🌹🍀 14 - OCTOBER - 2022 FRIDAY ALL MESSAGES శుక్రవారం, భృగు వాసర సందేశాలు 🍀🌹
🌹 14 - OCTOBER అక్టోబరు - 2022 FRIDAY శుక్రవారం, భృగు వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 270 / Bhagavad-Gita -270 - 6వ అధ్యాయము 37 ధ్యాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 669 / Vishnu Sahasranama Contemplation - 669 🌹
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 631 / Sri Siva Maha Purana - 631 🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 348 / DAILY WISDOM - 348 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 247 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹14, October అక్టోబరు 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : రోహిణి వ్రతం, Rohini Vrat🌻*
*🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -16 🍀*
*16. ఆద్యన్తరహితే వరవర్ణిని సర్వసేవ్యే సూక్ష్మాతి సూక్ష్మతర రూపిణి స్థూలరూపే ।*
*సౌన్దర్యలక్ష్మి మధుసూదన మోహనాఙ్గి శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : మానసిక శక్తులను సరాసరి విధ్వంస ప్రయోజనాలకు ఉపయోగించడం హేయం. తప్పకుండ అది తిరిగి ఆ ఉపయోగించిన వాని మీదికే అతి భయంకరంగా విరుచుకొని పడుతుంది. తనకు మానసిక శక్తులు కలవని తెలిసిన వానిలో మహోదాతమైన లోకశ్రేయోభిలాష దీపిస్తూ వుండడం అత్యంతావశ్యకం.🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, శరద్ ఋతువు,
దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం
తిథి: కృష్ణ పంచమి 28:54:38 వరకు
తదుపరి కృష్ణ షష్టి
నక్షత్రం: రోహిణి 20:48:54 వరకు
తదుపరి మృగశిర
యోగం: వ్యతీపాత 13:56:08 వరకు
తదుపరి వరియాన
కరణం: కౌలవ 16:00:17 వరకు
వర్జ్యం: 12:05:40 - 13:50:08
మరియు 26:59:56 - 28:46:12
దుర్ముహూర్తం: 08:30:03 - 09:17:08
మరియు 12:25:31 - 13:12:37
రాహు కాలం: 10:33:40 - 12:01:59
గుళిక కాలం: 07:37:04 - 09:05:22
యమ గండం: 14:58:35 - 16:26:53
అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:24
అమృత కాలం: 17:19:04 - 19:03:32
సూర్యోదయం: 06:08:46
సూర్యాస్తమయం: 17:55:12
చంద్రోదయం: 21:14:24
చంద్రాస్తమయం: 09:58:33
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: వృషభం
మిత్ర యోగం - మిత్ర లాభం
20:48:54 వరకు తదుపరి
మానస యోగం - కార్య లాభం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 270 / Bhagavad-Gita - 270 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 37 🌴*
*37. అర్జున ఉవాచ*
*అయతి: శ్రద్ధయోపేతో యోగాచ్చలితమానస: |*
*అప్రాప్య యోగసంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి ||*
🌷. తాత్పర్యం :
*అర్జునుడు పలికెను : ఓ కృష్ణా! తొలుత ఆత్మానుభవ విధానము శ్రద్ధతో అనుసరించి, పిదప లౌకికభావన కారణముగా దానిని త్యజించి, యోగమునందు పూర్ణత్వమును పొందలేని విఫలయోగి గమ్యమెట్టిది?*
🌷. భాష్యము :
ఆత్మానుభావము (యోగము) పొందు మార్గము భగవద్గీత యందు వివరింపబడినది. జీవుడు వాస్తవమునాకు పాంచభౌతికదేహము గాక దానికి అతీతుడైన వాడనియు మరియు సత్, చిత్, ఆనందమందే అతనికి నిజమైన ఆనందము కలదనియు తెలిపెడి జ్ఞానము ఆత్మానుభావము యొక్క మూలసిద్ధాంతమై యున్నది. ఇట్టి నిత్యజీవనము, జ్ఞానము మరియు ఆనందములనునవి(సత్, చిత్, ఆనందము) దేహము, మనస్సులకు అతీతమైన దివ్యలక్షణములు. ఇట్టి ఆత్మానుభవము జ్ఞానమార్గము ద్వారా, అష్టాంగయోగ మార్గము ద్వారా లేక భక్తిమార్గము ద్వారా పొందుటకు సాధ్యమగును. ఈ మార్గములన్నింటి యందును జీవుడు తన నిజస్థితిని, తనకు భగవానునితో గల సంబంధమును మరియు తనకు భగవానునితో గల సంబంధమును పున:స్థాపించి కృష్ణభక్తిభావన యందలి అత్యున్నత పూర్ణత్వస్థితిని బడయుటకు వలసిన కర్మలను ఎరుగవలసియున్నది. ఈ మూడుమార్గములలో దేనిని చేపట్టినను శీఘ్రముగనో లేక ఆలస్యముగనో తప్పక మనుజుడు దివ్యగమ్యమును చేరగలడు.
