🌹🍀 21 - NOVEMBER - 2022 MONDAY ALL MESSAGES సోమవారం,ఇందు వాసర సందేశాలు 🍀🌹
🌹21 - NOVEMBER నవంబరు - 2022 MONDAY సోమవారం, ఇందు వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 285 / Bhagavad-Gita -285 - 7వ అధ్యాయము 05 జ్ఞాన విజ్ఞాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 684 / Vishnu Sahasranama Contemplation - 684 🌹
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 646 / Sri Siva Maha Purana - 646 🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 363 / DAILY WISDOM - 363 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 262 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹21, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : ప్రదోష వ్రతం, Pradosh Vrat🌻*
*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 8 🍀*
*13. కమండలుధరో ధన్వీ బాణహస్తః కపాలవాన్ |*
*అశనీ శతఘ్నీ ఖడ్గీ పట్టిశీ చాయుధీ మహాన్*
*14. స్రువహస్తః సురూపశ్చ తేజస్తేజస్కరో నిధిః |*
*ఉష్ణీషీ చ సువక్త్రశ్చ ఉదగ్రో వినతస్తథా*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : మానవుల హేతుబద్ధ ప్రవృత్తి లక్షణం విశ్వాసాలను అనుసరించడం. సహజ, ప్రవృత్తులను సమర్థించడం. ఇదే సామాన్యంగా హేతుబద్ధ మనుకొనే బుద్ధిచేసే పని. కాని, అందుకు ప్రేరణ అంతశ్చేతనలో నుంచి కానరాకుండా జరుగుతున్నందు వల్ల మానవులు తాము హేతుబద్ధంగా ప్రవర్తిస్తున్నామనే అనుకుంటూ వుంటారు. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, శరద్ ఋతువు,
దక్షిణాయణం, కార్తీక మాసం
తిథి: కృష్ణ ద్వాదశి 10:08:27 వరకు
తదుపరి కృష్ణ త్రయోదశి
నక్షత్రం: చిత్ర 24:14:49 వరకు
తదుపరి స్వాతి
యోగం: ఆయుష్మాన్ 21:07:20 వరకు
తదుపరి సౌభాగ్య
కరణం: తైతిల 10:04:27 వరకు
వర్జ్యం: 08:29:20 - 10:03:48
మరియు 29:35:46 - 31:07:42
దుర్ముహూర్తం: 12:24:16 - 13:09:18
మరియు 14:39:22 - 15:24:25
రాహు కాలం: 07:48:24 - 09:12:51
గుళిక కాలం: 13:26:11 - 14:50:38
యమ గండం: 10:37:18 - 12:01:45
అభిజిత్ ముహూర్తం: 11:39 - 12:23
అమృత కాలం: 17:56:08 - 19:30:36
సూర్యోదయం: 06:23:58
సూర్యాస్తమయం: 17:39:31
చంద్రోదయం: 03:38:02
చంద్రాస్తమయం: 15:41:46
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు : ముద్గర యోగం - కలహం 24:14:49
వరకు తదుపరి ఛత్ర యోగం - స్త్రీ లాభం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 285 / Bhagavad-Gita - 285 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 7 వ అధ్యాయము - జ్ఞానవిజ్ఞాన యోగం - 05 🌴*
*05. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్ |*
*జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ ||*
🌷. తాత్పర్యం :
*ఓ మాహాబాహుడవైన అర్జునా! వాటికి అన్యముగా న్యునమైన ప్రకృతిని ఉపయోగించుకొను జీవులను కూడియున్న నా ఉన్నతమైన శక్తి వేరొక్కటి కలదు.*
🌷. భాష్యము :
జీవులు శ్రీకృష్ణభగవానుని ఉన్నతమైన ప్రకృతికి (శక్తికి) చెందినవారని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అను వివిధాంశములుగా ప్రదర్శింపబడు భౌతికపదార్థమే న్యూనమైన శక్తి. భుమ్యాది స్థూలవిషయములు రెండు ప్రకృతిరూపములు న్యునశక్తి నుండి ఉద్భవించినట్టివే. వివిధప్రయోజనములకై ఈ న్యునశక్తులను వినియోగించుకొను జీవులు శ్రీకృష్ణభగవానుని ఉన్నతశక్తికి సంబంధించినవారై యున్నారు. అటువంటి ఈ ఉన్నతశక్తి వలననే సమస్తజగత్తు నడుచుచున్నది.
