🌹🍀 18 - AUGUST - 2022 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🍀🌹
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 18, ఆగస్టు 2022 గురువారం, బృహస్పతి వాసరే Thursday 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 249 / Bhagavad-Gita - 249 -6-15 ధ్యాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 648 / Vishnu Sahasranama Contemplation - 648 🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 327 / DAILY WISDOM - 327 🌹
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 227 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹18, August 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
*స్మార్త శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : స్మార్త శ్రీ కృష్ణ జన్మాష్టమి, రోహిణి అష్టమి, Smarta Janmashtami, Ashtami Rohini🌻*
*🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రము - 7 🍀*
*7. దాక్షిణ్యరమ్యా గిరిశస్య మూర్తిః దేవీ సరోజాసనధర్మపత్నీ*
*వ్యాసాదయోఽపి వ్యపదేశ్యవాచః స్ఫురంతి సర్వే తవ శక్తిలేశైః ॥*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : ద్వంద్వాత్మకంగా ఆలోచించే తర్కబుద్ధి ఉన్న కాలంలో, అనేక విషయాల యెడ ఏవగింపు ఉంటుంది. సాక్షాద్దర్శనంలో తర్కబుద్ధి తిరోహితమైన పిమ్మట ఏవగింపు కలిగించే వికార వస్తువుల కొరకు లోకమంతా గాలించినా అవి ఎక్కడా కనిపించవు. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, శ్రావణ మాసం
దక్షిణాయణం, వర్ష ఋతువు
తిథి: కృష్ణ సప్తమి 21:22:57 వరకు
తదుపరి కృష్ణ అష్టమి
నక్షత్రం: భరణి 23:37:47 వరకు
తదుపరి కృత్తిక
యోగం: వృధ్ధి 20:41:47 వరకు
తదుపరి ధృవ
కరణం: విష్టి 08:49:33 వరకు
వర్జ్యం: 08:13:12 - 09:55:44
దుర్ముహూర్తం: 10:13:06 - 11:03:48
మరియు 15:17:17 - 16:07:59
రాహు కాలం: 13:54:54 - 15:29:58
గుళిక కాలం: 09:09:44 - 10:44:47
యమ గండం: 05:59:36 - 07:34:40
అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:44
అమృత కాలం: 18:28:24 - 20:10:56
సూర్యోదయం: 05:59:36
సూర్యాస్తమయం: 18:40:05
చంద్రోదయం: 23:17:09
చంద్రాస్తమయం: 11:39:01
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: మేషం
పద్మ యోగం - ఐశ్వర్య ప్రాప్తి 23:37:47
వరకు తదుపరి లంబ యోగం -
చికాకులు, అపశకునం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 249 / Bhagavad-Gita - 249 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 16 🌴*
*16. నాట్యనాత్యశ్నతస్తు యోగోస్తి న చైకాన్తమనశ్నత: |*
*న చాతిస్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున ||*
🌷. తాత్పర్యం :
*ఓ అర్జునా! అతిగా భుజించువానికి లేదా అతితక్కువ తినువానికి, అతిగా నిద్రించువానికి లేదా తగినంత నిద్రలేనివానికి యోగి యగుటకు అవకాశము లేదు.*
🌷. భాష్యము :
ఆహారము మరియు నిద్రయందు నియమము ఇచ్చట యోగులకు నిర్దేశింపబడుచున్నది. అధికముగా భుజించుట యనగా దేహపోషణకు అవసరమైనదాని కన్నాను అధికముగా భుజించుటని భావము. సమృద్ధిగా ధాన్యము, కూరగాయలు, ఫలములు, పాలు లభించుచున్నందున మనుజుల జంతుమాంసము తిననవసరము లేదు. శ్రీమద్భగవద్గీత ప్రకారము అట్టి సరళమగు ఆహారము సాత్వికమైనట్టిది. మాంసాహారము తమోగుణప్రధానులకు ఉద్దేశింపబడినది. కావున మాంసాహారము, మద్యపానము, ధూమపానము చేయుచు కృష్ణునకు అర్పింపని ఆహారమును గ్రహించువారు తాము పాపమునే భుజించుటచే పాపకర్మల ఫలములను అనుభవింపవలసివచ్చును. “భుంజతే తే త్వఘం పాపా: యే పచన్త్యాత్మకారణాత్ – ఎవరైతే కృష్ణునికి అర్పింపక తమ ప్రీత్యర్థమే ఆహారమును స్వీకరింతురో లేక తయారుచేకొందురో అట్టివారు పాపమునే భుజించువారు కాగలరు.”
