top of page
Writer's picturePrasad Bharadwaj

🍀 15 - OCTOBER - 2022 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🍀

🌹🍀 15 - OCTOBER - 2022 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🍀🌹

1) 🌹 15 - OCTOBER - 2022 SATURDAY శనివారం, స్థిర వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹 కపిల గీత - 78 / Kapila Gita - 78 🌹 సృష్టి తత్వము - 34

3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 117 / Agni Maha Purana - 117 🌹 🌻. సర్వదేవ పవిత్రారోపణ విధి - 2🌻

4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 252 / Osho Daily Meditations - 252 🌹

5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 408 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 408 -1 🌹 ”శివంకరీ”- 1


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹15, October అక్టోబరు 2022 పంచాగము - Panchagam 🌹*

*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*

*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*

*ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*


*🍀. శ్రీ శని అష్టోత్తరశతనామ స్తోత్రం - 10 🍀*


*19. ధీరాయ దివ్యదేహాయ దీనార్తిహరణాయ చ*

*దైన్యనాశకరాయాఽర్యజనగణ్యాయ తే నమః*

*20. క్రూరాయ క్రూరచేష్టాయ కామక్రోధకరాయ చ*

*కళత్రపుత్రశత్రుత్వకారణాయ నమో నమః*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : ఏకలక్ష్యం పై ఏకాగ్రత - మానసికశక్తి ఉపయోగించ గోరేవాడు సరిపడని రెండు శుభముల నొకేసారి లక్షింపరాదు. ఏది ఘనతరమో, అపేక్షణీయమో దానినే ఎన్నిక చేసి, దానిపై మనస్సు నేకాగ్రం చెయ్యాలి. అప్పుడు దానికున్న ప్రతిరోధములన్నీ వాటంతటవే పటాపంచలై పోతాయి. పరస్పర విరుద్ధశయాలతో గజిబిజి కావడం సామాన్య లోక పద్ధతి. 🍀*


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు,

దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం

తిథి: కృష్ణ షష్టి 31:05:41 వరకు

తదుపరి కృష్ణ సప్తమి

నక్షత్రం: మృగశిర 23:23:20 వరకు

తదుపరి ఆర్ద్ర

యోగం: వరియాన 14:23:18 వరకు

తదుపరి పరిఘ

కరణం: గార 17:58:04 వరకు

వర్జ్యం: 02:59:56 - 04:46:12

దుర్ముహూర్తం: 07:43:04 - 08:30:06

రాహు కాలం: 09:05:22 - 10:33:33

గుళిక కాలం: 06:09:00 - 07:37:11

యమ గండం: 13:29:56 - 14:58:07

అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:24

అమృత కాలం: 13:37:32 - 15:23:48

సూర్యోదయం: 06:09:01

సూర్యాస్తమయం: 17:54:29

చంద్రోదయం: 22:03:24

చంద్రాస్తమయం: 10:52:57

సూర్య సంచార రాశి: కన్య

చంద్ర సంచార రాశి: వృషభం

వజ్ర యోగం - ఫల ప్రాప్తి 23:23:20

వరకు తదుపరి ముద్గర యోగం

- కలహం


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. కపిల గీత - 78 / Kapila Gita - 78🌹*

*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*

*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 34 🌴*


*34. భూతానాం ఛిద్రదాతృత్వం బహిరంతరమేవ చ|*

*ప్రాణేంద్రియాత్మధిష్ణ్యత్వం నభసో వృత్తిలక్షణమ్॥*


*ప్రాణులు ఉండుటకు అవకాశమును ఇచ్చుట, అందరి యందును (సకల ప్రాణుల యందును) లోపల, బయట గూడ వ్యాపించి యుండుట, అట్లే ప్రాణములకును, ఇంద్రియములకును, మనస్సునకును ఆశ్రయముగా ఉండుట. ఇవి ఆకాశము యొక్క వృత్తి (కార్యరూప) లక్షణములు.*


