top of page
Writer's picturePrasad Bharadwaj

23 - JUNE - 2022 THURSDAY MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 221, జూన్ 2022 గురువారం, బృహస్పతి వాసరే Thursday 🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 221 / Bhagavad-Gita - 221 - 5- 17 కర్మ యోగము🌹

3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 620 / Vishnu Sahasranama Contemplation - 620🌹

4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 299 / DAILY WISDOM - 299 🌹

5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 199 🌹

6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 138 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹 23, June 2022 పంచాగము - Panchagam 🌹*

*శుభ గురువారం, Thursday, బృహస్పతి వాసరే*

*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*

*ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*


*🍀. దక్షిణామూర్తి స్తోత్రము - 10 🍀*


*సర్వాత్మత్వమితి స్ఫుటీకృత మిదం యస్మాదముష్మిన్ స్తవే*

*తేనాస్య శ్రవణాత్తదర్థమన నాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్*

*సర్వాత్మత్వమహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః*

*సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్యమవ్యాహతమ్*


*తాత్పర్యము: ఈ స్తోత్రము ఆత్మ యొక్క సర్వ వ్యాపకా తత్త్వమును తెలుపుచున్నది. దీని మననము, పఠనం, ధ్యానము వలన శిష్యుడు ఆత్మ సంయోగం చెంది, ఈ విశ్వము, ఆత్మ యొక్క ఏకత్వమును తెలుసుకొని ఎనిమిది పరిణామముల సారమగును.*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : జీవితములో జరిగే ప్రతి విషయంలో పరమార్థం ఉంది, కొన్ని సార్లు కనిపిస్తుంది, కొన్ని సార్లు లోతుగా వెతకాలి, కొన్ని సార్లు అర్థం చేసుకొనేందుకు కొంత సమయం పడుతుంది. - మాస్టర్‌ ఆర్‌.కె. 🍀*


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, జేష్ఠ మాసం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

తిథి: కృష్ణ దశమి 21:43:30 వరకు

తదుపరి కృష్ణ ఏకాదశి

నక్షత్రం: రేవతి 06:15:39 వరకు

తదుపరి అశ్విని

యోగం: అతిగంధ్ 28:51:12 వరకు

తదుపరి సుకర్మ

కరణం: వణిజ 09:11:08 వరకు

వర్జ్యం: -

దుర్ముహూర్తం: 10:06:32 - 10:59:13

మరియు 15:22:37 - 16:15:18

రాహు కాలం: 13:57:01 - 15:35:47

గుళిక కాలం: 09:00:41 - 10:39:27

యమ గండం: 05:43:08 - 07:21:54

అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:44

అమృత కాలం: -

సూర్యోదయం: 05:43:08

సూర్యాస్తమయం: 18:53:20

చంద్రోదయం: 01:29:05

చంద్రాస్తమయం: 14:09:01

సూర్య సంచార రాశి: జెమిని

చంద్ర సంచార రాశి: మీనం

మిత్ర యోగం - మిత్ర లాభం 06:15:39

వరకు తదుపరి మానస యోగం - కార్య లాభం


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹

#పంచాగముPanchangam

Join and Share


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. శ్రీమద్భగవద్గీత - 221 / Bhagavad-Gita - 221 🌹*

*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*

*📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 17 🌴*


*17. తద్బుద్ధయస్తదాత్మా నస్తన్నిష్టా స్తత్పరాయణా: |*

*గచ్ఛన్త్యపునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషా: ||*


🌷. తాత్పర్యం :

*బుద్ధి, మనస్సు, నిష్ఠ, ఆశ్రయములన్నియును భగవానుని యందే లగ్నమైనపుడు మనుజుడు సంపూర్ణ జ్ఞానముచే కల్మషరహితుడై నేరుగా ముక్తిమార్గమున ప్రయాణించును.*


🌷. భాష్యము :

