🌹 25 - JULY - 2022 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 25, జూలై 2022 సోమవారం, ఇందు వాసరే Monday 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 237 / Bhagavad-Gita - 237 - 6- 04 ధ్యాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 636 / Vishnu Sahasranama Contemplation - 636 🌹
4) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 215 🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 315 / DAILY WISDOM - 315 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹25, July 2022 పంచాగము - Panchangam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : ప్రదోషవ్రతం, Pradosh Vrat 🌻*
*🍀. రుద్రనమక స్తోత్రం - 34 🍀*
*65. హరిత్యాయ నమస్తుభ్యం హరిద్వర్ణాయ తే నమః!*
*నమ ఉర్మ్యాయ సూర్మ్యాయ పర్ణ్యాయ చ నమోనమః!!*
*66. నమోపగుర మాణాయ పర్ణశద్యాయ తే నమః!*
*అభిఘ్నతే చాఖ్ఖిదతే నమః ప్రఖ్ఖిదతే నమః!!*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : భగవానుని స్వరూప జ్ఞానం కలవానినీ, భగవానుని యెడ అనురాగం కలవానినీ రూపొందించిన వారు భారతీయులు. అనురాగంతో కూడిన సమర్పణా భావనలో ఆనందించిన వారు భారతీయులు.🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, ఆషాడ మాసం
దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: కృష్ణ ద్వాదశి 16:17:10 వరకు
తదుపరి కృష్ణ త్రయోదశి
నక్షత్రం: మృగశిర 25:06:36 వరకు
తదుపరి ఆర్ద్ర
యోగం: ధృవ 15:03:56 వరకు
తదుపరి వ్యాఘత
కరణం: తైతిల 16:16:09 వరకు
వర్జ్యం: 04:20:10 - 06:08:30
దుర్ముహూర్తం: 12:48:29 - 13:40:24
మరియు 15:24:14 - 16:16:10
రాహు కాలం: 07:30:28 - 09:07:49
గుళిక కాలం: 13:59:52 - 15:37:13
యమ గండం: 10:45:10 - 12:22:31
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:47
అమృత కాలం: 15:10:10 - 16:58:30
సూర్యోదయం: 05:53:06
సూర్యాస్తమయం: 18:51:56
చంద్రోదయం: 02:46:39
చంద్రాస్తమయం: 16:23:32
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: వృషభం
ఆనంద యోగం - కార్య సిధ్ధి 25:06:36
వరకు తదుపరి కాలదండ యోగం
- మృత్యు భయం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 237 / Bhagavad-Gita - 237 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 04 🌴*
*04. యదా హి నేన్ద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే |*
*సర్వసంకల్పసన్న్యాసీ యోగారూఢస్తదోచ్యతే ||*
🌷. తాత్పర్యం :
*విషయకోరికల నన్నింటిని విడిచి ఇంద్రియప్రీతి కొరకు వర్తించుట గాని, కామ్యకర్మలందు నియుక్తుడగుట గాని చేయని మనుజుడు యోగారూఢుడని చెప్పబడును.*
🌷. భాష్యము :
మనుజుడు శ్రీకృష్ణభగవానుని దివ్యమైన ప్రేమయుక్తసేవ యందు సంపూర్ణముగా నియుక్తుడైనపుడు తన యందే ఆనందము ననుభవించును కావున ఇంద్రియభోగమునందు కాని, కామ్యకర్మలందు కాని ఎన్నడును రతుడు కాడు. కర్మ కర్మ చేయక ఎవ్వరును ఉండలేనందున అట్లు కృష్ణభక్తిపరాయణుడు కానిచో మనుజుడు ఇంద్రియభోగరతుడు కావలసివచ్చును.
