🌹11 - NOVEMBER నవంబరు - 2022 FRIDAY శుక్రవారం, భృగు వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 280 / Bhagavad-Gita -280 - 6వ అధ్యాయము 47 ధ్యాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 679 / Vishnu Sahasranama Contemplation - 679 🌹
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 641 / Sri Siva Maha Purana - 641 🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 358 / DAILY WISDOM - 358 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 257 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹11, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*
*🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -19 🍀*
*19. మాతా త్వమేవ జననీ జనకస్త్వమేవ దేవి త్వమేవ మమ భాగ్యనిధిస్త్వమేవ ।*
*సద్భాగ్యదాయిని త్వమేవ శుభప్రదాత్రీ శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : భగవానుని తీరులు - భగవానుడు అత్యంత విషమంగా పరీక్షించేటప్పుడే సక్రమంగా నడిపిస్తాడు. అత్యంత క్రూరంగా శిక్షించేటప్పుడే సంపూర్ణంగా ప్రేమిస్తాడు. అత్యంత తీవ్రంగా ప్రతిఘటించేటప్పుడే సమగ్రంగా తోడ్పడుతాడు. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, శరద్ ఋతువు,
దక్షిణాయణం, కార్తీక మాసం
తిథి: కృష్ణ తదియ 20:19:17 వరకు
తదుపరి కృష్ణ చవితి
నక్షత్రం: మృగశిర 31:33:11 వరకు
తదుపరి ఆర్ద్ర
యోగం: శివ 21:28:22 వరకు
తదుపరి సిధ్ధ
కరణం: వణిజ 07:22:36 వరకు
వర్జ్యం: 11:17:50 - 13:03:30
దుర్ముహూర్తం: 08:35:13 - 09:20:42
మరియు 12:22:40 - 13:08:10
రాహు కాలం: 10:34:38 - 11:59:55
గుళిక కాలం: 07:44:02 - 09:09:20
యమ గండం: 14:50:31 - 16:15:49
అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:21
అమృత కాలం: 21:51:50 - 23:37:30
సూర్యోదయం: 06:18:45
సూర్యాస్తమయం: 17:41:06
చంద్రోదయం: 19:54:41
చంద్రాస్తమయం: 08:42:21
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: వృషభం
యోగాలు : మానస యోగం - కార్య
లాభం 31:33:11 వరకు తదుపరి
పద్మ యోగం - ఐశ్వర్య ప్రాప్తి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 280 / Bhagavad-Gita - 280 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 47 🌴*
*47. యోగినామపి సర్వేషాంమద్గతేనాంతరాత్మనా ।*
*శ్రద్ధావాన్ భజతే యో మాం స మే యుక్తతమో మతః ।।*
🌷. తాత్పర్యం :
*అందరి యోగులలో కెల్లా, ఎవరి మనస్సు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో, ఎవరు నా యందు ధృఢ విశ్వాసం తో భక్తితో ఉంటారో, వారిని అత్యున్నతమైన వారిగా పరిగణిస్తాను.*
🌷. భాష్యము :
యోగులలో కూడా, కర్మ యోగులు, భక్తి యోగులు, జ్ఞాన యోగులు, అష్టాంగ యోగులు మొదలైన వారు ఉంటారు. ఏ రకమైన యోగులు శ్రేష్ఠమైన వారో అన్న వివాదానికి ఈ శ్లోకం ముగింపు ఇస్తున్నది. 'భక్తి యోగి' యే పరమ శ్రేష్ఠుడు, మరియు, సర్వోత్తమమైన అష్టాంగ యోగి మరియు హఠ యోగుల కన్నా ఉన్నతమైన వాడు, అని శ్రీ కృష్ణుడు ప్రకటిస్తున్నాడు. ఇది ఎందుకంటే, భక్తి అనేది భగవంతుని యొక్క అత్యున్నత శక్తి. అది ఎంత బలీయమైనదంటే, అది భగవంతున్ని కట్టి పడేసి, ఆయనను భక్తునికి బానిస గా చేస్తుంది. అందుకే, భాగవతంలో ఆయన ఇలా చెప్పాడు:
అహం భక్త-పరాధీనో హ్యస్వతంత్ర ఇవ ద్విజ
సాధుబిర్ గ్రస్త-హృదయో భక్తైర్ భక్త-జన-ప్రియః (9.4.63)
"నేను సర్వ-స్వతంత్రుడను అయినా, నేను నా భక్తులకు బానిసై పోతాను. వారు నా హృదయాన్ని జయిస్తారు. నా భక్తులే కాదు, నా భక్తుల భక్తులు కూడా నాకు చాలా ప్రియమైనవారు." భక్తి యోగి దివ్య ప్రేమ శక్తి కలిగి ఉంటాడు, అందుకే భగవంతునికి అత్యంత ప్రియమైన వాడు మరియు ఆయన చే అందరి కంటే అత్యున్నతంగా పరిగణించబడుతాడు.
