1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 09, జూన్ 2022 గురువారం, బృహస్పతి వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 214 / Bhagavad-Gita - 214 - 5- 10 కర్మ యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 613 / Vishnu Sahasranama Contemplation - 613 🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 292 / DAILY WISDOM - 292 🌹
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 192 🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 131 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. నిత్య పంచాగము - Daily Panchagam 09, June 2022, శుభ గురువారం, బృహస్పతి వాసరే 🌹 మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : మహేష నవమి, గంగా దసరా, Mahesh Navami, Ganga Dussehra🌻
🍀. దక్షిణామూర్తి స్తోత్రము - 8 🍀
విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతం శిష్యాచార్యతయా తయైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే
తాత్పర్యము: ఎవరి మాయ వలన ఈ ప్రపంచమున చేతన, స్వప్నావస్థల యందు అనేక రూపముల అనుభూతి కలుగుతున్నదో (గురువు, శిష్యుడు, తండ్రి కొడుకు మొదలగునవి), శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : మనోవాక్కాయ కర్మలను ఏకీకృతం చేయడమే రామ చేతనత్వము యొక్క రహస్యము. రాం శబ్ధమును మీ అణువణువులోకి దింపుకోండి. అప్పుడు మీరే హనుమంతుడు అయిపోతారు. - మాస్టర్ ఆర్.కె. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, జేష్ఠ మాసం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు తిథి: శుక్ల-నవమి 08:22:27 వరకు తదుపరి శుక్ల-దశమి నక్షత్రం: హస్త 28:27:01 వరకు తదుపరి చిత్ర యోగం: వ్యతీపాత 25:49:56 వరకు తదుపరి వరియాన కరణం: కౌలవ 08:19:27 వరకు వర్జ్యం: 12:53:36 - 14:29:20 దుర్ముహూర్తం: 10:03:53 - 10:56:27 మరియు 15:19:21 - 16:11:56 రాహు కాలం: 13:53:55 - 15:32:30 గుళిక కాలం: 08:58:09 - 10:36:44 యమ గండం: 05:40:59 - 07:19:34 అభిజిత్ ముహూర్తం: 11:49 - 12:41 అమృత కాలం: 22:28:00 - 24:03:44 సూర్యోదయం: 05:40:59 సూర్యాస్తమయం: 18:49:40 చంద్రోదయం: 13:46:00 చంద్రాస్తమయం: 01:25:42 సూర్య సంచార రాశి: వృషభం చంద్ర సంచార రాశి: కన్య రాక్షస యోగం - మిత్ర కలహం 28:27:01 వరకు తదుపరి చర యోగం - దుర్వార్త శ్రవణం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి. 🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. శ్రీమద్భగవద్గీత - 214 / Bhagavad-Gita - 214 🌹 ✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 10 🌴
10. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వా కరోతి య: | లిప్యతే న స పాపేన పద్మపత్రమివామ్భసా ||
🌷. తాత్పర్యం : ఫలముల నన్నింటిని భగవానునకు అర్పించి సంగత్వము లేకుండా తన ధర్మమును నిర్వహించువాడు తామరాకు నీటిచే అంటబడనట్లుగా పాపకర్మలచే ప్రభావితుడు కాడు.
🌷. భాష్యము : ఇచ్చట “బ్రాహ్మణి” యనగా “కృష్ణభక్తిరసభావనమునందు” అని అర్థము. “ప్రధానము” అని పిలువబడును భౌతికజగత్తు ప్రకృతి త్రిగుణముల సంపూర్ణ ప్రదర్శనమై యున్నది. “సర్వం హి ఏతత్ బ్రహ్మ”(మాండూక్యోపనిషత్తు 2), “తస్మాత్ ఏతత్ బ్రహ్మ నామరూపం అన్నం చ జాయతే” (ముండకోపనిషత్తు 1.2.10) అను వేదమంత్రములు మరియు “మమ యోనిర్ మహద్బ్రహ్మ” (భగవద్గీత 14.3) అను భగవద్గీతావాక్యము జగత్తు నందలి సర్వము బ్రహ్మస్వరూపమని తెలుపుచున్నది. అనగా జగమునందలి విషయములు తమకు కారణమైన బ్రహ్మము కన్నను భిన్నముగా ప్రదర్శితమగుచున్నను వాస్తవమునాకు బ్రహ్మమునకు అభిన్నములై యున్నవి.
