top of page
Writer's picturePrasad Bharadwaj

🍀 14 - AUGUST - 2022 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🍀

🌹 14 - AUGUST - 2022 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 14, ఆగస్టు 2022 ఆదివారం, భాను వాసరే Sunday 🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 247 / Bhagavad-Gita - 247 -6-14 ధ్యాన యోగము🌹

3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 646 / Vishnu Sahasranama Contemplation - 646 🌹

4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 325 / DAILY WISDOM - 325 🌹

5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 225 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹14, August 2022 పంచాగము - Panchangam 🌹*

*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*

*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*

*ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : Kajari Teej 🌻*


*🍀. శ్రీ సూర్య పంజర స్తోత్రం - 22 🍀*


మిత్రాయ నమః దక్షిణహస్తే మాం రక్షతు ।

రవయే నమః వామహస్తే మాం రక్షతు ।

సూర్యాయ నమః హృదయే మాం రక్షతు ।

భానవే నమః మూర్ధ్నిస్థానే మాం రక్షతు ।

ఖగాయ నమః దక్షిణపాదే మాం రక్షతు ।

పూష్ణే నమః వామపాదే మాం రక్షతు ।

హిరణ్యగర్భాయ నమః నాభిస్థానే మాం రక్షతు ।

మరీచయే నమః కణ్ఠస్థానే మాం రక్షతు ।


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : నీ తోటి వానిపై హింసా ప్రయోగం చేసే అధికారం నీకు లేదు. అది ఒక్క భగవానునికి మాత్రమే ఉన్నది. లేక, భగవానునిచే ఆదేశించబడిన వారి కున్నది. కాని, అలా ఆదేశించబడిన వారిలో నీ వొక్కడవని మాత్రం మూఢావేశ వశుడవై తలపోయబోకు.🍀*


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, శ్రావణ మాసం

దక్షిణాయణం, వర్ష ఋతువు

తిథి: కృష్ణ తదియ 22:37:38

వరకు తదుపరి కృష్ణ చవితి

నక్షత్రం: పూర్వాభద్రపద 21:57:02

వరకు తదుపరి ఉత్తరాభద్రపద

యోగం: సుకర్మ 25:37:25 వరకు

తదుపరి ధృతి

కరణం: వణిజ 11:44:36 వరకు

వర్జ్యం: 05:28:12 - 06:58:00

దుర్ముహూర్తం: 17:00:46 - 17:51:42

రాహు కాలం: 17:07:08 - 18:42:37

గుళిక కాలం: 15:31:39 - 17:07:08

యమ గండం: 12:20:40 - 13:56:10

అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:45

అమృత కాలం: 14:27:00 - 15:56:48

సూర్యోదయం: 05:58:44

సూర్యాస్తమయం: 18:42:37

చంద్రోదయం: 20:45:04

చంద్రాస్తమయం: 08:02:33

సూర్య సంచార రాశి: కర్కాటకం

చంద్ర సంచార రాశి: కుంభం

చర యోగం - దుర్వార్త శ్రవణం

21:57:02 వరకు తదుపరి స్థిర

యోగం - శుభాశుభ మిశ్రమ ఫలం


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. శ్రీమద్భగవద్గీత - 247 / Bhagavad-Gita as It is - 247🌹*

*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*

*📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 14 🌴*


*14. ప్రశాన్తాత్మా విగతభీర్భ్రహ్మచారివ్రతే స్థిత: |*

*మన: సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పర:*


🌷. తాత్పర్యం :

*ఆ విధముగా కలతనొందనటువంటి నియమిత మనస్సుతో, భయమును వీడి, బ్రహ్మచర్యమును పాటించుచు యోగియైనవాడు నన్నే హృదయమునందు ధ్యానించుచు నన్నే జీవితపరమగతిగా చేసికొనవలెను.*


🌷. భాష్యము :

యాజ్ఞవల్క్యమహర్షి రచించిన బ్రహ్మచర్య నియమములందు ఈ విషయములందు ఈ విషయమును గూర్చి ఇట్లు చెప్పబడినది.


