top of page
Writer's picturePrasad Bharadwaj

🍀 14 - NOVEMBER - 2022 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🍀

🌹🍀 14 - NOVEMBER - 2022 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🍀🌹

1) 🌹 14 - NOVEMBER - 2022 MONDAY, సోమవారం, ఇందు వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹 కపిల గీత - 89 / Kapila Gita - 89 🌹 సృష్టి తత్వము - 45

3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 128 / Agni Maha Purana - 128 🌹 🌻. అర్ఘ్యదాన-శల్యముల కథనము - 2 🌻

4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 263 / Osho Daily Meditations - 263 🌹 వెనక్కు వెళ్లడం - GOING BACK

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 412 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 412 - 1🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹14, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹*

*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*

*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : నెహ్రూ జయంతి, Nehru Jayanti🌻*


*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 7 🍀*


*11. దశబాహుస్త్వనిమిషో నీలకంఠ ఉమాపతిః |*

*విశ్వరూపః స్వయంశ్రేష్ఠో బలవీరోఽబలో గణః*

*12. గణకర్తా గణపతిర్దిగ్వాసాః కామ ఏవ చ |*

*మంత్రవిత్పరమోమంత్రః సర్వభావకరో హరః*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : ఆత్మ పరిశుద్ధికి ఉపాయం - నిన్ను పరిశుద్ధుని గావించే పని భగవానునికే వదలి వేస్తే నీలోని చెడునంతా లోలోపలనే ఆయన తుదకు హరించి వేస్తాడు. అలా కాకుండా ఆ కర్తవ్యం నీవే పైన వేసుకొంటే, బాహ్య ప్రవృత్తి యందు సైతం తప్పుదారులు త్రొక్కి దుఃఖాల పాలౌతావు. 🍀*


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు,

దక్షిణాయణం, కార్తీక మాసం

తిథి: కృష్ణ షష్టి 27:25:04 వరకు

తదుపరి కృష్ణ సప్తమి

నక్షత్రం: పునర్వసు 13:15:46 వరకు

తదుపరి పుష్యమి

యోగం: శుభ 23:42:26 వరకు

తదుపరి శుక్ల

కరణం: గార 14:07:56 వరకు

వర్జ్యం: 22:14:20 - 24:02:12

దుర్ముహూర్తం: 12:23:00 - 13:08:21

మరియు 14:39:02 - 15:24:23

రాహు కాలం: 07:45:15 - 09:10:16

గుళిక కాలం: 13:25:21 - 14:50:23

యమ గండం: 10:35:18 - 12:00:20

అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:22

అమృత కాలం: 10:33:18 - 12:21:06

సూర్యోదయం: 06:20:13

సూర్యాస్తమయం: 17:40:26

చంద్రోదయం: 22:30:37

చంద్రాస్తమయం: 11:15:40

సూర్య సంచార రాశి: తుల

చంద్ర సంచార రాశి: జెమిని

యోగాలు : ధూమ్ర యోగం - కార్యభంగం,

సొమ్ము నష్టం 13:15:46 వరకు

తదుపరి ధాత్రి యోగం - కార్య జయం


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. కపిల గీత - 89 / Kapila Gita - 89🌹*

*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*

*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 45 🌴*


*45. కరంభపూతిసౌరభ్యశాంతోగ్రామ్లాదిభిఃపృథక్|*

*ద్రవ్యావయవవైషమ్యాద్గంధ ఏకో విభిద్యతే॥*


*గంధము ఒకటేయైనను పరస్పరము కలిసియున్న ద్రవ్యభాగముల న్యూనాధిక్యమువలన అది మిశ్రితగంధమై దుర్గంధము, సుగంధము, మృదువు, తీవ్రము,పులుపు మొదలగు పలురీతులుగా రూపొందెను.*


*పూతి గంధం అంటే దుర్గంధం.*

*శాంతం - ప్రశాంతముగా ఉండేది.*

*ఉగ్ర గంధం - ఉదా: ఉల్లి వంటివి తరిగితే వచ్చే గంధము వలన కళ్ళు నీరు కారతాయి.*

*గ్రాంల - పులిస్తే వచ్చే గంధము. కరంభం - ఇది అన్ని గంధముల కలయిక.*

*అన్నము రెండు రోజులు ఉంచితే అందులోకి వేరే ద్రవ్యాలు వచ్చి చేరతాయి. నిప్పూ నీరుతోనే అన్నం వండుతాము. ఆ అన్నం సాయంత్రానికి మెత్తబడుతుంది, మర్నాటికి నీరు వస్తుంది, తరువాత వాసన వస్తుంది, ఆ తరువాత సాయంత్రానికి పురుగులు వస్తాయి. ఏ ద్రవ్యం యొక్క పదార్ధములు ఏ ఏ సమయాలలో ఏ మోతాదులలో కలవాలో కలిస్తే పదార్థమవుతుంది. ఉన్న గంధము ఒకటే గానీ, ఆయా ద్రవ్యముల అవయవాల వైషమ్యాలని బట్టి వేరుగా అనిపిస్తుంది. ఆశ్రయాన్ని బట్టి గంధం మారుతుంది గానీ, గంధము అన్నది ఒకటే.*