*సకల వస్తువులకూ ప్రాణులకూ అవకాశమిచ్చేది ఆకాశం. అన్ని లోకాలు, గోళాలు ఉన్నది ఆకాశములో. లోపలా వెలుపలా అను వ్యవహారమునకు మూలము ఆకాశం. గడప దాటితే ఇంటి వెలుపలా అంటాం. బయటా లోపలా అని దేన్ని బట్టి అంటున్నాం. పైన కప్పు ఉంటే దాన్ని లోపలా అంటాము, లేకపోతే దాని వెలుపలా అంటాము. ఈ "లోపలా" "వెలుపలా" అనే వ్యవహారానికి కూడా ఆకాశము మూలం.*

*ప్రాణానికి మూలం. హృదయాకాశం, దహరాకాశం. ఇంద్రియములు కూడా ఆకాశమే. కన్ను ముక్కు మొదైలైన రంధ్రాలు ఉన్నది కూడా ఆకాశములోనే.*


*సశేషం..*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Kapila Gita - 78 🌹*

*🍀 Conversation of Kapila and Devahuti 🍀*

*📚 Prasad Bharadwaj*


*🌴 2. Fundamental Principles of Material Nature - 34 🌴*


*34. bhūtānāṁ chidra-dātṛtvaṁ bahir antaram eva ca*

*prāṇendriyātma-dhiṣṇyatvaṁ nabhaso vṛtti-lakṣaṇam*


*The activities and characteristics of the ethereal element can be observed as accommodation for the room for the external and internal existences of all living entities, namely the field of activities of the vital air, the senses and the mind.*


*The mind, the senses and the vital force, or living entity, have forms, although they are not visible to the naked eye. Form rests in subtle existence in the sky, and internally it is perceived as the veins within the body and the circulation of the vital air. Externally there are invisible forms of sense objects. The production of the invisible sense objects is the external activity of the ethereal element, and the circulation of vital air and blood is its internal activity. That subtle forms exist in the ether has been proven by modern science by transmission of television, by which forms or photographs of one place are transmitted to another place by the action of the ethereal element. That is very nicely explained here. This verse is the potential basis of great scientific research work, for it explains how subtle forms are generated from the ethereal element, what their characteristics and actions are, and how the tangible elements, namely air, fire, water and earth, are manifested from the subtle form. Mental activities, or psychological actions of thinking, feeling and willing, are also activities on the platform of ethereal existence.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 117 / Agni Maha Purana - 117 🌹*

*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*

*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 37*


*🌻. సర్వదేవ పవిత్రారోపణ విధి - 2🌻*


ఓ! శక్తిదేవీ! నీకు నమస్కారము. ఈ పవిత్రము స్వీకరింపుము. పవిత్రము చేయు నను ఉద్దేశ్యముతే దీనిని ఇచ్చుచున్నాను. ఇది ఒక సంవత్సరము జరుగు పూజ ఫలము నిచ్చును".


"పవిత్రకమునందలి ఈ దారము నారాయణ-అనిరుద్ధమయ మైనది. ధన-ధాన్య-ఆయురారోగ్యముల నిచ్చునది. దీనిని నీకు సమర్పించుచున్నాను. ఈ శ్రేష్ఠమైన దారము ప్రద్యుమ్న - సంకర్షణమయ మైనది. విద్యా-దంతతి-సౌభాగ్యముల నిచ్చును. దీనిని మీకు సమర్పించుచున్నాను.


వాసుదేవమయ మగు ఈ సూత్రము ధర్మార్థకామమోక్షముల నిచ్చును. సంసారసాగరమును దాటుటకు ఇది ఉత్తమసాధనము. దీనిని మీ పాదములపై సమర్పించు చున్నాను. విశ్వరూపమయ మగు ఈ సూత్రము సర్వకామములను సఫలము చేయును. సమస్తపాపములను నశింపచేయును. కడచిన తరములవారిని, రాబోవు తరములవారిని కూడ ఉద్ధరించుచు. దీనిని మీకు సమర్పించుచున్నాను.


కనిష్ఠము, మధ్యమము, ఉత్తమము, పరమోత్తమము అని నాలుగు విధము లగు పవిత్రకములను, మంత్రోచ్చారణపూర్వకముగ క్రమానుసారముగ మునులు సమర్పించిరి".


అగ్ని మహాపురాణమునందు సర్వదేవతాపవిత్రారోపణ మను ముప్పదియేడవ అధ్యాయము సమాప్తము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Agni Maha Purana - 117 🌹*

*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *


*Chapter 37*

*🌻 The investiture of sacred thread for all gods - 2 🌻*



9. O goddess Śakti! Salutations to you. Accept this.article of worship which is capable of yielding fruits of annual worship for the sake of purification.


