🌹🍀 21 - OCTOBER - 2022 FRIDAY ALL MESSAGES శుక్రవారం, భృగు వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 21 - OCTOBER - 2022 WEDNESDAY శుక్రవారం, భృగు వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 81 / Kapila Gita - 81 🌹 సృష్టి తత్వము - 37
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 120 / Agni Maha Purana - 120 🌹 🌻. దేవాలయ నిర్మాణ ఫలము - 3🌻
4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 255 / Osho Daily Meditations - 255 🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 409 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 409 -2 🌹 ‘శివప్రియా'- 2
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹21, October అక్టోబరు 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : రమా ఏకాదశి, గోవత్స ద్వాదశి, Rama Ekadashi, Govatsa Dwadashi 🌻*
*🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -17 🍀*
*17. సౌఖ్యప్రదే ప్రణతమానసశోకహన్త్రి అమ్బే ప్రసీద కరుణాసుధయాఽఽర్ద్రదృష్ట్యా ।*
*సౌవర్ణహారమణినూపురశోభితాఙ్గి శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : మానవ లక్ష్యం - ఆనందమే ఈశ్వరుడు మానవజాతికి నిర్దేశించిన లక్ష్యం. దీనిని నీవు మొదట నంపాదించు కోగలిగితే పిమ్మట నీతోటి వారికి పంచిపెట్ట గలుగుతావు. మానవుడు స్వర్గ సుఖమసుకోని, పుణ్య సంపద అనుకోనీ తనకు మాత్రమే సంపాదించుకునేది సరియైన సంపాదన కానేరదు.🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, శరద్ ఋతువు,
దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం
తిథి: కృష్ణ ఏకాదశి 17:24:44 వరకు
తదుపరి కృష్ణ ద్వాదశి
నక్షత్రం: మఘ 12:29:08 వరకు
తదుపరి పూర్వ ఫల్గుణి
యోగం: శుక్ల 17:47:34 వరకు
తదుపరి బ్రహ్మ
కరణం: బాలవ 17:18:45 వరకు
వర్జ్యం: 20:56:20 - 22:37:48
దుర్ముహూర్తం: 08:30:36 - 09:17:16
మరియు 12:23:55 - 13:10:35
రాహు కాలం: 10:33:05 - 12:00:35
గుళిక కాలం: 07:38:06 - 09:05:36
యమ గండం: 14:55:34 - 16:23:04
అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:23
అమృత కాలం: 09:53:18 - 11:37:06
సూర్యోదయం: 06:10:37
సూర్యాస్తమయం: 17:50:33
చంద్రోదయం: 02:24:07
చంద్రాస్తమయం: 15:22:04
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: సింహం
కాల యోగం - అవమానం 12:29:08
వరకు తదుపరి సిద్ది యోగం -
కార్య సిధ్ధి , ధన ప్రాప్తి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 81 / Kapila Gita - 81🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 37 🌴*
*37. చాలనం వ్యూహనం ప్రాప్తిర్నేతృత్వం ద్రవ్యశబ్దయోః|*
*సర్వేంద్రియాణామాత్మత్వం వాయోః కర్మాభిలక్షణమ్॥*
*చెట్లకొమ్మలను చలింపజేయుటకు, తృణాదులను ఒకచోట చేర్చుట, సర్వత్ర వ్యాపించుట, వస్తువులయొక్క వాసనలను (గంధమును) ఘ్రాణేంద్రియము (ముక్కు) కడకును. శబ్దముసు శ్రోత్రేంద్రియము (చెవులు) కడకును చేర్చుట అట్లే సమస్త ఇంద్రియములకును కార్యశక్తిని కలిగించుట అనునవి వాయువుయొక్క వృత్తుల (కార్యముల) లక్షణములు.*
*ప్రతీ దాన్ని కదిలించడం గాలి యొక్క గుణం. దగ్గరగా ఉన్న దాన్ని విడదీసేదీ, దూరముగా ఉన్నవాటిని దగ్గరకు చేసేదీ వాయువు. ఈ రెండిటికీ కదలిక కావాలి. ద్రవ్యమునూ(గంధమును) శబ్దమునూ మన దగ్గరకు తీసుకుని వస్తుంది. అన్ని ఇంద్రియములనూ ధరించేది వాయువు. మన ఇంద్రియాలు అన్నీ ఆకాశములోనే ఉన్నాయి. అవి కింద పడకుండా ఆపేది వాయువు. అలాగే అన్ని గోళాలు ఆకాశములో ఉన్నాయి కానీ కింద పడవు, అలాగే అవయవ రంధ్రాలలో ఇంద్రియాలు ఉన్నాయి. ఆ ఇంద్రియాలను ధరించేది వాయువు. చక్షురింద్రియం, ఘ్రానేంద్రియం వంటివి ఇంకో గోళం (అవయవము) లోకి వెళ్ళకుండా ఉండటానికి కారణం వాయువు.*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 81 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*
