top of page
Writer's picturePrasad Bharadwaj

🍀 23 - JULY - 2022 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🍀

🌹 23 - JULY - 2022 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹


1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 23, జూలై 2022 శనివారం, స్థిర వాసరే Saturday 🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 236 / Bhagavad-Gita - 236 - 6- 03 ధ్యాన యోగము🌹

3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 635 / Vishnu Sahasranama Contemplation - 635 🌹

4) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 214 🌹

5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 314 / DAILY WISDOM - 314 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹23, July 2022 పంచాగము - Panchagam 🌹*

*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*

*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*

*ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*


*🍀. శ్రీ శని స్తోత్రం (దశరథ కృతం) - 6 🍀*


*11. త్వయాఽవలోకితాస్తేఽపి నాశం యాంతి సమూలతః |*

*ప్రసాదం కురు మే సౌరే ప్రణత్వాహిత్వమర్థితః*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : దివ్యజ్ఞానంలో, దివ్యకర్మలో పరవశించి నప్పుడే భక్తికి పూర్ణత్వసిద్ధి. భగవానునితో లీనమవడమనే దివ్యానుభవం పొందడానికే ఈ జగత్తు సృష్టించబడినది. అదే సృష్టి ప్రయోజనం. 🍀*


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, ఆషాడ మాసం

దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు

తిథి: కృష్ణ దశమి 11:29:21 వరకు

తదుపరి కృష్ణ ఏకాదశి

నక్షత్రం: కృత్తిక 19:04:54 వరకు

తదుపరి రోహిణి

యోగం: దండ 13:06:16 వరకు

తదుపరి వృధ్ధి

కరణం: విష్టి 11:29:21 వరకు

వర్జ్యం: 05:44:00 - 07:30:32

దుర్ముహూర్తం: 07:36:28 - 08:28:28

రాహు కాలం: 09:07:28 - 10:44:59

గుళిక కాలం: 05:52:28 - 07:29:58

యమ గండం: 13:59:59 - 15:37:30

అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:48

అమృత కాలం: 16:23:12 - 18:09:44

సూర్యోదయం: 05:52:28

సూర్యాస్తమయం: 18:52:31

చంద్రోదయం: 01:20:11

చంద్రాస్తమయం: 14:38:22

సూర్య సంచార రాశి: కర్కాటకం

చంద్ర సంచార రాశి: వృషభం

ధ్వజ యోగం - కార్య సిధ్ధి 19:04:54

వరకు తదుపరి శ్రీవత్స యోగం -

ధన లాభం , సర్వ సౌఖ్యం


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. శ్రీమద్భగవద్గీత - 236 / Bhagavad-Gita - 236 🌹*

*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*

*📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 03 🌴*


*03. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే |*

*యోగారూఢస్య తస్యైవ శమ: కారణముచ్యతే ||*


🌷. తాత్పర్యం :

*అష్టాంగ యోగ పద్ధతి యందు ఆరంభ స్థితిలో నున్న యోగికి కర్మము సాధనముగా చెప్పబడగా, యోగము నందు సిద్ధిని పొందిన వానికి భౌతిక కర్మల విరమణ సాధనముగా చెప్పబడినది.*


🌷. భాష్యము :

శ్రీకృష్ణభగవానునితో సంబధమును ఏర్పరచుకొను పద్ధతియే యోగమని పిలువబడును. అత్యున్నతమైన ఆధ్యాత్మికానుభవమును పొందుటకు అట్టి యోగమును ఒక నిచ్చెనగా భావింపవచ్చును. అది జీవుని అత్యంత హీనస్థితి నుండి ప్రారంభమై పూర్ణమైన ఆత్మానుభవస్థితి వరకు కొనసాగియుండును. వివిధములైన ఉన్నతుల ననుసరించి ఆ నిచ్చెన యొక్క వివిధభాగములు వివిధనామములతో పిలువబడును. అట్టి యోగమును నిచ్చెనను జ్ఞానయోగము, ధ్యానయోగము, భక్తియోగమను నామములు కలిగిన మూడుభాగములుగా విభజింపవచ్చును. ఆ యోగనిచ్చెన యొక్క ఆరంభము “యోగారురుక్షువు” స్థితియనియు, దాని చివరిమెట్టు “యోగారూఢము” అనియు పిలువబడును.


ఆరంభదశలో వివిధములైన నియమముల ద్వారా మరియు వివిధములైన ఆసనముల ద్వారా(దాదాపు శరీరవ్యాయామము వంటివి మాత్రమే) ధ్యానము నందు ప్రవేశించుటకు చేయు అష్టాంగయోగమందలి పద్ధతులు కామ్యకర్మలనియే భావింపబడును. అయినను ఇంద్రియములను నియమించుటకు అవసరమగు పూర్ణ మనోనిర్మలత్వమును సాధించుటకు అవన్నియును సహాయభూతములు కాగలవు. అట్టి ధ్యానమునందు పూర్ణత్వమును బడసినవాడు కలతపెట్టెడి సర్వమనోకర్మల నుండి దూరుడగును.


