top of page
Writer's picturePrasad Bharadwaj

🍀 18 - DECEMBER - 2022 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🍀

🌹🍀 18 - DECEMBER - 2022 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🍀🌹

1) 🌹 18 - DECEMBER - 2022 SUNDAY, ఆదివారం భాను వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹 కపిల గీత - 105 / Kapila Gita - 105 🌹 సృష్టి తత్వము - 61

3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 697 / Vishnu Sahasranama Contemplation - 697 🌹

4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 144 / Agni Maha Purana - 144 🌹 🌻. వాసుదేవ ప్రతిమా లక్షణము - 3🌻

5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 279 / Osho Daily Meditations - 279 🌹 279. వైరాగ్యం - NON-ATTACHMENT

6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 419 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 419 - 2 🌹. 'జడాత్మికా’ - 2 'Jadatmika' - 2


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹18, డిసెంబరు, December 2022 పంచాగము - Panchagam 🌹*

*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*

*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*

*ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*


*🍀. ఆదిత్య స్తోత్రం - 14 🍀*


*14. దుఃస్వప్నం దుర్నిమిత్తం దురితమఖిల మప్యామయానప్య సాధ్యాన్*

*దోషాన్ దుఃస్థానసంస్థ గ్రహగణజనితాన్ దుష్టభూతాన్ గ్రహాదీన్ |*

*నిర్ధూనోతి స్థిరాం చ శ్రియమిహ లభతే ముక్తిమభ్యేతి చాన్తే*

*సంకీర్త్య స్తోత్రరత్నం సకృదపి మనుజః ప్రత్యహం పత్యురహ్నామ్*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : ఆత్మసుఖ త్యాగ పద్ధతి ఆత్మ పారిశుద్ధ్యానికి గొప్ప సాధనమనే మాట నిజమే. కాని, అదే జీవితానికి పరమ లక్ష్యమూ, పరమ ధర్మమూ కానేరదు, నిన్ను నీవు హింసించుకోడం కంటె జగత్తులో ఈశ్వరుని తృప్తుని చెయ్యడం నీకు పరమలక్ష్యమై పుండాలి. 🍀*


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, హేమంత ఋతువు,

దక్షిణాయణం, మార్గశిర మాసం

తిథి: కృష్ణ దశమి 27:33:30 వరకు

తదుపరి కృష్ణ ఏకాదశి

నక్షత్రం: హస్త 10:19:18 వరకు

తదుపరి చిత్ర

యోగం: సౌభాగ్య 06:48:15 వరకు

తదుపరి శోభన

కరణం: వణిజ 15:37:23 వరకు

వర్జ్యం: 18:23:00 - 19:59:48

దుర్ముహూర్తం: 16:16:34 - 17:00:58

రాహు కాలం: 16:22:07 - 17:45:20

గుళిక కాలం: 14:58:54 - 16:22:07

యమ గండం: 12:12:28 - 13:35:41

అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:34

అమృత కాలం: 04:04:00 - 05:44:00

మరియు 28:03:48 - 29:40:36

సూర్యోదయం: 06:39:36

సూర్యాస్తమయం: 17:45:20

చంద్రోదయం: 01:24:56

చంద్రాస్తమయం: 13:35:04

సూర్య సంచార రాశి: ధనుస్సు

చంద్ర సంచార రాశి: కన్య

యోగాలు: మానస యోగం - కార్య లాభం

10:19:18 వరకు తదుపరి పద్మ యోగం

- ఐశ్వర్య ప్రాప్తి


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. కపిల గీత - 105 / Kapila Gita - 105🌹*

*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*

*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 61 🌴*


*61. మనసశ్చంద్రమా జాతో బుద్ధిరబుద్ధేర్గిరాం పతిః|*

*అహంకారస్తతో రుద్రశ్చితం చైత్యస్తతోఽభవత్॥*


*మనస్సునుండి దాని అభిమాన దేవతయైన చంద్రుడు, హృదయము నుండి బుద్ధియు, దాని అభిమాన దేవతయైన బ్రహ్మ వ్యక్తమయ్యెను. పిమ్మట అహంకారము, దాని అభిమాన దేవతయైన రుద్రుడు ఉత్పన్నమయ్యెను. అనంతరము చిత్తము, దాని అభిమాన దేవతయైన క్షేత్రజ్ఞుడు రూపొందెను.*


