🌹🍀 09 - DECEMBER - 2022 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🍀🌹
1) 🌹09 - DECEMBER డిసెంబరు - 2022 FRIDAY శుక్రవారం, బృగు వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 294 / Bhagavad-Gita -294 🌹 7వ అధ్యాయము, జ్ఞాన విజ్ఞాన యోగము -14వ శ్లోకము.
3) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 655 / Sri Siva Maha Purana - 655 🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 006 / DAILY WISDOM - 006 🌹 శాశ్వతత్వం పట్ల ప్రేమ - The Love for the Eternal
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 271 🌹
6) 🌹. శివ సూత్రములు - 08/ Siva Sutras - 08 🌹. 3. యోనివర్గః కాలశరీరం - 3 Yonivargaḥ kalāśarīram - 3
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹09, డిసెంబరు, December 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : అన్నపూర్ణ జయంతి, Annapurna Jayanti, Rohini Vrat🌻*
*🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -23 🍀*
*23. శ్రీపద్మనేత్రరమణీవరే నీరజాక్షి
*శ్రీపద్మనాభదయితే సురసేవ్యమానే ।*
*శ్రీపద్మయుగ్మధృతనీరజహస్తయుగ్మే*
*శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : నీ గమ్యం చాల దూరాన ఉన్నది కనుక, అడుగులు త్వరగా ముందుకు వెయ్యి. గమ్యస్థానంలో నీ ప్రభువు నీ కొరకు వేచి యున్నాడు గనుక అనవసరముగా ఎక్కడా తడయబోకు.🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, హేమంత ఋతువు,
దక్షిణాయణం, మార్గశిర మాసం
తిథి: కృష్ణ పాడ్యమి 11:35:39
వరకు తదుపరి కృష్ణ విదియ
నక్షత్రం: మృగశిర 15:00:44 వరకు
తదుపరి ఆర్ద్ర
యోగం: శుభ 27:43:59 వరకు
తదుపరి శుక్ల
కరణం: కౌలవ 11:35:39 వరకు
వర్జ్యం: 24:20:42 - 26:07:30
దుర్ముహూర్తం: 08:47:59 - 09:32:29
మరియు 12:30:27 - 13:14:56
రాహు కాలం: 10:44:47 - 12:08:12
గుళిక కాలం: 07:57:56 - 09:21:21
యమ గండం: 14:55:03 - 16:18:28
అభిజిత్ ముహూర్తం: 11:46 - 12:30
అమృత కాలం: 05:18:06 - 07:03:54
మరియు 30:34:30 - 32:21:18
సూర్యోదయం: 06:34:30
సూర్యాస్తమయం: 17:41:54
చంద్రోదయం: 18:38:05
చంద్రాస్తమయం: 07:28:01
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: జెమిని
యోగాలు : మానస యోగం - కార్య
లాభం 15:00:44 వరకు తదుపరి
పద్మ యోగం - ఐశ్వర్య ప్రాప్తి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 294 / Bhagavad-Gita - 294 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం - 14 🌴*
*14. దైవీహ్యేషా గుణమయాయి మమ మాయా దురత్యయా |*
*మామేవ యే ప్రపద్యన్తే మాయామేతాం తరన్తి తే ||*
🌷. తాత్పర్యం :
*త్రిగుణాత్మకమైన నా ఈ దైవీమాయ నిశ్చయముగా దాటశక్యము కానిది. కాని నన్ను శరణుజొచ్చినవారు దీనిని సులభముగా దాట గలుగులుగుదురు.*
🌷. భాష్యము :
దేవదేవుడైన శ్రీకృష్ణునకు అసంఖ్యాకములైన శక్తులు కలవు. అవన్నియును దివ్యమైనవి. జీవులు అతని శక్తిలో భాగములై కారణముగా దివ్యులైనను మయాశక్తి సంపర్కముచే వారి ఆదియైన ఉన్నతశక్తి కప్పబడియుండును. ஆఆ విధముగా మాయాశక్తిచే కప్పబడినప్పుడు ఎవ్వరును దాని ప్రభావము నుండి తప్పించుకొనలేరు.
