1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 16, శనివారం, జూలై 2022 స్థిర వాసరే Saturday 🌹
2) 🌹 కపిల గీత - 39 / Kapila Gita - 39 🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 79 / Agni Maha Purana - 79 🌹
4) 🌹. శివ మహా పురాణము - 595 / Siva Maha Purana - 595 🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 214 / Osho Daily Meditations - 214 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 386 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 386 - 2 🌹
🌹. స్వపిండప్రదానం 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹16, July 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : సంకష్ఠి చతుర్థి, కర్క సంక్రాంతి, Sankashti Chaturthi, Karka Sankranti🌻*
*🍀. శ్రీ శని స్తోత్రం (దశరథ కృతం) - 5 🍀*
*9. దేవాసురమనుష్యాశ్చ సిద్ధవిద్యాధరోరగాః |*
*త్వయావలోకితాస్సౌరే దైన్యమాశువ్రజంతితే*
*10. బ్రహ్మా శక్రోయమశ్చైవ మునయః సప్తతారకాః |*
*రాజ్యభ్రష్టాః పతంతీహ తవ దృష్ట్యాఽవలోకితః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : కర్మయోగ లక్ష్యం ఆయా కర్మల ఫలితాలను సాధించడం కాదు. - ఇచ్ఛా జ్ఞాన క్రియా రూపంలో అభివ్యక్తమయ్యే ఈశ్వరుని నిత్యానంద విభూతి యందు పాల్గొనడం. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, ఆషాడ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: కృష్ణ తదియ 13:28:31 వరకు
తదుపరి కృష్ణ చవితి
నక్షత్రం: ధనిష్ట 15:11:31 వరకు
తదుపరి శతభిషం
యోగం: ఆయుష్మాన్ 20:48:35 వరకు
తదుపరి సౌభాగ్య
కరణం: విష్టి 13:32:31 వరకు
వర్జ్యం: 21:51:12 - 23:20:08
దుర్ముహూర్తం: 07:34:39 - 08:26:54
రాహు కాలం: 09:06:06 - 10:44:05
గుళిక కాలం: 05:50:08 - 07:28:07
యమ గండం: 14:00:03 - 15:38:02
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:48
అమృత కాలం: 05:48:06 - 07:14:42
మరియు 30:44:48 - 32:13:44
సూర్యోదయం: 05:50:08
సూర్యాస్తమయం: 18:54:00
చంద్రోదయం: 21:30:42
చంద్రాస్తమయం: 08:19:52
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: కుంభం
వర్ధమాన యోగం - ఉత్తమ ఫలం
15:11:31 వరకు తదుపరి ఆనంద
యోగం - కార్య సిధ్ధి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 39-40 / Kapila Gita - 39 - 40🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
✍️. శ్రీమాన్ కందాడై రామానుజాచార్యులు
*📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴. 16. స్వచ్ఛమైన భక్తుల ఆధ్యాత్మిక సంపద - 3 🌴*
39. ఇమం లోకం తథైవాముమాత్మానముభయాయినమ్
*ఆత్మానమను యే చేహ యే రాయః పశవో గృహాః*
*40. విసృజ్య సర్వానన్యాంశ్చ మామేవం విశ్వతోముఖమ్*
*భజన్త్యనన్యయా భక్త్యా తాన్మృత్యోరతిపారయే*
*ఈ లోకమూ పరలోకమూ, ఈ శరీరం వెంట లభించే పశువులు భార్య పిల్లలూ సంపదలూ అన్నిటినీ విడిచిపెట్టి, అంతటా వ్యాపించి ఉన్న నన్ను అనన్యమైన భక్తితో సేవిస్తారు. అటువంటి వారిని నేనే దగ్గరుండి సంసారాన్ని దాటిస్తాను.*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 39, 40 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*
*🌴 16. The Pure Devotees' Spiritual Opulences - 3 🌴*
*39. imam lokam tathaivamum atmanam ubhayayinam*
*atmanam anu ye ceha ye rayah pasavo grhah*
*40. visrjya sarvan anyams ca mam evam visvato-mukham*
*bhajanty ananyaya bhaktya tan mrtyor atiparaye*
*Thus the devotee who worships Me, the all-pervading Lord of the universe, with unflinching devotional service, gives up all aspirations for promotion to heavenly planets or happiness in this world with wealth, children, cows, home or anything in relationship with the body. I take him to the other side of birth and death.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 79 / Agni Maha Purana - 79 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 27*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*🌻. దీక్షా విధి - 5 🌻*
గర్భాధానమును, జాతకర్మను, భోగమును, లయమును, ఆ అగ్నియందే ఎనిమిది హోమములు చేసి, పిమ్మట శుద్ధహోమము చేవలెను.
