1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 17, జూలై 2022 ఆదివారం, భాను వాసరే Sunday 🌹
🌹. కర్కాటక సంక్రమణం & దక్షిణాయన పుణ్యకాల ప్రారంభం - ఉ10.57నుండి 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 233 / Bhagavad-Gita - 233 - 5- 29 కర్మ యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 632 / Vishnu Sahasranama Contemplation - 632 🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 311 / DAILY WISDOM - 311 🌹
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 211 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹17, July 2022 పంచాగము - Panchangam 🌹*
*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : కర్కాటక సంక్రమణం & దక్షిణాయన పుణ్యకాల ప్రారంభం - ఉ10.57 నుండి 🌻*
*🍀. శ్రీ సూర్య పంజర స్తోత్రం - 17 🍀*
*అసితాఙ్గభైరవాయ నమః రురుభైరవాయ నమః*
*చణ్డభైరవాయ నమః క్రోధభైరవాయ నమః*
*ఉన్మత్తభైరవాయ నమః భీషణభైరవాయ నమః*
*కాలభైరవాయ నమః సంహారభైరవాయ నమః*
*ముఖస్థానే మాం రక్షతు ॥ 17 ॥*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : ఉన్నతస్థాయిలో విశాలతరమైన వ్యవస్థల ప్రతిష్టాపనకు గట్టిగా కృషి చేసేముందు, వాటికంటే తక్కువ స్థాయిలోని వ్యవస్థలను నిర్మాణం చేస్తూ ఈశ్వరుని ప్రపంచం సోపాన క్రమంలో ఒక్కొక్క అడుగే ముందుకు సాగుళూ వుంటుంది. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, ఆషాడ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: కృష్ణ చవితి 10:51:23 వరకు
తదుపరి కృష్ణ పంచమి
నక్షత్రం: శతభిషం 13:26:25 వరకు
తదుపరి పూర్వాభద్రపద
యోగం: సౌభాగ్య 17:48:27 వరకు
తదుపరి శోభన
కరణం: బాలవ 10:54:23 వరకు
వర్జ్యం: 19:32:44 - 21:04:40
దుర్ముహూర్తం: 17:09:23 - 18:01:37
రాహు కాలం: 17:15:55 - 18:53:51
గుళిక కాలం: 15:38:00 - 17:15:55
యమ గండం: 12:22:09 - 14:00:04
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:48
అమృత కాలం: 06:44:48 - 08:13:44
మరియు 28:44:20 - 30:16:16
సూర్యోదయం: 05:50:28
సూర్యాస్తమయం: 18:53:51
చంద్రోదయం: 22:12:55
చంద్రాస్తమయం: 09:21:00
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: కుంభం
రాక్షస యోగం - మిత్ర కలహం 13:26:25
వరకు తదుపరి చర యోగం - దుర్వార్త శ్రవణం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 233 / Bhagavad-Gita - 233🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 29 🌴*
*29. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్ |*
*సుహృదం సర్వభుతానాం జ్ఞాత్వా మాం శాన్తిమృచ్చతి ||*
🌷. తాత్పర్యం :
*నా సంపూర్ణభావన యందున్నవాడు నన్ను సర్వయజ్ఞములకు తపస్సులకు చరమభోక్తగను, సకల లోకములకు దేవతలకు ప్రభువుగను, సకలజీవులకు లాభమును గూర్చువానిగను మరియు శ్రేయోభిలాషిగను తెలిసికొని భౌతికదుఃఖముల నుండి విడివడి పరమశాంతిని పొందును.*
🌷. భాష్యము :
మాయాశక్తి బంధములో నున్న బద్ధజీవులు భౌతికజగమునందు శాంతిని పొందుటకై ఆరాటపడుచుందురు. కాని శాంతిసూత్రమును మాత్రము వారెరుగరు. అదియే భగవద్గీత యందు ఇచ్చట వివరింపబడినది. ఆ ఘనమైన శాంతిసూత్రము ఈ విధముగా తెలుపబడినది. సమస్త మానవకర్మలకు శ్రీకృష్ణభగవానుడే దివ్యభోక్త. అతడే సర్వలోకములకు మరియు అందున్న దేవతలకు ప్రభువు కనుక జనులు అతని దివ్యసేవకే సమస్తమును అర్పించవలసి యున్నది. అతని కన్నాను ఘనుడైనవాడు వేరోక్కడు లేడు. బ్రహ్మరుద్రాదుల వంటి దేవతల కన్న్నాను అతడు ఘనమైనవాడు.
