top of page
Writer's picturePrasad Bharadwaj

🍀 08 - AUGUST - 2022 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🍀

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 08, ఆగస్టు 2022 సోమవారం, ఇందు వాసరే Monday 🌹 2) 🌹. శ్రీమద్భగవద్గీత - 244 / Bhagavad-Gita - 244 -6-11 ధ్యాన యోగము🌹 3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 643 / Vishnu Sahasranama Contemplation - 643 🌹 4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 322 / DAILY WISDOM - 322 🌹 5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 222 🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹08, August 2022 పంచాగము - Panchangam 🌹* *శుభ సోమవారం, Monday, ఇందు వాసరే* *మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ* *🌻. పండుగలు మరియు పర్వదినాలు : శ్రావణ పుత్రదా ఏకాదశి, సోమవార వ్రతం, Shravana Putrada Ekadashi, Somwar Vrat 🌻* *🍀. రుద్రనమక స్తోత్రం - 36 🍀* *69. అవిజ్ఞేయ స్వరూపాయ సుందరాయ నమోనమః!* *ఉమాకాంత నమస్తేస్తు నమస్తే సర్వసాక్షిణే!!* *70. హిరణ్య బాహవే తుభ్యం హిరణ్యాభరణాయ చ!* *నమో హిరణ్య రూపాయ రూపాతీతాయ తే నమః!!* 🌻 🌻 🌻 🌻 🌻 *🍀. నేటి సూక్తి : ఆ అనంతునికి నీవు పరిష్వంగ యోగ్యమైన దివ్యశరీరాన్ని కల్పించడంతో పాటు ఈ జగత్తున దృగ్గోచరమయ్యే సమస్త శరీరాలలోనూ ఆయనను నీవు దర్శించగలిగితే, పరమసత్యపు అత్యంత సువిశాల అగాధ తలాలను సైతం నీవు అందుకోగలిగావని చెప్పవచ్చు. 🍀* 🌷🌷🌷🌷🌷 శుభకృత్‌ సంవత్సరం, శ్రావణ మాసం దక్షిణాయణం, వర్ష ఋతువు తిథి: శుక్ల-ఏకాదశి 21:01:09 వరకు తదుపరి శుక్ల ద్వాదశి నక్షత్రం: జ్యేష్ఠ 14:38:37 వరకు తదుపరి మూల యోగం: ఇంద్ర 06:55:16 వరకు తదుపరి వైధృతి కరణం: వణిజ 10:27:00 వరకు వర్జ్యం: 21:51:20 - 23:18:00 దుర్ముహూర్తం: 12:47:16 - 13:38:31 మరియు 15:21:02 - 16:12:17 రాహు కాలం: 07:33:20 - 09:09:26 గుళిక కాలం: 13:57:44 - 15:33:50 యమ గండం: 10:45:32 - 12:21:38 అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:46 అమృత కాలం: 06:31:48 - 08:00:12 మరియు 30:31:20 - 31:58:00 సూర్యోదయం: 05:57:15 సూర్యాస్తమయం: 18:46:02 చంద్రోదయం: 15:20:49 చంద్రాస్తమయం: 01:35:41 సూర్య సంచార రాశి: కర్కాటకం చంద్ర సంచార రాశి: వృశ్చికం పద్మ యోగం - ఐశ్వర్య ప్రాప్తి 14:38:37 వరకు తదుపరి లంబ యోగం - చికాకులు, అపశకునం 🌻 🌻 🌻 🌻 🌻 *🍀. నిత్య ప్రార్థన 🍀* *వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ* *నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా* *యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా* *తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం* *తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* *విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.* 🌹🌹🌹🌹🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