10-14. I dedicate unto you this excellent thread verily the same as (lord) Nārāyaṇa and (lord) Aniruddha and which is capable of yielding fruits of annual worship for the sake of purification and which yields wealth, grains and health.


I dedicate unto you this excellent thread verily the same as Kāmadeva and Saṅkarṣaṇa, which yields learning, progeny and welfare. I dedicate unto you this thread verily the same as Vāsudeva, which yields dharma, artha, kāma, and mokṣa and which is the cause for transport over the ocean of mundane existence.


This thread verily the universal form is the donor of all things, the destroyer of sins and elevates past and future lineage. I offer in order to the four younger deities with the mystic syllables.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 252 / Osho Daily Meditations - 252 🌹*

*📚. ప్రసాద్ భరద్వాజ*


*🍀 252. సాంగత్యం 🍀*


*🕉. మీ సాంగత్య అనుభవం యొక్క లోతు మీ అన్ని అనుభవాల లోతును నిర్ణయిస్తుంది. ఎవరైనా ఆ అనుభవంలోకి లోతుగా వెళ్లలేకపోతే, మరొక దానిలో ఎప్పటికీ లోతుగా వెళ్లలేరు, ఎందుకంటే ఇది అత్యంత ప్రాథమికమైనది, అత్యంత సహజమైన అనుభవం. 🕉*


*మీ జీవశాస్త్రం సాంగత్యం కోసం సిద్ధంగా ఉంది, మీరు దాని గురించి ఏమీ నేర్చుకోలేరు. మీరు సంగీతం నేర్చుకుంటే, అది అంతర్నిర్మితంగా ఉండదు; మీరు దానిని నేర్చుకోవాలి. మీరు కవిత్వం లేదా పెయింటింగ్ లేదా నృత్యం నేర్చుకుంటే, మీరు దానిని నేర్చుకోవాలి. లైంగికత అక్కడే ఉంది - స్క్రిప్ట్ ఇప్పటికే మీ జీవశాస్త్రంలో వ్రాయబడింది. కాబట్టి మీరు సాంగత్యంలో లోతుగా వెళ్లలేకపోతే, మీరు సంగీతంలోకి లోతుగా ఎలా వెళ్లగలరు మరియు మీరు డ్యాన్స్‌లోకి ఎలా వెళ్ళగలరు? ఇది చాలా సహజమైన విషయం. మీరు సాంగత్యంలో మిమ్మల్ని మీరు వెనుకకు తీసుకుంటే, మీరు డ్యాన్స్‌లో కూడా మిమ్మల్ని మీరు వెనక్కి తీసుకుంటారు. మీరు ఏ సంబంధానికి కూడా వెళ్లలేరు, ఎందుకంటే ఆ సంబంధం దగ్గరతనంగా మారుతుంది.*


*ప్రజలు చాలా భయపడ్డారు, మరియు ఆధునిక మనస్సు ముఖ్యంగా భయపడుతుంది, ఎందుకంటే చాలా విషయాలు తెలిసిపోయాయి మరియు జ్ఞానం మీకు లోతుగా వెళ్ళడానికి సహాయం చేయలేదు, అది మిమ్మల్ని భయపెట్టడానికి సహాయపడింది. మానవజాతి చరిత్రలో ఇంతకు ముందెన్నడూ మనిషి భయపడలేదు, కానీ ప్రతి మనిషి తాను తగినంత మనిషి అవుతాడో లేదో అని భయపడతాడు. స్త్రీకి భావప్రాప్తి కలుగుతుందో లేదోనని భయపడుతుంది. ఆమె ఉద్వేగం పొందలేకపోతే, లైంగిక చర్యలోకి వెళ్లకపోవడమే మంచిది, ఎందుకంటే అది చాలా అవమానకరమైనది, లేదా ఆమె నటించవలసి ఉంటుంది. మరియు పురుషుడు చాలా భయపడ్డాడు మరియు లోలోపల భయపడతాడు మరియు అతను ప్రపంచంలోనే గొప్ప వ్యక్తి అని స్త్రీకి నిరూపించగలడా అని లోపల వణుకుతున్నాడు. ఏమిటీ చెత్తంతా. ! కేవలం మీరుగా ఉంటే సరిపోతుంది.*

