🌹🍀 20 - DECEMBER - 2022 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 20 - DECEMBER - 2022 TUESDAY, మంగళవారం భౌమ వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 106 / Kapila Gita - 106 🌹 సృష్టి తత్వము - 62
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 698 / Vishnu Sahasranama Contemplation - 698 🌹
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 145 / Agni Maha Purana - 145 🌹 🌻. వాసుదేవ ప్రతిమా లక్షణము - 4🌻
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 280 / Osho Daily Meditations - 280 🌹 280. సంక్షిప్త అంతర్దృష్టి - GLIMPSES
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 420 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 420 - 1 🌹. 420. 'గాయత్రీ' - 1 'Gayatri' - 1
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹20, డిసెంబరు, December 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*
*🍀. శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం - 6 🍀*
*11. సర్వవానరముఖ్యానాం ప్రాణభూతాత్మనే నమః |*
*శరణ్యాయ వరేణ్యాయ వాయుపుత్రాయ తే నమః*
*12. ప్రదోషే వా ప్రభాతే వా యే స్మరంత్యంజనాసుతమ్ |*
*అర్థసిద్ధిం జయం కీర్తిం ప్రాప్నువంతి న సంశయః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : పాప ప్రవృత్తి వలన, అధర్మ ప్రవృత్తి వలన చేకూరెడి చెరుపును గుర్తించడం తేలికే. అహంకృతి పూర్వకమైన పుణ్య ప్రవృత్తి, ధర్మ ప్రవృత్తి వలన చేకూరెడి చెరుపును గుర్తించడం కష్టం. దానిని సుశిక్షితమైన నేత్రం మాత్రమే గుర్తించ గలుగుతుంది. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, హేమంత ఋతువు,
దక్షిణాయణం, మార్గశిర మాసం
తిథి: కృష్ణ ద్వాదశి 24:46:55 వరకు
తదుపరి కృష్ణ త్రయోదశి
నక్షత్రం: స్వాతి 09:55:45 వరకు
తదుపరి విశాఖ
యోగం: సుకర్మ 24:40:27 వరకు
తదుపరి ధృతి
కరణం: కౌలవ 13:39:34 వరకు
వర్జ్యం: 15:12:06 - 16:42:42
దుర్ముహూర్తం: 08:53:46 - 09:38:09
రాహు కాలం: 14:59:52 - 16:23:04
గుళిక కాలం: 12:13:27 - 13:36:40
యమ గండం: 09:27:03 - 10:50:15
అభిజిత్ ముహూర్తం: 11:51 - 12:35
అమృత కాలం: 01:20:34 - 02:54:06
మరియు 24:15:42 - 25:46:18
సూర్యోదయం: 06:40:39
సూర్యాస్తమయం: 17:46:17
చంద్రోదయం: 03:13:31
చంద్రాస్తమయం: 14:55:14
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: ధ్వజ యోగం - కార్య సిధ్ధి
09:55:45 వరకు తదుపరి శ్రీవత్స యోగం
- ధన లాభం , సర్వ సౌఖ్యం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 106 / Kapila Gita - 106🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 62 🌴*
*62. ఏతే హ్యభ్యుత్థితా దేవా నైవాస్యోత్థాపనేఽశకన్|*
*పునరావివిశుః ఖాని తముత్థాపయితుం క్రమాత్॥*
*ఈ క్షేత్రజ్ఞుడే గాక, దేవతలందరు ఉత్పన్నులైనను, ఆ విరాట్ పురుషుని మేల్కొలుపుటకు అశక్తులైరి. ఆయనను మేల్కొలుపుటకై తమ తమ ఉత్పత్తి, స్థానముల యందు ప్రవేశించిరి.*
*ఇంతమంది అధిష్ఠాన దేవతలూ ఇంద్రియములూ వాటి కర్మలూ ఉన్నా, ఇవన్నీ నివృత్తి కర్మలో ఉన్న జీవుడిని ప్రవర్తింప చేయలేక పోయాయి. దాని కోసమై మళ్ళీ ఇంద్రియాధిష్ఠాన దేవతలు విరాట్ పురుషునిలోకి ప్రవేశించి దానిని కదిలించడానికి ప్రయత్నించాయి.*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 106 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*
*🌴 2. Fundamental Principles of Material Nature - 62 🌴*
*62. ete hy abhyutthitā devā naivāsyotthāpane 'śakan*
*punar āviviśuḥ khāni tam utthāpayituṁ kramāt*
*When the demigods and presiding deities of the various senses were thus manifested, they wanted to wake their origin of appearance. But upon failing to do so, they reentered the body of the virāṭ-puruṣa one after another in order to wake Him.*
