🌹🍀 07 - SEPTEMBER - 2022 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🍀🌹
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 07, సెప్టెంబర్ 2022 బుధవారం, సౌమ్యవాసరే Wednesday 🌹
*🌴. వామన జయంతి శుభాకాంక్షలు, Happy Vamana Jayanti 🌴*
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 259 / Bhagavad-Gita -259 - 6-26 ధ్యాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 658 / Vishnu Sahasranama Contemplation - 658 🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 337 / DAILY WISDOM - 337 🌹
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 237 🌹
*🌹. వామన జయంతి విశిష్టత🌹*
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 07, September 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*🌴. వామన జయంతి శుభాకాంక్షలు, Happy Vamana Jayanti 🌴*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌺. పండుగలు మరియు పర్వదినాలు : వామన జయంతి, Vamana Jayanti 🌺*
*🍀. శ్రీ వామన స్తోత్రం 🍀*
విశ్వాయ విశ్వభవనస్థితి సంయమాయ
స్వైరం గృహీతపురుశక్తిగుణాయ భూమ్నే |
స్వస్థాయ శశ్వదుపబృంహితవూర్ణబోధ-
వ్యాపాదితాత్మతమసే హరయే నమస్తే ||
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : తుట్టతుది ఆనందం అందుకోడానికి దుఃఖమనేదీ, అడ్డులేని కార్యసిద్ధి పొందడానికి అపజయమనేదీ ఎంతగా అవసరమో నీవు గుర్తించ గలిగినప్పుడే, ఈశ్వరుని కార్యపద్ధతులు నీకు అర్థం కావడమనేది ప్రారంభమౌతుంది.🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, దక్షిణాయణం,
వర్ష ఋతువు, భాద్రపద మాసం
తిథి: శుక్ల ద్వాదశి 24:06:53 వరకు
తదుపరి శుక్ల త్రయోదశి
నక్షత్రం: ఉత్తరాషాఢ 16:01:32
వరకు తదుపరి శ్రవణ
యోగం: శోభన 25:16:56 వరకు
తదుపరి అతిగంధ్
కరణం: బవ 13:35:17 వరకు
వర్జ్యం: 01:27:40 - 02:55:00
మరియు 19:38:30 - 21:05:30
దుర్ముహూర్తం: 11:49:17 - 12:38:46
రాహు కాలం: 12:14:02 - 13:46:47
గుళిక కాలం: 10:41:16 - 12:14:02
యమ గండం: 07:35:44 - 09:08:30
అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:38
అమృత కాలం: 10:11:40 - 11:39:00
మరియు 28:20:30 - 29:47:30
సూర్యోదయం: 06:02:58
సూర్యాస్తమయం: 18:25:05
చంద్రోదయం: 16:14:36
చంద్రాస్తమయం: 02:32:43
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: మకరం
వజ్ర యోగం - ఫల ప్రాప్తి 10:33:59
వరకు తదుపరి ముద్గర యోగం
- కలహం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌺. వామన జయంతి శుభాకాంక్షలు మిత్రులందరికి, Happy Vamana Jayanti to All 🌺*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. శ్రీ వామన స్తోత్రం 🍀*
అదితిరువాచ –
యజ్ఞేశ యజ్ఞపురుషాచ్యుత తీర్థపాద
తీర్థశ్రవశ్శ్రవణ మంగళనామధేయ |
ఆపన్నలోకవృజినోపశమోదాఽఽద్య శం నః
కృధీశ భగవన్నసి దీననాథః || ౧ ||
విశ్వాయ విశ్వభవన స్థితి సంయమాయ
స్వైరం గృహీత పురుశక్తి గుణాయ భూమ్నే |
స్వస్థాయ శశ్వదుప బృంహిత వూర్ణబోధ-
వ్యాపాదితాత్మ తమసే హరయే నమస్తే || ౨ ||
ఆయుః పరం వపురభీష్టమతుల్యలక్ష్మీ-
