🌹🍀 19 - NOVEMBER - 2022 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🍀🌹
🌹19 - NOVEMBER నవంబరు - 2022 SATURDAY శనివారం, స్థిర వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 284 / Bhagavad-Gita -284 - 7వ అధ్యాయము 04 జ్ఞాన విజ్ఞాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 683 / Vishnu Sahasranama Contemplation - 683 🌹
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 645 / Sri Siva Maha Purana - 645 🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 362 / DAILY WISDOM - 362 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 261 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹19, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*
*🍀. శ్రీ వీరభద్ర దండక స్తోత్రం - 3 🍀*
*చూర్ణీకృతార్యేషు దోర్దండ పాండిత్య సంరంభణోల్లాస | రాజత్కరాంభోజ విన్యస్త ఖడ్గత్రిశూలాది నానాయుధా | భండనాచార్య | రుద్రాక్షమాలాలసద్దేహ | రత్నాంచితానర్ఘ సౌవర్ణ కేయూర భాస్వత్ కిరీటోత్తమాంగా |*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : మరుగు పడివున్న విజ్ఞానపు అస్పష్ట ప్రతిబింబమే హృదయమందలి విశ్వాసం. విశ్వాసికి అత్యంత సంశయాళుని కంటే ఎక్కువగానే సంశయాలు కలుగుతూ వుంటాయి. కాని, అతనికి తెలియకుండా అతని లోపల తెలుసుకున్నదేదో ఉండడం చేత అతడు తన విశ్వాసం వీడడు. ఆదే సాక్షాత్కార పర్యంతమూ అతనిని ప్రేరేపించి నడిపిస్తుంది. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, శరద్ ఋతువు,
దక్షిణాయణం, కార్తీక మాసం
తిథి: కృష్ణ దశమి 10:31:03 వరకు
తదుపరి కృష్ణ ఏకాదశి
నక్షత్రం: ఉత్తర ఫల్గుణి 24:15:17
వరకు తదుపరి హస్త
యోగం: వషకుంభ 24:25:49 వరకు
తదుపరి ప్రీతి
కరణం: విష్టి 10:27:02 వరకు
వర్జ్యం: 06:40:48 - 08:21:12
దుర్ముహూర్తం: 07:53:06 - 08:38:13
రాహు కాలం: 09:12:04 - 10:36:40
గుళిక కాలం: 06:22:51 - 07:47:28
యమ గండం: 13:25:52 - 14:50:28
అభిజిత్ ముహూర్తం: 11:39 - 12:23
అమృత కాలం: 16:43:12 - 18:23:36
సూర్యోదయం: 06:22:51
సూర్యాస్తమయం: 17:39:40
చంద్రోదయం: 01:54:39
చంద్రాస్తమయం: 14:28:54
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు : ఉత్పాద యోగం - కష్టములు,
ద్రవ్య నాశనం 24:15:17 వరకు తదుపరి
మృత్యు యోగం - మృత్యు భయం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 284 / Bhagavad-Gita - 284 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 7 వ అధ్యాయము - జ్ఞానవిజ్ఞాన యోగం - 04 🌴*
*04. భూమిరాపోనలో వాయు; ఖం మనో బుద్ధిరేవ చ |*
*అహజ్కార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా*
🌷. తాత్పర్యం :
*భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అను ఎనిమిది అంశముల సముదాయము నా భిన్నప్రకృతి యనబడును.*
🌷. భాష్యము :
భగవత్తత్త్వవిజ్ఞానము భగవానుని దివ్యమగు స్థితిని మరియు అతని విభిన్నశక్తులను విశ్లేషించి చర్చించును. సాత్వతంత్ర్యములో వివరింపబడినట్లు ఆ భగవానుని వివిధ పురుషావతారముల యందలి శక్తిచే ప్రకృతి యని పేరు.
విష్ణోస్తు త్రీణి రూపాణి పురుషాఖ్యాన్యథో విదు: |
ఏకం తు మహత: స్రష్టృ ద్వితీయం త్వండ సంస్థితం |
తృతీయం సర్వభూతస్థం తాని జ్ఞాత్వా విముచ్యతే
“భౌతికజగత్తు సృష్టికై శ్రీకృష్ణభగవానుడు సంపూర్ణస్వాంశ మూడు విష్ణురూపములను దాల్చును. అందులో మొదటి విష్ణురూపమైన మాహావిష్ణువు మహతత్త్వమని తెలియబడును భౌతికశక్తిని సృష్టించును. రెండవ విష్ణురూపమైన గర్భోదకశాయివిష్ణువు వివధవ్యక్తీకరణలకై అన్ని విశ్వములందును ప్రవేశించును. ఇక మూడవ విష్ణురూపమైన క్షీరోదకశాయివిష్ణువు సకల విశ్వములందు పరమాత్మ రూపున వ్యాపించి పరమాత్మగా పిలువబడు అణువణువు నందును నిలిచియుండును. ఈ ముగ్గురు విష్ణువుల గూర్చి తెలిసినవాడు భవబంధము నుండి ముక్తిని పొందగలడు.”