కృష్ణభక్తిభావన లేనప్పుడు ప్రతియొక్కరు తన కొరకు గాని లేదా తనవారి కొరకు గాని సంబంధించిన స్వార్థపూరిత కర్మల యందు పాల్గొనుచుందురు. కాని కృష్ణభక్తిపరాయణుడు మాత్రము ప్రతిదియు శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే ఒనరించును ఇంద్రియభోగము నుండి పూర్ణముగా దూరుడై యుండును. అట్టి అనుభవము లేనివాడు యోగమను నిచ్చెన యొక్క చివరిమెట్టును చేరుటకు ముందు యాంత్రికమైన విధానము ద్వారా విషయవాంఛల నుండి బయటపడుటకు యత్నించ వలసి యుండును.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 237 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 6 - Dhyana Yoga - 04 🌴*
*04. yadā hi nendriyārtheṣu na karmasv anuṣajjate*
*sarva-saṅkalpa-sannyāsī yogārūḍhas tadocyate*
🌷 Translation :
*A person is said to be elevated in yoga when, having renounced all material desires, he neither acts for sense gratification nor engages in fruitive activities.*
🌹 Purport :
When a person is fully engaged in the transcendental loving service of the Lord, he is pleased in himself, and thus he is no longer engaged in sense gratification or in fruitive activities. Otherwise, one must be engaged in sense gratification, since one cannot live without engagement. Without Kṛṣṇa consciousness, one must be always seeking self-centered or extended selfish activities. But a Kṛṣṇa conscious person can do everything for the satisfaction of Kṛṣṇa and thereby be perfectly detached from sense gratification. One who has no such realization must mechanically try to escape material desires before being elevated to the top rung of the yoga ladder.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 636/ Vishnu Sahasranama Contemplation - 636🌹*
*🌻636. విశుద్ధాత్మా, विशुद्धात्मा, Viśuddhātmā🌻*
*ఓం విశుద్ధాత్మనే నమః | ॐ विशुद्धात्मने नमः | OM Viśuddhātmane namaḥ*
*అసావాత్మా విశుద్ధశ్చ విశుద్ధాత్మేతి కథ్యతే*
*గుణత్రయాతీతుడు కావున విశుద్ధమగు ఆత్మ స్వరూపము గల ఆ పరమాత్మ విశుద్ధాత్మగా పిలువబడును.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 636🌹*
*🌻636. Viśuddhātmā🌻*
*OM Viśuddhātmane namaḥ*
असावात्मा विशुद्धश्च विशुद्धात्मेति कथ्यते /
*Asāvātmā viśuddhaśca viśuddhātmeti kathyate*
*Since He is beyond the three guṇas, He is Viśuddha or pure. Since His is the purest ātma or soul, He is Viśuddhātmā.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अर्चिष्मान्अर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः ।अनिरुद्धोऽप्रतिरथः प्रद्युम्नोऽमितविक्रमः ॥ ६८ ॥
అర్చిష్మాన్అర్చితః కుమ్భో విశుద్ధాత్మా విశోధనః ।అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ॥ 68 ॥
Arciṣmānarcitaḥ kumbho viśuddhātmā viśodhanaḥ,Aniruddho’pratirathaḥ pradyumno’mitavikramaḥ ॥ 68 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 215 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. శూన్యంగా వుండండి. అది అసాధారణ అనుభవం. ఏమీ కానీతనంగా వుండంలో హెచ్చుతగ్గులొద్దు. పోటీలు వద్దు. వ్యక్తి మౌనంగా, వినయంగా, ఎవరూ కానితనంగా వుంటే అప్పుడు స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి.🍀*
*ఒకడు ఏమీ కావాలని అనుకోనప్పుడు, ఎవరూ కావాలని అనుకోనప్పుడు ఒకడు గొప్ప వాడవుతాడు. శూన్యంగా వుండండి. అది అసాధారణ అనుభవం. ఏమీ కానీతనంగా వుండంలో హెచ్చుతగ్గులొద్దు. పోటీలు వద్దు. అది గొప్పతనానికి, ఔన్నత్యానికి అర్థం కాదు. ఔన్నత్యమన్నది సహజంగా వచ్చేది. అది లక్ష్యం కాదు, అంతం కాదు. అది పరిమళం లాంటిది. పువ్వే దానికి అంతం. అక్కడ నీ చైతన్యం పరిమళిస్తుంది.*