*🌴 2. Fundamental Principles of Material Nature - 37 🌴*
*37. cālanaṁ vyūhanaṁ prāptir netṛtvaṁ dravya-śabdayoḥ*
*sarvendriyāṇām ātmatvaṁ vāyoḥ karmābhilakṣaṇam*
*The action of the air is exhibited in movements, mixing, allowing approach to the objects of sound and other sense perceptions, and providing for the proper functioning of all other senses.*
*We can perceive the action of the air when the branches of a tree move or when dry leaves on the ground collect together. Similarly, it is only by the action of the air that a body moves, and when the air circulation is impeded, many diseases result. Paralysis, nervous breakdowns, madness and many other diseases are actually due to an insufficient circulation of air. In the Āyur-vedic system these diseases are treated on the basis of air circulation. If from the beginning one takes care of the process of air circulation, such diseases cannot take place.*
*From the Āyur-veda as well as from the Śrīmad-Bhāgavatam it is clear that so many activities are going on internally and externally because of air alone, and as soon as there is some deficiency in the air circulation, these activities cannot take place. Here it is clearly stated, netṛtvaṁ dravya-śabdayoḥ. Our sense of proprietorship over action is also due to the activity of the air. If the air circulation is stifled, we cannot approach a place after hearing. If someone calls us, we hear the sound because of the air circulation, and we approach that sound or the place from which the sound comes. It is clearly said in this verse that these are all movements of the air. The ability to detect odors is also due to the action of the air.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 120 / Agni Maha Purana - 120 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 38*
*🌻. దేవాలయ నిర్మాణ ఫలము - 3🌻*
*విష్ణ్వాలయమునకు వెల్లవేసినవారును, దానిపై బంధూకపుష్పముల చిత్రములు వేసినవారును విష్ణులోకమును పొందుదురు. కూలిపోయిన లేదా కూలిపోవుచున్న లేదా సగము కూలిపోయిన దేవాలయమును జీర్ణోద్ధారణము చేసినవానికి క్రొత్తదేవాలయము నిర్మించినవానికంటె రెట్టింపు ఫలము లభించును. కూలిపోయిన విష్ణ్వాంయమును మరల నిర్మించి రక్షించిన వాడు సాక్షాత్ భగవత్స్వరూపుడు.*
*భగవంతుని ఆలయము నందు ఇటుకలు ఎంతకాల ముండునో అంతవరకును, వాటిని నిర్మించినవాడు, తన కులముతో కూడ, విష్ణులోకములో నుందును. ఇహలోకమునందును, పరలోకమునందును గూడ ఆతడే పూజనీయుడు; అతడే పుణ్యవంతుడు.*
*శ్రీకృష్ణునకు ఆలయము కట్టించిన పుణ్యాత్ముడే పుట్టినవారిలో లెక్క. అతడే తన వంశమును రక్షించువాడు. విష్ణు-శివ-సూర్య-దేవ్యాదులకు ఆలయమును నిర్మించువాడే ఈ లోకమునందు కీర్తి పొందును. ఎంతో శ్రమపడి సంపాదించిన ధనమును, శ్రీకృష్ణాలయమును నిర్మించుటకు వినియోగింపక, కేవలము దానిని రక్షించుచుండు మూమార్ఖునకు దానివల్ల ఏమి ప్రయోజనము కలుగును?*
*పితరులు, బ్రాహ్మణులు, దేవతలు-వీరికై తన ధనమును వినియోగించని వాని ధనము, బంధువులకు ఉపకరించని వాని ధనము వ్యర్థము. దానమునకు గాని, భోగమునకు గాని, ధర్మాచరణమునకు గాని, కీర్తి కొరకు గాని ఉపకరించని ధనమునకు స్వామి అయి ఏమి ప్రయోజనము? అందుచే పూర్వజన్మాదృష్టముచేత గాని, పురుష ప్రయత్నముచేత గాని, మరి ఏఉపాయాంతరముచేత గాని లభించిన ధనమును ఉత్తమబ్రహ్మణులకు దానము చేయవలెను; స్థిరకీర్త లభించుటకు ఉపయోగించవలెను. దానికీర్త్యాదుకంటె గూడ దేవాలయనిర్మాణము ఉత్తమ మైనది గాన బుద్ధిమంతుడు విష్ణ్వాదిదేవతలకు ఆలయములు కట్టించవలెను.*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 120 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 38*