ఆధ్యాత్మిక మార్గమున కొద్ది యత్నమైనను ముక్తికి గొప్పగా దోహదము కాగలదని పలుకుచు శ్రీకృష్ణభగవానుడు ద్వితీయాధ్యాయమున ఈ విషయమును నిర్ధారించియున్నాడు. ఈ మూడుమార్గములలో భక్తియోగమార్గము భగవదనుభూతిని బడయుటకు ప్రత్యక్షమార్గమై యున్నందున ఈ యుగమునకు మిక్కిలి అనువైనదియై యున్నది. భగవానుడు గతమునందు తెలిపియున్న వచనమును తిరిగి నిర్దారించుకొనుట కొరకే అర్జునుడిచ్చట ఈ విధముగా ప్రశ్నించుచున్నాడు. మనుజుడు ఆత్మానుభవమార్గమును శ్రద్ధతో స్వీకరించినను జ్ఞానయోగవిధానము మరియు అష్టాంగయోగపద్ధతి ఈ కాలమున మిగుల కష్టతరవిధానములై యున్నవి. కనుకనే ఈ మార్గములందు పలుయత్నములు కావించినను బహుకారణముల చేత మనుజుడు విఫలత్వమునే బడయవచ్చును. మొట్టమొదటి విషయమేమన ఈ విధానము ననుసరించుట యందు మనుజుడు అత్యంత శ్రద్ధ యుండదు.
అంతియేగాక ఆధ్యాత్మికమార్గమును చేపట్టుట యనగా దాదాపు మాయపై యుద్ధము ప్రకటించు వంటిది. కనుక ఎవ్వరైనను అట్లు యత్నించుగనే మాయ వివిధములైన ఆకర్షణలచే సాధకుని జయింప యత్నించుచుండును. వాస్తవమునకు బద్ధజీవుడు మయాగుణములచే ప్రభావితుడైనట్టివాడే గనుక ఆధ్యాత్మిక కలాపములందున్న తిరిగి ఆ గుణములచే మోహింపబడుటకు అవకాశము కలదు. ఇదియే ఆధ్యాత్మికమార్గము నుండి పతనము నొందుట యనబడును. యోగాచ్చలిత మానస: . ఆ విధముగా ఆత్మానుభవమార్గము నుండి వైదొలగుట వలన కలిగెడి ఫలితములను తెలిసికొనుట అర్జునుడు కుతూహలపడుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 270 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 6 - Dhyana Yoga - 37 🌴*
*37. arjuna uvāca*
*ayatiḥ śraddhayopeto yogāc calita-mānasaḥ*
*aprāpya yoga-saṁsiddhiṁ kāṁ gatiṁ kṛṣṇa gacchati*
🌷 Translation :
*Arjuna said: O Kṛṣṇa, what is the destination of the unsuccessful transcendentalist, who in the beginning takes to the process of self-realization with faith but who later desists due to worldly-mindedness and thus does not attain perfection in mysticism?*
🌹 Purport :
The path of self-realization or mysticism is described in the Bhagavad-gītā. The basic principle of self-realization is knowledge that the living entity is not this material body but that he is different from it and that his happiness is in eternal life, bliss and knowledge. These are transcendental, beyond both body and mind. Self-realization is sought by the path of knowledge, by the practice of the eightfold system or by bhakti-yoga.
In each of these processes one has to realize the constitutional position of the living entity, his relationship with God, and the activities whereby he can reestablish the lost link and achieve the highest perfectional stage of Kṛṣṇa consciousness. Following any of the above-mentioned three methods, one is sure to reach the supreme goal sooner or later. This was asserted by the Lord in the Second Chapter: even a little endeavor on the transcendental path offers a great hope for deliverance. Out of these three methods, the path of bhakti-yoga is especially suitable for this age because it is the most direct method of God realization.
