🌹🍀 23 - AUGUST - 2022 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🍀🌹
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 23, మంగళవారం, ఆగస్టు 2022 భౌమ వాసరే Tuesday 🌹
2) 🌹 కపిల గీత - 59 / Kapila Gita - 59 🌹 సృష్టి తత్వము - 15
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 98 / Agni Maha Purana - 98 🌹
4) 🌹. శివ మహా పురాణము - 614 / Siva Maha Purana -614 🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 233 / Osho Daily Meditations - 233 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 401 / Sri Lalitha Chaitanya Vijnanam - 401 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹23, AUGUST ఆగస్టు 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : అజా ఏకాదశి, Aja Ekadashi 🌻*
*🍀. సంకట మోచన హనుమాన్ స్తుతి - 1 🍀*
*1. వీర! త్వమాదిథ రవిం తమసా త్రిలోకీ వ్యాప్తా భయం తదిహ కోఽపి న హర్త్తుమీశః.*
*దేవైః స్తుతస్తమవముచ్య నివారితా భీర్జానాతి కో న భువి సంకటమోచనం త్వాం.*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : తమ స్వభావం ప్రకారం ప్రవర్తించడం తప్ప జంతువులకు వేరొకటేమీ తెలియదు. కనుకనే వాటిలో దివ్యత్వమున్నది. ఏ దోషమూ వాటి యందు లేదు. ఆత్మవిమర్శ వాటిలో తలయెత్తితే మాత్రం, వాటి అదే ప్రవర్తన మహాదోషం అవుతుంది. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, శ్రావణ మాసం
దక్షిణాయణం, వర్ష ఋతువు
తిథి: కృష్ణ ఏకాదశి 06:08:28 వరకు
తదుపరి కృష్ణ ద్వాదశి
నక్షత్రం: ఆర్ద్ర 10:45:35 వరకు
తదుపరి పునర్వసు
యోగం: సిధ్ధి 24:38:32 వరకు
తదుపరి వ్యతీపాత
కరణం: బాలవ 06:07:27 వరకు
వర్జ్యం: 24:12:00 - 25:59:36
దుర్ముహూర్తం: 08:31:48 - 09:22:13
రాహు కాలం: 15:27:39 - 17:02:09
గుళిక కాలం: 12:18:38 - 13:53:08
యమ గండం: 09:09:37 - 10:44:07
అభిజిత్ ముహూర్తం: 11:53 - 12:43
అమృత కాలం: -
సూర్యోదయం: 06:00:35
సూర్యాస్తమయం: 18:36:40
చంద్రోదయం: 02:20:01
చంద్రాస్తమయం: 16:00:14
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: జెమిని
చర యోగం - దుర్వార్త శ్రవణం 10:45:35
వరకు తదుపరి స్థిర యోగం - శుభాశుభ
మిశ్రమ ఫలం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 59 / Kapila Gita - 59🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ*
*2వ అధ్యాయము*
*🌴 2వ అధ్యాయము - సృష్టి తత్వం - 15 🌴*
*15. ఏతావానేవ సంఖ్యాతో బ్రహ్మణః సగుణస్య హ|*
*సన్నివేశో మయా ప్రోక్తో యః కాలః పంచవింశకః॥*
*ఈ విధముగా తత్త్వజ్ఞానులు ఈ ఇరువది నాలుగు తత్త్వములను సగుణ బ్రహ్మ యొక్క విశిష్టమగు స్థానములుగా పేర్కొనిరి. ఇవిగాక కాలము ను ఇరువది ఐదవ తత్త్వముగా పరిగణించిరి.*
*బ్రహ్మ మంచితనం, మోహం మరియు అజ్ఞానం అనే మూడు గుణాలతో కలిసినప్పుడు, భౌతిక విస్తరణ జరుగుతుంది, దీనిని కొన్నిసార్లు సగుణ బ్రహ్మంగా పిలుస్తారు మరియు అది ఈ ఇరవై ఐదు అంశాలతో కూడి ఉంటుంది.*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 59 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*✍️ Swami Prabhupada. 📚 Prasad Bharadwaj*
*🌴 2. Fundamental Principles of Material Nature - 15 🌴*
*15. etāvān eva saṅkhyāto brahmaṇaḥ sa-guṇasya ha*
*sanniveśo mayā prokto yaḥ kālaḥ pañca-viṁśakaḥ*
*All these are considered the qualified Brahman. The mixing element, which is known as time, is counted as the twenty-fifth element.*
*When Brahman is mixed with the three qualities goodness, passion and ignorance, there results the material expansion, which is sometimes called saguṇa Brahman and which consists of these twenty-five elements.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 98 / Agni Maha Purana - 98 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 31*
*🌻. అపామార్జన (ఆత్మ రక్షణ ) విధానము - 5 🌻*
తీవ్రజ్వాలలచే ప్రకాశించుచు, మహాధ్వని చేయుచున్న సుదర్శనచక్రమా! సమస్తదుష్టరాక్షసులను సంహరింపుము; సంహరింపుము. నీ ప్రభావముచే ఆ రాక్షసు లందరును నశింతురుగాక. సర్వాత్మకు డగు నృసింహుడు, తన గర్జనముచే, పూర్వ-పశ్చిమ-ఉత్తర-దక్షిణదిశలందు రక్షించుగాక.