ప్రతిదియు పరబ్రహ్మమైన శ్రీకృష్ణునికి సంబంధించినదే కావున అవియన్నియును అతనికే చెందియున్నవని ఈశోపనిషత్తు నందు తెలుపబడినది. సర్వము శ్రీకృష్ణునకే చెందినదనియు, శ్రీకృష్ణుడే సర్వమునకు యజమానియనియు, తత్కారణముగా సమస్తమును ఆ భగవానుని సేవయందే నియుక్తము కావించవలెననియు తెలిసినవాడు తన పుణ్యపాపకర్మల ఫలములతో సంబంధము లేకుండును. ఒక నిర్దుష్ట కార్యార్థమై భగావానునిచే ఒసగిబడియున్నందున భౌతికదేహమును సైతము కృష్ణభక్తిభావన యందు నియోగింపవలెను. అట్టి సమయమున నీటి యందున్నను తడి గాని తామరాకు వలె దేహము పాపకర్మఫలములకు అతీతమగును.
“మయి సర్వాణి కర్మాణి సన్న్యస్య – నీ కర్మలనన్నింటిని నాకు అర్పింపుము” అని శ్రీకృష్ణభగవానుడు తృతీయాధ్యాయమున(3.30) పలికి యుండెను. సారంశమేమనగా కృష్ణభక్తిభావనము లేనివాడు దేహేంద్రియభావనలో వర్తించగా, కృష్ణభక్తిపరాయణుడు దేహము కృష్ణుని సొత్తు గనుక దానిని అతని సేవ యందే నియోగించవలెనను జ్ఞానముతో వర్తించును. 🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 214 🌹 ✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada 📚 Prasad Bharadwaj
🌴 Chapter 5 - Karma Yoga - 10 🌴
10. brahmaṇy ādhāya karmāṇi saṅgaṁ tyaktvā karoti yaḥ lipyate na sa pāpena padma-patram ivāmbhasā
🌷 Translation : One who performs his duty without attachment, surrendering the results unto the Supreme Lord, is unaffected by sinful action, as the lotus leaf is untouched by water.
🌹 Purport : Here brahmaṇi means in Kṛṣṇa consciousness. The material world is a sum total manifestation of the three modes of material nature, technically called the pradhāna. The Vedic hymns sarvaṁ hy etad brahma (Māṇḍūkya Upaniṣad 2), tasmād etad brahma nāma rūpam annaṁ ca jāyate (Muṇḍaka Upaniṣad 1.1.9), and, in the Bhagavad-gītā (14.3), mama yonir mahad brahma indicate that everything in the material world is a manifestation of Brahman; and although the effects are differently manifested, they are nondifferent from the cause.
In the Īśopaniṣad it is said that everything is related to the Supreme Brahman, or Kṛṣṇa, and thus everything belongs to Him only. One who knows perfectly well that everything belongs to Kṛṣṇa, that He is the proprietor of everything and that, therefore, everything is engaged in the service of the Lord, naturally has nothing to do with the results of his activities, whether virtuous or sinful. Even one’s material body, being a gift of the Lord for carrying out a particular type of action, can be engaged in Kṛṣṇa consciousness.
It is then beyond contamination by sinful reactions, exactly as the lotus leaf, though remaining in the water, is not wet. The Lord also says in the Gītā (3.30), mayi sarvāṇi karmāṇi sannyasya: “Resign all works unto Me [Kṛṣṇa].” The conclusion is that a person without Kṛṣṇa consciousness acts according to the concept of the material body and senses, but a person in Kṛṣṇa consciousness acts according to the knowledge that the body is the property of Kṛṣṇa and should therefore be engaged in the service of Kṛṣṇa. 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 613 / Vishnu Sahasranama Contemplation - 613🌹 📚. ప్రసాద్ భరద్వాజ
🌻613. శ్రీమాన్, श्रीमान्, Śrīmān🌻
ఓం శ్రీమతే నమః | ॐ श्रीमते नमः | OM Śrīmate namaḥ
శ్రీమాన్, श्रीमान्, Śrīmān
శ్రియోఽస్య సన్తీతి శ్రీమానితి విష్ణుః సముచ్యతే
సకల విధములగు శ్రీలు ఈతనికి కలవు. సర్వ శుభలక్షణ సంపన్నుడు గనుక శ్రీమాన్.
