top of page
Writer's picturePrasad Bharadwaj

25 - JUNE - 2022 SATURDAY MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 25, జూన్ 2022 శనివారం, స్థిర వాసరే Saturday 🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 222 / Bhagavad-Gita - 222 - 5- 18 కర్మ యోగము🌹

3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 621 / Vishnu Sahasranama Contemplation - 621🌹

4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 300 / DAILY WISDOM - 300 🌹

5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 200 🌹

6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 139 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹25, June 2022 పంచాగము - Panchagam 🌹*

*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*

*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*

*ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*


*🍀. శ్రీ శని స్తోత్రం (దశరథ కృతం) - 2 🍀*


*3. నమః పౌరుషగాత్రాయ స్థూలరోమాయ తే నమః |*

*నమో నిత్యం క్షుధార్తాయ నిత్యతృప్తాయ తే నమః*

*4. నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కరాళినే |*

*నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోఽస్తు తే*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : అపరిగ్రహము పాటిస్తే పూర్వజన్మ స్మృతులు అన్నీ వస్తాయి. 12 సంవత్సరములు సత్యము పాటిస్తే ఏది అంటే అది జరుగుతుంది. - మాస్టర్‌ ఆర్‌.కె. 🍀*


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, జేష్ఠ మాసం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

తిథి: కృష్ణ ద్వాదశి 25:11:42 వరకు

తదుపరి కృష్ణ త్రయోదశి

నక్షత్రం: భరణి 10:24:59 వరకు

తదుపరి కృత్తిక

యోగం: ధృతి 29:54:17 వరకు

తదుపరి శూల

కరణం: కౌలవ 12:10:33 వరకు

వర్జ్యం: 23:45:00 - 25:31:48

దుర్ముహూర్తం: 07:28:58 - 08:21:39

రాహు కాలం: 09:01:09 - 10:39:54

గుళిక కాలం: 05:43:37 - 07:22:23

యమ గండం: 13:57:26 - 15:36:11

అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:44

అమృత కాలం: 05:08:00 - 06:53:20

సూర్యోదయం: 05:43:37

సూర్యాస్తమయం: 18:53:43

చంద్రోదయం: 02:41:42

చంద్రాస్తమయం: 15:50:34

సూర్య సంచార రాశి: జెమిని

చంద్ర సంచార రాశి: మేషం

ధ్వాo క్ష యోగం - ధన నాశనం, కార్య హాని

10:24:59 వరకు తదుపరి ధ్వజ యోగం

- కార్య సిధ్ధి


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹

#పంచాగముPanchangam

Join and Share


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. శ్రీమద్భగవద్గీత -222 / Bhagavad-Gita - 222 🌹*

*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*

*📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 18 🌴*


*18. విద్యావినయసమ్పన్నే బ్రాహ్మణే గవి హస్తిని |*

*శుని చైవ శ్వపాకే చ పణ్డితా: సమదర్శిన: ||*


🌷. తాత్పర్యం :

*వినమ్రులైన యోగులు యథార్థమైన జ్ఞానము కలిగిన వారగుటచే విద్యావినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, గోవుని, ఏనుగును, శునకమును, శునకమాంసము తినువానిని(చండాలుని) సమదృష్టితో వీక్షింతురు.*


🌷. భాష్యము :

కృష్ణభక్తిభావన యందున్నవాడు జాతి, కుల విచక్షణను చూపడు. సంఘదృష్టిలో బ్రహ్మణుడు మరియు చండాలుడు వేరు కావచ్చును. ఆలాగుననే కుక్క, గోవు, ఏనుగు మొదలుగునవి జాతిదృష్టిలో వేరుకావచ్చును. కాని ఈ విధమైన దేహపరభేదములు జ్ఞానవంతుడైన యోగి దృష్టిలో అర్థరహితములు. పరమాత్మ రూపున శ్రీకృష్ణభగవానుడు వాటన్నింటి యందును నిలిచి వాటితో సంబంధమును కలిగియుండుటే అందులకు కారణము. భగవానుని గూర్చిన అట్టి అవగాహనయే నిజమైన జ్ఞానమై యున్నది.


భగవానుడు ప్రతిజీవిని కూడా మిత్రునిగా భావించు కారణమున దేహములు వివిధవర్ణములు లేదా జాతులు యందున్నను అతడు మాత్రము సమభావము కలిగియుండును. జీవుల స్థితులతో నిమిత్తములేక అతడు సర్వుల యందును పరమాత్మరూపున వసించియుండును. బ్రహ్మణుడు మరియు చండాలుని దేహములు సమానములు కాకున్నను పరమాత్మ రూపున భగవానుడు ఆ రెండింటి యందును నిలిచియుండును. దేహములనునవి ప్రక్రుతిజన్యత్రిగుణముల ద్వారా రూపొందినవైనను, దేహము నందుండెడి ఆత్మా, పరమాత్మ మాత్రము ఒకే ఆధ్యాత్మికతను కలిగియున్నట్టివి.


