top of page
Writer's picturePrasad Bharadwaj

12 - JULY - 2022 TUESDAY MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 12, మంగళవారం, జూలై 2022 భౌమ వాసరే Tuesday 🌹

2) 🌹 కపిల గీత - 37 / Kapila Gita - 37 🌹

3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 77 / Agni Maha Purana - 77 🌹

4) 🌹. శివ మహా పురాణము - 593 / Siva Maha Purana - 593 🌹

5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 212 / Osho Daily Meditations - 212 🌹

6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 385-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 385-2 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹12, July 2022 పంచాగము - Panchagam 🌹*

*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*

*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*

*ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*


*🍀. హనుమ భుజంగ స్తోత్రం - 10 🍀*


*16. హనూమ ద్భుజంగ ప్రయాతం ప్రభాతే*

*ప్రదోషేపివా చార్థరాత్రోపిమర్త్యః*

*పఠన్ నశ్యతోపి ప్రముక్తా ఘజాలో*

*సదాసర్వదా రామభక్తిః ప్రయాతిః |*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : వేషాలు చూచి కలత చెందుతా వెందుకు ? ఇతరులను నిరసించే లక్షణం నీలో పొడసూపినప్పుడెల్ల నీ హృదయంలోనికి దృష్టి సారించుకొని నీ అవివేకానికి నవ్వు కోవడం నేర్చుకో. 🍀*


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, ఆషాడ మాసం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

తిథి: శుక్ల త్రయోదశి 07:47:58 వరకు

తదుపరి శుక్ల చతుర్దశి

నక్షత్రం: మూల 26:22:38 వరకు

తదుపరి పూర్వాషాఢ

యోగం: బ్రహ్మ 16:59:23 వరకు

తదుపరి ఇంద్ర

కరణం: తైతిల 07:45:58 వరకు

వర్జ్యం: 12:18:00 - 13:42:24

దుర్ముహూర్తం: 08:25:56 - 09:18:19

రాహు కాలం: 15:38:04 - 17:16:17

గుళిక కాలం: 12:21:38 - 13:59:51

యమ గండం: 09:05:13 - 10:43:26

అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:47

అమృత కాలం: 20:44:24 - 22:08:48

సూర్యోదయం: 05:48:48

సూర్యాస్తమయం: 18:54:29

చంద్రోదయం: 17:40:38

చంద్రాస్తమయం: 03:51:04

సూర్య సంచార రాశి: జెమిని

చంద్ర సంచార రాశి: ధనుస్సు

ఛత్ర యోగం - స్త్రీ లాభం 26:22:38

వరకు తదుపరి మిత్ర యోగం -

మిత్ర లాభం


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. కపిల గీత - 37 / Kapila Gita - 37🌹*

*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*

*📚. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌴. 16. స్వచ్ఛమైన భక్తుల ఆధ్యాత్మిక సంపద - 1 🌴*


*37. అథో విభూతిం మమ మాయా వినస్తామైశ్వర్య మష్టాఙ్గమను ప్రవృత్తమ్*

*శ్రియం భాగవతీం వాస్పృహయన్తి భద్రాం పరస్య మే తేऽశ్నువతే తు లోకే*


*ఇలాంటి యోగము తోటీ ధ్యానము తోటీ భావముతోటీ నన్ను మాత్రమే చేరి , కొలిచి స్తుతించి, ఇంతకన్నా వేరే విషయాలను చూడకుండా ఉన్నప్పుడు, ఇంతటి పరమభక్తునికి కోరకున్నా అష్ట సిద్ధులూ వస్తాయి. అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం. అప్రయత్నముగా వచ్చినా ఈ అష్ట సిద్ధులని కూడా నా భక్తులు కోరరు. భగవత్భక్తులు కోరే మంగళకరమైన సంపద (కైవల్యం) కూడా వారు కోరరు.*


*సశేషం..*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Kapila Gita - 37 🌹*

*✍️ Swami Prabhupada.*

*📚 Prasad Bharadwaj*


*🌴 16. The Pure Devotees' Spiritual Opulences - 1 🌴*


*37. atho vibhutim mama mayavinas tam aisvaryam astangam anupravrttam*

*sriyam bhagavatim vasprhayanti bhadram prasya me te 'snuvate tu loke*


*Thus because he is completely absorbed in meditation upon Me, the devotee does not desire even the highest benediction obtainable in the upper planetary systems, including Satyaloka. He does not desire the eight material perfections obtained from mystic yoga, nor does he desire to be elevated to the kingdom of God. Yet even without desiring them, the devotee enjoys, even in this life, all the offered benedictions.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 77 / Agni Maha Purana - 77 🌹*

*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 27*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*


*🌻. దీక్షా విధి - 3 🌻*


పాదాంగుష్ఠము మొదలు శిఖ వరకు పొడవు గల ఆరు పేట్ల ఎఱ్ఱటి దారమును కన్యచేత భేదింపచేసి, మరల దానిని మూడు పేటలు చేసి, దానిపై, ఏ ప్రకృతిలో విశ్వము లీనమగునో, దేనినుండి జనించునో అట్టి ప్రకృతిని వివిధ ప్రక్రియలతో భావన చేయవలెను.