కర్మణా మనసా వాచా సర్వావస్థాసు సర్వదా |

సర్వత్ర మైథునత్యాగో బ్రహ్మచర్యం పచక్షతే


“అన్ని సమయములలో, అన్ని పరిస్థితులలో, అన్ని ప్రదేశములలో మనసా, వాచా, కర్మణా మైథునభోగమును త్యజించుట కొరకే బ్రహ్మచర్యవ్రతము ఉద్దేశింపబడి యున్నది.” మైథునసుఖము అనుభవించుచునే సరియైన యోగాభ్యాసమును ఎవ్వరును చేయజాలరు. కనుకనే మైథునసుఖపు జ్ఞానముండని బాల్యము నుండియే బ్రహ్మచర్యము బోధింపబడును. ఐదేండ్ల సమయము నందే పిల్లలను గురుకులమునకు లేదా గురువు వద్దకు పంపినచో అతడు వారిని చక్కని బ్రహ్మచారులగు రీతిగా శిక్షణను ఒసగగలడు.


ధ్యానమార్గము, జ్ఞానమార్గము లేదా భక్తిమార్గము ఏదైనను సరియే అట్టి బ్రహ్మచర్యభ్యాసము లేనిదే ఎవ్వరును వారి యోగమునందు అభివృద్ధిని పొందలేరు. అయినను గృహస్థజీవన ధర్మమును చక్కగా పాటించుచు, కేవలము భార్యతోనే నియమబద్ధముగా సాంసారికసుఖమును కలిగియున్నవాడు సైతము బ్రహ్మచారిగా పిలువబడును. అట్టి నియమిత గృహస్థ బ్రహ్మచారలు భక్తిమార్గమునందు ఆమోదింపబడుదురు.


కాని జ్ఞానము మరియు ధ్యానమార్గ సంప్రదాయములు అట్టి గృహస్థ బ్రహ్మచారులను తమ యందు చేర్చుకొనుటకైనను అంగీకరింపవు. భగవద్గీత (2.59) యందు ఇదే విషయము ఇట్లు చెప్పబడినది.


విషయా వినివర్తన్తే నిరాహారస్య దేహిన: |

రసవర్ణం రసో(ప్యస్య పరం దృష్ట్వా నివర్తతే ||


ఇతరులు బలవంతముగా తమను ఇంద్రియభోగము నుండి నియమించు కొనుచుండగా భక్తులు తమ ఉన్నత రసాస్వాదన కారణముగా అప్రయత్నముగా ఇంద్రియభోగముల నుండి దూరులగుచున్నారు. భక్తులు తప్ప అన్యులకు ఆ దివ్యరసాస్వాదనపు జ్ఞానము ఏమాత్రము ఉండదు. సంపూర్ణముగా కృష్ణభక్తిభావన యందు నిలివనిదే ఎవ్వరును అభయత్వమును పొందలేరని “విగతభీ:” యను పదము సూచించుచున్నది.

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 24 🌹*

*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*

*📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 6 - Dhyana Yoga - 14 🌴*


*14.praśāntātmā vigata-bhīr brahmacāri-vrate sthitaḥ*

*manaḥ saṁyamya mac-citto yukta āsīta mat-paraḥ*


🌷 Translation :

*Thus, with an unagitated, subdued mind, devoid of fear, completely free from sex life, one should meditate upon Me within the heart and make Me the ultimate goal of life.*


🌹 Purport :

In the rules of celibacy written by the great sage Yājñavalkya it is said:


karmaṇā manasā vācā sarvāvasthāsu sarvadā

sarvatra maithuna-tyāgo brahmacaryaṁ pracakṣate


“The vow of brahmacarya is meant to help one completely abstain from sex indulgence in work, words and mind – at all times, under all circumstances and in all places.” No one can perform correct yoga practice through sex indulgence. Brahmacarya is taught, therefore, from childhood, when one has no knowledge of sex life. Children at the age of five are sent to the guru-kula, or the place of the spiritual master, and the master trains the young boys in the strict discipline of becoming brahmacārīs. Without such practice, no one can make advancement in any yoga, whether it be dhyāna, jñāna or bhakti.