🌹 🌹🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 669 / Vishnu Sahasranama Contemplation - 669🌹*
*🌻669. బ్రాహ్మజ్ఞః, ब्राह्मज्ञः, Brāhmajñaḥ🌻*
*ఓం బ్రహ్మజ్ఞాయ నమః | ॐ ब्रह्मज्ञाय नमः | OM Brahmajñāya namaḥ*
*వేదానయం స్వాత్మ భూతాన్ విష్ణుర్జానాతి యత్తతః ।*
*బ్రహ్మజ్ఞః ఇతి విద్వద్భిః ప్రోచ్యతే పరమేశ్వరః ॥*
*తన స్వరూపమేయగు వేదములను సమగ్రముగా ఎరిగి యుండు వాడు విష్ణుదేవుడు. వేద ప్రతిపాద్య తత్త్వమునే స్వస్వరూపముగా ఎరిగిన వాడు గనుక ఆ పరమేశ్వరుడు బ్రహ్మజ్ఞః అని చెప్పబడును.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 669🌹*
*🌻669. Brāhmajñaḥ🌻*
*OM Brahmajñāya namaḥ*
वेदानयं स्वात्म भूतान् विष्णुर्जानाति यत्ततः ।
ब्रह्मज्ञः इति विद्वद्भिः प्रोच्यते परमेश्वरः ॥
*Vedānayaṃ svātma bhūtān viṣṇurjānāti yattataḥ,*
*Brahmajñaḥ iti vidvadbhiḥ procyate parameśvaraḥ.*
*Since Lord Viṣṇu knows the meaning of Vedas comprehensively and since the true essence of the Vedas is He Himself, the Lord is known as Brāhmajñaḥ.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ।ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः ॥ ७१ ॥
బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః ।బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ॥ 71 ॥
Brahmaṇyo brahmakrdbrahmā brahma brahmavivardhanaḥ,Brahmavidbrāhmaṇo brahmī brahmajño brāhmaṇapriyaḥ ॥ 71 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 631 / Sri Siva Maha Purana - 631 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 12 🌴*
*🌻. కార్తికేయ స్తుతి - 1 🌻*
బ్రహ్మ ఇట్లు పలికెను -
విష్ణువు మొదలగు దేవతలు మరియు ఇతరులు అందరు ఆనందముతో వెల్లి విరిసిన ముఖములు గలవారై తారకుడు సంహరింపబడుటను గాంచి భక్తితో శంకర తనయుని స్తుతించిరి (1).
దేవతలిట్లు పలికిరి -
కల్యాణ స్వరూపుడు, జగత్తునకు మంగళముల నిచ్చువాడు, విశ్వమునకు బంధువు, విశ్వమును సంకల్పించి సృష్ఠించువాడు అగు నీకు అనేక నమస్కారములగు గాక! (2) ఓ దేవా! రాక్షసశ్రేష్ఠుడగు తారకుని, బాణాసురుని సంహరించిన నీకు నమస్కారము. ఓ శంకర పుత్రా! ప్రలంబుని సంహరించిన, పవిత్ర స్వరూపుడవగు నీకు అనేక నమస్కారములు (3). ఓ అగ్ని పుత్రా! జగత్తుల సృష్టిస్థితిలయములకు కర్తవు నీవే. ప్రసన్నుడవు కమ్ము. ఓ శంభు పుత్రా! దీనబంధూ! నీవు ప్రపంచ రూపుడవై విస్తరించగా, ప్రాణులన్నియూ బింబరూపుడవగు నీకు ప్రతిబింబములైనవి (4).
స్వామీ! ప్రభూ! దేవతలను రక్షించు నీవు మమ్ములను సర్వదా రక్షింపుము. కరుణా నిధీ! దేవతల ప్రాణములను రక్షించిన వాడా! ప్రసన్నుడవు కమ్ము (5). ప్రభూ! పరమేశ్వరా! నీవు తారకాసురుని వాని పరివారముతో సహా సంహరించి దేవతల నందరినీ కష్టములనుండి గట్టెక్కించినావు (6).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ మునీ! విష్ణువు మొదలగు దేవతలు ఈ విధముగా స్తుతించగా, కుమార ప్రభుడు వారందరికీ క్రమముగా కొత్త వరములనిచ్చెను (7). ఆ శంకర పుత్రుడు స్తోత్రము చేయుచున్న పర్వతులను గాంచి మిక్కిలి ప్రసన్నుడై వారికి వరములనిచ్చి ఇట్లు పలికెను (8).