ముక్తానాం అపి సిద్ధానాం నారాయణ-పరాయణః
సు-దుర్లభః ప్రశాంతాత్మా కోటిష్వపి మహా-మునే (భాగవతం 6.14.5)
"కోట్ల మంది పరిపూర్ణ సిద్ది సాధించి విముక్తి పొందిన మహాత్ములలో కూడా, సర్వోన్నత భగవానుడు అయిన శ్రీమన్నారాయణుడి పట్ల భక్తికల, ప్రశాంత చిత్తులు, చాలా అరుదు."
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 280 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 6 - Dhyana Yoga - 47 🌴*
*47. yoginām api sarveṣhāṁ mad-gatenāntar-ātmanā*
*śhraddhāvān bhajate yo māṁ sa me yuktatamo mataḥ*
🌷 Translation :
*Of all yogis, those whose minds are always absorbed in Me, and who engage in devotion to Me with great faith, them I consider to be the highest of all.*
🌹 Purport :
Even amongst yogis, there are karm yogis, bhakti yogis, jñāna yogis, aṣhṭāṅg yogis, etc. This verse puts to rest the debate about which form of Yog is the highest. Shree Krishna declares the bhakti yogi to be the highest, superior to even the best aṣhṭāṅg yogi and haṭha yogi. That is because bhakti , or devotion, is the highest power of God. It is such a power that binds God and makes him a slave of his devotee. Thus, he states in the Bhāgavatam:
ahaṁ bhakta-parādhīno hyasvatantra iva dvija
sādhubhir grasta-hṛidayo bhaktair bhakta-jana-priyaḥ (9.4.63)[v27]
“Although I am supremely independent, yet I become enslaved by my devotees. They conquer my heart. What to speak of my devotees, even the devotees of my devotees are very dear to me.” The bhakti yogi possesses the power of divine love, and is thus most dear to God and considered by him to be the highest of all.
muktānām api siddhānāṁ nārāyaṇa-parāyaṇaḥ
su-durlabhaḥ praśhāntātmā koṭiṣhv api mahā-mune (Bhāgavatam 6.14.5)[v28]
“Amongst many millions of perfected and liberated saints, the peaceful person who is devoted to the Supreme Lord, Narayan, is very rare.”