ఆ సూత్రముతో, ఎన్ని తత్త్వము లున్నవో అన్ని ప్రాకృతికపాశములను ముడివేసి, దానిని మూకుడులో అగ్ని కుండపార్శ్వమునందుంచి, గురువు, ప్రకృతి మొదలు పృథివి వరకున ఉన్న ఆ తత్త్వములను స్పష్టిక్రమానుసారము ధ్యానించుచు శిష్యుని శరీరముపై న్యాసము చేయవలెను.


వికృతుల క్రమము ప్రకారము నిఖిలమార్గమును పంచాంగములతో, తన్మాత్రాత్మకమగు మాయాసూత్రమైన పశువు శరీరమునందు ఉపసంహరించి, తత్త్వచింతకులు అచట ఐదు, పది, లేదా పండ్రెండు విధములచే ఆ గ్రథితమైన సూత్రమున పర్వ భేదముచే ఇవ్వవలెను.


తన ఇచ్ఛననుసరించి, సూత్రమునందును, దేహమునందును - ప్రకృతి, లింగశక్తి కర్త, బుద్ధి, మనస్సు తన్మాత్రలు, జ్ఞానేంద్రియము, కర్మేంద్రియములు పంచభూతములు - వీటినన్నింటిని, ద్వాదశాత్మను ధ్యానించవలెను. సృష్ట్యనులోమవిలోమక్రమములచే ఒక్కొక్క శతము హోమములు చేసి, పిమ్మట పూర్ణాహుతి ఇచ్చి, మూకుడులో సంపుటముగా చేసి, కుంభీశునకు నివేదనము చేయవలెన.


ఈ విధముగ, శాస్త్రానుసారముగా, అధివాసితము చేసి; భక్తుడై శిష్యునికి దీక్ష ఇవ్వవలెను. కరణి, కర్తరి, రజస్సులు, ఖటిక, ఇంకను ఉపయుక్తములైన వస్తువులు, వీటి నన్నింటిని ఆతని ఎడమ ప్రక్క దగ్గరగా ఉంచి, మూల మంత్రముచే స్పృశించి, అదివాసితములు చేయవలెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Agni Maha Purana - 77 🌹*

*✍️ N. Gangadharan*

*📚. Prasad Bharadwaj *


*Chapter 27*

*🌻 Mode of performing the initiation rite - 3 🌻*


23. One should then take up a red thread spun by a maiden and measure it six times from the tuft of the hair to the toe and again multiply it three times.


24. Then one should meditate on the Prakṛti in which the universe lies and from which the universe is born, as being present there,.


25. Having tied the nooses of Prakṛti proportional to the number of principles, that thread is placed on an earthen vessel near the pit.


26. Then having meditated upon the principles commencing with the Prakṛti to the earth, following the order of creation, the spiritual teacher should assign them to the body of the disciple.


27. Those (principles), one, five, ten or twelve[5] may be tied individually and given by those who devote their thought on the principles.


28-29. With the five organs of action (one has to create) the entire universe in the order of evolution. Having drawn the subtle principles into one’s self and (having placed) the rope of illusion on the animal, the nature is taken as the creative power, the intellect or the mind as the agent, the five subtle principles as born of intellect and the five elements from the organs of action.


30-31. One has to meditate on these twelve principles in the rope as well as in the body according to his desire. Having made oblations with the residue of offerings according to the order of creation, and hundred oblations to each and every (principle) and then the final oblation, the earthen vessel is covered and is dedicated to the presiding deity of the pot.