*మనసు కూడా చంద్రునిలాగ వికారాత్మకం. అదే హృదయం నుంచి బుద్ధి పుట్టింది. ఈ బుద్ధికి అధిపతి బ్రహ్మ. ఈ హృదయం నుండే అహంకారం పుట్టింది. దీనికి అధిపతి రుద్రుడు. అదే హృదయం నుండే చిత్తం పుట్టింది. చైత్యుడు (క్షేత్రజ్ఞుడు లేదా జీవుడు) చిత్తములో ఉంటాడు.*


*సశేషం..*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Kapila Gita - 105 🌹*

*🍀 Conversation of Kapila and Devahuti 🍀*

*📚 Prasad Bharadwaj*


*🌴 2. Fundamental Principles of Material Nature - 61 🌴*


*61. manasaś candramā jāto buddhir buddher girāṁ patiḥ*

*ahaṅkāras tato rudraś cittaṁ caityas tato 'bhavat*


*After the mind, the moon appeared. Intelligence appeared next, and after intelligence, Lord Brahmā appeared. Then the false ego appeared and then Lord Śiva, and after the appearance of Lord Śiva came consciousness and the deity presiding over consciousness.*


*The moon appeared after the appearance of mind, and this indicates that the moon is the presiding deity of mind. Similarly, Lord Brahmā, appearing after intelligence, is the presiding deity of intelligence, and Lord Śiva, who appears after false ego, is the presiding deity of false ego. In other words, it is indicated that the moon-god is in the mode of goodness, whereas Lord Brahmā is in the mode of passion and Lord Śiva is in the mode of ignorance. The appearance of consciousness after the appearance of false ego indicates that, from the beginning, material consciousness is under the mode of ignorance and that one therefore has to purify himself by purifying his consciousness.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 697 / Vishnu Sahasranama Contemplation - 697🌹*


*🌻697. వసుమనాః, वसुमनाः, Vasumanāḥ🌻*


*ఓం వసుమనసే నమః | ॐ वसुमनसे नमः | OM Vasumanase namaḥ*


*అవిశేషేణ సర్వేషు విషయేష్వస్య చక్రిణః ।*

*వసతీతి వసుప్రోక్తమ్ తాదృశం విద్యతే మనః ।*

*ఇతి విష్ణుర్వసుమనా ఇతి సఙ్కీర్త్యతే బుధైః ॥*


*సమానముగా ఒకే విధమున సర్వ భూతముల యందును వసించును కావున వసుః. సర్వ భూతముల యందును సమాన రూపమున వసించు మనస్సు ఈతనికి కలదు గనుక వసుమనాః.*


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 697🌹*


*🌻697. Vasumanāḥ🌻*


*OM Vasumanase namaḥ*


अविशेषेण सर्वेषु विषयेष्वस्य चक्रिणः ।

वसतीति वसुप्रोक्तम् तादृशं विद्यते मनः ।

इति विष्णुर्वसुमना इति सङ्कीर्त्यते बुधैः ॥


*Aviśeṣeṇa sarveṣu viṣayeṣvasya cakriṇaḥ,*

*Vasatīti vasuproktam tādr‌śaṃ vidyate manaḥ,*

*Iti viṣṇurvasumanā iti saṅkīrtyate budhaiḥ.*


*He resides uniformly in all beings i.e., vasu. His mind is of that nature and hence Vasumanāḥ.*


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः ।

वसुप्रदो वासुदेवो वसुर्वसुमना हविः ॥ ७४ ॥

మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః ।

వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః ॥ 74 ॥

Manojavastīrthakaro vasuretā vasupradaḥ,

Vasuprado vāsudevo vasurvasumanā haviḥ ॥ 74 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 144 / Agni Maha Purana - 144 🌹*

*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*

*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 44*


*🌻. వాసుదేవ ప్రతిమా లక్షణము - 3🌻*


*గంధ పాత్రము, ఆ వర్తము, శష్కులి (చెవి రంధ్రము) కూడ నిర్మింపవలను. క్రింది పెదవి ఒక అంగులము, పైపెదవి అర అంగుళము ఉండవలెను. నేత్రవిస్తారము అర అంగుళము, ముఖ విస్తారము నాలుగు అంగుళములు ముఖము వెడల్పు ఒకటిన్నర అంగుళములు ఉండవలెను. ముక్కు ఎత్తు ఒక అంగుళము పొడవు రెండు అంగుళములు ఉండవలెను. దాని అకారము కరవీర కుసుమము వలె ఉండవలెను. రెండు నేత్రముల మధ్య నాలుగు అంగుళముల అవకాశముండ వలెను. రెండు అంగుళములు నేత్రముల పరిధిలోనికి రాగా ఇంక రెండు అంగుళముల వ్యవధానముండును.*