ర్ద్యౌభూరసాస్సకలయోగగుణాస్త్రివర్గః |
జ్ఞానం చ కేవలమనంత భవంతి తుష్టా-
త్త్వత్తో నృణాం కిము సపత్నజయాదిరాశీః || ౩ ||
ఇతి శ్రీమద్భాగవతే శ్రీవామనస్తోత్రం |
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 259 / Bhagavad-Gita - 259 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 26 🌴*
*26. యతో యతో నిశ్చలతి మనశ్చంచలమస్థిరమ్ |*
*తతస్తతో నియమ్యైతదాత్యన్యేవ వశం నయేత్ ||*
🌷. తాత్పర్యం :
*చంచలత్వము మరియు అస్థిరత్వము కారణమున మనస్సు ఎచ్చట పరిభ్రమించినను మనుజుడు దానిని అచ్చట నుండి తప్పక నిగ్రహించి ఆత్మ వశమునకు గొనిరావలెను.*
🌷. భాష్యము :
చంచలత్వము, అస్థిరత్వమనునవి మనస్సు యొక్క స్వభావములు. కాని ఆత్మదర్శియైన యోగి అట్టి మనస్సును నియమింపవలెను. దానిచే అతడెన్నడును నియమింపబడరాదు. మనస్సును నియమించినవాడు (తద్ద్వారా ఇంద్రియములను నియమించినవాడు) గోస్వామి లేదా స్వామి యనబడును. అట్లుగాక మనస్సు చేతనే నియమింప బడెడివాడు గోదాసుడు లేదా ఇంద్రియదాసుడని పిలువబడును.
ఇంద్రియముల వలన కలిగే ఆనందపు పరిమాణమును గోస్వామి ఎరిగియుండును. కనుకనే దివ్యానంద భావనలో అతని ఇంద్రియములు హృషీకేశుని (ఇంద్రియాధినేతయైన శ్రీకృష్ణుడు) సేవ యందు నియుక్తమై యుండును. ఆ విధముగా పవిత్రములైన ఇంద్రియములతో కృష్ణుని సేవించుటయే కృష్ణభక్తిరసభావనమనబడును.
ఇంద్రియములను అదుపులోనికి తెచ్చుటకు ఇదియే ఉత్తమమార్గము. యోగాభ్యాసపు అత్యున్నత పూర్ణత్వమైన దీనికి మించినది వేరొక్కటి లేదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 259 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
*🌴 Chapter 6 - Dhyana Yoga - 26 🌴*
*26. yato yato niścalati manaś cañcalam asthiram*
*tatas tato niyamyaitad ātmany eva vaśaṁ nayet*
🌷 Translation :
*From wherever the mind wanders due to its flickering and unsteady nature, one must certainly withdraw it and bring it back under the control of the Self.*
🌹 Purport :
The nature of the mind is flickering and unsteady. But a self-realized yogī has to control the mind; the mind should not control him. One who controls the mind (and therefore the senses as well) is called gosvāmī, or svāmī, and one who is controlled by the mind is called go-dāsa, or the servant of the senses. A gosvāmī knows the standard of sense happiness. In transcendental sense happiness, the senses are engaged in the service of Hṛṣīkeśa, or the supreme owner of the senses – Kṛṣṇa. Serving Kṛṣṇa with purified senses is called Kṛṣṇa consciousness.
That is the way of bringing the senses under full control. What is more, that is the highest perfection of yoga practice.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 658 / Vishnu Sahasranama Contemplation - 658🌹*
*🌻658. వీరః, वीरः, Vīraḥ🌻*
*ఓం వీరాయ నమః | ॐ वीराय नमः | OM Vīrāya namaḥ*
*విష్ణుర్గత్యాది మత్త్యాత్సవీర ఇత్యభిధీయతే*
'వీ' అను ధాతువునకు పలు అర్థములుగలవు.
