🌹🍀 08 - OCTOBER - 2022 FRIDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🍀🌹
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 08, శనివారం, అక్టోబరు 2022 స్థిర వాసరే SATURDAY 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 267 / Bhagavad-Gita -267 - 6వ అధ్యాయము 34 ధ్యాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 666 / Vishnu Sahasranama Contemplation - 666 🌹
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 628 / Sri Siva Maha Purana - 628 🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 345 / DAILY WISDOM - 345 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 244 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹08, October అక్టోబరు 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*
*🍀. శ్రీ శని అష్టోత్తరశతనామ స్తోత్రం - 9 🍀*
*17. ఖేచరాయ ఖగేశాయ ఘననీలాంబరాయ చ*
*కాఠిన్యమానసాయాఽర్యగణస్తుత్యాయ తే నమః*
*18. నీలచ్ఛత్రాయ నిత్యాయ నిర్గుణాయ గుణాత్మనే*
*నిరామయాయ నింద్యాయ వందనీయాయ తే నమః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : భావన జగన్నిర్మాణం చేస్తుంది. మనస్సే యథార్థం. దృశ్యమంతా స్వప్నమే. ఒక భావనను దృఢంగా మనం ధారణ చేసినప్పుడు. దానికి విరుద్ధమైనదంతా క్రమంగా కరిగిపోతుంది. అది అంతా ఏమైపోయిందా అనీ, ఒకప్పుడది మనలను ఎలా భ్రమ పెట్టిందా అనీ మనం అచ్చెరు వొందుతాము. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, శరద్ ఋతువు,
దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం
తిథి: శుక్ల చతుర్దశి 27:43:34 వరకు
తదుపరి పూర్ణిమ
నక్షత్రం: పూర్వాభద్రపద 17:09:49
వరకు తదుపరి ఉత్తరాభద్రపద
యోగం: వృధ్ధి 20:53:05 వరకు
తదుపరి ధృవ
కరణం: గార 16:34:16 వరకు
వర్జ్యం: 00:23:20 - 01:54:40
మరియు 26:25:12 - 27:58:04
దుర్ముహూర్తం:
07:42:25 - 08:29:54
రాహు కాలం: 09:05:30 - 10:34:31
గుళిక కాలం: 06:07:28 - 07:36:29
యమ గండం: 13:32:33 - 15:01:34
అభిజిత్ ముహూర్తం: 11:40 - 12:26
అమృత కాలం: 09:31:20 - 11:02:40
సూర్యోదయం: 06:07:28
సూర్యాస్తమయం: 17:59:36
చంద్రోదయం: 17:10:43
చంద్రాస్తమయం: 04:29:52
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: కుంభం
కాలదండ యోగం - మృత్యు భయం
17:09:49 వరకు తదుపరి ధూమ్ర
యోగం - కార్య భంగం, సొమ్ము నష్టం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 267 / Bhagavad-Gita - 267 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 34 🌴*
*34. చంచలం హి మన: కృష్ణ ప్రమాథి బలవద్దృఢమ్ |*
*తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్*
🌷. తాత్పర్యం :
*ఓ కృష్ణా! మనస్సు చంచలమును, కల్లోలపూర్ణమును, దృఢమును, మిగుల బలవత్తరమును అయి యున్నది. దీనిని నిగ్రహించుట వాయువును నిగ్రహించుట కన్నాను కష్టతరమని నేను భావించుచున్నాను.*
🌷. భాష్యము :
మనస్సు మిగుల బలవత్తరము, దృఢమును అయియున్నది. తత్కారణమున అది వాస్తవమునకు బుద్ధికి విధీయమై యుండవలసినను కొన్నిమార్లు దానిని అతిక్రమించుచుండును.
జగము నందు అనేకములైన అవరోధములతో సంఘర్షణ పడు మనుజుని అట్టి మనస్సును నిగ్రహించుట అత్యంత కష్టమైన కార్యము. కృత్రిమముగా ఎవరైనను శత్రుమిత్రుల యెడ సమానవైఖరిని కనబరచిన కనబరచవచ్చును.
