top of page
Writer's picturePrasad Bharadwaj

🍀 25 - AUGUST - 2022 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🍀

🌹🍀 25 - AUGUST - 2022 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🍀🌹

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 25, మంగళవారం, ఆగస్టు 2022 బృహస్పతి వాసరే Thursday 🌹

2) 🌹 కపిల గీత - 60 / Kapila Gita - 60 🌹 సృష్టి తత్వము - 16

3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 99 / Agni Maha Purana - 99 🌹

4) 🌹. శివ మహా పురాణము - 615 / Siva Maha Purana -615 🌹

5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 234 / Osho Daily Meditations - 234 🌹

6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 402 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 402 - 1 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹25, August 2022 పంచాగము - Panchagam 🌹*

*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*

*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*

*ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాస శివరాత్రి, Masik Shivaratri 🌻*


*🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రము - 8 🍀*


*8. మందోఽభవిష్యన్నియతం విరించః వాచాం నిధేర్వాంఛితభాగధేయః*

*దైత్యాపనీతాన్ దయయైన భూయోఽపి అధ్యాపయిష్యో నిగమాన్నచేత్త్వమ్ ॥*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : శాస్త్రం బోధించిన సత్యాన్ని నీ ఆత్మలో సాక్షాత్కరించుకొని అనుభవించు. అటు పిమ్మట కావాలనుకుంటే ఆ అనుభవాన్నిబుద్ధితో తర్కించి వాగ్రూపంలో అభివ్యక్తం చెయ్యి. నీకు పరమ ప్రమాణం నీ అనుభవమే. 🍀*


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, శ్రావణ మాసం

దక్షిణాయణం, వర్ష ఋతువు

తిథి: కృష్ణ త్రయోదశి 10:39:52

వరకు తదుపరి కృష్ణ చతుర్దశి

నక్షత్రం: పుష్యమి 16:17:01 వరకు

తదుపరి ఆశ్లేష

యోగం: వరియాన 25:57:09 వరకు

తదుపరి పరిఘ

కరణం: వణిజ 10:36:52 వరకు

వర్జ్యం: 30:17:32 - 32:02:36

దుర్ముహూర్తం : 10:12:22 - 11:02:39

మరియు 15:14:04 - 16:04:21

రాహు కాలం: 13:52:22 - 15:26:39

గుళిక కాలం: 09:09:31 - 10:43:48

యమ గండం: 06:00:57 - 07:35:14

అభిజిత్ ముహూర్తం: 11:53 - 12:43

అమృత కాలం: 09:11:08 - 10:57:36

సూర్యోదయం: 06:00:57

సూర్యాస్తమయం: 18:35:13

చంద్రోదయం: 04:05:14

చంద్రాస్తమయం: 17:31:38

సూర్య సంచార రాశి: సింహం

చంద్ర సంచార రాశి: కర్కాటకం

శుభ యోగం - కార్య జయం 16:17:01

వరకు తదుపరి అమృత యోగం -

కార్య సిధ్ది


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. కపిల గీత - 60 / Kapila Gita - 60🌹*

*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*

*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*2వ అధ్యాయము*


*🌴 2వ అధ్యాయము - సృష్టి తత్వం - 16 🌴*


*16. ప్రభావం పౌరుషం ప్రాహుః కాలమేకే యతో భయమ్

అహఙ్కారవిమూఢస్య కర్తుః ప్రకృతిమీయుషః


*కొందరు కాలమును ప్రత్యేకతత్త్వముగా భావింపక, అది పరమపురుషుని ప్రభావమనియు, లేక ఈశ్వరుని సంహారకారణీ శక్తి అనియు నుడువుదురు. దాని వలన మాయాకార్యరూపములైన దేహాదులయందు ఆత్మాభిమానము కలిగి, జీవుడు అహంకారముచే మోహితుడై, తనను కర్తగా భావించుకొని, నిరంతరము భయగ్రస్తుడగును.*


