🌹 20 - JULY - 2022 WEDNESDAY ALL MESSAGES బుధవారం , సౌమ్య వాసర సందేశాలు 🌹
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 20, బుధవారం, జూలై 2022 సౌమ్య వాసరే Wednesday 🌹
2) 🌹 కపిల గీత - 42 / Kapila Gita - 42 🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 81 / Agni Maha Purana - 81 🌹
4) 🌹. శివ మహా పురాణము - 597 / Siva Maha Purana - 597 🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 216 / Osho Daily Meditations - 216 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 388 / Sri Lalitha Chaitanya Vijnanam - 388 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹20 July 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌺. పండుగలు మరియు పర్వదినాలు : కాలాష్ఠమి, Kalashtami 🌺*
*🍀. నారాయణ కవచము - 12 🍀*
*20. మాం కేశవో గదయా ప్రాతరవ్యా- ద్గోవింద ఆసంగవమాత్తవేణుః |*
*నారాయణః ప్రాహ్ణ ఉదాత్తశక్తి- ర్మధ్యందినే విష్ణురరీంద్రపాణిః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : నేను భక్తుడను కాను, జ్ఞానిని కాను, భగవత్కార్యములు నెరవేర్పబూనిన కర్మిష్టినీ కాను. మరి నే నెవరిని? నా ప్రభుని చేతిలోని పనిముట్టును. దివ్యగోప కిశోరుడు మోయించు పిల్లనగ్రోవిని, ఈశ్వర నిశ్శ్వాస వశమున నెగురు ఎండుటాకును. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, ఆషాడ మాసం
దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: కృష్ణ సప్తమి 07:37:05 వరకు
తదుపరి కృష్ణ అష్టమి
నక్షత్రం: రేవతి 12:52:58 వరకు
తదుపరి అశ్విని
యోగం: సుకర్మ 12:42:08 వరకు
తదుపరి ధృతి
కరణం: బవ 07:38:04 వరకు
వర్జ్యం: 26:07:00 - 39:10:20
దుర్ముహూర్తం: 11:56:17 - 12:48:25
రాహు కాలం: 12:22:21 - 14:00:04
గుళిక కాలం: 10:44:38 - 12:22:21
యమ గండం: 07:29:11 - 09:06:54
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:48
అమృత కాలం: -
సూర్యోదయం: 05:51:28
సూర్యాస్తమయం: 18:53:14
చంద్రోదయం: 00:04:25
చంద్రాస్తమయం: 12:03:45
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: మీనం
ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య నాశనం
12:52:58 వరకు తదుపరి మృత్యు యోగం
- మృత్యు భయం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 42 / Kapila Gita - 42🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
✍️. శ్రీమాన్ కందాడై రామానుజాచార్యులు
*📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴. 17. సర్వ నియామకుడినైన నన్ను ఆశ్రయం పొందడం - 2 🌴*
*42. మద్భయాద్వాతి వాతోऽయం సూర్యస్తపతి మద్భయాత్*
*వర్షతీన్ద్రో దహత్యగ్నిర్మృత్యుశ్చరతి మద్భయాత్*
*నాకు భయపడే సూర్యుడూ, ఇంద్రుడు అగ్ని మృత్యువూ వారి వారి పనులు చేస్తున్నారు. *
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 42 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*
*🌴 17. Taking Shelter of Me, the Supreme Controller - 2 🌴*
*42. mad-bhayad vati vato 'yam suryas tapati mad-bhayat*
*varattndro dahaty agnir mrtyus carati mad-bhayat*
*It is because of My supremacy that the wind blows, out of fear of Me; the sun shines out of fear of Me, and the lord of the clouds, lndra, sends forth showers out of fear of Me. Fire burns out of fear of Me, and death goes about taking its toll out of fear of Me.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 81 / Agni Maha Purana - 81 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 27*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*🌻. దీక్షా విధి - 7 🌻*
గురువు, సమస్తమైన దైవమార్గమును గాని, ఆధ్యాత్మికముగా బావన చేయబడిన భౌతిక మార్గమునుగాని, శిష్యుని దేహముపై ధ్యానించి, ముందుగా వాసుదేవాది దేవతలను, అగ్ని మొదలైనవారిని, క్రమముగ వారి వారి మంత్రములతో ఎనిమిదేసి ఆహుతులచేత తృప్తిపరచి, విసర్జనము చేయవలెను.
