top of page
Writer's picturePrasad Bharadwaj

🍀 07 - OCTOBER - 2022 FRIDAY ALL MESSAGES శుక్రవారం, భృగు వాసర సందేశాలు 🍀

🌹🍀 07 - OCTOBER - 2022 FRIDAY ALL MESSAGES శుక్రవారం, భృగు వాసర సందేశాలు 🍀🌹

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 07, శుక్రవారం, అక్టోబరు 2022 భృగు వాసరే FRIDAY 🌹

2) 🌹 కపిల గీత - 74 / Kapila Gita - 74 🌹 సృష్టి తత్వము - 30

3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 113 / Agni Maha Purana - 113 🌹

4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 248 / Osho Daily Meditations - 248 🌹

5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 406 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 406 -12 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹





*🌹07, October అక్టోబరు 2022 పంచాగము - Panchagam 🌹*

*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*

*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*

*ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : ప్రదోష వ్రతం, Pradosh Vrat🌻*


*🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -15 🍀*


*15. అష్టోత్తరార్చనప్రియే సకలేష్టదాత్రి హే విశ్వధాత్రి సురసేవితపాదపద్మే ।*

*సఙ్కష్టనాశిని సుఖఙ్కరి సుప్రసన్నే శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : ప్రతి తలంపులో, ప్రతి చేష్టలో, నిత్య జీవితంలో, గృహంలో, సమాజంలో, ధనం సంపాదించడంలో, నిల్వ చేయడంలో, ఖర్చు పెట్టడంలో, అన్నింటిలోనూ మర్త్య రూపధారియగు అనంతుని అభివ్యక్తమొనర్చే శక్తిని నీవు సంపాదించ గలిగినప్పుడు, నీ జీవితకర్మల సాఫల్యాన్ని నీవు సంపూర్ణంగా పొందగలుగుతావు.🍀*


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు,

దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం

తిథి: శుక్ల ద్వాదశి 07:28:30 వరకు

తదుపరి శుక్ల త్రయోదశి

నక్షత్రం: శతభిషం 18:18:17 వరకు

తదుపరి పూర్వాభద్రపద

యోగం: దండ 23:29:15 వరకు

తదుపరి వృధ్ధి

కరణం: బాలవ 07:27:30 వరకు

వర్జ్యం: 02:28:48 - 03:59:12

మరియు 24:23:20 - 25:54:40

దుర్ముహూర్తం: 08:29:53 - 09:17:26

మరియు 12:27:35 - 13:15:07

రాహు కాలం: 10:34:41 - 12:03:49

గుళిక కాలం: 07:36:25 - 09:05:33

యమ గండం: 15:02:05 - 16:31:13

అభిజిత్ ముహూర్తం: 11:40 - 12:26

అమృత కాలం: 11:31:12 - 13:01:36

సూర్యోదయం: 06:07:16

సూర్యాస్తమయం: 18:00:21

చంద్రోదయం: 16:30:55

చంద్రాస్తమయం: 03:31:48

సూర్య సంచార రాశి: కన్య

చంద్ర సంచార రాశి: కుంభం

సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం 18:18:17

వరకు తదుపరి ధ్వాo క్ష యోగం - ధన

నాశనం, కార్య హాని


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹





*🌹. కపిల గీత - 74 / Kapila Gita - 74🌹*

*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*

*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 30 🌴*


*30. సంశయోఽథ విపర్యాసో నిశ్చయః స్మృతిరేవ చ||*

*స్వాప ఇత్యుచ్యతే బుద్ధేర్లక్షణం వృత్తితః పృథక్॥*


*వృత్తుల యొక్క భేదము వలన సంశయము, విపర్యయము (విపరీత జ్ఞానము), నిశ్చయము, స్మృతి, నిద్ర అనునవి బుద్ధి యొక్క లక్షణములు. ఈ బుద్ధితత్త్వమునే *ప్రద్యుమ్ముడు* అని వ్యవహరింతురు.*


*బుద్ధికి అయిదు లక్షణాలు ఉన్నాయి 1. సంశయం (వికల్ప జ్ఞ్యానం), 2. విపర్యయం, 3. నిశ్చయం, 4. స్మృతి, 5. స్వాప.*


*1. సంశయం అంటే ఒక దానిలో ఇంకో దానిని చూచుట. అన్యధా జ్ఞ్యానం. ఒక ధర్మము యందు ధర్మి ద్వయాన్ని చెప్పుట. అదా ఇదా? తాడా పామా? అనే సంశయము.*


*2. విపర్యయం: ఇందులో రెండు ఉంటాయి. అన్యధా జ్ఞ్యానం, విపరీత జ్ఞ్యానం.