కృష్ణభక్తిరసభవితుడు శ్రీకృష్ణునే సదా తలచుచున్నందున తొలి నుండియే ధ్యానస్థితి యందు నెలకొనియుండును. అంతియేగాక నిరంతర కృష్ణసేవ యందు నిలిచియున్నందున అతడు సర్వవిధములైన కామ్యకర్మలను త్యజించినవానిగా భావింపబడును.

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 236 🌹*

*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*

*📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 6 - Dhyana Yoga - 03 🌴*


*03. ārurukṣor muner yogaṁ karma kāraṇam ucyate*

*yogārūḍhasya tasyaiva śamaḥ kāraṇam ucyate*


🌷 Translation :

*For one who is a neophyte in the eightfold yoga system, work is said to be the means; and for one who is already elevated in yoga, cessation of all material activities is said to be the means.*


🌹 Purport :

The process of linking oneself with the Supreme is called yoga. It may be compared to a ladder for attaining the topmost spiritual realization. This ladder begins from the lowest material condition of the living entity and rises up to perfect self-realization in pure spiritual life. According to various elevations, different parts of the ladder are known by different names. But all in all, the complete ladder is called yoga and may be divided into three parts, namely jñāna-yoga, dhyāna-yoga and bhakti-yoga. The beginning of the ladder is called the yogārurukṣu stage, and the highest rung is called yogārūḍha.


Concerning the eightfold yoga system, attempts in the beginning to enter into meditation through regulative principles of life and practice of different sitting postures (which are more or less bodily exercises) are considered fruitive material activities. All such activities lead to achieving perfect mental equilibrium to control the senses. When one is accomplished in the practice of meditation, he ceases all disturbing mental activities.


A Kṛṣṇa conscious person, however, is situated from the beginning on the platform of meditation because he always thinks of Kṛṣṇa. And, being constantly engaged in the service of Kṛṣṇa, he is considered to have ceased all material activities.

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 635 / Vishnu Sahasranama Contemplation - 635🌹*


*🌻635. కుమ్భః, कुम्भः, Kumbhaḥ🌻*


*ఓం కుమ్భాయ నమః | ॐ कुम्भाय नमः | OM Kumbhāya namaḥ*


*కుమ్భ సమేఽస్మిన్ సమస్తం ప్రతిష్ఠిత మితేశ్వరః ।*

*కుమ్భ ఇత్యుచ్యతే సర్భిర్వేదవిద్యా విశారదైః ॥*


*కడవ వంటి వాడు. కుంభము నందు నీరు వలె సర్వమును ఈతని యందు ప్రతిష్ఠితముగా అనగా నిలుకడ నందినదిగా నున్నది.*


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 635🌹*


*🌻635. Kumbhaḥ🌻*


*OM Kumbhāya namaḥ*


कुम्भ समेऽस्मिन् समस्तं प्रतिष्ठित मितेश्वरः ।

कुम्भ इत्युच्यते सर्भिर्वेदविद्या विशारदैः ॥


*Kumbha same’smin samastaṃ pratiṣṭhita miteśvaraḥ,*

*Kumbha ityucyate sarbhirvedavidyā viśāradaiḥ.*


*The One who is like a pot. Just like water that stays put in a jar, everything rests in Him and hence He is called Kumbhaḥ.*


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka


अर्चिष्मान्अर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः ।अनिरुद्धोऽप्रतिरथः प्रद्युम्नोऽमितविक्रमः ॥ ६८ ॥

అర్చిష్మాన్అర్చితః కుమ్భో విశుద్ధాత్మా విశోధనః ।అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ॥ 68 ॥

Arciṣmānarcitaḥ kumbho viśuddhātmā viśodhanaḥ,Aniruddho’pratirathaḥ pradyumno’mitavikramaḥ ॥ 68 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹





*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 214 🌹*

*✍️. సౌభాగ్య*

*📚. ప్రసాద్ భరద్వాజ*


*🍀. శూన్యంగా వుండు. నిశ్చలంగా ఉండు. అప్పుడు సమస్తం నీలో ప్రతిఫలిస్తుంది. ఆ అనుభవమొకటే మార్మికమైన అనుభవం. అది నీకు దైవానికి సంబంధించిన నిశ్చితత్వాన్ని కలిగిస్తుంది. అది విశ్వాసం కంటే భిన్నమైంది. 🍀*


*గుర్తుంచుకోవాల్నిన విషయమేమిటంటే జ్ఞానం అన్నది విషయ సేకరణలో లేదు. ఇతర్ల నించీ నేర్చుకోవడంలో లేదు. దానికి భిన్నంగా నేర్చుకోక పోవండలో వుంది. పసిపిల్ల వాడుగా తిరిగి మారినపుడే వ్యక్తి తెలిసిన వాడవుతాడు. చైతన్యమనే అద్దం అప్పుడే దుమ్ము ధూళి అంటకుండా వుంటుంది. అప్పుడు సమస్త ఆకాశం, నక్షత్రాలు వాటి వైభవాన్ని అందులో స్పష్టంగా ప్రకటిస్తాయి. ఆ అనుభవమే దేవుడు.*


