🌹🍀 23 - OCTOBER - 2022 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 23 - OCTOBER - 2022 SUNDAY ఆదివారం, భాను వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
*🌻. ధన త్రయోదశి, ధన్వంతరి జయంతి శుభాకాంక్షలు మిత్రులందరికి, Happy Dhan Teras and Dhanvanthari Jayanthi to All. 🌻*
2) 🌹 కపిల గీత - 82 / Kapila Gita - 82 🌹 సృష్టి తత్వము - 38
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 121 / Agni Maha Purana - 121 🌹 🌻. దేవాలయ నిర్మాణ ఫలము - 4🌻
4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 256 / Osho Daily Meditations - 256 🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 410 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 410 -1 🌹 'శివపరా'- 1
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹23, October అక్టోబరు 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*
*🌻. ధన త్రయోదశి, ధన్వంతరి జయంతి శుభాకాంక్షలు మిత్రులందరికి, Happy Dhan Teras and Dhanvanthari Jayanthi to All. 🌻*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : ధన త్రయోదశి, శని త్రయోదశి, ధన్వంతరి జయంతి, Dhan Teras, Shani Trayodashi, Dhanvanthari Jayanthi 🌻*
*🍀. ఆదిత్య స్తోత్రం - 07 🍀*
*7. యచ్ఛక్త్యాఽధిష్ఠితానాం తపనహిమ జలోత్సర్జనాదిర్జగత్యామ్*
*ఆదిత్యానామశేషః ప్రభవతి నియతః స్వస్వమాసాధికారః |*
*యత్ ప్రాధాన్యం వ్యనక్తి స్వయమపి భగవాన్ ద్వాదశస్తేషు భూత్వా*
*తం త్రైలోక్యస్య మూలం ప్రణమత పరమం దైవతం సప్తసప్తిమ్*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : కవులు మానవ జీవితంలో సంభవించే బాహ్యకష్టాలకూ, మరణానికి విశేష ప్రాధాన్యమిచ్చి వ్రాస్తూ వుంటారు. కాని, ఆత్మ వైఫల్యాలు మాత్రమే నిక్కమైన విషాదాంత నాటకాలు. దివ్యత్వం దెసకు విజయవంతంగా మానవుని ఆధిరోహణ మొక్కటే యథార్థమైన మహా కావ్యం. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, దక్షిణాయణం,
శరద్ ఋతువు, అశ్వీయుజ మాసం
తిథి: కృష్ణ త్రయోదశి 18:04:01 వరకు
తదుపరి కృష్ణ చతుర్దశి
నక్షత్రం: ఉత్తర ఫల్గుణి 14:35:17
వరకు తదుపరి హస్త
యోగం: ఇంద్ర 16:07:21 వరకు
తదుపరి వైధృతి
కరణం: వణిజ 17:59:01 వరకు
వర్జ్యం: 23:01:27 - 24:37:55
దుర్ముహూర్తం: 16:16:16 - 17:02:49
రాహు కాలం: 16:22:05 - 17:49:21
గుళిక కాలం: 14:54:49 - 16:22:05
యమ గండం: 12:00:17 - 13:27:33
అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:23
అమృత కాలం: 07:10:06 - 08:48:58
సూర్యోదయం: 06:11:12
సూర్యాస్తమయం: 17:49:21
చంద్రోదయం: 04:06:30
చంద్రాస్తమయం: 16:33:47
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: కన్య
మిత్ర యోగం - మిత్ర లాభం 14:35:17
వరకు తదుపరి మానస యోగం -
కార్య లాభం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌻. ధన త్రయోదశి, ధన్వంతరి జయంతి శుభాకాంక్షలు మిత్రులందరికి, Happy Dhan Teras and Dhanvanthari Jayanthi to All. 🌻*
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 82 / Kapila Gita - 82🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 38 🌴*
*38. వాయోశ్చ స్పర్శతన్మాత్రాద్రూపం దైవేరితాదభూత్|*
*సముత్థితం తతస్తేజశ్చక్షూరూపోపలంభనమ్॥*
*అనంతరము దైవప్రేరణచే స్పర్శతన్మాత్రగా గల వాయువు వికారము చెందెను. తత్ఫలితముగా (వాయువు నుండి) రూపతన్మాత్ర ఉత్పన్నమాయెను. దానినుండి తేజస్సు- అగ్నిమహాభూతము పుట్టినది. అట్లే రూపములను ప్రాప్తింప జేయు నేత్రేంద్రియము ఉద్భవించినది.*
*స్పర్శ తన్మాత్ర నుండి ఆవిర్భవించిన వాయువు నుండి ఆవిర్భవించినది రూప తన్మాత్రం. దాని నుండి అగ్ని పుడుతుంది. చక్షురింద్రియం ఈ రూపాన్ని గ్రహిస్తుంది. చక్షురింద్రియం సూర్యాధిష్టం. సుర్ర్యభగవానునిలో ఉన్నవాడు, అంతర్యామిగా ఉన్నవాడు, చక్షురింద్రియములో ఉన్నవాడూ ఒకడే. అందుకే భగవానుని ఆరాధించడానికి కనులు మూసుకున్నా తెరుచుకుని ఉన్నా కనపడతాడు భగవానుడు.*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 82 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*
*🌴 2. Fundamental Principles of Material Nature - 38 🌴*
*38. vāyoś ca sparśa-tanmātrād rūpaṁ daiveritād abhūt*
*samutthitaṁ tatas tejaś cakṣū rūpopalambhanam*