*వీ గతి వ్యాప్తి ప్రజన కాన్తి అసన ఖాదనేషు.*
*వ్యాప్తి - అనగా ఎందయినను చేరియుండు వాడు; ప్రజననము - మిక్కిలిగా ప్రపంచమును జనింప జేయువాడు; కాంతి - ప్రకాశము గలవాడు; అసనము - అసురులు మొదలయిన వారిని సంహరించుటకై ఏ ఆయుధములయినను ఎంతటి దూరమునకయినను విసిరివేయ సామర్థ్యము గలవాడు; ఖాదము - ప్రళయ కాలమున సర్వ ప్రాణులను హరించువాడు.*
*పై అర్థములుగల 'వీ' అను ధాతువునకు 'ర' - 'కలది' అను అర్థముగల ప్రత్యయము చేరగా వీరః అను నామము వచ్చును. 'వీ' ధాత్వర్థములన్నియు తన ధర్మములుగా గలవాడు కనుక ఆ విష్ణు దేవుడు వీరః అనబడును.*
401. వీరః, वीरः, Vīraḥ
643. వీరః, वीरः, Vīraḥ
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 658🌹*
*🌻658.Vīraḥ🌻*
*OM Vīrāya namaḥ*
*विष्णुर्गत्यादि मत्त्यात्सवीर इत्यभिधीयते / Viṣṇurgatyādi mattyātsavīra ityabhidhīyate*
The root 'Vī' has many interpretations.
*वी गति व्याप्ति प्रजन कान्ति असन खादनेषु / Vī gati vyāpti prajana kānti asana khādaneṣu.*
*'Vī' can mean motion, pervasion (to pervade), creation, effulgence, throwing (weapon) and annihilation. The suffix 'ra' implies (the One) with. Hence Lord Viṣṇu by the reason of having all capabilities/attributes as defined by the root 'Vī' is Vīraḥ.*
401. వీరః, वीरः, Vīraḥ
643. వీరః, वीरः, Vīraḥ
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
कामदेवः कामपालः कामी कान्तः कृतागमः ।अनिर्देश्यवपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ॥ ७० ॥
కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః ।అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనన్తో ధనఞ్జయః ॥ 70 ॥
Kāmadevaḥ kāmapālaḥ kāmī kāntaḥ krtāgamaḥ,Anirdeśyavapurviṣṇurvīro’nanto dhanañjayaḥ ॥ 70 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 337 / DAILY WISDOM - 337 🌹*
*🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀*
*📝. ప్రసాద్ భరద్వాజ్*
*🌻 2. నీతి మరియు నైతిక శాస్త్రం 🌻*
*మానవ జీవితం సురక్షితంగా జీవించడానికి కొన్ని నిర్దుష్టమైన ప్రవర్తనా నియమాలపై ప్రజలు ఎక్కువగా ఆధారపడతారు. వీటినే నైతిక విలువలు లేదా నైతికత అంటారు. మనిషి తన అసమర్థత, అభద్రత మరియు బానిసత్వ భావనను అధిగమించడానికి ప్రయత్నించే ప్రయత్నాలలో ఇది మరొకటి. వ్యక్తుల ప్రవర్తనకు నైతికత అనే ఒక ప్రమాణం లేదా కట్టుబాటు రూపొందించబడింది. ఆ కట్టుబాటు విచ్ఛిన్నమైతే, ఆ ప్రవర్తనను అనైతికం, మొదలైనవి అంటారు. నేటి మతాలు ఈ నైతిక విలువల గురించి ఎంత చెప్పినా, ఆఖరికి ఇవి ఎది చెయ్యాలో, ఎది చెయ్యకూడదో, ఎలా చెయ్యాలో చెప్పే ఒక నియమాల సంపుటి మాత్రమే తప్ప మరొకటి కాదు. మనుష్యులను ఒక విధంగా మాత్రమే జీవించాలని బలవంతపెట్టే ఒక నిర్దుష్టమైన నియమాల యొక్క సమూహం.*