*కాలమంటే పరమాత్మ యొక్క ప్రభావం (ప్రభావం పౌరుషం - పురుషుని యొక్క ప్రభావం). ప్రకృతికి గానీ జీవునికి గానీ భయము కలిగేది కాలము వలనే. తాను స్వయముగా కల్పించుకున్న ప్రకృతి సంబంధముతో అనుభూతి కోసం ఆచరించే కర్మలే పాప పుణ్యాలు. వీటి సమూహాన్ని బట్టే ఫలం నిర్ణయించబడుతుంది. ప్రతీదానికి నియమిత కాలం ఉంటుంది. అహంకారముతో మూఢుడై కర్తృత్వాన్ని ఆపాదించుకున్న జీవునికి భయము ఈ కాలము వలన. ప్రకృతి భావాన్ని పురుషుడు పొందుతున్నాడు. ప్రకృతిని నేనే అనుకుంటున్నాడు, అహంకార విమూఢుడై. అందువలనే కర్త అయ్యాడు. కర్తృత్వాన్ని తెచ్చిపెట్టుకుంటున్నాడు. అలా కర్తృత్వాన్ని తెచ్చిపెట్టుకునే జీవుడిని భయపెట్టేది ఈ కాలము.*


*సశేషం..*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Kapila Gita - 60 🌹*

*🍀 Conversation of Kapila and Devahuti 🍀*

*✍️ Swami Prabhupada. 📚 Prasad Bharadwaj*


*🌴 2. Fundamental Principles of Material Nature - 16 🌴*


*16. prabhāvaṁ pauruṣaṁ prāhuḥ kālam eke yato bhayam*

*ahaṅkāra-vimūḍhasya kartuḥ prakṛtim īyuṣaḥ*


*The influence of the Supreme Personality of Godhead is felt in the time factor, which causes fear of death due to the false ego of the deluded soul who has contacted material nature.*


*The living entity's fear of death is due to his false ego of identifying with the body. Everyone is afraid of death. Actually there is no death for the spirit soul, but due to our absorption in the identification of body as self, the fear of death develops.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 99 / Agni Maha Purana - 99 🌹*

*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*

*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 32*


*🌻. సంస్కార వర్ణనము 🌻*


అగ్నిదేవుడు చెప్పను : బుద్ధిమంతు డగు పురుషుడు నిర్వాణాదిదీక్షలలో నలబదియోనిమిది సంస్కారములు చేసికొనవలెను. ఆ సంస్కారములను గూర్చి వినుము. వీటిచే మనుష్యుడు దేవతాతుల్యు డగును.


మొట్టమొదట యోనిలో, గర్భాధానము. పిమ్మట (2) పుంసవన సంస్కారము చేయవలెను: పిమ్మట (3) సీమంతోన్నయనము, (4) జాతకర్మ (5) నామకరణము (6) అన్నప్రాశనము (7) చూడాకర్మ (8) బ్రహ్మచర్యము (9) వైష్ణవి (10) పార్థి (11) భౌతిక (12) శ్రౌతికి అను నాలుగు బ్రహ్మచర్యవ్రతములు,


(13) గోదానము (14) సమావర్తనము (15) అష్టక (16) అన్వష్టక (17) పార్వణశ్రాద్ధము (18) శ్రావణి (19 ఆగ్రహాయణి (20) చైత్రి (21) ఆశ్యయుజి అను ఏడు పాకయజ్ఞములు, (22) ఆధానము (23) అగ్ని హోత్రము (24) దర్శము


(25) పౌర్ణమాసము (26) చాతుర్మాస్యము (27) పశుబంధము (28) సౌత్రామణి అను ఏడు హవిర్యజ్ఞములు (29) యజ్ఞములలో శ్రేష్ఠ మైన దగు అగ్నిష్టోమము (30) అత్యగ్నిష్టోమము (31) ఉక్థ్యము (32) షోడశి (33) వాజపేయము (34) అతిరాత్రము (35) అప్తోర్యామముఅను ఏడు సోమసంస్థలు, (36) హిరణ్యాంఘ్రి


(37) హిరణ్యాక్షము (38) హిరణ్యమిత్రము (39) హిరణ్యపాణి (40) హేమాక్షము (41) హేమాంగము (42) హేమసూత్రము (43) హిరణ్యాస్యము (44) హిరణ్యాంగము (45) హేమజిహ్వము (46) హిరణ్యవత్తు


(47) అన్ని యజ్ఞములకును అధిపతి యైన (1) అశ్వమేధము అను సహస్రేశయజ్ఞములు, సర్వభూతదయ, క్షమ, ఋజుత్వము, శౌచము, అనాయాసము, మంగళము, అకార్పణ్యము, అస్పృహ అను ఎనిమిది గుణములు. ఈ సంస్కారములను చేయవలెను.