*By interactions of the air and the sensations of touch, one receives different forms according to destiny. By evolution of such forms, there is fire, and the eye sees different forms in color.*
*Because of destiny, the touch sensation, the interactions of air, and the situation of the mind, which is produced of the ethereal element, one receives a body according to his previous activities. Needless to say, a living entity transmigrates from one form to another. His form changes according to destiny and by the arrangement of a superior authority which controls the interaction of air and the mental situation. Form is the combination of different types of sense perception. Predestined activities are the plans of the mental situation and the interaction of air.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 121 / Agni Maha Purana - 121 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 38*
*🌻. దేవాలయ నిర్మాణ ఫలము - 4🌻*
భక్తిమంతు డగు పురుషుడు దేవాలయమును నిర్మించి, దానిలో దేవతా ప్రతిష్ఠ చేసినా డనగా, అతడు చరాచరరూపములగు ముల్లోకములగు ముల్లోకములను భవనమునిర్మించినాడని యర్థము భూతవర్తమాన భవిష్యత్కాలములకు చెందిన, స్థూల-సూక్ష్మరూపము.
తద్భిన్నము అయిన బ్రహ్మాదిస్తంబాంత మగు ప్రపంచ మంతయు మహావిష్ణువునుండియే జనించినది. దేవాధిదేవుడును, మహాత్ముడును అగు అట్టి విష్ణువునకు ఆలయమును నిర్మించినవాడు మరల ఈ సంసారమునందు జనింపడు. శివ-బ్రహ్మ-సూర్య-గణశ-దుర్గా-లక్ష్మాదిదేవతలకు ఆలయమును నిర్మింపచేసి వారికి ఆలయ నిర్మాణము చేయించిన వారి కంటె గూడ అధికఫలము లబించును.
దేవతాప్రతిమా స్థాపనరూప మగు యజ్ఞమువలన లభించు ఫలము అనంతము, మట్టితో చేసిన ప్రతిమకంటె కఱ్ఱతో చేసిన ప్రతిమ ఉత్తమ మైనది. దానికంటె ఇటుకలతో నిర్మించినది, దానికంటె ఱాయితో నిర్మించినది, దానికంటె సువర్ణాదిలోహముంతో నిర్మించినది శ్రేష్ఠమైనది, దేవాలయ ప్రారంభము చేసినంతమాత్రముననే ఏడు జన్మల పాపము నశించును.
నిర్మించువాడు స్వర్గలోకప్రాప్తికి అధికారి యగును. అతడు నరకమునకు వెళ్ళడు. అంతే కాదు-ఆతడు తన వంశములోని నూరు తరములవారిని విష్ణులోకమునకు పంపును యమధర్మరాజు తన దూతలతో, దేవాలయములు నిర్మించువారిని గూర్చి ఇట్లు చెప్పెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 121 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 38*
*🌻 Benefits of constructing temples - 4 🌻*
26-31. One may give to the foremost brahmins and also do (such acts) which would glorify him. More than the charities and more than the acts which would glorify him, one has to build the temples of Viṣṇu and other gods. The temple of Hari being set up by devoted great men, the three worlds, the movable and immovable things and the entire objects get established.
All the things beginning with Brahmā to the Pillar, that has already born, that is being born, that is to be born, the gross, the minute and the other things are born of Viṣṇu. Having set up an abode for that lord of lords, the omnipresent, the great Viṣṇu, one is not born again in this world. By building temples for the celestials, Śiva, Brahmā, Sun, Vighneśa (lord of impediments), Caṇḍī (Pārvatī), Lakṣmī and others (a man) reaps the same benefit as he would get for building an abode for Viṣṇu. Greater merit (is acquired) by installing images of gods.
32. In the rites (relating to) installation of an idol there is no limit for the fruits (gained). An image made of wood gives greater merit than that made of clay. One made of bricks yields greater merit than that made of wood.
33. One made of stones gives (greater merit) than that made -of bricks. (Images made) of gold and other metals yield more benefits. Sins committed in seven births get destroyed even at the very commencement of installation.
34. One who builds a temple goes to heaven and never goes to hell. Having elevated a hundred of his ancestors he conveys them to the world of Viṣṇu.
