top of page
Writer's picturePrasad Bharadwaj

🍀 08 - DECEMBER - 2022 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🍀

🌹🍀 08 - DECEMBER - 2022 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🍀🌹

1) 🌹 08 - DECEMBER - 2022 THURSDAY,గురువారం, బృహస్పతి వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹

🍀. దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Dattatreya Jayanti to All 🍀

🌹దత్తాత్రేయ జయంతి విశిష్టత 🌹

2) 🌹 కపిల గీత - 101 / Kapila Gita - 101 🌹 సృష్టి తత్వము - 57

3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 693 / Vishnu Sahasranama Contemplation - 693 🌹

4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 140 / Agni Maha Purana - 140 🌹 🌻. ఆలయ ప్రాసాద దేవతా స్థాపన శాంత్యాది వర్ణనము - 3 🌻

5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 275 / Osho Daily Meditations - 275 🌹 అబద్ధం మరియు నిజం THE FALSE AND THE TRUE

6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 418 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 418 - 1 🌹 'జడశక్తిః' - 1 'Jadashaktih' - 1


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹08, డిసెంబరు, December 2022 పంచాగము - Panchagam 🌹*

*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*

*🍀. దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Dattatreya Jayanti to All 🍀*

*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*

*ప్రసాద్ భరద్వాజ*


*🌺. పండుగలు మరియు పర్వదినాలు : దత్తాత్రేయ జయంతి, Dattatreya Jayanti, 🌺*


*🍀. శ్రీ దత్తత్రేయ స్తోత్రం 🍀*


*బ్రహ్మజ్ఞానమయీ ముద్రా వస్త్రే చాకాశభూతలే |*

*ప్రజ్ఞానఘనబోధాయ దత్తాత్రేయ నమోఽస్తు తే*

*అవధూత సదానంద పరబ్రహ్మస్వరూపిణే |*

*విదేహదేహరూపాయ దత్తాత్రేయ నమోఽస్తు తే*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : నిష్కాముడవై నీ ఆత్మను లక్ష్యమందు లగ్నంచేసి, నీలోని దివ్య శక్తితో దానినే అనుసంధానం చెయ్యి. అపుడు, ఆ లక్ష్యమే సాధనాన్ని సృష్టి చేస్తుంది. అంతేకాదు, తనకు తానే సాధనమౌతుంది కూడ. ఏల నంటే, బ్రహ్మమైన ఆ లక్ష్యం ఇది వరకే సిద్ధించి యున్నది. ఆ బ్రహ్మముగానే దానిని నీవు సర్వకాల సర్వావస్థలలో దర్శించు. 🍀*


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, హేమంత ఋతువు,

దక్షిణాయణం, మృగశిర మాసం

తిథి: పూర్ణిమ 09:39:02 వరకు

తదుపరి కృష్ణ పాడ్యమి

నక్షత్రం: రోహిణి 12:34:10 వరకు

తదుపరి మృగశిర

యోగం: సద్య 27:11:05 వరకు

తదుపరి శుభ

కరణం: బవ 09:39:02 వరకు

వర్జ్యం: 03:50:40 - 05:35:08 మరియు

18:43:18 - 20:29:06

దుర్ముహూర్తం: 10:16:28 - 11:00:59

మరియు 14:43:33 - 15:28:03

రాహు కాలం: 13:31:13 - 14:54:40

గుళిక కాలం: 09:20:50 - 10:44:17

యమ గండం: 06:33:54 - 07:57:22

అభిజిత్ ముహూర్తం: 11:45 - 12:29

అమృత కాలం: 09:04:04 - 10:48:32

మరియు 29:18:06 - 31:03:54

సూర్యోదయం: 06:33:54

సూర్యాస్తమయం: 17:41:36

చంద్రోదయం: 17:48:15

చంద్రాస్తమయం: 06:33:38

సూర్య సంచార రాశి: వృశ్చికం

చంద్ర సంచార రాశి: వృషభం

యోగాలు : ఉత్పాద యోగం - కష్టములు,

ద్రవ్య నాశనం 12:34:10 వరకు తదుపరి

మృత్యు యోగం - మృత్యు భయం


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ దత్తాత్రేయ స్వామివారి జయంతి విశిష్టత 🌹*

