🌹🍀 24 - DECEMBER - 2022 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 24 - DECEMBER - 2022 SATURDAY, శనివారం స్థిర వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 108 / Kapila Gita - 108 🌹 సృష్టి తత్వము - 64
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 700 / Vishnu Sahasranama Contemplation - 700 🌹 సత్కృతిః, सत्कृतिः, Satkrtiḥ
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 147 / Agni Maha Purana - 147 🌹 🌻. వాసుదేవ ప్రతిమా లక్షణము - 6 Characteristics of the image of Vāsudeva - 6🌻
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 282 / Osho Daily Meditations - 282 🌹 282. ధృవ నక్షత్రం - POLAR STAR
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 420 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 420 - 3 🌹. 420. 'గాయత్రీ' - 3 'Gayatri' - 3
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹24, డిసెంబరు, December 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : చంద్ర దర్శనము, Chandra Darshan🌻*
*🍀. శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం - 1 🍀*
*1. నమస్తేఽస్తు భైరవాయ బ్రహ్మవిష్ణుశివాత్మనే |*
*నమస్త్రైలోక్యవంద్యాయ వరదాయ పరాత్మనే*
*2. రత్నసింహాసనస్థాయ దివ్యాభరణశోభినే |*
*దివ్యమాల్యవిభూషాయ నమస్తే దివ్యమూర్తయే*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : జీవన మరణములు - నేను మృత్యువుకు లొంగి పోవలెనా, లేక ఎదురు తిరిగి పోరాడి జయించ వలెనా? నాలోని ఈశ్వరుడెట్లు నిర్దేశిస్లే అట్లు జరుగుగాక. ఏమంటే, నేను జీవించినా మరణించినా ఎప్పుడూ ఉండేవాడినే. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, హేమంత ఋతువు,
దక్షిణాయణం, పుష్య మాసం
తిథి: శుక్ల పాడ్యమి 12:07:53 వరకు
తదుపరి శుక్ల విదియ
నక్షత్రం: పూర్వాషాఢ 22:16:36
వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం: వృధ్ధి 09:27:31 వరకు
తదుపరి ధృవ
కరణం: బవ 12:06:52 వరకు
వర్జ్యం: 09:38:48 - 11:02:56
మరియు 29:18:00 - 30:42:24
దుర్ముహూర్తం: 08:11:23 - 08:55:45
రాహు కాలం: 09:29:03 - 10:52:15
గుళిక కాలం: 06:42:38 - 08:05:50
యమ గండం: 13:38:40 - 15:01:53
అభిజిత్ ముహూర్తం: 11:53 - 12:37
అమృత కాలం: 18:03:36 - 19:27:44
సూర్యోదయం: 06:42:38
సూర్యాస్తమయం: 17:48:17
చంద్రోదయం: 07:35:36
చంద్రాస్తమయం: 18:50:28
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: ధనుస్సు
యోగాలు: మతంగ యోగం - అశ్వ లాభం
22:16:36 వరకు తదుపరి రాక్షస యోగం
- మిత్ర కలహం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 108 / Kapila Gita - 108🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 64 🌴*
*64. అక్షిణీ చక్షుషాఽదిత్యో నోదతిష్థత్తదా విరాట్|*
*శ్రోత్రేణ కర్ణౌ చ దిశో నోదతిష్థత్తదా విరాట్॥*
*సూర్యుడు చక్షురింద్రియములతో గూడి నేత్ర గోళములందు ప్రవేశించెను. కాని అతడు మేల్కొనలేదు. దిక్కులు శ్రవణేంద్రియముతో గూడి చెవుల యందును ప్రవేశించెను. ఐనను ఆ విరాట్ పురుషుడు మాత్రము లేవలేదు.*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 108 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*
*🌴 2. Fundamental Principles of Material Nature - 64 🌴*
*64. akṣiṇī cakṣuṣādityo nodatiṣṭhat tadā virāṭ*
*śrotreṇa karṇau ca diśo nodatiṣṭhat tadā virāṭ*
*The sun-god entered the eyes of the virāṭ-puruṣa with the sense of sight, but still the virāṭ-puruṣa did not get up. Similarly, the predominating deities of the directions entered through His ears with the sense of hearing, but still He did not get up.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 700 / Vishnu Sahasranama Contemplation - 700🌹*