పిమ్మట సంహారక్రమమున హోమముచే శోధనము చేయవలెను. శిష్యుని దేమముపై కట్టిన కర్మరూప సూత్రములను విడిపించి, వాటిని ఒకచోట పోగుచేసి, తత్త్వ శోధనము చేయవలెను. ప్రాకృతికాగ్నియందును, ఆధిదైవిక విష్ణువునందును లయముచేసి, అశుద్ధులతో కూడిన తత్త్వమును పూర్ణాహుతిచే శుద్ధము చేయవలెను.
ప్రాకృతిక గుణములను దహించి శిష్యుడు ప్రకృతిస్థుడైన పిమ్మట గురువు ఆతనిని విముక్తుని చేయవలెను; లేదా శిశువులను (శిష్యులను) అధికారమునందు నియుక్తులను చేయవలెను.
లేదా గురువు భావస్థితుడై మరియొక శక్తిదీక్ష యైన చేయవలెను. యతులు గాని, నిర్ధనులు గిన భక్తి పూర్వకముగ తన నాశ్రయించి నపుడు స్థండిలముపై విష్ణువును పూజించి, పార్శ్వమునందే కూర్చుండబెట్టవలెను. శిష్యుడు దేవతాభిముఖుడుగా ఉండగా గురువు ముఖమును అడ్డముగా త్రిప్పి కూర్చుండవలెను. స్వీయపర్వములతో వికల్పిత మైన సకలాధ్వమును శిష్యునిదేహముపై ధ్యానించి పిమ్మట ఆధిదైవికపూజ చేయవలెను. ధ్యానమోగముచే చింతించి, వెనుక చెప్పిన విధమున తాడనాదికముచే క్రమముగ స్థండిలముపై నున్న హరియందు సకలతత్త్వసంశోధనము చేయవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 81 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *
*Chapter 27*
*🌻 Mode of performing the initiation rite - 7 🌻*
63-65. Then purification is made by oblation in the order of destruction. Having released all the fetters of deeds, the preceptor, has to purify the principles, having drawn them in order from the body of the disciple. Having dissolved in the fire, the primordial Viṣṇu and the Supreme Spirit, the pure principle is accomplished by (offering) final oblation with impure prin-•ciple. After the disciple had attained his natural state, he has to consume all the qualities of the primordial being.
66. The preceptor has to release or bind the children. Or the preceptor remaining in his natural state has to perform a different kind of initiation (called) Śaktidīkṣā[9].
67-69. Having worshipped Viṣṇu placed nearby with the lad in an altar and (who) is being adored with the devotion of ascetics and mendicants, the pupil remains facing the deity, the self (preceptor) facing obliquely. After having contemplated upon the entire course which has been resolved by him (the preceptor) according to the phases of the moon, (the preceptor) has to think deeply with contemplation on the Lord, the supreme spirit, stationed in the body of the disciple.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 597 / Sri Siva Maha Purana - 597 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 04 🌴*
*🌻. కార్తికేయుని కొరకై అన్వేషణ - 6 🌻*
శంభుడు దేవతలతో గూడి నీకు అభిషేకమును చేయగలడు. నీకు ఆయుధములన్నియు లభించగలవు. తారకాసురుని సంహరించగలవు (53). నీవు జగత్తును లయము చేయు రుద్రుని కుమారుడవు. నిన్ను దాచే సామర్ధ్యము ఈ కృత్తికలకు లేదు. ఎండిన మ్రాను తన తొర్రలో అగ్నిని దాచియుంచలేదు (54).
బ్రహ్మాండములన్నింటిలో అధిక ప్రకాశము గల నీవు వీరి ఇంటిలో నుండుట బాగుండలేదు. నూతిలో నున్న మదపుటేనుగు ప్రకాశించదు (55). మానవుని దృష్టికి సూర్యుడు కానరాకుండగా చంద్రకాంతి కప్పివేయజాలదు. అటులనే నీ తేజస్సు నిన్ను దాగి ఉండనీయదు. నీవు మా సన్నిధికి రమ్ము (56).
