1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 13, జూన్ 2022 సోమవారం, ఇందు వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 216 / Bhagavad-Gita - 216 - 5- 12 కర్మ యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 615 / Vishnu Sahasranama Contemplation - 615🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 294 / DAILY WISDOM - 294 🌹
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 194 🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 133 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. 13, June 2022 పంచాగము - Panchangam 🌹*
*శుభ సోమవారం, ఇందు వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*
*🍀. రుద్రనమక స్తోత్రం - 28 🍀*
*53. పారాయ పారవిందాయ నమస్తీక్ణేషవే నమః!*
*సుధన్వనే నమస్తుభ్యం స్వాయుధాయ నమోనమః!!*
*54. నమః స్రుత్యాయ పథ్యాయ నమః కాట్యాయ తే నమః!*
*నమో నీప్యాయ సోద్యాయ సరస్యాయ చ తే నమః!!*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : సత్సంగము వలన మానవుడు సంస్కరింపబడి సత్పురుషునిగా మారగలడు. - సద్గురు శ్రీరామశర్మ 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, జేష్ఠ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: శుక్ల చతుర్దశి 21:04:20 వరకు
తదుపరి పూర్ణిమ
నక్షత్రం: అనూరాధ 21:25:31 వరకు
తదుపరి జ్యేష్ఠ
యోగం: సిధ్ధ 13:42:10 వరకు
తదుపరి సద్య
కరణం: గార 10:45:42 వరకు
వర్జ్యం: 03:34:10 - 04:59:50
మరియు 26:20:52 - 27:45:24
దుర్ముహూర్తం: 12:42:26 - 13:35:04
మరియు 15:20:21 - 16:12:59
రాహు కాలం: 07:20:02 - 08:58:44
గుళిక కాలం: 13:54:49 - 15:33:30
యమ గండం: 10:37:25 - 12:16:07
అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:42
అమృత కాలం: 12:08:10 - 13:33:50
సూర్యోదయం: 05:41:21
సూర్యాస్తమయం: 18:50:53
చంద్రోదయం: 17:46:45
చంద్రాస్తమయం: 04:14:08
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
మానస యోగం - కార్య లాభం
21:25:31 వరకు తదుపరి పద్మ
యోగం - ఐశ్వర్య ప్రాప్తి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
#PanchangDaily
#DailyTeluguCalender
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 216 / Bhagavad-Gita - 216 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 12 🌴*
*12. యుక్త: కర్మఫలం త్యక్త్వా శాన్తిమాప్నోతి నైష్టికీమ్ |*
*అయుక్త: కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే ||*
🌷. తాత్పర్యం :
*స్థిరమైన భక్తిని కలిగినవాడు సర్వకర్మఫలములను నాకు అర్పించుటచే నిర్మలమైన శాంతిని పొందును. కాని భగవద్భావనము లేనివాడు మరియు తన కర్మఫలము యెడ ఆసక్తిని కలిగియున్నవాడును అగు మనుజుడు బద్ధుడగును.*
🌷. భాష్యము :
కృష్ణభక్తిరసభావితుడు మరియు దేహభావన యందున్నవాడు అనెడి ఇరువురి నడుమగల భేదమేమనగా మొదటివాడు కృష్ణునితో సదా కూడియుండగా, రెండవవాడు తన కర్మఫలము యెడ ఆసక్తుడై యుండును. కృష్ణుని యెడ ఆసక్తుడై యుండి కేవలము అతని కొరకే కర్మనొనరించువాడు నిక్కముగా ముక్తపురుషుడు. అట్టివాడు తన కర్మఫలముల యెడ ఎటువంటి చింతను కలిగియుండడు. ద్వైతభావనలో అనగా పరతత్త్వము యొక్క జ్ఞానరాహిత్యముతో కర్మనొనరించుటయే కర్మఫలముల యెడ చింతకు కారణమని శ్రీమధ్భాగవతము నందు వివరింపబడినది. దేవదేవుడైన శ్రీకృష్ణుడే ఆ పరతత్త్వము.
అట్టి శ్రీకృష్ణుని భక్తి యందు ద్వైతభావనము లేదు. సర్వము సర్వశుభకరుడైన శ్రీకృష్ణుని శక్తిఫలమే అయినందున కృష్ణపరకర్మలన్నియును ఆధ్యాత్మికతను సంతరించుకొని దివ్యములు మరియు భౌతికప్రభావరహితములును అయియున్నవి. కనుకనే కృష్ణభక్తిభావన యందు మనుజుడు పూర్ణశాంతితో నిండియుండును. కాని ఇంద్రియప్రీతి కొరకు లాభగణనలో మునిగినవాడు అట్టి శాంతిని పొందలేడు. అనగా కృష్ణునికి అన్యముగా వేరేదియును లేదనెడి అవగాహనయే శాంతికి మరియు అభయత్వమునకు ఆధారమై యున్నది. ఇదియే కృష్ణభక్తిరసభావన యందలి రహస్యము.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 216 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 5 - Karma Yoga - 12 🌴*
*12. yuktaḥ karma-phalaṁ tyaktvā śāntim āpnoti naiṣṭhikīm*
*ayuktaḥ kāma-kāreṇa phale sakto nibadhyate*
🌷 Translation :
*The steadily devoted soul attains unadulterated peace because he offers the result of all activities to Me; whereas a person who is not in union with the Divine, who is greedy for the fruits of his labor, becomes entangled.*
🌹 Purport :
The difference between a person in Kṛṣṇa consciousness and a person in bodily consciousness is that the former is attached to Kṛṣṇa whereas the latter is attached to the results of his activities. The person who is attached to Kṛṣṇa and works for Him only is certainly a liberated person, and he has no anxiety over the results of his work.
