🌹🍀 16 - OCTOBER - 2022 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🍀🌹
🌹 16 - OCTOBER అక్టోబరు - 2022 SUNDAY ఆదివారం, భాను వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 271 / Bhagavad-Gita -271 - 6వ అధ్యాయము 38 ధ్యాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 670 / Vishnu Sahasranama Contemplation - 670 🌹
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 632 / Sri Siva Maha Purana - 632 🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 349 / DAILY WISDOM - 349 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 248 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹16, October అక్టోబరు 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*
*🍀. ఆదిత్య స్తోత్రం - 06 🍀*
*6. ఆదిత్యం మణ్డలాన్తఃస్ఫురదరుణవపుస్తేజసా వ్యాప్తవిశ్వం*
*ప్రాతర్మధ్యాహ్నసాయం సమయ విభజనా దృగ్యజుస్సామ సేవ్యమ్ |*
*ప్రాప్యం చ ప్రాపకం చ ప్రథితమతిపథి జ్ఞానినాముత్తరస్మిన్*
*సాక్షాద్ బ్రహ్మేత్యుపాస్యం సకలభయ హరాభ్యుద్గమం సంశ్రయామి*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : మనం సాధించగోరే లక్ష్యం ఎంతెంతగా స్వార్థము నతిక్రమించగలిగితే మన మానసికశక్తి అంతంతగా పుంజీభవించుకొని విజృంభిస్తుంది. ప్రతిదినం ఒక నిర్ణీత సమయంలో ఒకే ఆలోచన చేసినప్పుడు, దాని నుండి ఉద్భూతమయ్యే శక్తి ఆ విషయంపై వారి ఏకాగ్రభావపు లోతు ననుసరించి నిశ్చయంగా అపారమే కాగలదు. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, దక్షిణాయణం,
శరద్ ఋతువు, అశ్వీయుజ మాసం
తిథి: కృష్ణ షష్టి 07:05:11 వరకు
తదుపరి కృష్ణ సప్తమి
నక్షత్రం: ఆర్ద్ర 26:15:54 వరకు
తదుపరి పునర్వసు
యోగం: పరిఘ 15:08:42 వరకు
తదుపరి శివ
కరణం: వణిజ 07:04:11 వరకు
వర్జ్యం: 08:46:33 - 10:34:05
దుర్ముహూర్తం: 16:19:52 - 17:06:50
రాహు కాలం: 16:25:44 - 17:53:48
గుళిక కాలం: 14:57:40 - 16:25:44
యమ గండం: 12:01:32 - 13:29:36
అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:24
అమృత కాలం: 15:02:55 - 16:50:27
మరియు 26:31:12 - 28:19:04
సూర్యోదయం: 06:09:15
సూర్యాస్తమయం: 17:53:48
చంద్రోదయం: 22:54:40
చంద్రాస్తమయం: 11:45:37
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: జెమిని
ధ్వాo క్ష యోగం - ధన నాశనం,
కార్య హాని 26:15:54 వరకు తదుపరి
ధ్వజ యోగం - కార్య సిధ్ధి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. శ్రీమద్భగవద్గీత - 271 / Bhagavad-Gita - 271 🌹
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 38 🌴*
*38. కచ్చిన్నోభయవిభ్రష్ట శ్చిన్నాభ్రమివ నశ్యతి |*
*అప్రతిష్టో మహాబాహా విమూడో బ్రహ్మణ: పథి ||*
🌷. తాత్పర్యం :
*ఓ మాహాబాహో శ్రీకృష్ణా! ఆధ్యాత్మికమార్గము నుండి వైదొలగిన అట్టి మనుజుడు ఆధ్యాత్మికజయము మరియు లౌకికజయమును రెండింటిని పొందినవాడై ఎచ్చోటను స్థానము లేకుండా గాలిచే చెదరిన మేఘము వలె నశింపడా?*
🌷. భాష్యము :
మానవాభ్యుదయమునకు రెండు మార్గములు గలవు. లౌకికులు ఆధ్యాత్మికత యందు అనురక్తి యుండదు. తత్కారణమున వారు ఆర్ధికాభివృద్ధి ద్వారా లౌకికపురోగతిని బడయుట యందు గాని, తగిన కర్మల ద్వారా ఉన్నతలోకములను చేరుట యందు గాని ప్రియమును కలిగియుందురు. కాని ఎవ్వరేని ఆధ్యాత్మికమార్గమును చేపట్టినచో అట్టి విషయకర్మల నుండి విరమణను పొంది, సర్వవిధములైన నామమాత్ర సుఖముల నన్నింటిని త్యజించవలసివచ్చును.