*ప్రసాద్‌ భరధ్వాజ*


*🌼. శ్రీ దత్తాత్రేయుడు జ్ఞానయోగనిధి, విశ్వగురువు, సిద్ధసేవితుడు. ‘శ్రీదత్తా’ అని స్మరించినంతనే మన మనస్సులోని కోర్కెలు తీర్చునని శ్రుతి తెలుపుచున్నది. సర్వజీవులకు జ్ఞానబోధ గావించుట, జ్ఞానమయము, ప్రేమ సత్యానందమయము, ధర్మమయమూ తరింపజేయుటయే దత్తమూర్తి అవతారము. దత్తాత్రేయుడు వేదజ్ఞానము నధిగమించిన జ్ఞానసాగరుడు.🌼*


*🌿🌼🙏. దత్తాత్రేయుడు అత్రి మహర్షి, అనసూయాదేవి కుమారుడు. అత్రి మహర్షి పుత్ర సంతానము కొరకై ఘోర తపస్సు చేసి దివ్యశక్తులు కలిగిన కుమారుడు కావాలని త్రిమూర్తులను కోరుకున్నాడు. తన తపస్సు ఫలితంగా బ్రహ్మ అంశమున చంద్రుడు, విష్ణు అంశమున దత్తుడు, శివ అంశమున దుర్వాసుడు జన్మించారు. కాలాంతరమున జన్మించిన ఆ ముగ్గురే శ్రీదత్తుడు అను నామముతో ప్రసిద్ధి చెందిరి. చంద్రుడు, దుర్వాసుడు తమ యొక్క శక్తులను దత్తునికి ధారపోశారు. దత్తుడు అనగా తనంత తానుగా ఎదుటి వ్యక్తికి ఇష్టముతో పెంచుకొనుటకై వెళ్లినవాడు అని అర్థం. శ్రీహరి తన జన్మస్థలమైన వైకుంఠ పట్టణమును విడిచి, అత్రికి పుత్రుడైన కారణముగా ఈయన ఆత్రేయుడైనాడు. ‘దత్తుడు + ఆత్రేయుడు ‘దత్తాత్రేయుడు’ అని మనం వ్యవహరించుచున్నాము.🙏🌼🌿*


*🌿🌼🙏. ఆధిభౌతికము, ఆధిదైవికము, ఆధ్యాత్మికము అనే త్రివిధాలయిన తాపాలను తన తపో మహిమతో తొలగించుకొన్న మహనీయుడు అత్రి మహర్షి. అత్రి పుత్రుడు కనుక ‘ఆత్రేయుడు’ అని కూడా పిలువబడినాడు. దత్తుడు గోమతీ నదీ తీరమున సత్యజ్ఞాన సముపార్జనకై తపస్సు చేసి సకల విద్యలలో ఆరితేరి జ్ఞానమును సంపాదించి సత్యజ్ఞాని అయ్యాడు. దత్తాత్రేయుడికి ఆరు చేతులు మూడు తలలు నడిమి శిరస్సు విష్ణువుది. కుడిది శివుడిది ఎడమది బ్రహ్మ శిరం. కుడి భాగము సద్గురు స్వరూపము, ఎడమభాగము పరబ్రహ్మస్వరూపము మధ్యభాగాన గురుమూర్తిగా అజ్ఞానమును తొలగించి శ్రీదత్తుడు లోకముల రక్షణ చేయును. మూడు ముఖములతో, ఆరు భుజములతో నాల్గు కుక్కలతో, ఆవుతో కనిపిస్తాడు. నాల్గు కుక్కలు నాల్గు వేదములు, ఆవు మనస్సే మాయాశక్తి, మూడు ముఖములు త్రిమూర్తులు. సృష్టి, స్థితి, లయములు. త్రిశూలము ఆచారము, చక్రము అవిద్యా నాశకము, శంఖము నాదము సమస్త నిధి, డమరు సర్వవేదములు దీని నుంచి పాదుర్భవించినవి. కమండలము సకల బాధలను దూరం చేసి శుభాలను చేకూర్చుటకు ప్రతీక.🙏🌼🌿*