*ప్రభుత్వ నిబంధనల ప్రకారం మనిషి ఒక నిర్దిష్ట పద్ధతిలో మాత్రమే ప్రవర్తించవలసి వస్తుంది, అయితే నీతి మరియు నైతికత యొక్క ఆదేశాలు అతన్ని మరొక విధంగా బలవంతం చేస్తాయి. అతను కోరుకున్నా లేకపోయినా ఒక ప్రామాణిక పద్ధతిలో ప్రవర్తించేలా బలవంతం చేస్తాయి. . కాబట్టి, మళ్ళీ, అతను బంధన స్థితిలోనే ఉన్నాడు. జీవితంలో స్వేచ్ఛ కిరణం కూడా కనిపించదు. ప్రతి వైపు నుండి ఎల్లప్పుడూ ఒత్తిడి ఉంటుంది. ఈ పద్ధతిలో లేదా ఆ పద్ధతిలో చెప్పడానికి, చేయమని మరియు ఆలోచించమని మతం ప్రతి ఒక్కరినీ బలవంతం చేస్తుంది; సమాజం దానిదైన పంథా లో బలవంతం చేస్తుంది. రాజకీయ ప్రభుత్వాలు కూడా అలాగే ఉంటాయి.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 337 🌹*
*🍀 📖 from The Philosophy of Religion 🍀*
*📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj*
*🌻 2. 2. The Science of Ethics and Morality 🌻*
*There is the science of ethics, often called morality, on which people hang very much for a safe conduct of human life. This is another of man's attempts at trying to tackle his feeling of inadequacy, insecurity, and bondage. A standard or a norm is framed for the behaviour of people, and, if the norm is broken, that behaviour is called unethical, immoral, and so on. Thus, the religions of the world today, especially those which have leant too much on these norms of ethics and morality, have turned out to be nothing but mechanisms of dos and don'ts, a different set of mandates that compel men to behave in a particular manner.*
*While man is forced to behave in a particular manner only, willy-nilly, by the regulations of the government, the mandates of ethics and morality compel him in another way and force him to behave in a standardised manner, whether he wants it or not. So, again, he is in a state of bondage. Not even a ray of freedom can be seen in life. There are always compulsions from every side. Religion compels everyone to say, do, and think in this manner or that manner; society forces in its own way; and so do political governments.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 237 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. అహం అధికారపూర్వకం. అదెప్పుడూ మర్యాదగా మారదు. అది వినయంగా మారదు. మర్యాద, వినయం, ద్వారానే అస్తిత్వానికి దారి ఏర్పడుతుంది. మనిషి రాయిగా వుండడం కన్నా నీరుగా మారాలి. 🍀*