ఇష్టదేవతామూలమంత్రమున నూరు ఆహుతు లివ్వవలెను. సౌర-శాక్త-వైష్ణవ-శైవ దీక్షలలో అన్నింటియందును ఇవి సమానమే. ఈ సంస్కారములచే సంస్కృతు డగు పురుషుడు భోగములను, మోక్షమును కూడ పొందును. సమస్తరోగములచే విముక్తుడై దేవతాపురుషుడు వలె నుండును. మునుష్యునకు ఇష్టదేవతామంత్ర జప-హోమ-పూజా-ధ్యానములచే ఆభీష్టప్రాప్తి కలుగును.


ఆగ్నేయమహాపురాణమునందలి సంస్కారవర్ణన మను ముప్పదిరెండవ అధ్యాయము సమాప్తము,


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Agni Maha Purana - 99 🌹*

*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *


*Chapter 32*

*🌻 Narration about the purificatory rites 🌻*


Agni said:

I. An intelligent man has to do forty-eight purificatory rites[1] among the initiatory rites for attaining liberation. You hear them, by which one may become a celestial.


2. One has to perform garbhādhāna as soon as the conception takes place, then the puṃsavana[2] rite, the simantonnayana[3], the jātakarma[4], and the naming ceremony.


3. (One has to perform the rites of) giving food (to the new born child), then the tonsure, and the brahmacarya (the life of celibacy practised by a boy while studying the Vedas). (One has to perform) the four (rites)—the vaiṣṇavī, pārthī, bhautikī and śrautī[5], and making a gift of cows, entering the life of a householder after completing one’s vedic studies.


4-7. The seven kinds of Pākayajñas[6] are aṣṭakā, pārvaṇaśrāddha, śrāvaṇī, āgrayaṇī, caitrī and āśvayujī. The Haviryajñas[7] are seven. (You) hear them. (They) are (agni) ādhāna, agnihotra, darśapūrṇamāsa, cāturmāsya, paśubandha, and sautrāmaṇi. (You) hear the seven kinds of Somasaṃsthās[8] agniṣṭoma the excellent sacrifice atyagniṣṭoma, uktha, ṣoḍaśī, vājapeya, atirātra and aptoryāma. These are of thousand kinds.


8-9. They are hiraṇyāṅghri, hiraṇyākṣa, hiraṇyamitra, hiraṇyapāṇi, hemākṣa, hemāṅga, hemasūtraka, hiraṇyāsya, hiraṇyāṅga, hemajihva, and hiraṇyavat. The aśvamedha is the excellent among them. Now you hear the eight virtues.


10-11. They are—compassion towards all beings, forbearance, sincerity, purity, ease, wishing the welfare of all, liberality and freedom from avarice. A hundred oblations are to be offered with the basic mystic syllable. The same procedure is to be followed in the initiation (ceremony) related to Saura, Śakti (the female deity) and Viṣṇu.


12. Being purified by these purificatory rites, one may get enjoyment, release (from bondage). Such a man becoming free from diseases remains like a god. By the recitation (of the names of god), by offering oblations and by worship and meditation on the deity one gets his cherished desire.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹 . శ్రీ శివ మహా పురాణము - 614 / Sri Siva Maha Purana - 614 🌹*

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 08 🌴*

*🌻. దేవాసుర యుద్ధము - 2 🌻*


వీరుడు, గొప్ప తేజశ్శాలి యగు వీరభద్రుడు కూడా భయంకరమైన వాడియైన త్రిశూలముతో వెంటనే తారకుని కొట్టెను (13) . రాక్షసశ్రేష్టుడు, బలశాలి, వీరులకు ఆదరణీయుడు అగు ఆ తారకుడు కూడ తరువాత యుద్దములో వీరభద్రుని శక్తితో కొట్టెను (14). యుద్ధ విద్యలో నేర్పరులగు వారిద్దరు ఈవిధముగా యుద్ధరంగములో అనేక విధములగు శస్త్రాస్త్రములతో యుద్ధమును చేయుచూ పరస్పరము హింసించుకొనిరి (15).


