1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 20, సోమవారం, జూన్ 2022 ఇందు వాసరే Monday 🌹
2) 🌹 కపిల గీత - 26 / Kapila Gita - 26🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 66 / Agni Maha Purana - 66🌹
4) 🌹. శివ మహా పురాణము - 582 / Siva Maha Purana - 582🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 201 / Osho Daily Meditations - 201🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 380 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 380-3 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. 20, June 2022 పంచాగము - Panchangam 🌹*
*శుభ సోమవారం, ఇందు వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : కాలాష్టమి, Kalashtami🌻*
*🍀. రుద్రనమక స్తోత్రం - 29 🍀*
*55. నమో నాద్యాయ భవ్యాయ వైశంతాయ నమోనమః!*
*అవట్యాయ నమస్తుభ్యం నమః కూప్యాయ తే నమః!!*
*56. అవర్ష్యాయ చ వర్ష్యాయ మేఘ్యాయ చ నమోనమః!*
*విద్యుత్యాయ నమస్తుభ్యమీథ్రియాయ నమోనమః!!*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : ఏ పదార్ధముకైనా అతిగా విలువ ఇవ్వడం ఋషి సాంప్రదాయం కాదు. మీరు అసలు విలువ ఇవ్వని గాలి, నీరు లాంటివి నిజంగా విలువైనవి. - మాస్టర్ ఆర్.కె.🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, జేష్ఠ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: కృష్ణ సప్తమి 21:03:43 వరకు
తదుపరి కృష్ణ అష్టమి
నక్షత్రం: పూర్వాభద్రపద 28:36:18
వరకు తదుపరి ఉత్తరాభద్రపద
యోగం: ప్రీతి 08:27:50 వరకు
తదుపరి ఆయుష్మాన్
కరణం: విష్టి 09:38:09 వరకు
వర్జ్యం: 11:13:12 - 12:48:00
దుర్ముహూర్తం: 12:43:56 - 13:36:37
మరియు 15:21:59 - 16:14:40
రాహు కాలం: 07:21:15 - 09:00:02
గుళిక కాలం: 13:56:22 - 15:35:09
యమ గండం: 10:38:49 - 12:17:35
అభిజిత్ ముహూర్తం: 11:51 - 12:43
అమృత కాలం: 20:42:00 - 22:16:48
మరియు 24:10:24 - 25:48:16
సూర్యోదయం: 05:42:29
సూర్యాస్తమయం: 18:52:43
చంద్రోదయం: 00:17:09
చంద్రాస్తమయం: 11:33:25
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: కుంభం
ముసల యోగం - దుఃఖం 28:36:18
వరకు తదుపరి గద యోగం -
కార్య హాని , చెడు
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
Join and Share
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 26 / Kapila Gita - 26🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴. 12. శ్రవణం ద్వారా దైవంతో అనుబంధం - 2 🌴*
*26. భక్త్యా పుమాన్జాతవిరాగ ఐన్ద్రియాద్దృష్ట శ్రుతాన్మద్రచ నానుచిన్తయా*
*చిత్తస్య యత్తో గ్రహణే యోగయుక్తో యతిష్యతే ఋజుభిర్యోగమార్గైః*
*నా యందు కలిగిన భక్తితో జీవుడు వైరాగ్యాన్ని పొందుతాడు. ఇంద్రియములకు సంబంధించిన విషయాల యందు, చూచినా విన్నా ఆసక్తి కలుగదు. వాడి మనసు ఎప్పుడూ నా కథలను గూర్చి చింతిస్తూ ఉంటాడు. నిరంతరం నా కథలనే చెబుతూ వింటూ ఉండే వాడు సాంసారిక భోగముల యందు విరక్తి కలిగి ఉంటాడు. అతను యోగములో ఉండి మనస్సును స్వాధీనములో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది జరిగితే వారికి చక్కటి దారి దొరుకుతుంది. దానితో నన్ను సాక్షాత్కరింప చేసుకోవడానికీ, మనసుని నిగ్రహించు కోవడానికి ప్రయత్నిస్తాడు.*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 26 🌹*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*
*🌴 12. Association with the Supreme Lord Through Hearing - 2 🌴*
*26. bhaktya puman jata-viraga aindriyad drsta-srutan mad-racananucintaya*
*cittasya yatto grahane yoga-yukto yatisyate rjubhir yoga-margaih*
*Thus consciously engaged in devotional service in the association of devotees, a person gains distaste for sense gratification, both in this world and in the next, by constantly thinking about the activities of the Lord. This process of Krsna consciousness is the easiest process of mystic power; when one is actually situated on that path of devotional service, he is able to control the mind.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#కపిలగీత #KapilaGita
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 66 / Agni Maha Purana - 66 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 24*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*🌻. కుండ నిర్మాణాగ్ని కార్యాది విధి -4 🌻*
సాధకుడు అన్నింటను ఓంకారముతో ఉపచారము చేయవలెను. ధనలోభము చేయకుండగా అంగహోమములు చేయవలెను.