32-33. Having duly performed the initial consecration, the devoted disciple is initiated. Then in a place where the wind blows, an arrow of a particular shape and a knife made either of silver or iron as well as all necessary materials are placed; and touched with the principal mystic syllable he should perform the initial consecration ceremony.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹 . శ్రీ శివ మహా పురాణము - 593 / Sri Siva Maha Purana - 593 🌹*

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ


*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 04 🌴*


*🌻. కార్తికేయుని కొరకై అన్వేషణ - 2 🌻*


విష్ణువు ఇట్లు పలికెను -


భరత ఖండమునందు ఎవరైతే నీ శిశువుని దాచియుంచినారో వారు మిథ్యావాదులు, గురుదారా సమాగమమును చేయువారు, గురువును నిందించుట యందు ఆసక్తి గలవారుగా శాశ్వతముగా నగుదురు గాక!(12)


బ్రహ్మ ఇట్లు పలికెను -


నీ తేజస్సును దాచియుంచిన వ్యక్తి భారత దేశములోని పుణ్య క్షేత్రములో నిన్ను సేవించుటకు, పూజించుటకు అర్హతను గోల్పోవును (13).


లోకపాలురు ఇట్లు పలికిరి -


నీ తేజస్సంజాతుడగు శిశువును దాచిన పాపి పతితుడగును. వాని పుణ్య కర్మలు వ్యర్ధమగును. వాని సంతానము నష్టమగును (14).


దేవతలిట్లు పలికిరి -


నీ శిశువుని దాచిన వానికి, వాగ్దానమును చేసి నెరవార్చని మూర్ఖునకు లభించు పాపము చుట్టు కొనును (15).


దేవ పత్నులు ఇట్లు పలికిరి -


ఏ స్త్రీ నీ శిశువును దాచి యుంచునో, అట్టి స్త్రీకి, భర్తను నిందించి పరపురుషునితో సమాగమమును చేసి తల్లివైపు బంధువులకు కూడా దూరమైన పాపాత్మురాలి పాపము చుట్టుకొనును (16).


బ్రహ్మ ఇట్లు పలికెను -


దేవ దేవుడగు శివప్రభుడు దేవతల మాటను విని ధర్ముడు మొదలగు కర్మ సాక్షులనుద్ధేశించి భయముతో ఇట్లు పలికెను (17).


శ్రీ శివుడు ఇట్లు పలికెను -


దేవతలెవ్వరూ నా తేజస్సును దాచిపెట్టలేదు. కాని భగవంతుడగు, మహేశ్వరుడను, ప్రభుడను అగు నా అమోఘమగు తేజస్సు ఎవరో ఒకరు దాచి పెట్టినారనుట నిశ్చయము (18). మీరందరు సర్వకర్మలకు సర్వకాలములలో సాక్షులై యున్నారు. మీకు తెలియని దాపరికముండునా? కాన మీరు తెలుసుకున్న సత్యమును చెప్పుడు (19).


బ్రహ్మ ఇట్లు పలికెను -


ఈశ్వరుని మాటలు విని వారా సభలో వణికిపోయిరి. వారు ఒకరి నొకరు చూచుకొని ప్రభువు ఎదుట వరుసగా నిట్లు పలికిరి (20). కోపించిన శంకరుని అమోఘమైన తేజస్సారము భూతలముపై పడినది. నాకు అంతవరకు మాత్రమే తెలియునని నేను (బ్రహ్మ) చెప్పితిని (21).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 SRI SIVA MAHA PURANA - 593 🌹*

*✍️ J.L. SHASTRI*

*📚. Prasad Bharadwaj *


*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 04 🌴*


*🌻 Search for Kārttikeya and his conversation with Nandin - 2 🌻*


Viṣṇu said:—

12. Let those who have concealed your semen incur the sins of those who utter lies, of those who outrage the modesty of preceptor’s wife, and of those who are engaged in insulting the preceptor always.


Brahmā said:—

13. Let him who has concealed your semen anywhere in the holy centres of Bhārata be debarred from the privilege of serving or worshipping you.


The guardians of the quarters said:—

14. Let him who has concealed your semen suffer continuously from the pang as a result of that sinful action.[1]


The gods said:—

15. Let him who has concealed your semen incur the sin of that stupid person who does not fulfil the promise he himself has made.


The wives of the gods said:—

16. Let her who has concealed your semen be deprived of mother and kinsmen and incur the sin of those base women who hate their husband and carry on an affair with another man.


Brahmā said:—

11. On hearing the words of the gods, Śiva the lord of the gods threatened Dharma and others the cosmic witnesses of all activities.


Lord Śiva said:—

18. The infallible semen of mine, has not been concealed by the gods. By whom could it then have been concealed?


19. All of you are the witnesses of all actions always. Has it been concealed by you? Have you come to know of it? Please narrate.


20. On hearing the words of Śiva they nervously looked at one another and spoke before the lord one by one.


Brahmā said:—

21. The infallible semen of Śiva, infuriated at the intervention in the course of his sexual dalliance, fell on the ground. This was observed by me.