కాని లౌకికుడును మాత్రము ఆ విధముగా చేయలేడు. మనస్సును నిగ్రహించుట తీవ్రగాలిని నియమించుట కన్నను అతికష్టమైన కార్యమగుటయే అందులకు కారణము. కతోపనిషత్తు (1.3.3-4) నందు ఈ విషయమును గూర్చి ఇట్లు చెప్పబడినది.
ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ చ |
బుద్ధిం తు సారథిం విద్ధి మన: ప్రగ్రహమేవ చ
ఇంద్రియాణి హయా నాహు: విషయాం స్తేషు గోచరాన్ |
ఆత్మేన్ద్రియమనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణ: ||
“దేహమును రథములో జీవుడు ప్రయాణికుడు కాగా, బుద్ధి రథచోదకుడై యున్నాడు. మనస్సు రథమును నడుపు సాధనము కాగా ఇంద్రియముల అశ్వములై యున్నవి. ఈ విధముగా జీవుడు మనస్సు మరియు ఇంద్రియముల సంగత్వమున భోక్త యగుచున్నాడని మునులచే అవగాహన చేసికొనబడినది.”
వాస్తవమునకు బుద్ధి యనునది మనస్సునకు నిర్దేశము నొసగవలెను. కాని బలవత్తరము, దృఢమును అగు మనస్సు అంటువ్యాధి ఔషధశక్తిని సైతము అతిక్రమించునట్లు, మనుజుని బుద్ధిని సైతము కొన్నిమార్లు అతిక్రమించుచుండును.
అట్టి బలమైన మనస్సును యోగపద్ధతిచే నియమింపవలసియున్నది. అయినను అర్జునుని వంటి వానికి కూడా ఈ యోగాభ్యాసము ఆచరణీమైనదిగా లేదు. అట్టి యెడ నేటి సాధారణమానవుని గూర్చి ఇక చెప్పవలసినది ఏమున్నది?
ఈ శ్లోకమునందు తెలుపబడిన వాయువు ఉదాహరణము అత్యంత సమంజసముగా నున్నది. ఏలయన ఎవ్వరును వాయువును బంధించలేరు. కాని దాని కన్నను కల్లోలపూర్ణమగు మనస్సును నిరోధించుట ఇంకను కష్టతరమై యున్నది.
అటువంటి మనస్సును నిరోధించుటకు శ్రీచైతన్యమాహాప్రభువు ఉపదేశించిన భవతారకమైన హరే కృష్ణ మాహామంత్రమును నమ్రతతో కీర్తించుట అతిసులభమైన మార్గము. అనగా “స వై మన: కృష్ణపదారవిందయో:” అను విధానమే ఇచ్చట నిర్దేశింపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 267 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 6 - Dhyana Yoga - 34 🌴*
*34. cañcalaṁ hi manaḥ kṛṣṇa pramāthi balavad dṛḍham*
*tasyāhaṁ nigrahaṁ manye vāyor iva su-duṣkaram*
🌷 Translation :
*The mind is restless, turbulent, obstinate and very strong, O Kṛṣṇa, and to subdue it, I think, is more difficult than controlling the wind.*
🌹 Purport :
The mind is so strong and obstinate that it sometimes overcomes the intelligence, although the mind is supposed to be subservient to the intelligence.
For a man in the practical world who has to fight so many opposing elements, it is certainly very difficult to control the mind.
Artificially, one may establish a mental equilibrium toward both friend and enemy, but ultimately no worldly man can do so, for this is more difficult than controlling the raging wind. In the Vedic literature (Kaṭha Upaniṣad 1.3.3–4) it is said:
ātmānaṁ rathinaṁ viddhi śarīraṁ ratham eva ca
buddhiṁ tu sārathiṁ viddhi manaḥ pragraham eva ca
indriyāṇi hayān āhur viṣayāṁs teṣu gocarān
ātmendriya-mano-yuktaṁ bhoktety āhur manīṣiṇaḥ
“The individual is the passenger in the car of the material body, and intelligence is the driver.
Mind is the driving instrument, and the senses are the horses. The self is thus the enjoyer or sufferer in the association of the mind and senses. So it is understood by great thinkers.”
