద్రంగా మారిపోయింది. అదేమీ కోల్పోదు. చిన్ని సరిహద్దుల్ని కోల్పోయి విస్తరిస్తుంది. అది భయానికి కూడా కారణమవుతుంది. అన్ని సరిహద్దులూ మరణంతో మాయమవుతాయి. మన సరిహద్దుల్ని మనం కోల్పోయిన క్షణం మనం మరణాన్ని కూడా కోల్పోతాం. అప్పుడు మనం శాశ్వతంలో భాగాలవుతాం. నువ్వు అనంత సంగీతంలో భాగమయినపుడే ధ్యానం విజయం సాధిస్తుంది. ఆ సంగీతం ఎప్పుడూ వుంది. అది వినడానికి ధ్యానం నీకు సహకరిస్తుంది.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Commentaires