*🌿🌼🙏. సంసార బంధములను తెంచుకొని తమ భక్తులను తనే ఎంచుకుని పరమ పదం వైపుకు నడిపించిన గురుదేవులు దత్తాత్రేయులవారు పుట్టిన రోజు మార్గశీర్షమాసంలో పూర్ణిమనాడు వస్తుంది. మృగశిరా నక్షత్రం వృషభరాశికి చెందినది. పౌర్ణమి అనేది చంద్రునికి సంబంధించిన అన్ని కళలతో నిండిన తిథి. వృషభరాశి చంద్రునికి స్వస్థానం కాబట్టి సంపూర్ణమైన చంద్రుని శక్తి ఉండే రోజు మార్గశీర్ష పూర్ణిమ నాడు దత్తాత్రేయ జయంతి జరుపుకుంటున్నారు. పౌర్ణమినాడు దత్తుని పాలతో అభిషేకించి మనస్సులోని కోరికలను ఆయనకు తెలియజేస్తే విజయమును చేకూర్చుతాడు. శ్రీ దత్తావారిని తలచి ఆయురారోగ్యములను, స్మరించి భోగభాగ్యములను పొంది, శ్రీదత్తుని విషయమై ఏదైనా మనము అనుకున్నచో, అనుకున్న రోజు దగ్గర నుండే ఒక చక్కని మార్పు కలుగుట జరుగుతుంది. కనుక అట్టి దత్తుని జయంతి రోజు ఆరాధించి ధన్యులమవుదాం!🙏🌼🌿*


*🙏🌼🌿. ఘోరమైన కష్టాలను తొలగించే మహా మహిమాన్వితమైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఘోర కష్టోద్ధారణ స్త్రోత్రం.


*🌿🌼🙏. ఈ పంచ శ్లోకాలను భక్తితో చదివిన వారికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వలన ఎంతటి కష్టాలు, బాధలు ఉన్నా, అవన్నీ పూర్తిగా తొలగిపోయి, సుఖ సంతోషాలు చేకూరుతాయి. పరిపూర్ణ భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో పఠించండి.🙏🌼🌿*


*🌿🌼🙏1.శ్రీ పాద శ్రీ వల్లభ త్వం సదైవ శ్రీ దత్తా స్మాన్ పాహి దేవాధిదేవ|,*

*భవగ్రహ క్లేశ హరిన్ సుకీర్తే ఘోరకష్టాదుద్ధారాస్మాన్ నమస్తే .🙏🌼🌿*


*🌿🌼🙏2.త్వం నో మాతా త్వం నో పితాప్తో ధి పస్త్వం త్రాతాయోగ క్షేమకృత్ సద్గురు స్త్వమ్*