ఇట్టి స్థితిలో ఆధ్యాత్మిక మార్గమున పయనించువాడు తన యత్నములో విఫలమైనచో బాహ్యమునకు రెండువిధములా నష్టపోయినవాడగును. వేరుమాటలలో అతడు భౌతికసుఖమును అనుభవింపలేదు. అలాగుననే ఆధ్యాత్మికజయమును సైతము పొందలేడు. గాలి చేత చెదరగొట్టబడిన మేఘమువలె అతడు రెండింటి యందును స్థానము లేకుండును. కొన్నిమార్లు ఆకాశమున మేఘము ఒక చిన్న మేఘము నుండి విడివడి పెద్ద మేఘముతో కలియుచుండును. కాని ఆ ప్రయత్నములో అది విఫలమైనచో, గాలిచే చెదరగొట్టబడి అనంత ఆకాశములో జాడలేకుండా పోవును.
బ్రహ్మము, పరమాత్మ, భగవానుని ప్రకటమగు పరతత్త్వపు అంశరూపమున తాను నిజమునకు దివ్యుడనని జీవుడు ఎరుగగలిగే ఆత్మానుభవమార్గమే “బ్రహ్మణపథి:” యనబడును. శ్రీకృష్ణభగవానుడే ఆ పరతత్త్వము కనుక అతనికి శరణము నొందినవాడు కృతకృత్యుడైన ఆధ్యాత్మికుడు కాగలడు. కాని బ్రహ్మానుభవము మరియు పరతత్త్వానుభవము ద్వారా ఇట్టి జీవితలక్ష్యమును చేరగలుగుట బహుజన్మలు అవసరమగును (బహూనాం జన్మనామన్తే). కనుకనే ప్రత్యక్ష విధానమైన భక్తియోగమే (కృష్ణభక్తిరసభావనము) అత్యుత్తమ ఆధ్యాత్మికానుభవ మార్గమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 271 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 6 - Dhyana Yoga - 38 🌴*
*38. kaccin nobhaya-vibhraṣṭaś chinnābhram iva naśyati*
*apratiṣṭho mahā-bāho vimūḍho brahmaṇaḥ pathi*
🌷 Translation :
*O mighty-armed Kṛṣṇa, does not such a man, who is bewildered from the path of transcendence, fall away from both spiritual and material success and perish like a riven cloud, with no position in any sphere?*
🌹 Purport :
There are two ways to progress. Those who are materialists have no interest in transcendence; therefore they are more interested in material advancement by economic development, or in promotion to the higher planets by appropriate work. When one takes to the path of transcendence, one has to cease all material activities and sacrifice all forms of so-called material happiness. If the aspiring transcendentalist fails, then he apparently loses both ways; in other words, he can enjoy neither material happiness nor spiritual success. He has no position; he is like a riven cloud.
A cloud in the sky sometimes deviates from a small cloud and joins a big one. But if it cannot join a big one, then it is blown away by the wind and becomes a nonentity in the vast sky. The brahmaṇaḥ pathi is the path of transcendental realization through knowing oneself to be spiritual in essence, part and parcel of the Supreme Lord, who is manifested as Brahman, Paramātmā and Bhagavān. Lord Śrī Kṛṣṇa is the fullest manifestation of the Supreme Absolute Truth, and therefore one who is surrendered to the Supreme Person is a successful transcendentalist. To reach this goal of life through Brahman and Paramātmā realization takes many, many births (bahūnāṁ janmanām ante). Therefore the supermost path of transcendental realization is bhakti-yoga, or Kṛṣṇa consciousness, the direct method.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 670/ Vishnu Sahasranama Contemplation - 670🌹*
*🌻670. బ్రాహ్మణప్రియః, ब्राह्मणप्रियः, Brāhmaṇapriyaḥ🌻*
*ఓం బ్రాహ్మణప్రియాయ నమః | ॐ ब्राह्मणप्रियाय नमः | OM Brāhmaṇapriyāya namaḥ*
*బ్రాహ్మణానాం ప్రియో విష్ణుర్బ్రాహ్మణా అస్య వా ప్రియాః ।*
*బ్రాహ్మణప్రియ ఇత్యుక్తో విష్ణుర్విబుధసత్తమైః ॥*
*తత్పురుష సమాసముగా చూచినట్లయితే బ్రాహ్మణులకు ఇష్టుడు అని అర్థము. బహువ్రీహి సమాసముగా చూచినట్లయిన ఎవనికి బ్రాహ్మణులు ప్రీతి పాత్రులో అట్టివాడు బ్రాహ్మణప్రియః.*
దీకిని ఉపబలముగా భగవద్వచనము -
ఘ్నన్తం శపన్తం పురుషం వదన్తం । యో బ్రాహ్మణం న ప్రణమేద్ యథాఽర్హం । స పాపకృద్ బ్రహ్మదావాగ్నిదగ్ధో । వధ్యశ్చ దణ్డశ్చ న చాఽస్మదీయః ॥ '
*తనను చంపుచున్నవానిని, తిట్టుచున్నవానిని, తన విషయమున కఠిన వచనములు పలుకుచున్న వానిని ఐనను, బ్రాహ్మణుని ఆతని ఇతరములగు యోగ్యతల ననుసరించి తగిన విధమున నమస్కరించకుండునో అట్టి పాపకారి మనుజుడు బ్రహ్మ దావాగ్నిచే దహించబడువాడును, వధ్యుడును, దండ్యుడును అగును. అంతియకాదు - వాడు నావాడు కాడు' అని యున్నది.*
మహాభారతమునందలి భీష్మవచనమున పరమాత్మునకు బ్రాహ్మణులయందుగల ప్రీతి నిరూపించడినది.
