1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 15, జూన్ 2022 బుధవారం, సౌమ్య వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 217 / Bhagavad-Gita - 217 - 5- 13 కర్మ యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 616 / Vishnu Sahasranama Contemplation - 616🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 295 / DAILY WISDOM - 295 🌹
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 1945🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 134 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹.15 June 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌺. పండుగలు మరియు పర్వదినాలు : మిధున సంక్రాంతి, Mithuna Sankranti 🌺*
*🍀. నారాయణ కవచము - 8 🍀*
*13. జలేషు మాం రక్షతు మత్స్యమూర్తి-ర్యాదోగణేభ్యో వరుణస్య పాశాత్ |*
*స్థలేషు మాయావటువామనోఽవ్యా త్త్రివిక్రమః ఖేఽవతు విశ్వరూపః*
*14. దుర్గేష్వటవ్యాజిముఖాదిషు ప్రభుః పాయాన్నృసింహోఽసురయూథపారిః |*
*విముంచతో యస్య మహాట్టహాసం దిశో వినేదుర్న్యపతంశ్చ గర్భాః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : ఆధ్యాత్మిక శక్తి తాను స్పృశించే ప్రతి దానిని పరివర్తన చేస్తుంది. మన మనసులో ప్రవహించే ఆలోచనల పై మనలను యజమానిగా చేస్తుంది. సద్గురు శ్రీరామశర్మ. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, జేష్ఠ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: కృష్ణ పాడ్యమి 13:33:57 వరకు
తదుపరి కృష్ణ విదియ
నక్షత్రం: మూల 15:33:32 వరకు
తదుపరి పూర్వాషాఢ
యోగం: శుక్ల 25:15:44 వరకు
తదుపరి బ్రహ్మ
కరణం: కౌలవ 13:32:56 వరకు
వర్జ్యం: 01:33:00 - 02:57:00
మరియు 23:59:00 - 25:23:20
దుర్ముహూర్తం: 11:50:12 - 12:42:52
రాహు కాలం: 12:16:32 - 13:55:16
గుళిక కాలం: 10:37:48 - 12:16:32
యమ గండం: 07:20:20 - 08:59:04
అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:42
అమృత కాలం: 09:57:00 - 11:21:00
సూర్యోదయం: 05:41:37
సూర్యాస్తమయం: 18:51:28
చంద్రోదయం: 20:04:27
చంద్రాస్తమయం: 06:12:51
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
ధ్వజ యోగం - కార్య సిధ్ధి 15:33:32
వరకు తదుపరి శ్రీవత్స యోగం -
ధన లాభం , సర్వ సౌఖ్యం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
Join and Share
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 217 / Bhagavad-Gita - 217 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 13 🌴*
*13. సర్వకర్మాణి మనసా సన్న్యస్యాస్తే సుఖం వశీ |*
*నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్న కారయన్*
🌷. తాత్పర్యం :
*దేహమునందున్న జీవుడు తన స్వభావమును నియమించి మానసికముగా కర్మలన్నింటిని త్యజించినపుడు, కర్మను చేయక మరియు కర్మకు కారణము కాక నవద్వారపురము నందు(దేహములో) సుఖముగా వసించును.*
🌷. భాష్యము :
బద్ధజీవుడు నవద్వారములు గల పురమునందు నివసించును. దేహకర్మలు (దేహమనెడి పురము యొక్క కర్మలు) స్వాభావిక గుణము ననుసరించి వాటంతట అవే అప్రయత్నముగా నిర్వహింపబడును. దేహపరిస్థితుల ప్రభావమునకు లోనైయుండెడి జీవుడు ఒకవేళ తలచినచో వాటికి అతీతుడుగును కావచ్చును. జీవుడు తన ఉన్నతస్వభావమును మరచి దేహాత్మభావనను పొందుట వలననే దుఃఖము నొందుచున్నాడు.
కృష్ణభక్తిభావనలో అతడు తన సహజస్థితిని పునరిద్ధరించుకొని బంధము నుండి ముక్తుడు కాగలడు. కనుకనే కృష్ణభక్తిపరాయణుడైనంతనే మనుజుడు శీఘ్రముగా దేహపరకర్మల నుండి దూరుడగును. అటువంటి మారిన ప్రవృత్తులు కలిగిన నియమితజీవితము నందు అతడు నవద్వారపురములో సుఖుముగా జీవించును. నవద్వారములు ఈ క్రింది విధముగా తెలుపబడినవి.