అనేక రూపములను ధరించు భగవంతుడైన జనార్దనుడు స్వర్గలోక-భూలోక-అంతరిక్షములందును, ముందును, వెనుకను రక్షించుగాక. దేవాసుర మనుష్యసహిత మగు ఈ జగత్తు అంతుయు భగవంతు డగు విష్ణుయొక్క స్వరూపమే. ఈ సత్యముయొక్క ప్రభావముచే ఈతని దుష్టరోగము లన్నియు నశించుగాక.
''విష్ణువును స్మరింపగనే సర్వపాపములును వెంటనే తొలగిపోవును'' అను సత్యముయొక్క ప్రభావముచే వీని దుష్టరోగము లన్నియు శాంతించుగాక. ''యజ్ఞేశ్వరుడైన విష్ణువు దేవతలచే ప్రశంసించబడుచున్నాడు'' అనెడు సత్యముయొక్క ప్రభావముచే నా మాట సత్య మగుగాక. శాంతి కలుగుగాక. మంగల మగుగాక. ఈతని దుష్టరోగములు నశించుగాక.
భగవంతుడైన వాసుదేవుని శరీరమునుండి పుట్టిన కుశలచే నేను ఈతని రోగములను తొలగించితిని. నరనారాయణులు, గోవిందుడును వీనికి అపామార్జనము చేయుగాక. శ్రీహరి వచనము ప్రకారము ఈతని సంపూర్ణదుఃఖములు శమించుగాక. సమప్తరోగాదులను నివారించుటకు అపామార్జనస్తోత్రము ప్రశస్త మైనది. నేను శ్రీహరిని. నేను నీ రోగములను నశింపచేసితిని.
అగ్నిమహాపురాణమునందలి కేశాపామార్జనస్తోత్రవర్ణన మను ముప్పదియొకటవ అధ్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 98 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 31*
*🌻 Mode of cleansing and Protection oneself and others - 5 🌻*
38. O Sudarśana, the huge fire and great sound (you) destroy (all evils). O Vibhīṣaṇa (one who frightens)! may all the evil demons get destroyed.
39. May the Man-lion (deity), the soul ofall beings, possessing terrific roars protect me in the east, west, south and north.
40. May Lord Janārdana of manifold forms protect me in heavens, on the earth, in the sky, behind me, on the sides and in front of me.
41. As Viṣṇu (protects) the entire universe (consisting of) the celestials, demons and mortals, may the evils of this person be put down by that truth.
42. As the sins get destroyed at once by the remembrance of Viṣṇu, may all evil of this person get destroyed by that truth.
43. As the Supreme Lord Viṣṇu has been extolled in the vedānta (the philosophical inquiry is known as it forms the concluding portion of the Vedas) may all the evils of this person get destroyed by that truth.
44. As Viṣṇu, the lord of sacrifices is exolled [extolled?] among the celestials, may what all has been uttered by me become so by that truth.
45-46. May there be peace. May there be good. May the evil of this man get destroyed, being agitated by me with the kuśa (grass) originating from the body of Vāsudeva. May Govinda, the Nara-Nārāyaṇa[4] cleanse me. May there be remo, 1 of all miseries by the chant (of the names) of Hari in the same manner.
47. This is the weapon which cleans and which wards off all diseases. I am Hari. The kuśa grass is Viṣṇu. Your diseases have been destroyed by me.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 613 / Sri Siva Maha Purana - 613 🌹*
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 08 🌴*
*🌻. దేవాసుర యుద్ధము - 1 🌻*
బ్రహ్మ ఇట్లు పలికెను -
పుత్రా! నారదా! దేవదానవుల సేనలకు, వాటి అధీశ్వరులగు ఇంద్ర తారకులకు జరిగిన తుముల యుద్ధమును నీకు ఇంతవరకు చెప్పితిని. మరల వినుము (1). ఈ విధముగా దేవదానవులను వినాశము చేయు తుముల యుద్ధము జరుగుచుండగా తారకుడు దేవేంద్రుని గొప్ప శక్తి అను ఆయుధముతో మోదెను (2). వెంటనే ఐరావతము మూర్ఛిల్లి నేలపై బడెను. వజ్రధారి యగు ఇంద్రుడు మిక్కిలి ఖేదమును పొందెను (3). పుత్రా! అదే విధముగా లోకపాలురందరు వారి కంటె అధిక బలశాలులైన, రణవిద్యా పారంగతులైన రాక్షసుల చేతిలో పరాజయమును పొందిరి (4).