స్కందుడిట్లు పలికెను -
పర్వతులు అగు మీరందరు తపశ్శాలులకు పూజింప దగినవారు, కర్మిష్ఠులచే మరియు జ్ఞానులచే సేవింపదగినవారు కాగలరు (9). ఓ పర్వతులారా! నా వచనముచే మీరు శంభు లింగాకారమును పొందెదరు. సందేహము వలదు (10). నా మాతామహుడు,పర్వతరాజు అగు హిమవంతుడు మహాత్ముడై తపశ్శాలులకు ఫలముల నిచ్చువాడు కాగలడు (11).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 631🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 12 🌴*
*🌻 The story of Śiva and Pārvatī including that of Kārttikeya - 1 🌻*
Brahmā said:—
1. On seeing Tāraka killed, Viṣṇu and other gods, with faces refulgent with pleasure, eulogised Kārttikeya with devotion.
The gods said:—
2. Obeisance to you of good features, obeisance to you who confer auspiciousness on the universe, O kinsman of the universe, obeisance be to you. Obeisance to you, O purifier of the universe.
3. Obeisance to you, the slayer of the chief of the Asuras. O lord, obeisance to the slayer of the Asura Bāṇa. Obeisance to the destroyer of Pralamba. Obeisance to you of holy features. Obeisance to you, O son of Śiva.
4. You alone are the creator, sustainer and annihilator of the universe. You, born of firegod, be pleased. Your cosmic image is identical with the universe. O son of Śiva, kinsman of the distressed, be pleased.
5. O lord, protector of the gods, O lord, save us always. O merciful one, protector of gods, be pleased.
6. After killing the Asura Tāraka along with his followers, O great lord, the gods have been freed from adversities by you.
Brahmā said:—
7. O sage, thus eulogised by Viṣṇu and the other gods, lord Kumāra granted them fresh boons in order.
8. On seeing the mountains eulogising, the son of Śiva became very glad and spoke to them after granting boons.
Skanda said:—
9. All of you mountains will become worthy of being worshipped by the sages and resorted to by persons following the paths of action and knowledge.
10. O mountains, at my word you will be assuming the forms of phallic emblems, the special forms of Śiva. There is no doubt about it.
11. My maternal grandfather, the excellent mountain Himavat, will become the fortunate bestower of fruits to ascetics.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 348 / DAILY WISDOM - 348 🌹*
*🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀*
*📝. ప్రసాద్ భరద్వాజ్*
*🌻13. బహుశా విశ్వ సమాజం ఉంది🌻*
*ఒక వ్యక్తి పదార్థ ప్రపంచంలోకి ఎంత లోతుగా వెళ్తే, ఆకాశాన్ని అర్థం చేసుకోవడంలో మరింత ముందుకు వెళ్తే , ప్రకృతి యొక్క పనితీరు యొక్క అనేక రహస్యాలు గురించి అతను అంతర్దృష్టిని పొందుతాడు. ఈ రహస్యం ఏమిటంటే ఆకాశంలో బాహ్యంగా చెల్లాచెదురుగా కనిపించే భౌతిక పదార్థాల మధ్య ఉండే ఒక జీవ సంబంధం కనిపిస్తుంది. మన భూమి సూర్యుని చుట్టూ అనేక యుగాలుగా ఏదో పట్టాలపై తిరుగుతున్నట్లు అదే మార్గం అనుసరిస్తోంది. ఇది ఎలా జరుగుతుందో ఊహించడం సైతం అసాధ్యమైన పని. మనిషి భూమి వంటి వస్తువులను నిర్జీవమైనవిగా, ఆలోచించలేనివిగా, చూడడానికి కళ్ళు మరియు ఆలోచించే మనస్సులు లేనివిగా పరిగణిస్తాడు. కానీ ఈ గ్రహాల గమనంలోని ఖచ్చితత్వం అత్యుత్తమ గణిత కల్పనను కూడా అధిగమిస్తుంది.*