Intelligence is supposed to direct the mind, but the mind is so strong and obstinate that it often overcomes even one’s own intelligence, as an acute infection may surpass the efficacy of medicine.
Such a strong mind is supposed to be controlled by the practice of yoga, but such practice is never practical for a worldly person like Arjuna.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 666 / Vishnu Sahasranama Contemplation - 666🌹*
*🌻666. బ్రహ్మవిత్, ब्रह्मवित्, Brahmavit🌻*
*ఓం బ్రహ్మవిదే నమః | ॐ ब्रह्मविदे नमः | OM Brahmavide namaḥ*
*వేదం యధావత్ వేదార్థం వేత్తీతి బ్రహ్మ విద్ధరిః*
*బ్రహ్మను అనగా వేదమును, వేదార్థమును ఉన్నది ఉన్నట్లుగా ఎరిగి యుండు వాడు వేదవిత్.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 666🌹*
*🌻666. Brahmavit🌻*
*OM Brahmavide namaḥ*
*वेदं यधावत् वेदार्थं वेत्तीति ब्रह्म विद्धरिः / Vedaṃ yadhāvat vedārthaṃ vettīti brahma viddhariḥ*
*He who knows Brahma i.e., Vedas and Vedartha i.e., the true meaning of Vedas - correctly is Brahmavit.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ।ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः ॥ ७१ ॥
బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః ।బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ॥ 71 ॥
Brahmaṇyo brahmakrdbrahmā brahma brahmavivardhanaḥ,Brahmavidbrāhmaṇo brahmī brahmajño brāhmaṇapriyaḥ ॥ 71 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 628 / Sri Siva Maha Purana - 628 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 11 🌴*
*🌻. బాణ ప్రలంబవధ - 1 🌻*
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ మహర్షీ! ఇంతలో అచటకు క్రౌంచుడను పర్వతుడు బాణాసురునిచే పీడింపబడిన వాడై వచ్చి కుమారుని శరణు జొచ్చెను (1). యుద్ధములో ఈశ్వరుని తేజోరూపమగు కుమారుని ధాటికి తాళ##లేక అతడు తన పదివేల సైన్యముతో గూడి పారిపోవుచూ క్రౌంచపర్వతమును ఆయుధము యొక్క అగ్రభాగముతో నుగ్గు నుగ్గు చేసెను (2). ఆ క్రౌంచుడు కుమారుని పాదపద్మములకు భక్తితో ప్రణమిల్లి ప్రేమతో నిండిన వాక్కులతో గుహుని సాదరముగా నిట్లు స్తుతించెను (3).
క్రౌంచుడిట్లు పలికెను -
కుమారా! స్కందా! దేవదేవా! తారకాసురుని చంపినవాడా!బాణాసురునిచే పీడింపబడి శరణుపొందిన నన్ను రక్షించుము (4). గొప్ప సేన గల వాడా! నాథా! దయానిధీ! నీచే సంగరములో తన్నులు తిని పారిపోయిన బాణుడు నా వద్దకు వచ్చి నన్ను పీడించినాడు (5). ఓ దేవదేవా! రెల్లు గడ్డి యందు పుట్టిన వాడా! వానిచే పీడింపబడి మిక్కిలి దుఃఖితుడనైన నేను పారిపోయి నిన్ను శరణు జొచ్చితిని. దయను చూపుము (6). ఓ ప్రభూ! ఆ బాణాసురుని సంహరించి నాకు సుఖమును కలిగించుము. నీవు దైత్యులను సంహరించి దేవతలను రక్షించే విశిష్ట ప్రభుడవు (7).