*నేత్రములోని మూడవ వంతు నల్లగ్రుడ్లు, ఐదవవంతు చిన్న నల్లగ్రుడ్డు ఉండవలెను. నేత్ర విస్తారము రెండు అంగుళములు, ద్రోణి అర అంగుళము ఉండవలెను. కను బొమ్మల రేఖల ప్రమాణము కూడ అంతే ఉండవలెను. రెండు కను బొమ్మలును ఒకే ప్రమాణములో ఉండవలెను. కనుబొమ్మల మధ్య రెండు అంగుళములు విస్తారము నాలుగు అంగుళములు ఉండవలెను.*


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Agni Maha Purana - 144 🌹*

*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *


*Chapter 44*

*🌻Characteristics of the image of Vāsudeva - 3 🌻*


17. Then the external auditory passage with its membranes etc. should be made. The lower lip should be of two aṅgulas and the upper lip should be half of it.


18. Then the (breadth) of an eye (should be) half an aṅgula and the mouth (should be) four aṅgulas. The measurement of its depth is spoken to be one and a half aṅgulas.


19-20. The unopened mouth should be in this way. The opened mouth should be three aṅgulas. The base of the bridge of the nose should be one aṅgula high. From its tip it should be two aṅgulas similar to the karavīra (flower) (oleander). The intervening space between the two eyes should be made to measure four aṅgulas.


21. The corners of the eyes (should be) two aṅgulas. The space between them (should be) two aṅgulas. The pupil (should be) one third of the eye and the iris (should be) one fifth (of it).


22. The breadth of the eye (should be) three aṅgulas. The cavity (of the eye) is considered to be half an aṅgula. The lengths of the eyebrows are considered to be equal and are proportional to the eye-brows.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 279 / Osho Daily Meditations - 279 🌹*

*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 279. వైరాగ్యం 🍀*


*🕉. పరిత్యాగం చేయడం కాదు. జీవితం ఇచ్చే ప్రతిదాన్ని ఆస్వాదించండి, కానీ ఎల్లప్పుడూ స్వేచ్ఛగా ఉండండి. కాలం మారినా, విషయాలు అదృశ్యమైనా, మీకు ఎలాంటి తేడా తీసుకు రాకపోతే, మీరు రాజభవనంలో అయినా ఉండొచ్చు, గుడిసెలోనైనా ఉండొచ్చు... ఆకాశం కింద ఆనందంగా జీవించొచ్చు. 🕉*


*దేనికీ అంటి పెట్టుకుని ఉండకూడదన్న నిరంతర అవగాహన జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. అందుబాటులో ఉన్నవాటిని విపరీతంగా ఆనందించ వచ్చు. ఇది ప్రతి ఒక్కరికి ఇది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంది, కానీ మనస్సు చాలా విషయాలతో ముడిపడి ఉంటుంది - ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే వేడుకకు మనం గుడ్డిగా ఉంటాము. మాస్టర్ అయిన ఒక జెన్ సన్యాసి కథ ఉంది. ఒక రాత్రి అతని గుడిసెలోకి ఒక దొంగ ప్రవేశించాడు, కానీ అక్కడ దొంగిలించడానికి ఏమీ లేదు. దొంగ ఏమి అనుకుంటాడోనని ఆయన చాలా ఆందోళన చెందారు. ఇంత చీకటి రాత్రిలో ఊరు నుంచి కనీసం నాలుగైదు మైళ్ల దూరం వచ్చిన దొంగకు ఏమీ దొరకక పోతే ఎలా అనే ఆలోచనతో ఆందోళన చెందాడు. ఆ సన్యాసి దగ్గర అతను ఉపయోగించే ఒక దుప్పటి మాత్రమే ఉంది.