*బహుశా, ఇలాంటి ఖగోళ, భౌతిక వస్తువుల పనిచేసే విధానాన్ని పరిశీలించడం ద్వారా మాత్రమే గణిత వ్యవస్థను కనుగొని ఉంటాడు. అయితే, గణిత సంబంధమైన అంతర్ దృష్టికి సంబంధించి కాంత్ వంటి హేతువాదుల అభిప్రాయాన్ని మేము తిరస్కరించడం లేదు. మనస్సు యొక్క చర్య కూడా స్పష్టంగా కనిపించని చోట, అటువంటి ఖచ్చితత్వం ఎలా సాధ్యమవుతుందో వివరించలేము. మనిషి ఆలోచనా అలవాటు కారణంగా దీన్ని అర్థం చేసుకోవడం కష్టంగా ఉన్నప్పటికీ, బహుశా, చివరకు, నిర్జీవపదార్థాలుగా చెప్పబడే వాటి ఉనికిలో ఉండే ఖచ్చితత్వాన్ని ఒక మహాజ్ఞానానికి ఆపాదించవచ్చు. మనిషి తన స్వంత చిన్న మానవ సమాజాన్ని కలిగి ఉన్నట్లుగానే, బహుశా ఒక విశ్వ సమాజం ఉంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 348 🌹*
*🍀 📖 from The Philosophy of Religion 🍀*
*📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj*
*🌻13. There is, Perhaps, a Cosmic Society🌻*
*The deeper does one go into the world of matter, and the further does one move in the direction of space, the more is the insight one gains into the secret of the operation of nature, the secret being an organic relation among bodies, which appears to be outwardly scattered in space. It is humanly impossible to imagine how the Earth, for instance, can move along the same track which it was following for aeons up to this time, as if there is a set of rails laid down on its path in space. Man is used to thinking that things, like the planet Earth, are inorganic, inanimate, incapable of thought, without eyes to see and minds to think. But the precision with which bodies work surpasses even the best mathematical imagination.*
*Perhaps, man has invented the system of mathematics only on the observation of the way in which material bodies operate. We are not intending to refute the opinion of rationalists like Kant, however, in connection with the grounds of mathematical intuition. It cannot be explained how such a precision can be possible at all, where the action of the mind is not even apparent. Though this is difficult to understand because of man's habit of thinking, probably, finally, he will have to come round to attribute an intellect or a reason to what goes as inanimate existence. There is, perhaps a cosmic society, even as man has his own little small human society.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 247 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. విషాదం నింపుకున్న వాడెవడూ దేవుడి దగ్గరకి వెళ్ళినట్లు నేను వినలేదు. దేవుడి దగ్గరికి వెళ్ళే మార్గం ఆనంద మార్గం. కాబట్టి ఉత్సవం జరుపుకో, ఆనందించు, అప్పుడు నువ్వు అన్ని దిక్కుల్లోనూ దేవుణ్ణి చూస్తావు.🍀*
*వ్యక్తి ఆహ్లాదంగా మారినపుడు, వ్యక్తి ప్రేమగా మారినపుడు అపుడు ఎట్లాంటి ప్రార్ధన అవసరమూ వుండదు. వ్యక్తి అప్పటికే దైవత్వంలోకి ప్రవేశించి వుంటాడు. విషాదం నింపుకున్న వాడెవడూ దేవుడి దగ్గరకి వెళ్ళినట్లు నేను వినలేదు. దేవుడి దగ్గరికి వెళ్ళే మార్గం నాట్య మార్గం. కాబట్టి నాట్యం నేర్చుకో. పాడు, ఉత్సవం జరుపుకో, ఆనందించు, అప్పుడు నువ్వు అన్ని దిక్కుల్లోనూ దేవుణ్ణి చూస్తావు. అప్పుడు ప్రతి అనుభవమూ దైవత్వంతో నిండుతుంది.*
*సాధారణమయింది అసాధారణంగా మారడం మొదలు పెడుతుంది. ప్రాణం లేనివి ప్రాణవంత మవుతాయి. జీవితమంతా దైవత్వంతో నిండిపోతుంది. అంటే దేవుడు ఎక్కడో వున్నాడని కాదు. అన్ని దిశలూ వుంటాడు. నిన్ను చుట్టు ముట్టి వుంటాడు. నువ్వొక పవిత్ర భూమిపై నడుస్తూ వుంటావు. ప్రతి రాయి పవిత్ర వాక్యాల్ని ప్రవచిస్తుంది. ప్రతి వ్యక్తికీ నాట్యం చేసే హృదయం వుండాలి. అప్పుడే అది చూస్తుంది. అనుభూతిస్తుంది.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Comments