గర్భాధానము, పుంసవనము, సీమన్తోన్నయనము, జాతకర్మ నామకరణము, అన్నప్రాశనము, చౌలము, వ్రత బంధము (ఉపనయనము), సమస్త మైన వేదవ్రతాలు (నాలుగు), స్నాతకము, వివాహము, ఆధికారము అను సంస్కారములను వరుసగా చేయవలెను.
ప్రతికర్మయందును హృదయాదిక్రమముచే ధ్యానించి, ఒక్కొక్క కర్మను పూజించి, మరల ఎనిమిదేసి ఆహుతులను హోమము చేయవలెను.
సాధకుడు వౌషట్ చివర గల మంత్రమును చక్కగా ప్లుతస్వరముతో ఉచ్చరించుచు స్రుక్కు మొదటి భాగముతో పూర్ణాహుతి ఇవ్వవలెను.
విష్ణవునకై వహ్నిని సంస్కరించి వైష్ణవమైన చరువును అర్పించవలెను. స్థండిలముమీద విష్ణువును పూజించి, మంత్రములను స్మరించుచు ఆశ్రయించవలెను.
ఉత్తమమైన సాంగావరణమును ఆసనాదిక్రమముచే గంధి పుష్పములతో పూజించి, దేవతాశ్రేష్ఠుడైన ఆ విష్ణువును ధ్యానించి, సమిధను ఉంచి, పిమ్మట ఆగ్నేయ ఈశాన్య దిక్కలందు ఆజ్యాఘారములను, వాయవ్య నైరృతదిక్కలంధు ఆజ్యభాగములను క్రమానుసారముగా సమర్పించి, పిమ్మట దక్షిణోత్తర చక్షుర్హోములు చేసి, పిమ్మట అర్చా క్రమానుసారముగా మధ్యయందు, సర్వమంత్రముల తోడను, హోమము చేయవలెను. 40
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 66 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *
*Chapter 24*
*🌻 Mode of constructing the sacrificial pit and the oblations unto fire - 4 🌻*
32. The aspirant must everywhere do the worship with the syllable Om. One has to do offering unto fire with the auxiliaries befitting one’s means.
33-34. Garbhādhāna[3] is the first one. Then puṃsavana[4] is remembered. Then the sīmantonnayana [5], jātakama[6], nāma (nāmakaraṇa)[7], annaprāśana[8], cūḍākṛti[9], vratabandha[10], and many more are the vedic observances. One who has the right to do these rites should perform these in the company of his wife.
35. Having contemplated (on the deity) in the heart and other limbs and worshipping him, one has to offer sixty-four oblations for every one of the rites again.
36. The worshipper has to offer the final oblation with the sacrificial ladle, chanting loudly with sweet intonation the mystic formula ending with the word vauṣaṭ.
37. After having purified the fire ofViṣṇu, the food intended for Viṣṇu has to be boiled. After having worshipped Viṣṇu in the altar and remembering the mystic formulae one has to seek his protection.
38-39. Having worshipped in order his seat and other things along with the enclosures with fragrant flowers and contemplating on the most excellent lord of all deities, and placing the fuel and then the support, the oblations of clarified butter (should be poured) in order (on fires) placed in the south-east, north-east, north-west and south-west.