*In order to wake the sleeping Deity-controller within, one has to rechannel the sense activities from concentration on the outside to concentration inside. In the following verses, the sense activities which are required to wake the virāṭ-puruṣa will be explained very nicely.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 698 / Vishnu Sahasranama Contemplation - 698🌹*
*🌻698. హవిః, हविः, Haviḥ🌻*
*ఓం హవిషే నమః | ॐ हविषे नमः | OM Haviṣe namaḥ*
*బ్రహ్మార్పణం బ్రహ్మహవిరితి గీతోక్తితో హవిః*
*శ్రీమద్భగవద్గీతలో కల భగవద్వచనముచే యజ్ఞాదుల యందు అర్పింపబడు హవిస్సు కూడా భగవద్రూపమే గనుక ఆ దేవదేవుడు హవిః.*
:: శ్రీమద్భగవద్గీత జ్ఞాన యోగము ::
బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ ।
బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మకర్మసమాధినా ॥ 24 ॥
*యజ్ఞము నందలి హోమ సాధనములు, హోమ ద్రవ్యములు, హోమాగ్ని, హోమము చేయువాడు, చేయబడు హోమము - అన్నియును బ్రహ్మ స్వరూపములే యనెడి ఏకాగ్ర భావముతో ఆ యజ్ఞాది కర్మలను చేయు మనుజుడు బ్రహ్మమునే పొందగలడు.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 698🌹*
*🌻698.Haviḥ🌻*
*OM Haviṣe namaḥ*
ब्रह्मार्पणं ब्रह्महविरिति गीतोक्तितो हविः
*Brahmārpaṇaṃ brahmahaviriti gītoktito haviḥ*
*By the Lord's word in Śrīmad Bhagavad Gīta, Brahman is the offer and also the offering.*
:: श्रीमद्भगवद्गीत ज्ञान योगमु ::
ब्रह्मार्पणं ब्रह्महविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम् ।
ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ॥ २४ ॥
Śrīmad Bhagavad Gīta - Chapter 4
Brahmārpaṇaṃ brahmahavirbrahmāgnau brahmaṇā hutam,
Brahmaiva tena gantavyaṃ brahmakarmasamādhinā. 24.
The ladle is Brahman, the oblation is Brahman, the offering is poured by Brahman in the sacrificial fire of Brahman. Brahman alone is to be reached by him who has concentration on Brahman as the objective.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः ।
वसुप्रदो वासुदेवो वसुर्वसुमना हविः ॥ ७४ ॥
మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః ।
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః ॥ 74 ॥
Manojavastīrthakaro vasuretā vasupradaḥ,
Vasuprado vāsudevo vasurvasumanā haviḥ ॥ 74 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 145 / Agni Maha Purana - 145 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 44*
*🌻. వాసుదేవ ప్రతిమా లక్షణము - 4🌻*
*కేశవాది మూర్తుల శిరస్సు మొత్తము తిరుగుడు ఇరువదియారు లేదా ముప్పది అంగుళము లుండవలెను. క్రింద కంఠము పది అంగుళములు, దాని తిరుగుడు ముప్పది అంగుళము, క్రిందినుండి పైకి కంఠ విస్తారము ఎనిమిది అంగుళములు, కంఠమునకును. వక్షస్థలమునకును మధ్యనున్న అవకాశము కంఠముకంటె మూడు రెట్లు విస్తారముతో ఉండవలెను. స్కంభములు ఎనిమిదేసి అంగుళములు, అంసములు మూడేసి అంగుళములు ఉంచవలెను. బాహువులు మోచేయివరకు పదునాలుగేసి అంగుళములు, ప్రబాహువులు (మోచేతి క్రింద) పదునారేసి అంగుళములు, బాహువులు వెడల్పు ఆ రంగుళములు. ప్రబాహువుల వెడల్పు కూడ దానితో సమానముగా ఉండవలెను.*
*బాహుదండము తిరుగుడు పై నుండి తొమ్మిది కలలు లేదా పదునేడు ఆంగుళము లుండవలెను. బాహు మధ్యమున కూర్పురము (మోచేయి) ఉండును. కూర్పరము తిరిగుడు పదునాలుగు అంగుళములు, ప్రబాహుమధ్యమున దాని విస్తారము పదునారు అంగుళములు, చేతి అగ్ర భాగము విస్తారము పండ్రెండు అంగుళములు, దాని మధ్య అరచేతి విస్తారము అరంగుళములు ఉండవలెను.*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 145 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 44*
*🌻Characteristics of the image of Vāsudeva - 4 🌻*
24. The measurement around the heads of the images of Keśava and other gods should be thirty-six (aṅgulas). The headmeasure of all those (images) which are short-necked (should be) ten (aṅgulas).