పండితుడు, జ్ఞానయోగముచేత ఆ పరమున పరమాత్మయందు విలీనముచేసి, బంధ విముక్తడై జీవుడు సుద్ధము, జ్ఞానస్వరూపము, నిర్వికారము, పరమానందరూపము అగు పరమాత్మయందు ఆనందము పొందు చున్నట్లు భావింపవలెను.
పిమ్మట పూర్ణాహుతి ఇవ్వవలెను. ఈ విధముగా దీక్ష పూర్తియగును.
దీక్షా-హోమ-విలయముల కుపయుక్తములగు ప్రయోగమంత్రములను చెప్పెదను. ''ఓం యం భూతాని విశుద్ధం హుం ఫట్'' అను మంత్రముచే తాడనమును, వియోజనమును చేయవలెను.
''ఓం యం భూతాన్యాపాతయే7హమ్'' అను మంత్రముచే ఆదానము చేయవలెను. ప్రకృతితో యోజనము చేయు మంత్రమును వినుము, 'ఓం యం భూతాని పుంశ్చాహో'' అనునది ప్రయోజన మంత్రము.
హోమ మంత్రమును, పిమ్మట పూర్ణాహుతి మంత్రమును చెప్పెను- ''ఓం భూతాని సంహర స్వాహా'' అనునది హోమమంత్రము ''ఓం శ్రీం ఓం నమోభగవతే వాసుదేవాయ వౌషట్'' అనునది పూర్ణాహుతి మంత్రము. పూర్ణాహుత్యనంతరము తత్త్వమునందు శిష్యుని సాధించవలెను. ఈ విధముగా బుధుడు క్రమముగ సర్వతత్త్వ సంశోధనము చేయవలెను.
నమః అనునది అంతమునందుగల ఆయా తత్త్వముల బీజములతో తాడనాది పూర్వకముగా తత్త్వసంశోధనము చేయవలెను. 'ఓం వాం కర్మేన్ద్రియాణి నమః' 'ఓం దేం బుద్ధీన్ద్రియాణి నమః' ఇత్యాది విధమున చేయవలెను. తాడనాది ప్రయోగము 'యం' బీజముతో చేసినట్లె చేయవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 79 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *
*Chapter 27*
*🌻 Mode of performing the initiation rite - 5 🌻*
44. After offering eight oblations each (in favour) of (Garbādhāna[7], Jātakarma[8], enjoyment and dissolution, he should offer them for purification.
45. The preceptor should take up pure materials and bring together the two excellent principles in order in such a way they are not broken.
46. Then the soul, freed from fetters is immersed in the supreme soul in the supreme undecaying position.
47. A learned person has to think of the peaceful, supreme, blissful, pure intellect and offer the completing oblation. Thus ends the (rite of) initiation.
48. I shall describe the mystic syllables for the application with which the oblation (relating to) the initiation is closely associated:
Oṃ, Yaṃ, the goblins, the pure huṃ, phaṭ. By this one should strike and separate the two.
49. Oṃ, Yaṃ, I destroy the goblins. After having seized this (syllable) (you) hear (the mode of) yoking it with the nature. Oṃ, aṃ, the goblins and the males. I shall describe the mystic syllable for the oblation as well as the final oblation.
50. Oṃ, destroy the goblins; oblations. Oṃ, aṃ, Oṃ, salutations to the Lord Vāsudeva, vauṣaṭ. After the final oblation the disciple has to be accomplished. In this way the wise man has to purify the principles.
51. Ending with (the word) salutation and with the basic syllable sva and preceded by beating (one has to say) Oṃ, vāṃ, the organs of action, Oṃ, deṃ, the organs of intellect (sense). With the syllable yam similar beating etc. are done.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 595 / Sri Siva Maha Purana - 595 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 04 🌴*
*🌻. కార్తికేయుని కొరకై అన్వేషణ - 4 🌻*
బ్రహ్మ ఇట్లు పలికెను -
త్రిపురారి యగు శివుడు వారి ఆ మాటలను విని ఆనందించి బ్రహ్మణులకు ప్రీతితో అనేక దక్షిణల నిచ్చెను (33). పుత్రుని వార్తను వినిన పార్వతి అంతరంగములో మిక్కిలి సంతసించి బ్రాహ్మణులకు కోటి రత్నములను, వివిధ ధనములను ఇచ్చెను (34). లక్ష్మి సరస్వతి, మేన, సావిత్రి, మరియు ఇతర దేవతా స్త్రీలు, విష్ణువు మొదలుగా గల సర్వ దేవతలు బ్రాహ్మణులకు ధనము నిచ్చిరి (35).