ఉన్నతశక్తికి చెందిన జీవుడు నడుపనిదే భౌతికజగత్తు నడువలేదు. కాని శక్తులు అన్నివేళలా వానిని కలిగియున్న శక్తిమానినిచే నియమింపబడి యున్నందున జీవులు సదా భగవానునిచే నియమింపబడెడివారే. కనుక వారికెన్నడును స్వతంత్ర ఉనికి యనునది ఉండదు. కొందరు బుద్ధిహీనులు ఊహించునట్లు వారెన్నడును భగవానునితో సమశక్తిమంతులు కాజాలరు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 285 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 7 - Jnana Vijnana Yoga - 05 🌴*
*05. apareyam itas tv anyāṁ prakṛtiṁ viddhi me parām*
*jīva-bhūtāṁ mahā-bāho yayedaṁ dhāryate jagat*
🌷 Translation :
*Besides these, O mighty-armed Arjuna, there is another, superior energy of Mine, which comprises the living entities who are exploiting the resources of this material, inferior nature.*
🌹 Purport :
Here it is clearly mentioned that living entities belong to the superior nature (or energy) of the Supreme Lord. The inferior energy is matter manifested in different elements, namely earth, water, fire, air, ether, mind, intelligence and false ego. Both forms of material nature, namely gross (earth, etc.) and subtle (mind, etc.), are products of the inferior energy. The living entities, who are exploiting these inferior energies for different purposes, are the superior energy of the Supreme Lord, and it is due to this energy that the entire material world functions. The cosmic manifestation has no power to act unless it is moved by the superior energy, the living entity.
Energies are always controlled by the energetic, and therefore the living entities are always controlled by the Lord – they have no independent existence. They are never equally powerful, as unintelligent men think.
🌷 🌷 🌷 🌷 🌷
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 684 / Vishnu Sahasranama Contemplation - 684🌹*
*🌻684. రణప్రియః, रणप्रियः, Raṇapriyaḥ🌻*
*ఓం రణప్రియాయ నమః | ॐ रणप्रियाय नमः | OM Raṇapriyāya namaḥ*
*రణప్రియః, रणप्रियः, Raṇapriyaḥ*
*ప్రియో రణో యస్య యతో ధత్తే పఞ్చమహాయుధమ్ ।*
*సతతం లోకరక్షార్థమతో వాఽయం రణప్రియః ॥*
*లోక రక్షార్థమై సతతము శంఖ, చక్ర, గదా, ధనుస్సు, కడ్గములను మహా ఆయుధములను ధరించుచుండువాడు. కావున ఆతడు రణ ప్రియుడు. ఎవనికి రణము ప్రియమో అట్టివాడు రణప్రియః.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 684🌹*
*🌻684. Raṇapriyaḥ🌻*
*OM Raṇapriyāya namaḥ*
प्रियो रणो यस्य यतो धत्ते पञ्चमहायुधम् ।
सततं लोकरक्षार्थमतो वाऽयं रणप्रियः ॥
*Priyo raṇo yasya yato dhatte pañcamahāyudham,*
*Satataṃ lokarakṣārthamato vā’yaṃ raṇapriyaḥ.*
*He always carries the five great warfare paraphernalia viz., the conch shell, discus, mace, bow and sword; ever ready to engage in war to protect the worlds.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
स्तव्यस्स्तवप्रियस्स्तोत्रं स्तुतिः स्तोता रणप्रियः ।पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः ॥ ७३ ॥
స్తవ్యస్స్తవప్రియస్స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః ।పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః ॥ 73 ॥
Stavyasstavapriyasstotraṃ stutiḥ stotā raṇapriyaḥ,Pūrṇaḥ pūrayitā puṇyaḥ puṇyakīrtiranāmayaḥ ॥ 73 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 646 / Sri Siva Maha Purana - 646 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 15 🌴*
*🌻. గణేశ యుద్ధము - 1 🌻*
బ్రహ్మ ఇట్లు పలికెను -
శివ విభుడిట్లు పలుకగా గణములు దృఢనిశ్చయము చేసుకొని సర్వసన్నద్ధులై పార్వతీ మందిరమునకు వెళ్లిరి (1).
