top of page
Writer's picturePrasad Bharadwaj

🍀 24, JANUARY 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🍀

🌹🍀 24, JANUARY 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🍀🌹

1) 🌹 24, JANUARY 2023 SUNDAY,ఆదివారం, భాను వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹 కపిల గీత - 123 / Kapila Gita - 123 🌹 🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 07 / 3. Salvation due to wisdom of Nature and Jeeva - 07 🌴

3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 715 / Vishnu Sahasranama Contemplation - 715 🌹

🌻715. దుర్ధరః, दुर्धरः, Durdharaḥ🌻

4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 676 / Sri Siva Maha Purana - 676 🌹 🌻. గణేశ వివాహోపక్రమము - 5 / Gaṇapati’s marriage - 5 🌻

5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 297 / Osho Daily Meditations - 297 🌹 🍀297. అలవాటు అనే జైలు / The prison of habit 🍀

6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 426 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 426 - 2 🌹 🌻 426. 'పంచకోశాంతర స్థితా' - 2 / Panchakoshantarah Stitha' - 2 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹24, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹*

*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*

*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ *

*ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*


*🍀. అపరాజితా స్తోత్రం - 3 🍀*


*5. అతిసౌమ్యాతిరౌద్రాయై నతాస్తస్యై నమో నమః |*

*నమో జగత్ప్రతిష్ఠాయై దేవ్యై కృత్యై నమో నమః*

*6. యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా |*

*నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : సాధన : కర్మాచరణలో మూడు దశలు - కర్మాచరణలోని మూడవ దశలో కర్మ నిన్ను బహిర్ముఖుని చేయదు. అంతర్ముఖం చేస్తుంది. కానీ ఈ కర్మాచరణలో కూడా ఆ సంసిద్ధికి నీవు తెలియకుండానే, అంటే ఎరుక లేకుండానే వుంటావు. 🍀*


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌, శిశిర ఋతువు,

ఉత్తరాయణం, మాఘ మాసం

తిథి: శుక్ల తదియ 15:23:39 వరకు

తదుపరి శుక్ల చవితి

నక్షత్రం: శతభిషం 21:59:47 వరకు

తదుపరి పూర్వాభద్రపద

యోగం: వరియాన 21:36:11 వరకు

తదుపరి పరిఘ

కరణం: గార 15:27:39 వరకు

వర్జ్యం: 06:54:18 - 08:20:22

మరియు 27:52:08 - 29:20:40

దుర్ముహూర్తం: 09:04:50 - 09:49:59

రాహు కాలం: 15:17:25 - 16:42:06

గుళిక కాలం: 12:28:04 - 13:52:44

యమ గండం: 09:38:42 - 11:03:23

అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:50

అమృత కాలం: 15:30:42 - 16:56:46

సూర్యోదయం: 06:49:20

సూర్యాస్తమయం: 18:06:47

చంద్రోదయం: 08:59:33

చంద్రాస్తమయం: 20:53:17

సూర్య సంచార రాశి: మకరం

చంద్ర సంచార రాశి: కుంభం

యోగాలు: మృత్యు యోగం - మృత్యు

భయం 21:59:47 వరకు తదుపరి

కాల యోగం - అవమానం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. కపిల గీత - 123 / Kapila Gita - 123🌹*

*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*

*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 07 🌴*


*07. సర్వభూతసమత్వేన నిర్వైరేణాప్రసంగతః|*

*బ్రహ్మచర్యేణ మౌనేన స్వధర్మేణ బలీయసా॥*


*సకల ప్రాణుల యందును సమభావము కలిగి యుండవలెను. ఎవ్వరి యెడలను వైరభావమును కలిగి యుండరాదు. లౌకిక విషయముల యందు ఆసక్తిని త్యజింప వలెను. బ్రహ్మచర్యమును పాటింపవలెను. భగవంతుని యందే మననశీలుడై యుండవలెను. స్వధర్మములను దృఢముగా ఆచరించుచు వాటి ఫలములను భగవదర్పణము చేయుచుండవలెను.*