*మర్యాద అన్నది గొప్ప దైవికమయిన లక్షణం. అస్తిత్వంలో అపూర్వమయిన లక్షణం వల్ల అహం వదిలేయ బడుతుంది. అహమెప్పుడూ మర్యాద కాదు. అహం అధికారపూర్వకం. అదెప్పుడూ మర్యాదగా మారదు. అది వినయంగా మారదు. వినయంగా అది వుండడమన్నది అసాద్యం.*
*అది వినయంగా మారితే దాని స్థితి తలకిందులవుతుంది. మర్యాద, వినయం, ద్వారానే అస్తిత్వానికి దారి ఏర్పడుతుంది. మనిషి రాయిగా వుండడం కన్నా నీరుగా మారాలి. ఒక విషయమెప్పుడూ గుర్తుంచుకోవాలి. కాలం గడిచే కొద్దీ నీరు రాయిపై విజయం సాధిస్తుంది.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. వామన జయంతి విశిష్టత🌹*
*🌴. వామన జయంతి శుభాకాంక్షలు, Happy Vamana Jayanti 🌴*
*📚. ప్రసాద్ భరధ్వాజ*
*'ధర్మ సంస్థాపనకోసం అవసరమైన సందర్భాల్లో అవతరిస్తూనే ఉంటా'నని శ్రీమహావిష్ణువు అభయ ప్రదానం చేశాడు.*
*ఆ పరంపరలో ఆవిష్కారమైన అయిదోది వామనావతారం. భాద్రపద శుద్ధ ద్వాదశినాడు అదితి , కశ్యపుల కుమారుడిగా శ్రీహరి వామనమూర్తిగా అవతరించాడు. దీన్ని వామన ద్వాదశిగా , విజయ ద్వాదశిగా వ్యవహరిస్తారు. సృష్టిలోని జీవావరణంలో జీవులు సూక్ష్మరూపం నుంచి మహా భారీకాయం వరకు వైవిధ్యభరితంగా గోచరమవుతాయి. ఈ అణుత్వం , మహారూపాలు పరస్పర విరుద్ధమైనవి. కానీ , ఆ వైవిధ్యం ఆత్మ , పరమాత్మల విషయంలో లేదని వేదోక్తి. ఆత్మ అణువు కంటే సూక్ష్మమైనది , మహత్తరమైనది. అది ఎంత సూక్ష్మమైనదో , అంత స్థూలమైనదని కఠోపనిషత్తు ప్రకటించింది. వామనావతార నేపథ్యం ఇదే !*
*వామనావతార విశేషాల్ని శ్రీమద్భాగవతం , వామన పురాణాలు విశదీకరిస్తున్నాయి. ఓసారి బలి చక్రవర్తి ఇంద్రుణ్ని ఓడించి , స్వర్గానికి అధిపతి అయ్యాడు. విజయగర్వంతో రాక్షసులు అనేక అకృత్యాలకు పాల్పడసాగారు. దాంతో దేవతల మాతృమూర్తి అదితి కలత చెంది , కేశవుణ్ని వేడుకుని , అనుగ్రహాన్ని పొందింది. ఫలితంగా నారాయణుడు దేవతల రక్షణార్థం వామనుడిగా అవతరించాడు. అతనికి ఉపనయన సంస్కారాలు జరిగాయి.*
*బ్రహ్మ తేజస్సు , దివ్య యశస్సులతో వెలిగే వటుడైన వామనుడు దండాన్ని , గొడుగును , కమండలాన్ని ధరించి బలి చక్రవర్తి నిర్వహించే యజ్ఞశాలలోకి ప్రవేశించాడు. *'స్వస్తి జగత్త్రయీ భువన శాసనకర్తకు...' అంటూ బలిని ఆశీర్వదించాడు. సందర్భోచిత లౌక్యాన్ని ప్రదర్శించాడు. వామనుడి వర్చస్సు , వాక్చాతుర్యానికి ముగ్ధుడై బలి చక్రవర్తి ఏం కావాలో కోరుకొమ్మన్నాడు.*