మాయకారణముననే జీవులు తమను ప్రభువులుగా తలచుచున్నను వాస్తవమునాకు వారు దేవదేవుని మాయకు ఆధీనులైనట్టివారే. శ్రీకృష్ణభగవానుడు ప్రకృతి ప్రభువు కాగా, కఠినమగు ప్రకృతి నియమములచే నియమింపబడువారు బద్ధజీవులు. ఈ నగ్నసత్యమును అవగతము చేసికొననంతవరకు వక్తిగతముగా గాని, సామూహికముగా గాని విశ్వశాంతిని సాధించు అవకాశమే లేదు. దేవదేవుడైన శ్రీకృష్ణుడే సర్వులకు ప్రభువు మరియు దేవతలతో సహా సర్వజీవులు అతనికి లోబడియుండువారు అనుటయే కృష్ణభక్తిరసభావనము. అట్టి సంపూర్ణ కృష్ణభక్తిభావన యందే మనుజుడు పూర్ణశాంతిని పొందగలడు.
యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి యను ఎనిమిది అంగములు గల యోగాభ్యాసమునందు క్రమానుగతమైన ఉద్దరమున్నను అది భక్తియుక్తసేవచే సంపూర్ణత్వము నొందుట యందు ఉపోద్ఘాతము వంటిది మాత్రమే. భక్తియోగమునందలి సంపూర్ణత్వమొక్కటే మనుజునకు శాంతిని గూర్చగలదు. అదియే మానవజన్మ యొక్క పరమసిద్ధియై యున్నది.
శ్రీమద్భగవద్గీత యందలి “కర్మయోగము – కృష్ణభక్తిరసభావితకర్మ” అను పంచమాధ్యాయమునకు భక్తివేదాంత భాష్యము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 233 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 5 - Karma Yoga - 29 🌴*
*29. bhoktāraṁ yajña-tapasāṁ sarva-loka-maheśvaram*
*suhṛdaṁ sarva-bhūtānāṁ jñātvā māṁ śāntim ṛcchati*
🌷 Translation :
*A person in full consciousness of Me, knowing Me to be the ultimate beneficiary of all sacrifices and austerities, the Supreme Lord of all planets and demigods, and the benefactor and well-wisher of all living entities, attains peace from the pangs of material miseries.*
🌹 Purport :
🌹 Purport :
The conditioned souls within the clutches of the illusory energy are all anxious to attain peace in the material world. But they do not know the formula for peace, which is explained in this part of the Bhagavad-gītā. The greatest peace formula is simply this: Lord Kṛṣṇa is the beneficiary in all human activities. Men should offer everything to the transcendental service of the Lord because He is the proprietor of all planets and the demigods thereon. No one is greater than He. He is greater than the greatest of the demigods, Lord Śiva and Lord Brahmā.
Under the spell of illusion, living entities are trying to be lords of all they survey, but actually they are dominated by the material energy of the Lord. The Lord is the master of material nature, and the conditioned souls are under the stringent rules of material nature. Unless one understands these bare facts, it is not possible to achieve peace in the world either individually or collectively. This is the sense of Kṛṣṇa consciousness: Lord Kṛṣṇa is the supreme predominator, and all living entities, including the great demigods, are His subordinates. One can attain perfect peace only in complete Kṛṣṇa consciousness.
There is a gradual process of elevation in the practice of yama, niyama, āsana, prāṇāyāma, pratyāhāra, dhāraṇā, dhyāna and samādhi. But these only preface perfection by devotional service, which alone can award peace to the human being. It is the highest perfection of life.
