🌹🍀 09 - OCTOBER అక్టోబరు - 2022 SATURDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🍀🌹
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 07, ఆదివారం, అక్టోబరు OCTOBER 2022 భాను వాసరే SUNDAY 🌹
2) 🌹 కపిల గీత - 75 / Kapila Gita - 75 🌹 సృష్టి తత్వము - 31
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 114 / Agni Maha Purana - 114 🌹
4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 249 / Osho Daily Meditations - 249 🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 406 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 406 -2 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹09, October అక్టోబరు 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*
*🍀. ఆశ్వీయుజ పౌర్ణమి, వాల్మీకి జయంతి శుభాకాంక్షలు 🍀*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : ఆశ్వీయుజ పౌర్ణమి, వాల్మీకి జయంతి, మీరాబాయి జయంతి, Aswiyuja Purnima, Valmiki Jayanti, Meerabai Jayanti 🌻*
*🍀. ఆదిత్య స్తోత్రం - 05 🍀*
*5. ఆదిత్యానాశ్రితాః షణ్ణవతిగుణసహస్రాన్వితా రశ్మయోఽన్యే*
*మాసే మాసే విభక్తాస్త్రిభువనభవనం పావయన్తః స్ఫురన్తి |*
*యేషాం భువ్యప్రచారే జగదవనకృతాం సప్తరశ్మ్యుత్థితానాం*
*సంసర్పే చాధిమాసే వ్రతయజనముఖాః సత్క్రియాః న క్రియన్తే*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : 'నేను శ క్తిమంతుడను, నేను శక్తిమంతుడను' అనెడి ఒకే ఒక భావనను మనం మనఃపూర్వకంగా, ప్రశాంతంగా, నిశ్చలంగా, నిండు విశ్వాసంతో హృదయమందు మౌనస్థితిలోనే ధారణ చేసి ఉద్ఘాటించి నప్పుడు, దాని సాన్నిధ్యంలో తద్వ్యతిరేక భావాలన్నీ బిగువు సడలి బలహీనములై ప్రక్క కొదిగి నిలువక తప్పదు. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, దక్షిణాయణం,
శరద్ ఋతువు, అశ్వీయుజ మాసం
తిథి: పూర్ణిమ 26:26:05 వరకు
తదుపరి కృష్ణ పాడ్యమి
నక్షత్రం: ఉత్తరాభద్రపద 16:22:16
వరకు తదుపరి రేవతి
యోగం: ధృవ 18:36:29 వరకు
తదుపరి వ్యాఘత
కరణం: విష్టి 15:03:51 వరకు
వర్జ్యం: 02:25:12 - 03:58:04
దుర్ముహూర్తం: 16:24:01 - 17:11:26
రాహు కాలం: 16:29:57 - 17:58:50
గుళిక కాలం: 15:01:03 - 16:29:57
యమ గండం: 12:03:15 - 13:32:09
అభిజిత్ ముహూర్తం: 11:40 - 12:26
అమృత కాలం: 11:42:24 - 13:15:16
సూర్యోదయం: 06:07:40
సూర్యాస్తమయం: 17:58:50
చంద్రోదయం: 17:48:50
చంద్రాస్తమయం: 05:25:45
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: మీనం
స్థిర యోగం - శుభాశుభ మిశ్రమ ఫలం
16:22:16 వరకు తదుపరి వర్ధమాన
యోగం - ఉత్తమ ఫలం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 75 / Kapila Gita - 75🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 31 🌴*
*31. తైజసానీంద్రియాణ్యేవ క్రియాజ్ఞాన విభాగశః|*
*ప్రాణస్య హి క్రియాశక్తిర్బుద్ధేర్వి జ్ఞానశక్తితా॥*
*ఇంద్రియములు గూడ తైజస (రాజస) అహంకార కార్యములే - కర్మ, జ్ఞానవిభాగములను అనుసరించి, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు అని రెండు విభాగములు గలవు. కర్మేంద్రియములు ప్రాణశక్తివలన పనిచేయును. జ్ఞానేంద్రియములు బుద్ధి వలన పని చేయును.*