*పరిమళాన్ని వెతుకుతూ పువ్వును మరచి పోకూడదు. పువ్వుని అన్వేషిస్తే పరిమళం దానంతట అదే వస్తుంది. వ్యక్తి మౌనంగా, వినయంగా, ఎవరూ కానితనంగా వుంటే అప్పుడు స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. అప్పుడు నువ్వు స్వర్గానికి అతిథి అవుతావు. అప్పుడు నువ్వు జీవితంలోని ఉన్నతోన్నత శిఖరాన్ని అధిరోహిస్తావు.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 315 / DAILY WISDOM - 315 🌹*
*🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻 10. అత్యున్నత తపస్సు అంటే భగవంతుడిలా ఆలోచించడం 🌻*
*తపస్సు అనేది కేంద్రీకృత శక్తి. ఇంద్రియాలు శక్తిని వెలుపల వస్తువుల దిశలో మళ్లించకుండా నిరోధించడం ద్వారా వ్యక్తిత్వంలో ఉత్పన్నమయ్యే శక్తి. మీ శక్తి యొక్క సంపూర్ణ భాండాగారం అయిన మీ వ్యక్తిత్వ చైతన్యం, మీరు ఒక వస్తువును చూసినప్పుడు, విన్నప్పుడు, వాసన చూసినప్పుడు, రుచి చూసినప్పుడు, స్పర్శించినప్పుడు లేదా ఒక విషయాన్ని ఆలోచించినప్పుడు జ్ఞానేంద్రియాల ద్వారా బాహ్య వస్తువుల వైపు మళ్లించ బడుతుంది. మీరు ఈ వ్యక్తిత్వ చైతన్యాన్ని చూడకుండా, వినకుండా, వాసన చూడకుండా, రుచి చూడకుండా, స్పర్శించకుండా లేదా ఏ విధమైన బాహ్యతను ఆలోచించకుండా అడ్డుకుంటే, మీ వ్యక్తిత్వం నుండి శక్తి బయటకు వెళ్లదు. ఇది అంతర్ముఖం అవుతుంది. అప్పుడు మీరు దృఢంగా, శక్తివంతంగా ఉన్నట్లు భావిస్తారు.*
*ఈ ప్రక్రియను తపస్సు అని పిలుస్తారు, ఇది శక్తి యొక్క అంతర్గతీకరణ. అనుభవ శూన్యులకు, తపస్సు గురించి ఇంత అవగాహన ఉంటే సరిపోతుంది, కానీ అత్యున్నత తపస్సు అంటే భగవంతునిలా ఆలోచించడం. భగవంతుడు ఆలోచించినట్లు మీరు ఆలోచించగలిగితే, అదే గొప్ప తపస్సు. దేవుడు ఎలా ఆలోచిస్తాడో మీరు ఊహించవచ్చు; అతను ఏ జ్ఞానేంద్రియాలను ఉపయోగించకుండా, అంటే కళ్ళు, చెవులు, ముక్కు మొదలైనవాటిని ఉపయోగించకుండా నేరుగా మొత్తం విశ్వాన్ని ఒకే ఆలోచనలో ఆలోచిస్తాడు. అతని ఉనికి అతని భావన; అతని భావన మరియు అతని ఉనికి ఒకేలా ఉంటాయి. మానవుల విషయంలో, ఆలోచన అనేది ఒక వస్తువు, కానీ భగవంతుని విషయంలో, ఆలోచన స్వయంగా తానే అయి ఉండటం.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 315 🌹*
*🍀 📖 from Your Questions Answered 🍀*
*📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj*
*🌻 10. The Highest Tapas is to Think like God Himself 🌻*
*Tapas is energy and heat, a force generated in the personality by preventing the sense organs from diverting energy outside in the direction of objects. The consciousness, the total quantum of your energy, is diverted by the sense organs outside towards objects of sense when you see a thing, hear, smell, taste, touch, or even think a thing. If you prevent the consciousness from seeing, hearing, smelling, tasting, touching or even thinking an externality of any kind, the energy will not go out of your personality. It will be retained inside.*
*Then you will feel strong, energetic, forceful. This process is called tapas, an inwardisation of power. For the beginner, this much understanding about tapas is sufficient, but the highest tapas is to think like God Himself. When you can think as God thinks, that is the greatest tapas. You can imagine how God thinks; He will think in one Thought the whole cosmos directly, without the use of any sense organs, i.e. eyes, ears, nose, etc. His very Being is His Thought; His Thought and His Being are identical. In the case of human beings, thought is of an object, but in the case of God, Thought is of Being Itself.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Comments