40. Then having poured portions of the clarified butter in the south and north, one has to offer oblation in the middle reciting the mystic formulae in the order of worship.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #AgniMahaPuranam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 582 / Sri Siva Maha Purana - 582 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 02 🌴*
*🌻. కుమారస్వామి జననము - 2 🌻*
శివుని రాక ఆలస్యమగుటచే అచటకు వచ్చిన పార్వతి దేవశ్రేష్టులనందరినీ చూచి, ఆ వృత్తాంతము నంతనూ తెలుసుకొని మహాక్రోధమును పొంది (12), అపుడు విష్ణువు మొదలగు దేవతలందరినీ ఉద్దేశించి ఇట్లనెను (13).
దేవ్యువాచ|
రేరే సురగణాస్సర్వే యూయం దుష్టా విశేషతః | స్వార్థసంసాధకా నిత్యం తదర్థం పరదుఃఖదాః 14
స్వార్థహేతోర్మహేశానమారాధ్య పరమం ప్రభుమ్ | నష్టం చక్రుర్మద్విహారం వంధ్యాeôభవమహం సురాః 15
మాం విరోధ్య సుఖం నైవ కేషాంచిదపి నిర్జరాః | తస్మాద్దుఃఖం భ##వేద్వో హి దుష్టానాం త్రిదివౌకసామ్ || 16
దేవి ఇట్లు పలికెను--
ఓరీ! దేవతా గణములారా! మీరందరు పరమ దుర్మార్గులు. మీరు నిత్యము స్వార్థసాధనాపరులు. స్వార్థము కొరకై ఇతరులకు దుఃఖమును కలిగించెదరు (14). మీ స్వార్థము కొరకై పరమప్రభుడగు మహేశ్వరుని ఆరాధించి నా విహారమును భంగపరిచిరి. ఓ దేవతలారా! నేను వంధ్యను అయితిని (15). ఓ దేవతలారా! నాతో విరోధించిన వారికి ఎవరికైననూ సుఖము లభించదు. కావున దుష్టులగు దేవతలకు (మీకు) దుఃఖము కలుగు గాక! (16)
బ్రహ్మ ఇట్లు పలికెను-
శివుని పత్నియగు ఆ పార్వతి ఇట్లు పలికి కోపముతో మండిపడుతూ విష్ణువు మొదలగు దేవతలనందరినీ శపించెను (17).
పార్వతి ఇట్లు పలికెను--
ఈ నాటి నుండియూ దేవతల భార్యలు వంధ్యలు అగుదురు గాక! నన్ను విరోధించిన దేవతలందరు దుఃఖితులగుదురు గాక! (18)
బ్రహ్మ ఇట్లు పలికెను--
సకలేశ్వరి యగు పార్వతి విష్ణువు మొదలగు దేవలనందరినీ ఇట్లు శపించి శివతేజస్సును గ్రహించిన అగ్నితో కోపముగా నిట్లనెను (19).
పార్వతి ఇట్లు పలికెను--
ఓయీ అగ్నీ! నీవు నిత్యదుఃఖితమగు హృదయము గలవాడవై సర్వభక్షకుడవు కమ్ము. నీవు శివతత్త్వము నెరుంగని మూర్ఖుడవు గనుక దేవకార్యమును చేసినావు (20). ఓరీ మోసగాడా! నీవు మహా దుష్టుడవు. దుష్టుల దుష్ట బోధనలను విని శివవీర్యమును గ్రహించితివి. నీవు ఉచితమగు కార్యమును చేయలేదు (21).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 582 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 02 🌴*
*🌻 The birth of Śiva’s son - 2 🌻*
12. When Śiva took a long time to return, she hastened there and saw the gods. On coming to know of the incident she became very furious.
13. She told Viṣṇu and the gods as follows.
The goddess said:—
14. Hi Hi, O gods, you are wicked and particularly selfish and for that purpose you give pain to others.
15. O gods, for the sake of realising your self-interests you all propitiated the lord and spoilt my dalliance. I have become a barren woman therefore.