బ్రహ్మ ఇట్లు పలికెను -
భక్తులను పాలించే స్కందుడు, ఇట్లు క్రౌంచుడు స్తుతించగా ప్రసన్నుడై, సాటిలేని తన శక్తిని చేతబట్టి మనస్సులో శివుని స్మరించెను (8). శంకరుని పుత్రుడగు ఆ కుమారుడు దానిని బాణాసురునిపైకి ప్రయోగించెను. అపుడు పెద్దశబ్దమాయెను. దిక్కులు, ఆకాశము మంటలతో నిండెను (9). ఓ మునీ! ఆ గొప్ప శక్తి క్షణకాలములో బలవంతుడగు ఆ రాక్షసుని మరియు అతని సేనను భస్మము చేసి గుహుని వద్దకు తిరిగి వచ్చెను (10). అపుడు కుమార ప్రభుడు పర్వతశ్రేష్ఠుడగు క్రౌంచునితో, 'నిర్భయముగా నీ ఇంటికి వెళ్లుము. ఆ రాక్షసుడు సైన్యముతో సహా నశించినాడు' అని చెప్పెను (11).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 628🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 11 🌴*
*🌻 The Victory of Kumāra and the death of Bāṇa and Pralamba - 1 🌻*
Brahmā said:—
1. O sage, in the meantime the mountain Krauñca, harassed by Bāṇa came there and sought refuge in Kumāra.
2. This Bāṇa had been fleeing from the previous battle, unable to bear the brilliance of the lord. He with the army of ten thousand persons, inflicted pain on Krauñca with the tip of his missiles.
3. The mountain Krauñca devoutly bowed at the lotuslike feet of Kumāra and eulogised him with reverence with words full of love.
Krauñca said:—
4. O Kumāra, O Skanda, O lord of gods, O slayer of the Asura Tāraka protect me who have sought refuge in you. I am harassed by the Asura Bāṇa.
5. O Mahāsena, O lord, O merciful one, routed and uprooted from the battle with you he came and harassed me.
6. Afflicted by him I have run from him and sought refuge in you. O lord of gods, born amongst the reeds, be merciful.
7. O lord, please slay the Asura Bāṇa. Make me happy. You are the slayer of Asuras and a special saviour of the gods. You are a self-ruler.
Brahmā said:—
8. Skanda who was thus eulogised by Krauñca became delighted. He, the saviour of the devotees, took up his matchless spear and remembered Śiva.
9. The son of Śiva hurled the spear aiming at Bāṇa. It gave loud report, blazing forth the quarters and the sky.
10. O sage, reducing the Asuras to ashes along with his army in a trice, the great spear returned to Kumāra.
11. The lord Kumāra told Krauñca, the chief of the mountains, “Go home fearlessly. That Asura has been slain along with his army.”
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 345 / DAILY WISDOM - 345 🌹*
*🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀*
*📝. ప్రసాద్ భరద్వాజ్*
*🌻10. జీవిత పరమార్థం మోక్షాన్ని సాధించడమే🌻*
*అంతిమంగా, జీవితం యొక్క అత్యున్నత లక్ష్యం ఏదైనా కోరిక నెరవేరడం కాదు. మోక్షం సాధించడం. ఈ విశ్వం యొక్క పరిణామ ప్రక్రియ అనేది తనలో ఉన్న ప్రతి అణువు స్వీయ-సాక్షాత్కారం వైపు కదలడం. అది ఒక వ్యక్తి యొక్క ఎదుగుదల మాత్రమే కాదు, విశ్వంలో ఉన్న ప్రతి విషయం ఏకరీతిగా ఎదుగుదల వైపు ప్రయాణించడం. ఇది విశ్వం యొక్క స్వీయ-సాక్షాత్కారం. విశ్వం మొత్తంగా దాని స్వంత ఉనికి గురించి తెలుసుకోవడం కోసం ప్రయాణిస్తుంది.*