*🌻700. సత్కృతిః, सत्कृतिः, Satkrtiḥ🌻*
*ఓం సద్కృతయే నమః | ॐ सद्कृतये नमः | OM Sadkrtaye namaḥ*
*సతీ కృతిర్జగద్రక్షా లక్షణాఽస్య యతస్తతః ।*
*సత్కృతిః ప్రోచ్యతే విష్ణుర్వేదికైస్తత్వదర్శిభిః ॥*
*పరమాత్ముడు జగద్రక్షణము అను మిగుల ఉత్కృష్టమైన కృతిని ఆచరించుచుండువాడు కనుక 'సత్కృతిః' - 'గొప్పపని కలవాడు.'*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 700🌹*
*🌻700. Satkrtiḥ🌻*
*OM Sadkrtaye namaḥ*
सती कृतिर्जगद्रक्षा लक्षणाऽस्य यतस्ततः ।
सत्कृतिः प्रोच्यते विष्णुर्वेदिकैस्तत्वदर्शिभिः ॥
*Satī krtirjagadrakṣā lakṣaṇā’sya yatastataḥ,*
*Satkrtiḥ procyate viṣṇurvedikaistatvadarśibhiḥ.*
*The Lord's action of protecting the world is sat or good and hence He is called Satkrtiḥ.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सद्गतिस्सत्कृतिस्सत्ता सद्भूतिस्सत्परायणः ।शूरसेनो यदुश्रेष्ठस्सन्निवासस्सुयामुनः ॥ ७५ ॥
సద్గతిస్సత్కృతిస్సత్తా సద్భూతిస్సత్పరాయణః ।శూరసేనో యదుశ్రేష్ఠస్సన్నివాసస్సుయామునః ॥ 75 ॥
Sadgatissatkrtissattā sadbhūtissatparāyaṇaḥ,Śūraseno yaduśreṣṭhassannivāsassuyāmunaḥ ॥ 75 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 147 / Agni Maha Purana - 147 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 44*
*🌻. వాసుదేవ ప్రతిమా లక్షణము - 6🌻*
*పాదముల విస్తారము అరంగుళములు, గుహ్యకము మూడు అంగుళములు, పంజా ఐదు అంగుళములు ఉండవలెను. పాదముల బొటనవ్రేలు వెడల్పుగా ఉండవలెను. మిగిలిన వ్రేళ్ళ మధ్య భాగవిస్తారము క్రమముగా మొదటి వ్రేలు ఎనిమిదవ భాగము తక్కువగా ఉండవలెన. బొటన వ్రేలు ఎత్తు ఒకటిన్నర అంగుళము లుండవలెను, దీని గోరు ప్రమాణమును మిగిలిన వ్రేళ్ళ ప్రమాణము కంటె రెట్టింపు ఉంచవలెను. రెండవ వ్రేలి గోరు విస్తారము అర అంగుళము, ఇతరమైన వ్రేళ్ళ గోరు విస్తారము క్రమముగా కొంచెకొంచెము తగ్గించవలెను. అండకోశములు రెండును మూడేసి అంగుళముల పొడవు, లింగము నాలుగు అంగుళములు ఉండవలెను, దానిపై భాగము నాలుగు అంగుళము లుండవలెను.*
*అండకోశములు పూర్తి తిరుగుడు ఆరేసి అంగుళములు. ఇంత మాత్రమేకాక దేవతా ప్రతిమను సకల భూషణములతో అలంకరించవలెను. ఈ విధముగా సంక్షిప్తముగ లక్షణము చెప్పబడినది. ఇదే విధముగ లోకములో కనబడు ఇతర లక్షణములను కూడ దృష్ణిలో నుంచుకొని, ప్రతిమపై అలక్షణములను నిర్మింపవలెను. పైకుడి చేతిలో చక్రము, క్రింది దానిలో పద్మము, పై ఎడమచేతిలో శంఖము క్రింది దానిలో గద ఉంచవలెను. ఇవి వాసుదేవ శ్రీకృష్ణుని చిహ్నములు గాన ఆప్రతిమ యందు మాత్రమే ఉంచవలెను. భగవంతుని సమీపమున హస్తమునందు కమలము ధరించిన లక్ష్మిని, వీణను ధరించి యున్న పుష్టిదేవిని నిర్మించవలెను.*
*ఈ ప్రతిమల ఎత్తు భగవత్ప్రతిమ తొడల ఎత్తు ఉండవలెను. ప్రభామండములో ఉన్న మాలధర-విద్యాధరుల విగ్రహము కూడ స్థాపింపవలెను. ప్రభను ఏనుగు మొదలైన వాటితో అలంకరింపవలెను. భగవచ్చరణముల క్రింద భాగమును (పాదపీఠమును) పద్మాకారమును నిర్మింపవలెను. ఈ విధముగ దేవ ప్రతిమలకు పై చెప్పిన లక్షణము లుండునట్లు కూర్చవలెను.*
*అగ్ని మహాపురాణమునందు వాసుదేవ ప్రతిమా లక్షణమను నలుబది నాల్గవ అధ్యాయము సమాప్తము.*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 147 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 44*
*🌻Characteristics of the image of Vāsudeva - 6 🌻*
41. The front (part) of the ankles should be four aṅgulas The extent of the feet should be three kalās. The generative organ should be three aṅgulas.
