top of page
Writer's picturePrasad Bharadwaj

🍀 20 - OCTOBER - 2022 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🍀

🌹🍀 20 - OCTOBER - 2022 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🍀🌹

🌹 20 - OCTOBER అక్టోబరు - 2022 THURSDAY గురువారం, బృహస్పతి వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 273 / Bhagavad-Gita -273 - 6వ అధ్యాయము 40 ధ్యాన యోగము🌹

3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 672 / Vishnu Sahasranama Contemplation - 672 🌹

4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 634 / Sri Siva Maha Purana - 634 🌹

5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 351 / DAILY WISDOM - 351 🌹

6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 250 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹20, October 2022 పంచాగము - Panchagam 🌹*

*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*

*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*

*ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*


*🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రము - 14 🍀*


*14. మనోగతం పశ్యతి యస్సదా త్వాం మనీషిణాం మానస రాజహంసం*

*స్వయంపురోభావవివాదభాజః కింకుర్వతే తస్య గిరో యథార్హమ్ ॥*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : సకల ప్రాణుల యెడ నీవు దయగలిగి ఉండడమనేది మంచిదే. కాని, నీ దయకు నీవు దాసుడవు కావడం మాత్రం మంచిది కాదు. ఈశ్వరునికి దక్క మరెవ్వరికీ నీవు దాసుడవు కావద్దు. ఈశ్వరుని ముఖ్య పరివార దేవతలకు సైతం నీవు దాసుడవు కాకుండ నుండ వలసినదే. 🍀*


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు,

దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం

తిథి: కృష్ణ దశమి 16:06:37 వరకు

తదుపరి కృష్ణ ఏకాదశి

నక్షత్రం: ఆశ్లేష 10:31:13 వరకు

తదుపరి మఘ

యోగం: శుభ 17:52:36 వరకు

తదుపరి శుక్ల

కరణం: విష్టి 16:01:36 వరకు

వర్జ్యం: 23:30:00 - 25:13:52

దుర్ముహూర్తం: 10:03:56 - 10:50:40

మరియు 14:44:17 - 15:31:01

రాహు కాలం: 13:28:22 - 14:55:58

గుళిక కాలం: 09:05:32 - 10:33:08

యమ గండం: 06:10:19 - 07:37:55

అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:23

అమృత కాలం: 08:45:08 - 10:31:00

సూర్యోదయం: 06:10:19

సూర్యాస్తమయం: 17:51:12

చంద్రోదయం: 01:32:28

చంద్రాస్తమయం: 14:44:40

సూర్య సంచార రాశి: తుల

చంద్ర సంచార రాశి: కర్కాటకం

అమృత యోగం - కార్య సిధ్ది 10:31:13

వరకు తదుపరి ముసల యోగం -

దుఃఖం


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 273 / Bhagavad-Gita as It is - 273🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 40 🌴*


*40. శ్రీ భగవానువాచ*

*పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే |*

*న హి కల్యాణకృత్కశ్చిద్ దుర్గతిం తాత గచ్ఛతి*


🌷. తాత్పర్యం :

*శ్రీకృష్ణభగవానుడు పలికెను : ఓ పార్థా! శుభకార్యముల యందు నియుక్తుడైనవాడు ఈ లోకమున గాని, పరలోకమున గాని వినాశమును పొందడు. మిత్రమా! మంచి చేయువాడెన్నడును చెడుచే పరాజితుడు కాడు.*


🌷. భాష్యము :

శ్రీమద్భాగవతము (1.5.17) నందు శ్రీనారదముని వ్యాసదేవునికి ఈ విధముగా ఉపదేశము కావించిరి.


త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం హరే ర్భజన్నపక్వోథ పతేత్తతో యది |

యత్ర క్వ వాభద్ర మభూదముష్య కిమ్ కో వార్థ ఆప్తోభజతాం స్వధర్మత:


“భౌతికవాంఛల నన్నింటిని త్యజించి దేవదేవుడైన శ్రీకృష్ణుని సంపూర్ణ శరణాగతిని బడసినవానికి ఏవిధమైన నష్టము గాని, వినాశము గాని ఉండదు. కాని అభక్తుడైనవాడు తన విధ్యుక్తధర్మములలో సంపూర్ణముగా నిమగ్నుడైనను పొందునదేదియును లేదు.” భౌతికవాంఛా పూర్ణమునకై శాస్త్రవిహితములు మరియు ఆచారవిహితములు అయిన పలుకర్మలు కలవు. యోగియైనవాడు ఆధ్యాత్మికపురోగతి కొరకై అట్టి సమస్త లౌకికకర్మలను త్యజింప వలసి యుండును.