🌹. శ్రీమద్భగవద్గీత - 244 / Bhagavad-Gita - 244 🌹 ✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 📚. ప్రసాద్ భరద్వాజ 🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 11 🌴 *11. శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మాన: |* *నాత్యుచ్చ్రితం నాతినీచం చైలాజినకుశోత్తరమ్ ||* 🌷. తాత్పర్యం : *యోగాభ్యాసము కొరకు యోగి ఏకాంతస్థాలమున కేగి నేలపై కుశగ్రాసమును పరచి, దానిని జింకచర్మము మరియు వస్త్రముతో కప్పవలెను, అట్టి ఆసనము అతి ఎత్తుగాను లేదా అతి క్రిందుగాను ఉండక పవిత్రస్థానములో ఏర్పాటు కావలెను.* 🌷. భాష్యము : “శుచౌదేశే” అను పదము ఇచ్చట తీర్థస్థానములను సూచించుచున్నది. భారతభూమి యందు యోగులు మరియు భక్తులు గృహములను విడిచి గంగ, యమున వంటి పవిత్రనదులు ప్రవహించు ప్రయాగ, మథుర, బృందావనము, హృషీకేశము, హరిద్వారము వంటి తీర్థస్థానముల కేగి అచ్చట ఏకాంత యోగాభ్యాసమును కావింతురు. కాని ఇది అన్నివేళలా సర్వులకు (ముఖ్యముగా పాశ్చాత్యదేశవాసులకు) సాధ్యము కాదు. పెద్ద పెద్ద నగరములందలి యోగసంఘములు ధనమును గడింపవచ్చునేమో గాని నిజమైన యోగసాధనకు అవి ఏమాత్రము తగినవి కావు. 🌹 🌹 🌹 🌹 🌹 🌹 Bhagavad-Gita as It is - 244 🌹 ✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada 📚 Prasad Bharadwaj 🌴 Chapter 6 - Dhyana Yoga - 11 🌴 *11. śucau deśe pratiṣṭhāpya sthiram āsanam ātmanaḥ* *nāty-ucchritaṁ nāti-nīcaṁ cailājina-kuśottaram* 🌷 Translation : *To practice yoga, one should go to a secluded place and should lay kuśa grass on the ground and then cover it with a deerskin and a soft cloth. The seat should be neither too high nor too low and should be situated in a sacred place.* 🌹 Purport : “Sacred place” refers to places of pilgrimage. In India the yogīs – the transcendentalists or the devotees – all leave home and reside in sacred places such as Prayāga, Mathurā, Vṛndāvana, Hṛṣīkeśa and Hardwar and in solitude practice yoga where the sacred rivers like the Yamunā and the Ganges flow. But often this is not possible, especially for Westerners. The so-called yoga societies in big cities may be successful in earning material benefit, but they are not at all suitable for the actual practice of yoga. 🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 643/ Vishnu Sahasranama Contemplation - 643🌹* *🌻643. వీరః, वीरः, Vīraḥ🌻* *ఓం వీరాయ నమః | ॐ वीराय नमः | OM Vīrāya namaḥ* వీరః, वीरः, Vīraḥ వీరః శూరః *శూరుడు, మహా విక్రమశాలి.* :: శ్రీమద్రామాయణే అరణ్యకాణ్డే త్రిపఞ్చాశస్సర్గః :: నిమేషన్తరమాత్రేణ వినా భ్రాత్రా మహావనే । రాక్షసా నిహతా యేన సహస్రాణి చతుర్దశ ॥ 23 ॥ స కథం రాఘవో వీరః సర్వాస్త్రకుశలో బలీ । న త్వాం హన్యాచ్ఛరైస్తీక్ష్ణైః ఇష్టభార్యాపహారిణమ్ ॥ 24 ॥ *(సీతా దేవి రావణునితో) ఆనాడు దండకారణ్యమునందు తమ్మునితోడు లేకుండగనే రాముడు ఒక్కడే ఖరుడు మొదలగు పదునాలుగువేలమంది రాక్షసయోధులను ఒక్క నిముషములో మట్టి గరిపించెను. వివిధములగు అస్త్రములను ప్రయోగించుటలో ఆరితేరినవాడు, మహా వీరుడు, బలశాలియు అయిన అట్టి శ్రీరాముడు అతని ప్రియభార్యను అపహరించిన నిన్ను తీక్ష్ణమైన శరములచే చంపకుండ ఎట్లుండగలడు?