*రాజసాహ అనుగృహీతములైన ఇంద్రియములే కర్మేంద్రియ జ్ఞ్యానేంద్రియములు. ప్రాణము అంటే పని చేసే శక్తి. జ్ఞ్యాన ఇంద్రియాలకు బుద్ధి. కర్మేంద్రియాలకు ప్రాణము. మన మనసు బుద్ధి శరీరం ఇంద్రియాలూ బాగుడాలంటే, అధర్మంగా ప్రవర్తించకుండా ఉండాలంటే, కోపాది వికారాలు ప్రబలమవ్వకుండా ఉండాలంటే ఈ నాలుగు వ్యూహాలను (వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధులను ) ఆరాధించాలి.*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 75 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*
*🌴 2. Fundamental Principles of Material Nature - 31 🌴*
*31. taijasānīndriyāṇy eva kriyā-jñāna-vibhāgaśaḥ*
*prāṇasya hi kriyā-śaktir buddher vijñāna-śaktitā*
*Egoism in the mode of passion produces two kinds of senses—the senses for acquiring knowledge and the senses of action. The senses of action depend on the vital energy, and the senses for acquiring knowledge depend on intelligence.*
*It has been explained in the previous verses that mind is the product of ego in goodness and that the function of the mind is acceptance and rejection according to desire. But here intelligence is said to be the product of ego in passion. That is the distinction between mind and intelligence; mind is a product of egoism in goodness, and intelligence is a product of egoism in passion. The desire to accept something and reject something is a very important factor of the mind. Since mind is a product of the mode of goodness, if it is fixed upon the Lord of the mind, Aniruddha, then the mind can be changed to Divine consciousness.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 114 / Agni Maha Purana - 114 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 36*
*🌻. విష్ణుపరిత్రారోపణ విధి - 1🌻*
అగ్ని దేవుడు చెప్పెను:- ప్రాతఃకాలమున స్నానాదికము చేసి, ద్వారపాలుల పూజ చేసిన పిదప గుప్తస్థానము నందు ప్రవేశించి, వెనుక అధివాసితములైన పవిత్రకములనుండి ఒక దానిని ప్రసాదముగా గ్రహింపవలెను. మిగిలిన వస్త్రములును, అలంకారములు,ను, గంధమును, నిర్మాల్యమును తొలగించి భగవంతునకు స్నానము చేయించి పూజ చేయవలయును, పంఛామృత-కషాయ-గంధోదకములచే స్నానము చేయించి ముందగనే సిద్ధము చేసికొని ఉంచుకొనిన వస్త్ర-గంధ-పుష్పములను దేవునకు సమర్పింపవలెను.
నిత్యహోమము చేసిన విధముగ అగ్నిలోహోమము చేసి భగవంతుని స్తుతించి, ప్రార్థించి భగవచ్చరణములపై శిరస్సు ఉంచవలెను. తన సమస్తకర్మలను భగవంతునకు సమర్పించి పిదప నైమిత్తకపూజ చేయవలెను. ద్వారపాల-విష్ణు-కుంభ-వర్ధనులను ప్రార్థింపవలెను. "అతో దేవాః" ఇత్యాదిమంత్రముచే గాని, మూలమంత్రము గాని కలశముపై శ్రీహరిని ఈ విధముం ప్రార్థింపవలెను. "ఓ కృష్ణా! కృష్ణా! నీకు నమస్కారము. ఈ పవిత్రమును గ్రహింపుము. ఇది ఉపాసకుని పవిత్రునిగ చేసి సంవత్సరముపాటు చేయు పూజయొక్క సంపూర్ణ ఫలమును ఇచ్చును.
పరమేశ్వరా! నేను చేసిన పాపములను నశింపచేసి నన్ను పరమపవిత్రుని చేయుము. సురేశ్వరా! నీ కృపచే నేను పరిశుద్ధుడ నగుదును". హృదయశిరోమంత్రములచే పవిత్రమునకును, తనకును అభిషేకము చేసి విష్ణుకలశమును ప్రోక్షించిన పిమ్మట దేవుని దగ్గరకు వెళ్ళవలెను. దేవుని రక్షాబంధమును తొలగించి, పవిత్రమును సమర్పించి-"ప్రభో! నేను నిర్మించిన ఈ బ్రహ్మసూత్రమును స్వీకరింపుము. ఇది కర్మపరిపూర్తిసాధనము. నాయం దేవిధమైన దోషములను ఉండని విధముగ ఈ పవిత్రారోపణకర్మను సంపన్నము చేయుము" అని ప్రార్థిం-వలెను.