*త్వం సర్వస్వం నో ప్రభో విశ్వమూర్తే ఘోరకష్టాదుద్ధారాస్మాన్ నమస్తే .🙏🌼🌿*


*🌿🌼🙏3.పాపం తాపం వ్యాధిదీం చ దైన్యమ్ భీతిం క్లేశం త్వం హ రాశు త్వ దైన్యమ్|*

*త్రాతారం నో వీక్ష ఇషాస్త జూర్తే ఘోరకష్టాదుద్ధారాస్మాన్ నమస్తే .🙏🌼🌿*


*🌿🌼🙏4.నాన్య స్త్రాతా న పీడాన్ న భర్తా త్వత్తో దేవ త్వం శరణ్యో శోకహర్తా|*

*కుర్వత్రేయ అనుగ్రహం పూర్ణరతే ఘోరకష్టాదుద్ధారాస్మాన్ నమస్తే .🙏🌼🌿*


*🌿🌼🙏5.ధర్మే ప్రీతీం సన్మతం దేవభక్తిమ్ సత్స్ జ్ఞప్తి దేహి భుక్తిమ్ చ ముక్తిం |*

*భవ శక్తీమ్ చ అఖిలానంద మూర్తే ఘోరకష్టాదుద్ధారాస్మాన్ నమస్తే .🙏🌼🌿*


*🌿🌼🙏. శలోక పంచక మతద్యో లోక మంగళ |వర్ధనం ప్రపటేన్యతో భక్త్యా స శ్రీ దత్తాత్రేయ ప్రియో భవేత్ 🙏🌼🌿*


*🌿🌼🙏దగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా🙏*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. కపిల గీత - 101 / Kapila Gita - 101🌹*

*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*

*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 57 🌴*


*57. రేతస్తస్మాదాప ఆసన్నిరభిద్యత వై గుదమ్|*

*గుదాదపానోఽపానాచ్చ మృత్యుర్లోకభయంకరః॥*


*దాని నుండి వీర్యము, లింగము అభిమాన దేవతయైన జలము ఏర్పడెను. పిమ్మట గుదము ప్రకటమయ్యెను. దాని నుండి అపానవాయువు యొక్క అభిమాన దేవతయైన లోక భయంకరమగు మృత్యుదేవత ఏర్పడెను.*


*సశేషం..*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Kapila Gita - 101 🌹*

*🍀 Conversation of Kapila and Devahuti 🍀*

*📚 Prasad Bharadwaj*


*🌴 2. Fundamental Principles of Material Nature - 57 🌴*


*57. retas tasmād āpa āsan nirabhidyata vai gudam*

*gudād apāno 'pānāc ca mṛtyur loka-bhayaṅkaraḥ*


*After this, semen (the faculty of procreation) and the god who presides over the waters appeared. Next appeared an anus and then the organs of defecation and thereupon the god of death, who is feared throughout the universe.*


*It is understood herewith that the faculty to discharge semen is the cause of death. Therefore, yogīs and transcendentalists who want to live for greater spans of life voluntarily restrain themselves from discharging semen. The more one can restrain the discharge of semen, the more one can be aloof from the problem of death. There are many yogīs living up to three hundred or seven hundred years by this process, and in the Bhāgavatam it is clearly stated that discharging semen is the cause of horrible death. The more one is addicted to sexual enjoyment, the more susceptible he is to a quick death.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 693 / Vishnu Sahasranama Contemplation - 693🌹*


*🌻693. వసుప్రదః, वसुप्रदः, Vasupradaḥ🌻*


*ఓం వసుప్రదాయ నమః | ॐ वसुप्रदाय नमः | OM Vasupradāya namaḥ*


*వసుం ధనం ప్రకర్షేణ దదాతీతి వసుప్రదః ।*

*సాక్షాద్ ధనాధ్యక్ష ఏష తత్ప్రసాదాత్ తథేతరః ॥*

*ధనాధ్యక్ష ఇతి వసుప్రద ఇత్యుచ్యతే హరిః ॥*


*వసువు అనగా ధనమును మిక్కిలిగా ఇచ్చువాడు గనుక వసుప్రదః. కుబేరుడు ఆ పరమాత్ముని అనుగ్రహమున ధనాధ్యక్షుడు అనిపించుకొనువాడయ్యెను. పరమాత్ముడు సాక్షాత్తుగా ధనాధ్యక్షుడు.*