పూర్వమే తెలుపబడినట్లు భౌతికములు, ఆధ్యాత్మికములు అగు ప్రకృతులు శ్రీకృష్ణభగవానుని నుండియే ఉత్పన్నమగుచున్నందున నిత్యములై యున్నవి. జీవులు భగవానుని నిత్యమైన ఉన్నతప్రకృతికి చెందినవారు.
కాని గౌణప్రకృతి సంపర్కము వలన (భౌతికపదార్థ సంపర్కము) వారి మోహము సైతము నిత్యమగుచున్నది. కనుకనే బద్ధజీవుడు “నిత్యబద్ధుడు” అని పిలువబడుచున్నాడు. ఏ సమయమున అతడు బద్ధుడైనాడన్న చరిత్రను కనుగొనుట ఎవ్వరికినీ సాధ్యము కాదు. కనుకనే భౌతికప్రకృతి గౌణశక్తియైనను ప్రకృతిబంధము నుండి జీవుని ముక్తి అత్యంత కఠినమై యున్నది. జీవుడు అతిక్రమింపలేనటువంటి భగవత్సంకల్పము చేతనే భౌతికప్రకృతియు నడుచుటయే అందులకు కారణము. భౌతికప్రకృతి గౌణమైనను శ్రీకృష్ణభగవానునితో సంబంధమును కలిగి అతని సంకల్పము చేతనే నడుచుచున్నందున భౌతికప్రకృతి విశ్వము యొక్క సృష్టి, లయములందు అద్భుతముగా పనిచేయుచుండును.
“మాయం తు ప్రకృతిం విద్యాన్ మాయినం తు మహేశ్వరమ్ (శ్వేతాశ్వతరోపనిషత్తు 4.10) – మాయ అసత్యము లేదా తాత్కాలికమైనను దాని వెనుక ఘన ఇంద్రజాలకుడైన దేవదేవుడు కలడు. అతడే మహేశ్వరుడు మరియు దివ్యనియామకుడు” అని వేదములు సైతము ఈ విషయమును నిర్ధారించుచున్నవి. “గుణము” అను దానికి వేరొక అర్థము త్రాడు. అనగా బద్ధజీవుడు మొహమనెడి త్రాళ్ళతో గట్టిగా బంధింపబడియున్నాడని అవగతము చేసికొనవలెను. చేతులు, కాళ్ళు బంధింపబడిన వ్యక్తి తనను తాను బంధముక్తుని గావించుకొనలేడు. బంధరహితుడైన వాడే అతనికి సహాయము చేయవలసి యుండును. బంధింపబడి యున్నవాడు బంధింపబడిన వానిచే సహాయము నొందలేడు గనుక రక్షించువాడు ముక్తుడై యుండవలెను. కనుక కేవలము శ్రీకృష్ణభగవానుడు లేదా అతని ప్రతినిధియైన ఆధ్యాత్మికగురువు మాత్రమే బద్ధజీవునికి బంధము నుండి ముక్తిని గూర్చవలదు. అట్టి ఉన్నతమైన సహాయము లేనిదే ఎవ్వరును ప్రకృతిబంధము నుండి విడివడలేరు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 294 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 7 - Jnana Yoga - 14 🌴*
*14. daivī hy eṣā guṇa-mayī mama māyā duratyayā*
*mām eva ye prapadyante māyām etāṁ taranti te*
🌷 Translation :
*This divine energy of Mine, consisting of the three modes of material nature, is difficult to overcome. But those who have surrendered unto Me can easily cross beyond it.*
🌹 Purport :
The Supreme Personality of Godhead has innumerable energies, and all these energies are divine. Although the living entities are part of His energies and are therefore divine, due to contact with material energy their original superior power is covered. Being thus covered by material energy, one cannot possibly overcome its influence. As previously stated, both the material and spiritual natures, being emanations from the Supreme Personality of Godhead, are eternal. The living entities belong to the eternal superior nature of the Lord, but due to contamination by the inferior nature, matter, their illusion is also eternal.
The conditioned soul is therefore called nitya-baddha, or eternally conditioned. No one can trace out the history of his becoming conditioned at a certain date in material history. Consequently, his release from the clutches of material nature is very difficult, even though that material nature is an inferior energy, because material energy is ultimately conducted by the supreme will, which the living entity cannot overcome. Inferior, material nature is defined herein as divine nature due to its divine connection and movement by the divine will.