* 401. వీరః, वीरः, Vīraḥ సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 *🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 643🌹* *🌻643. Vīraḥ🌻* *OM Vīrāya namaḥ* वीरः शूरः / Vīraḥ Śūraḥ *Brave and Valiant.* :: श्रीमद्रामायणे अरण्यकाण्डे त्रिपञ्चाशस्सर्गः :: निमेषन्तरमात्रेण विना भ्रात्रा महावने । राक्षसा निहता येन सहस्राणि चतुर्दश ॥ २३ ॥ स कथं राघवो वीरः सर्वास्त्रकुशलो बली । न त्वां हन्याच्छरैस्तीक्ष्णैः इष्टभार्यापहारिणम् ॥ २४ ॥ Śrīmad Rāmāyaṇa - Book 3, Chapter 53 Nimeṣantaramātreṇa vinā bhrātrā mahāvane, Rākṣasā nihatā yena sahasrāṇi caturdaśa. 23. Sa kathaṃ rāghavo vīraḥ sarvāstrakuśalo balī, Na tvāṃ hanyāccharaistīkṣṇaiḥ iṣṭabhāryāpahāriṇam. 24. *By whom fourteen thousand demons are killed in war just within a minute, single-handedly without any help from his brother, how then that brave and mighty Raghava, an expert in all kinds of missiles, not eliminate you, the stealer of his chosen wife, with his mordant arrows?" Thus Seetha poured forth her ire at Ravana* 401. వీరః, वीरः, Vīraḥ 🌻 🌻 🌻 🌻 🌻 Source Sloka कालनेमिनिहा वीरश्शौरिश्शूरजनेश्वरः ।त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः ॥ ६९ ॥ కాలనేమినిహా వీరశ్శౌరిశ్శూరజనేశ్వరః ।త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ॥ 69 ॥ Kālaneminihā vīraśśauriśśūrajaneśvaraḥ,Trilokātmā trilokeśaḥ keśavaḥ keśihā hariḥ ॥ 69 ॥ Continues.... 🌹 🌹 🌹 🌹🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 322 / DAILY WISDOM - 322 🌹* *🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀* *✍️ .స్వామి కృష్ణానంద 📝. ప్రసాద్ భరద్వాజ* *🌻 17. ఒక యోగ రహస్యం 🌻* *మీరు వస్తువులను ఎక్కువగా కోరుకునే కొద్దీ మీ శక్తి తగ్గిపోతుంది. ఎవరైతే విషయాలు కోరుకుంటున్నారో వారు శక్తిని కోల్పోతారు; వస్తువులతో ఒకటిగా ఉన్న వ్యక్తి శక్తితో నిండిపోతాడు. వస్తువులతో ఐక్యమైన వ్యక్తికి వస్తువులపై కోరిక ఉండదు; ఇది ఒక వ్యక్తి శక్తితో నిండిన మార్గం. విషయాలు మన వెలుపల నిలబడితే, అవి మన శక్తిని తీసివేస్తాయి; అవి మనతో ఒకటిగా ఉంటే, అవి మనకు శక్తిని ఇస్తాయి. ఇదే యోగ రహస్యం. మన వెలుపల ఏదీ నిలబడకూడదు; ప్రతిదీ మనతో ఒకటిగా ఉండాలి. ఆ వ్యక్తి మీ వెలుపల ఉన్నప్పుడు మీరు ఎవరికీ స్నేహితులు కాలేరు. ఒక వ్యక్తి ఆలోచన మరియు ఉనికిలో మీతో ఒకటిగా ఉండాలి; అప్పుడు అతను నిజమైన స్నేహితుడు.* *ఈ విధంగా మీరు అన్ని విషయాలకు స్నేహితునిగా ఉండగలరు, దేవుడితో కూడా. మీరు కోరుకునే వస్తువులతో ఒకటిగా మారినప్పుడు, అన్నింటి నుండి శక్తి వస్తుంది. ఇదే విజయం వెనుక రహస్యం. మీకు కావలసినది మీకు ఇప్పటికే ఉందని మీరు తీవ్రంగా భావించాలి. అప్పుడు మీరు అడగకుండానే విషయాలు మీకు నిజంగా వస్తాయి. ఈ విధంగా మీ శక్తి పెరుగుతుంది. యోగాలో మీరు వస్తువుల వెంట పరిగెత్తరు. కానీ వస్తువులు వాటంతట అవే మీ వద్దకు వస్తాయి. ఇది దానిలోని సాంకేతిక విషయం. యోగా అంటే మీరు ఒక వస్తువు గురించి తెలుసుకుని దానిని కోరుకోవడం మాత్రమే కాదు, మీరే అది అయిపోవడం.