35. Yama (god of death) said to his emissaries:
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 256 / Osho Daily Meditations - 256 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀 256. నిరాశ 🍀*
*🕉. సాంకేతికత మీ కోసం అందించిన అన్ని పరికరాలను మీరు కలిగి ఉన్నారు, కాబట్టి ఈ రోజు మీ వద్ద లేనిది రేపు మీకు ఏమి ఇవ్వగలదు? 🕉*
*భవిష్యత్తు విఫలం చెందినప్పడు గొప్ప నిరాశ, నిస్సహాయత తలెత్తుతుంది. ఇప్పటి వరకు ప్రపంచం ఎంతో ఆశతో జీవించింది, కానీ అకస్మాత్తుగా ఆశలు మాయమవుతున్నాయి మరియు నిరాశ స్థిరపడుతోంది. ఇది చాలా ముఖ్యమైనది. సాంకేతికత మీ కోసం అందించిన అన్ని పరికరాలను మీరు కలిగి ఉన్నారు, కాబట్టి ఈ రోజు మీ వద్ద లేనిది రేపు మీకు ఏమి ఇవ్వగలదు?మానవ స్పృహలో ఈ సంక్షోభం చాలా ముఖ్యమైనది. ఇప్పుడున్న పరిస్థితులలో మానవత భూమి నుండి కనుమరుగై పోవాలి లేదా అది పూర్తిగా కొత్త జీవికి, కొత్తగా జన్మనివ్వాలి. నా పని మానవ చైతన్యానికి కొత్త జన్మనిస్తుంది.*
*ఈ ప్రపంచం మనకు విఫలమైనదిగా నిరూపించ బడుతున్నది. ఇప్పుడు ఈ భూమిపై ఆశపడాల్సిన పనిలేదు. ఇప్పుడు వాంఛ అధికమవుతోంది. ఇప్పుడు కనిపించే దానిలో వెతకడం పూర్తయింది. ఇక మనం అదృశ్యంలో శోధించవచ్చు. ఇప్పుడు సమయం అర్థం లేనిది; మనం తాత్కాలికం కాని స్థితికి వెళ్లాలి. ఇప్పుడు సాధారణ ప్రాపంచిక జీవితానికి ఆకర్షణ లేదు; అది ఆనందాన్ని కోల్పోయింది. మనం అన్ని కోరికలను, సాధ్యమైన కోరికలను అన్నింటినీ నెరవేర్చాము కానీ అవి మనల్ని సంతృప్తి పరచలేదు. కనుక ఇప్పుడు నిజమైన అసంతృప్తి సాధ్యమవుతోంది మరియు అర్ధం చేసుకుంటే నిజంగా అసంతృప్తి చెందడం గొప్ప ఆశీర్వాదం.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 256 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 256. HOPELESSNESS 🍀*
*🕉. You have all the gadgets that technology has provided for you, So what can tomorrow give to you that you don't have today? 🕉*
*The future flops, and with the future flopping great hopelessness arises. The world up to now has lived with great hope, but suddenly hopes are disappearing and despair is settling in. To me, this is of immense importance. This crisis in human consciousness is of great import. Either humanity has to disappear from the earth or it will have a totally new being, a new birth. And my work consists of giving a new birth to human consciousness.*
*The world has failed us; now there is nothing to long for here on the earth. Now the longing can soar high. Now the visible is finished, and we can search in the invisible. Now time is meaningless; we have to move into the nontemporal. Now the ordinary mundane life has no charm; it has lost all joy. We have fulfilled all the desires, all the possible desires, and they have not satisfied us. Now the real discontent is possible, and to be really discontented is a great blessing.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 410 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 410 - 1🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 89. శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా ।*
*అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా ॥ 89 ॥ 🍀*
*🌻 410. 'శివపరా'- 1 🌻*
*శివుని కంటే పరమైనది శ్రీదేవి అని అర్ధము. లేక శివుడు పరుడుగా కలది, లేక భక్తులను శివపరము చేయునది, లేక సతతము శివుని గూర్చి బోధించునది అని అర్థము. శివునికి ఆమె పరము, ఆమెకు శివుడు పరము. దీనిని తెలియ వలెను. వారు ఒకే తత్త్వము నుండి దిగివచ్చిన వారు గనుక ఇరువురిలో ఎవ్వరునూ అధికము కాదు అని తెలిపెడి నామమిది. ఆమెను పూజించిన అతని కడకు చేర్చును. అతనిని పూజించిన ఆమె కడకు చేర్చును. అనగా ఎవరిని పూజించిననూ చేర్చునది పరమునకే. వారిరువురునూ ఒకరిని గూర్చి ఒకరు బోధింతురు. ఇది అభేద స్థితికి చిహ్నము.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 410 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj*
*🌻 89. Shivapriya shivapara shishteshta shishta-pujita*
*Aprameya svaprakasha manovachamagochara ॥ 89 ॥ 🌻*
*🌻 410. 'Shivapara'- 1 🌻*
*It means that Sridevi is superior to Shiva. Or it means that the one who has Shiva as Her consort. Or the One who hands over the devotees to Lord Shiva. Or the One who relentlessly teaches about Lord Shiva. She is the One other than Shiva and Shiva is the one other than Her. This needs to be known. It is a name that tells us that neither of them is superior because they come from the same philosophy. Those who worship Her shall be taken to Him by Her. Those who worship Him shall be taken to Her by Him. Meaning irrespective of whom one worships, they shall reach them. They both teach about each other. It is a symbol of state of Oneness.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Comments