Thus end the Bhaktivedanta Purports to the Fifth Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of Karma-yoga, or Action in Kṛṣṇa Consciousness.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 632 / Vishnu Sahasranama Contemplation - 632🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻632. శోకనాశనః, शोकनाशनः, Śokanāśanaḥ🌻*
*ఓం శోకనాశనాయ నమః | ॐ शोकनाशनाय नमः | OM Śokanāśanāya namaḥ*
*శోకనాశనః, शोकनाशनः, Śokanāśanaḥ*
*స్మృతి మాత్రేణ భక్తానాం శోకం నాశయతీతి సః ।*
*శోకనాశన ఇత్యుక్తో విష్ణుర్విద్యద్భిరచ్యుతః ॥*
*స్మరణ మాత్రము చేతనే భక్తుల శోకమును నశింప జేయు వాడు గనుక శ్రీ విష్ణువు శోకనాశనహః అని కీర్తింప బడుతాడు.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 632🌹*
*📚. Prasad Bharadwaj*
*🌻632. Śokanāśanaḥ🌻*
*OM Śokanāśanāya namaḥ*
स्मृति मात्रेण भक्तानां शोकं नाशयतीति सः ।
शोकनाशन इत्युक्तो विष्णुर्विद्यद्भिरच्युतः ॥
*Smr̥ti mātreṇa bhaktānāṃ śokaṃ nāśayatīti saḥ,*
*Śokanāśana ityukto viṣṇurvidyadbhiracyutaḥ.*
*Since Lord Viṣṇu destroys the grief of His devotees by their mere thought of Him, He is known as Śokanāśanaḥ.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
उदीर्णस्सर्वतश्चक्षुरनीशश्शाश्वतस्स्थिरः ।भूशयो भूषणो भूतिर्विशोकश्शोकनाशनः ॥ ६७ ॥
ఉదీర్ణస్సర్వతశ్చక్షురనీశశ్శాశ్వతస్స్థిరః ।భూశయో భూషణో భూతిర్విశోకశ్శోకనాశనః ॥ 67 ॥
Udīrṇassarvataścakṣuranīśaśśāśvatassthiraḥ,Bhūśayo bhūṣaṇo bhūtirviśokaśśokanāśanaḥ ॥ 67 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 311 / DAILY WISDOM - 311 🌹*
*🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻 6. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి 🌻*
*నిద్రలో, మీకు తండ్రి, తల్లి, సంబంధాలు లేవు-ఏమీ లేవు. మీరు మాత్రమే అక్కడ ఉన్నారు. నిద్ర స్థితి మీకు అలాంటి ఆనందాన్ని తెచ్చిపెట్టింది. దానితో పోలిస్తే మీరు మరే ఇతర ఆనందాన్ని అంతగా కలిగి ఉండరు. ఒక రాజు కూడా గాఢనిద్రలోకి ప్రవేశించిన వ్యక్తి వలె సంతోషంగా ఉండలేడు, ఎందుకంటే అతను నేను, నేనే సముద్రంలో ప్రవేశించాడు. మీకు నిద్రా సమయంలో సంబంధాలు లేవు, ఆస్తి లేదు, స్నేహితులు లేవు, శరీరం లేదు, మనస్సు లేదు. అక్కడ ఏమి ఉంది? 'నువ్వు' అక్కడే ఉన్నావు. దీనినే నేను అసలైన సముద్రం అంటాను.*
*ఆచరణాత్మక జీవితం, మరియు ఫ్యాక్టరీ జీవితం, కార్యాలయ జీవితం మొదలైన వాటి మధ్య తేడాను గుర్తించవద్దు. నిజంగా అలాంటిదేమీ లేదు. ఇది చాలా ఆసక్తికరమైన మరియు ముఖ్యమైన అంశం. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆనందంగా ఉండాలి- “అంతా బాగానే ఉంది; ఏమీ తప్పు కాదు. అంతా బాగుంది; నాతో అంతా బాగానే ఉంది. ఎందుకు ఉండకూడదు? తప్పక ఉంటుంది.” ఎవరూ మీకు ఇబ్బందిని సృష్టించలేరు. ఎవరు ఇబ్బందులు సృష్టించగలరు? మీరు మీ కోసం ఇబ్బందులను సృష్టిస్తున్నారు, ఎందుకంటే మీరే ఇబ్బంది. కాబట్టి, మీరు ఎందుకు ఫిర్యాదు చేస్తారు? మనస్సు చాలా సూక్ష్మమైనది. ఇలా ఆలోచించలేము. అలా ఆలోచించడం ప్రారంభిస్తే, అది గిలగిలలాడుతుంది మరియు మీరు మళ్ళీ నిద్రలోకి జారుకుంటారు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 311 🌹*