దివ్యమగు పరమసత్యమే శ్రీకృష్ణభగవానుడు. శ్రీకృష్ణుడు పూర్ణపురుషోత్తముడగు భగవానుని ప్రకటించుటయందే గీతాజ్ఞానమంతయు కేంద్రీకృతమైనది. వేదవాజ్మయమంతయు ఈ విషయమునే తెలుపుచున్నది. పరతత్త్వమనగా పరమసత్యత్వమని భావము. బ్రహ్మము, పరమాత్మ, భగవానుడనెడి తత్త్వములుగా పరతత్త్వము నెరిగినవారే దానిని అవగాహన చేసికొనగలరు. ఆ పరతత్త్వము యొక్క చరమానుభవమే శ్రీకృష్ణభగవానుడు. అతనికి మించి వేరొక్కటి లేదు. కనుకనే ఆ భగవానుడు “మత్త: పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ” అని భోధించెను. నిరాకారబ్రహ్మము సైతము శ్రీకృష్ణుని పైననే ఆధారపడియున్నదని తెలుపబడినది (బ్రాహ్మణోహి ప్రతిష్టాహమ్). కనుకనే అన్నివిధముల శ్రీకృష్ణుడే పరమసత్యమై యున్నాడు.


తత్కారణముగా శ్రీకృష్ణుని యందే మనస్సు, బుద్ధి, నిష్ఠ, ఆశ్రయములను సదా కలిగి యున్నారు (కృష్ణభక్తిరస భావితులు) నిస్సందేహముగా కల్మషరహితులును మరియు పరతత్త్వ విషయమున సంపూర్ణజ్ఞానమును కలిగినవారు అగుదురు. కృష్ణభక్తిరసభావితుడు శ్రీకృష్ణుని యందు ద్వైతము కలదని (ఏకకాలమున ఏకత్వము మరియు వ్యక్తిత్వము) సంపూర్ణముగ అవగతము చేసికొనగలుగును. అట్టి జ్ఞానమును కలిగిన మనుజుడు ముక్తిమార్గమున పురోభివృద్ధిని పొందును.

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 221 🌹*

*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*

*📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 5 - Karma Yoga - 17 🌴*


*17. tad-buddhayas tad-ātmānas tan-niṣṭhās tat-parāyaṇāḥ*

*gacchanty apunar-āvṛttiṁ jñāna-nirdhūta-kalmaṣāḥ*


🌷 Translation :

*When one’s intelligence, mind, faith and refuge are all fixed in the Supreme, then one becomes fully cleansed of misgivings through complete knowledge and thus proceeds straight on the path of liberation.*


🌹 Purport :

The Supreme Transcendental Truth is Lord Kṛṣṇa. The whole Bhagavad-gītā centers around the declaration that Kṛṣṇa is the Supreme Personality of Godhead. That is the version of all Vedic literature. Para-tattva means the Supreme Reality, who is understood by the knowers of the Supreme as Brahman, Paramātmā and Bhagavān. Bhagavān, or the Supreme Personality of Godhead, is the last word in the Absolute. There is nothing more than that. The Lord says, mattaḥ parataraṁ nānyat kiñcid asti dhanañ-jaya. Impersonal Brahman is also supported by Kṛṣṇa: brahmaṇo hi pratiṣṭhāham.


Therefore in all ways Kṛṣṇa is the Supreme Reality. One whose mind, intelligence, faith and refuge are always in Kṛṣṇa, or, in other words, one who is fully in Kṛṣṇa consciousness, is undoubtedly washed clean of all misgivings and is in perfect knowledge in everything concerning transcendence. A Kṛṣṇa conscious person can thoroughly understand that there is duality (simultaneous identity and individuality) in Kṛṣṇa, and, equipped with such transcendental knowledge, one can make steady progress on the path of liberation.

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 620 / Vishnu Sahasranama Contemplation - 620🌹*

*📚. ప్రసాద్ భరద్వాజ*


*🌻 620. విజితాఽఽత్మా, विजिताऽऽत्मा, Vijitā''tmā🌻*


*ఓం విజితాత్మనే నమః | ॐ विजितात्मने नमः | OM Vijitātmane namaḥ*


*విజిత ఆత్మాహియేన విజితాత్మా స ఈర్యతే*


*ఎవనిచే ఆత్మ (మనస్సు) జయించ బడినదియో ఆతండు విజితాత్మ.*


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 620 🌹*

*📚. Prasad Bharadwaj*


*🌻 620. Vijitā''tmā🌻*


*OM Vijitātmane namaḥ*


*विजित आत्माहियेन विजितात्मा स ईर्यते / Vijita ātmāhiyena vijitātmā sa īryate*


*He by whom the ātma i.e., manas has been conquered is Vijitātmā.*


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

स्वक्षस्स्वङ्गश्शतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः ।विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्छिन्नसंशयः ॥ ६६ ॥