* *కొనసాగుతుంది...* 🌹 🌹 🌹 🌹 🌹 *🌹 DAILY WISDOM - 322 🌹* *🍀 📖 from Your Questions Answered 🍀* *📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj* *🌻 17. This is the Secret of Yoga 🌻* *Your energy becomes less and less as you desire things more and more. Whoever wants things loses energy; whoever is one with things, becomes filled with energy. One who is united with things has no desire for things; this is the way one becomes filled with energy. When things stand outside us, they take away our energy; if they are one with us, they give us energy. This is the secret of yoga. Nothing should stand outside us; everything should be one with us. You cannot be a friend of anybody when that person is outside you. A person has to be one with you in thought and being; then he is a real friend.* *This is how you can be a friend of all things, even God Himself. When you become the very things that you want, all energy comes in. This is the secret behind success. You have to intensely feel that you already have what you want. Then things will really come to you, without your asking for them. This is how energy increases. Yoga is the technique by which you do not run after things, but things, by themselves, will come to you. You have not only to know a thing but also to be it.* *Continues...* 🌹 🌹 🌹 🌹 🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 222 🌹* *✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ* *🍀. జీవితాన్ని మించిన దైవం లేదు. అస్తిత్వాన్ని మించిన ఆలయం లేదు. నువ్వు ప్రతిదాన్ని ఉత్సవంగా జరుపుకోవడం ఆరంబిస్తే నువ్వు నిజమైన ఆరాధకుడవుతావు. నువ్వు దేన్నీ నమ్మాల్సిన పన్లేదు. నువ్వు ఏం చేసినా అది నీ ధ్యానమవుతుంది.🍀* *ప్రతి ఒక్కరు మతానికి సంబంధించి కొత్త విధానాన్ని అవలంబించాలి. మతమన్నది, జీవితాన్ని ఉన్నతంగా ప్రదర్శించేది. జీవితాన్ని అభివృద్ధిపదంలో నడిపేది. జీవితాన్ని మరింత సౌందర్య భరితం చేసేది. అది సృజనాత్మకంగా వుండాలి. పలాయనంగా కాదు. నిన్ను మొద్దుబారేలా చెయ్యకూడదు. మరింత సున్నితంగా మార్చాలి. నా వరకు జీవితాన్ని మించిన దైవం లేదు. అస్తిత్వాన్ని మించిన ఆలయం లేదు.* *అప్పుడు ప్రతిదీ దైవత్వం నిండిన ఉత్సవమవుతుంది. అప్పుడు కలయిక ఉత్సవం, విడిపోవడం ఉత్సవం, పసితనం ఉత్సవం, యవ్యవనం ఉత్సవం, వృద్ధాప్యం ఉత్సవం. విభిన్నరకాల ఉత్సవాలు. నువ్వు ప్రతిదాన్ని ఉత్సవంగా జరుపుకోవడం ఆరంబిస్తే నువ్వు నిజమైన ఆరాధకుడవుతావు. నువ్వు దేన్నీ నమ్మాల్సిన పన్లేదు. చర్చికి, ఆలయానికి వెళ్ళాల్సిన పన్లేదు. నువ్వు ఎక్కడ వున్నా, నువ్వు ఏం చేసినా అది నీ ధ్యానమవుతుంది. సాధన అవుతుంది. నీ క్రమశిక్షణ అవుతుంది.* *సశేషం ...* 🌹 🌹 🌹 🌹 🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Comments


Post: Blog2 Post
bottom of page