*అప్పుడు ద్వేష భావం తొలగుతుంది. అలా చేయగా అన్ని భూతముల యందు సమానముగా ఉన్న భగవానుని చూస్తావు. అలాంటి భావన వచ్చినప్పుడు దేని యందు ఆసక్తి ఉండకూడదు. ఎవరి మీదా ద్వేషము పొందకుండా, అందరినీ సమముగా చూడాలి. ఇవి జరగాలంటే, శరీర భోగాల మీద ఆసక్తి తగ్గాలి. బ్రహ్మచర్యాన్ని అలవరచుకోవాలి. బ్రహ్మచర్యానికి భంగం కలిగించేది, కనపడిన ప్రతీ వారితో మాటలు కలపడం. బ్రహ్మచర్యానికి మూలం మౌనం. మౌనం అలవాటు చేసుకోవాలి. మౌనం అలవాటు కావాలంటే స్వధర్మాసక్తి కావాలి.*


*సశేషం..*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Kapila Gita - 123 🌹*

*🍀 Conversation of Kapila and Devahuti 🍀*

*📚 Prasad Bharadwaj*


*🌴 3. Salvation due to wisdom of Nature and Jeeva - 07 🌴*


*07. sarva-bhūta-samatvena nirvaireṇāprasaṅgataḥ*

*brahmacaryeṇa maunena sva-dharmeṇa balīyasā*


*In executing devotional service, one has to see every living entity equally, without enmity towards anyone yet without intimate connections with anyone. One has to observe celibacy, be grave and execute his eternal activities, offering the results to the Supreme Personality of Godhead.*


*A devotee of the Supreme Personality of Godhead who seriously engages in devotional service is equal to all living entities. There are various species of living entities, but a devotee does not see the outward covering; he sees the inner soul inhabiting the body. Because each and every soul is part and parcel of the Supreme Personality of Godhead, he does not see any difference. That is the vision of a learned devotee. As explained in Bhagavad-gītā, a devotee or a learned sage does not see any difference between a learned brāhmaṇa, a dog, an elephant or a cow because he knows that the body is the outer covering only and that the soul is actually part and parcel of the Supreme Lord. A devotee has no enmity towards any living entity, but that does not mean that he mixes with everyone. That is prohibited. Aprasaṅgataḥ means "not to be in intimate touch with everyone." A devotee is concerned with his execution of devotional service, and he should therefore mix with devotees only, in order to advance his objective. He has no business mixing with others, for although he does not see anyone as his enemy, his dealings are only with persons who engage in devotional service.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 715 / Vishnu Sahasranama Contemplation - 715🌹*


*🌻715. దుర్ధరః, दुर्धरः, Durdharaḥ🌻*


*ఓం దుర్ధరాయ నమః | ॐ दुर्धराय नमः | OM Durdharāya namaḥ*


న శక్యాధారణా యస్య ప్రణిధానాదిషు ప్రభోః ।

సర్వోపాధివినిర్ముక్తస్యాథతస్య ప్రసాదతః ॥

జన్మాన్తర సహస్రేషు కైశ్చిద్దుఃఖే న ధార్యతే ।

హృదయే భావనాయోగాత్ తస్మాద్ విష్ణు స్స దుర్ధరః ॥

షట్సప్తతితమే శ్లోకే మఙ్గ్లార్థోఽథ శబ్దకః ।

దుర్ధరోఽపి ధ్రియేతైవ తదనుగ్రహకారణాత్ ॥

ధృతే రనన్తరం భక్తేష్వ పరాజితతా భవేత్ ।

ఇతి భోధయితుం వాఽథ శబ్దోఽత్రైవ ప్రయోజితః ॥


*ఎంతటి శ్రమచే కూడ ధరించబడు శక్యుడు కాడు. ఎంతో శ్రమచే ధరించబడువాడు. రెండు అర్థములు.*


*సర్వ ఉపాధుల నుండియు వినిర్ముక్తుడుకావున ఆతనిని హృదయమున నిలిపి ధ్యానించుటయందు ఎంత శ్రమచే కూడ ధారణ చేయుట శక్యము కాదు. ఐనప్పటికీ, ఆ భగవానుని అనుగ్రహమువలన కొందరిచే మాత్రమే వారి వారి జన్మాంతర సహస్ర సంపాదిత భావనా యోగ బలము వలన ఎంతయో శ్రమతో హృదయమున ధరింపబడును.*


*క్లేశోఽధికతర స్తేషా మవ్యక్తాసక్తచేతసాం । అవ్యక్త హి* *గతిర్దుఃఖం దేహవద్బిరవాప్యతే ॥ (గీతా 12.5)*