పాపమును భుజించువాడు మరియు అతిగా భుజించువాడు పూర్ణయోగమును అభ్యసింపలేడు. కనుక కృష్ణునకు అర్పింపబడిన ఆహారమును భుజించుటయే సర్వులకు ఉత్తమము. కృష్ణభక్తిభావన యందున్నవాడు తొలుత కృష్ణునికి అర్పింపబడని ఆహారమును దేనిని కూడా స్వీకరింపడు. కనుక కృష్ణభక్తిరస భావితుడే యోగాభ్యాసమునందు పూర్ణత్వమును పొందగలడు. అట్లుగాక కేవలము తనకు తోచిన విధముగా ఉపవాసముండి కృత్రిమముగా ఆహారమును విడిచి యోగమభ్యసించువాడు ఎన్నడును యోగమునందు పూర్ణుడు కాలేడు.
కృష్ణభక్తిపరాయణుడు శాస్త్రములలో తెలిపినరీతి ఉపవాసమును అవలంబించును. అతడు అధికముగా భుజించుట లేదా అతిగా ఉపవసించుట చేయనందున యోగాభ్యాసమును చక్కగా పాటించగలడు. అధికముగా భుజించువానికి స్వప్నములు ఎక్కువగా వచ్చుచున్నందున అధికసమయము నిద్రించును. వాస్తవమునకు మనుజుడు ఆరుగంటల కన్నాను అధికముగా నిద్రపోరాదు. ఆ విధముగా రోజులో ఆరుగంటల కన్నను అధికముగా నిద్రించువాడు తమోగుణముచే ప్రభావితుడైనట్టివాడే. తమోగుణప్రధానుడు మందుడై, అధికముగా నిద్రించును. అట్టివాడు ఎన్నడును యోగమును నిర్వహింపలేడు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 249 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 6 - Dhyana Yoga - 16 🌴*
*16. nāty-aśnatas tu yogo ’sti na caikāntam anaśnataḥ*
*na cāti-svapna-śīlasya jāgrato naiva cārjuna*
🌷 Translation :
*There is no possibility of one’s becoming a yogī, O Arjuna, if one eats too much or eats too little, sleeps too much or does not sleep enough.*
🌹 Purport :
Regulation of diet and sleep is recommended herein for the yogīs. Too much eating means eating more than is required to keep the body and soul together. There is no need for men to eat animals, because there is an ample supply of grains, vegetables, fruits and milk. Such simple foodstuff is considered to be in the mode of goodness according to the Bhagavad-gītā. Animal food is for those in the mode of ignorance.
Therefore, those who indulge in animal food, drinking, smoking and eating food which is not first offered to Kṛṣṇa will suffer sinful reactions because of eating only polluted things. Bhuñjate te tv aghaṁ pāpā ye pacanty ātma-kāraṇāt. Anyone who eats for sense pleasure, or cooks for himself, not offering his food to Kṛṣṇa, eats only sin. One who eats sin and eats more than is allotted to him cannot execute perfect yoga. It is best that one eat only the remnants of foodstuff offered to Kṛṣṇa. A person in Kṛṣṇa consciousness does not eat anything which is not first offered to Kṛṣṇa.