*'కేవలం నా పాదాలకే పరిమితమైన మూడు అడుగుల భూమిని మాత్రం నాకివ్వు చాలు' అన్నాడు వామనుడు. ఆ వటుడి రూపంలాగానే అతడి కోరిక కూడా కురచగానే ఉందని బలి భావించాడు. భూ దానానికి సమాయత్తమైన బలిని అతడి గురువు శుక్రాచార్యుడు నిలువరించాడు. అయినా బలి శుక్రుడి మాట వినకుండా , వామనుడికి ఉదకపూర్వకంగా భూమిని దానం చేశాడు. త్రివిక్రముడిగా వామనుడు విరాట్ రూపాన్ని సంతరించుకుని , ఓ పాదంతో భూమినీ , మరో పాదంతో స్వర్గాన్నీ ఆక్రమించి , మూడోపాదం బలి శిరస్సుపై ఉంచి , అతణ్ని రసాతలానికి అణగదొక్కాడు.*
*బలి సర్వ సమర్పణా భావానికి ప్రసన్నుడైన వామనుడు సుతల లోక రాజ్యాన్ని అనుగ్రహించాడు. ఇంద్రుడికి తిరిగి స్వర్గలోకాధిపత్యాన్ని కల్పించాడు.*
*వామన పురాణంలో ఇదే గాథను పోలిన మరో వృత్తాంతం గోచరమవుతుంది .*
*దుంధుడు అనే దానవుడు దేవతలపై దండెత్తే బలాన్ని సమకూర్చుకోవడానికి దేవికా నదీ తీరాన అశ్వమేధ యాగం చేయసాగాడు. దుంధుణ్ని యుక్తితో జయించాలని , శ్రీహరి వామన రూపంలో దేవికానదిలో ఓ దుంగలాగా తేలుతూ కొట్టుకుపోసాగాడు. దుంధుడు , అతడి అనుచరులు ఆ బాలుణ్ని రక్షించారు. తన పేరు గతి భానుడనీ , తాను మరుగుజ్జునైనందువల్ల ఆస్తి వివాదాల్లో తనను దాయాదులు నదిలో పడవేశారని చెప్పాడు. అతడి దీనగాథను విని దుంధుడు ఏం కావాలో కోరుకొమ్మన్నాడు. మూడడుగుల నేల కోరిన వామనుడు ఆ సంవిధానంలోనే దుంధుణ్ని భూమిలోకి తొక్కి సమాధి చేశాడని పురాణగాథ.*
*వామనావతారం ఆత్మ తత్వాన్ని అద్భుతంగా ప్రకటించింది. జీవుడు తనలో ఉన్న ఆత్మ , విశ్వాంతరాళంలో ఉన్న పరమాత్మ ఒక్కటేనని జ్ఞానపూర్వకంగా గుర్తించాలి. ఆ స్పృహ ఏర్పడే కొద్దీ వామనరూపం అనూహ్యంగా పెరిగి పెద్దదై , విశ్వవ్యాప్తమై , పరమాత్మ తత్వమై భాసిల్లుతుంది. యజ్ఞయాగాదులనేవి పేరుకోసం చేయవద్దనీ , నేను ప్రభువును , నేను గొప్ప దాతనని గర్వించడం తగదని భగవద్గీత హెచ్చరించింది. పరుల ధనాన్నీ , భూమిని ఆక్రమించడం , దానం చేయడం , నేను కర్తను , భోక్తను అని విర్రవీగేవారు అజ్ఞానులని ఈశావాస్య ఉపనిషత్తు చెబుతోంది. ఈ నేపథ్యమే బలి పతనానికి దారి తీసింది. మనిషి బిందు స్థితిలో బీజప్రాయంగా నిద్రాణంగా ఉన్న శక్తిని ఆత్మవిశ్వాసంతో గుర్తించాలి. దీని ద్వారా మనిషి మహనీయుడిగా ఎదగవచ్చని వామనావతారం సందేశమిస్తుంది.*
*వామన ద్వాదశి ముందు రోజు ఏకాదశినాడు ఉపవసించి జాగారం చేసి , వామన విగ్రహాన్ని పూజిస్తారు.*
*శుక్ర ద్వాదశి , వామన ద్వాదశి , శ్రవణ ద్వాదశి , మహా ద్వాదశి , అనంత ద్వాదశి , కల్కి ద్వాదశి అన్న పేర్లూ ఈ పర్వదినానికున్నాయి.*
*ఎదుటివారిని అహంకారంతో చులకనగా చూసే దుష్టులకు తగిన గుణపాఠం నేర్పి , వారికి సక్రమ మార్గ నిర్దేశం చేయడమే వామనావతార రహస్యం.*
🌹 🌹 🌹 🌹 🌹
Comments