42. Its girth (should be) five aṅgulas. The fore-finger (should be) of same length. The other fingers are duly lesser by one part of eighth.
43. The height of the toe is said to be one and a half aṅgulas. The nail of the two should be made twice that.
44. (Those of other fingers) should be gradually made half aṅgula less than the previous. The scrotum should be three aṅgulas (long). The generative organ (should be) four fingers (long).
45. The girth of the upper part of the pouch should be made (to be) four aṅgulas. The girth of the scrotum is said to be six aṅgulas.
46. The image should be adorned with ornaments. This is the exact description of details. The features (of the deities) should be made in this world, as described.
47. A disc on the (upper) right hand, and a lotus on the lower (right hand), the conch on the (upper) left hand, the mace on the lower (left hand) are to be placed according to the characteristic of Vāsudeva.
48-49. (The images of) Śrī and Puṣṭi should be made carrying a lotus and a harp respectively in their hands, (their images) reaching upto the thighs (of that of Vāsudeva). Then the two Vidyādharas (a class of semi-divine beings) holding the garlands (in their hands) should be made in the halo of the principal image). The halo (should also) be decked with the (images) of (celestial) elephants. The pedestal should be radiant like a lotus on which the images (should be worshipped) as follows.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 282 / Osho Daily Meditations - 282 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 282. ధృవ నక్షత్రం 🍀*
*🕉. ధృవ నక్షత్రం అత్యంత శాశ్వతమైన, కదలని నక్షత్రం. ప్రతిదీ కదులుతుంది, కానీ కదలని నక్షత్రం ఇది మాత్రమే. 🕉*
*ప్రేమ అనేది ధ్రువ నక్షత్రం. ప్రేమ తప్ప ప్రతిదీ కదులుతుంది. అన్ని మారుతాయి; ప్రేమ మాత్రమే శాశ్వతంగా ఉంటుంది. మారుతున్న ఈ ప్రపంచంలో మార్పులేని పదార్థం ప్రేమ మాత్రమే. మిగతావన్నీ కదిలేవి, క్షణికమైనవి. ప్రేమ మాత్రమే శాశ్వతం. కాబట్టి ఈ రెండు విషయాలు మీరు గుర్తుంచుకోవాలి. ఒకటి ప్రేమ. ఎందుకంటే అది భ్రాంతి లేని ఏకైక విషయం, అది మాత్రమే వాస్తవికత; మిగతావన్నీ ఒక కల. కాబట్టి ఒకరు ప్రేమగా మారగలిగితే, ఒకరు నిజమవుతారు. ఒక వ్యక్తి పూర్తి ప్రేమను పొందినట్లయితే, ఒకరు స్వయంగా, సత్యం అవుతారు, ఎందుకంటే ప్రేమ ఒక్కటే సత్యం. రెండవ విషయం ఏమిటంటే, మీరు నడుస్తున్నప్పుడు, మీలో ఏదో ఎప్పటికీ నడవదని గుర్తుంచుకోండి.*
*అది మీ ఆత్మ. మీ ధ్రువ నక్షత్రం. మీరు తింటారు, కానీ మీలో ఏదో తినదు. మీరు కోపంగా ఉంటారు, కానీ మీలో ఎక్కడో కోపం ఎప్పుడూ ఉండదు. మీరు వెయ్యి ఒక్క పనులు చేస్తారు, కానీ మీలో ఏదో ఒకటి చేయడం కంటే ఎక్కువ ఖచ్చితంగా ఉంటుంది. అది మీ ధ్రువ నక్షత్రం. కాబట్టి నడవడంలో, ఎప్పుడూ నడవనిది గుర్తుంచుకోండి. కదిలడంలో కదలనిది గుర్తుంచుకో. మాట్లాడటంలో, నిశ్శబ్దం గుర్తుంచుకో. పనులు చేయడంలో, నిశ్చలత, ఉండటం గుర్తుంచుకోండి. ఇది పూర్తిగా శాశ్వతమైనది, ఇది ఎప్పటికీ మినుకు మినుకుమనేది, ఎప్పుడూ కదలదు, దీనిలో ఎటువంటి మార్పు తెలియదు. నీలోని మార్పులేనిది నిజమైనది. మరియు ప్రేమ దానిని కనుగొనే మార్గం.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 282 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 282. POLAR STAR 🍀*
*🕉.The polar star is the most permanent, unmoving star. Everything goes on moving, but this is the only star that doesn't move. 🕉*