నవద్వారే పురే దేహీ హంసో లీలాయతే బహి: |
వశీ సర్వస్య లోకస్య స్థావరస్య చరస్య చ
“జీవుని దేహమునందు నిలిచియుండెడి భగవానుడు విశ్వమునందలి సమస్తజీవులను నియమించువాడు. దేహము నవద్వారములను కలిగియుండును (రెండు కళ్ళు, రెండు నాసికారంధ్రములు, రెండు చెవులు, ఒకనోరు,మర్మావయము, గుదస్థానము). బద్ధస్థితిలో జీవుడు అట్టి దేహముతో తనను గుర్తించును. కాని హృదయస్థ పరమాత్మతో తనను అతడు గుర్తించినపుడు దేహమునందున్నపుడు భగవానుని వలె స్వతంత్రుడు కాగలదు (శ్వేతాశ్వతరోపనిషత్తు 3.18)”.
కనుకనే కృష్ణభక్తిరసభావనము నందున్నవాడు దేహము యొక్క అంతర్బాహ్య కర్మలన్నింటి నుండి స్వతంత్రుడై యుండును.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 217 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 5 - Karma Yoga - 13 🌴*
*13. sarva-karmāṇi manasā sannyasyāste sukhaṁ vaśī*
*nava-dvāre pure dehī naiva kurvan na kārayan*
🌷 Translation :
*When the embodied living being controls his nature and mentally renounces all actions, he resides happily in the city of nine gates [the material body], neither working nor causing work to be done.*
🌹 Purport :
The embodied soul lives in the city of nine gates. The activities of the body, or the figurative city of body, are conducted automatically by its particular modes of nature. The soul, although subjecting himself to the conditions of the body, can be beyond those conditions, if he so desires. Owing only to forgetfulness of his superior nature, he identifies with the material body, and therefore suffers.
By Kṛṣṇa consciousness, he can revive his real position and thus come out of his embodiment. Therefore, when one takes to Kṛṣṇa consciousness, one at once becomes completely aloof from bodily activities. In such a controlled life, in which his deliberations are changed, he lives happily within the city of nine gates. The nine gates are mentioned as follows:
nava-dvāre pure dehī haṁso lelāyate bahiḥ
vaśī sarvasya lokasya sthāvarasya carasya ca
“The Supreme Personality of Godhead, who is living within the body of a living entity, is the controller of all living entities all over the universe. The body consists of nine gates [two eyes, two nostrils, two ears, one mouth, the anus and the genitals]. The living entity in his conditioned stage identifies himself with the body, but when he identifies himself with the Lord within himself, he becomes just as free as the Lord, even while in the body.” (Śvetāśvatara Upaniṣad 3.18)
Therefore, a Kṛṣṇa conscious person is free from both the outer and inner activities of the material body.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 616 / Vishnu Sahasranama Contemplation - 616🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻616. స్వఙ్గః, स्वङ्गः, Svaṅgaḥ🌻*
*ఓం స్వాఙ్గాయ నమః | ॐ स्वाङ्गाय नमः | OM Svāṅgāya namaḥ*
స్వఙ్గః, स्वङ्गः, Svaṅgaḥ
*అఙ్గాని శోభనాన్యస్యేత్యచ్యుతః స్వఙ్గ ఉచ్యతే*
*సుందరమగు అంగములును, అవయవములు ఈతనికి గలవు కనుక అచ్యుతుడు స్వంగః. అంగము అనగా శరీరము అనియు అర్థము. సు + అంగః సుందరమగు శరీరము కలవాడనియు చెప్పవచ్చును.*
:: శ్రీమద్రామాయణే సున్దరకాణ్డే పఞ్చత్రింశస్సర్గః ::
విపులాంశో మహాబాహుః కమ్బుగ్రీవః శుభాననః ।
గూఢజత్రుస్సుతామ్రాక్షో రామో దేవి జనైః శ్రుతః ॥ 15 ॥
దున్దుభిస్వననిర్ఘోషః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ ।
సమస్సమవిభక్తాఙ్గో వర్ణం శ్యామం సమాశ్రితః ॥ 16 ॥