*🍀 📖 from Your Questions Answered 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*
*🌻 6. You Must be Always Happy 🌻*
*In sleep, you had no father, mother, relations—nothing was there. Just, you were there. And, the state of sleep brought you such a joy that you would not like to have any other joy compared to it. Even a king cannot be so happy as a person who has entered into deep sleep, because he has entered the Self, the ocean of Self. And, you had no relations, no property, no friends, no body, no mind at that time. What was there? ‘You' were there. This is what I call the ocean.*
*Do not make a distinction between practical life and factory life, office life, etc. There is really no such thing. This is a very interesting and important point. You must be always happy, blissful—“Everything is fine; nothing is wrong. Everything is good; all is well with me. Why should it not be? It must be.” Nobody can create trouble for you. Who can create trouble? You are creating trouble for yourself, because you yourself are the trouble. So, why do you complain? The mind is very subtle. It cannot think like this. If it starts thinking thus, it will become giddy, and you will fall into sleep, again.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 211 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. సత్యాన్ని అనుభవానికి తెచ్చుకోవడానికి అన్ని రకాల నమ్మకాలూ ఆటంకాలే. నువ్వు ఎప్పుడూ నమ్మడం ఆరంభిస్తావో నీలో పరిశీలన ఆగిపోతుంది. ఒకసారి నమ్మకం మొదలయితే నీకు అన్నీ తెలుసు అనుకుంటావు. సందేహాలు సజీవంగా వున్నపుడే అన్వేషిస్తావు. 🍀*
*నిజమైన మతం నమ్మకాల మీద ఆధారపడి వుండదు. నిజం కాని మతమే నమ్మకాల మీద ఆధారపడి వుంటుంది. నిజమైన మతం పునాదులు అనుభవం మీద ఆధారపడి వుంటాయి. సత్యాన్ని అనుభవానికి తెచ్చుకోవడానికి అన్ని రకాల నమ్మకాలూ ఆటంకాలే. నువ్వు ఎప్పుడూ నమ్మడం ఆరంభిస్తావో నీలో పరిశీలన ఆగిపోతుంది. ఒకసారి నమ్మకం మొదలయితే నీకు అన్నీ తెలుసనుకుంటావు.*
*నమ్మకమంటే అర్థమేమిటంటే నీ సందేహాల్ని అణిచిపెట్టావని, నీ సందేహాలు సజీవంగా, తాజాగా, యవ్వనంతో వున్నపుడే అన్వేషిస్తావు. అవి ముందు వెళ్ళే మెట్లు. అవి తప్పు కాదు. వాటిల్లో దోషం లేదు. అట్లా అని మనిషి ఎప్పటికీ సందేహాల్లోనే పడి కొట్టుకు పోకూడదు. సత్యాన్ని గ్రహించడానికి వ్యక్తి సందేహాల్ని ఆకారం చేసుకోవాలి. కాబట్టి అది పూర్తిగా వేరయిన విషయం. అది నిర్జీవమైన సత్యం కాదు. సజీవ సత్యం. అది నీ సత్యం. నీ జీవితంలో దాని కోసం నువ్వు శ్రమించాలి.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
నేటి విశేషం
🌹. కర్కాటక సంక్రమణం & దక్షిణాయన పుణ్యకాల ప్రారంభం - ఉ10.57నుండి 🌹
శాస్త్ర ప్రకారం జనవరి 15 నుంచి జూలై 16 వరకు ఉత్తరాయణం ,
జూలై 17 నుంచి జనవరి 14 వరకు దక్షిణాయనం అని అంటారు...
దక్షిణాయనంలో పిండ ప్రదానాలు , పితృ తర్ఫణాలు చేయడం , సాత్వికాహారం ఫలితాన్నిస్తాయి.
సూర్య గమణాన్నిబట్టి మన భారతీయులు కాలాన్నిరెండు భాగాలుగా విభజించారు...