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 655 / Sri Siva Maha Purana - 655 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 16 🌴*
*🌻. గణేశ శిరశ్ఛేదము - 3 🌻*
విష్ణువు తనకు ప్రభువు, భక్తవత్సలుడు, మహేశ్వరుడు అగు శివుని స్మరించి చాల కష్టపడి ప్రయత్నించి ఆ పరిఘ యొక్క మార్గము నుండి తప్పించు కొనెను (16). శంకరుడుర విష్ణువు యొక్క ముఖమును చూచి కోపించి తన త్రిశూలమును చేత బట్టి యుద్దమును చేయుకోరికతో ఒకవైపునుండి ముందునకు వచ్చెను (17). మహేశ్వరుడగు శంభుడు శూలమును చేతబట్టి తనను సంహరించగోరి మీదకు వచ్చుచుండుటను మహాబలుడు, వీరుడు అగు పార్వతీ తనయుడు గాంచెను (18). శివుని శక్తిచే వర్థిల్లినవాడు, మహావీరుడు అగు ఆ గణేశుడు తల్లి పాదపద్మములను స్మరించి శక్తితో శివుని చూతిపై గొట్టెను (19).
మంచి లీలలను ప్రదర్శించే శివపరమాత్మ త్రిశూలము చేతి నుండి క్రిందపడుటకు గాంచి పినాక ధనస్సును తీసుకొనెను (20). గణేశుడు పరిఘతో దానిని కూడ నేలపై పడవేసెను. మరియు శివుని అయిదు చేతులను పరిఘతో కొట్టెను. అపుడు శివుడు ఇంకో అయిదు చేతులతో శూలము బట్టెను (21). లోకాచారము ననుసరించి శివుడు ఇట్లు పలికెను: అహో! ఈనాడు నాకు పెద్ద దుఃఖము సంప్రాప్తమైనది. ఇది నిశ్చయము. ఇపుడు గణముల గతియేమగును? (22) ఇంతలో శక్తి మాతలిచ్చిన బలముతో కూడియున్న వీరుడగు ఆ గణేశుడు పరిఘతో గణములను, దేవతలను మోదెను (23).
పరిఘచే పీడింపబడిన దేవతలు, గణములు పదిదిక్కులకు పరుగెత్తిరి. అద్భుతమగు ప్రహారమునిచ్చే ఆ గణేశుని ఎదుట యుద్దములో ఎవ్వరైననూ నిలువలేకపోయిరి (24). ఆ గణేశుని చూచి విష్ణువు ఇట్లనెను : ఈతడు ధన్యుడు, మహాబలుడు, మహావీరుడు, మహాశూరుడు. ఈతనికి యుద్దమునందు ప్రీతి మెండు (25). నేను దేవతలను దానవులను, రాక్షసులను, యక్షులను, గంధర్వులను, దితిపుత్రులను అనేక మందిని చూచితిని (26). తేజస్సు, రూపము, శౌర్యము, గణములు మొదలగు వాటిలో ఈ గణేశునితో సరిదూగ గలవారు ముల్లోకములలో ఒక్కరైననూ లేరు (27).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 655🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 16 🌴*
*🌻 The head of Gaṇeśa is chopped off during the battle - 3 🌻*
16. Viṣṇu strenuously dodged the same after remembering Śiva, the great lord, favourably disposed towards His devotees.
17. Seeing his face on a side, the infuriated Śiva took up his trident with a desire to fight and came there.
18. Pārvatī’s son of great strength and heroism, saw Śiva arrived there with desire to fight him to a finish, the great lord with the trident in his hand.
19. Gaṇeśa, the great hero, who had been rendered more powerful by Pārvatī and the Śaktis remembered the lotuslike feet of his mother and struck him in his hand with his Śakti.
20. Thereupon the trident fell from the hand of Śiva of supreme soul. Seeing this, Śiva the source of great enjoyment and protection took up his bow Pināka.
21. Gaṇeśa felled that to the ground by means of his iron club. Five of his hands too were struck. He took up the trident with the other five hands.
22. “Alas, this has been more distressing even to me. What may not happen to the Gaṇas? Śiva who followed the worldly conventions cried out like this.