Therefore, only the Kṛṣṇa conscious person can attain perfection in yoga practice. Nor can one who artificially abstains from eating, manufacturing his own personal process of fasting, practice yoga. The Kṛṣṇa conscious person observes fasting as it is recommended in the scriptures. He does not fast or eat more than is required, and he is thus competent to perform yoga practice. One who eats more than required will dream very much while sleeping, and he must consequently sleep more than is required. One should not sleep more than six hours daily. One who sleeps more than six hours out of twenty-four is certainly influenced by the mode of ignorance.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 648 / Vishnu Sahasranama Contemplation - 648🌹*
*🌻648. కేశవః, केशवः, Keśavaḥ🌻*
*ఓం కేశవాయ నమః | ॐ केशवाय नमः | OM Keśavāya namaḥ*
కేశవః, केशवः, Keśavaḥ
*సూర్యాదికేషు సఙ్క్రాన్తా అంశవః కేశసంజ్ఞితాః।*
*తద్వత్తయా కేశవ ఇత్యుచ్యతే విబుధైర్హరిః ॥*
*సూర్యుడు మొదలగు తేజో గోళముల యందు సంక్రమించినట్టి (కేశములు అను వ్యవహార సంజ్ఞ గల) కిరణములు ఈతనికి గలవు గనుక ఆ పరమాత్మునికి కేశవః అను నామము.*
:: శ్రీమహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మపర్వణి ఏకచత్వారింశదధికత్రిశతతమోఽధ్యాయాః ::
అంశవో యత్ ప్రకాశన్తే మమైతే కేశసంజ్ఞితాః ।
సర్వజ్ఞాః కేశవం తస్మాన్మామాహుర్ద్విజసత్తమాః ॥48 ॥
*నా అంశువులు లేదా కిరణములు ఏవి ప్రకాశించుచున్నవో అవి కేశములు అను సంజ్ఞగలవి. అందువలననే సర్వజ్ఞులగు బ్రాహ్మణ శ్రేష్ఠులు నన్ను కేశవః అనుచున్నారు.*
బ్రహ్మవిష్ణుశివాభిఖ్యాః శక్తయః కేశసంజ్ఞితాః ।
తద్వత్తయా వా కేశవ ఉక్త్రాస్త్రయ ఇత్ శ్రుతేః ॥
*బ్రహ్మ, విష్ణు, శివులు - ఈ శక్తి త్రయమునకు 'కేశాః' అని వ్యవహారము. అట్టి కేశులు ఆ పరమాత్మయొక్క శక్తిరూపులుగా ఉన్నారు. 'త్రయః కేశినః' (ఋగ్వేదము 1.64.44) - 'కేశములు (తేజోవంతములైన కిరణములు) గలవారు ముగ్గురు చెప్పబడుచున్నారు' అని శ్రుతి వచించుచున్నది.*
మునినా విష్ణుపురాణే మత్కేశౌ వసుధాతలే ।
ఇత్యత్ర కేశ శబ్దో హి ప్రయుక్తశ్శక్తి వాచకః ॥
*నా కేశములు భూతలమునందు (బ్రహ్మ రుద్రులు) ప్రసిద్ధులుగానున్నారు అను విష్ణుపురాణ వచనముచే (పంచమాంశే ప్రథమోఽధ్యాయః) కేశ శబ్దము 'శక్తి' అను అర్థమును చెప్పునదిగా ప్రయోగించబడియున్నది.*
త్రయః కేశిన ఇత్యాది శ్రుతౌ ధర్మైకమూలకే ।
కోబ్రహ్మేతి సమాఖ్యాతః ఈశోఽహం సర్వదేహినాం ॥
అవాన్తరాంశ సమ్భూతౌ తస్మాత్ కేశవ నామవాన్ ।
ఇతి హరివంశే వ్యాస మునినా పరికీర్తనాత్ ॥
*'కః అనగా బ్రహ్మయని లెస్సగా చెప్పబడుచున్నది. నేను సర్వప్రాణులకును ఈశుడను. మేము ఇరువురము నీయంశ వలన జనించితిమి. అందువలన నీవు 'కేశవః' అను నామము కలవాడవయితివి' అని హరి వంశమున రుద్రుని వచనము.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 648🌹*
*🌻648. Keśavaḥ🌻*
*OM Keśavāya namaḥ*
सूर्यादिकेषु सङ्क्रान्ता अंशवः केशसंज्ञिताः।
तद्वत्तया केशव इत्युच्यते विबुधैर्हरिः ॥
*Sūryādikeṣu saṅkrāntā aṃśavaḥ keśasaṃjñitāḥ,*
*Tadvattayā keśava ityucyate vibudhairhariḥ.*
*Keśa is the name given to rays of luminous objects like sun etc. As He has them, He is called Keśavaḥ.*
:: श्रीमहाभारते शान्तिपर्वणि मोक्षधर्मपर्वणि एकचत्वारिंशदधिकत्रिशततमोऽध्यायाः ::
अंशवो यत् प्रकाशन्ते ममैते केशसंज्ञिताः ।
सर्वज्ञाः केशवं तस्मान्मामाहुर्द्विजसत्तमाः ॥४८ ॥
Śrī Mahābhārata - Śānti Parva, Mokṣadharma Parva - Chapter 341
Aṃśavo yat prakāśante mamaite keśasaṃjñitāḥ,
Sarvajñāḥ keśavaṃ tasmānmāmāhurdvijasattamāḥ.48.