భూమధ్యరేఖకు ఉత్తరదిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని , దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయమని అన్నారు.
ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనం, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం...
కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది...
సంక్రమణం ప్రవేశించిన తరువాత మొదటి 6 గంటల 49 నిముషములు పుణ్యకాలంగా, 2 గంటల 16 నిమిషములు అత్యంత పుణ్యకాలంగా శాస్త్రములందు చెప్పబడింది.
ఆ సమయంలో స్నాన , దాన , జపాదులేవైనా అధిక ఫలితాలనిస్తాయి...
ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడి గమనంలో మార్పులే ఉత్తరాయణ , దక్షిణాయనాలు, 'అయనం' అంటే ప్రయాణం అని అర్ధం.
దక్షిణాయనం అంటే దక్షిణ దిశగా ప్రయాణం చేయడమనే అర్ధం వస్తుంది.
సూర్యుడు తూర్పు దిశలో ఉదయిస్తాడని తెలుసు, కానీ సూర్యోదయాన్ని గమనిస్తే , అది తూర్పు దిక్కున జరగదు.
సూర్యుడు సరిగ్గా తూర్పు దిశ మధ్యలో ఉదయించేది ఏడాదిలో 2 రోజులు మాత్రమే, అవి మార్చి 21 , సెప్టెంబరు 23. మిగతా ఆరు నెలలు కాస్త ఈశాన్యానికి దగ్గరగా , మరో 6 నెలల ఆగ్నేయానికి దగ్గరగా సూర్యోదయం జరుగుతుంది...
సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని 'ఉత్తరాయాణం' అని , ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని 'దక్షిణాయనం' అని అంటారు...
ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశలో పయనిస్తాడు...
ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే , దక్షిణాయనం దేవతలకు రాత్రి కాలం.
ఈ కాలంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు...
ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సాయం ఎంతో అవసరం, అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడానికి ఈ కాలంలో ఉపాసనలు చేస్తారు.
అందువల్ల ఇది ఉపాసన కాలం అయ్యింది, శ్రీహరి ఆషాడ శుద్ద ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్లి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తారు.
ఈ సమయంలో యోగులు , మఠాధిపతులు చాతుర్మాస దీక్షను చేపడతారు.
శాస్త్రీయంగా దక్షిణాయనంలో సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసరిస్తుంది, ఫలితంగా జీవులలో రోగనిరోధకశక్తి క్షీణించి రోగాల బారిన పడతారు.
వీటిని నిరోధించడానికి ఈ కాలంలో బ్రహ్మచర్యం , ఉపాసన , తరుచుగా ఉపవాసాలు , పూజలు , వ్రతాల పేరుతో పాటించే నియమాలు రోగనిరోధక శక్తిని పెంచి , ఆరోగ్యాన్ని కలిగిస్తాయి.
ఎలా చూసిన దక్షిణాయనంలో చేసే జప , దాన , పూజలు ఆరోగ్యాన్ని , అధ్యాత్మిక అనుభూతుని ప్రసాదించడంతో పాటు పరమాత్మ పాదాలను చేరుస్తాయి...
ముఖ్యంగా దక్షిణాయనంలోనె పితృ దేవతలు తమ సంతానం ఇచ్చే శ్రాద్ధాలు , విశేష తర్పణాలను స్వీకరించేందుకు భూమిపైకి వస్తారని అంటారు.
ఈ సమయంలోనే పితృదేవతారాధనకు సంబంధించిన మహలయ పక్షాలు వస్తాయి...
పితృదేవతలను సంతృప్తిపరిస్తే వారి అను గ్రహంతో సంతానాభివృద్ధి జరుగుతుంది.
శ్రద్ధాదులు నిర్వహించకపోవడం కూడా సంతాన లేమికి ఒక కారణమని పెద్దలు పేర్కొంటారు.
బతికుండగా తల్లిదండ్రుల సేవ , మరణించాక శ్రాద్ధాలు చేయడం విధి , ఎంతో ముఖ్యం , శుభప్రదం. పితృ రుణం తీర్చుకోవడానికి అది మార్గం.