One who, however, follows the rules and regulations of married life, having a sexual relationship only with his wife (and that also under regulation), is also called a brahmacārī. In the Bhagavad-gītā (2.59) it is said: viṣayā vinivartante nirāhārasya dehinaḥ

rasa-varjaṁ raso ’py asya paraṁ dṛṣṭvā nivartate


Whereas others are forced to restrain themselves from sense gratification, a devotee of the Lord automatically refrains because of superior taste. Other than the devotee, no one has any information of that superior taste.


Vigata-bhīḥ. One cannot be fearless unless one is fully in Kṛṣṇa consciousness. A conditioned soul is fearful due to his perverted memory, his forgetfulness of his eternal relationship with Kṛṣṇa.

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 646 / Vishnu Sahasranama Contemplation - 646🌹*


*🌻646. త్రిలోకాత్మా, त्रिलोकात्मा, Trilokātmā🌻*


*ఓం త్రిలోకాత్మనే నమః | ॐ त्रिलोकात्मने नमः | OM Trilokātmane namaḥ*


*త్రయాణామపి లోకానామన్తర్యామితయా హరిః ।*

*ఆత్మేతి వా త్రయో లోకా భిన్ద్యన్తే నైవ వస్తుతః ॥*

*ఇతి వోక్తస్త్రిలోకాత్మేత్యచ్యుతో విదుషాం వరైః ॥*


*ఎల్ల ప్రాణులకును అంతర్యామి రూపమున ఉన్నవాడు కావున మూడు లోకములకు దేహాంతర్వర్తి అయిన చైతన్యస్వరూపమైన ఆత్మ తానే. మూడు లోకములును ఎవని స్వరూపమో అట్టివాడు త్రిలోకాత్మా. ఏలయన లోక త్రయములు వాస్తవమున పరమాత్మ కంటె వేరుకావు గదా!*


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 646🌹*


*🌻646.Trilokātmā🌻*


*OM Trilokātmane namaḥ*


त्रयाणामपि लोकानामन्तर्यामितया हरिः ।

आत्मेति वा त्रयो लोका भिन्द्यन्ते नैव वस्तुतः ॥

इति वोक्तस्त्रिलोकात्मेत्यच्युतो विदुषां वरैः ॥


*Trayāṇāmapi lokānāmantaryāmitayā hariḥ,*

*Ātmeti vā trayo lokā bhindyante naiva vastutaḥ.*

*Iti voktastrilokātmetyacyuto viduṣāṃ varaiḥ.*


*He is the indwelling Antaryāmi of all being in all the three worlds, i.e., He is their Ātma or Soul. Or since the three worlds are not really different from Him, He is Trilokātmā.*


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

कालनेमिनिहा वीरश्शौरिश्शूरजनेश्वरः ।त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः ॥ ६९ ॥

కాలనేమినిహా వీరశ్శౌరిశ్శూరజనేశ్వరః ।త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ॥ 69 ॥

Kālaneminihā vīraśśauriśśūrajaneśvaraḥ,Trilokātmā trilokeśaḥ keśavaḥ keśihā hariḥ ॥ 69 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 325 / DAILY WISDOM - 325 🌹*

*🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀*

*✍️ .స్వామి కృష్ణానంద 📝. ప్రసాద్ భరద్వాజ*


*🌻 20. వ్యక్తిత్వం అనేది మానవ భావన 🌻*


*దేవుడు కూడా ఒక వ్యక్తి అవునా కాదా వ్యక్తి అనేది ప్రతి ఒక్క మతంలో ఉన్న చాలా ముఖ్యమైన ప్రశ్న. అన్ని మతాలు (జుడాయిజం, జొరాస్ట్రియనిజం, క్రిస్టియానిటీ మరియు ఇస్లాం) దేవుణ్ణి సర్వోన్నత వ్యక్తిగా పరిగణిస్తాయి. ఆయనను దాదాపు సర్వోన్నత తండ్రి భావనతో గుర్తిస్తాయి. “పరలోకంలో ఉన్న తండ్రీ, నీ నామం చేత మేము పరిశుద్ధబడుగాక,”—అదే ప్రార్థన. భగవంతుని యొక్క ఈ వర్ణనలన్నీ ఆయనను ఒక విశ్వవ్యాప్తమైన వ్యక్తిత్వమని సూచిస్తున్నాయి. కానీ వ్యక్తిత్వం అనేది మానవ భావన.*