*సశేషం..*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Kapila Gita - 89 🌹*

*🍀 Conversation of Kapila and Devahuti 🍀*

*📚 Prasad Bharadwaj*


*🌴 2. Fundamental Principles of Material Nature - 45 🌴*


*45. karambha-pūti-saurabhya śāntogrāmlādibhiḥ pṛthak*

*dravyāvayava-vaiṣamyād gandha eko vibhidyate*


*Odor, although one, becomes many—as mixed, offensive, fragrant, mild, strong, acidic and so on—according to the proportions of associated substances.*


*Mixed smell is sometimes perceived in foodstuffs prepared from various ingredients, such as vegetables mixed with different kinds of spices and asafoetida. Bad odors are perceived in filthy places, good smells are perceived from camphor, menthol and similar other products, pungent smells are perceived from garlic and onions, and acidic smells are perceived from turmeric and similar sour substances. The original aroma is the odor emanating from the earth, and when it is mixed with different substances, this odor appears in different ways.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 128 / Agni Maha Purana - 128 🌹*

*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*

*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 40*


*🌻. అర్ఘ్యదాన-శల్యముల కథనము - 2🌻*


రెండు పదములపై నున్న పుష్పదంతుని కుశతృణములచేతమ, రెండు పదములపై నున్న వరుణుని పద్మముల చేతను, రెండు పదములపై నున్న అసురుని సురచేతను, ఒక పదముపై నున్న ఆదేశేషుని నేయి కలిపిన జలముచేతను. అర్ధపదముపై నున్న పాపమును యవాన్నముచేతను, అర్ధపదముపై నున్న రోగమును గంజిచేతను, ఒక పదముపై ఉన్న నాగమును నాగపుష్పము చేతను, రెండు పదములపై మన్న ముఖ్యుని భక్ష్యపదార్థముల చేతను, ఒక పదముపై నున్న భల్లాటుని పెసల అన్నముచేతమ, ఒక పదముపై ఉన్న సోముని తేనెతో కూడిన పాయసముచేతను, రెండు పదములపై నున్న ఋషిని శాలూకముచేతమ, ఒక పదముపై ఉన్న అదితిని లోపికచేతను, అర్థపదముపై నున్న దితిని పూరీలచేతను తృప్తిపరుపవలెమ.


ఈశాన్యదిశయం దున్న ఈశునికి క్రింద అర్ధపదముపై నున్న ఆవునిపాలచేతమ, క్రింద అర్ధపదముపై నున్న ఆపవత్సుని దధిచేతను తృప్తిపరుపవలెను. తూర్పున నాలుగు కోష్ఠములపై నున్న మరీచిని లడ్డూలచే తృప్తిపరుపవలెను. బ్రహ్మకు పై నున్న కోణమందు అర్ధపదముపై ఉన్న సావిత్రునకు రక్తపుష్పములు నివేదించవలెను. దాని క్రింద నున్న అర్ధకోణమునందున్న సవితకు కుశోదకము నాలుగు పదములపై ఉన్న వివస్వంతునకు రక్తచందనమును లీయవలెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Agni Maha Purana - 128 🌹*

*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *


*Chapter 40*

*🌻 The mode of making the respectful offering to the god - 2 🌻*


8. The (two) door-keepers Sugrīva and Puṣpadanta occupying two squares (are worshipped) with barley grains and a clump of grass respectively, and Varuṇa with lotus flowers in a square.


9. The asura (demon) in two squares (is propitiated) with wine, (the serpent) Śeṣa in a square with ghee and water, the sin in half a square with barley grains, the disease in half a square with maṇḍaka (a kind of baked flour).


10. The Nāga (serpent) (is worshipped) in a square with the nāga flowers and the chief serpent in two squares with edibles The Bhallāṭa (a kind of superhuman being) (is worshipped) in a single square with rice mixed with kidney-bean, and the moon (with the same offering) in the next square.


11. The sage placed in two squares (is worshipped) with honey, sweat gruel and nutmeg, Diti in a square with anointments and Aditi in one and a half squares.


12. Āpas (is propitiated) in a square below in the northeast with milk and cake and then Apavatsa remaining in a square below with curd.


13. Marīci (is propitiated) in four squares in the east with balls of sweet-meat and for (the god) Savitṛ, the red flowers (are placed) in the lower aṅgular square.