*🌻 Benefits of constructing temples - 3 🌻*
18. Those who decorate (the temple) of Viṣṇu with the bandhūka flowers and an oint with fragrant paste, also reach the place of the lord. (Having erected the temple of Hari), a person obtains two-fold merits after having elevated the fallen, the falling and half-fallen. He who brings about the fall of a man is the protector of one fallen.
19. By (erecting) a temple of Viṣṇu one reaches his region. As long as the bricks remain in the temple of Hari, the founder of that family is honoured in the world of Viṣṇu. He becomes pious and adorable in this world as well as the next.
20. He who builds a temple for Kṛṣṇa, the son of Vasudeva is born as a man of good deeds and his family gets purified.
21. He who builds an abode for Viṣṇu, Rudra, Sun or the goddess etc. acquires fame. What is the use of the hoarded riches for an ignorant person?
22-23. If one does not cause an abode for Kṛṣṇa to be built (with wealth) acquired by hard (work) (and) if one’s wealth could not be enjoyed by manes, brahmins, celestials and relatives, his acquisition of wealth is useless. As death is certain for a man so also the destruction of wealth.
24. One who does not spend his riches for charities or for enjoyments is stupid and is being bound even while alive, while the riches are flickery.
25. Is there any merit in being the lord of wealth acquired either accidentally or by one’s effort, if it is not spent for acquiring fame or for philanthropy?
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 255 / Osho Daily Meditations - 255 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀 255. భగవంతుని పాట 🍀*
*🕉. మనమందరం ఒకే గాయకుడి విభిన్న పాటలం, ఒకే నర్తకి యొక్క విభిన్న హావభావాలం. 🕉*
*ప్రతి జీవి దేవుని పాట: ప్రత్యేకమైనది, వ్యక్తిగతమైనది, సాటిలేనిది, పునరావృతం చేయలేనిది. ఒకే మూలం నుండి అది వస్తోంది. ఒక్కో పాటకి ఒక్కో రుచి ఉంటుంది, అందం ఉంటుంది, సంగీతం ఉంటుంది, శృతి ఉంటుంది కానీ, గాయకుడు ఒకడే. మనమందరం ఒకే గాయకుడి విభిన్న పాటలము. ఒకే నర్తకి యొక్క విభిన్న హావభావాలం. అనుభూతిని ప్రారంభించడం ధ్యానం. అప్పుడు సంఘర్షణ అదృశ్య మవుతుంది, అసూయలు అసాధ్యమవుతాయి మరియు హింసను ఊహించ లేము. ఎందుకంటే ప్రపంచం అంతటా మన స్వంత ప్రతిబింబాలు తప్ప మరెవ్వరూ లేరు. సముద్రపు అలలన్నింటిలాగే మనం కూడా ఒకే మూలానికి చెందిన వారమైతే, ఈ సంఘర్షణ, పోటీ, ఉన్నతమైన లేదా తక్కువ అనే భావనలు, అసలు ఈ అర్ధం లేనివన్నీ ఏమిటి?*
*ఎవరూ గొప్పవారు కాదు మరియు ఎవరూ తక్కువ కాదు: ప్రతి ఒక్కరూ కేవలం తాను లేదా ఆమె మాత్రమే. మరియు ప్రతి ఒక్కరూ చాలా ప్రత్యేకమైన వారు. ఇంతకు ముందు మీలాంటి వ్యక్తి మరెవరూ లేరు మరియు మీలాంటి వ్యక్తి మళ్లీ ఉండే అవకాశం లేదు. వాస్తవానికి, మీరు వరుసగా రెండు క్షణాలు ఒకేలా ఉండరు. నిన్న మీరు వేరొక వ్యక్తి, నేడు మీరే మరొకరు. రేపు, ఎవరికీ తెలియదు. ప్రతి జీవి ఒక ప్రవాహం: స్థిరమైనది కొనసాగే మార్పు, ప్రవహించే నది. మీరు ఒకే నదిలో రెండుసార్లు అడుగు పెట్టలేరు అని చెప్తారు. నేను మీకు చెప్తున్నాను, మీరు ఒకే నదిలో ఒక్కసారి కూడా అడుగు పెట్టలేరు, ఎందుకంటే నది నిరంతరం ప్రవహిస్తుంది మరియు నది మన జీవితాన్ని సూచిస్తుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 255 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 255. S0NG OF GOD 🍀*