*శూన్యంగా వుండు. నిశ్చలంగా ఉండు. అప్పుడు సమస్తం నీలో ప్రతిఫలిస్తుంది. ఆ అనుభవమొకటే మత సంబంధమైన అనుభవం. అదొకటే మార్మికమైన అనుభవం. అది నీకు దైవానికి సంబంధించిన నిశ్చితత్వాన్ని కలిగిస్తుంది. అది విశ్వాసం కంటే భిన్నమైంది. అది నీకు విస్పష్టతనిస్తుంది. అది ఎవరో బుద్ధుడో మరెవరో చెప్పింది కాదు. అది నీ అనుభవపు లోతుల్లోనిది. నీ అస్తిత్వాంలో భాగం. అప్పుడే అసలయిన లక్ష్యం నెరవేరుతుంది. సంపూర్ణత సమకూరుతుంది.*


*సశేషం ...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹





*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 314 / DAILY WISDOM - 314 🌹*

*🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀*

*📝 .స్వామి కృష్ణానంద 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌻 9. సంపూర్ణుడు నిన్ను మాత్రమే కోరుకుంటాడు 🌻*


*పరమాత్మ నిన్ను మాత్రమే కోరుకుంటాడు. మీ నుండి ఇంకేమీ కోరుకోడు, మిమ్మల్ని మాత్రమే కోరుకుంటాడు. మీరు సంపూర్ణతకు ఏమీ ఇవ్వలేరు, ఎందుకంటే ఏదీ మీకు చెందినది కాదు. మీరు ప్రపంచంలో ఒంటరిగా ఉన్నారు. ఆస్తి అనేది ఏమీ లేదు; అది ఒక భ్రమ. ఎవరూ దేనినీ స్వంతం చేసుకోలేరు. ప్రతి వస్తువు స్వతంత్రమైనది, కాబట్టి మీరు దేవునికి ఏమీ ఇవ్వలేరు; మీరు మిమ్మల్ని మాత్రమే ఇవ్వగలరు. అదే చిట్టచివరి త్యాగం. మిమ్మల్ని మీరు భగవంతునికి సమర్పించు కోవడానికి, ఇతర మార్గాలు కూడా ఉన్నాయి, కానీ అవన్నీ చివరకు ధ్యానానికి మాత్రమే దారితీస్తాయి. ధ్యానమే అంతిమ మార్గం.*


*ప్రస్తుతం సంపూర్ణత ఎక్కడ ఉంది? అది 'ప్రతిచోటా' ఉన్నట్లయితే, సంపూర్ణం వెలుపల ఏదైనా ఉందా లేదా సంపూర్ణమైనది మాత్రమే ఉందా? ఇక్కడ ఉన్న వాళ్లంతా ఎక్కడ ఉన్నారు? వారు సంపూర్ణత లోపల ఉన్నారా? వారు సంపూర్ణతలో ఉన్నట్లయితే, ప్రపంచంలోని అన్ని విషయాల పట్ల మీ వైఖరి ఏమిటి? మీరు ఒక వస్తువును చూసినప్పుడు, ఆ సమయంలో మీకు ఏమి అనిపిస్తుంది? మీరు అందరినీ గౌరవించవచ్చు. కానీ ‘అందరూ’ లేరు.ఇక్కడంతా కేవలం పరమాత్మే ఉందని చెప్పారు కదా! మీరు 'అందరూ' అని ఎందుకు అంటున్నారు? అందరూ పరమాత్మలోనే ఉన్నారు. ఈ ఆలోచన ఎప్పుడూ కొనసాగగలిగితే, అది పరమాత్మపై అత్యున్నత ధ్యానం అవుతుంది. కానీ, కొన్నిసార్లు మీరు సంపూర్ణమైనది కాకుండా చాలా విషయాలు ఉన్నాయని భావించడం ప్రారంభిస్తే, అప్పుడు ధ్యానం పూర్తి కాదు.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 DAILY WISDOM - 314 🌹*

*🍀 📖 from Your Questions Answered 🍀*

*📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj


*🌻 9. The Absolute Wants You Only 🌻*


*The Absolute wants you. It does not want anything else from you, it wants you only. You cannot give anything to the Absolute, because nothing actually belongs to you. You are alone in the world. There is no such thing as property; it is an illusion. Nobody can own anything. Each thing is independent, so you cannot give anything to God; you can give only yourself. That is the final thing, the sacrifice. For giving yourself to God, there are other ways also, but they all finally lead to meditation only. The final thing is meditation.*


*Where is the Absolute at present? If it is ‘everywhere', is there anything outside the Absolute, or does only the Absolute exist? What about all these people sitting here? Are they inside the Absolute? If they are inside the Absolute, what is your attitude towards all things in the world? When you see a thing, what do you feel at that time? You may respect everyone. But there is no ‘everyone'. You said there is only one Absolute, so why do you say ‘everyone'? Everyone has gone into the Absolute. If this thought can continue always, that is the highest meditation on the Absolute. But, sometimes if you start feeling that there are many things other than the Absolute, then the meditation will not be complete.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Comments


Post: Blog2 Post
bottom of page