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
. *🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 679 / Vishnu Sahasranama Contemplation - 679🌹*
*🌻679. స్తవ్యః, स्तव्यः, Stavyaḥ🌻*
*ఓం స్తవ్యాయ నమః | ॐ स्तव्याय नमः | OM Stavyāya namaḥ*
*కేశవః స్తూయతే సర్వైర్నస్తోతా కస్యవాఽపి సః ।*
*ఇతి స్తవ్య ఇతి ప్రోక్తో వేదవిద్యావిశారదైః ॥*
*కేశవుడు ఎల్లరిచే స్తుతించ బడును గానీ తాను ఎవ్వరిని స్తుతించువాడు కాదు కనుక వేదవిద్యా విశారదులు ఈతనిని స్తవ్యః అని కీర్తింతురు.*
:: పోతన భాగవతము తృతీయ స్కంధము ::
సీ.వరుస విగ్రహ పారవశ్యంబునను జేసి రఘురామ కృష్ణ వరాహ నారసింహాది మూర్తు లంచితలీల ధరియించి దుష్టనిగ్రహమును శిష్టపాలనమును గావించుచు నయమున సద్దర్మ నిరత చిత్తులకు వర్ణింపఁ దగినచతురాత్మతత్త్వ విజ్ఞాన ప్రదుండవై వర్తింతు వనఘ! భవన్మహత్త్వతే.మజున కయినను వాక్రువ్వ నలది గాదు, నిగమ జాతంబు లయిన వర్ణింపలేవయెఱిఁగి సంస్తుతి సేయ నే నెంత దాన?, వినుత గుణశీల మాటలు వేయు నేల? (1033)
*పరమాత్మ స్వరూపుడవైన నీవు అవతారముల మీద ముచ్చటపడి రఘురామచంద్రుడిగా, శ్రీ కృష్ణ ప్రభువుగా, వరాహస్వామిగా, నరసింహమూర్తిగా ఆకారములు ధరియించి దుష్ట శిక్షణం, శిష్ట రక్షణం చేస్తావు. ఉత్తమ ధర్మమునందు ప్రవృత్తమైన చిత్తము గల భక్తులకు జ్ఞానదృష్టిని ప్రసాదించుటకొరకై వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహాలను అవలంబించి ప్రవర్తిస్తావు. అనఘుడవు. అనంత కల్యాణ గుణ సంపన్నుడవు అయిన నీ మహత్త్వమును అభివర్ణించడము చతుర్ముఖునకు, చతుర్వేదులకు కూడ సాధ్యము కాదు; ఇకె నేనెంత? వెయ్యి మాటలు ఏల? నిన్ను తెలుసుకొని సన్నుతించడము నాకు శక్యము కాని పని.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 679🌹*
*🌻679. Stavyaḥ🌻*
*OM Stavyāya namaḥ*
केशवः स्तूयते सर्वैर्नस्तोता कस्यवाऽपि सः ।
इति स्तव्य इति प्रोक्तो वेदविद्याविशारदैः ॥
*Keśavaḥ stūyate sarvairnastotā kasyavā’pi saḥ,*
*Iti stavya iti prokto vedavidyāviśāradaiḥ.*
*He is praised by all; but no one is praised by Him.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
स्तव्यस्स्तवप्रियस्स्तोत्रं स्तुतिः स्तोता रणप्रियः ।पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः ॥ ७३ ॥
స్తవ్యస్స్తవప్రియస్స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః ।పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః ॥ 73 ॥
Stavyasstavapriyasstotraṃ stutiḥ stotā raṇapriyaḥ,Pūrṇaḥ pūrayitā puṇyaḥ puṇyakīrtiranāmayaḥ ॥ 73 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 641 / Sri Siva Maha Purana - 641 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 14 🌴*
*🌻. గణ వివాదము - 2 🌻*
మహేశ్వరుడిట్లు పలికెను-
ఈ కుర్రువాడెవడు? ఏమి పలుకుచున్నాడు? గొప్పవాని వలె మాటలాడు చున్నాడు. ఈ దుష్టబుద్ధి ఏమి చేయగలడు? తన చావును తాను కోరి తెచ్చుకొనుచున్నాడు. ఇది నిశ్చయము (12). ఈ కొత్త ద్వారపాలకుని దూరముగా త్రోసి వేయుడు. మీరు నపుంసకులవలె నిలబడి వాని గాథను నాకు ఎట్లు చెప్పగల్గుచున్నారు? (13). అద్భుతమగు లీలలు గల శంభుస్వామి ఇట్లు పలుకగా ఆ గణములు మరల అచటకు వచ్చి ఆ ద్వారపాలకునితో నిట్లనిరి (14).