Continues....

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 212 / Osho Daily Meditations - 212 🌹*

*📚. ప్రసాద్ భరద్వాజ్*


*🍀 212. వివరించలేనిది 🍀*


*🕉. ఏదైనా నిజంగా జరిగినప్పుడు, అది ఎల్లప్పుడూ వివరించ లేనిదే. 🕉*

*ఏమీ జరగనప్పుడు, మీరు దాని గురించి చాలా మాట్లాడవచ్చు. కానీ ఎప్పుడు నిజంగా ఏదో జరుగుతుంది, అప్పుడు మాట్లాడటం దాదాపు అసాధ్యం. ఒకరు కేవలం నిస్సహాయంగా భావిస్తారు. ఏదైనా జరిగినప్పుడు మరియు ఏమి జరుగుతుందో మరియు ఏమి జరిగిందో చెప్పలేనప్పుడు, ఒకరు నష్టపోయినప్పుడు మరియు అన్ని ఉచ్చారణలను కోల్పోయిన క్షణాలు చాలా ధన్యమైనవి. అప్పుడు నిజంగా ఏదో జరిగింది!*

*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations - 212 🌹*

*📚. Prasad Bharadwaj*


*🍀 212. INEXPRESSIBLE 🍀*


*🕉. Whenever something really happens, it is always inexpressible. 🕉*

*When nothing happens, you can talk much about it. But when

something really happens, then to talk is almost impossible. One simply feels helpless. So blessed are the moments when something happens and one cannot say what is happening and what has happened, when one is at a loss and loses all articulateness. Then something has really happened!*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 385 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 385 - 2🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*మూల మంత్రము :*

*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*


*🍀 84. సద్యఃప్రసాదినీ విశ్వసాక్షిణీ సాక్షివర్జితా*

*షడంగదేవతాయుక్తా షాడ్గుణ్యపరిపూరితా ॥ 84 ॥ 🍀*


*🌻 385. ‘సాక్షివర్జితా' - 2🌻*


*దేవతల నందరిని గమనించువాడు ఇంద్రుడు. అతడు దేవతలను పాలించువాడు కూడ. అతడిని కూడ గమనించువారు సప్త ఋషులు, కుమారులు, నారదుడు, త్రిమూర్తులు. వారిని కూడ గమనించునది శ్రీమాత. శ్రీమాత నెవ్వరునూ గమనించలేరు. ఆమె వ్యూహము ఎవ్వరికినీ తెలియదు. ఆమె సంకల్పించిన వెనుక బ్రహ్మర్షులకు, బ్రహ్మాదులకు తెలియును. ఇక ఆమె గమనమును, వ్యూహమును తెలియుట ఎట్లు? తెలియబడదు. కావున ఆమెను ఎవ్వరునూ సాక్షీభూతులై చూడలేరు. చూచుట, తెలియుట వంటి ప్రజ్ఞలు కూడ ఆమె నుండి ఏర్పడినవే.*


*కనుక అంతుబట్టని తత్త్వము శ్రీమాత. ఆమెను చేరవచ్చును గానీ ఆమె సర్వత్వమును, ఈశ్వరత్వమును గమనించలేరు. ఆమె కన్న పై స్థితిలో గలవారికే అది సాధ్యము. అట్టి వారెవ్వరునూ సృష్టిలో లేరు. శ్రీకృష్ణ తత్త్వము కూడ ఇట్టిదే. శ్రీకృష్ణుని చర్యలను గాని, ఊహలను గాని తెలిసినవారు అప్పటికినీ ఇప్పటికినీ లేరు. శ్రీకృష్ణుని మూలము శ్రీ లలితయే. శ్రీ లలితయైననూ, శ్రీకృష్ణుడైననూ ఒక్కటియే. దేవర్షి యగు నారదుడు కూడ వారి లీలలను తెలిసినపుడు ఆనందభరితుడై ధ్యానము చేయుచు నర్తించును.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 385 - 2 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️. Acharya Ravi Sarma *

*📚. Prasad Bharadwaj*


*🌻 84. Sadyah prasadini vishvasakshini sakshivarjita

Shadanga devata yukta shadgunya paripurita ॥ 84 ॥ 🌻*


*🌻 385. Sākṣivarjitā साक्षिवर्जिता 🌻*


*But She is without witness. The existence of the Supreme form of the Brahman cannot be witnessed by anyone, as this form of the Brahman has no known source of origin. Another quality of the pure Brahman is referred here.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Comments


Post: Blog2 Post
bottom of page