*My rays which illumine are called keśas. Therefore, learned people, the best among the dvijas (twice born) call me Keśava.*
ब्रह्मविष्णुशिवाभिख्याः शक्तयः केशसंज्ञिताः ।
तद्वत्तया वा केशव उक्त्रास्त्रय इत् श्रुतेः ॥
Brahmaviṣṇuśivābhikhyāḥ śaktayaḥ keśasaṃjñitāḥ,
Tadvattayā vā keśava uktrāstraya it śruteḥ.
*The śaktis or powers called Brahmā, Viṣṇu and Śiva are designated as Keśas. Having them, He is Keśava. Trayaḥ Keśinaḥ / त्रयः केशिनः (Rg veda 1.64.44) - There are three Keśins.*
मुनिना विष्णुपुराणे मत्केशौ वसुधातले ।
इत्यत्र केश शब्दो हि प्रयुक्तश्शक्ति वाचकः ॥
Muninā viṣṇupurāṇe matkeśau vasudhātale,
Ityatra keśa śabdo hi prayuktaśśakti vācakaḥ.
*As mentioned in Viṣṇu purāṇa (part 5, chapter 1), 'My Keśas are in the earth.' Here too the word keśa is used as a synonym for śakti.*
त्रयः केशिन इत्यादि श्रुतौ धर्मैकमूलके ।
कोब्रह्मेति समाख्यातः ईशोऽहं सर्वदेहिनां ॥
अवान्तरांश सम्भूतौ तस्मात् केशव नामवान् ।
इति हरिवंशे व्यास मुनिना परिकीर्तनात् ॥
Trayaḥ keśina ityādi śrutau dharmaikamūlake,
Kobrahmeti samākhyātaḥ īśo’haṃ sarvadehināṃ.
Avāntarāṃśa sambhūtau tasmāt keśava nāmavān,
Iti harivaṃśe vyāsa muninā parikīrtanāt.
*It is mentioned in Harivaṃśa that Rudra praises the Lord as 'Ka means Brahma and I am Īsa, the Lord of all that are embodied. We i.e, Brahma and Rudra are Your aṃśās i.e., manifestations. So, You have the name Keśavaḥ.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
कालनेमिनिहा वीरश्शौरिश्शूरजनेश्वरः ।त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः ॥ ६९ ॥
కాలనేమినిహా వీరశ్శౌరిశ్శూరజనేశ్వరః ।త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ॥ 69 ॥
Kālaneminihā vīraśśauriśśūrajaneśvaraḥ,Trilokātmā trilokeśaḥ keśavaḥ keśihā hariḥ ॥ 69 ॥
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 327 / DAILY WISDOM - 327 🌹*
*🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀*
*✍️ .స్వామి కృష్ణానంద 📝. ప్రసాద్ భరద్వాజ*
*🌻 22. వస్తువులు వస్తాయి, పోతాయి. 🌻*
*మీరు ఆప్యాయత, దయ మరియు కరుణ, సేవాభావం మరియు దాతృత్వం కలిగి ఉండాలని చెప్పబడింది. నిజానికి ఇవన్నీ చాలా చాలా ముఖ్యమైనవే, కానీ వీటన్నింటి కంటే ముఖ్యమైనది మరొకటి ఉంది, ఇది ఆత్మ చివరకు ఎక్కడికి చేరుకుంటోంది అనే విషయం. ఈ ప్రపంచం మానవజాతితో సహా ఏదో ఒక రోజు అదృశ్యమవుతుంది. ఒక దానికి ప్రారంభం ఉంటే, ముగింపు కూడా ఉంటుంది. సౌర వ్యవస్థ కూడా శాశ్వతంగా మనుగడ సాగించక పోవచ్చు. మన ఇంద్రియాలకు అంతా బాగానే ఉన్నట్లు అనిపించినా, అది నిజం అనుకొని సంతృప్తి చెందడం అంత తెలివైన పనేమీ కాదు.*
*వస్తువులు వస్తాయి, పోతాయి. మనుషులు పుడతారు, చనిపోతారు. సామ్రాజ్యాలు పెరుగుతాయి, పతనమవుతాయి. చాలా మంది సీజర్లు మరియు నెపోలియన్లు వచ్చారు మరియు పోయారు. ఏమీ మిగలలేదు. ఈ డ్రామా ఏమిటి? ఈ నిగూఢ విశ్వ చరిత్రలో ఏదీ శాశ్వతంగా ఉన్నట్లు అనిపించదు. కొంత కాలం పాటు మనుగడలో ఉన్నట్లు కనిపించినా, అది ఎంత కాలం ఉంటుంది తెలీదు. ఈ ప్రపంచంలో మనకు సంవత్సరాలు కాదు కదా ఎన్ని నిమిషాలు ఉన్నాయో తెలీదు. కొన్ని కారణాల వల్ల కొన్ని నిమిషాలు మాత్రమే ఉండవచ్చు. గత అనుభవాలను బట్టి, చరిత్రను బట్టి మనం నేర్చుకోవాలి.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 327 🌹*