:: శ్రీమద్రామాయణే యుద్ధకాణ్డే త్రయస్త్రింశః సర్గః :: దీర్ఘవృత్తభుజః శ్రీమాన్ మహోరస్కః ప్రతాపవాన్ । ధన్వీ సహననోపేతో ధర్మాత్మా భువి విశ్రుతః ॥ 11 ॥
శ్రీరాముడు పొడవైన, బలిష్ఠములైన బాహువులు గలవాడు. సర్వ శుభలక్షణ సంపన్నుడు. విశాలమైన వక్షఃస్థలము గలవాడు. ఆయన ప్రతాపమునకు తిరుగు లేదు. ధనుస్సూ దివ్యము అయినది. శరీరసౌష్ఠవము గలవాడు. భూమండలమున ధర్మాత్ముడిగా వాసిగాంచిన వాడు.
శ్రీమాన్, श्रीमान्, Śrīmān
శ్రీమాన్, श्रीमान्, Śrīmān
శ్రీమాన, श्रीमान, Śrīmān*
సశేషం… 🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 613🌹 📚. Prasad Bharadwaj
🌻613. Śrīmān🌻
OM Śrīmate namaḥ
श्रियोऽस्य सन्तीति श्रीमानिति विष्णुः समुच्यते / Śriyo’sya santīti śrīmāniti viṣṇuḥ samucyate
He has every kind of Śrī or every kind of illustrious opulence and hence He is Śrīmān.
:: श्रीमद्रामायणे युद्धकाण्डे त्रयस्त्रिंशः सर्गः :: दीर्घवृत्तभुजः श्रीमान् महोरस्कः प्रतापवान् । धन्वी सहननोपेतो धर्मात्मा भुवि विश्रुतः ॥ ११ ॥
Śrīmad Rāmāyaṇa - Book 6, Chapter 33 Dīrghavr̥ttabhujaḥ śrīmān mahoraskaḥ pratāpavān, Dhanvī sahananopeto dharmātmā bhuvi viśrutaḥ. 11 .
Rama, who is endowed with long and well rounded arms, an illustrious man, who is large-chested, a man of great energy, an archer well known in the world, a man endowed with muscularity, a righteous minded man, a is person of celebrity on earth.
శ్రీమాన్, श्रीमान्, Śrīmān
శ్రీమాన్, श्रीमान्, Śrīmān
శ్రీమాన, श्रीमान, Śrīmān
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka श्रीदश्श्रीशश्श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः ।श्रीधरः श्रीकरश्श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः ॥ ६५ ॥
శ్రీదశ్శ్రీశశ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ।శ్రీధరః శ్రీకరశ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ॥ 65 ॥
Śrīdaśśrīśaśśrīnivāsaḥ śrīnidhiḥ śrīvibhāvanaḥ,Śrīdharaḥ śrīkaraśśreyaḥ śrīmān lokatrayāśrayaḥ ॥ 65 ॥
Continues…. 🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 292 / DAILY WISDOM - 292 🌹 🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀 📝 .స్వామి కృష్ణానంద 📚. ప్రసాద్ భరద్వాజ
🌻 18. హృదయం లేనప్పుడు, ఆనందం ఉండదు 🌻
మనం ఎప్పుడూ సంతోషంగా ఉండము. మనకు ఏమి జరిగిందో మనం తెలుసుకోలేము. మనం తృప్తి చెందలేము - వ్యక్తులతో లేదా మన సాధనతో లేదా ఈ ప్రపంచంలో దేనితోనూ కాదు. ఈ అశాంతి, శాంతిరాహిత్యం మరియు అసంతృప్తి, ఆధ్యాత్మిక అన్వేషకులలో తరచుగా కనిపించే మానసిక స్థితిగా వ్యక్తమవుతుంది. ఇది తీరని కోరికల ద్వారా మిగిలి పోయిన ముద్రలు, వాటి ఉనికి కారణంగా ఉంటుంది. మనం మన ఇంద్రియాలను ఉద్దేశపూర్వకంగా వస్తువుల నుండి ఉపసంహరించు కోలేదు.
గ్రంథాలు, గురువు, వాతావరణం, మఠం లేదా ఇతర పరిస్థితుల నుండి ఒత్తిడి కారణంగా మనం వాటిని ఉపసంహరించు కున్నాము. కొన్నిసార్లు మన అభ్యాసానికి కారణం స్వయం ప్రేరితం కాదు. మన హృదయం అక్కడ లేనందున, సహజంగానే ఆనంద భావన కూడా ఉండదు. హృదయం లేనప్పుడు ఆనందం ఉండదు. అందుకే స్వీయ నియంత్రణ సాధన, లేదా ఇంద్రియాల నియంత్రణ, లోతైన తాత్విక జ్ఞానం మరియు ఆధ్యాత్మిక ఆకాంక్షతో జత చేయబడాలని సూచించ బడింది, ఇది 'స్వాధ్యాయ' అనే పదం మరియు మరొక పదం 'ఈశ్వర ప్రాణిధాన' ద్వారా సూచించ బడుతుంది.ఇది జీవిత పరమావధిగా భగవంతుని ఆరాధించడం.