*Love is the polar star. Everything moves except love. Everything changes; only love remains permanent. In this changing world only love is the unchanging substance. Everything else is a flux, momentary. Only love is eternal. So these two things you have to remember. One is love, because that is the only thing that is non illusory, That is the only reality; everything else is a dream. So if one can become loving, one becomes real. If one attains total love, one has become oneself, the truth, because love is the only truth. And the second thing is that when you are walking, remember that something in you never walks.*
*That's your soul, your polar star. You eat, but something in you never eats. You become angry, but something in you never becomes angry. You do a thousand and one things, but something in you remains absolutely beyond doing. That is your polar star. So walking, remember that which never walks. Moving, remember the immobile. Talking, remember silence. Doing things, remember being. Always remember-that which is absolutely permanent, which never flickers, never wavers, which knows no change. That unchanging one within you is the real. And love is the way to find it.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 420 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 420 - 3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 90. చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।*
*గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥ 🍀*
*🌻 420. 'గాయత్రీ' - 3🌻*
*సంకల్పమే లేనపుడు సృష్టికర్త కూడ లేడు. ప్రకృతి పురుషులు కూడ లేరు. తత్త్వమే యుండును. అందుండి పుట్టు మొట్టమొదటి సృష్టి స్ఫురణ సృష్టికి కారణభూతము. సంకల్పమే లేనపుడు క్రియ కూడ లేదు. ఇచ్ఛా, జ్ఞాన క్రియలు లేవు. తత్త్వము యొక్క ప్రథమ వ్యక్తరూపము గాయత్రి అని తెలియవలెను. ఆమె సంకల్పములకు తల్లి, పుట్టుచోటు. ఎవ్వరికైనను సంకల్పము కలిగిన పిదపనే అందుండి ఇచ్ఛా జ్ఞాన క్రియలు పుట్టును.*
*సంకల్పమే కలుగనిచో స్థబ్దుగ నుందురు. స్థబ్దత రెండు రకములు. ఒకటి సమాధి, రెండు జడము. ఇందు మొదటివారు సంకల్పమును దాటి తత్త్వమున నిలచినవారు. రెండవ వారు అతి మంద్రస్థాయిలో మాత్రమే సంకల్పము పనిచేయు స్థబ్ధులు. సమాధి యందుండు యోగేశ్వరులు మొదలుగ స్థబ్దుల వరకు అందరిని, అన్నింటిని నడిపించునది సంకల్పమే.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 420 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Prasad Bharadwaj*
*🌻 90. Chichakti shchetanarupa jadashakti jadatmika*
*Gayatri vyahruti sandhya dvijabrunda nishemita ॥ 90 ॥🌻*
*🌻 420. 'Gayatri' - 3 🌻*
*When there is no will there is no creator. Not even nature and consciousness. There is only philosophy. The idea of creation that arose from it was the cause of creation. When there is no will there is no action. There are no will, wisdom and action. It should be known that the first manifestation of Tattva(philosophy) is Gayatri. She is the mother and birthplace of will. It is only from the will do intention, knowledge and action are born.*
*If there is no will, you will be stagnant. Stagnation is of two types. One is samadhi, other is inertia. The first of these are those who go beyond will and stand in philosophy. Second, they are the weaklings whose will works only at the lowest level. Sankalpa is what drives everyone and everything, from the yogis in samadhi to the laziest of people.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
Kommentare