అన్యధా జ్ఞ్యానం అంటే ఒక వస్తువులో ఒక గుణం వేరుగా కనిపించుట. ఉదా: తెల్లగా ఉన్న శంఖం పచ్చగా కనిపించడం. అంటే గుణం మారింది. ధర్మిలో ధర్మం మారుట.*

*విపరీత జ్ఞ్యానం. ఒక వస్తువును చూచి ఇంకో వస్తువు అనుకోవడం. తగరమును చూచి వెండి అనుకోవడం. ఇక్కడ వస్తువే మారింది. ఇక్కడ ధర్మే మారింది.*


*3. నిశ్చయం: ఇది ప్రమాణ రూపం. ఇది ఇంతే. శంఖము తెల్లగా ఉంది అని నిశ్చయముగా తెలియడం.*


*4. స్మృతి : అనుభూత విషయ జ్ఞ్యానం స్మృతి. జరిగిన దాన్ని గుర్తుంచుకోవడం. (ఉదా: ఈ శ్లోకం ఫలాన అధ్యాయములో వచ్చింది)*


*5. స్వాప - బుద్ధి స్తభముగా ఉండటం స్వాప. నిద్రపోతే కలిగేది ఇదే. బుద్ధి నిద్రపోతే అసలు నిద్ర. బుద్ధి ఆలోచిస్తూ ఉంటే కలలు వస్తాయి. దాన్ని మగత నిద్ర అంటాం. బుద్ధి స్తబ్ధముగా ఉండే నిద్ర నలభై నిముషాలు చాలు.*


*సశేషం..*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Kapila Gita - 74 🌹*

*🍀 Conversation of Kapila and Devahuti 🍀*

*📚 Prasad Bharadwaj*


*🌴 2. Fundamental Principles of Material Nature - 30 🌴*


*30. saṁśayo 'tha viparyāso niścayaḥ smṛtir eva ca*

*svāpa ity ucyate buddher lakṣaṇaṁ vṛttitaḥ pṛthak*


*Doubt, misapprehension, correct apprehension, memory and sleep, as determined by their different functions, are said to be the distinct characteristics of intelligence.*


*Doubt is one of the important functions of intelligence; blind acceptance of something does not give evidence of intelligence. Therefore the word saṁśaya is very important; in order to cultivate intelligence, one should be doubtful in the beginning. But doubting is not very favorable when information is received from the proper source. In Bhagavad-gītā the Lord says that doubting the words of the authority is the cause of destruction.*


*As described in the Patañjali yoga system, 1) pramāṇa 2) viparyaya 3) vikalpa 4) nidra 5) smṛtyaḥ. By intelligence only one can understand things as they are. By intelligence only can one understand whether or not he is the body. The study to determine whether one's identity is spiritual or material begins in doubt. When one is able to analyze his actual position, the false identification with the body is detected. This is viparyāsa.*


*When false identification is detected, then real identification can be understood. Real understanding is described here as niścayaḥ, or proved experimental knowledge. This experimental knowledge can be achieved when one has understood the false knowledge. By experimental or proved knowledge, one can understand that he is not the body but spirit soul.*


*Smṛti means "memory," and svāpa means "sleep." Sleep is also necessary to keep the intelligence in working order. If there is no sleep, the brain cannot work nicely. In Bhagavad-gītā it is especially mentioned that persons who regulate eating, sleeping and other necessities of the body in the proper proportion become very successful in the yoga process. These are some of the aspects of the analytical study of intelligence as described in both the Patañjali yoga system and the Sāṅkhya philosophy system of Kapiladeva in Śrīmad-Bhāgavatam.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹





*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 113 / Agni Maha Purana - 113 🌹*

*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*

*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 35*


*🌻. పవిత్రాది వాసనము - 2🌻*


ఈ క్రమమునే పాటించుచు కుంభమున మహావిష్ణువును ఉద్దేశించి- "ఓ దేవా! ఇది నీ తేజస్సునుండియే పుట్టినది. సుందరమైనది. సర్వపాపవినాశకము. ఇది అన్ని మనోరథములను ఇచ్చునది. దీనిని నీకు సమర్పించుచున్నాను" అని పలుకుచు పవిత్రకమును సమర్పింపవలెను.