:: శ్రీమహాభారతే శాన్తిపర్వణి సప్తచత్వారింశోఽధ్యాయః ::
యం దేవం దేవకీ దేవీ వసుదేవాదజీజనత్ ।
భౌమస్య బ్రహ్మణో గుప్త్యై దీప్తమగ్నిమివారణిః ॥ 29 ॥
*అరణి ప్రజ్వలించు అగ్నిని ప్రకటించినట్లు - భూలోకవర్తియగు బ్రాహ్మణ జాతిని, వేదములను మరియు యజ్ఞములను రక్షించుటకై దేవకీ దేవి వసుదేవుని వలన అట్టి దేవుని కనెను.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 670🌹*
*🌻670. Brāhmaṇapriyaḥ🌻*
*OM Brāhmaṇapriyāya namaḥ*
ब्राह्मणानां प्रियो विष्णुर्ब्राह्मणा अस्य वा प्रियाः ।
ब्राह्मणप्रिय इत्युक्तो विष्णुर्विबुधसत्तमैः ॥
*Brāhmaṇānāṃ priyo viṣṇurbrāhmaṇā asya vā priyāḥ,*
*Brāhmaṇapriya ityukto viṣṇurvibudhasattamaiḥ.*
*Brāhmaṇapriyaḥ can be interpreted as 'the One who is dear to Brāhmaṇas' or 'the One to whom Brāhmaṇas are dear.'*
The Lord said:
घ्नन्तं शपन्तं पुरुषं वदन्तं । यो ब्राह्मणं न प्रणमेद् यथाऽर्हं । स पापकृद् ब्रह्मदावाग्निदग्धो । वध्यश्च दण्डश्च न चाऽस्मदीयः ॥ /
Ghnantaṃ śapantaṃ puruṣaṃ vadantaṃ, Yo brāhmaṇaṃ na praṇamed yathā’rhaṃ, Sa pāpakrd brahmadāvāgnidagdho, Vadhyaśca daṇḍaśca na cā’smadīyaḥ.
*One who does not duly respect a Brāhmaṇa as is proper, who kills, curses or speaks harshly to him, is a sinner burnt up by the forest fire of Brahma and must be put to death or otherwise punished; he doe not belong to Me.*
:: श्रीमहाभारते शान्तिपर्वणि सप्तचत्वारिंशोऽध्यायः ::
यं देवं देवकी देवी वसुदेवादजीजनत् ।
भौमस्य ब्रह्मणो गुप्त्यै दीप्तमग्निमिवारणिः ॥ २९ ॥
Śrī Mahābhārata - Book 12, Chapter 47
Yaṃ devaṃ devakī devī vasudevādajījanat,
Bhaumasya brahmaṇo guptyai dīptamagnimivāraṇiḥ. 29.
*That God whom the holy Devaki begot of Vasudeva like the radiant fire from araṇi wood for the protection of Brāhmaṇas, Vedas and yajñas on earth.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ।ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः ॥ ७१ ॥
బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః ।బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ॥ 71 ॥
Brahmaṇyo brahmakrdbrahmā brahma brahmavivardhanaḥ,Brahmavidbrāhmaṇo brahmī brahmajño brāhmaṇapriyaḥ ॥ 71 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 632 / Sri Siva Maha Purana - 632 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 12 🌴*
*🌻. కార్తికేయ స్తుతి - 2 🌻*
దేవతలిట్లు పలికిరి -
ఈ తీరున వరములనిచ్చి, రాక్షసరాజగు తారకుని సంహరించి నీవు మమ్ములనందరినీ మాత్రమే గాక, చరాచర ప్రాణులన్నిటినీ సుఖపెట్టితివి (12). ఇపుడు నీవు ప్రీతితో శివుని నివాసమగు కైలాసమును, తల్లి దండ్రులగు పార్వతీ పరమేశ్వరులను చూడదగుదువు (13).