దానవులతో యుద్ధము చేయుచున్న ఇతర దేవతలు కూడు వారి తేజస్సును సహింపలేని వారై పరాజయమును పొంది పలాయనమును చిత్తగించిరి (5). ఆ సమయములో గొప్ప పరాక్రమమును ప్రరర్శించి విజయమును సాధించిన దానవులు సింహనాదములను చేయుచూ కోలాహలముగా గర్జించిరి (6). అదే సమయములో క్రోధావిష్టుడైన వీరభద్రడు వీరులగు గణములతో గూడి తాను వీరుడనని తలపోయు తారకుని ఎదుర్కొనెను (7). శివుని కోపము నుండి పుట్టినవాడు, బలవంతుడు, గణాధ్యక్షుడునగు వీరభధ్రుడు దేవతలను వెనుకకు పంపి యుద్ధము చేయు ఆకాంక్షతో తారకుని ఎదుట నిలబడెను (8).
అపుడా ప్రమథులు, రాక్షసులు పరమోత్సాహముతో ఆ మహారణరంగమునందు పరస్పరము యుద్ధమును చేసిర (9). యుద్ధ పండితులగు వారు ఆ యుద్ధములో ఒకరి నొకరు త్రిశూలములతో, రెండువైపుల పదును గల కత్తులతో, పాశములతో, ఖడ్గములతో, గొడ్డళ్లతో మరియు పట్టిశములతో హించుకొనిరి (10). వీరభద్రునిచే త్రిశూలముతో గట్టిగా కొట్టబడిన తారకుడుక్షణకాలము మూర్ఛను పొంది శీఘ్రమే భూమిపై పడెను (11). వీరుడు,రాక్షసశ్రేష్ఠుడు అగు ఆ తారకుడు తెలివిని దెచ్చుకొని వెంటనే లేచి నిలబడి శక్తి అను ఆయుధముతో వీదభద్రుని బలముగా కొట్టెను (12).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 613🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 08 🌴*
*🌻 The battle between the gods and Asuras - 1 🌻*
Brahmā said:—
1. O Nārada, O dear, thus I have described to you the fight between the rank and file of both the armies of the gods and Asuras. The fight was very tumultuous. Now listen to the fight between the two leaders on either side.
2-3. In the tumultuous fight that ensued reducing the numbers of the gods and the demons, lord Indra struck by the great spear fell from his elephant and became unconscious. The thunderbolt-bearing lord of gods attained great depression of spirits and swooned.
4. In the same manner, O dear, the guardians of the quarters, though powerful, were defeated in battle by the Asuras, great experts in warfare.
5. The other gods too were fought and defeated by the Asuras. Unable to bear their ferocity they took to flight.
6. The victorious Asuras, their effort having been successful, roared like lions and raised shouts of jubilation.
7. In the meantime Vīrabhadra reached the place furiously along with his heroic Gaṇas and approached Tāraka who professed to be a great hero.
8. The leader of the Gaṇas, the strong one born of the anger of Śiva, kept the gods in the rear and faced Tāraka desirous of fighting him.
9. Then the Pramathas and the jubilant Asuras, fond of great battle, fought one another.
10. Skilled adepts in warfare they hit and smashed one another with tridents, double-edged swords, nooses, axes and sharp-edged spikes.