25. The inter-space between the neck and the chest should be three times the length of the neck and should be thrice as much broad plus eight aṅgulas.
26. The shoulders (should) be made (to measure) eight aṅgulas and the two beautiful shoulder regions (should be) three times those. The arms should measure seven times (the length of) the eyes. The fore arms (should be) sixteen aṅgulas.
27. The arms should be three kalās[1] in breadth and the forearms should also be equal to that. The upper arm should have a circumference of nine kalās.
28. It should be seventeen aṅgulas at the middle and sixteen aṅgulas above the elbow-joint. O Brahman! the circumference of elbow should be three times that.
29. The circumference of the middle of the forearm is said to be sixteen aṅgulas. The circumference of the fore-part of the arm is said to be twelve aṅgulas.
30. The palm of the hand is said to be six aṅgulas in breadth. The length should be seven aṅgulas. The middle (finger) should be five aṅgulas (long).
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 280 / Osho Daily Meditations - 280 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀 280. సంక్షిప్త అంతర్దృష్టి 🍀*
*🕉. సాక్షాత్కారం చాలా అకస్మాత్తుగా జరిగితే పిచ్చిగా మారవచ్చు. కనుక ఇది ఎల్లప్పుడూ సంక్షిప్త అంతర్దృష్టులతో మొదలవుతుంది. అది అలాగే మంచిది; అకస్మాత్తుగా తెరుచుకునే ఆకాశం చాలా ఎక్కువగా ఉంటే, భరించ లేరు. 🕉*
*కొన్నిసార్లు మీరు చాలా అకస్మాత్తుగా కొంత ఎక్కువ సృహలోకి వెళ్ళేంత పరిస్థతి ఎదురుకావచ్చు. కానీ ఇది ప్రమాదకరమైనది. ఎందుకంటే ఇది మీకు చాలా ఎక్కువ అయితే మీరు దానిని సవ్యంగా గ్రహించ లేరు. ఎప్పడూ వచ్చిన ఉన్నత సృహని ఎలా జీర్ణించుకుంటారు అనేది ముఖ్యం. అది కేవలం ఒక అనుభవం కాదు మీ స్వయం యొక్క అవగాహన. అనుభవమైతే అది వచ్చి పోతుంది; అది ఒక సంగ్రహావలోకనంగానే మిగిలిపోతుంది. ఏ అనుభవమూ శాశ్వతంగా ఉండదు - మీ స్వయం మాత్రమే శాశ్వతంగా ఉంటుంది. అంతర్గత విషయాల గురించి మరీ అత్యాశతో ఉండకండి. అత్యాశ బాహ్య విషయాలలో ఎంత చెడ్డదో, అంతర్గత విషయాలలో కూడా అంతే చెడ్డది.*
*మీరు డబ్బు మరియు అధికారం మరియు ప్రతిష్ట కోసం అత్యాశతో ఉన్నప్పుడు ఇది చాలా ప్రమాదకరం కాదు. ఎందుకంటే ఆ విషయాలు వ్యర్థమైనవి. మీరు అత్యాశతో ఉన్నారా లేదా అనే దానితో పెద్దగా తేడా లేదు. కానీ లోపల ఉన్న దురాశ, మీరు లోపలి మార్గంలో వెళ్ళినప్పుడు, చాలా ప్రమాదకరమైనది కావచ్చు. చాలా మందికి దాదాపు పిచ్చి పట్టింది. ఇది వారి కళ్లకు చాలా మిరుమిట్లు గొలిపేలా ఉంటుంది మరియు వారు అంధులుగా మారవచ్చు. రావడం, వెళ్లడం ఎప్పుడూ మంచిది. ఇది స్థిరమైన లయగా ఉండనివ్వండి, తద్వారా మీరు ప్రపంచానికి దూరంగా ఉండరు మరియు ప్రపంచంలో ఎన్నడూ ఉండరు. దాని ద్వారా మీరు దానిని అధిగమిస్తున్నారని మీరు గ్రహిస్తారు. ఈ ప్రక్రియ చాలా క్రమానుగతంగా జరగాలి. ఒక పువ్వు క్రమక్రమంగా తెరుచు కుంటున్నప్పుడు నిజంగా ఎప్పుడు ప్రారంభమైందో మీరు గ్రహించలేరు. ఆంతరిక సృహ కూడా అంత సహజంగా అది జరగాలి.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 280 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 280. GLIMPSES 🍀*
*🕉. It always starts with glimpses, and it is good that it does; a sudden opening if the sky will be too much, unbearable. One can go mad if a realization happens too suddenly. 🕉*