*మనం వ్యక్తిత్వం గురించి మాట్లాడేటప్పుడు, మనం ఎల్లప్పుడూ మానవ వ్యక్తిత్వ గురించే ఆలోచిస్తాము. మనము సింహం లేదా ఏనుగు యొక్క వ్యక్తిత్వం గురించి ఆలోచించము. మన ఆలోచనలు మానవ జాతి ఆలోచనా సరళిని అనుసరించి ఉంటాయి. ఇప్పుడు, మనిషి ఆలోచనా విధానం ఒక్కటే ఉందా? మరో ఆలోచనా విధానమే లేదా? కప్ప కూడా ఆలోచిస్తుంది, సరీసృపాలు ఆలోచిస్తాయి, ఆవు, ఏనుగు ఆలోచిస్తుంది. వారి ఆలోచన తప్పు అని మీరు అనుకుంటున్నారా? భగవంతుడు ఈ విశ్వమంత పెద్ద మానవ రూపమని మనం సాధారణంగా అనుకుంటాము.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 DAILY WISDOM - 325 🌹*

*🍀 📖 from Your Questions Answered 🍀*

*📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj*


*🌻 20. Personality is a Human Concept 🌻*


*Whether God is a person or not is a fairly important question in the study of theologies everywhere, in all religions. All the Semitic religions (Judaism, Zoroastrianism, Christianity, and Islam) consider God as a Supreme Person, almost identifying Him with the concept of a Supreme Father. “Father in heaven, hallowed be Thy name,”—that is how the prayer goes. All these descriptions of God imply that He is a large inclusive universal personality. Personality is a human concept.*


*When we talk of personality, we always think of the pattern of human personality. We don't think of the personality of a lion, or an elephant. Our thoughts are conditioned by the human way of thinking. Now, is it true that the human way of thinking is the only way of thinking, and there is no other way? A frog also thinks, a reptile thinks, a cow thinks, an elephant thinks. Do you think that their thinking is wrong? We generally think that God is a huge human form, as big as this universe.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 225 🌹*

*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*


*🍀. అస్తిత్వం మన లోపలి నుండి అన్ని దిక్కులకు ప్రతిధ్వనిస్తుంది. మనం ఏది నాటితే అదే మొలకెత్తుతుంది. కానీ నువ్వు ఒక గింజను నాటినా అది వేల విత్తనాలుగా వికసిస్తుంది. 🍀*


*ప్రేమించిన వ్యక్తిని సమస్త అస్తిత్వం ప్రేమిస్తుంది. అస్తిత్వం మన లోపలి నుండి అన్ని దిక్కులకు ప్రతిధ్వనిస్తుంది. మనమొక అద్భుతమయిన పాట పాడితే అది వేలరెట్లు పరమాద్భుతంగా మనకేసి వస్తుంది. అది మన మీద వర్షిస్తుంది. మనం ఏది యిచ్చినా అది తిరిగి మన దగ్గరికే వస్తుంది.*


*మనుషులు ఎందుకు బాధల్లో వుంటారంటే వాళ్ళు యివ్వడానికి వెనకాడతారు. లోభితనం ప్రదర్శిస్తారు. ఇతరులకు వాళ్ళు బాధని పంచుతారు. మనం ఏది నాటితే అదే మొలకెత్తుతుంది. కానీ నువ్వు ఒక గింజను నాటినా అది వేల విత్తనాలుగా వికసిస్తుంది.*


*సశేషం ...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు #DailyMessages

Join and Share

Comments


Post: Blog2 Post
bottom of page