11. Immediately after being hit hard with a trident by Vīrabhadra, Tāraka fell unconscious on the ground.
12. Regaining consciousness quickly Tāraka the excellent Asura got up and forcefully hit Vīrabhadra with his spear.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 232 / Osho Daily Meditations - 232 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀 233. పాత మనసు 🍀*
*🕉. మీరు మీ ఇష్టాలను వింటుంటే, మీరు మీ పాత మనస్సును వింటున్నారు. మీరు మీ ఇష్టాలకు వ్యతిరేకంగా కొన్ని పనులు చేయాలి, ఆపై మీరు ఎదుగుతారు. 🕉*
*ప్రజలు అనుకున్నంత సాఫీగా ఎదుగుదల ఉండదు. ఇది బాధాకరమైనది, .. మరియు మీ ఇష్టాలు మరియు అయిష్టాలకు వ్యతిరేకంగా మీరు వెళ్ళవలసి వచ్చినప్పుడు గొప్ప నొప్పి వస్తుంది. అయితే ఇది నాకు నచ్చింది, ఇది నాకు నచ్చదు అని చెప్పేది ఎవరు? ఇది మీ పాత మనస్సు, మీరు కాదు. అది అనుమతిస్తే, మార్చడానికి మార్గం లేదు. మనసుకు నచ్చుతుంది కాబట్టి పాత మార్గంలోనే ఉండమని చెబుతుంది. కాబట్టి దాని నుండి బయటకు రావాలి. ఒక్కోసారి ఇష్టాలకు, అయిష్టాలకు వ్యతిరేకంగా ఉండాల్సి వస్తుంది.*
*ఎవరైనా పాత విధానాన్ని మార్చుకున్నప్పుడల్లా బాధగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. ఇది కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం లాంటిది. మీకు పాతది బాగా తెలుసు, కాబట్టి ప్రతిదీ సులభంగా జరుగుతుంది. మీరు కొత్త నైపుణ్యం నేర్చుకున్నప్పుడు, అది కష్టంగా ఉంటుంది. ఇది కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడమే కాదు, కొత్త జీవిని నిర్మించడం. కష్టపడాల్సి వస్తుంది. కొత్తది పుట్టాలంటే పాతది చావాలి. కొత్తది రావాలంటే పాతది వెళ్లాలి. పాత వాటిని అంటి పెట్టుకుని ముందుకు వెళితే కొత్తవి వచ్చేందుకు ఖాళీ ఉండదు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 233 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 233. OLD MIND 🍀*
*🕉. If you listen to your likings, you are listening to your old mind. One has to do some things against one's likings, and then one grows. 🕉*
*Growth is not as smooth as people think. It is painful, .. and the greatest pain comes when you have to go against your likes and dislikes. But who is this that goes on saying, "This I like and this I don't like"? This is your old mind, not you. If it is allowed, there is no way to change. The mind will tell you to stay in the old rut, because it likes that. So one has to come out of it. Sometimes one has to be against likings and dislikings.*
*Whenever one changes an old style, it is painful, it hurts. It is like learning a new skill. You know the old very well, so everything goes easily. When you learn a new skill, it is difficult. And it is not only learning a new skill, it is learning a new being. It is going to be hard. The old has to die for the new to be born. The old has to go for the new to come. If you go on clinging to the old, there is no space for the new to come in.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 401 / Sri Lalitha Chaitanya Vijnanam - 401 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 87. వ్యాపినీ, వివిధాకారా, విద్యాఽవిద్యా స్వరూపిణీ ।
మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ ॥ 87 ॥ 🍀*
*🌻 401. 'వివిధాకారా’ 🌻*
*ప్రాకృత సర్గము, వైకృత సర్గము, కౌమార సర్గము అను వివిధ ఆకారములు కలది శ్రీమాత అని అర్థము. మహదహంకారము నుండి సాత్విక, రాజస, తామస అహంకారము లేర్పడుచున్నవి. వానినుండి తైజస, వైకారిక, భూతాది ప్రకృతి ప్రకాశించును. తైజసము నుండి మనస్సు, వైకారికము నుండి ఇంద్రియములు, భూతాది నుండి తన్మాత్రలు పుట్టినవి. ఈ మొత్తము ఆరు సర్గలు మహత్తు నుండి జరిగినవి. వీటిని ప్రాకృత సర్గము లందురు. వీనినుండి వృక్షములు, పశువులు, ఇతర భూతములు పుట్టినవి. వీటిని వైకృత సర్గము లందురు.*
*ప్రాకృతము, వైకృతాకృతము అయిన ఒక సృష్టిని కౌమార సర్గము అని చెప్పిరి. ఇందు మొదటి సర్గము మహత్తు, రెండవది అహంకారము, మూడవది భూతము. మహత్తు నుండి గుణములు, అహంకారము నుండి ద్రవ్యజ్ఞాన క్రియలు, భూత సర్గము నుండి ద్రవ్యశక్తి పుట్టినవి. వీని వివరములు భాగవతము రెండవ అధ్యాయమున బ్రహ్మదేవుడు నారదునకు తెలిపిన ఉపదేశమున చూడవచ్చును.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 401 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj*
*🌻 87. Vyapini vividhakara vidya vidya svarupini
Mahakameshanayana kumudahlada kaomudi ॥ 87 ॥ 🌻*
*🌻 401. Vividhākārā विविधाकारा 🌻*
*She has many forms. All these forms arise out of mūla-prakṛti (nāma 397). She takes different forms while performing different functions. As the creator, She is the Supreme Mother or Brahma rūpa (nāma 265). As the sustainer, She is Viṣṇu rūpinī (nāma 893). As the destroyer, She is Rudra rūpā (nāma 269). As a witness to the total dissolution, She is mahā pralaya sākṣiṇī (nāma 571).*
*This nāma encases all Her forms. As seen above, each of Her acts is represented by a form. She is also addressed as bahu-rūpā in nāma 824.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Comments