తరువాత దేవతలు, మునులు, పర్వతములు ప్రోత్సహించగా, ఆ ప్రభుడు తన పుత్రుడు ఉన్న చోటికి గణములను దూతలుగా పంపెను (36).
వీరభద్రుని, విశాలాక్షుని, శంకుకర్ణుని, కరాక్రముని, నందీశ్వరుని, మహాకాలుని, వజ్రదంష్ట్రుని, మహోన్మదుని (37), గోకర్ణాస్యుని, దధిముఖుని, అగ్ని జ్వాలలవలె ప్రకాశించు అక్ష క్షేత్ర పాలకులను, మూడు లక్షల భూతములను (38), రుద్రులను, శివునితో సమానమగు పరాక్రమము గల భైరవులను, వికృతరూపము గల ఇతరులను లెక్కలేనంత మందిని పంపెను.
ఓ నారదా! (39) అనేక శస్త్రాస్త్రములను చేతులయందు ధరించి గర్వించి యున్న ఆ శివదూతలు అందరు కృత్తికల భవనమును చుట్టు ముట్టిరి (40).
ఆ కృత్తికలు వారిని చూచి భయముతో కంగారుతో నిండిన మనస్సు గలవారై, బ్రహ్మ తేజస్సుతో వెలిగి పోవుచున్న కార్తికునితో చెప్పిరి (41).
కృత్తికలిట్లు పలికిరి -
కుమారా! లెక్క లేనన్ని సైన్యములు ఇంటిని చుట్టు ముట్టినవి. ఏమి చేయవలెను? ఎచటకు పోవలెను? గొప్ప భయము సంప్రాప్తమైనరది (42).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 595 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 04 🌴*
*🌻 Search for Kārttikeya and his conversation with Nandin - 4 🌻*
Brahmā said:—
33. On hearing their words, the destroyer of Pura[2] became glad. In his joy he gave monetary gifts to the brahmins.
34. On receiving the news of her son, Pārvatī was delighted. She distributed a crore of gems and much wealth among the brahmins.
35. Lakṣmī, Sarasvatī, Menā, Sāvitrī and all other women, Viṣṇu and all other gods gave much wealth to the brahmins.
36. Urged by the gods, sages and mountains, the lord sent his Gaṇas as his emissaries to the place where his son was staying.
37-39. O Nārada, he sent Vīrabhadra, Viśālākṣa, Śaṅkukarṇa, Parākrama, Nandīśvara, Mahākāla, Vajradaṃṣṭra, Mahonmada, Gokarṇāsya, Dadhimukha who was comparable to the blazing flame of fire, a hundred thousand Kṣetrapālas, three hundred thousand Bhūtas, Rudras, Bhairavas, and innumerable others of the same exploit as that of Śiva and of hideous features.
40. All the emissaries of Śiva went and haughtily encircled the abode of the Kṛttikās with various miraculous weapons in their hands.