ఓ శంభుపుత్రా! జగత్తులను వ్యాపించి యుండు విష్ణువు నీవే. నీ వంటి వాడు మరియొకడు పుట్టలేదు. పరిచ్ఛిన్నములగు వస్తువులనన్నిటినీ ఆకాశము వ్యాపించి యుండు తీరున నీవు సర్వమును వ్యాపించెదవు (57).
కాని, జ్ఞానులు కర్మలనాచరించు చున్నానూ కర్మఫలముతో సంగమును పొందని తీరున, యోగీంద్రుడవగు నీకు కూడా సంసారలేపము లేదు. జగత్తును పోషించు నీవు జగత్తుతో సంపర్కమును పొందవు (58).
యోగి యొక్క ఆత్మ త్రిగుణాతీతమై యుండును. అటులనే ఈ జగత్తును సృజించి రక్షించే తేజోరాశివగు నీవు ఈత్రిగుణములకు అంతర్గతుడవై లేవు (59). ఓ సోదరా! నిన్ను ఎరుంగని మానవులు భ్రష్టమైన బుద్ధి గలవారు. కప్పలు, పద్మములు ఒకే సరస్సులో నుండును. కాని కప్పలు పద్మములను ఆదరించవు (60).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 597 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 04 🌴*
*🌻 Search for Kārttikeya and his conversation with Nandin - 6 🌻*
53. Śiva will be crowning you in the company of the gods. You will get miraculous weapons and will slay the demon Tāraka.
54. You are the son of the annihilator of the universe and these (Kṛttikas) are impatient to gain possession of you as the dry tree tries to conceal fire within its hollow though it is incapable of holding it.
55. You are brilliant enough to illuminate the universe. You do not fit in well in this abode just as a majestic elephant fallen in a deep well does not retain splendour.
56. You can shed splendour if your brilliance is not hidden just as the sun illuminates the world only when it is not hidden by the cloud.
57. In the matter of omnipresence in the universe you alone are Viṣṇu, O Śiva’s son. The all-pervading sky is not pervaded by anything else.
58. A Yogin is not entangled in the activities of nurturing himself. The soul is not involved in the physical activities.
59. You are the creator of the universe, you are the lord. Your place is not among these. You are a mass of attributes and splendour as the soul of a Yogin.
60. O brother, those who do not know you are of damned intellect. Although the toads and lotuses are in the same pond toads are not honoured.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 216 / Osho Daily Meditations - 216 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀 216. ధ్యానం 🍀*
*🕉. ఒక ధ్యానం ఉంది, కేవలం ఆనందం అది. కానీ అది మనం చేసేది కాదు. మన వైపు నుండి ఒకే ఒక్క విషయం అవసరం: అది జరిగితే మనం దానిని అడ్డుకోకూడదు. 🕉*
*మీరు నిర్వహించగల ధ్యానం మనస్సు యొక్క ఆటగా మిగిలిపోతుంది. మీ మనస్సు నియంత్రణలో ఉన్నది. ; అది చేసేది మనసు ధ్యానం. కానీ ఈ ధ్యానం మిమ్మల్ని మనస్సును దాటి తీసుకెళ్లదు. మనసే దానికి కర్త అయితే అది ఎలా జరుగుతుంది ? అప్పుడు అది మనస్సు ద్వారా తారుమారు చేయబడి మీ చేతుల్లో ఏదో అనుభూతి మిగిలిపోతుంది. మీ చేతుల్లో లేనిదే నిజమైన ధ్యానం; దానికి విరుద్ధంగా, మీరు దాని చేతుల్లో ఉన్నారు. కానీ పద్ధతులు సహాయపడతాయి; అవి మిమ్మల్ని నిరాశకు గురిచేస్తాయి. అవి మిమ్మల్ని నిస్సహాయ స్థితికి తీసుకువస్తాయి.*