స్వక్షస్స్వఙ్గశ్శతానన్దో నన్దిర్జ్యోతిర్గణేశ్వరః ।విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్నసంశయః ॥ 66 ॥


Svakṣassvaṅgaśśatānando nandirjyotirgaṇeśvaraḥ,Vijitātmā vidheyātmā satkīrtiśchinnasaṃśayaḥ ॥ 66 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹

#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 299 / DAILY WISDOM - 299 🌹*

*🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀*

*📝 .స్వామి కృష్ణానంద*

*📚. ప్రసాద్ భరద్వాజ*


*🌻 25. మన వ్యక్తిత్వం అసంబద్ధం 🌻*


*వ్యవహారాల యొక్క నిజమైన స్థితిని గ్రహించలేక పోవడం, విషయాల మధ్య సరైన సంబంధం గురించి అవగాహన లేకపోవడం, తప్పుడు విలువలను సృష్టిస్తుంది. ఈ విలువలు కేవలం నైరూప్యమైన ఊహ మాత్రమే కాదు, ఇది లోకాలలో ఉనికి కలిగిన ఒక ఘనమైన పదార్థం . అవిద్య అనేది కేవలం జ్ఞానం లేకపోవడమే కాదు-ఈ సూత్రాన్ని వివరించే వారు చాలా హాస్యభరితంగా మనకు చెప్పినట్లుగా, సంస్కృతంలో 'అమిత్ర' అనే పదానికి వ్యాకరణపరంగా 'స్నేహితుడు కానివాడు' లేదా 'మిత్రుడు కానివాడు' అని అర్థం, అయినప్పటికీ వాస్తవానికి దీనికి శత్రువు అని అర్థం.*


*స్నేహితుడు కాని వాడు ఉనికిలో లేని వ్యక్తి కాదు; అతను ఉనికిలో ఉన్న శత్రువు. అలాగే, అమిత్ర అంటే మిత్రుడు లేకపోవడం కాదు, శత్రువు ఉన్నాడని అర్థం. అలాగే, అవిద్య అంటే కేవలం జ్ఞానం లేకపోవడమే కాదు, దాని స్వంత సానుకూలతను కలిగి ఉన్న భయంకరమైన శత్రువు మన ముందు ఉండటం. ఇది ఒక విచిత్రమైన రీతిలో ఉండి, అవగాహన యొక్క పట్టును తప్పించు కుంటుంది. కాబట్టి ప్రతికూలత కలిగిన సానుకూలత సృష్టించ బడుతుందని మనం చెప్పవచ్చు. దానిని వ్యక్తిత్వం అని పిలుస్తారు, ఇది వాస్తవికతపై ఆధారపడినప్పటికీ వాస్తవికంగా దానిలో ఏమీ లేదు. మన వ్యక్తిత్వం ఆవిరి వలె నైరూప్యమైనది. దానిలో ఘన పదార్థం లేదు. ఇది ఉల్లిపాయ లాగా ఒలిచి వేయబడుతుంది మరియు చివరికి దానిలో మనకు ఏమీ కనిపించదు.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 DAILY WISDOM - 299 🌹*

*🍀 📖 from The Study and Practice of Yoga 🍀*

*📝 Swami Krishnananda*

*📚. Prasad Bharadwaj*


*🌻 25. The Individuality of Ours is Insubstantial 🌻*


*The inability to perceive the true state of affairs, the absence of an understanding of the correct relationship among things, creates a false sense of values. This sense of values is not merely an abstract imagination, but is a solid metaphysical entity that crops up. Avidya is not merely absence of knowledge—just as, as the expounders of this sutra tell us very humorously, the word ‘amitra'in Sanskrit grammatically means ‘no friend' or ‘non-friend', though actually it means an enemy.*