16. O gods, after offending me none can be happy. Hence O wicked heaven-dwellers, you will remain unhappy.
Brahmā said:—
17. After saying these words Pārvatī, the daughter of the king of mountains, blazing with fury cursed Viṣṇu and all other gods.
Pārvatī said:—
18. From now onwards let the wives of the gods be utterly barren and let the gods who offended me be unhappy.
Brahmā said:—
19. Cursing Viṣṇu and other gods, Pārvatī furiously told Agni who had swallowed Śiva’s semen.
Pārvatī said:—
20. O Agni, be the devourer of everything and let your soul be afflicted. You are a fool. You do not know Śiva’s fundamental principles. You have come forward to carry out the task of the gods.
21. It is neither proper nor beneficent to you to have eaten up Śiva’s semen. You are a rogue, a wretched vile, paying heed to the wicked counsel of the wicked.
Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 201 / Osho Daily Meditations - 201 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*
*🍀 201. పదాలు 🍀*
*🕉. పదాలు కేవలం పదాలు కాదు. వాటికి వాటి స్వంత మానసిక స్థితి, వాతావరణాలు ఉన్నాయి. 🕉*
*ఒక పదం మీలో స్థిరపడినప్పుడు, అది మీ మనస్సుకు భిన్నమైన వాతావరణాన్ని, భిన్నమైన విధానాన్ని, విభిన్న దృష్టిని తెస్తుంది. అదే విషయాన్ని వేరే పేరుతో పిలవండి మరియు మీరు చూస్తారు: ఏదో వెంటనే భిన్నంగా ఉంటుంది. భావ పదాలు ఉన్నాయి మరియు మేధో పదాలు ఉన్నాయి. మేధోపరమైన పదాలను మరింత ఎక్కువగా వదలండి. మరింత ఎక్కువ భావ పదాలను ఉపయోగించండి. రాజకీయ పదాలు ఉన్నాయి మరియు మతపరమైన పదాలు ఉన్నాయి. రాజకీయ పదాలను వదలండి. వెంటనే సంఘర్షణ సృష్టించే పదాలు ఉన్నాయి. మీరు వాటిని పలికిన క్షణం, వాదన తలెత్తుతుంది. కాబట్టి ఎప్పుడూ తార్కిక, వాద భాషని ఉపయోగించవద్దు. వాగ్వాదం తలెత్తకుండా ఆప్యాయత, శ్రద్ధ, ప్రేమ యొక్క భాషను ఉపయోగించండి.*
*ఈ విధంగా తెలుసుకోవడం ప్రారంభించినట్లయితే, ఒక అద్భుతమైన మార్పు తలెత్తడాన్ని చూస్తారు. జీవితంలో కాస్త అప్రమత్తంగా ఉంటే ఎన్నో కష్టాలను దూరం చేసుకోవచ్చు. అపస్మారక స్థితిలో ఉచ్చరించే ఒక్క పదం కష్టాల సుదీర్ఘ గొలుసును సృష్టిస్తుంది. కొంచెం తేడా, చాలా చిన్న మలుపు, మరియు ఇది చాలా మార్పును సృష్టిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు అవసరమైనప్పుడు పదాలను ఉపయోగించాలి. కలుషిత పదాలను నివారించండి. తాజా పదాలు, వివాదాస్పద రహిత పదాలను ఉపయోగించండి, అవి వాదనలు కావు, మీ భావాల వ్యక్తీకరణలు మాత్రమే. ఎవరైనా పదాల రసజ్ఞుడిగా మారగలిగితే, అతని జీవితమంతా పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఒక పదం బాధను, కోపాన్ని, సంఘర్షణను లేదా వాగ్వాదాన్ని కలిగిస్తే, దానిని వదలండి. దాన్ని మోసుకెళ్లడంలో అర్థం ఏమిటి? దాన్ని మెరుగైన వాటితో భర్తీ చేయండి. ఉత్తమమైనది నిశ్శబ్దం. తదుపరి ఉత్తమమైనవి గానం, కవిత్వం, ప్రేమ.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 201 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 201. WORDS🍀*
*🕉 Words are not just words. They have moods, climates of their own. 🕉*
*When a word settles inside you, it brings a different climate to your mind, a different approach, a different vision. Call the same thing a different name, and you will see: Something is immediately different. There are feeling words and there are intellectual words. Drop intellectual words more and more. Use more and more feeling words. There are political words and there are religious words. Drop political words. There are words that immediately create conflict. The moment you utter them, argument arises. So never use logical, argumentative language. Use the language of affection, of caring, of love, so that no argument arises.*