ద్వారపాలులకును, యోగపీఠాసనమునకును, ముఖ్యగురువులకును పవిత్రకము సమర్పింపవలెను. వీటిలో కనిష్ఠ పవిత్రకమును (నాభివరకు వచ్చుదానిని) ద్వారపాలులకును, మధ్యమపవిత్రకమును (తొడలవరకు వచ్చుదానిని) యోగ పీఠాసనమునకును, ఉత్తమపవిత్రకమును (మోకాళ్ళ వరకు మచ్చుదానిని గురువులకును ఇవ్వవలెను. వనమాలా పవిత్రకమును (పాదములవరకు వచ్చుదానిని) మూలమంత్రముతో భగవంతునకు సమర్పింపవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 114 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 36*
*🌻 Mode of performing the investiture of sacred thread - 1 🌻*
Agni said:
1. Having bathed in the morning and worshipping the guardian deities, (the worshipper) should enter the secret chamber and gather (articles) and place.
2. The articles (are) the dress, ornaments and perfumes which were offered in the consecration ceremony earlier. Having discarded the remnants (of articles for worship), the deity should be well-installed and worshipped.
3. One should offer the pañcāmṛta (five sweet articles), the unguents, pure and perfumed waters as well as dress, perfumes.and flowers.
4. Having offered unto the fire as done everyday one should pray to the deity and bow down. Having submitted one’s actions to the deity one should perform the naimittika (periodical) ceremony.
5. One should worship the gate-keeper, the pitcher ofViṣṇu and the varddhanī (vessel) and Hari. The pitcher (should be consecrated) with the sacred syllable ‘ato deva’ (and the following).
6. “O Kṛṣṇa! Salutations to you. You accept this sacred thread for the sake of purifying all and which yields fruits of a year’s worship.
7. You purify sins that had been committed by me. O God! the lord of celestials I will be purified by your grace.”
8. Having sprinkled mentally the sacred thread and the self, and having sprinkled the pitcher of Viṣṇu, one should go near the deity.
9-10. One should offer a sacred thread to the self, after having discarded the protective thread (tied on the hand). O Lord! Accept the sacred thread that has been made ready by me, for the sake of accomplishing rites so that there may not be any fault on me. The sacred thread (should be offered) to the gate-keepers, the seat and to the chief preceptors.
11. The garlands of forest flowers (should be offered) to the gods of inferior order with the basic formula.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 249 / Osho Daily Meditations - 249 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀 249. చిరునామా మార్పు 🍀*
*🕉. ఉదయం చాలా పెళుసుగా ఉంటుంది మరియు ఉషోదయ సూర్య కిరణాలు బలంగా లేకున్నా, తరువాత వచ్చే కొత్త కిరణాలు, ప్రతి క్షణం బలంగా మారుతూ ఉంటాయి. వాటిని ఆస్వాదించు మరియు వాటిని గడిచిన పోయిన సమయంతో గుర్తించవద్దు. 🕉*
*ఈ క్షణం నుండి మిమ్మల్ని మీరు నవజాత శిశువుగా భావించండి. రాత్రి ముగిసింది, మరియు మీరు ఉదయం జన్మించారు. ఇది అంత సులభం కాదు, ఎందుకంటే గతం యొక్క పట్టు లోతుగా ఉంది. ఉదయం చాలా పెళుసుగా ఉంటుంది, మరియు సూర్యుని యొక్క కొత్త కిరణాలు చాలా బలంగా లేకున్నా, అవి ప్రతి క్షణం బలంగా మారుతూ ఉంటాయి. వాటిని ఆస్వాదించు మరియు గతంతో గుర్తించవద్దు. అలాగే ఏదైనా పాత అలవాటు వచ్చినట్లయితే, దానిని గమనించండి.*
*తపాలా అందించే వ్యక్తి ఉన్నట్లుగా, అది వేరొకరికి చెందినదన్నట్లుగా దూరంగా ఉండండి. అది తప్పు ఇంటికి ఒక లేఖను పంపిణీ చేసింది. ఇది మీకు సంబోధించ బడలేదు అని భావిస్తూ, మీరు దానిని తపాలా కార్యాలయమునకు తిరిగి ఇవ్వండి. పాత అలవాటు వల్ల మనసు నమ్ముతూనే ఉంటుంది, ఎందుకంటే చిరునామా మారిందని తెలియడానికి మనసుకు సమయం పడుతుంది. శరీరం చాలా సోమరిగా ఉంటుంది కనుక మనస్సు చాలా నెమ్మదిగా కదులుతుంది; అందువల్ల మీ అపస్మారక మనస్సు మరింత నెమ్మదిగా కదులుతుంది. ఇవన్నీ వేర్వేరు సమయ వ్యవస్థలను కలిగి ఉన్నాయి.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 249 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 249. ADDRESS CHANGE 🍀*