అపుడచట అందరు చూచుచుండగా ఆ ఇద్దరు మహావీరుల మధ్య శరీరము గగుర్పొడిచే భయంకరమగు యుద్ధము జరిగెను (16). అపుడు భేరీలు, మృదంగములు, పటహములు, ఆనకములు, గోముఖములు అను వాద్యములను వీరులు మ్రోగించిరి. ఆ శబ్దము వినువారలకు మిక్కిలి బీతిని గొల్పెను (17). దెబ్బలతో శిథిలమైన దేహములు గల వారిద్దరు యుద్దమునకు మరల సన్నద్ధులై బుధాంగారకుల వలె మహవేగముతో ద్వంద్వయుద్ధమును చేసిరి (18). వీరభద్రునకు వానితో జరుగు చున్న ఈ యుద్ధమును చూచి, శివునకు ప్రియుడవగు నీవు అచటకు వెళ్లి వీరభద్రునితో ఇట్లు పలికితివి (19).


నారదుడిట్లు పలికెను -


వీరభద్రా! మహావీరా! నీవు గణములలో అగ్రేసరుడవు. ఈ యుద్ధమునుండి వెనుకకు మరలుము. నీవు వధించగలవని తోచుట లేదు (20). నీ ఈ మాటను విని గణాధ్యక్షుడు, కోపముతో ఆవేశమును పొంది యున్నవాడు అగు వీరభద్రుడు అపుడు చేతులను జోడించి నీతో ఇట్లు పలికెను (21).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 SRI SIVA MAHA PURANA - 614🌹*

*✍️ J.L. SHASTRI*

*📚. Prasad Bharadwaj *


*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 08 🌴*


*🌻 The battle between the gods and Asuras - 2 🌻*


13. In the same manner, the heroic Vīrabhadra of great brilliance hit Tāraka with his sharp terrible trident.


14. The powerful king of the Asuras, the heroic Tāraka, hit Vīrabhadra[1] again with spear.


15. Fighting each other thus they hit each other with various weapons and missiles both being equally skilful in the art of warfare.


16. Even as others stood gazing, the two of great energy continued their duel causing hair to stand on ends, with tumultuous noise.


17. Then various military bands and drums like Bherīs, Mṛdaṅgas, Paṭahas, Āṇakas and Gomukhas were sounded by the soldiers terrifying those who happened to hear.


18. Both of them were severely wounded by the mutual hits and thrusts but still they continued their fight with added vigour like Mercury and Mars.


19. On seeing the fight between him and Vīrabhadra, you, the favourite of Śiva went there and said to Vīrabhadra,

Nārada said:—


20. “O Vīrabhadra, of great heroism, you are the leader of the Gaṇas. Please desist from this fight. Your killing him does not fit in properly”.


21. On hearing your words, the leader of the Gaṇas Vīrabhadra became furious but spoke to you with palms joined in reverence.


Continues....

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹







*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 234 / Osho Daily Meditations - 234 🌹*

*📚. ప్రసాద్ భరద్వాజ*


*🍀 234. ఆదర్శాలు 🍀*


*🕉. గొప్ప ఆదర్శాలను బోధించినప్పుడల్లా, ప్రజలు మురికిగా మరియు దోషిత్వాన్ని అనుభవిస్తారు. ఎందుకంటే ఆ ఆదర్శాలు అవివేకమైనవి మరియు అసాధ్యం; వాటిని ఎవరూ నెరవేర్చలేరు. 🕉*

*ఆదర్శాలతో, మీరు ఏమి చేసినా, మీరు ఎల్లప్పుడూ తక్కువగా ఉంటారు, మీరు ఎల్లప్పుడూ వైఫల్యం చెందుతారు, ఎందుకంటే ఆదర్శం అసాధ్యం. ఇది అమానుషం. వారు దానిని 'అతీతం' అంటారు - కానీ అది స్వీయ హింస అవుతుంది, ఆపై మీరు ఏమి చేసినా తప్పు. అదే మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. కాబట్టి ఆదర్శాలను వదిలివేయండి మరియు కేవలం ఉండండి. వాస్తవికవాదిగా మారండి. మీరు వాస్తవికవాదిగా మారిన తర్వాత, ప్రతిదీ అందంగా మరియు పరిపూర్ణంగా కనిపిస్తుంది.*