*🕉. We are all different songs of the same singer, different gestures of the same dancer. 🕉*
*Each being is a song of God: unique, individual, incomparable, unrepeatable, but still coming from the same source. Each song has its own flavor, its own beauty, its own music, its own melody, but the singer is the same. We are all different songs of the same singer, different gestures of the same dancer. To start feeling it is meditation. Then conflict disappears, jealousies become impossible, and violence is unthinkable, because there is nobody other than our own reflections all over the world. If we belong to the same source, just like all the waves of the ocean, then what is the point of conflict, competition, feeling superior or inferior, and all that nonsense?*
*Nobody is superior and nobody is inferior: Everybody is simply just himself or herself. And everybody is so unique that there has never been any other individual like you before, and there is no possibility of there ever being an individual like you again. In fact, you yourself are not the same for two consecutive moments. Yesterday you were a different person, today it is just somebody else. Tomorrow, one never knows. Each being is a flux: a constant change, a river flowing. Heraclitus says that you cannot step in the same river twice. And I say to you, you cannot step in the same river even once, because the river is constantly flowing. And the river represents life.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 409 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 409 - 2🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 89. శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా ।*
*అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా ॥ 89 ॥ 🍀*
*🌻 409. ‘శివప్రియా'- 2 🌻*
*ప్రేమ సమానత్వమునకు నిదర్శనము. ఆధిక్యము హెచ్చుతగ్గులకు నిదర్శనము. పురుషులు తాము అధికులను కొందురు. అట్టి పురుషులు తెలియని వారు. అట్లే స్త్రీలు కూడ తాము అధికులమని ఋజువు చేయుటకు ప్రయత్నింతురు. ఇరువురు సమానులే గాని ఎవరునూ ఒకరి కన్న ఇంకొకరు అధికులు కారు. ఆధిక్య భావము అజ్ఞానము, సమభావము జ్ఞానము. సమదర్శనులే తెలిసినవారని శ్రీకృష్ణుడు గీతయందు తెలిపెను. సమదర్శనము లేనిచోట దివ్యసాన్నిధ్య ముండదు. శివప్రియా అను నామము ఇట్టి సమభావమును ప్రకటించుచున్నది.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 409 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj*
*🌻 89. Shivapriya shivapara shishteshta shishta-pujita*
*Aprameya svaprakasha manovachamagochara ॥ 89 ॥ 🌻*
*🌻 409. 'Shivapriya'- 2 🌻*
*Love is proof of equality. Dominance is indicative of inequality. Men tend to think they are superior. Such men are ignorants. Similarly, women also try to prove that they are superior. Both are equal and neither is superior to the other. Superiority is ignorance, equality is wisdom. Lord Krishna said in the Gita that only those who envision equality are wise. Where there is no equality in outlook, there is no reaching Divine. The name Shivapriya declares this equality.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
ความคิดเห็น