సమాన ఆధ్యాత్మికతను కలిగియున్నప్పటికిని ఆత్మ, పరమాత్మ పరిమాణరీతిని ఎన్నడును సమానములు కావు. ఏలయన జీవాత్మ తాను నిలిచియున్న దేహమునకే పరిమితము చెందియుండగా, పరమాత్మ ప్రతిజీవి దేహమునందు నిలిచియుండును. కృష్ణభక్తిరసభావితుడు ఈ జ్ఞానమును సంపూర్ణముగా కలిగియుండుటచే నిక్కముగా జ్ఞానవంతుడును మరియు సమదృష్టి కలవాడును అయియుండును. చైతన్యము, సనాతనత్వము, ఆనందమయత్వము అనునవి ఆత్మ, పరమాత్మల ఒకేరీతి లక్షణములు. కాని వాటి నడుమ గల బేధమేమనగా ఆత్మ తాను నిలిచి యున్న దేహపరిధిలో చేతనము కలిగియుండగా, పరమాత్మ సర్వదేహములు జ్ఞానమును కలిగియుండును. అట్టి పరమాత్మ సర్వదేహములందు ఎట్టి విచక్షణలేక నిలిచియుండును.

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 222🌹*

*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*

*📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 5 - Karma Yoga - 18 🌴*


*18. vidyā-vinaya-sampanne brāhmaṇe gavi hastini*

*śuni caiva śva-pāke ca paṇḍitāḥ sama-darśinaḥ*


🌷 Translation :

*The humble sages, by virtue of true knowledge, see with equal vision a learned and gentle brāhmaṇa, a cow, an elephant, a dog and a dog-eater [outcaste].*


🌹 Purport :

A Kṛṣṇa conscious person does not make any distinction between species or castes. The brāhmaṇa and the outcaste may be different from the social point of view, or a dog, a cow and an elephant may be different from the point of view of species, but these differences of body are meaningless from the viewpoint of a learned transcendentalist. This is due to their relationship to the Supreme, for the Supreme Lord, by His plenary portion as Paramātmā, is present in everyone’s heart. Such an understanding of the Supreme is real knowledge.


As far as the bodies are concerned in different castes or different species of life, the Lord is equally kind to everyone because He treats every living being as a friend yet maintains Himself as Paramātmā regardless of the circumstances of the living entities. The Lord as Paramātmā is present both in the outcaste and in the brāhmaṇa, although the body of a brāhmaṇa and that of an outcaste are not the same. The bodies are material productions of different modes of material nature, but the soul and the Supersoul within the body are of the same spiritual quality.


The similarity in the quality of the soul and the Supersoul, however, does not make them equal in quantity, for the individual soul is present only in that particular body whereas the Paramātmā is present in each and every body. A Kṛṣṇa conscious person has full knowledge of this, and therefore he is truly learned and has equal vision. The similar characteristics of the soul and Supersoul are that they are both conscious, eternal and blissful. But the difference is that the individual soul is conscious within the limited jurisdiction of the body whereas the Supersoul is conscious of all bodies. The Supersoul is present in all bodies without distinction.

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 621 / Vishnu Sahasranama Contemplation - 621🌹*

*📚. ప్రసాద్ భరద్వాజ*


*🌻621. అవిధేయాఽఽత్మా, अविधेयाऽऽत्मा, Avidheyā’’tmā🌻*


*ఓం విధేయాత్మనే నమః | ॐ विधेयात्मने नमः | OM Vidheyātmane namaḥ*


*నకేనాపి విధేయోఽయం స్వాత్మేతి పరమేశ్వరః ।*

*అవిధేయాత్మేతి హరిరచ్యుతే విదుషాం వరైః ॥*


*విధి అనగా ఇది ఇట్లు ఉన్నది. ఇది ఇట్లు ఉండును; ఇది ఇట్లు చేయుము అని చెప్పుట. ఈ విధముగ చెప్పుటనే విధానము అందురు; ఈ విధమున విధానమును విధిని చేయుటకు యోగ్యుడుకానీ, శక్యుడుకానీ 'విధేయః' అనబడును. అట్లు విధేయముకాని ఆత్మ స్వరూపము ఎవనిదియో అట్టివాడు. పరమాత్ముని స్వరూపము ఇట్టిది అని చెప్ప శక్యముకాదు. నీవు ఇది ఇట్లు చేయుము అని ఎవరిచేతను విధీంచబడుటకు అతడు శక్యుడు కానివాడు.*