శివగణములిట్లు పలికిరి -
ఓరీ! ద్వారపాలకా! నీవెవరివి ? నిన్ను ఇక్కడ నిలబెట్టుటకు కారణమేమి? నీవు మమ్ములను లెక్క చేయుటనే లేదు. బ్రతుకు మీద తీపి గలదా? (15). మేమందరము ద్వారపాలకులమే. ఏమి చెప్పెదవు? నీవునిలబడుటకు కారణమేమి? సింహాసనము నెక్కిన నక్క మంగళములను కోరినట్లున్నది (16). ఓరీ మూర్ఖా! నీవు గణముల పరాక్రమమును దర్శించనంతవరకు మాత్రమే గర్జించెదవు. నీవు గణముల పరాక్రమమును దర్శించి ఇచటనే నేలగూలెదవు (17). వారు ఇట్లు అవమానకరముగు మాటలను పలుకగా మిక్కిలి కోపించి గణేశుడు కర్రను చేతబట్టి ఆ గణములను కోట్టెను (18).
పార్వతీ తనయుడగు గణేశుడు అపుడు మహావీరులైన ఆ శంకరుని గణనాయకులను బయపెట్టు చున్నవాడై ఇట్లు పలికెను (19).
పార్వతీతనయుడిట్లు పలికెను -
ఇచట నుండి దూరముగా పొండు. పొండు పోనిచో నా మిక్కిలి భయంకరమగు పరాక్రమమును మీకు చూపెదను. మీరు నవ్వుల పాలగుదురు (20). పార్వతీ తనయుని ఆ మాటలను విని, శంకరుని గణములు వారిలో వారు ఇట్లు మాటలాడు కొనిరి (21).
శివగణముల లిట్లు పలికెను -
ఏమి చేయవలెను ? ఎచటకు పోవలెను? ఆ బాలుని మనమేల దండించుట లేదు? మనము మర్యాదను రక్షించు చున్నాము.
అట్లు గానిచో, ఆ దేవి ఏమనును? (22)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 641🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 14 🌴*
*🌻 The Gaṇas argue and wrangle - 2 🌻*
Lord Śiva said:—
12. “Who is this fellow? What does he say? He is standing there haughtily as though he is our enemy. What will that wicked knave do? Certainly he wants to die.
13. Why? Are you dastardly eunuchs to stand here helplessly and complain to me about him. Let this new doorkeeper be thrown out.”
Brahmā said:—
14. Thus commanded by lord Śiva of wonderful sports the Gaṇas returned to the place and spoke to the doorkeeper.
Śiva’s Gaṇas said:—
15. O gatekeeper, who are you standing here? Why have you been stationed here? Why don’t you care for us. How can you thus remain alive?
16. We are here the duly appointed doorkeepers. What are you saying? A jackal sitting on a lion’s seat wishes for happiness.
17. O fool, you will roar only as long as you do not feel the brunt of our attack. Erelong you will fall by feeling the same.”
18. Thus taunted by them, Gaṇeśa became furious and took the staff with his hands and struck the Gaṇas even as they continued to speak harsh words.
19. Then the fearless Gaṇeśa, son of Pārvatī rebuked the heroic Gaṇas of Śiva and spoke as follows:—
The son of Pārvatī said:—
20. “Get away. Get away. Or I shall give you a foretaste of my fierce valour. You will be the laughing-stock of all.”