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 693🌹*


*🌻693. Vasupradaḥ🌻*


*OM Vasupradāya namaḥ*


वसुं धनं प्रकर्षेण ददातीति वसुप्रदः ।

साक्षाद् धनाध्यक्ष एष तत्प्रसादात् तथेतरः ॥

धनाध्यक्ष इति वसुप्रद इत्युच्यते हरिः ॥


*Vasuṃ dhanaṃ prakarṣeṇa dadātīti vasupradaḥ,*

*Sākṣād dhanādhyakṣa eṣa tatprasādāt tathetaraḥ.*

*Dhanādhyakṣa iti vasuprada ityucyate hariḥ.*


*Vasu is dhanam or wealth. Since He bestows it abundantly, He is called Vasupradaḥ. He is the lord of wealth in His own right. The other (Kubera) is lord of wealth only by His grace.*


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः ।

वसुप्रदो वासुदेवो वसुर्वसुमना हविः ॥ ७४ ॥

మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః ।

వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః ॥ 74 ॥

Manojavastīrthakaro vasuretā vasupradaḥ,

Vasuprado vāsudevo vasurvasumanā haviḥ ॥ 74 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 140 / Agni Maha Purana - 140 🌹*

*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*

*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 43*


*🌻. ఆలయ ప్రాసాద దేవతాస్థాపన శాంత్యాది వర్ణనము - 3🌻*


ప్రతిమలను నిర్మించుటకై అడవిలోనికి వెళ్లి వనయాగము ప్రారంభిపవలెను. అచట ఒక కుండము త్రవ్వి, దానిని అలికి, మండపముపై విష్ణుమూర్తిని పూజింపవలెను. విష్ణువునకు బలి సమర్పించి ప్రతిమా నిర్మాణకర్మ యందు ప్రయోగించు టంకము మొదలగు శస్త్రములను పూజించవలెను. హోమము చేసిన పిమ్మ బియ్యపు నీళ్ళతో అస్త్ర మంత్రమును (అస్త్రాయఫట్‌) ఉచ్చరించుచు ఆ శిలను తడుపవలెను. న


రసింహ మంత్రముతో దానికి రక్షచేసి మూలమంత్రముతో (ఓం నమోనారాయణాయ) పూజచేయవలెను. పూర్ణాహుతి హోమము చేసిన పిమ్మట ఆచార్యుడు భూతములకు బలి సమర్పింపవలెను. అచట కనబడకుండ నివసించు జంతువులు, రాక్షసులు, యక్షులు సిద్ధులు మొదలగు వారికందరకు పూజలు చేసి ''కేశవుని ఆజ్ఞచే మేము ప్రతిమల కొరకై ఈయాత్రపై వచ్చితిమి. శ్రీమహావిష్ణుని కార్యము మీ కార్యముకూడ అగును అందుచే మేమిచ్చిన ఈ బలిచే తృప్తులై మీరు వెంటనే ఈ స్థానమును విడచి, కుశల పూర్వకముగ మరొక చోటికి వెళ్ళుడు'' అని చెప్పుచు క్షమా ప్రార్థన చేయవలెను.


ఈ విధముగ ప్రార్థింపబడిన వారందరును ప్రసన్నులై సుఖముగ ఆ స్థానమును విడిచి మరొక ప్రదేశమునకు వెళ్ళి పోవుదారు. పిమ్మట శిల్పులతో కలసి యజ్ఞ చరువును భక్షించి రాత్రి నిద్రించు సమయమున స్వప్న మంత్రమును ఈ విధముగ జపించవలెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Agni Maha Purana - 140 🌹*

*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *


*Chapter 43*

*🌻 Installation of deities in the temples - 3 🌻*


16. One should go to the forest and perform the forest rites for the sake of an image. After having bathed and plastering a shed Hari should be worshipped there.


17. After having made the offering of the victim, the (stonecutter’s) chisel used for the work should be worshipped. Having offered homa (pouring of clarified butter into the fire), water mixed with rice should be sprinkled over the image with the implement (chisel).