*మీకు పరిపూర్ణత యొక్క ఆదర్శం లేనప్పుడు, ప్రతిదీ పరిపూర్ణంగా ఉంటుంది, ఎందుకంటే దానిని పోల్చడానికి మరియు ఖండించడానికి ఏమీ లేదు. ఖండించడానికి నాకు ఏమీ కనిపించడం లేదు. కానీ శతాబ్దాలుగా మనస్సు ఉంది. ఖండించాలని షరతు విధించారు. రాజకీయ నాయకుడు మరియు పూజారుల చేతిలో అది గొప్ప వ్యూహం - వారు మీలో అపరాధాన్ని సృష్టిస్తారు, ఆపై వారు మిమ్మల్ని మార్చగలరు. మనిషిని తారుమారు చేయడం అనేది ఒక వ్యక్తి చేయగలిగే అతి నీచమైన నేరం.*

*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations - 234 🌹*

*📚. Prasad Bharadwaj*


*🍀 234. IDEALS 🍀*


*🕉. Whenever people are taught great ideals, they start feeling dirty and guilty. Because those ideals are foolish and impossible; nobody can fulfill them. 🕉*

*With ideals, no matter what you do, you always fall short, you are always a failure, because the ideal is impossible. It is inhuman. They call it "superhuman"- it is inhuman! But it becomes a self-torture, and then whatever you do is wrong. That's what can create trouble for you. So drop ideals and just be. Become a realist. Once you become a realist, everything seems to be just beautiful and perfect.*


*When you don't have any ideal of perfection, everything is perfect because there is nothing with which to compare and condemn it. I don't see anything to condemn. But for centuries the mind has been conditioned to condemn. That's a great strategy in the hands of the politician and the priests-they create guilt inside you, and then they can manipulate you. To manipulate a human being is the worst crime one can commit.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 402 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 402 - 1 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*


*🍀 87. వ్యాపినీ, వివిధాకారా, విద్యాఽవిద్యా స్వరూపిణీ ।

మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ ॥ 87 ॥ 🍀*


*🌻 402. 'విద్యా అవిద్యా స్వరూపిణి' - 1 🌻*


*శ్రీమాత విద్యా స్వరూపిణీయే గాక, అవిద్యా స్వరూపిణి యని కూడ అర్థము. విద్యను, అవిద్యను రెండింటిని ఎఱుంగువాడు మృత్యువును దాటి అమృతత్త్వము ననుభవించు చుండును. సృష్టి యందలి ద్రవ్య మంతయూ నశించు చుండును. ఇంద్రియ ప్రవృత్తులునూ అట్లే తాత్కాలికములు. గుణములు కూడ ప్రాకృత సంబంధములే. గుణములు, ఇంద్రియములు, రూపములు మూడును ప్రకృతి సంబంధితములు. అనుభూతికి ఈ మొత్తము వేదిక.*


*జీవుడు పరమాత్మ నుండి వ్యక్తమైన అంశ. ప్రకృతి కూడ పరమాత్మ నుండి వ్యక్తమైనదే. మూలప్రకృతి అష్టప్రకృతిగ మారి జీవుని అనుభూతికి వేదిక యగు చున్నది. వేదిక శాశ్వతము కాదు. అది అవిద్యా స్వరూపము. జీవుడు శాశ్వతుడు. మూలప్రకృతి, దాని కాధారమైన పరతత్వము శాశ్వతము. మూల ప్రకృతి, పరతత్వములతో అనుసంధానము చెందు ఆత్మ విద్యా స్వరూపమై యుండును.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 402 -1🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*📝. Prasad Bharadwaj*


*🌻 87. Vyapini vividhakara vidya vidya svarupini

Mahakameshanayana kumudahlada kaomudi ॥ 87 ॥ 🌻*


*🌻 402. 'Vidya Avidya Swarupini' - 1 🌻*


*This means that Mata is the personification of wisdom, and also the personification of ignorance. He who knows both education and ignorance will go beyond death and experience immortality. All the riches and sensualities in this Creation shall perish. Gunas are also natural(prakritic) tendencies. Gunas, senses and forms are related to nature. This whole platform for experience.*


*The Self is a manifestation of the Supreme Being and so is nature. The primordial nature expressed itself in eight forms and formed a basis for experience. The basis is not permanent. It is a form of ignorance. The self is eternal. Primordial nature, and its associated philosophy is eternal. The soul, which connects the primordial aspects of nature, with its philosophies is the personification of wisdom.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

コメント


Post: Blog2 Post
bottom of page