అంతేకాదు కని పెంచిన తల్లిదండ్రులకు అది ఒక కృతజ్ఞతా పూర్వక చర్య.
చేయవలసినవి
ధ్యానం , మంత్ర జపాలు , సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర నదుల్లో స్నానాలు , పిండ ప్రదానాలు , పితృ తర్ఫణాలు , సాత్వికాహారం (శాకాహారం) తీసుకోవడం , అవసరంలో ఉన్న వారికి దానం చేయడం , అన్నదానం , తిల (నువ్వుల ) దానం , వస్త్ర దానం , విష్ణు పూజ , విష్ణు సహస్రనామ పారాయణ , సూర్యరాధన , ఆదిత్య హృదయ పారాయణం చేస్తే అవి శరీరానికి , మనసుకు మేలు చేస్తాయని , పాపాలు తొలగిపోతాయని పెద్దలు సూచించారు, దక్షిణాయన పుణ్యకాలం లో ఏమి చెయ్యాలి ?
జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు నవగ్రహాలకు రాజు.... అసలు జ్యోతిషంలో ఒక్క గ్రహం రాశి మారటానికి ఒక్కో కాల వ్యవధి వుంటుంది.
అంటే చంద్రుడు మేష రాశి నుంచి వృషభరాశికి మారటానికి 2 1/2 రోజులు పడుతుంది.
శనిగ్రహం 2 1/2 సం పడుతుంది.
రాహు , కేతువులకి 1 1/2 సం , రవికి నెల రోజులు... ఇలా ప్రతి గ్రహానికి కొంత కాల పరిమితి వుంటుంది. అయితే ముఖ్యంగా సూర్యుడు నెలకి ఒక్కో రాశి చొప్పున (మేషాది మీన రాశులు) పన్నెండు రాశులలోనూ పన్నెండు నెలలు సంచరిస్తే మనకి సంవత్సర కాలం పూర్త వుతుంది.
సూర్యుడు మేష రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘మేష సంక్రమణం’ అని
సూర్యుడు వృషభ రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘వృషభ సంక్రమణం’ అని
సూర్యుడు మిథున రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘మిథున సంక్రమణం’ అని
సూర్యుడు కర్కాటక రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘కర్కాటక సంక్రమణం’ అని
ఇలా ఏయే రాశుల్లో ప్రవేశిస్తే ఆయా సంక్రమణ కాలంగా చెపుతారు. సంక్రమణం అనే మాటకి ‘జరగటం’ , ‘ప్రవేశించటం’ అని చెప్పొచ్చు.
సూర్యుడు కర్కాటక సంక్రమణం చేసాడు అంటే సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు అని అర్ధం. ఇది జూలై 15 నుంచి 17 తేది వరకు జరుగుతూ వుంటుంది.
సాధారణంగా జూలై 16వ తేదీనే !
ఈ కర్కాటక సంక్రమణాన్ని ‘దక్షిణాయన’ మని అంటుంటారు. (మనకి సంవత్సరానికి అయనములు రెండు. ఒకటి ఉత్తరాయనం , రెండవది దక్షిణాయనం) ఇక తర్వాత సూర్యుని సింహరాశి ప్రవేశం , తర్వాత కన్యా రాశి ప్రవేశం (వినాయక చవితి వస్తుంది), తులారాశి ప్రవేశం (దసరాలు). ఇలా పన్నెండు రాశులలోనూ సూర్యుడు ప్రవేశించే కాలాన్ని సంక్రమణంగా చెప్తాం, (మకర సంక్రమణం (సం క్రాంతి)... మకరరాశి ప్రవేశం ! కుంభరాశి ప్రవేశం (మహా శివరాత్రి) అయితే సూర్యుని మకర సంక్రమణ మే ‘ఉత్తరాయన పుణ్యకాలం’.
ఏ తిథులతోను సంబంధం లేకుండాను , ఎవరినీ అడగక్కర్లేకుండాను సంవత్సరంలో వచ్చే పండుగలు ఉత్తరాయణ - దక్షిణాయన మనేవి. జనవరి 14 న వచ్చే ఉత్తరాయణాన్ని మకర సంక్రమణమనీ , జూలై 16 న వచ్చే దక్షిణాయనాన్ని కర్కాటక సంక్రమణమనీ, వ్యవహరిస్తారు.