ధూపదీపాదుల ద్వారా బాగుగా పూజ చేసి మండప ద్వార సమీపమునకు వెళ్ళి, గంధపుష్పాక్షితలతో గూడిన ఆ పవిత్రకమును తాను కూడా "ఇది విష్డుతేజోరూవ మైనది. మహాపాతకములను నశింప చేయునది. ధర్మార్ధకామముల సిద్ధికై దీనిని ధరించుచున్నాను" అని చెప్పుచు ధరింపవలెను. ఆసనముపై శ్రీహరిపరివారమునకును గురువునకును పవిత్రకము నీయవలెను. గంధపుహ్పాక్షతాదులచే శ్రీహరిని పూజించి, గంధపుష్పాదులతో పూజించిన పవిత్రమును శ్రీహరికి సమర్పింపవలెను.


ఆ సమయమున "విష్ణుతేజో భవమ్‌" ఇత్యాది మూలమంత్రమును పఠించవలెను. పిమ్మట అగ్న్యధిష్ఠాతగా నున్న మహావిష్ణువునకు పవిత్రకము సమర్పించి ఇట్లు ప్రార్థింపవలెను.


కేశవా! నీవు, క్షీరసాగరమున శేషశయ్యపై శయనించి యున్నావు, నేను ప్రాతఃకాలమున నీ పూజ చేసెదను. నీవు ఇచట ఉపస్థితుడవు కమ్ము! పిమ్మట ఇంద్రాది దిక్పాలకులను, శ్రీవిష్ణుపార్షదులకును బలి సమర్పింపవలెను. పిమ్మట రోచనా-కర్పూర-కేసర-గంధాదులచే అలంకృతమై రెండు వస్త్రము లుంచిన జలపూర్ణకలశమునకు మూలమంత్రముతో పూజ చేయవలెను.


మండపమునుండి బైటకు వచ్చి తూర్పున అలికిన మండలత్రయమునందు వరుసగ పంచగవ్యమును, చదువును, దంతకాష్ఠమును ఉంచవలెను.రాత్రి పురాణశ్రవణ-స్తోత్రపాధాదులతో జాగరణము చేయవలెను. పరులకు భృత్యులుగా ఉండువారు, బాలులు, స్త్రీలు, భోగిజనులు మొదలగు వారి గంధపవిత్రములు తప్ప మిగిలిన వాటికి అప్పుడే అధివాసనము చేయవలెను.


అగ్ని మహాపురాణమునందు పవిత్రాదివాసనమును ముప్పదియైదవ అధ్యాయము సమాప్తము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Agni Maha Purana - 113 🌹*

*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *


*Chapter 35*

*🌻 Mode of consecration of an image - 2 🌻*


12. After having worshipped well with perfumes, one has. to offer to Hari along with perfumes, flowers etc. and saying, “May these become the energy of Viṣṇu”.


13-14. Having offered to the deity stationed in the fire one should pray to the deity (saying), “O lord couched on the great serpent in the milky ocean. I shall worship you in the morning. You (please) be present here O Keśava.” Then having offered offerings to Indra and others one should dedicate them to the attendants of Viṣṇu.


15. Then one should place a pitcher covered by two cloths and filled with water mixed with perfumes, rocanā, camphor and saffron in front of the deity.


16-18. Having adorned the deity with perfumes and flowers, one should worship him with the mystic formula. Having come out of the hall one should place in three circular enclosures the five products obtained from the cow, the sacrificial offering (caru) and wood for cleansing the teeth. One should read purāṇas and recite hymns and along with servants, a women and children remain awake. Then the consecration rite should be performed immediately without sacred perfumes.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹







*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 248 / Osho Daily Meditations - 248 🌹*

*📚. ప్రసాద్ భరద్వాజ*


*🍀 248. పాత అలవాట్లు 🍀*


*🕉. పాత పోకడలు, పాత అలవాట్లు భవిష్యత్తులోకి మరియు గతానికి బలవంతం చేస్తాయి. మీకు గుర్తున్న క్షణం, ఇప్పుడు విశ్రాంతి తీసుకోండి. 🕉*

*పాత అలవాట్ల హాస్యాస్పదతను చూసి నవ్వుకోండి. వారితో పోరాడాలని నేను చెప్పడం లేదు. మీరు పోరాడితే మీరు ఆందోళనను సృష్టిస్తారు. నేను నవ్వడం కోసమే చెబుతున్నాను. మీరు ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రత్యక్షంగా పట్టుకున్నప్పుడల్లా, విశ్రాంతి తీసుకోండి. మీ గతం, భవిష్యత్తులోకి - మళ్లీ మళ్లీ పాము తన పాత చర్మం నుండి జారిపోయినట్లుగా మీ మనస్సు పాత పోకడల నుండి జారిపోతుంది. పోరాడాల్సిన అవసరం లేదు.*