బ్రహ్మ ఇట్లు పలికెను -
విష్ణువు మొదలగు దేవతలందరు ఇట్లు పలికి కుమారుని అనుమతిని పొంది, పెద్ద ఉత్సవమును చేసి కుమారునితో బాటు కైలాసమునకు వెళ్లిరి (14). కుమార ప్రభుడు శంకరుని నివాసము, మహా మంగలకరము అగు కైలాసమునకు వెళ్లు చుండగా జయజయధ్వనులు బయల్వెడలినవి (15). గొప్ప సంపదలతో విరాజిల్లునది, సర్వత్రా అలంకరింపబడినది, సుందరమైనది, అన్నింటిపైన ఆకాశము నందు విరాజిల్లునది అగు విమానమును కుమారుడు ఎక్కెను (16). ఓ మునీ! నేను, విష్ణువు ఆ సమయములో గుహుని శిరస్సుపై మహానందముతో చామరములను జాగ్రత్తగా పట్టుకొని యుంటిమి (17).
అపుడు ఇంద్రాది దేవతలందరు నాల్గువైపులా నిలబడి తగు విధముగా గుహుని సేవిస్తూ ఆనందముగా వెళ్లిరి (18). వారు ఆనందంతో శంభుని జయమును బిగ్గరగా పలుకుచూ కైలాసమును ప్రవేశించి, మరల మంగళ శబ్దములను అచట పలికిరి (19). విష్ణువు మొదలగు దేవతలందరు వెంటనే శివపార్వతులను దర్శించి, భక్తితో చేతులు జోడించి ప్రణమిల్లి వినయముతో నిలబడిరి (20). కుమారుడు కూడా వినయముతో కూడిన మనస్సు గలవాడై విమానము నుండి దిగి ఆనందముతో సింహాసనమునందున్న శివపార్వతులకు ప్రణమిల్లెను (21).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 632🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 12 🌴*
*🌻 The story of Śiva and Pārvatī including that of Kārttikeya - 2 🌻*
The gods said:—
12. By killing Tāraka the lord of Asuras, and by granting boons thus, all of us including the mobile and immobile beings have been made happy by you.
13. Now, it behoves you to go to Kailāsa with great pleasure, to the abode of Śiva in order to see your mother and father Śiva and Pārvatī.
Brahmā said:—
14. After saying thus and obtaining his permission, Viṣṇu and other gods went jubilantly to that mountain along with Kumāra.
15. When the lord Kumāra started to Kailāsa, the abode of Śiva, sounds of “Victory” arose indicating great auspiciousness.
16. Kumāra got in the richly decorated aerial chariot that shone above all the things.
17. O sage, with great pleasure, Viṣṇu and I held the chowries aloft above the head of the lord with alertness.
18. Indra and other gods, rendering suitable service to Kumāra went ahead joyously flanking him on all sides.
19. They reached Śiva’s mountain crying shouts of victory to Śiva. They entered the precincts with delight. Auspicious sounds arose.
20. On seeing Śiva and Pārvatī, Viṣṇu and other gods bowed to Śiva with devotion and stood there humbly with palms joined in reverence.