*విశ్వం తన సమగ్రతను అన్నింటినీ కలుపుకొని స్వీయ-అవగాహనలో తిరిగి తనను తాను పొందడానికి ప్రయత్నిస్తోంది. యంత్రం పని చేస్తున్నప్పుడు తనలో ఉన్న ప్రతి భాగం అది పని చేసే పనికి దోహద పడుతున్నట్లుగానే విశ్వం లోని ప్రతి భాగం తన స్వీయ సాక్షాత్కారం కోసం దోహద పడుతుంది. దానిలోని ప్రతి భాగం ఆ వైపుగానే కదులుతుంది. భగవంతుని ప్రాప్తి, పరమాత్మ యొక్క సాక్షాత్కారం, విశ్వంతో వ్యక్తి యొక్క ఐక్యత, ఇదే జీవిత లక్ష్యం. ఇదే మోక్షం. ఇది అన్ని జీవాల చివరి లక్ష్యం.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 345 🌹*
*🍀 📖 from The Philosophy of Religion 🍀*
*📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj*
*🌻10. The Supreme Aim of Life is the Attainment of Moksha🌻*
*Ultimately, the supreme aim of life is not the fulfilment of any desire, but the attainment of liberation, moksha. The evolutionary process of the cosmos is the movement of all phenomena towards Self-realisation, not of any given individual, but of all things uniformly. It is the Self-realisation of the universe. The universe is struggling to become aware of its own existence as a total whole.*
*The cosmos is endeavouring to regain its integrality in an all-inclusive Self-awareness. Towards this end, every part of it is moving, like the parts of a machine when it is operating. The goal of life is the attainment of God, the realisation of the Absolute, the unity of the individual with the cosmos. This is Moksha. This is the final aim of all life.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 244 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. నిశ్శబ్దమన్నది రసవాదం. ఒకసారి నువ్వు శబ్ద సరిహద్దుల్ని దాటి వెళ్ళితే నీ అస్తిత్వాన్ని చేరితే, నీ కేంద్రాన్ని చేరితే లక్ష్యాన్ని అందుకున్నట్లే. దానికో పేరు దేవుడు. దేవుడన్నది ఫిలాసఫీ కాదు. దేవుడు నిశ్శబ్ద సంగీతం లాంటివాడు. 🍀*
*నిశ్శబ్దం పట్ల స్పృహ లేకుంటే తన లోపలి సామ్రాజ్యాన్ని వ్యక్తి చూడలేడు. తనలోని ఐశ్వర్యాన్ని, సంపదను చూడలేడు. అతను బిచ్చగాడుగా మిగిలిపోతాడు. పక్కకు చూస్తే అతను చక్రవర్తి కావచ్చు. నిశ్శబ్దమన్నది రసవాదం. ఒకసారి నువ్వు శబ్ద సరిహద్దుల్ని దాటి వెళ్ళితే నీ అస్తిత్వాన్ని చేరితే, నీ కేంద్రాన్ని చేరితే లక్ష్యాన్ని అందుకున్నట్లే. దాన్ని ఎన్నో పేర్లతో పిలుస్తారు. దానికో పేరు దేవుడు. దేవుడన్నది ఫిలాసఫీ కాదు. దేవుడు సంగీతం లాంటివాడు. దేవుడు మత సిద్ధాంతం లాంటివాడు కాడు. దేవుడు కవిత్వం లాంటి వాడు. దేవుడు ఒక ప్రతిపాదన కాదు. దేవుడు నాట్యం లాంటివాడు.*
*ఈ కోణాల్లో దేవుణ్ణి చూడ్డం ఆరంభిస్తే నువ్వు సరయిన మార్గంలో వున్నట్లే. యింటి వేపు అడుగులు వేసినట్లే. బాహ్యమయిన సంగీతాన్ని, లోపలి సంగీతాన్ని కూడా అనుసరించు. ఎక్కడో ఏదో గుడికి వెళ్ళాల్సిన పన్లేదు. సంగీతం చాలు. అస్తిత్వ సంగీతాన్ని అనుభవానికి తెచ్చుకోవడం చాలు. వెదురుపొదల గుండా సాగే గాలి, లేదా ప్రవాహ శబ్దం. అపూర్వ నాట్యం చేసే ముద్ర సౌందర్య ధ్వని వీటిని మెల్లగా విను. ఎట్లాంటి ఆలోచన లేకుండా విను. అవి నీ అస్తిత్వపు మూలాల్లోకి ప్రవేశిస్తాయి. అప్పుడు నువ్వు ఏ బోధా నీకు యివ్వలేని దాన్ని చూసి ఆశ్చర్యపోతావు. వస్తు ప్రపంచం నీకు యివ్వలేని దాన్ని సంగీతమిస్తుంది.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Comments