*పోరాటం ఎప్పుడూ దేనినీ పరిష్కరించదు. ఇది మరిన్ని సంక్లిష్టతలను సృష్టించ గలదు. కేవలం అర్థం చేసుకోండి. భవిష్యత్తు అనే రేపు దాని స్వంత మార్గం అది తీసుకుంటుంది. అది మీ ప్రస్తుతంలోకి వచ్చినప్పుడు, దానిని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు. కానీ అది ఎప్పుడూ రాదు అలా రాదు. ఈ రేపు అనేది ఎల్లప్పుడూ ఈ రోజు వలె వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ, ప్రస్తుతంలో ఉండటం నేర్చుకోండి.*

*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations - 248 🌹*

*📚. Prasad Bharadwaj*


*🍀 248. OLD HABITS 🍀*


*🕉. Old tendencies, old habits, will force into the future and into the past. The moment you remember, relax-relax in the now. 🕉*

*Laugh at the ridiculousness of old habits. I'm not saying to fight with them. If you fight you will create anxiety. I am saying simply to laugh. Whenever you catch yourself red-handed-again in the future and again in the past-just slip out of it, as a snake slips out of its old skin. There is no need to fight.*


*Fight never solves anything. It can create more complexities. Just understand it. Tomorrow will take its own course. When it comes, you will be there to face it. And it never comes as tomorrow; it always comes as today. So learn to be here now.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹



🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹





*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 406 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 406 - 1🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*


*🍀 88. భక్తహార్ద తమోభేద భానుమద్-భానుసంతతిః ।*

*శివదూతీ, శివారాధ్యా, శివమూర్తి, శ్శివంకరీ ॥ 88 ॥ 🍀*


*🌻 406. 'శివారాధ్యా’ - 1 🌻*


*శివునిచే ఆరాధింపబడునది శ్రీమాత అని అర్థము. శివుడు కూడ ధ్యాన మార్గమున దేవిని ఆరాధించి సర్వసిద్ధులను పొంది సృష్టి యందు ప్రభువయ్యెను. సిద్ధులు అన్నియూ శ్రీమాతవే. శ్రీమాత అనుగ్రహము లేనిదే ఎవ్వరునూ ఎట్టి సిద్దులను పొందలేరు. సిద్దులు పొందుటకు కూడ ఆరాధనయే ఉపాయము. ఆరాధన మూడు విధములుగ నున్నది. తామసికము, రాజసికము, సత్త్వము. ఇందు మొదటి రెండునూ సిద్ధులను కోరి ఆరాధించుట. మూడవది అగు సాత్విక ఆరాధన అమ్మ అనుగ్రహము కొరకు, సాన్నిధ్యము కొరకు మాత్రమే ప్రార్థించుట.*


*తామసిక, రాజసిక ఆరాధకులు అహంకారము వలన పతనము చెందుదురు. సాత్విక ఆరాధకులు అమ్మ సాన్నిధ్యమున నుండుటచే పతనము చెందరు. తామసిక, రాజసిక ఆరాధకులు సిద్ధులను ప్రదర్శించుట, గొప్పతనము చాటుకొనుట, ఇతరులను వశపరచుకొనుట, ఇత్యాది కృత్యములలో పాల్గొని క్రమముగ నశింతురు. సాత్వికులు సిద్ధులను వినియోగింపరు. కాలమును దేశమును బట్టి, అవసరమును బట్టి వారి నుండి సిద్ధులు వ్యక్తమగును.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 406 - 1 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj*


*🌻 88. Bhaktahardhatamobheda bhanumadbanu santatih*

*Shivaduti shivaradhya shivamurtishivankari ॥ 88 ॥ 🌻*


*🌻 406. 'Shivaradhya' - 1 🌻*


*It means Lord Shiva worships Srimata. Lord Shiva also worshipped the Goddess through meditation and became the lord of creation. All Siddhas(miracles) are of Sri Mata only. Without Srimata's grace, no one can attain any Siddhi. It is only through worship of Srimata that one can attain siddhis. Worship is of three types. Tamasika, Rajasika, Sattva. The first two of these are seeking only Siddhis. Third is sattvic worship praying only for Amma's grace and closeness.*


*Tamasic and rajasic worshipers fall due to pride. Sattvic worshipers do not fall due to being in the presence of Mother. Tamasic and rajasic worshipers engage in activities such as display of siddhis, display of greatness, subjugation of others, etc. and eventually perish. Satviks do not use Siddhis. According to the time and the situation, according to the need, the siddhis will be manifested from them.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Comments


Post: Blog2 Post
bottom of page