కొనసాగుతుంది… 🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 292 🌹 🍀 📖 from The Study and Practice of Yoga 🍀 📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj
🌻 18. When the Heart is not There, There cannot be Joy 🌻
We are always in a mood of unhappiness. We cannot know what has happened to us. We are not satisfied—neither with people, nor with our sadhana, nor with anything in this world. This disquiet, peacelessness and displeasure which can manifest as a sustained mood in spiritual seekers is due to the presence of the impressions left by frustrated desires. We have not withdrawn our senses from objects wantonly or deliberately, but we have withdrawn them due a pressure from scriptures, Guru, atmosphere, monastery, or other conditions.
Sometimes factors which are extraneous become responsible for the practice that we have undergone or are undergoing; and because the heart is absent there, naturally the feeling of happiness is also not there. When the heart is not there, there cannot be joy. That is why it is suggested that the sadhana of self-control, or control of the senses, should be coupled with a deep philosophical knowledge and spiritual aspiration, which is what is indicated by the term ‘svadhyaya', and the other term ‘Ishvara pranidhana', which is adoration of God as the ultimate goal of life.
Continues… 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 192 🌹 ✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మానవజాతికి జ్ఞానం పోగవుతూ వుంది. నువ్వు బుద్ధుడుని కలిస్తే ఆయనకు ఎన్నో విషయాలు వివరించగలవు. వేల సంగతులు ఆయనకు తెలియనివి వున్నాయి. ఆయన తెలియని వాడని కాదు. ఆయనకు తెలుసు. విభిన్నమార్గంలో ఆయనకు తెలుసు. 🍀
మానవజాతికి గతంలో కన్నా యిప్పుడు చాలా విషయాలు తెలుసు. జ్ఞానం పోగవుతూ వుంది. యిప్పటి మనిషికి బుద్ధుడు కన్నా ఎక్కువగా తెలుసు. నువ్వు బుద్ధుడుని కలిస్తే ఆయనకు ఎన్నో విషయాలు వివరించగలవు. వేల సంగతులు ఆయనకు తెలియనివి వున్నాయి. ఆయన మెట్రిక్ కూడా పాసయ్యే వాడు కాడనుకుంటాను. అంత మాత్రాన ఆయన తెలియని వాడని కాదు. ఆయనకు తెలుసు. విభిన్నమార్గంలో ఆయనకు తెలుసు.
ఆయన అనుభవం ఆయన అస్తిత్వాన్ని రూపాంతరం చెందించిది. ఆయన దగ్గర నీ దగ్గరున్నంత సమాచారం లేకపోవచ్చు. కానీ ఆయన రూపాంతరం చెందిన వ్యక్తి. పరిణితి చెందిన మనిషి అసలు విషయం అది. సమాచార సేకరణ పనికి మాలినది. నీ దగ్గర కన్నా కంప్యూటర్ దగ్గర ఎక్కువ సమాచారం వుంటుంది. కానీ కంప్యూటర్ బుద్ధుడు కాలేదు. కంప్యూటర్ జ్ఞానోదయం పొందగలదని అంటావా? అసాధ్యం.
సశేషం … 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 131 🌹 ✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్ సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 101. శిశు పోషణ - 1 🌻
శిశుపోషణ విషయమున తల్లిదండ్రులు చేయు కృషి, మమకార పూరితము. ఆటబొమ్మలు, ఐస్క్రీమ్లు, చాక్లెట్లు, రంగురంగుల దుస్తులు, పాదరక్షలు అమర్చుటలో సతమతమగు తల్లి దండ్రులు, జీవపోషణకేమియు చేయుటలేదు. దేహపోషణము మాత్రమే చేయుచున్నారు.
మరికొందరు, ఆవేశముతో దైవ మంత్రములు, స్తోత్రములు, శతకములు, పిల్లలపై రుద్ది, వారు వల్లించునపుడు గర్వపడుచున్నారు. పిల్లలకు మంచి విషయములు నేర్పుచున్నామని, తెలియక అహంకార పడుచున్నారు. నిజముగ పిల్లల యందాసక్తి మీకున్నచో వారికి రెండు విషయములు నేర్పుడు.
సశేషం….. 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Commentaires