ఈ రెండు ఆయనాలు కలిపితేనే సంవత్సరం అవుతుంది.
సూర్యుడు ప్రతి నెలలోను ఒక రాశినుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంటాడు.
దీనికే ‘సంక్రమణం’ అని పేరు. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పటినుంచి మకరరాశిలోకి ప్రవేశించేంతవరకు వుండే కాలం దక్షిణాయనం.
ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు.
దేవతలకు ఉత్తరాయణం పగలు కాగా , దక్షిణాయనం రాత్రిగాను చెప్తారు. అదేవిధంగా ఉత్తరాయణం దేవతలకు , దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని చెబుతారు.
దక్షిణాయన సందర్భంగా సంక్రమణ స్నానాలు చేయడం , విష్ణు సహస్రనామ పారాయణం చేయడంతోపాటు శ్రీ వరాహస్వామి వారిని పూజించడం శ్రేష్టమని చెప్తారు.
దక్షిణాయన ఆరంభ కాలమైన ఆషాఢంలో ఏ పండుగలు లేకపోయినా ఆ తర్వాత మాసాల్లో శ్రీకృష్ణాష్టమి , వినాయక చవితి , రాఖీపూర్ణిమ , ఆదిపరాశక్తి మహిమలనుచాటే దసరా , నరక బాధలు తొలగించిన దీపావళి , శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక , మార్గశిర మాసాలు , గోపికలు ఆనంద పారవశ్యాన్ని పొందే ధనుర్మాసం ఇవన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి.
ఆషాఢమాసంలో సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం ఖచ్చితంగా జరుగుతుంది.
కర్కాటక రాశి ప్రవేశంతో దక్షిణాపథంవైపు సూర్యుడు పయనమవుతాడు. దక్షిణాయనంలో చేసే పితృకర్మలు సరాసరి ఆ పితృ దేవతలకు ఉత్తమమైనవి.
దక్షిణాయనంలో చేసే పితృకర్మలు సరాసరి ఆ పితృదేవతలకు సకల నరకాలనుండి తొలగిస్తాయి.
దక్షిణాయనంలో దేవతా ప్రతిష్ఠ , గృహ ప్రవేశం. , ఉపనయనం , వివాహ కార్యాల్లాంటి శుభ కార్యాలను చేయడం మంచిది కాదంటారు.
కానీ దక్షిణాయనంలో ఉగ్రదేవతా రూపాలను అంటే సప్త మాతృకలు , భైరవ , వరాహ , నృసింహ , మహిషాసుర మర్దని , దుర్గ లాంటి దేవతామూర్తులను ప్రతిష్టించవచ్చని వైఖానస సంహిత చెబుతోంది.
కర్కాటక సంక్రమణ సమయంలో అంటే దక్షిణాయన ప్రారంభంలో పుణ్య స్నానాలు , జపతపాలు చేయడం ఎంతో మంచిది. ఆనాడు కులదైవాన్ని , లేదా శ్రీ మహా విష్ణువును పత్రాలతో పూజిస్తే ఆ ఏడాదంతా చేసే దోషాలు , పాపాలు వైదొలగుతాయి.
వారి పితృదేవతలు స్వర్గాది సుఖలోకాలను చేరుకుంటారు.
సంక్రమణ కాలంలో చేసే పుణ్య స్నానాల వలన రోగాలు నివారించబడడమే కాకుండా దారిద్య్రం కూడా నిర్మూలించబడుతుంది.
ముఖ్యంగా ఈ సంక్రమణ కాలం సాధకులకు మంచి ఆధ్యాత్మిక ఫలితాలనిస్తుంది. ఈ సమయంలో దానాలు కూడా విశేష ఫలాలనిస్తాయి.
అందుకే మోక్షానికి ఉత్తరాయణం , ఇహానికి దక్షిణాయనం ప్రతీకలుగా భావిస్తారు. ఈరోజు పుణ్యనదీ స్నాన , దాన , జప , హోమం అక్షయ ఫలాన్ని ఇస్తుంది...
🌻శుభమస్తు🌻
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Comments