top of page
Writer's picturePrasad Bharadwaj

🍀 11 - OCTOBER అక్టోబరు - 2022 TUESDAY ALL MESSAGES మంగళవారం,భౌమ వాసర సందేశాలు 🍀

🌹🍀 11 - OCTOBER అక్టోబరు - 2022 TUESDAY ALL MESSAGES మంగళవారం,భౌమ వాసర సందేశాలు 🍀🌹

1) 🌹 11 - OCTOBER అక్టోబరు - 2022 TUESDAY మంగళవారం, భౌమ వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹 కపిల గీత - 76 / Kapila Gita - 76 🌹 సృష్టి తత్వము - 32

3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 115 / Agni Maha Purana - 115 🌹

4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 250 / Osho Daily Meditations - 250 🌹

5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 407 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 407 -1 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹





*🌹11, అక్టోబరు, October 2022 పంచాగము - Panchagam 🌹*

*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*

*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*

*ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేదు🌻*


*🍀. సంకట మోచన హనుమాన్ స్తుతి - 6 🍀*


*6. యుద్ధే దశాస్యవిహితే కిల నాగపాశై- ర్బద్ధాం విలోక్య పృతనాం ముముహే ఖరారిః.*

*ఆనీయ నాగభుజమాశు నివారితా భీర్జానాతి కో న భువి సంకటమోచనం త్వాం.*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : 'మేమంతా ఒక్కటి. మాలో ఉండే విభేదాలన్నీ మిథ్యలు' అని ఆసేతుహిమాచలంలో గల భారతీయులంతా ప్రతి సాయంకాలం ప్రదోష సమయాన ఒక పది నిమిషాల సేపు భావించ నేర్చుకుంటే, దాని వలన ఉత్పన్నమయ్యే శక్తి నిస్సందేహంగా అపారమే కాగలదు. 🍀*


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు,

దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం

తిథి: కృష్ణ విదియ 25:31:55

వరకు తదుపరి కృష్ణ తదియ

నక్షత్రం: అశ్విని 16:19:32

వరకు తదుపరి భరణి

యోగం: హర్షణ 15:15:42 వరకు

తదుపరి వజ్ర

కరణం: తైతిల 13:33:52 వరకు

వర్జ్యం: 12:15:20 - 13:52:24

మరియు 26:14:48 - 27:54:16

దుర్ముహూర్తం: 08:29:56 - 09:17:13

రాహు కాలం: 15:00:02 - 16:28:42

గుళిక కాలం: 12:02:43 - 13:31:23

యమ గండం: 09:05:24 - 10:34:03

అభిజిత్ ముహూర్తం: 11:39 - 12:25

అమృత కాలం: 09:01:12 - 10:38:16

సూర్యోదయం: 06:08:05

సూర్యాస్తమయం: 17:57:21

చంద్రోదయం: 19:05:01

చంద్రాస్తమయం: 07:14:25

సూర్య సంచార రాశి: కన్య

చంద్ర సంచార రాశి: మేషం

అమృత యోగం - కార్య సిధ్ది 16:19:32

వరకు తదుపరి ముసల యోగం - దుఃఖం


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹





*🌹. కపిల గీత - 76 / Kapila Gita - 76🌹*

*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*

*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 32 🌴*


*32. తామసాచ్చ వికుర్వాణాద్భగవద్వీర్యచోదితాత్|*

*శబ్దమాత్రమభూత్తస్మాన్నభః శ్రోత్రం శబ్దగమ్॥*


భగవంతుని యొక్క చేతనాశక్తి ప్రేరణచే తామసాహంకారమున వికారము ఏర్పడెను. దాని నుండి శబ్దతన్నాత్ర ఉద్భవించెను. శబ్దతన్మాత్ర నుండి ఆకాశము, అట్లే శబ్ద జ్ఞానమును కలిగించు శ్రోత్రేంద్రియము (చెవులు) ఉత్పన్మములయ్యెను.


పంచభూతాలకి తామసాహంకారం ఆది కాబట్టి దీనిని భూతాది అంటారు. భగవ్త్సంకల్పమనే ప్రేరణతో తాంసాహంకారం వికారం చెంది శబ్ద తన్మాత్రం ఉదయించింది. దీని నుండి ఆకాశం పుట్టింది. ఆకాశము యొక్క గుణము శబ్దము. శబ్దమును గ్రహించే ఇంద్రియం శ్రోత్రేంద్రియం. శ్రోత్రేంద్రియం ఆకాశము నుంచి పుట్టిందా? కాదు. అది పుట్టినది రాజసాహంకారము నుండి. శ్రోత్రేంద్రియం శబ్దమును గ్రహిస్తుంది గానీ, అది ఆకాశము నుండి పుట్టలేదు.