కృష్ణభక్తిభావనను పూర్ణముగా అనుసరించినచో దాని ద్వారా మనుజుడు అత్యున్నత పూర్ణత్వము బడయుననుట సత్యమే అయినను ఒకవేళ అతడు పూర్ణత్వస్థితిని పొందకున్నచో భౌతికరంగమునందును మరియు ఆధ్యాత్మికరంగమందును నష్టపోయినట్లు కాడా యని కొందరు ప్రశ్నించు నవకాశము కలదు. కాని ఈ విషయమున చింత ఏమాత్రము వలదని సఫలీకృతుడు కానట్టి యోగికి శ్రీమద్భాగవతము హామీ ఇచ్చుచున్నది. కర్మనిర్వాహణను పూర్ణముగా ఒనరించని కారణమున ఒకవేళ వారు అట్లు కర్మఫలముల ననుభవింపవలసివచ్చినను వారు ఎట్టి నష్టము పొందబోరు.

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 273 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 6 - Dhyana Yoga - 40 🌴*


*40. śrī-bhagavān uvāca*

*pārtha naiveha nāmutra vināśas tasya vidyate*

*na hi kalyāṇa-kṛt kaścid durgatiṁ tāta gacchati*


🌷 Translation :

*The Supreme Personality of Godhead said: Son of Pṛthā, a transcendentalist engaged in auspicious activities does not meet with destruction either in this world or in the spiritual world; one who does good, My friend, is never overcome by evil.*


🌹 Purport :

In the Śrīmad-Bhāgavatam (1.5.17) Śrī Nārada Muni instructs Vyāsadeva as follows:


tyaktvā sva-dharmaṁ caraṇāmbujaṁ harer bhajann apakvo ’tha patet tato yadi

yatra kva vābhadram abhūd amuṣya kiṁ ko vārtha āpto ’bhajatāṁ sva-dharmataḥ


“If someone gives up all material prospects and takes complete shelter of the Supreme Personality of Godhead, there is no loss or degradation in any way. On the other hand a nondevotee may fully engage in his occupational duties and yet not gain anything.” For material prospects there are many activities, both scriptural and customary. A transcendentalist is supposed to give up all material activities for the sake of spiritual advancement in life, Kṛṣṇa consciousness. One may argue that by Kṛṣṇa consciousness one may attain the highest perfection if it is completed, but if one does not attain such a perfectional stage, then he loses both materially and spiritually.


The Bhāgavatam assures the unsuccessful transcendentalist that there need be no worries. Even though he may be subjected to the reaction for not perfectly executing prescribed duties, he is still not a loser, because auspicious Kṛṣṇa consciousness is never forgotten, and one so engaged will continue to be so even if he is lowborn in the next life. On the other hand, one who simply follows strictly the prescribed duties need not necessarily attain auspicious results if he is lacking in Kṛṣṇa consciousness.

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 672/ Vishnu Sahasranama Contemplation - 672🌹*


*🌻672. మహాకర్మా, महाकर्मा, Mahākarmā🌻*


*ఓం మహాకర్మణే నమః | ॐ महाकर्मणे नमः | OM Mahākarmaṇe namaḥ*


*మహత్ప్రపఞ్చ సృష్ట్యాది కర్మాస్యేతి జనార్దనః ।*

*మహాకర్మేత్యుచ్యతే స విష్ణుర్విబుధసత్తమైః ॥*


*ఈతడు నిర్వర్తించు జగత్ ఉత్పత్తి, స్థితి, లయ రూపమగు కర్మము చాలా గొప్పదీ - అన్యులకు శక్యము కానిదిగనుక మహాకర్మా.*


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 672🌹*


*🌻672. Mahākarmā🌻*


*OM Mahākarmaṇe namaḥ*


महत्प्रपञ्च सृष्ट्यादि कर्मास्येति जनार्दनः ।

महाकर्मेत्युच्यते स विष्णुर्विबुधसत्तमैः ॥


*Mahatprapañca sr‌ṣṭyādi karmāsyeti janārdanaḥ,*

*Mahākarmetyucyate sa viṣṇurvibudhasattamaiḥ.*


*Great are His actions of creation, sustenance and annihilation of the creation that cannot be accomplished by any other and hence He is Mahākarmā.*


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

महाक्रमो महाकर्मा महातेजा महोरगः ।महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः ॥ ७२ ॥


మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః ।మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః ॥ 72 ॥


Mahākramo mahākarmā mahātejā mahoragaḥ,Mahākraturmahāyajvā mahāyajño mahāhaviḥ ॥ 72 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 . శ్రీ శివ మహా పురాణము - 634 / Sri Siva Maha Purana - 634 🌹*

*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 12 🌴*

*🌻. కార్తికేయ స్తుతి - 4 🌻*


వృషభధ్వజుడు, మహేశ్వరుడు, గణములకు ప్రభువు, సర్వేశ్వరుడు, ముల్లోకములకు ప్రభువు అగు మహాదేవునకు నమస్కారము (33) ఓ నాథా! త్రిగుణ స్వరూపుడవై లోకములన్నిటిని సృష్టించి, పాలించి, పోషించి, సంహరించు నీకు నమస్కారము. నీవు శాశ్వతుడవు (34). సంగము లేని వాడు, పరమేశ్వరుడు, మంగళకరుడు, పరమాత్మ, ప్రపంచాతీతుడు, శుద్ధుడు, సర్వకారణుడు, నాశము లేనివాడు (35), చేతి యందు దండమును ధరించు మృత్యుస్వరూపుడు, చేతి యందు పాశమును ధరించువాడు, వేద మంత్రములచే ప్రతిపాదింబడువాడు, ప్రలయకాలములో అనేక విధములుగా ప్రాణులను భక్షించువాడు అగు నీకు నమస్కారము (36).


ఓ పరమేశ్వరా! భూత వర్తమాన భవిష్యత్కాలములకు చెందిన పదార్థములు మరియు స్థావర జంగమ ప్రాణులు నీ దేహమునుండియే పుట్టుచున్నవి (37). స్వామీ! మమ్ములను ఎల్లవేళలా రక్షించుము. భగవాన్‌! ప్రభూ! ప్రసన్నుడవు కమ్ము. పరమేశ్వరా! మేము నిన్ను అన్ని విధములుగా శరణు పొంది యున్నాము (38). తెల్లని కంఠము (నీలభాగమును విడచి) గలవాడు, స్వాహాకారస్వరూపుడు, రూపములేని వాడైననూ రూపమును స్వీకరించి సర్వరూపములు తానే అయినవాడు అగు రుద్రునకు నమస్కారము (39). విషమును ధరించుటచే నీలవర్ణమును కూడిన కంఠము గలవాడు, చితాభస్మను అవయవములపై ధరించినవాడు, నిత్యము నల్లని కేశములు గలవాడు అగు శివునకు అనేక నమస్కారములు (40).


అందరిచే నమస్కరింపబడు రూపముగలవాడు, యోగులచే ఉపాసింపబడువాడు, లయకాలములో ప్రాణులను సంహరించువాడు, అందరిచే పూజింపబడే పాదములు గలవాడు అగు మహాదేవునకు వందనము (41). నీవు దేవతలందరిలో బ్రహ్మవు. రుద్రులలో కంఠమునందు నీలవర్ణము, ఇతర దేహము నందు రక్తవర్ణము గల శివుడవు. సర్వప్రాణులలోని ఆత్మవు నీవే. సాంఖ్యులు నిన్ను పురుషుడని వర్ణింతురు (43).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 SRI SIVA MAHA PURANA - 634🌹*

*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *


*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 12 🌴*


*🌻 The story of Śiva and Pārvatī including that of Kārttikeya - 4 🌻*


33. Obeisance to the bull-bannered lord Śiva, obeisance to the lord of Gaṇas; Obeisance to the lord of all. Obeisance to the lord of the three worlds.


34. O lord, obeisance to you, the annihilator, the sustainer and creator of the worlds. O lord of gods, obeisance to you, the lord of three attributes and the eternal.


35. Obeisance to the lord free from attachment; obeisance to Śiva the great soul. Obeisance to the pure beyond the world of matter, obeisance to the great, the unwasting.


36. Obeisance to you the god of death holding the staff of punishment and noose in the hand. Obeisance to the chief of the deities invoked by Vedic mantras. Obeisance to you the hundred-tongued deity.


37. O lord, everything has come out of your body whether past, present or future, whether mobile or immobile.


38. O lord, protect us always. O supreme lord, we have sought refuge in you in every respect.


39. Obeisance to you, the blue-necked Rudra, of the form of offering. Obeisance to you both possessed and devoid of forms, the multiformed one.


40. Obeisance to Śiva, the blue-necked, the wearer of ashes on the limbs from the funeral pyre. Obeisance to you Śrīkaṇṭha and Nīlaśikhaṇḍa.