*🍀 📖 from Your Questions Answered 🍀*
*📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj*
*🌻 22. Things Come, and Things Go 🌻*
*You must be affectionate, kind and compassionate, serviceful and charitable, they say. All this is very, very important indeed, but there is something more important than all these things, which is the destiny of the soul of the human individual—what happens, finally. This world shall vanish one day, with all its humanity. If it had a beginning, it shall have an end, also. Even the solar system may not survive eternally. It would not be a wise complacence on the part of anyone to imagine that everything is fine, as it appears on the surface to the sense organs.*
*Things come, and things go. People are born, and people die. Empires rise, and empires fall. Caesars and Napoleons have come, and many have gone, also. Nothing remains. What is this drama? In this mysterious presentation of the history of the universe, the history of humanity, nothing seems to be enduring, and even when something appears to be enduring for some time, we do not know for how long it will endure. None of us knows how many minutes more we will be in this world, let alone years. There may be only a few minutes, for some reason. We have to learn by past experience, and by history.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 227 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. మనలో మనమేది సృష్టించుకుంటే అది అయస్కాంత క్షేత్రమవుతుంది. వ్యక్తి అస్తితవ్వపు ఆశీర్వాదాన్ని అందుకోదలచుకుంటే తనకు వీలయినంత ఆనందాన్ని సృష్టించాలి. 🍀*
*నువ్వు అయస్కాంత శక్తిని కలిగి వుంటే దానికి తగిన దానినే ఆకర్షిస్తావు. అది ఒక తాగుబోతు నగరానికి రావడం లాంటిది. వెంటనే అతను నగరంలోని యితర తాగుబోతుల్ని కలుస్తాడు. జూదగాడు నగరానికి వస్తే యితర జూదగాళ్ళని కలుస్తాడు. దొంగ నగరానికి వస్తే యితర దొంగల్తో స్నేహం చేస్తాడు. ఒక సత్యాన్వేషి నగరానికి వస్తే యితర సత్యాన్వేషకుల్ని కనిపెడతాడు. మనలో మనమేది సృష్టించుకుంటే అది అయస్కాంత క్షేత్రమవుతుంది. అది ఒక శక్తి కేంద్రాన్ని ఏర్పరుస్తుంది. అక్కడి నించీ పనులు జరగడం ఆరంభిస్తాయి.*
*కాబట్టి వ్యక్తి అస్తితవ్వపు ఆశీర్వాదాన్ని అందుకో దలచుకుంటే తనకు వీలయినంత ఆనందాన్ని సృష్టించాలి. నీ దగ్గర మరింత వుంటే అది మరింతగా వస్తుంది. ఒకసారి ఈ రహస్యాన్ని వ్యక్తి అర్థం చేసుకుంటే లోపలి ప్రపంచంలో అతను మరింత మరింత సంపన్నుడవుతాడు. అతని ఆనందంలో అంతులేని గాఢత పెరుగుతుంది. పరవశానికి అక్కడ అంతు వుండదు. వ్యక్తి సరైన మార్గంలో అడుగుపెట్టడ మొక్కటే జరగాలి.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Comentarios