*If one starts being aware in this way, one sees a tremendous change arising. If one is a little alert in life, many miseries can be avoided. A single word uttered in unconsciousness can create a long chain of misery. A slight difference, just a very small turning, and it creates a lot of change. One should become very careful and use words when absolutely necessary. Avoid contaminated words. Use fresh words, noncontroversial, which are not arguments but just expressions of your feelings. If one can become a connoisseur of words, one's whole life will be totally different. If a word brings misery, anger, conflict, or argument, drop it. What is the point in carrying it? Replace it with something better. The best is silence. The next best are singing, poetry, love.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#ఓషోబోధనలు #OshoDiscourse
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
.
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 380-3 / Sri Lalitha Chaitanya Vijnanam - 380-3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 83. ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ ।*
*రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83 ॥ 🍀*
*🌻 380. 'బిందుమండలవాసినీ' - 3🌻*
*జీవితము యజ్ఞార్థము కానిచో తపస్సు వలను పడదు. అంతరాంత రాళమున జీవప్రజ్ఞ చేరవలె నన్నచో ఇతరములు గోచరింపక సమస్తము శ్రీమాత దివ్యరూపముగనే దర్శించుట ప్రధానము. అపుడు శ్రీమాత భావన నిత్యమగును. అనన్యమగును. బిందు మండల మనగా తెల్లని కాంతితో కూడిన మండలము. ఆ కాంతికి కేంద్రమే బిందువు. ఈ బిందువు గాని, దాని కాంతి గాని, పదార్థమును ఆవరించి యుండును గాని ఆశ్రయించి యుండదు. బిందువు రూపము పూర్ణమగుట వలన దీనిని పూర్ణ మనిరి. తేజోవంత మగుట వలన చీకటికి ఆవలి వెలుగు అనిరి. దీనిని స్మరించుటకే భ్రూమధ్యమున స్త్రీలు, పురుషులు తిలక ధారణము గాని భస్మ ధారణము గాని చేయుట.*
*మాధవు డుండు స్థానము అయి వుండుటచే ఈ భ్రూమధ్య స్థానమును బిందు మాధవు డని, బిందు మాధవి అని పలుకుదురు. భ్రూమధ్యము నుండి బ్రహ్మనాళమున చరించుట బ్రహ్మానంద దాయకము. హృదయ మందు విశాలమై పరమ పవిత్రమైన ప్రజ్ఞగ ప్రవహించు చుండును గనుక బిందు హ్రదము (సరస్సు) అని కూడ పలుకుదురు. బిందు స్థానమున చేరిన వారిని బిందు శర్మ అని పిలుతురు. నాళమున ఈ బిందువు అన్ని లోకముల యందు పయనించు త్రోవను బిందురేఖ అనిరి. బిందు జ్ఞానమే సర్వజ్ఞానము, సర్వానందమయము.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 380 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 83. Odyana pita nilaya nindu mandala vasini*
*Rahoyaga kramaradhya rahastarpana tarpata ॥ 83 ॥ 🌻*
*🌻 380. Bindumaṇḍala-vāsini बिन्दुमण्डल-वासिनि - 3 🌻*
*The bindu is also referred to the orifice in the sahasrāra also known as brahmarandhra through which commune with God is established. The cosmic energy enters the human body only through this orifice in the crown cakra and medulla in the back head cakra. When these two places are exposed to Mother Nature and early morning sun, sufficient cosmic energy can be drawn by the gross body to have a disease free life.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Comments