గణాధ్యక్షులందరు యుద్ధమునకు సన్నద్ధులై వచ్చి యుండుటను గాంచి గణేశుడు వారితో నిట్లనెను (2).
గణేశుడిట్లు పలికెను -
శివుని ఆజ్ఞను పాలించు గణాధ్యక్షలందరీకీ స్వాగతము. బాలుడు, ఏకాకి అగు నేను పార్వతీ దేవి ఆజ్ఞను పాలించెదను (3). పార్వతీదేవి తన కుమారుని బలమును చూచుగాక! శివుడు కూడా తన గణముల బలమును చూడగలడు (4). ఈ యుద్ధములో భవాని పక్షమున బాలుడు, శివుని పక్షమున బలవంతులగు గణములు ఉన్నారు. మీరు పూర్వము అనేక యుద్ధములలో రాటు దేలిన యుద్ధ నిపుణులు (5). నేను పూర్వము యుద్ధమును చేయనే లేదు. బాలుడనగు నేను ఇపుడు యుద్ధమును చేయబోవు చున్నాను (6).
ఈ సంధర్భములో నాకు కలుగబోయే వినాశ##మేమియూ లేదు. పార్వతీ పరమేశ్వరులు సిగ్గుపడినచో, అది నాకు మీకు కూడ సిగ్గుపడదగినవిషయమే యగును (7). ఓ గణనాథులారా! మీరీ సత్యమునెరింగి యుద్ధమునకు దిగుడు. మీరు మీ ప్రభువు ముఖమును, నేను నా తల్లి ముఖమును చూచి (8), యుద్ధమును చేసెదము. ఎట్టి యుద్ధము జరుగవలసియున్నదో అట్టి యుద్ధము జరుగుగాక! దానిని అపగల సమర్థుడు ముల్లోకములలో లేడు (9).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 646🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 15 🌴*
*🌻 Gaṇeśa’s battle - 1 🌻*
Brahmā said:—
1. When Śiva told them thus, they came to a decisive resolution. They got ready and went to Śiva’s palace.
2. On seeing the excellent Gaṇas, fully equipped for war, coming, Gaṇeśa spoke thus to them.
Gaṇeśa said:—
3. Welcome to the leaders of Gaṇas, carrying out the behests of Śiva. I am only one and that too a mere boy carrying out the directions of Pārvatī.
4. Yet let the goddess see the strength of her son. Let Śiva see the strength of his Gaṇas too.
5. The fight between the parties of Pārvatī and Śiva is the one between a strong army and a boy. You are all experts in warfare and have fought in many a battle.
6. I have never fought in a battle before. I am a mere boy. I am going to fight now. Still if you are put to shame, it will be shameful to Śiva and Pārvatī.
7. But that will not happen to me. If I am put to shame, the contrary will happen to me. Pārvatī and Śiva will be put to shame but not I.
8. O leader of the Gaṇas, the war shall be fought after realising this. You shall look up to your lord and I to my mother.