ఈ శ్లోకమున తెలుపబడినట్లు భౌతికశక్తి యందు ముఖ్యముగా ఎనిమిది అంశములు కలవు. వీనిలో భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము లనునవి మహత్తర సృష్టి లేదా స్థూలసృష్టిగా పిలువబడును. వీనియందే శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధమను ఐదు ఇంద్రియార్థములు ఇమిడియున్నవి. భౌతిక విజ్ఞానశాస్త్రము కేవలము ఈ పదివిషయములనే చర్చించును. కాని అన్యమును కాదు. కాని మనస్సు, బుద్ధి, అహంకారమను మిగతా మూడువిషయములు భౌతికవాదులచే ఉపేక్షింపబడును.
మనోకర్మలతో తాదాత్మ్యము చెందియుండు తత్త్వవేత్తలు కూడా సర్వమునకు మూలకారణము శ్రీకృష్ణుడని ఎరుగలేనందున జ్ఞానమునందు అసంపూర్ణులైయున్నారు. “నేను నాది” యను అహంకారభావనమే భౌతికస్థితి మూలకారణమై యున్నది. అట్టి అహంకారము భౌతికకర్మలకు ఉపయోగపడు దశేంద్రియములను కూడియుండును. బుద్ధి యనునది మహతత్త్వమని పిలువబడు పూర్ణ భౌతికసృష్టి సంబంధించినది. అనగా శ్రీకృష్ణభగవానుని ఈ ఎనిమిది భిన్నశక్తుల నుండి భౌతికజగత్తు యొక్క ఇరువదినాలుగు అంశములు వ్యక్తమగుచున్నవి. ఈ ఇరువదినాలుగు అంశములు విషయమే నాస్తిక సాంఖ్యవాదపు చర్చనీయాంశమై యున్నది.
వాస్తవమునకు అవియన్నియును శ్రీకృష్ణుని శక్తి నుండియే ఉద్భవించి, అతని నుండి విడివడియున్నవి. కాని అల్పజ్ఞులైన సాంఖ్యతత్త్వవేత్తలు అట్టి శ్రీకృష్ణుని సర్వకారణకారణునిగా ఎరుగలేరు. గీతయందు తెలుపబడినట్లు శ్రీకృష్ణుని బాహ్యశక్తి స్వరూపమే సాంఖ్యతత్త్వమునందు చర్చనియాంశమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 284 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 7 - Jnana Vijnana Yoga - 04 🌴*
*04. bhūmir āpo ’nalo vāyuḥ khaṁ mano buddhir eva ca*
*ahaṅkāra itīyaṁ me bhinnā prakṛtir aṣṭadhā*
🌷 Translation :
*Earth, water, fire, air, ether, mind, intelligence and false ego – all together these eight constitute My separated material energies.*
🌹 Purport :
The science of God analyzes the constitutional position of God and His diverse energies. Material nature is called prakṛti, or the energy of the Lord in His different puruṣa incarnations (expansions) as described in the Nārada Pañcarātra, one of the Sātvata-tantras:
viṣṇos tu trīṇi rūpāṇi
puruṣākhyāny atho viduḥ
ekaṁ tu mahataḥ sraṣṭṛ
dvitīyaṁ tv aṇḍa-saṁsthitam
tṛtīyaṁ sarva-bhūta-sthaṁ
tāni jñātvā vimucyate
“For material creation, Lord Kṛṣṇa’s plenary expansion assumes three Viṣṇus. The first one, Mahā-viṣṇu, creates the total material energy, known as the mahat-tattva. The second, Garbhodaka-śāyī Viṣṇu, enters into all the universes to create diversities in each of them. The third, Kṣīrodaka-śāyī Viṣṇu, is diffused as the all-pervading Supersoul in all the universes and is known as Paramātmā. He is present even within the atoms. Anyone who knows these three Viṣṇus can be liberated from material entanglement.”