21. On hearing these words of Geṇeśa, the Gaṇas of Śiva spoke to one another.
Śiva’s Gaṇas said:—
22. What shall be done? Where shall we go? Why shall we not act? Bounds of decency are observed by us. He would not have acted thus, otherwise.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 358 / DAILY WISDOM - 358 🌹*
*🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀*
*📝. ప్రసాద్ భరద్వాజ్*
*🌻23. ధ్యానం అంటే భగవంతుడు స్నానం చేయడమే🌻*
*ధ్యానం యొక్క అత్యున్నత స్థాయిలో, ధ్యానం చేసే ఆత్మ తాను ధ్యానించే వస్తువు లోకి ప్రవేశించి, సముద్రం లో నదులు కరిగినట్లుగా, ఆ వస్తువులో కరిగిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే, భగవంతుని గురించి ఎవరూ ధ్యానం చేయడం లేదని చెప్పవచ్చు, ఎందుకంటే ఎవరైనా భగవంతుని సమగ్ర జీవంలో ఒక భాగమే. అప్పుడు, ధ్యానం ఎవరు చేస్తారు? ఈ పరిశోధనాత్మక స్ఫూర్తిని లోతుగా పరిశోధించినప్పుడు, అది భగవంతుడు ధ్యానం ద్వారా తనలో తాను రమిస్తున్నాడని చెప్పవచ్చు.*
*ఇది భగవంతుడు లేదా ఈ విశ్వం తమను తాము చైతన్యవంతంగా తెలుసుకోవడం.అత్యున్నత స్థాయిలో విశ్వం మరియు భగవంతుని మధ్య తేడాను గుర్తించలేరు. భౌతిక శరీరాలు, సామాజిక విభాగాలు, మానసిక అహంకారాలు మొదలైన అనేక విధాలుగా మన స్వంత వ్యక్తిత్వాన్ని మనం నిర్వహించడం వల్ల ఈ వ్యత్యాసం ఏర్పడింది. ధ్యానం యొక్క అత్యున్నత రూపం ఏమిటంటే బ్రహ్మం యొక్క సర్వాంత్యామిత్వాన్ని అంతర్లీనంగా ధృవీకరించడం అని యోగ-వసిష్ఠం చెబుతుంది. దీనినే బ్రహ్మ-అభ్యాసం అంటారు. ఈ ధ్యానంలో మనస్సు తీసుకునే రూపాన్ని బ్రహ్మకార-వృత్తి అని పిలుస్తారు. ఈ స్థాయిలో మనస్సు విశ్వ పదార్థంతో ఒకటౌతుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 358 🌹*
*🍀 📖 from The Philosophy of Religion 🍀*
*📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj*
*🌻23. Meditation is God Bathing Himself🌻*
*In a heightened form of meditation, the meditating spirit enters into the body of the object with such force that it dissolves itself in the object, as rivers melt down in the ocean. In a sense, it may be said that no one is meditating on God, because that someone is a part of God's all-comprehensive Being. Then, who would do the meditation? When one goes deep into this investigative spirit, it would be realised that it is a meditation with which God is bathing Himself.*
*It is God becoming conscious of Himself, or the universe getting illumined into its own self-conscious attitude. One cannot distinguish between the universe and God in the ultimate sense. The distinction has arisen on account of our maintaining an individuality of our own as physical bodies, social units, psychological egos, etc. The Yoga-Vasishtha tells us that the highest form of meditation is an inward affirmation of the cosmic presence of Brahman. This is what is known as Brahma-Abhyasa. The form which the mind takes in this meditation is known as Brahmakara-Vritti, the psychosis which assumes the form of the cosmic substance.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 257 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. ప్రార్థన పరిమళాన్ని అందుకోవడం అంటే నీ జీవితంలో పతాక స్థాయిని చేరడం. అదే సంపూర్ణత, సమగ్రత, సంతృప్తి, వ్యక్తి తన సొంత యింటికి చేరతాడు. 🍀*
*ప్రార్థన పువ్వు లాంటిది. ఆనందం పూలు విచ్చుకున్న వసంతం లాంటిది. పూలు విచ్చుకున్నపుడు పరిమళ ముంటుంది. బంధింప బడిన పరిమళం స్వేచ్ఛా పొందుతుంది. ప్రార్ధన సహజంగా, అప్రయత్నంగా, హఠాత్తుగా పొంగిపొర్లుతుంది.*
*అప్పుడు నువ్వు కేవలం కృతజ్ఞత ప్రకటించాలి. దానికి కారణమేమీ వుండదు. అలా ప్రకటించడం చాలు. క్షణకాలం ప్రదర్శిస్తే చాలు. ఆ పరిమళాన్ని అందుకోవడం అంటే నీ జీవితంలో పతాక స్థాయిని చేరడం. అదే సంపూర్ణత, సమగ్రత, సంతృప్తి, వ్యక్తి తన సొంత యింటికి చేరతాడు.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
コメント