*సశేషం..*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Kapila Gita - 76 🌹*

*🍀 Conversation of Kapila and Devahuti 🍀*

*📚 Prasad Bharadwaj*


*🌴 2. Fundamental Principles of Material Nature - 32 🌴*


*32. tāmasāc ca vikurvāṇād bhagavad-vīrya-coditāt

śabda-mātram abhūt tasmān nabhaḥ śrotraṁ tu śabdagam


When egoism in ignorance is agitated by the Regenerative energy of the Godhead, the subtle element sound is manifested, and from sound come the ethereal sky and the sense of hearing.


It is understood from this verse that by agitation of the element of egoism in ignorance, the first thing produced was sound, which is the subtle form of ether. It is stated also in the Vedānta-sūtra that sound is the origin of all objects of material possession and that by sound one can also dissolve this material existence. Anāvṛttiḥ śabdāt means "liberation by sound." The entire material manifestation began from sound, and sound can also end material entanglement, if it has a particular potency. Our entanglement in material affairs has begun from material sound.


Now we must purify that sound in spiritual understanding. There is sound in the spiritual world also. If we approach that sound, then our spiritual life begins, and the other requirements for spiritual advancement can be supplied. We have to understand very clearly that sound is the beginning of the creation of all material objects for our sense gratification. Similarly, if sound is purified, our spiritual necessities also are produced from sound. The Vedic knowledge is called śruti; knowledge has to be received by hearing. By hearing only can we have access to either material or spiritual enjoyment.


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹





*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 115 / Agni Maha Purana - 115 🌹*

*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*

*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 36*


*🌻. విష్ణుపరిత్రారోపణ విధి - 2🌻*


"నమో విష్వక్సేనాయ" అను మంత్రము చదువుచు విష్వక్సేనునకు కూడ పవిత్రకము మర్పింపవలెను. అగ్నిలో హోమము చేసి అగ్నిలో నున్న విశ్వాదిదేవతలకు పవిత్రకము అర్పింపవలెను. పూజానంతరము ప్రాయశ్చిత్తర్థమై మూలమంత్రముతో పూర్ణాహుతి చేయవలెను.


అష్టోత్తర శతముతో గాని, ఐదు ఉపనిషన్మంత్రములతో గాని పూర్ణాహుతి ఇవ్యవలెను. అష్టోత్తరశతము లెక్కపట్టుటకు, మణిమాల గాని, మందారపుష్పాదులు కాని ఉపయోగింపవలెను. చివర- "ఓ గరుడధ్వాజా! నేని చేసిన ఈ వార్షికపూజ సఫల మగుగాక. వనమాల నీ వక్షస్థలమును ప్రకాశింపచేయుచున్నట్లే ఈ పవిత్రకతంతువులును, వీటి ద్వారా నేను చేసిన పూజలో తెలిసిన గాని తెలియక గాని కలిగిన లోపములను, విధినిర్వహణములో విఘ్నముల వలన కలిగిన లోపములను, కర్మలోపములను, తొలగించి, పూజ పూర్ణముగ సఫల మగునట్లు చేయుము" అని ప్రార్థించవలెను.


ఈ విధముగ ప్రార్థనానమస్కరములు, అపరాధక్షమాపణము చేసి పవిత్రకమును శిరస్సుపై ఉంచవలెను. తగు విధముగ బలి ఇచ్చి, వైష్ణవగురువును దక్షిణలతే సంతోషపెట్టవలెను. ఒక దినమునగాని, ఒక పక్షముపాటు గాని భోజనవస్త్రాదుల నిచ్చి బ్రాహ్మణులను సంతోషపెట్టవలెను. స్నానసమయమున పవిత్రమును తీసివేసి పూజించవలెను. ఉత్సవదివసమునందు వచ్చువారి నెవరిని కాదనక అందరికీని తప్పక అన్నదానము చేసి తాను కూడా భోజనము చయవలెను.