*అను భగవద్గీత వచనముననుసరించి అవ్యక్త రూపమగు గతిని అనగా అక్షరతత్త్వరూపగమ్యమును దేహవంతులు ఎంతయో దుఃఖముతో అనగా అధికశ్రమచే పొందుచున్నారు. కావున అక్షరోపాసన మందు ఆసక్తమగు చిత్తము కలవారికి కలుగు క్లేశము అధికతరము.*


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 715🌹*


*🌻715. Durdharaḥ🌻*


*OM Durdharāya namaḥ*


क्लेशोऽधिकतरस्तेषामव्यक्तासक्तचेतसाम् ||

अव्यक्ता हि गतिर्दु:खं देहवद्भिरवाप्यते 12.5

((गीता 12.5) भगवद गीता है)


*kleśho ’dhikataras teṣhām avyaktāsakta-chetasām*

*avyaktā hi gatir duḥkhaṁ dehavadbhir avāpyate (Gita 12.5)*


* 12.5: For those whose minds are attached to the unmanifest, the path of realization is full of tribulations. Worship of the unmanifest is exceedingly difficult for embodied beings.*


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

भूतावासो वासुदेवः सर्वासुनिलयोऽनलः ।दर्पहा दर्पदोऽदृप्तो दुर्धरोऽथापराजितः ॥ ७६ ॥

భూతావాసో వాసుదేవః సర్వాసునిలయోఽనలః ।దర్పహా దర్పదోఽదృప్తో దుర్ధరోఽథాపరాజితః ॥ 76 ॥

Bhūtāvāso vāsudevaḥ sarvāsunilayo’nalaḥ,Darpahā darpado’dr‌pto durdharo’thāparājitaḥ ॥ 76 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 . శ్రీ శివ మహా పురాణము - 676 / Sri Siva Maha Purana - 676 🌹*

*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 19 🌴*

*🌻. గణేశ వివాహోపక్రమము - 5 🌻*


నాకు వెంటనే శుభవివాహమును జరిపించవలెను. లేదా, వేదశాస్త్రములు అసత్యమని చెప్పుడు (45).మీరు ధర్మస్వరూపులగు తల్లి దండ్రులు. ఈ రెండు పక్షములలో ఏది ఎక్కువ శ్రేష్ఠమైనది అను విషయమును చక్కగా విచారించి ప్రయత్నపూర్వకముగా అనుష్ఠించుడు (46).


బ్రహ్మ ఇట్లు పలికెను -


బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, మహాజ్ఞాని, మంచి స్ఫూర్తి గలవాడు, పార్వతీ తనయుడు అగు ఆ గణేశుడు ఇట్లు పలికి విరమించెను (47). జగత్తునకు తల్లి దండ్రులు, ఆది దంపతులు అగు ఆ పార్వతీ పరమేశ్వరులు గణేశుని ఈ వచనములను విని పరమాశ్చర్యమును పొందిరి (48). అపుడు పార్వతీ పరమేశ్వరులు బుద్దిమంతుడు, మరియు సత్యభాషియగు తమ పుత్రుని ప్రేమతో మిక్కిలి ప్రశంసించి ఇట్లు పలికిరి (49).


పార్వతీపరమేశ్వరులిట్లు పలికిరి -


పుత్రా! మహత్ముడవగు నీకు స్వచ్ఛమగు బుద్ధి కలిగినది. నీవు చెప్పిన మాట యథార్థము. సందేహము లేదు (50). కష్టము వచ్చినప్పుడు ఎవని బుద్ధి పని చేయునో వాని కష్టము సూర్యోదయము కాగానే చీకటి తొలగినట్లు తొలగిపోవును (51).


బుద్ధి గల వానిదే బలము. బుద్ధి లేని వానికి బలమెక్కడిది? మదించిన సింహమును కుందేలు నూతిలో పడద్రోసినది (52). వేదశాస్త్ర పురాణములు పుత్రునకు ఏ ధర్మమును విధించినవో, నీవా ధర్మమును పూర్ణముగా పాలించితివి (53). నీవు చేసిన కర్మ ధర్మబద్ధమైనది. లోకములో ఎవరైననూ దానిని పాలించవలెను. నీవు చేసిన కర్మను మేమిద్దరము ఆదరించు చున్నాము. దీనిలో సందేహము లేదు (54).