*🕉. The morning is very fragile, and the new rays if the sun are not very strong, but they will be proving stronger and stronger every moment. Nourish them, nurture them. And don't identify with the past. 🕉*
*From this moment think of yourself as a newborn child. The night is over, and you are born to the morning. It is not going to be easy, because the hold of the past is deep. The morning is very fragile, and the new rays of the sun are not very strong, but they will be proving stronger and stronger every moment. Nourish them, nurture them. And don't identify with the past. If any old habit comes by, simply watch it.*
*Remain aloof as if it belongs to somebody else, as if the postman has delivered a letter to the wrong house. It is not addressed to you, so you return it to, the post office. The mind will go on believing just because of the old habit, because the mind will take time to know that the address is changed. The mind moves very slowly; then the unconscious moves even more slowly. The body is very lethargic. They have different time systems.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 406 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 406 - 2🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 88. భక్తహార్ద తమోభేద భానుమద్-భానుసంతతిః ।*
*శివదూతీ, శివారాధ్యా, శివమూర్తి, శ్శివంకరీ ॥ 88 ॥ 🍀*
*🌻 406. 'శివారాధ్యా’ - 2 🌻*
*సాత్వికులు శ్రీమాత హృదయమందే వసించుటచే శ్రీమాత సంకల్పమే వారి నుండి వ్యక్తమగును కాని, వారు ప్రత్యేకముగ చేయునది ఏదియు యుండదు. దేశకాలములందు అమ్మ సంకల్పమునకు ప్రతీకలుగ సృష్టియందు జీవుల కొరకు ప్రశాంతముగ చరించు చుందురు. సత్వగుణోపేతమైన ఆరాధనమే శుభమగు ఆరాధనము. అదియే శివారాధనము.*
*ఆమె శివారాధ్య. అట్టి వారికే ఆమె లభ్యమగును. లీలాప్రాయముగ తానుగ వారికి వశమై వారి నుండి సిద్ధులను నిర్వహించును. అసుర ఆరాధన లన్నియూ వారికి వినియోగ పడకపోవుట, భక్తుల ఆరాధన లన్నియూ వారికి సమయమునకు తోడ్పాటు అగుట యందలి రహస్య మిదియే. అసురులు వశము చేసుకొను ప్రయత్నమున విఫలు లగుదురు. భక్తులు శ్రీమాతకు వశమగు ప్రయత్నము తమను తాము సమర్పించుకొని నిరహంకారు లగుదురు. అట్టి వారి కామె సులభ.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 406 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj*
*🌻 88. Bhaktahardhatamobheda bhanumadbanu santatih*
*Shivaduti shivaradhya shivamurtishivankari ॥ 88 ॥ 🌻*
*🌻 406. 'Shivaradhya' - 2 🌻*
*Since the satviks reside in the heart of the Mother, the Will of the Mother manifests from them, but they dont have a will of their own. They act peacefully according to time and place for the creatures in the creation as a symbol of Mother's will. A virtuous worship is auspicious worship. That only is Shiva worship.*
*She, being the foremost worshipper of Lord Shiva, is available only to them. She miraculously surrenders to them and performs siddhis from them. That's the secret of why Asura worship being useless to them, and the worship of devotees being of help to them in time. Asuras try to conquer and fail. Devotees try to surrender themselves to Sri Mata and become selfless. She is available easily to them.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Comentarios