41. Obeisance to you saluted by all, saluted by the Yogins. Obeisance to you, the great lord, whose feet are worshipped by all.


42. You are Brahmā among all the gods, you are Nīlalohita among Rudras; you are the soul in all living beings; you are the Puruṣa of Sāṅkhya system.


43. You are Sumeru among mountains, you are the moon among the stars. You are Vasiṣṭha among the sages and you are Indra among the gods.


Continues....

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 351 / DAILY WISDOM - 351 🌹*

*🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀*

*📝. ప్రసాద్ భరద్వాజ్*


*🌻16. చైతన్యం పై ధ్యానం యొక్క అవసరం🌻*


*మన ఈ విశ్లేషణ యొక్క తాత్విక మరియు మతపరమైన పర్యవసానాలు, చైతన్యం పై ధ్యానాన్ని, మన ఈ ప్రయాణం యొక్క మూల బిందువుగా నిలబెడతాయి. మన చేసే సంపూర్ణమైన అధ్యయనం, ప్రతి ప్రయత్నం, ఒక వాస్తవికతలో మనల్ని నిలబెడతాయి. ఇదే ధ్యానం యొక్క మూల ఉద్దేశ్యం. అత్యున్నత వాస్తవికత తో మనకున్న సంబంధాన్ని తెలుసుకోవటమే అత్యున్నత ధ్యానం. ధ్యానం అంటే ఒక కదలిక, ఆలోచన కాదు. అది పూర్ణత్వాన్ని అనుభావికంగా తెలుసుకుని, తన ముందున్న విషయాల ఆధారంగా తన దృక్పథాన్ని మెరుగు పరుచుకోవడం.*


*ఈ అధ్యయనం ప్రారంభం నుండి, వాస్తవికత అంటే ఏమిటి, అది విశ్వంలో మరియు స్వీయ-పరిపూర్ణత కోసం సమూహాలు, సమాజాలు లేదా సంస్థలుగా ఏర్పడే వ్యక్తులలో అనేక వ్యక్తీకరణ స్థాయిలలో ఎలా వ్యక్తమవుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించబడింది. సృష్టిలో వాస్తవికత క్రమంగా అవరోహణ చెందింది. ధ్యాన మార్గం దీనికి వ్యతిరేకం. ఇది విస్తారత వైపు చేసే అధిరోహణ.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 DAILY WISDOM - 351 🌹*

*🍀 📖 from The Philosophy of Religion 🍀*

*📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj*


*🌻16. The Need for Meditation on Consciousness🌻*


*The philosophical foundations and the religious consequences of the analysis lead to the need for a meditation on consciousness as the quintessence of the whole adventure. All study, all endeavour, and every enterprise, in every walk of life, results in the fixing of oneself in a type of reality. This is precisely the function of meditation. To recognise one's true relationship with the Ultimate Reality is to place oneself in the context of the highest form of meditation. Meditation is, in fact, not a psychological act or a physical movement, or even a social adjustment, but a trans-empirical attitude of the whole of what one is, a perfection of outlook one adopts in the light of the nature of the facts of life.*


*From the beginning of this study, an attempt has been made to understand what reality is, how it manifests itself by degrees of expression in the universe and in the individuals who form themselves into groups, societies, or organisations for the purpose of self-fulfilment. There is a gradual descent of the character of reality in the process of creation, and the aim of meditation is just the opposite of this descending series. Meditation leads to the gradual ascent of self by degrees of expansiveness.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 250 🌹*

*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*


*🍀. వివేకమన్నది పాట కాకుంటే అది నిజమైంది కాదు. అప్పుడది కేవలం జ్ఞానమవుతుంది. వివేకం కేవలం ధ్యానం గుండా జన్మిస్తుంది. 🍀*


*వివేకమన్నది ఒక పాట. అది గంభీరత కాదు. అది ఆట. అది విషాదం కాదు. అది ఉత్సవం. వివేకమన్నది పాట కాకుంటే అది నిజమైంది కాదు. అప్పుడది కేవలం జ్ఞానమవుతుంది. అది వివేకంగా భ్రమింప జేస్తుంది.*


*వివేకమన్నది, నిజమైన వివేకమన్నది పాటగా మారుతుంది. చివరికి పాటగా పరివర్తన చెందుతుంది. అది కేవలం ధ్యానం గుండా జన్మిస్తుంది. మరో మార్గం లేదు.*


*సశేషం ...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Commenti


Post: Blog2 Post
bottom of page