బ్రహ్మ ఇట్లు పలికెను -


వారిద్దరు ఇట్లు పలికి బుద్ధిశాలియగు గణేశుని కొనియాడి, ఆతనికి మాట ఇచ్చి, అతనికి వివాహమును చేయవలెననే ఉత్తమమగు నిర్ణయమును చేసిరి (55).


శ్రీ శివమహాపురాణములోని రుద్ర సంహితయందు కుమార ఖండలో గణేశ వివాహోపక్రమమనే పందొమ్మిదవ అధ్యాయము ముగిసెను (19).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 SRI SIVA MAHA PURANA - 676🌹*

*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *


*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 19 🌴*


*🌻 Gaṇapati’s marriage - 5 🌻*


45. Let my auspicious marriage be celebrated and that too very quickly. Otherwise let the Vedas and Śāstras be declared false.


46. Of the two alternatives whatever is excellent shall be followed, O parents, embodied virtues!


Brahmā said:—

47. Saying thus, Gāṇeśa of excellent intellect, of great wisdom and foremost among intelligent persons assumed silence.


48. On hearing his words, Pārvatī and Śiva, the rulers of the universe, were very much surprised.


49. Then, Śiva and Pārvatī praised their son who was clever and intelligent and spoke to him who had spoken the truth.


Śiva and Pārvatī said:—

50. O son, you are a supreme soul and your thoughts are pure. What you have said is true and not otherwise.


51. When misfortune comes, if a person is keenly intelligent, his misfortunes perish even as darkness perishes when the sun rises.


52. He who has intelligence possesses strength as well. How can he who is devoid of intellect have strength? The proud lion was drowned in a well with a trick by a little hare.[2]


53. Whatever has been mentioned in the Vedas, Śāstras and Purāṇas for a boy, all that has been performed by you, namely, the observance of virtue.


54. What has been executed by you shall be done by anyone. We have honoured it. It will not be altered now.


Brahmā said:—

55. After saying this and appeasing Gaṇeśa, the ocean of intelligence, they resolved to perform his marriage.


Continues....

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 297 / Osho Daily Meditations - 297 🌹*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🍀 297. అలవాటు అనే జైలు 🍀*


*🕉. నేను తప్పు కావచ్చు. నేను నిజంగా ఒక అలవాటు అనే జైలు నుండి బయటకు రాకపోవచ్చు, బహుశా నేను నటిస్తున్నాను. నేనే జైలర్ కూడా కావచ్చు! దాని గురించి ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. ఇది సమర్థతకు సంబంధించిన విషయం. 🕉*


*మీరు ధూమపానం మానేయాలని స్వంతంగా నిర్ణయించుకుంటే మరియు మీరు ఎవరితోనూ ఏమీ చెప్పకపోతే, మీరు ధూమపానం చేసే వారిలో వుండేందుకు వందలో తొంభై తొమ్మిది అవకాశాలు ఉన్నాయి. మరొకరు అతను పొగ త్రాగకూడదని నిర్ణయించుకున్నాడు మరియు అతను తన స్నేహితులకు చెప్పాడు. ఇంకా స్మోక్ చేసే అవకాశం చాలా తగ్గి పోతుంది. మూడవ అవకాశం ఏమిటంటే, అతను ధూమపానం చేయని సమాజంలో చేరాడు. ఇప్పుడు స్మోక్ చేయక పోవడానికి తొంభై తొమ్మిది శాతం అవకాశం ఉంది. మీరు ఏదైనా చేయాలనుకుంటే, కొంతమంది స్నేహితులను కనుగొనండి, తద్వారా మీరు కలిసి దీన్ని చేయగలరని గుర్జియేఫ్‌ చెప్పేవాడు. ఇది దాదాపు మీరు జైలులో ఖైదు చేయబడినట్లే: మీరు తప్పించు కోవాలను కుంటున్నారు, కానీ ఒంటరిగా తప్పించుకోవడం చాలా కష్టం.*