21. Kumāra descended from the aerial chariot in all humility and bowed joyously to Śiva and Pārvatī seated on a throne.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 349 / DAILY WISDOM - 349 🌹*
*🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀*
*📝. ప్రసాద్ భరద్వాజ్*
*🌻14. మనిషి విశ్వం వెలుపల లేడు🌻*
*ఆధునిక శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? పదార్థం సూక్ష్మీకరించబడింది. పదార్థం కఠినమైనదిగా, ఘనమైనదిగా పరిగణించ బడట్లేదు. మనిషి క్రమంగా సూక్ష్మ వాతావరణ లోతుల లోకి ప్రవేశిస్తున్నాడు. ఎంత సూక్ష్మం అంటే విశ్వంలోని విస్తృత వాతావరణం నుండి తన ఉనికిని గుర్తించడం సాధ్యం కానంత. గమనించే శాస్త్రవేత్త, లేదా తత్వవేత్త, విశ్వం లోపల ఉన్నాడు. ఇది గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. మనిషి విశ్వంలో భాగమైనప్పుడు దాన్ని విడిగా ఎలా చూడగలడు? మనిషి ఈ ప్రపంచంలో దేనినైనా ఎలా అధ్యయనం చేయగలడు? అతను నిజంగా వెలుపలే లేనట్లయితే, ఏదైనా వస్తువు యొక్క విశ్లేషణ ఎలా చేయగలడు?*
*గురుత్వాకర్షణ నియమం నుండి అనుసరించే పరిణామాల ద్వారా ఒకరు నిర్ధారించే వాస్తవం ఏమిటంటే, ఈ విశ్వం తన నిర్మాణం నుండి ఏ పదార్థాలను మినహాయించ లేదు. మనిషి విశ్వానికి వెలుపల లేడు. ఇది ఒక సాధారణ వాస్తవం. అతను విశ్వానికి వెలుపల లేకుంటే, అతను విశ్వాన్ని విడిగా ఎలా అధ్యయనం చేయగలడు? అతను దేనినైనా గమనించే అవసరం, ఆవశ్యకత లేదా అవకాశం ఎక్కడ వస్తుంది? ఆధునిక శాస్త్రవేత్త ముందున్న చిక్కుప్రశ్న ఏమిటంటే, అతను గమనించిన వస్తువు నుండి తనను తాను విడదీయలేక పోవడం. మొత్తం ఈ పరిస్థితి యొక్క సారాంశం ఇదే.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 349 🌹*
*🍀 📖 from The Philosophy of Religion 🍀*
*📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj*
*🌻14. Man is not Outside the Universe🌻*
*What does the modern scientist say? Matter has been dematerialised. Matter is no more considered to be a hard, solid substance. Man is gradually evaporating into thin air—so thin, so ethereal, and so fine that a time has come now when it is not possible to distinguish his own presence from the wider atmosphere of the universe. The observing scientist, or the philosopher, is inside the universe. This is important to remember. How can man look at the universe when he is a part of it? How can man study anything in this world? How can he make an analysis of any object, if he is not really outside it?*
*From the fact of the conclusions that one arrives at through the consequences following from the law of gravitation, it follows that the universal structure cannot exclude the contents thereof. Man is not outside the universe. This should be a simple fact. If he is not outside the universe, how can he study the universe? Where comes the need, and the necessity, or even the possibility of his observing anything? Here is the crux of the whole situation. The problem that hangs like an iron curtain in front of the modern scientist is this difficulty of his inability to disentangle himself from the object of his observation.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 248 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. మతమన్నది మృతప్రాయం కాదు. మతం సజీవమైంది. నువ్వు దాంతో సంబంధమేర్పరుచు కోవాలంటే సజీవంగా వుండాలి. నువ్వు లోభితనంతో వుంటే మరణంతో వుంటావు. నువ్వు ఆనందంతో వుంటే మరింత సజీవంగా వుంటావు.🍀*
*నేను ప్రపంచంలో గాఢమయిన ప్రేమలో ఉన్నాను. జీవితాన్ని గాఢంగా ప్రేమిస్తూ వున్నాను. గాలితో కలిసి, వర్ణంతో, వృక్షాలతో కలిసి నాట్యం చేయండి. మతమంటే పవిత్ర గ్రంథాలు కాదు. అది విస్తరించిన అస్తిత్వం. దాని ఛాయల్ని ఇంద్రధనసులో నెమలి నాట్యంలో, కోకిల గానంలో, వేణునాదంలో వినవచ్చు. చూడవచ్చు. మతమన్నది మృతప్రాయం కాదు.*
*మతం సజీవమైంది. నువ్వు దాంతో సంబంధ మేర్పరుచు కోవాలంటే సజీవంగా వుండాలి. నువ్వు లోభితనంతో వుంటే మరణంతో వుంటావు. నువ్వు ఆనందంతో వుంటే మరింత సజీవంగా వుంటావు. నీ ఆనందంద శిఖరస్థాయి చేరినపుడు నువ్వు అస్తిత్వంతో సంబంధమేర్పరచు కుంటావు. ఆ అవధి లేని ఆనందాన్ని వర్ణించలేం. పేరు పెట్టలేం. దాన్ని నువ్వు జ్ఞానోదయంమను, సత్యమను, దైవత్వమను అవన్నీ పదాలలో ఒదగని పరవశాన్ని పట్టివ్వడానికి ప్రయత్నిస్తున్నాయి.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Comments