🌷 🌷 🌷 🌷 🌷
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 683 / Vishnu Sahasranama Contemplation - 683🌹*
*🌻683. స్తోతా, स्तोता, Stotā🌻*
*ఓం స్తోత్రే నమః | ॐ स्तोत्रे नमः | OM Stotre namaḥ*
*స్తోతేత్యపి స ఏవోక్తః కేశవో బుధసత్తమైః*
*స్తుతి చేయువాడును కేశవుడే గనుక స్తోతా అను నామము.*
*స్తుతించబడు వాడు, స్తుతి చేత ప్రసన్నుడగు వాడు, స్తోత్ర స్వరూపుడు, స్తుతి చేయుట అను క్రియయు, స్తుతి చేయువాడు సర్వమూ విష్ణు దేవుడే.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 683🌹*
*🌻683. Stotā🌻*
*OM Stotre namaḥ*
स्तोतेत्यपि स एवोक्तः केशवो बुधसत्तमैः
*Stotetyapi sa evoktaḥ keśavo budhasattamaiḥ*
*He who praises is Lord Keśava Himself.*
*He is the only One who is to be praised; He gets pleased by the encomium; He is the praise Himself; He is the act of praising and also the one who praises. Every aspect of worship is Lord Viṣṇu Himself.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
स्तव्यस्स्तवप्रियस्स्तोत्रं स्तुतिः स्तोता रणप्रियः ।पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः ॥ ७३ ॥
స్తవ్యస్స్తవప్రియస్స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః ।పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః ॥ 73 ॥
Stavyasstavapriyasstotraṃ stutiḥ stotā raṇapriyaḥ,Pūrṇaḥ pūrayitā puṇyaḥ puṇyakīrtiranāmayaḥ ॥ 73 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 645 / Sri Siva Maha Purana - 645 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 14 🌴*
*🌻. గణ వివాదము - 6 🌻*
శంకరుడిట్లు పలికెను -
గణములారా! మీరందరు వినుడు. యుద్ధము సముచితము కాదు. మీరు నాకు సంబంధించిన వారు. ఆ గణశుడు గౌరికి సంబంధించిన వాడు (56). ఓ నా గణములారా! నేనీ సమయములో వెనుకకు తగ్గినచో, శివుడు సర్వదా భార్యకు విధేయుడు అనే అపకీర్తి లోకములో నిశ్చయముగా స్థిరపడును (57).
ఎదుటి వాని శక్తిని గమనించి ప్రతీకారమును చేయవలెననే గొప్ప నీతి గలదు. ఏకాకి, బాలుడు అగు ఈ గణశుడు ఏమి పరాక్రమమును చూపగల్గును? (58). గణములారా! మీరు యుద్ధములో గొప్ప నిపుణులని లోకములో పేరు గాంచినారు. నా గణములై యుండియూ మీరు యుద్ధమును విడనాడి లోకములో తేలికయగుట ఎట్లు సంభవము? (59)
స్త్రీ మొండిపట్టు పట్టరాదు. భర్త యెదుట మొండిపట్టు అసలే పనికి రాదు. గిరిజా దేవి అట్లు చేసినచో దాని ఫలమును నిశ్చయముగా అనుభవించగలదు (60). కావున నా వీరులైన మీరందరు నా మాటను శ్రద్ధతో వినుడు. మీరు యుద్ధమును నిశ్చయముగా చేయవలెను. ఏది జరిగిననూ జరుగనిండు (61).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ నారదా! మునీశ్వరా! అనేక లీలలలో నిపుణుడగు శంకరుడు లోక గతిని ప్రదర్శిస్తూ ఇట్లు పలికి విరమించెను (62).
శ్రీ శివమహా పురాణాములోని రుద్ర సంహితయందు కుమార ఖండలో గణవివాదమనే పదునాల్గవ అధ్యాయము ముగిసినది (14).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 645🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 14 🌴*
*🌻 The Gaṇas argue and wrangle - 6 🌻*
Śiva said:—
57. O Gaṇas, hear you all. A battle may not be a proper course. You are all my own. He is Pārvatī’s Gaṇa.
58. But if we are going to be humble, there is likely to be a rumour: “Śiva is subservient to his wife.” O Gaṇas, this is certainly derogatory to me.
59. The policy of meeting an action with another (Tit for tat) is a weighty one. That single-handed Gaṇa is a mere boy. What valour can be expected of him?
60. O Gaṇas, you are all experts in warfare and reputed to be so in the world. You are my own men. How can you forsake war and demean yourselves?
61. How can a woman be obdurate especially with her husband? Pārvatī will certainly derive the fruit of what she has done.
62. Hence, my heroic men, listen to my words with attention. This war has to be fought by all means. Let what is in store happen.”