41. On seeing them the Kṛttikās were extremely terrified. They spoke to Kārttikeya blazing with divine splendour.
Kṛttikās said:—
42. Dear boy, innumerable soldiers have encircled the house. What shall be done? Where are we to gc. A great danger has beset us.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 214 / Osho Daily Meditations - 214 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*
*🍀 214. పాత్ర 🍀*
*🕉. ఆత్మ ఉన్న వ్యక్తికి పాత్ర ఉండదు. 🕉*
*ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు. రేపు నువ్వు ఎవరో ఎవరికి తెలుసు? మీరు ఎవరు అవుతారో కూడా మీరు చెప్పలేరు, ఎందుకంటే రేపు అనేది ఏమి తెస్తుందో మీకు ఇంకా తెలియదు. కాబట్టి నిజంగా అప్రమత్తంగా ఉండే వ్యక్తులు ఎప్పుడూ ఏమీ వాగ్దానం చేయరు. ఎందుకంటే మీరు ఎలా వాగ్దానం చేస్తారు? 'నేను రేపు కూడా నిన్ను ప్రేమిస్తాను' అని మీరు ఎవరితోనైనా చెప్పలేరు, ఎందుకంటే ఎవరికి తెలుసు? నిజమైన అవగాహన మీకు అలాంటి వినయాన్ని ఇస్తుంది.*
*అప్పుడు మనం 'రేపటి గురించి నేను ఏమీ చెప్పలేను. చూద్దాం, రేపు రానివ్వండి అంటాం. నిన్ను ప్రేమిస్తానని నేను ఆశిస్తున్నాను, కానీ ఏమీ ఖచ్చితంగా లేదు.' అది అందమైన స్థితి. మీకు పాత్ర ఉంటే మీరు చాలా స్పష్టంగా ఉండవచ్చు, కానీ మీరు స్వేచ్ఛగా జీవించినప్పుడు అది మీకు మరియు ఇతరులకు కూడా చాలా గందరగోళంగా ఉంటుంది. కానీ ఈ గందరగోళానికి ఒక అందం ఉంది, ఎందుకంటే అది సజీవంగా ఉంటుంది, ఎల్లప్పుడూ కొత్త అవకాశాలతో ఉంటుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 214 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 214. CHARACTER 🍀*
*🕉. A person of soul has no character. 🕉*
*A person is an opening. Tomorrow who knows whom you will be? Even you cannot say who you will be, because you have not known tomorrow yet and what it brings. So people who are really alert never promise anything, because how can you promise? You cannot say to somebody, "I will love you tomorrow also," because who knows? Real awareness will give you such humbleness that you will say, "I cannot say anything about tomorrow. We will see.*
*Let tomorrow come. I hope that 1 will love you, but nothing is certain." And that is the beauty. If you have character you can be very clear, but when you live in freedom it can be very confusing to you, and to others also. But this confusion has a beauty in it because it is alive, throbbing always with new possibilities.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 386 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 386 - 2🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 84. సద్యఃప్రసాదినీ విశ్వసాక్షిణీ సాక్షివర్జితా*
*షడంగదేవతాయుక్తా షాడ్గుణ్యపరిపూరితా ॥ 84 ॥ 🍀*
*🌻 386. 'షడంగ దేవతాయుక్తా' - 2🌻*
*షడంగము లనగా వేదార్థమున తెలుపు ఆరు వేదాంగము లని కూడ అర్థ మున్నది. అవి వరుసగా 1. శిక్ష, 2. కల్పము, 3. జ్యోతిష్యము, 4. నిరుక్తము, 5. ఛందస్సు, 6. వ్యాకరణము. ఈ ఆరు శాస్త్రములు శ్రీమాత అధీనమున ఉన్నవి. ఆమె ఆరాధనమున నున్న వేదాంగములు ఆరింటిని అనుగ్రహ పూర్వకముగ తెలియనగును.*
*అట్టివారే మహాకవులగు కాళిదాసు, తెనాలి రామకృష్ణ కవి ఇత్యాదులు. ముందు తెలిపిన ఆరు అంగములను స్పృశించి మంత్రో పాసనము, స్తోత్ర పారాయణము చేయుట సదాచారము. దేహ మందలి ఆరు అంగములను అధిష్ఠించు దేవతలు యిట్లు పేర్కొనబడిరి. 1. సర్వజ్ఞత, 2. తృప్తి, 3. అనాది బోధ, 4. స్వతంత్రత, 5. అలుప్త శక్తి, 6. అనంతత. ఈ ఆరుగురు దేవతలు, ఆరు అంగములు, వారి నధిష్ఠించి యున్న శివ శక్తులను నిత్యము స్మరించుట శ్రేయోదాయకము.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 386 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 84. Sadyah prasadini vishvasakshini sakshivarjita
Shadanga devata yukta shadgunya paripurita ॥ 84 ॥ 🌻*
*🌻 386. षडङ्ग-देवदायुक्ता ṣaḍaṅga-devadāyuktā -2 🌻*
*Śiva has six types of known qualities and they are omniscience, completeness, supreme level of consciousness, freedom, everlasting power and infinity. These six are the qualities of the Brahman without attributes or prakāśa form of the Brahman. This nāma says that She is surrounded by these six aṅaga devatā-s. It is important to remember that She is described both as Brahman without attributes or the prakāśa form and as Brahman with attributes or the vimarśa form.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. స్వపిండప్రదానం 🌹*
➖➖➖✍️
*ఎవరికివారు బతికుండగానే పిండం పెట్టుకోవచ్చా?*
*దీనిపై శాస్త్రాభిప్రాయం ఏమిటో మీముందు ఉంచే ప్రయత్నమే ఈ వ్యాసం.*
*ఏ పని చేయవచ్చు ఏ పని చేయకూడదు అనే విషయంలో శాస్త్రమే మనకు ప్రమాణమని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత లో తెలియచేస్తూ ….*
*"తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ"*
అని { ౧౬అ - ౨౪శ్లోలో } పేర్కొనడం జరిగింది. దీనికి శంకర భగవత్పాదులు తమ గీతాభాష్యంలో ….