18. Having made the protective spell it should be worshipped with basic sacred syllable of lord Nṛsiṃha. After having made the offering to fire the final oblation should be made. Then offerings to the goblins should be given by the preceptor.


19. Having worshipped the good (spirits), the demons, guhyakas (a class of attendant-gods of Kubera), and accomplished souls and others who may be residing there, should be requested to forgive.


20. (They should be addressed as follows). “This journey (has been undertaken) by us for the image of Viṣṇu by the command of Keśava. Any work done for the sake of Viṣṇu, should also be your (concern).”


21. “Being always pleased with this offering (you) repair quickly to some other place quitting this place for good”.


22. Being informed thus (these beings) go to another place in good cheer and satisfied. Having eaten the sacrificial porridge along with the sculptors, he should repeat in the night the following sacred syllables (inducing) sleep.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 275 / Osho Daily Meditations - 275 🌹*

*📚. ప్రసాద్ భరద్వాజ*


*🍀 275. అబద్ధం మరియు నిజం 🍀*


*🕉. మొదటిసారి మనసు ధ్యానమయం అయినప్పుడు ప్రేమ బంధంలా కనిపిస్తుంది. ఒక విధంగా ఇది నిజం, ఎందుకంటే ధ్యానం లేని మనస్సు నిజంగా ప్రేమలో ఉండదు. ఆ ప్రేమ అబద్ధం, భ్రాంతికరమైనది, అది ప్రేమ కాదు, వ్యామోహం. 🕉*


*అసలైనది జరగనంత వరకు మీరు తప్పుడు ప్రేమను పోల్చడానికి ఏమీ లేదు, కాబట్టి ధ్యానం ప్రారంభ మైనప్పుడు, భ్రాంతికరమైన ప్రేమ చెదిరిపోతుంది, అదృశ్యం అవుతుంది. నిరుత్సాహ పడకండి మరియు నిరాశను శాశ్వత వైఖరిగా మార్చవద్దు. ఎవరైనా సృష్టికర్త ధ్యానం చేస్తే, అతని సృజనాత్మకత ప్రస్తుతానికి అదృశ్యమవుతుంది. మీరు చిత్రకారుడు అయితే, అకస్మాత్తుగా మీరు అందులో మిమ్మల్ని కనుగొనలేరు. మీరు కొనసాగవచ్చు, కానీ మీకు శక్తి మరియు ఉత్సాహం ఉండదు. కవి అయితే కవిత్వం ఆగిపోతుంది. మీరు ప్రేమలో ఉన్నట్లయితే, ఆ శక్తి కేవలం అదృశ్యం అవుతుంది. మీరు ఒక సంబంధంలోకి వెళ్లడానికి మిమ్మల్ని బలవంతం చేయడానికి ప్రయత్నిస్తే, మీ పాత వ్యక్తిగా ఉండాలంటే, ఆ అమలు చాలా ప్రమాదకరం.*


*అప్పుడు మీరు విరుద్ధమైన పని చేస్తున్నారు: ఒక వైపు మీరు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు, మరోవైపు మీరు బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు కారు నడుపుతూ, యాక్సిలరేటర్‌ని నొక్కుతూ, అదే సమయంలో బ్రేక్‌ను నొక్కినట్లుగా ఉంటుంది. ఇది విపత్తు కావచ్చు, ఎందుకంటే మీరు ఒకే సమయంలో రెండు వ్యతిరేక పనులు చేస్తున్నారు. ధ్యానం తప్పుడు ప్రేమకు మాత్రమే వ్యతిరేకం. తప్పు అదృశ్యమవుతుంది మరియు నిజమైనది కనిపించడానికి ఇది ప్రాథమిక పరిస్థితి. తప్పు పోవాలి, తప్పు నిన్ను పూర్తిగా ఖాళీ చేయాలి; అప్పుడు మాత్రమే మీరు సత్యమైన దాని కోసం అందుబాటులో ఉంటారు. చాలా మంది ప్రేమ ధ్యానానికి వ్యతిరేకమని, ధ్యానం ప్రేమకు వ్యతిరేకమని అనుకుంటారు. అది నిజం కాదు. ధ్యానం తప్పుడు ప్రేమకు వ్యతిరేకం, కానీ అది నిజమైన పూర్తి ప్రేమని కనుగొనడం కోసమే.*