Brahmā said:—
63. O excellent sage, O brahmin, after saying thus, Śiva an adept in various divine sports became silent observing the ways of the world.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 362 / DAILY WISDOM - 362 🌹*
*🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀*
*📝. ప్రసాద్ భరద్వాజ్*
*🌻27. నేను సందేహిస్తున్నాను అని నేను సందేహించలేను🌻*
భారతదేశపు గొప్ప తత్వవేత్త అయిన శంకరాచార్యులు, మరియు ప్రసిద్ధ పాశ్చాత్య తత్వవేత్త అయిన రెనే డెస్కార్టెస్, స్వయం యొక్క స్వభావం గురించి వేర్వేరు సమయాల్లో ఒకే విధంగా ఆలోచించారు. దానిలో ఒకరి స్వీయ ఉనికిని అనుమానించడం అసాధ్యంగా పరిగణించబడింది, ఎందుకంటే సంశయవాదం, బయటి విషయాల స్వభావానికి అన్వయించవచ్చు కానీ సంశయవాది స్వయంగా వచ్చిన తీర్మానాలకు వర్తించదు. అంటే, ప్రతి దానిని అనుమానించడం కూడా సంశయవాది ఒక ఖచ్చితత్వంతో చేస్తాడు. సందేహాస్పద వాదన యొక్క ముగింపులు ఇతర విషయాలకు సంబంధించిన అదే సంశయవాదానికి లోబడి ఉండవు.
'నేను అనుమానిస్తున్నానని నేను సందేహించ లేను.' ఇది చివరకు ఒక ప్రాథమిక ముగింపు. ఒక వ్యక్తి ప్రతి దానిని అనుమానించ గలడు కానీ తను అనుమానిస్తున్నాడు అనే దానిపై అనుమానం కలిగి ఉండడు. ఎందుకంటే సందేహించే వారు, వారినే అనుమానించు కున్నట్లయితే, అలాంటి సందేహానికి అర్ధం ఉండదు. సాధారణ మనుగడలోని విషయాల పట్ల ఉన్న పట్టును తార్కిక విశ్లేషణలో ధిక్కరించే మనిషిలో కొంత ప్రత్యేకత ఉంది. చాలా మంది భారతీయ తత్వవేత్తలు చివరకు తీసుకున్న వైఖరి ఇదే. ఈ రహస్యం, అన్ని ప్రకృతి రహస్యాలను ఛేదిండానికి మార్గాన్ని ఏర్పరుస్తుంది. ఈ 'నేను ఉన్నాను,' లేదా 'నేను ఉనికిలో ఉన్నాను' అనేవి ఒకదానికొకటి విరుద్ధమైనవి కావు. ఇది తిరస్కరించ లేనిది మరియు తప్పుపట్టలేని జ్ఞానం.
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 362 🌹*
*🍀 📖 from The Philosophy of Religion 🍀*
*📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj*
*🌻27. I Cannot Doubt that I am Doubting🌻*
The great philosopher of India, Acharya Sankara, and another reputed philosopher of the West, Rene Descartes, thought on equal terms at different times in regard to the nature of the self. The doubting of the existence of one's own self has been regarded as impossible, because scepticism, while it can be applied to the nature of things outside, cannot be applied to the conclusions arrived at by the sceptic himself. The doubting of everything is an acceptance of the doubtless position which the sceptic maintains. The conclusions of a sceptical argument are not subject to the very same scepticism to which other things are subject.
“I cannot doubt that I am doubting.” This is the basic conclusion one finally lands upon. One can doubt everything but cannot doubt that one is doubting, because if one doubts the doubting, such doubting would have no sense. There is some peculiarity in man which defies the grasp at ordinary logical analysis. And this was the stand taken finally by most of the Indian philosophers. This mystery, this secret, may form the key to unlock the secrets of all nature. This “I am,” or “I exist” is uncontradictable, undeniable, and is infallible knowledge.
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 261 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. మనం దూరంగా వున్న దాని పట్ల ఆకర్షింప బడతాం. దగ్గరున్న దాని పట్ల దృష్టి పెట్టం. మన లోపలికి వెళితే మనలో వున్న ఐశ్వర్యాన్ని చూసి ఆశ్చర్యపోతాం. 🍀*
మనం శక్తివంతులంగా పుట్టిన మాట వాస్తవం. ఉన్నత శిఖరాలకు ఎదిగే శక్తి వున్నదన్నది నిజం. కానీ ఆ శక్తిని మనం వినియోగించాలి. దానికో పద్ధతి కావాలి. ఒక రకమయిన శాస్త్రీయత అవసరం. అదేమంత కష్టం కాదు. దానికి శాస్త్రీయమయిన ధ్యానం అవసరం. మనం దూరంగా వున్న దాని పట్ల ఆకర్షింప బడతాం. దగ్గరున్న దాని పట్ల దృష్టి పెట్టం.
మన లోపలికి వెళితే మనలో వున్న ఐశ్వర్యాన్ని చూసి ఆశ్చర్యపోతాం. మనలోని ఆకాశానికి దిగ్భ్రమ చెందుతారు. అపూర్వ సౌందర్యానికి అబ్బురపోతాం. దాన్ని యింతకాలం ఎలా మరిచిపోయా? ఎలా కోల్పోయాం? అని నివ్వెరపోతాం. దాని వల్ల నీ సమస్త అస్తిత్వం స్వర్గకాంతులు చిమ్ముతుంది.
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Comments