శ్రీరాముడు విశాలములైన భుజములు, దీర్ఘములైన బాహువులు, శంఖము వంటి కంఠము గలవాడు. శుభప్రదమైన ముఖము గలవాడు. కండరములతో మూసికొని పోయిన సంధి యెముక గలవాడు. మనోహరములైన ఎఱ్ఱని కన్నులు గలవాడు. లోకవిఖ్యాతుడు. అతడు దుందుభిధ్వని వలె గంభీరమైన కంఠ స్వరముగలవాడు. నిగనిగలాడు శరీరచ్ఛాయ గలవాడు. ప్రతాపశాలి. ఎక్కువ తక్కువలు లేకుండా పరిపుష్టములైన చక్కని అవయవములు గలవాడు. మేఘశ్యామ వర్ణ శోభితుడు.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 616🌹*
*📚. Prasad Bharadwaj*
*🌻616. Svaṅgaḥ🌻*
*OM Svāṅgāya namaḥ*
*अङ्गानि शोभनान्यस्येत्यच्युतः स्वङ्ग उच्यते / Aṅgāni śobhanānyasyetyacyutaḥ svaṅga ucyate*
*Since Lord Acyuta is with proportionate and beautiful body parts, He is called Svaṅgaḥ. Su + aṅgaḥ. Aṅgaḥ also can mean body. Hence Svaṅgaḥ can also mean the One with a beautiful body.*
:: श्रीमद्रामायणे सुन्दरकाण्डे पञ्चत्रिंशस्सर्गः ::
विपुलांशो महाबाहुः कम्बुग्रीवः शुभाननः ।
गूढजत्रुस्सुताम्राक्षो रामो देवि जनैः श्रुतः ॥ १५ ॥
दुन्दुभिस्वननिर्घोषः स्निग्धवर्णः प्रतापवान् ।
समस्समविभक्ताङ्गो वर्णं श्यामं समाश्रितः ॥ १६ ॥
Śrīmad Rāmāyaṇa - Book 5, Chapter 35
Vipulāṃśo mahābāhuḥ kambugrīvaḥ śubhānanaḥ,
Gūḍajatrussutāmrākṣo rāmo devi janaiḥ śrutaḥ. 15.
Dundubhisvananirghoṣaḥ snigdhavarṇaḥ pratāpavān,
Samassamavibhaktāṅgo varṇaṃ śyāmaṃ samāśritaḥ. 16.
*Rama is a broad shouldered and a long-armed man. He has a shell-like neck. He has a handsome countenance. He has a hidden collar-bone. He has beautiful red eyes. His fame is heard about by people. He has a voice like the sound of a kettle-drum. He has a shining skin. He is full of splendour. He is square-built. His limbs are built symmetrically. He is endowed with a dark-brown complexion.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
स्वक्षस्स्वङ्गश्शतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः ।विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्छिन्नसंशयः ॥ ६६ ॥
స్వక్షస్స్వఙ్గశ్శతానన్దో నన్దిర్జ్యోతిర్గణేశ్వరః ।విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్నసంశయః ॥ 66 ॥
Svakṣassvaṅgaśśatānando nandirjyotirgaṇeśvaraḥ,Vijitātmā vidheyātmā satkīrtiśchinnasaṃśayaḥ ॥ 66 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 295 / DAILY WISDOM - 295 🌹*
*🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻 21. సుదీర్ఘ సాధన ఒక్కటే పరిష్కారం 🌻*
*సుదీర్ఘ సాధన ఒక్కటే పరిష్కారం. ఈ కష్టాలు, సమస్యలు, బాధలు, సంస్కారాలు మరియు కోరికలను మన దగ్గర ఉన్న ఏ కవచం లేదా పరికరంతో ఎదుర్కోలేము. నిరంతర సాధన తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఈ కోరికలతో మనం చేస్తున్న ఒక రకమైన సత్యాగ్రహం అని మనం చెప్పుకోవచ్చు. అవి కూడా అంతే శక్తివంతులు కాబట్టి మనం వాటిని నేరుగా యుద్ధంలో ఎదుర్కోలేము. కానీ, అవి మళ్లీ తలలు చూపించే అవకాశం లేదన్నంత పట్టుదలతో ఉంటాం. ఒక వ్యక్తి తన లక్ష్యం వైపు పయనిస్తున్నాడనే భావన సంవత్సరాలు సాధన తర్వాత ప్రారంభమవుతుంది-నెలల తర్వాత కాదు.*
*జ్ఞానేశ్వర మహారాజ్, జనకుడు వంటివారు పూర్వ జన్మలలో ఈ అభ్యాసం చేసి మరియు జీవితంలో చిన్న వయసు లోనే నైపుణ్యం మరియు విజయానికి సంబంధించిన సంకేతాలను చూపించిన ఆత్మస్థైర్యం కలవారు. ఇతరులకు ఇది ఒక హింసలా కనిపిస్తుంది కానీ మన పంచకోశ శరీరాలను ప్రక్షాళన చేయడానికి ఇదే మార్గము. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ మరియు ఆనందమయ - ఈ ఐదు కోశాలు కోరిక యొక్క అభివ్యక్తి యొక్క వివిధ సాంద్రతలు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 295 🌹*
*🍀 📖 from The Study and Practice of Yoga 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*
*🌻 21. Long Practice is the Only Solution 🌻*