అదే అతని ప్రతీది. దుస్తులు మరియు దుప్పటి కూడా. దానిని ఒక మూలన పెట్టాడు, కానీ దొంగకి చీకట్లో అది కనిపించలేదు, కాబట్టి మాస్టారు దుప్పటిని తీసుకోమని చెప్పవలసి వచ్చింది. అతను రిక్తహస్తాలతో తిరిగి వెళ్లకూడదని, దానిని బహుమతిగా తీసుకోమని వేడుకున్నాడు. దొంగ చాలా అబ్బురపడ్డాడు; అతను చాలా ఇబ్బందికరంగా భావించాడు. చివరకు అతను ఆ దుప్పటిని తీసుకు వెళ్లాడు. మాస్టారుకి చేతనైతే ఆ మనిషికి చంద్రుడిని ఇచ్చి ఉండే వాడినని కవిత రాశాడు. ఆ రాత్రి చంద్రుని కింద నగ్నంగా కూర్చొని చంద్రుడితో మునుపెన్నడూ లేనంతగా దగ్గరతనం ఆస్వాదించాడు. జీవితం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. మీరు ఆనందించ గల దాని కంటే ఇది ఎల్లప్పుడూ ఎక్కువగానే ఉంటుంది; మీరు ఎల్లప్పుడూ మీరు ఇవ్వగలిగిన దాని కంటే ఎక్కువ కలిగి ఉంటారు.*

*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹




*🌹 Osho Daily Meditations - 279 🌹*

*📚. Prasad Bharadwaj*


*🍀 279. NON-ATTACHMENT 🍀*


*🕉. I am not for renunciation. Enjoy everything that life gives, but always remain free. If times change, if things disappear, it makes no difference to you. You can live in a palace, you can live in a hut ... you can live as blissfully under the sky. 🕉*


*The constant awareness that one should not start clinging to anything makes life blissful. One enjoys tremendously whatever is available. It is always more than one can enjoy, and it is always available. But the mind is too attached to things-we become blind to the celebration that is always available. There is a story of a Zen monk who was a master. One night a thief entered his hut, but there was nothing there to steal. The master became very worried about what the thief would think. He had come at least four or five miles out of the town, and on such a dark night....*


*The monk had only one blanket that he was using-that was his clothing and bedcover and everything. He put the blanket in the corner, but the thief could not see in the dark, so the master had to tell him to take the blanket, begged him to take it as a gift saying that he should not return empty-handed. The thief was much puzzled; he felt so awkward that he simply escaped with the blanket. The master wrote a poem saying that if he had been able, he would have given the man the moon. Sitting under the moon that night, naked, he enjoyed the moon more than ever before. Life is always available. It is always more than you can enjoy; you always have more than you can give.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 419 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 419 -2 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*


*🍀 90. చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।*

*గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥ 🍀*


*🌻 419. 'జడాత్మికా’ - 2🌻*


*"ఈశ్వరః సర్వభూతానాం, హృద్దేశే తిష్ఠతి", "ఈశావాస్య మీదం జగత్”, “వాసుదేవ సర్వమితి" అను సూక్తులు సతతము ఆస్తిక జనులు వినుచునే యుందురు. పండితులు చెప్పుచునే యుందురు. కాని ఎవ్వరునూ ఆచరించరు. అట్టి ఆచరణ గలవారు కోటి కొక్కరుందురేమో! కేవలము యోగీశ్వరులే అట్లుండగలరు. వారే సమదర్శనులు. వారు జడమును అనాదరణ చేయరు. అందు కూడ దైవమున్నాడన్న ఎఱుక కలిగి యుందురు.*


*ఇటీవలి కాలమున రామకృష్ణ పరమహంస, మాస్టర్ ఇ.కె. అట్టి సమదర్శనమును ప్రదర్శించిరి. మరెందరో కూడా అట్లు యుండి యుండ వచ్చును. శ్రీమద్భగవద్గీత, భాగవతము అందించు సారాంశమిదియే. నామరూపాత్మకమైన జగత్తును నిరసింపక సమస్తమును దైవముగా చూచుట జడశక్తిః, జడాత్మికా అను నామముల నుండి గ్రహింప వచ్చును.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 419 - 2 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj*


*🌻 90. Chichakti shchetanarupa jadashakti jadatmika*

*Gayatri vyahruti sandhya dvijabrunda nishemita ॥ 90 ॥🌻*


*🌻 419. 'Jadatmika' - 2🌻*


*Theistic people are constantly hearing the sayings like 'Ishvarah Sarvabhutanam, Hriddeshe Tishthati', 'Ishavasya Aamam Jagat', 'Vasudeva Sarvamiti'. Scholars keep saying them. But no one practices. There are probably only one in a millions who practice like that! Only yogis can be like that. They are the equanimous. They do not disrespect inertia. They believe that there is a God even in inertia.*


*In recent times Ramakrishna Paramahamsa, Master E.K. showed such equanimity. Others may be like that. Srimad Bhagavad Gita, Bhagavata provides the same essence. Seeing everything as divine without objecting to the nominal physical world can be understood from the names Jadashaktih and Jadatmika.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


Join and Share

Commentaires


Post: Blog2 Post
bottom of page