*"కర్మాధికారభూమి ప్రదర్శనార్థమ్"* - అని ఆశ్లోకంలోని "ఇహ" అనే పదాన్ని వివరించారు.
*అనగా ఏయే కర్మలు చేయడానికి అధికారమున్నదో తెలుసుకోవడానికి శాస్త్రమే మనకు దిక్కు అని చెప్పకనే చెప్పడం జరిగింది.*
*ఇదే విషయంలో కాశీలో కొన్ని దశాబ్దాల క్రితం పండితులమధ్య ఆసక్తికర చర్చలు జరిగాయి.*
*అనంతరం మహామహోపాధ్యాయ, ఆహితాగ్ని, కాశీహిందూవిశ్వవిద్యాలయం లోని ధర్మశాస్త్ర విభాగాధ్యక్షులు అయిన పం.ప్రభుదత్తజీ శాస్త్రి గారు "జీవచ్ఛ్రాద్ధ" పద్ధతి పేరుతో గ్రంథం కూడా రాయడం జరిగింది.*
*అనంతరం జీవచ్ఛ్రాద్ధపద్ధతి అందరికీ ఆమోదయోగ్యమైనదేనని మహామహోపాధ్యాయ పం. శివకుమారమిశ్రా గారు, జ్యోతిర్విద్వాంసులైన గణేశదత్త శాస్త్రి, ప్రియానాథ, గౌరీదత్త, కుబేర శర్మ గార్లు దీనికి ఉపాదేయత కల్పించడం జరిగింది.*
*ఇవన్నీ సరే, పెట్టవచ్చా, కూడదా?పెట్టవచ్చునంటే పెట్టుకున్నవారు ఎవరైనా ఉన్నారా? అని అడుగుతారేమో…*
*నిరభ్యంతరంగా జీవశ్రాద్ధము అందరూ చేసుకోవచ్చు.*
*ప్రయాగలోని "శ్రీ హరిరామగోపాలకృష్ణ సనాతనధర్మ సంస్కృత మహావిద్యాలయం" లోని రిటైర్డ్ ప్రిన్సిపాల్_ పండిత శ్రీ రామకృష్ణ శాస్త్రి గారు, కాశీలో తమకుతామే శ్రాద్ధం పెట్టుకున్నారు. చేయించినవారు "శ్రీజోషణ్ రామ్ జీ పాండేయ్" గారు.*
*జీవచ్ఛ్రాద్ధం పెట్టుకున్న రామకృష్ణ శాస్త్రి గారిని - ఆ విధానమంతా పుస్తకరూపంలో అందించమని గీతా ప్రెస్, గోరఖ్ పూర్ వారు అడగడం, ఆయన రాసి ఇవ్వడం, దానిని గీతాప్రెస్ వారు అచ్చువేయడంకూడా జరిగింది.*
*హేమాద్రి, వీరమిత్రోదయం లాంటి ధర్మశాస్త్ర గ్రంథాలు అయితే అలా పెట్టుకోమని ఆజ్ఞాపించాయి.*
*జీవన్నేవాత్మనః శ్రాద్ధంకుర్యాత్ అన్యేషుసత్స్వపి*
( హేమాద్రి - 1710పేజీ , వీరమిత్రో.శ్రాద్ధప్ర.363పేజీ)
*కొడుకులు ఉన్నవారు కూడా తమకు తాము శ్రాద్ధం పెట్టుకోవాలని దానర్థం.*
*లింగ పురాణం, ఆది పురాణం, ఆదిత్య పురాణం, బౌధాయనగృహ్యశేషసూత్రాలు, కృత్యకల్పతరు ఇత్యాది గ్రంథాలు కూడా ఈ శ్రాద్ధమును తెలిపాయి.*
*ఇక సందేహాలు - సమాధానాలు చూద్దాం........ *
*౧. అలా పెట్టుకున్నవారు లోకవ్యవహారాలకు పనికొస్తారా....?*
*సమాధానము 😘
*చక్కగా పనికి వస్తారు. పనికిరారనేది ఒక భ్రాంతి మాత్రమేనని పండితులు తెలియజేసారు. అదీగాక, లింగపురాణం అయితే, దంపతులు జీవచ్ఛ్రాద్ధం ఆచరించాక పిల్లలు కలిగితే, పిల్లవాడు బ్రహ్మవేత్త అవుతాడని, ఆడపిల్ల పుడితే సాక్షాత్తు పార్వతీదేవి వలె విలసిల్లుతుందని తెలియజేస్తోంది.*