*మీరు ఒక గుంపును తయారు చేస్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది: కలిసి మీరు అలవాటును చంపవచ్చు, కానీ ఒంటరిగా అది చాలా కష్టం అవుతుంది. కలిసి మీరు గోడను విచ్ఛిన్నం చేయవచ్చు, కానీ ఒంటరిగా అది చాలా కష్టం అవుతుంది. కానీ మీరు విజయం సాధించలేని అవకాశం ఇప్పటికీ ఉంది, ఎందుకంటే మీ ముఠా నిస్సహాయల చిన్న ముఠాగా ఉంటుంది. అలవాట్లను నిర్వహించే శక్తులు మీ కంటే పెద్దవి. బయట ఉన్నవారు, ఇప్పటికే స్వేచ్ఛగా ఉన్నవారు, వాటిలో లేనివారు, మీకు అసరా ఇవ్వగలవారు. మీకు మార్గదర్శనం ఎవరు ఇవ్వగలరు. మీ అలవాటును దూరంగా తీసుకెళ్ల గలవారు. అటువంటి వారితో పరిచయం పెంచుకోవడం ఉత్తమం.*

*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹



*🌹 Osho Daily Meditations - 297 🌹*

*📚. Prasad Bharadwaj*


*🍀 297. The prison of habit 🍀*


*🕉. I may be wrong. Maybe I'm not really out of the prison of a habit, maybe I'm pretending. I might as well be a jailer! No one can be sure about that. It is a matter of efficiency. 🕉*


*If you decide on your own to quit smoking and you don't tell anyone, there's a ninety-nine out of a hundred chance you'll be a smoker. Another decided he didn't want to smoke and he told his friends. Also the chance of smoking will be reduced. A third possibility is that he joined a non-smoking society. Ninety-nine percent chance of not smoking now. Gurdjieff used to say that if you want to do something, find some friends so you can do it together. It's almost like being imprisoned in a prison: you want to escape, but it's too difficult to escape alone.*


*The chance is greater if you form a group: together you can kill the habit, but alone it will be very difficult. Together you can break the wall, but alone it will be very difficult. But there's still a chance that you won't succeed, because your gang will be a small gang of losers. The forces that govern habits are bigger than you. Those who are outside, those who are already free, those who are not among them, can give you support. Who can guide you? People who can take your habit away. It is better to get in touch with such people.*

*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 426 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 426 - 2 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*


*🍀 91. తత్త్వాసనా, తత్త్వమయీ, పంచకోశాంతరస్థితా ।*

*నిస్సీమమహిమా, నిత్యయౌవనా, మదశాలినీ ॥ 91 ॥ 🍀*


*🌻 426. 'పంచకోశాంతర స్థితా' - 2 🌻*


*పంచభూతముల సృష్టి భౌతిక సృష్టిగ పేర్కొందురు. అందు కూడ ఆనందము పొందుటకు వీలుకలదు. దానికి ప్రాతిపదిక పరిశుద్ధత. పంచకోశములను పరిశుద్ధముగా నుంచుకొనుట ఆరాధకునకు ప్రథమ కర్తవ్యము. అపుడే ఆనందము యుండును. శబ్దము వినుట పలుకుట యందు, స్పర్శయందు, రుచియందు, గంధమునందు పరిశుద్ధతను పాటింపవలెను.*


*అట్లే చూచు విషయముల యందు పరిశుద్దత పాటింపవలెను. అపుడే ఆనందమయుడగు బ్రహ్మయొక్క స్పర్శ, రుచి కలుగును. అపరిశుద్ధులకు యే అనుభూతి యుండదు. భ్రమ భ్రాంతులే యుండును. పంచకోశములు, పంచభూతములు బ్రహ్మము యొక్క రుచిని మాత్రమే కలిగించగలవు. నిజమగు ఆనందము చితశక్తిని కూడినపుడే కలుగును. అది త్రిగుణములకు ఆవల యున్నది.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 426 - 2 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻 91. Tatvasana tatvamaei panchakoshantarah sthita*

*Nisima mahima nitya-yaovana madashalini ॥ 91 ॥ 🌻*


*🌻 426. 'Panchakoshantarah Stitha' - 2🌻*


*The creation of five elements is called physical creation. That too cannot be enjoyed. Purity is the basis for it. The first duty of the worshiper is to clean the five layers( Panchakoshams). Only then will there be happiness. Purity should be observed in speech, touch, taste and smell. Purity should be observed in such things.*


*Only then will the touch and taste of blissful Brahma come. The impure have no feeling. They have only illusions. The panchakoshams and panchabhutas can only cause the taste of Brahman. Real happiness comes only when there is mental energy. It is beyond trigunas.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు #DailyMessages

Join and Share

Comments


Post: Blog2 Post
bottom of page