*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations - 252 🌹*

*📚. Prasad Bharadwaj*


*🍀 252. ASSOCIATION 🍀*


*🕉. The depth of your Intimate Association will decide the depth of all your experiences. If one cannot go deeply into the Intimate Association experience, then one can never go deeper into anything else, because it is the most fundamental, the most natural experience. 🕉*


*Your biology is ready for Intimate association, you are not expected to learn anything about it. If you learn music, it is not built in; you have to learn it. If you learn poetry or painting or dancing, you have to learn it. Association is just there-the script is already written in your biology. So if you cannot go deeply into Intimate association - which is such a natural thing-- how can you go deeply into music and how can you go deeply into dancing? If you hold yourself back in Intimate association, you will hold yourself back in dance too. You" will not be able to go into any relationship either, because the relationship tends to become Intimate association.


*People are so afraid, and the modern mind particularly becomes afraid, because so many things have become known, and the knowledge has not helped you to go deep, it has helped to make you afraid. Never before in humanity's history was the man afraid, but after Masters and Johnson every man is afraid of whether he will be man enough. The woman is afraid of whether she will be able to have an orgasm. If she cannot have an orgasm, it is better not to go into Intimate association at all, because then it is very humiliating, or she has to pretend. And the man is so afraid and nervous and trembling inside about whether he will be able to prove to the woman that he is the greatest man in the world. What nonsense! Just being yourself is enough.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 408 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 408 - 1🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*


*🍀 88. భక్తహార్ద తమోభేద భానుమద్-భానుసంతతిః ।*

*శివదూతీ, శివారాధ్యా, శివమూర్తి, శివంకరీ ॥ 88 ॥ 🍀*


*🌻 408. 'శివంకరీ”- 1 🌻*


*శుభములను, మంగళములను చేకూర్చునది మరియు భక్తుని శివునిగ చేయునది శ్రీమాత అని అర్థము. శుభములు గూర్చుట, తద్వారా జీవులను సంతుష్టులను చేసి క్రమముగ వారికి ఆరాధనా మార్గమున ఉన్నతి కలిగించుట, శివుని జేర్చుట, తద్వారా జీవుడు శివుడగుట- ఇట్టి సమస్త కార్యములను నిర్వర్తించునది శ్రీమాతయే. సంకల్పము శ్రీమాతయే గనుక జీవులకు శుభ సంకల్పములు కల్పించి తగు ప్రేరణ యిచ్చి, శక్తి బలముల నిచ్చి శివుని జేర్చువరకూ తోడ్పడును.*


*తల్లి బిడ్డను కని పోషించి పెంచి తండ్రి కప్పగించుట సంప్రదాయము. తండ్రి కుమారుని తన కార్యమున వినియోగించి స్థిరపరచును. ఇట్లు శ్రీమాత తానే సర్వస్వమునూ నిర్వర్తించును. ఇట్టి బాధ్యతా నిర్వహణము స్త్రీ రూపమున నిర్వర్తింపబడు చున్నది గాన మన సంప్రదాయమున స్త్రీ అత్యంత పూజనీయురాలైనది.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 408 - 1 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj*


*🌻 88. Bhaktahardhatamobheda bhanumadbanu santatih*

*Shivaduti shivaradhya shivamurti shivankari ॥ 88 ॥ 🌻*


*🌻 408. 'Shivankari”- 1 🌻*


*Shree Mata means the one who bestows auspiciousness and who makes the devotee to Lord Shiva. It is Sri Mata who performs auspicious things, thereby satisfying the living beings and gradually elevating them in the way of worship, worshiping Shiva, so that the living beings can come to Shiva and then become Shiva themselves- all these things are performed by Sri Mata.*


*As Sri Mata is the manifestation of will, she gives auspicious wills to the living beings, gives them proper inspiration, gives them energy and supports them till they reach Shiva. It is a tradition that the mother takes care of the child initially and then hands it over to the father. The father uses the son in his work and establishes him. Thus Srimata herself performs everything. This management of responsibility is performed in the form of a woman. That is why a woman is the most revered in our tradition.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Commentaires


Post: Blog2 Post
bottom of page