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 621🌹*

*📚. Prasad Bharadwaj*


*🌻621. Avidheyā’’tmā🌻*


*OM Vidheyātmane namaḥ*


नकेनापि विधेयोऽयं स्वात्मेति परमेश्वरः ।

अविधेयात्मेति हरिरच्युते विदुषां वरैः ॥


*Nakenāpi vidheyo’yaṃ svātmeti parameśvaraḥ,*

*Avidheyātmeti hariracyute viduṣāṃ varaiḥ.*


*The One whose ātma or nature is not under the sway of anybody.*


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

स्वक्षस्स्वङ्गश्शतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः ।विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्छिन्नसंशयः ॥ ६६ ॥


స్వక్షస్స్వఙ్గశ్శతానన్దో నన్దిర్జ్యోతిర్గణేశ్వరః ।విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్నసంశయః ॥ 66 ॥


Svakṣassvaṅgaśśatānando nandirjyotirgaṇeśvaraḥ,Vijitātmā vidheyātmā satkīrtiśchinnasaṃśayaḥ ॥ 66 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹

#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 300 / DAILY WISDOM - 300 🌹*

*🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀*

*📝 .స్వామి కృష్ణానంద*

*📚. ప్రసాద్ భరద్వాజ*


*🌻 26. ఏది వాస్తవమో అది అవాస్తవమై పోయింది 🌻*


*ఈ తప్పుడు వ్యక్తిత్వం యొక్క కుప్పలు కుప్పలు తప్పుడు అవగాహనలు ఒకదానితో ఒకటి సమూహ పరచబడి ఒక అజేయమైన కోట సృష్టించబడింది. ఇప్పుడు గుర్రం ముందు బండి ఉన్నట్లు కనిపిస్తోంది-అసత్యమైనది వాస్తవమైంది, మరియు అవాస్తవమైనది సత్యమైంది. కారణం పరిణామమైనది మరియు పరిణామం కారణమైంది. విశ్వం గ్రాహ్యం అయింది మరియు వ్యక్తిత్వం గ్రహించే వస్తువైంది. వ్యక్తిత్వం గ్రహణానికి, అనుభూతికి కారణంగా పరిగణించ బడుతోంది. అది పరిణామక్రమంలో ఎదిగే వస్తువు అనే విషయం విస్మరించబడింది.*


*అవి విశ్వరూపమైన సత్య పదార్ధం కంటే ముందుకు వచ్చాయి. ఐతరేయ ఉపనిషత్తులో కారణం ఎలా ప్రభావంగా మారవచ్చు మరియు ప్రభావం ఒక వంకర టింకర అవగాహన వల్ల కారణంగా ఎలా అవుతుందనేది చాలా అందంగా వివరించారు. ఈ పరిస్థితి కారణంగా ప్రతిదీ గందరగోళ స్థితిలో ఉంది. మరియు ఈ ప్రపంచాన్ని నడిపించే అన్ని పద్ధతుల గురించి పూర్తిగా తప్పుగా అర్థం చేసుకోబడింది. నిశ్చయంగా, మనం అనుకున్నదంతా తప్పుడు అవగాహన అని చెప్పవచ్చు. వ్యక్తి యొక్క వాస్తవికతకు సంబంధించినంత వరకు సరైన ఆలోచన అంటూ ఏమీ లేదు.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 DAILY WISDOM - 300 🌹*

*🍀 📖 from The Study and Practice of Yoga 🍀*

*📝 Swami Krishnananda*

*📚. Prasad Bharadwaj*


*🌻 26. That Which is Real has become Unreal 🌻*


*Piles and piles of notions of this false individuality, asmita, get grouped together, and there is an impregnable fortress created in the form of what we are as individuals. It looks as though now the cart is before the horse—that which is real has become unreal, and that which is unreal has become real. The thing that has really evolved as an effect becomes the cause, as it were; and that which is the cause looks as if it is the effect. The cosmic substance out of which the individuals have evolved has become the object of perception of the individuals, and the latter have usurped the position of the cause of cognition, experience, etc., not withstanding the fact that they are evolutes.*


*They have come further than the original substance, which is cosmic. This is a very beautiful process described in the Aitareya Upanishad: how the cause can become the effect and the effect can become the cause by a topsy-turvy positioning. Everything is in a state of confusion on account of this situation that has arisen, and there is a total misconstruing of all the features that rule this world. Conclusively, we may say that everything that we think is a wrong thought. There is nothing like correct thinking as far as the reality of the individual is concerned.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹

#నిత్యప్రజ్ఞాసందేశములు


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 200 🌹*

*✍️. సౌభాగ్య*

*📚. ప్రసాద్ భరద్వాజ*


*🍀. వ్యక్తి తెచ్చుకున్న జ్ఞానంతో అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకుంటాడు. అద్భుతానికి సంబంధించిన లక్షణాన్ని కోల్పోతారు. దైవానికి సంబంధించిన ముఖ్యమైన లక్షణం వ్యక్తి పసివాడుగా, అమాయకంగా, ఆశ్చర్యంతో నిండి వుండాలి. 🍀*


*వ్యక్తి పసివాడుగా అమాయకంగా వుండాలి. అప్పుడే తలుపులు తెరుచుకుంటాయి. జ్ఞానాన్ని పోడుచేసుకున్న వాళ్ళ స్వర్గద్వారాలు తెరుచుకోవు. పండితులు, మేధావులు, మత పెద్దలు వీళ్ళకు తలుపులు పూర్తిగా మూసుకుంటాయి. వాళ్ళకా సంగతి తెలుసు. వాళ్ళకు, అంతకు మించి ఏమీ అక్కర్లేదు. తెచ్చుకున్న జ్ఞానంతో వాళ్ళ అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకుంటారు. అద్భుతానికి సంబంధించిన లక్షణాన్ని కోల్పోతారు. అది దైవానికి సంబంధించిన ముఖ్యమైన లక్షణం.*


*పసిబిడ్డ అపూర్వమయిన ఆశ్చర్యంతో నిండి వుంటాడు. అతని హృదయం నిరంతరం రహస్యానుభూతుల్తో నిండి వుంటుంది. అతని కళ్ళు ఆశ్చర్యంతో నిండి వుంటాయి. సముద్ర తీరంలో నీటిబుడగల్ని చూసి నివ్వెరపోతాడు. గవ్వలేరుకుంటాడు. వాటిల్లో వజ్రాల్ని చూస్తాడు. సీతాకోకచిలుకని, మామూలు పువ్వుని చూసి మైమరచిపోతాడు. నువ్వు దేవుణ్ణి సమీపించడానికి వుండాల్సిన లక్షణాలు. సత్యాన్ని, సంతోషాన్ని సమీపించే లక్షణాలు. రహస్యం నింపుకున్న అస్తిత్వానికి చేరే లక్షణాలు. పసిపిల్లల్లాగా వుండాలి.*


*సశేషం ...*

🌹 🌹 🌹 🌹 🌹

#ఓషోరోజువారీధ్యానములు

#ఓషోబోధనలు #OshoDiscourse

#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 139 🌹*

*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*


*🌻 105. సదాచారము🌻*


*మానవజాతి యందు లెక్క లేనన్ని అస్వస్థతలున్నవి. లక్షల సంవత్సరముల నుండి, అజ్ఞానము కారణముగ జాతి యొనర్చిన దుష్కృత్యములు జాతి కర్మగ స్థిరపడి మానవుని బాధించుచున్నవి. మోటు మనుషుల కన్న సున్నితమైన మనస్సు గలవారికే, వ్యాధుల బాధ యెక్కువ. అందున దైవము ధర్మము, దయ, సత్యము, సత్కర్మ అను గుణములు నాశ్రయించిన వారికి వ్యాధుల ఆటుపోట్లు మరింత ఎక్కువగ నుండును. వారి శరీర ధాతువులు అహింసా మార్గమున సున్నితమగు చుండగ, వాతావరణ మందలి కాలుష్యము వారిని అంటుట సులభ మగుచుండును.*


*కావున అట్టివారు సామాన్యులకన్న కొంత భిన్నమైన ఆహార వ్యవహారాదులను ఏర్పరచుకొనవలసి యుండును. ఆచారము పేరున పెద్దలు ఈ రక్షణ కల్పించిరి. సదాచార మందు యిట్టి శ్రేయస్సు యిమిడి యున్నదని సాధకులు గ్రహించ వలెను. శుచి, శుభ్రత, దైనందిన దైవప్రార్థన, సదాచారములోని భాగములు. వీనిని అశ్రద్ధ చేయుట తగదు. మానవ సమాజమున ధార్మిక సంపత్తి కలవారు సదాచారము నవలంబించుటలో చాల వ్యాధుల నుండి పరిరక్షించు కొనగలరు. సదాచారము విషయమున అశ్రద్ధ గలవారు కంటినొప్పి, పంటి గొప్పి, అజీర్తి, ఇత్యాది బాధలకు తరచు గురి కాగలరు. సత్సాధకులు దీనిని గమనించుదురు గాక!*


*సశేషం.....*

🌹 🌹 🌹 🌹 🌹

#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #ChaitanyaVijnanam #PrasadBhardwaj


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

コメント


Post: Blog2 Post
bottom of page