*అవి మిమ్మల్ని అలాంటి స్థితికి తీసుకు వెళతాయి. నిరాశతో, మీరు చేసే దుర్మార్గపు వృత్తాన్ని చూసి, ఆ ధ్యానం చేయడం ఎక్కడికీ దారితీయదని మీరు చూస్తారు.... మీరు మళ్లీ మళ్లీ అదే స్థితికి వస్తారు, మీరు మీ మనస్సుకు తిరిగి వస్తారు. ఒక రోజు, అంతర్దృష్టి ఉదయిస్తుంది: అప్పుడు చేయవలసింది, కేవలం మీరు చేస్తున్న పని నిజంగా రద్దు చేయడమే. అప్పుడు చేసే పనులన్నీ మాయమవుతాయి, ప్రయత్నాలన్నీ మాయమవుతాయి. అవతల నుండి ఏదో దిగుతుంది. అదే విముక్తి. ఈ సంగ్రహా వలోకనం యొక్క ఒక్క క్షణం కూడా సరిపోతుంది. మీరు మళ్లీ ఎప్పటికీ ఒకేలా ఉండరు, మీరు మళ్లీ అదే విధంగా ఉండలేరు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 216 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 216. MEDITATION 🍀*
*🕉. There is a meditation that simply happiness it is not our part to do. On our part, only one thing is needed: that if it happens we do not hinder it. 🕉*
*The meditation that you can manage will remain a mind game. It is your mind that is in control; it is the mind that is doing the meditation. But this meditation cannot take you beyond the mind. How can it, if the mind is the doer of it? Then it is manipulated by the mind and remains something in your hands. The real meditation is that which is not in your hands; on the contrary, you are in its hands. But techniques can help; they bring you to a point of frustration. They bring you to a point of hopelessness.*
*They bring you to a point where, out of despair, seeing the vicious circle of your doing, you see that doing leads nowhere....Again and again you come to the same point, you are back to your mind. One day, this insight dawns: that your doing is really your undoing. In that very moment is let-go. Then all doing disappears, all effort disappears. Something descends from the beyond. That is liberation. And even a single moment of that glimpse is enough. You are never the same again you cannot be the same again.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 388 / Sri Lalitha Chaitanya Vijnanam - 388🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 85. నిత్యక్లిన్నా, నిరుపమా, నిర్వాణ సుఖదాయినీ ।*
*నిత్యా, షోడశికారూపా, శ్రీకంఠార్ధ శరీరిణీ ॥ 85 ॥ 🍀*
*🌻 388. ‘నిత్యక్లిన్నా'🌻*
*నిత్యము దయతో నుండునది శ్రీదేవి అని అర్థము. దయ, కరుణ, ప్రేమ, ఆత్మీయత, జాలి, క్షమ ఇత్యాది హృద్యమగు గుణములు కలిగినది శ్రీమాత. నిజమునకు శ్రీమాత స్థానము హృదయమే. ఆమె హృదయముతోనే సర్వమును పాలించును. హృదయములో గెలువ గలిగిననాడు జీవుడు రాజును మించిన వాడగును. రారాజు హృదయ మెరిగినవాడే. హృదయముతో జయించ గలిగినది, శక్తితో జయించలేము. శక్తిని కూడ హృదయముతో జయించ వచ్చును.*
*ఋషులలో బ్రహ్మర్షి అయిన వశిష్ఠు డట్టివాడు. వశిష్ఠ మహర్షి హృదయ తత్త్వముతో నిండి సర్వమును జయించెను. హృదయమునకున్న స్వామిత్వము మరి ఏ కేంద్రమునకును లేదు. “ఓ అర్జునా! నేను జీవుల హృదయము నందుండి వారిపై ఈశ్వరత్వము నిలుపుచున్నాను.” అని శ్రీకృష్ణుడు పలికెను. సత్త్వమునకు, సత్యమునకు హృదయమే కేంద్రము. శ్రీమాత నిత్యము హృదయ మందుండి భక్తులకు భుక్తి, ముక్తి నిచ్చుచు ప్రేమతో పరిరక్షించుచు నుండును. కనుకనే ఆమె 'నిత్యక్లిన్న'.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 388 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 85. Nityaklinna nirupama nirvana sukhadaeini*
*Nitya shodashika rupa shree kantardha sharirini ॥ 85 ॥ 🌻*
*🌻 388. Nitya-klinnā नित्य-क्लिन्ना 🌻*
*Her ever compassionate nature is referred here. This is an extension of nāma 326. karuṇā-rasa-sāgarā. Nitya-klinnā is the name of a tithi nityā devi (third day of the lunar fortnight).*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Kommentare