*వారికి జాతకర్మాది సంస్కారాలను ఆ తల్లిదండ్రులు అందరివలెనే ఆచరించవచ్చునని కూడా లింగ పురాణం తెలిపింది.*
౨. *తాను పెట్టుకుంటే భార్య విధవ అయినట్లేనా....?*
*సమాధానం:- *
*ముందు భార్యకి చేసి, అనంతరం తాను చేసుకున్నట్లయితే ఆ శంక కూడా ఉండదు కదా!*
౩. *తనకి పెట్టుకునే శక్తి లేనట్లయితే, వేరే వారిచే పెట్టించవచ్చా....*
*సమాధానం :-*
*నిరభ్యంతరముగా పెట్టించవచ్చు.*
౪. *పెట్టుకున్న వారికి అశౌచాదులు ఉంటాయా....?*
*సమాధానం :-*
*అశౌచం, సూతకం ఉండవు. స్నానంతో శుద్ధి.*
౫. *ఎక్కడ పెట్టుకోవాలి...?*
*"పర్వతే వా నదీతీరే వనే వాయతనేऽపి వా*
*జీవచ్ఛ్రాద్ధం ప్రకర్తవ్యం మృత్యుకాలే ప్రయత్నతః"*
*అని లింగ పురాణ వచనం. అనగా పర్వతములయందు గానీ, నదీతీరమునందుగానీ, అడవియందుగానీ, ఇంటియందుగానీ ఈ జీవచ్ఛ్రాద్ధం ఆచరించాలి. *
౬. *అలా పెట్టుకున్నవారు ఇక చనిపోయినట్లే లెక్కా...*
*సమాధానం :- కాదు. ఆ భావన తప్పు. ఎందుకంటే వారికి శ్రాద్ధప్రక్రియ లో "ప్రేత" శబ్దం వాడ వద్దని, జీవ శబ్దమే వాడమని శ్రాద్దమయూఖము, శ్రాద్ధ పద్ధతి అనే గ్రంథాలు చెబుతున్నాయి.*
౭. *ఈ ప్రక్రియను గూర్చి సంక్షిప్త వివరణ*
*ఈ జీవచ్ఛ్రాద్ధపద్ధతి ని ఏ నెలలోనైనా కృష్ణద్వాదశి నాడు మొదలుపెట్టి శుక్లప్రతిపత్ నాటితో పూర్తి చేయాలి. మొత్తం ౫ రోజుల కార్యక్రమం ఇది. పరిశీలించండి....... *
*మొదటిరోజు : అధికారప్రాప్తికై ప్రాయశ్చిత్తానుష్ఠానము, దాని పూర్వాంగ,ఉత్తరాంగ కృత్యాలు, దశమహాదానాలు, అష్టమహాదానాలు, పంచధేనుదానము మొదలైనవి.*
*రెండవరోజు : సాలగ్రామ పూజ, జలధేనుస్థాపన-పూజ, వసురుద్రాదిత్యపార్వణశ్రాద్ధము , రాత్రి జాగరణ మొదలైనవి.*
*మూడవరోజు : పుత్తలనిర్మాణము , షట్పిండదీనములు, పుత్తలదాహము, దశగాత్రపిండదానము, శయనాదులు.*
*నాల్గవరోజు : మధ్యమషోడశీ, ఆద్యశ్రాద్ధము, శయ్యాదానం, వృషోత్సర్గం, వైతరణీగోదానం, ఉత్తమషోడశశ్రాద్ధము మొదలైనవి.*
*ఐదవరోజు : సపిండీకరణశ్రాద్ధము, అనంతరం గౌరీ-గణపతులకు పూజ, కలశ పూజ, శయ్యా-పద దానములు, బ్రాహ్మణభోజనాదులు.*
*అందువలన ఈ ప్రక్రియను అందరూ నిరభ్యంతరంగా ఆచరించుకొనవచ్చు.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Comments