*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹



*🌹 Osho Daily Meditations - 275 🌹*

*📚. Prasad Bharadwaj*


*🍀 275. THE FALSE AND THE TRUE 🍀*


*🕉.The first time that mind becomes meditative, love seems like a bondage. And in a way it is true, because a mind that is not meditative cannot really be in love. That love is false, illusory, more an infatuation than love. 🕉*


*You have nothing to compare false love to unless the real happens, so when meditation starts, the illusory love by and by dissipates, disappears. Don't be disheartened, and don't make disappointment a permanent attitude. If somebody is a creator and meditates, all creativity will disappear for the time being. If you are a painter, suddenly you will not find yourself in it. You can continue, but by and by you will have no energy and no enthusiasm. If you are a poet, poetry will stop. If you have been in love, that energy will simply disappear. If you try to force yourself to move into a relationship, to be your old self, that enforcement will be very dangerous.*


*Then you are doing a contradictory thing: On one hand you are trying to go in, on the other you are trying to go out. It is as if you are driving a car, pressing the accelerator and at the same time pressing the brake. It can be a disaster, because you are doing two opposite things at the same time. Meditation is only against false love. The false will disappear, and that's a basic condition for the real to appear. The false must go, the false must vacate you completely; only then are you available for the real. Many people think that love is against meditation, and meditation is against love-that's not true. Meditation is against false love, but is totally for true love.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 418 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 418 -1 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*


*🍀 90. చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।*

*గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥ 🍀*


*🌻 418. 'జడశక్తిః' - 1🌻*


*జడమును సృష్టించునటు వంటి శక్తి శ్రీమాత. జడశక్తి మూలమున ఉపాధుల నేర్పరచుచు అందు జీవులను వసింప చేయుట సృష్టి యందొక మహత్తర కార్యము. నివాసముల నేర్పరచి జీవులను ప్రవేశపెట్టవలెను. గృహములను కట్టి అందు వసించుటకు మానవులు కృషి సలుపుదురు కదా! జీవుడుండుటకు ఉపాధి వలయును. నీరు వలయునన్నచో పాత్ర కావలయును. కప్పులేనిదే కాఫీ, టీలు త్రాగలేరు. కనీసము దోసిలి లేనిదే నీరు త్రాగలేము కదా! త్రాగుటకు నోరు, గొంతు కూడ వుండవలెను. జీవులకు దేహమే ఉపాధి. జీవులకు దేహములే ఉపాధి. దేహములే లేనిచో జీవునికి అనుభవము, అనుభూతి, ఆనందము వుండుట కవకాశము లేదు.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 418 - 1 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj*


*🌻 90. Chichakti shchetanarupa jadashakti jadatmika*

*Gayatri vyahruti sandhya dvijabrunda nishemita ॥ 90 ॥🌻*


*🌻 418. 'Jadashaktih' - 1🌻*


*Srimata is the power that creates inertia. It is a great work of creation to create and subsist the creatures on the basis of inertial force. The habitats should be carefully designed and the creatures should be introduced into them. Humans work hard to build houses and live in them. A vessel is necessary for the spirit similar to a vessel required for water. One can't drink coffee or tea without a cup. Atleast you need to cup your hands for drinking water! There should also be mouth and throat for drinking. The body is the vessel for spirit. Without bodies there is no scope for the living being to experience, feel and enjoy.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



Join and Share

Comments


Post: Blog2 Post
bottom of page