9. What sort of a fight shall be fought? Let what is destined to occur, occur. No one in the three worlds can ward it off.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 363 / DAILY WISDOM - 363 🌹*
*🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀*
*📝. ప్రసాద్ భరద్వాజ్*
*🌻28. మనిషి ఎప్పుడూ మేల్కొనే ఉండేవాడు కాదు🌻*
*మనిషి మేల్కొనే స్థితికి భిన్నమైన స్థితుల గుండా వెళ్ళే సందర్భాలు ఉన్నాయి. మనిషి ఎప్పుడూ మేల్కొనే ఉండడు; అతను మేల్కొని లేనప్పటికీ ఉనికిలో ఉండే సందర్భాలు ఉన్నాయి. కల అనేది ఒక ఉదాహరణ. మనిషి కలలో కూడా ఉంటాడు; అతను చనిపోలేదు. కానీ ఇక్కడ మేల్కొనే స్పృహ పనిచేయదు; ఇంద్రియాలు చురుకుగా ఉండవు. అప్పుడు తన భౌతిక కళ్లతో చూడడు, చెవులతో వినడు. కలలు కంటున్నప్పుడు చెవుల దగ్గర శబ్దం వస్తే, అతను వినకపోవచ్చు; నాలుకపై మధురమైన పదార్థాన్ని ఉంచినట్లయితే, అతను దానిని రుచి చూడలేడు.*
*స్వప్న స్థితిలో కూడా ఒక యంత్రాంగం పనిచేస్తూనే ఉంటుంది. 'నేను నిన్న కలలు కన్నాను,' అనేది కల నుండి మేల్కొన్నప్పుడు అందరూ సాధారణంగా చెప్పేది. 'నేను' కలలో ఉందా? అవును, 'నేను' అనేది ఉనికిలో ఉంది. ‘నేను’ ఏ స్థితిలో ఉంది? శరీరం వలె కాదు, ఎందుకంటే శరీరం క్రియారహితంగా ఉంది. అప్పుడు అక్కడ శరీరం ఉనికి గురించి తెలియదు. అప్పుడు ఆ వ్యక్తి శరీరంతో తనను తాను గుర్తించలేడు. మనిషి తన కలలో ఈ శరీరం కాదు. అప్పుడు అతను ఏమిటి? సరే, 'నేను మనస్సు మాత్రమే' అని ఒకరు అనవచ్చు. మనస్సు పనిచేస్తోంది; మనస్సు ఉనికిలో ఉంది; మనస్సు పనిచేస్తోంది; మనస్సు ఒక కల అని పరిగణించబడే మొత్తం దృగ్విషయాలను అనుభవిస్తోంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 363 🌹*
*🍀 📖 from The Philosophy of Religion 🍀*
*📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj*
*🌻28. Man is not Always Waking🌻*
*There are occasions when man passes through states which are different from the waking one. Man is not always waking; he is in other conditions also, when he still exists. Dream is one instance. Man exists even in dream; he is not dead. But here the waking consciousness does not operate; the senses are not active. One does not see with the eyes, does not hear with the ears. If a sound is made near the ears when one is dreaming, he may not hear it; if a particle of sugar is placed on the tongue, he may not taste it.*
*A mechanism operates even in the state of dream. And, “I dreamt yesterday,” is what everyone generally says when one wakes up from dream. Did ‘I' exist in dream? Yes, ‘I' did exist. In what condition did ‘I' exist? Not as the body, for the body was inactive. One was not aware of the existence of the body. One could not identify oneself with the body. Man was not the body at all, for all practical purposes, in his dream. What was he, then? Well, one may say, “I was only the mind.” The mind was operating; the mind was existing; the mind was functioning; the mind was experiencing the whole phenomena of what could be regarded as a dream life.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 262 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. నీ ఆలోచనలు, మనసు, నీ అహం యివన్నీ మాయమయి పోయినపుడే ఆ గాఢ నిశ్శబ్దంలోనే నువ్విక్కడికి యాదృచ్చికంగా రాలేదని అస్తిత్వానికి సంబంధించి ఒక ప్రత్యేకమయిన పనిని నిర్వర్తించడానికి వచ్చావని గ్రహిస్తావు.🍀*
*ఒకసారి నువ్వు ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెడితే నీ దృష్టి, దృక్పథం మారిపోతాయి. నువ్విక్కడికి యాదృచ్చికంగా రాలేదని అస్తిత్వానికి సంబంధించి ఒక ప్రత్యేకమయిన పనిని నిర్వర్తించడానికి వచ్చావని గ్రహిస్తావు. అస్తిత్వం నీ వెనకనే వుంటుంది.*
*నీ ఆలోచనలు, మనసు, నీ అహం యివన్నీ మాయమయి పోయినపుడే ఆ గాఢ నిశ్శబ్దంలోనే నువ్వా సంగతి గ్రహిస్తావు. ఆ స్పష్టతలో అన్ని మేఘాలూ అదృశ్యమయినపుడు నీ ముందు సూర్యుడు వెలుగుతాడు. ఆ కాంతిలో జీవితం రూపాంతరం చెందుతుంది. అప్పుడు జీవితానికి అర్థం, ప్రత్యేకత ఏర్పడతాయి. వాటి నించి ఉల్లాసం, ఆనందం వస్తాయి.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Comments