విసర్జనదినమున పవిత్రకమును పూజించి - "ఓ పవిత్రకమా! నేను చేసిన ఈ వార్షికపూజ సుసంపన్న మగునట్లు చేసితివి. ఇపుడు నిన్ను విసర్జంచుచున్నాను. నీవు విష్ణులోకమునకు పొమ్ము" అని ప్రార్థింపవలెను. ఉత్తర-ఈశాన్యముల మధ్య విష్వక్సేనపూజ చేసి, అతని పవిత్రకములను పూజించి బ్రాహ్మణులకు ఇచ్చివేయవలెను. ఆ పవిత్రములో ఎన్ని తంతువులున్నవో అన్ని వేల యుగముల కాలము ఉపాసకుడు విష్ణులోకములో నివసించును. పవిత్రారోపణము చేసిన సాధకుడు తన వెనుక నూరు తరములను ఉద్ధరించి, తనకు పూర్వము పది తరములవారిని తరువాతిపది తరముల వారిని విష్ణులోకమునకు చేర్ఛును. తాను కూడ ముక్తుడగును.


అగ్నిమాహాపురాణమునందు విష్ణుపవిత్రారోపణవిధినిరూపణ మను ముప్పదియారవ అధ్యాయము సంపూర్ణము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Agni Maha Purana - 115 🌹*

*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *


*Chapter 36*

*🌻 Mode of performing the investiture of sacred thread - 2 🌻*


12. The articles should be offered to the heart etc. and ending with Viṣvaksena (an epithet of Viṣṇu). Having offered to the fire the oblations placed near the fire for Viṣṇu and other (gods), and having worshipped, the final oblation should (then) be made with the basic formula for the expiation (of one’s sins).


13-16. O Lord! having Garuḍa as your emblem! Let this be your annual adoration with one hundred and eight or five Upaniṣads[1] (and) with garlands of gems and corals, the flowers mandāra and others.


“O Lord! Just as the garland of wild flowers and the kaustubha gem (are) (worn) always on the chest, so also bear the sacred thread and the worship on the chest. Whatever has been done wantonly or unwantonly in the regulations of the worship let it become complete by the rite shorn of impediments.” Having worshipped, bowing down, and requesting them the purified article should be placed on one’s own head.


17. Having made offering to Viṣṇu the preceptor should be satisfied by (giving) the fees. The brahmins should be satisfied) by (giving) food, clothes and other things either for a day or for a fortnight.


18. At the time of bathing, having gone down into the waters, the sacred thread should be offered. Without any restriction, food and other things should be given (to others) and then one has to eat.


19-22. Having worshipped fire at the (rite of) dismissal the threads are removed. (One should then say) “Having thus duly accomplished my annual adoration O thread! you now go to the world of Viṣṇu having been permitted by me. Having worshipped Someśa and Viṣvaksena at the centre and having worshipped the sacred threads one should dedicate them to the-brahmins. As many knots as there are in that thread (one will) live gloriously for so many thousands of years in the world of Viṣṇu. One will get release (from bondage) after having redeemed hundreds of his ancestors the ten preceding and the ten succeeding and having established them in the world of Viṣṇu.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹







*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 250 / Osho Daily Meditations - 250 🌹*

*📚. ప్రసాద్ భరద్వాజ*


*🍀 250. విరిగిన హృదయం 🍀*


*🕉. హృదయానికి అయ్యే గాయం మంచిదే. దానిని ఆనందంగా స్వీకరించండి. దానిని అనుమతించు, అణచి వేయవద్దు. బాధాకరమైనది ఏదైనా అణచివేయడం మనస్సు యొక్క సహజ ధోరణి. కానీ దానిని అణచి వేయడం ద్వారా మీరు పెరుగుతున్న దానిని నాశనం చేస్తారు. 🕉*


*హృదయం దెబ్బ తినడం మంచిదే. దాని ఉద్దేశ్యం ఏమిటంటే - అది కన్నీళ్లలో కరిగిపోయి అదృశ్యం కావాలి. హృదయం ఆవిరైపోవాలి. హృదయం ఆవిరైపోయినప్పుడు, సరిగ్గా అదే స్థలంలో, మీరు నిజమైన హృదయాన్ని తెలుసుకుంటారు. హృదయానికి అయ్యే గాయం మంచిదే. దానిని ఆనందంగా స్వీకరించండి. దానిని అనుమతించు, అణచి వేయవద్దు.*