In the Bhāgavatam, the cause of anxiety over the result of an activity is explained as being one’s functioning in the conception of duality, that is, without knowledge of the Absolute Truth. Kṛṣṇa is the Supreme Absolute Truth, the Personality of Godhead. In Kṛṣṇa consciousness, there is no duality. All that exists is a product of Kṛṣṇa’s energy, and Kṛṣṇa is all good.
Therefore, activities in Kṛṣṇa consciousness are on the absolute plane; they are transcendental and have no material effect. One is therefore filled with peace in Kṛṣṇa consciousness. But one who is entangled in profit calculation for sense gratification cannot have that peace. This is the secret of Kṛṣṇa consciousness – realization that there is no existence besides Kṛṣṇa is the platform of peace and fearlessness.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://www.tumblr.com/blog/bhagavadgitawisdom
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 615 / Vishnu Sahasranama Contemplation - 615🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻 615. స్వక్షః, स्वक्षः, Svakṣaḥ🌻*
*ఓం స్వక్షాయ నమః | ॐ स्वक्षाय नमः | OM Svakṣāya namaḥ*
*శోభనే పుణ్డరీకాభే అక్షిణీస్తో హరేరితిః ।*
*స్వక్ష ఇత్యుచ్యతే విష్ణుర్వేదవిద్యావిశారదైః ॥*
*సుందరములును, పద్మముల వలె ప్రకాశించునవియగు అక్షులు అనగా కన్నులు గలవాడు గనుక ఆ విష్ణుదేవుడు స్వక్షః (సు + అక్షః) అని కీర్తించబడుతాడు.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 615🌹*
*📚. Prasad Bharadwaj*
*🌻615. Svakṣaḥ🌻*
*OM Svakṣāya namaḥ*
शोभने पुण्डरीकाभे अक्षिणीस्तो हरेरितिः ।
स्वक्ष इत्युच्यते विष्णुर्वेदविद्याविशारदैः ॥
*Śobhane puṇḍarīkābhe akṣiṇīsto hareritiḥ,*
*Svakṣa ityucyate viṣṇurvedavidyāviśāradaiḥ.*
*Since His eyes are auspicious and resemble Lotus flower, He has the divine name Svakṣaḥ (सु + अक्षः / Su + Akṣaḥ).*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
स्वक्षस्स्वङ्गश्शतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः ।विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्छिन्नसंशयः ॥ ६६ ॥
స్వక్షస్స్వఙ్గశ్శతానన్దో నన్దిర్జ్యోతిర్గణేశ్వరః ।విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్నసంశయః ॥ 66 ॥
Svakṣassvaṅgaśśatānando nandirjyotirgaṇeśvaraḥ,Vijitātmā vidheyātmā satkīrtiśchinnasaṃśayaḥ ॥ 66 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 294 / DAILY WISDOM - 294 🌹*
*🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻 20. తేనె మొదట్లోనే ప్రవహించడం ప్రారంభించదు 🌻*
*పేర్కొన్న అభ్యాసం మనస్సును దాని చివరి సాధన వైపు నెమ్మదిగా మళ్లించడం మరియు అన్ని అడ్డంకులను తగ్గించడం కోసం ఉద్దేశించ బడింది. చాలా తీవ్రతతో ఎదురయ్యే ఇబ్బందులు, అధిగమించ లేనివిగా , చాలా కాలం పాటు ఆ రూపంలో ఉంటూ, బహుశా వాటిని చేరుకోవడం అసాధ్యం మరియు అధిగమించడం కష్టం అనిపించేలా ఉంటాయి. ఆదిలోనే తేనె ప్రవహించదని యోగ సాధకులు మరియు పూర్వం సాధువులు మరియు ఋషులందరికీ అనుభవమే.*
*అభ్యాసం ప్రారంభంలోనే వెలుగు చూడలేరు. ఇది నల్లటి మేఘాలతో దట్టంగా కప్పబడిన చీకటి ఆకాశంలా ఉంటుంది. ఒక వ్యక్తి తన ముందు చూడగలిగేది లేదా దర్శించగలిగేది సమస్యలు, కష్టాలు, బాధలు లేదా వారు ఆశించే వాటికి వ్యతిరేకంగా జరగటం. ఇలాగే క్రమేపీ విషయాలు కనిపించేంత చెడ్డవి కావు అనే భావన తనలోపల నుంచి వస్తుంది. అనేక జన్మల నుండి తనలో పేరుకుపోయిన సంస్కారాలు మరియు కర్మల యొక్క మందపాటి పొర కారణంగా ఒక వ్యక్తి యొక్క కఠోర ప్రయత్నాల ఫలితంగా వచ్చే ఈ కష్టాలు మరియు బాధలు, వ్యక్తి యొక్క వ్యక్తిత్వం కర్మల మూట తప్ప మరొకటి కాదు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 294 🌹*
*🍀 📖 from The Study and Practice of Yoga 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*
*🌻 20. Honey does not Start Flowing in the Beginning Itself 🌻*