*Sometimes you can be foolish enough to go into some realization too suddenly, which can be dangerous, because it will be too much for you; you will not be able to absorb it. The question is not of realization itself, but how to digest it by and by, so that it is not an experience but becomes your being. If it is an experience it will come and go; it will remain a glimpse. No experience can remain permanent--only your being can be permanent. And don't be greedy about inner matters. It is bad even in outward matters, and very bad in inward matters.*
*It is not so dangerous when you are greedy about money and power and prestige. Because those things are just futile, and whether you are greedy or not does not make much difference. But greed inside, when you move on the inward path, can be very dangerous. Many people have gone almost mad. It can be too dazzling to their eyes, and they can go blind. It is always good to come and go. Let it be a constant rhythm so that you are never out-of the world and never in the world. By and by you will realize that you transcend it. This process has to be so gradual--just as a flower opens so gradually that you cannot see when the opening really happened.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 420 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 420 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 90. చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।*
*గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥ 🍀*
*🌻 420. 'గాయత్రీ' - 1🌻*
*గానము చేయువారిని రక్షించునది శ్రీమాత అని అర్థము. సమస్త లోకములకు ఆధారమైన వెలుగును గానము చేయుట అనాదిగ నున్న ఆచారము. ఆ వెలుగే ఛందోబద్ధముగ అష్ట ప్రకృతులను నిర్వర్తించును. కావున గాయత్రి ఛందస్సు అని కూడ పిలువబడు చున్నది. ఎనిమిది అక్షరముల ఛందస్సుతో భూ భువః, సువర్లోకములను ఆవరించి యున్నది. 3 x 8 = 24 అక్షరములతో కూడి యున్నది. సంవత్సర రూపమై పండ్రెండు పూర్ణిమలు, పండ్రెండు అమావాస్యలుగ కాలమై వర్తించుచున్నది. *
*ఒక్కొక్క పాదమున ఎనిమిది అక్షరములతో సంవత్సరమందలి మూడు పాదములను దర్శింప వచ్చును. నాలుగు మాసములు ఒక పాదము. అందు నాలుగు అమావాస్యలు, నాలుగు పౌర్ణిమలు యుండును. అట్టివి మూడు పాదములతో సంవత్సర చక్రమగును. ఇట్టి కాలవిభజన నుండి 12 మాసముల యందు వెలువడుచున్న సూర్య చంద్రాత్మకమైన వెలుగును అవగాహనతో కూడి ఆరాధించు విధానమును ఋషులు అందించినారు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 420 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj*
*🌻 90. Chichakti shchetanarupa jadashakti jadatmika*
*Gayatri vyahruti sandhya dvijabrunda nishemita ॥ 90 ॥🌻*
*🌻 420. 'Gayatri' - 1🌻*
*It means it is Srimata who protects the chanters. Chanting the light that is the basis of all worlds is an ancient practice. That light regulates the eight aspects of nature harmoniously. Hence Gayatri is also known as harmony. Bhu Bhuvah and Suvarlokam are encompassed by the rhyme of eight letters. It consists of 3 x 8 = 24 letters. It manifests as time in the form of an year as twelve full moons and twelve new moons.*
*With eight letters in each pada, three padas of the year can be seen. Four months is one pada. There will be four new moons and four full moons in it. Three such padas make an year. Sages, with understanding, have provided a method of worshiping the solar and lunar light that emerges in 12 months from this time division.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
Comments