*బాధాకరమైనది ఏదైనా అణచివేయడం మనస్సు యొక్క సహజ ధోరణి. కానీ దానిని అణచి వేయడం ద్వారా మీరు పెరుగుతున్న దానిని నాశనం చేస్తారు. ఈ హృదయం పైన పొర తొలగి పోవాలి. అది తొలగి పోయిన తర్వాత, అకస్మాత్తుగా మీరు లోతైన హృదయాన్ని తెలుసుకుంటారు. ఇది ఒక ఉల్లిపాయ లాగా ఉంటుంది. మీరు దాని ఒక పొర తీస్తే ఇంకో కొత్త పొర ఉంటుంది.*

*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations - 250 🌹*

*📚. Prasad Bharadwaj*


*🍀 250. BROKEN HEARTED 🍀*


*🕉. Heartache is good. Accept it joyously. Allow it, don't repress it. The natural tendency of the mind is to repress anything that is painful. But by repressing it you will destroy something that was growing. 🕉*


*The heart is meant to be broken. Its purpose is that - that it should melt into tears and disappear. The heart is to evaporate, and when the heart has evaporated, exactly in the same place where the heart was, you come to know the real heart. Heartache is good. Accept it joyously. Allow it, don't repress it.*


*The natural tendency of the mind is to repress anything that is painful. But by repressing it you will destroy something that was growing. This heart has to break. Once it has fallen apart, suddenly you come to know a deeper heart. Just like an onion, you peel it, and the new layer is there.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹





*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 407 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 407 - 1🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*


*🍀 88. భక్తహార్ద తమోభేద భానుమద్-భానుసంతతిః ।*

*శివదూతీ, శివారాధ్యా, శివమూర్తి, శ్శివంకరీ ॥ 88 ॥ 🍀*


*🌻 407. 'శివమూర్తి'- 1 🌻*


*శివుడే స్వరూపముగ కలది శ్రీమాత అని అర్ధము. శివ శక్తులకు భేదము లేదు గనుక శివుని నుండి శక్తి రూపము వచ్చిన దనిననూ, శక్తి నుండి శివరూపము వచ్చిన దనిననూ విప్రతిపత్తి ఏమియునూ లేదు. వారు యిరువురిగా పేర్కొనబడిననూ నిజమునకు ఒక్కటియే. వారు విడదీయరాని వారు. ఒకే తత్త్వమును స్త్రీ పరముగ పురుష పరముగ తెలుపు రెండు సంప్రదాయము లుండుటచే ఇట్టి భావములు, నామములు సత్యమే.*


*శివుని మూర్తి ఆమె. ఆమె మూర్తి శివుడు. నిజమునకు ఒకటియే రెండుగ నున్నది. ఇట్లు ఒకదానితో నొకటి పెనవేసుకొని సమస్త లోకము లేర్పడినవి. దీని భావ మేమనగా ప్రకృతి పురుషులు ఒకరికొకరు ఆధారము. ఒకరు లేక ఇంకొకరు లేరు. ఒకరిని పూజించినచో ఇరువురినీ పూజించినట్లే. ఆమె యందు శివుడు, శివుడియం దామె యుండుటచే ఉపాధి, అందు వసించు తత్త్వము రెండునూ కలిపి పూర్ణ సత్యమగును.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 407 - 1 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj*


*🌻 88. Bhaktahardhatamobheda bhanumadbanu santatih*

*Shivaduti shivaradhya shivamurti shivankari ॥ 88 ॥ 🌻*


*🌻 407. 'Shivamurthi'- 1 🌻*


*It means that Srimata has the form of Lord Shiva. As there is no difference between the Shiva and Srimata, there is no difference between the form of Shakti coming from Shiva and the form of Shiva coming from Shakti. Even though they are mentioned as two, they are actually one. They are inseparable. The ultimate truth is understood as male in one philosophy and female in other. As there are two such schools of thought, there is this apparent dichotomy but in reality, there is only one truth.*


*Srimata is the embodiment of Shiva and Shiva is the embodiment of Srimata. Truth is one is manifesting as two. These are intertwined with each other and the whole worlds are formed. Its meaning is that Nature and Consciousness are mutually dependent. One can't exist without the other. Worshiping one is like worshiping both. In her there is Shiva, and in Shiva resides Her. So the manifestation and its philosophy reside in each other thus forming the whole Truth.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Comments


Post: Blog2 Post
bottom of page