*The practice mentioned is for the purpose of directing the mind slowly towards its final achievement, and for the attenuation of all the obstacles. The difficulties that present themselves with great intensity, ostensibly as if they are insurmountable, will be there in that form for a long time, making it appear that perhaps they are impossible to approach and difficult to overcome. It is the experience of all students of yoga, and saints and sages of the past, that honey does not start flowing in the beginning itself. One cannot see the light of day at the very commencement of the practice.*
*It will be like a dark sky thickly covered with black clouds, and the only thing that one will be able to see or visualise in front of oneself are problems, difficulties, pains, and everything that is the opposite of what one is asking or aspiring for. It is not till very late in the day that a feeling comes within oneself that, after all, things are not so bad as they appear. These difficulties and pains that are consequent upon one's strenuous effort are due to the thick layer of samskaras and karmas which have been accumulated in oneself since many births. The very personality of the individual is nothing but a bundle of karmas.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 194 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. మనం నామవాచకాలకు అలవాటు పడిపోయాం. నది అంటాం, చెట్టు అంటాం. నది ప్రవహించేది, చెట్టు అనుక్షణం చిగురించేది. మార్పు తప్ప ఏదీ శాశ్వతం కాదు. జ్ఞానం మృత విషయం. తెలుసుకోవడం సజీవమైంది. 🍀*
*జ్ఞానం మృత విషయం. తెలుసుకోవడం సజీవమైంది. ప్రవహించేది. మన భాషలన్నీ కాలం చెల్లినవి. భవిష్యత్తులో ఎప్పుడో మనం కొత్త భాషల్ని ప్రవేశ పెట్టవచ్చు. ఆ కొత్త భాషల్ని విభిన్నవ్యక్తులు. వేరు వేరు ప్రయోజనాల కోసం, విభిన్న పరిస్థితుల్లో ఉపయోగించవచ్చు. మత దృష్టితో చూసినా, శాస్త్రీయ దృష్టితో చూసినా ఉనికిలో ఏదీ నిశ్చలం కాదు. ప్రతిదీ కదలికలో వుంటుంది. సాగుతూ వుంటుంది.*
*అందువల్ల జ్ఞానం అన్నమాట కన్న నేను తెలుసుకోవడం అంటాను. ప్రేమ అన్నమాట కన్న ప్రేమించడం అన్న మాటని యిష్టపడతాను. మనం నామవాచకాలకు అలవాటు పడిపోయాం. నది అంటాం, చెట్టు అంటాం. నది ప్రవహించేది, చెట్టు అనుక్షణం చిగురించేది. ఆ పదాలు వాటిని అందివ్వలేవు. పాత ఆకులు రాల్తాయి. కొత్త ఆకులు వస్తాయి. మార్పు తప్ప ఏదీ శాశ్వతం కాదు.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 133 🌹* *✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్* *సేకరణ : ప్రసాద్ భరద్వాజ* *🌻 101. శిశు పోషణ - 3 🌻* *పిల్లలకు రెండు విషయములు నేర్పుడు.* *2. పిల్లలు పెరుగు, పరిసరములు ప్రత్యేకముగ నుంచు కొనవలెను. పట్టణములలో నెరిగిన వారికన్న పల్లెలలో పెరుగు వారు బలవంతులగుదురు. (ప్రాణ పరముగ, చేతనపరముగ) పల్లెలలో పెరిగిన వారికున్న వనములలో పెరిగినవారు, మరింత పటిష్ట వంతులగుదురు.* *వనములలో విద్యాలయము లేర్పరచి మమకార పడక, చిన్నతనముననే ఆ విద్యాలయములకు పంపి సంస్కారవంతులగు ఉపాధ్యాయులచే విద్యలభ్యసింప చేసినచో తల్లిదండ్రులు తమ కర్తవ్యమును సక్రమముగ నిర్వర్తించిన వారగుదురు. లేనిచో గమ్యమును చేరు జీవులుగ కాక చర్విత చర్వణులై సంసార చక్రమున పడి జనన, మరణములకు లోబడు జీవులుగ నేర్పడుదురు.* *సశేషం.....* 🌹 🌹 🌹 🌹 🌹 #మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #ChaitanyaVijnanam #PrasadBhardwaj https://t.me/ChaitanyaVijnanam https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/maharshiwisdom/ www.facebook.com/groups/chaitanyavijnanam/ https://dailybhakthimessages.blogspot.com https://incarnation14.wordpress.com/ https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages https://chaitanyavijnanam.tumblr.com/ 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Comments