23. In the meantime the heroic Gaṇeśa endowed with the surplus power bestowed by the Śaktis struck the gods and the Gaṇas with his iron club.
24. The gods and the Gaṇas smothered by that wonderful striker with the iron club went away to the ten directions. None of them remained in the battlefield.
25-27. On seeing Gaṇeśa, Viṣṇu said—“He is blessed. He is a great hero of great strength. He is valorous and fond of battle. Many gods, Danavas, Daityas, Yakṣas, Gandharvas, and Rakṣasas I have seen. In the entire extent of the three worlds, none of them can equal Gaṇeśa in regard to brilliance, form, features, valour and other qualities.”
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 06 / DAILY WISDOM - 06 🌹*
*🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 6. శాశ్వతత్వం పట్ల ప్రేమ 🌻*
*శాశ్వతత్వం పట్ల ప్రేమ అనేది అందరి హృదయాల్లో తీవ్రంగా ఉంటుంది. జీవులకు అది తెలియదు, అందువలన అవి బాధపడతాయి. ఈ ఒక్క వాస్తవికత నుండి మనం విముఖులైనపుడు, మనం స్వయం నిర్బంధానికి తలుపులు తెరుస్తాము. భూలోకంలో గాని, స్వర్గంలో గాని ఏ సాఫల్యమైనా, ప్రపంచానికి సంబంధించిన ఏ గొప్పతనమైనా, అంత విలువైనది కాదు.*
*జీవిత పట్ల ప్రేమ స్వయం పట్ల మనకున్న ప్రేమపై ఆధారపడి ఉంటుంది. అన్ని చర్యలు స్వయం కోసమే జరుగుతాయి, బాహ్య వ్యక్తులు మరియు వస్తువుల కోసం కాదు. “అందరినీ ప్రేమించడం అందరికీ ప్రియమైనది కాదు, కానీ స్వయం పట్ల ప్రేమ అందరికీ ప్రియమైనది. బృహదారణ్యకోపనిషత్తు II-4.5*
*అన్ని చర్యలు స్వయం కోసమే జరుగుతాయి, బాహ్య వ్యక్తులు మరియు వస్తువుల కోసం కాదు.*
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 06 🌹*
*🍀 📖 From The Realisation of the Absolute 🍀*
📝 Swami Krishnananda, 📚. Prasad Bharadwaj
*🌻 6. The Love for the Eternal 🌻*
*The love for the Eternal is the essential passion that burns in the heart of all things. Beings know it not, and so they suffer. When we turn our face away from this one Reality, we open the door to self-imprisonment. No achievement, either on earth or in heaven, no greatness pertaining to the world of name and form, is worth considering.*
*The love of life is based on the love of the Self. All actions are done for the sake of the Self, not for external persons and things. “Not, verily, for the love of the all is the all dear, but for the love of the Self is the all dear."— Brih. Up., II. 4. 5.*
*All actions are done for the sake of the Self, not for external persons and things.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 271 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. లోపలి పర్వతాల్ని అధిరోహించిన వాళ్ళు కొందరే. కానీ లోపలికి సాగే కొద్దీ వ్యక్తి మరింత చైతన్యంతో వుంటాడు. స్పృహతో వుంటాడు. కత్తి మీద సాము చేస్తాడు. గతాన్ని గురించి, భవిష్యత్తును గురించి ఆలోచించడు. అతనికీ క్షణం చాలు 🍀*
*ప్రమాదంలోని అద్భుతమయిన విషయమేమిటంటే అది నిన్ను చురుగ్గా వుంచుతుంది. చైతన్యంతో వుంచుతుంది. మెలకువతో వుంచుతుంది. కాబట్టి తెలియని శిఖరాన్ని అధిరోహించే వాళ్ళు చైతన్యంతో వుంటారు. వాళ్ళు దేనికోసం అన్వేషిస్తున్నారో వాళ్ళకు తెలీదు. ఉత్తర దక్షిణ ధృవాల్ని అన్వేషించిన వాళ్ళకి, చంద్రుడి దగ్గరకు వెళ్ళిన వాళ్ళకు వాళ్ళ అన్వేషణ ఎక్కడికి తీసుకు వెళుతుందో తెలీకుండా ప్రయాణించారు. ఎన్నో కష్టాల్ని ఎదుర్కొన్నారు. వాళ్ళు చైతన్యంతో మాత్రం వున్నారు. ధ్యాని స్పృహతో సాగుతాడు.*