*A non-friend is not a non-existent person; he is a very existent enemy. Likewise, even as amitra does not mean the absence of a friend but the presence of an enemy, avidya does not merely mean the absence of knowledge but the presence of a terrific foe in front of us, which has a positivity of its own. It exists in a peculiar way which eludes the grasp of understanding. So a negative type of positivity is created, we may say, called the individuality, which asserts itself as a reality even though it is based on a non-substantiality. The individuality of ours is insubstantial, like vapour. It has no concrete element within it. It can be peeled off like an onion, and we will find nothing inside it.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹

#నిత్యప్రజ్ఞాసందేశములు


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 199 🌹*

*✍️. సౌభాగ్య*

*📚. ప్రసాద్ భరద్వాజ*


*🍀. వ్యక్తి తనకు ఏమీ తెలియదన్న సగంతి తెలుసుకోవాలి. సంపాందించిన జ్ఞానాన్ని పక్కన పెట్టాలి. నీకు తెలుసుననే అభిప్రాయం నీకు ఏర్పడితే అప్పుడు అన్వేషణ ఆగిపోతుంది. ఇదే జ్ఞానంలో వున్న గొప్ప ప్రమాదం. 🍀*


*జ్ఞానంలో వున్న గొప్ప ప్రమాదం ఏమిటంటే అది నీకు దురభిప్రాయాల్ని ఏర్పరుస్తుంది. నీకు తెలుసుననే అభిప్రాయం నీకు ఏర్పడితే అప్పుడు అన్వేషణ ఆగిపోతుంది. వ్యక్తి తనకు ఏమీ తెలియదన్న సగంతి తెలుసుకోవాలి. సంపాందించిన జ్ఞానాన్ని పక్కన పెట్టాలి. అన్ని మతాల నించీ సంపాందించిన జ్ఞానాన్ని పక్కన పెట్టాలి.*


*అప్పుడు అన్వేషణ ఆరంభమవుతుంది. అప్పుడు వ్యక్తి నిజమైన అన్వేషకుడవుతాడు. తెలియనితనం వున్నపుడు ఒకరోజు గొప్ప దీవెన అందుతుంది. సత్యం ఆవిష్కారం అవుతుంది. దాన్నే జ్ఞానోదయమంటారు. నిర్వాణమంటారు. ప్రాచ్యంలో దాన్ని బుద్ధుని లేదా కృష్ణ చైతన్యమంటారు.*


*సశేషం ...*

🌹 🌹 🌹 🌹 🌹

#ఓషోరోజువారీధ్యానములు

#ఓషోబోధనలు #OshoDiscourse

#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 138 🌹*

*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*


*🌻 104. కలుపు మొక్కలు - 2🌻*


*సామాన్య మానవుల విషయమున కుర్చీ నుండి పడక వరకు సొంతము చేసుకొను బుద్ధి మిక్కుటముగ నుండును. అట్టి స్థితిలో క్రొత్తవారు చేరునపుడు ఆదరించి తాము చేయుచున్న పనిలో ప్రవేశము కల్పించి తమలో కలుపుకొనుటకు చాల పెద్ద మనస్సు అవసరము. ఇట్టి పెద్ద మనస్సున్న వారే బృందములో పెద్దవారు. లేనివారు బృందము యొక్క ఆయుర్దాయమునకు తెలియక గండి కొడుదురు.*


*నూతనముగ వచ్చిన వారిలో గల సామర్థ్యమును, నైపుణ్యమును గుర్తించి తగు రీతిని వారికిని కార్యక్రమముల యందు బాధ్యత ఏర్పరచుట సహకారమునకు సంకేతము. సహకారము లేని సంగములు, బృంద జీవనములు, నామ మాత్రములై సదాశయమను విత్తనమునకు జన్మించిన కలుపు మొక్కలుగ భాసించును. సహకార ఉద్యమమునకు ఇవి వెక్కిరింతై గోచరించును.*


*సశేషం.....*

🌹 🌹 🌹 🌹 🌹

#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #ChaitanyaVijnanam #PrasadBhardwaj


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

コメント


Post: Blog2 Post
bottom of page