*Long practice is the only solution. These difficulties, problems, pains, samskaras and desires cannot be faced with any armour or apparatus that we have with us. There is no alternative except continued practice. This is a kind of satyagraha that we are doing with these desires, we may say. We cannot face them in battle directly because they too are equally powerful. But, we can be persistent to such an extent that there is no chance for them to show their heads again. The feeling that one is moving towards one's goal begins to rise within oneself after years and years of practice—not after months.*
*Of course there are masters, great heroes on the path, who must have done this practice in previous births, such as Jnaneshwara Maharaj, Janaka, and such great heroes of the spirit who showed signs of mastery and achievement early in life. For others it is a torture, but it is a necessary ordeal that one has to pass through for the sake of scrubbing out all the encrustations in the form of anything that goes to make up this personality of ours in all its five vestures. Annamaya, pranamaya, manomaya, vijnanamaya and anandamaya—all these five koshas are various densities of the manifestation of desire.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#నిత్యప్రజ్ఞాసందేశములు
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 195 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. ఎవరి హృదయాలు అద్భుతంతో నాట్యం చేస్తాయో ఎవరి అస్తిత్వం సంభ్రమంతో సంచలిస్తుందో దేవుడు వాళ్ళకు సన్నిహితంగా వుంటాడు. అస్తిత్వం అలుపు లేనిది. అద్భుతం నిరంతరం కొనసాగుతుంది. రహస్యం కొనసాగుతుంది. 🍀*
*జీవితాన్ని చూడ్డం మాత్రమే కాదు. జీవించాలి. అప్పుడు తెలుసు కోవడమన్నది సాగుతూ వుంటుంది. అది కొనసాగే ప్రక్రియ. అది అంతం లేని మహాప్రస్థానం. అక్కడున్న సౌందర్యమేమిటంటే అక్కడ అద్భుతం నిరంతరం కొనసాగుతుంది. రహస్యం కొనసాగుతుంది. మనం నిరంతం అక్కడ యింకా చాలా తెలుసుకోవాలని తెలుసుకుంటూ వుంటాం.*
*అస్తిత్వం అలుపు లేనిది. మనిషి ఎప్పటికీ పసివాడుగా మిగిలిపోతాడు. అద్భుతాల మధ్య, ఆశ్చర్యాల మధ్య వున్న పసివాడవుతాడు. దేవుడు రహస్యం. ఐతే ఎవరి హృదయాలు అద్భుతంతో నాట్యం చేస్తాయో ఎవరి అస్తిత్వం సంభ్రమంతో సంచలిస్తుందో దేవుడు వాళ్ళకు సన్నిహితంగా వుంటాడు.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#ఓషోబోధనలు #OshoDiscourse
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 134 🌹*
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻 102. బృందము - జీవము - 1 🌻*
*బృందములందు, స్త్రీలు, పురుషులు, పిల్లలు కలసిమెలసి మెలగవచ్చునా? లేక వారి మధ్య వ్యత్యాసము చూపవలెనా? తప్పక బృందమందు అందరును ఉండవచ్చును. కాని ప్రకృతి సిద్ధమగు కొన్ని వ్యత్యాసములు మన్నించుట శ్రేయస్కరము. ఒకే వృక్షమునకు వివిధమగు శాఖలున్నవి కదా! ఒక శాఖ తీరునకు మరియొక శాఖ తీరునకు వ్యత్యాసముండుట కూడ సహజమే అని గుర్తింపవలెను. వ్యత్యాసములతో కూడిన శాఖలతో ఒక వృక్షమున్నట్లే ఒక బృందమందు గల సభ్యుల మధ్య ఏకత్వమందు సహజమగు భిన్నత్వమును గుర్తించి మన్నింప వలెను.*
*పిల్లలు పిల్లలే, వారు పెద్దలు కారు. జీవ పరముగ పెద్దలే అయివుండవచ్చుగాని, దేహపరముగ, మానసిక పరముగ కారు. అట్లే పురుషులు పురుషులే. స్త్రీలు స్త్రీలే. పురుషులు, స్త్రీలు కాలేరు. స్త్రీలు, పురుషులు కాక సంఘమందు వృద్ధులుందురు. వారి జీవితానుభవము ఇతరులు తెలియవలసిన ఆవశ్యకత యున్నది. పెద్ద కొమ్మలు, చిన్న కొమ్మలు, రెమ్మలువలె వృద్ధులు, స్త్రీ పురుషులు, పిల్లలు కలసిన బృందమే అందము.*
*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #ChaitanyaVijnanam #PrasadBhardwaj
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Comments