*అతనిలో అనంత విశ్వముందని అతనికి తెలుసు. కానీ పర్వతారోహణ కన్నా, చంద్రయాణం కన్న ప్రమాదకరమైంది . లోపలి పర్వతాల్ని అధిరోహించిన వాళ్ళు కొందరే. కానీ లోపలికి సాగే కొద్దీ వ్యక్తి మరింత చైతన్యంతో వుంటాడు. స్పృహతో వుంటాడు. కత్తి మీద సాము చేస్తాడు. గతాన్ని గురించి, భవిష్యత్తును గురించి ఆలోచించడు. అతనికీ క్షణం చాలు. యిప్పుడు యిక్కడ వుంటాడు. అందువల్ల పడిపోవడమంటూ వుండదు. కానీ అక్కడ ప్రమాదముంది. ప్రమాదం వుండడం వల్లే అప్రమత్తత ఏర్పడుతుంది.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 08 / Siva Sutras - 08 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻3. యోనివర్గః కళాశరీరం - 3 🌻*
*🌴. ఏకమూలంగా ఉన్న బహువిధ రూపాలే విశ్వం యొక్క సంపూర్ణ దేహం.🌴*
*విశ్వం యొక్క భౌతిక ఉనికికి మాయ కూడా కారణమని గుర్తుంచుకోవాలి. ఇది కారణం మరియు ప్రభావం యొక్క సిద్ధాంతాన్ని ప్రతిబింబిస్తుంది. కర్మ మలం యొక్క ప్రభావం ఎక్కువగా జన్మతః అజ్ఞానం యొక్క స్థాయిపై ఆధారపడి ఉంటుంది. పుట్టుకతో వచ్చిన అజ్ఞానం యొక్క స్థాయి మళ్లీ ఒకరి కర్మ ఖాతాపై ఆధారపడి ఉంటుంది. ఆత్మ విముక్తి మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించు కున్నప్పుడు, ఒకరు చేసే తన ప్రతి పరివర్తన క్రమంగా విముక్తి మార్గంలో ముందుకు తీసుకు వెళుతుంది.*
*మాయ మలం పరిమితికి కారణం. సర్వవ్యాపి అయిన బ్రహ్మాన్ని గుర్తించకపోవడానికి పరిమితే కారణం. బ్రాహ్మం అపరిమితమైనప్పటికీ, మాయ మలం యొక్క ప్రభావం కారణంగా, ఒకరి చైతన్యం మాయచే బంధించబడి, బ్రాహ్మము పరిమితమైనదిగా కనిపిస్తుంది. వాస్తవం ఏమిటంటే కనిపించే ప్రతి రూపమూ బ్రహ్మ స్వరూపమే తప్ప మరొకటి కాదు. కానీ, మాయ ప్రభావం కారణంగా, బ్రహ్మం యొక్క స్వరూపాన్ని వివిధ ఆకారాలు మరియు రూపాలుగా వేరు చేయవలసి వస్తుంది. ఇదే మాయ మలము.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 08 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻3. Yonivargaḥ kalāśarīram - 3 🌻*
*🌴The multitude of similar origins is the body of parts of the whole.🌴*
*It is to be remembered that māyā is also responsible for materialistic existence of the universe, replicating the theory of cause and effect. The effect of Kārma mala largely depends upon the level of inborn ignorance. The level of inborn ignorance again depends upon one’s karmic account. When the soul decides to pursue the path of liberation, it moves forward to liberation gradually in its every transmigratory existence.*
*Māyīya mala is the cause for limitation. Limitation is the reason for not realising the Brahman who is omnipresent. Though the Brahman is limitless, due to the influence of māyīya mala, one’s consciousness is bound by māyā, making the Brahman appear as the limited One. The reality is that the every form that is seen is nothing but the form of the Brahman. But, due to the influence of māyā, one is compelled to differentiate the form of the Brahman as different shapes and forms. This is māyīya mala.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Comments