14. In the square below that, water along with kuśa grass is offered to Savitṛ, red sandal paste is offered to Aruṇa in four squares.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 263 / Osho Daily Meditations - 263 🌹*

*📚. ప్రసాద్ భరద్వాజ*


*🍀 263. వెనక్కు వెళ్లడం 🍀*


*🕉. వెనక్కు వెళ్లేది లేదు, వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ముందుకు వెళ్లాలి, వెనుకకు కాదు. 🕉*


*పధంలో ఉన్నవారు మళ్లీ మళ్లీ ఎలా వెనక్కి వెళ్లాలా అని ఆలోచిస్తారు. కానీ తిరిగి వెళ్ళే అవకాశం లేదు; తిరిగి వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. మీరు ముందుకు సాగాలి. మీరు మీ స్వంత కాంతిని పొందాలి; మరియు మీరు అది చేయగలరు. వెనక్కి వెళ్లే అవకాశం లేదు, ఒకవేళ ఉన్నా కూడా జరిగిన అదే అనుభవం మీకు సంతృప్తిని కలిగించదు. ఇది కేవలం పునరావృతం. కానీ మీకు అది సంతృప్తిని ఇవ్వదు: అనుభవ కొత్తదనంలోనే నిజమైన సంతృప్తి ఉంటుంది.*


*పునరావృత్త అనుభవం మీకు ఎలాంటి ఆనందాన్ని ఇవ్వదు. మీరు ఇలా అంటారు, 'ఇది నాకు తెలుసు-కానీ ఇంకా ఏమి ఉంది? అందులో కొత్తదనం ఏముంది?' మరియు ఇది మరి కొన్ని సార్లు పునరావృతమైతే, మీరు దానితో విసుగు చెందుతారు. అందువల్ల ఒకరు ముందుకు సాగాలి. ప్రతిరోజూ కొత్త అనుభవాలు ఉంటాయి. అస్తిత్వం చాలా శాశ్వతంగా కొత్తది, మీకు మళ్లీ అదే సంగ్రహావ లోకనం ఉండదు. ఇది చాలా కోట్ల కొలది అంశాలను కలిగి ఉంది, ప్రతి రోజు మీరు కొత్త దృష్టిని కలిగి ఉంటారు - కాబట్టి పాత వాటి గురించి ఎందుకు బాధపడాలి? అవసరం లేదు.*

*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations - 263 🌹*

*📚. Prasad Bharadwaj*


*🍀 263. GOING BACK 🍀*


*🕉. There is no going back, and there is no need to go back. You have to go forward, not back. 🕉*


*While On path, again and again you will think about how to go back. But there is no going back; there is no need to go back. You have to go forward. You have to attain your own light; and that can be done. There is no possibility of going back, and even if there were, the same experience wouldn't satisfy you anymore. It would just be a repetition it-- wouldn't give you the same thrill: The thrill was in the novelty of it.*


*Now the same experience is not going to give you any joy. You will say, "This I know-but what more is there? What is new in it?" And if it is repeated a few times, you will get bored with it. One has to go forward, and each day there are new experiences. Existence is so eternally new, that you never have the same glimpse again. It has so many millions of aspects that each day you can have a new vision--so why bother about the old? There is no need.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 412 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 412 - 1🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*


*🍀 89. శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా ।*

*అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా ॥ 89 ॥ 🍀*


*🌻 412. ‘శిష్టపూజితా' -1🌻*


*శిష్ఠులచే పూజింప బడునది శ్రీమాత అని అర్థము. సదాచార సంపన్నులైన శిష్టులచే పూజింపబడి శ్రీమాత వారి ననుగ్రహించుచూ నుండును. శిష్టాచారులు చేయు పూజలు శ్రీమాతకు చాల ప్రియము. ఆచారము లేక చేయు పూజలు దంబము గనుక శ్రీమాత సదాచారమునకు ప్రేరణ కలిగించునేగాని అంతకు మించి అనుగ్రహించుట యుండదు. అనాచారులను, డంబాచారులను చిత్రమైన రీతిలో శ్రీమాత ఉద్ధరించుచుండును. అందరూ తన సంతతియే గనుక శిష్టులకు రక్షణ, ఇతరులకు శిక్షణ యిచ్చుచుండును.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 412 - 1 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj*


*🌻 89. Shivapriya shivapara shishteshta shishta-pujita*

*Aprameya svaprakasha manovachamagochara ॥ 89 ॥ 🌻*


*🌻 412. 'Sishta Pujita' - 1🌻*


*It means Sri Mata who is worshiped by the righteous. Srimata, worshipped by the righteous, always blesses them. The worship done by the righteous devotees is very dear to Sri Mata. As the worship done by boastful people is not considered righteous, Srimata does not consider this as sincere worship but inspire them towards righteousness. Srimata uplifts the ungrateful and downtrodden in a peculiar way. As everyone is Her descendant, She protects the disciples and trains the others.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Comments


Post: Blog2 Post
bottom of page