🌹🍀 26 - DECEMBER - 2022 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 26 - DECEMBER - 2022 MONDAY, సోమవారం ఇందు వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 109 / Kapila Gita - 109 🌹 సృష్టి తత్వము - 65
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 701 / Vishnu Sahasranama Contemplation - 701 🌹 సత్తా, सत्ता, Sattā
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 148 / Agni Maha Purana - 148 🌹 🌻. పిండికాది లక్షణము - 1 Characteristics of pedestals and details relating to images - 1🌻
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 283 / Osho Daily Meditations - 283 🌹 283. కేంద్రానికి తిరిగి చేరడం - BACK TO THE CENTER
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 420 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 420 - 4 🌹. 420. 'గాయత్రీ' - 4 'Gayatri' - 4
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹26, డిసెంబరు, December 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : వినాయక చతుర్థి, Vinayaka Chaturthi🌻*
*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 13 🍀*
*23. తేజోపహారీ బలహా ముదితోఽర్థోఽజితో వరః |*
*గంభీరఘోషో గంభీరో గంభీరబలవాహనః*
*24. న్యగ్రోధరూపో న్యగ్రోధో వృక్షకర్ణస్థితిర్విభుః |*
*సుతీక్ష్ణదశనశ్చైవ మహాకాయో మహాననః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : సశరీర అమరత్వం - భౌతిక శరీరంతో అమరత్వం సాధించి, మరణాన్ని మన యిచ్ఛానుసారం పొందే శక్తిని సంపాదించడం సాధ్యమే. కాని, ఒకే కోటును నూరేళ్ళు ధరించాలని గాని. ఒకే యిరుకు కొంపలో శాశ్వతంగా బంధింప బడాలని గాని ఎవరిచ్చగిస్తారు ? 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సం, హేమంత ఋతువు,
దక్షిణాయణం, పుష్య మాసం
తిథి: శుక్ల చవితి 25:39:04 వరకు
తదుపరి శుక్ల పంచమి
నక్షత్రం: శ్రవణ 16:43:29 వరకు
తదుపరి ధనిష్ట
యోగం: హర్షణ 21:01:21 వరకు
తదుపరి వజ్ర
కరణం: వణిజ 15:15:44 వరకు
వర్జ్యం: 20:19:40 - 21:46:44
దుర్ముహూర్తం: 12:38:39 - 13:23:02
మరియు 14:51:49 - 15:36:12
రాహు కాలం: 08:06:46 - 09:30:00
గుళిక కాలం: 13:39:41 - 15:02:55
యమ గండం: 10:53:14 - 12:16:28
అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:38
అమృత కాలం: 07:27:20 - 08:52:40
మరియు 29:02:04 - 30:29:08
సూర్యోదయం: 06:43:32
సూర్యాస్తమయం: 17:49:22
చంద్రోదయం: 09:35:23
చంద్రాస్తమయం: 21:06:43
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: మకరం
యోగాలు: సిద్ది యోగం - కార్య సిధ్ధి,
ధన ప్రాప్తి 16:43:29 వరకు తదుపరి
శుభ యోగం - కార్య జయం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 109 / Kapila Gita - 109🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 65 🌴*
*65. త్వచం రోమభిరోషధ్యో నోదతిష్థత్తదా విరాట్|*
*రేతసా శిశ్నమాపస్తు నోదతిష్థత్తదా విరాట్॥*
*ఓషధులు రోమములతో గూడి చర్మము నందు ప్రవేశించెను. కాని, ఆయన మెల్కోలేదు. జలము వీర్యముతో గూడి లింగము నందు ప్రవేశించెను. కాని, అతడు లేవలేడు.*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 109 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*
*🌴 2. Fundamental Principles of Material Nature - 65 🌴*
*65. tvacaṁ romabhir oṣadhyo nodatiṣṭhat tadā virāṭ*
*retasā śiśnam āpas tu nodatiṣṭhat tadā virāṭ*
*The predominating deities of the skin, herbs and seasoning plants entered the skin of the virāṭ-puruṣa with the hair of the body, but the Cosmic Being refused to get up even then. The god predominating over water entered His organ of generation with the faculty of procreation, but the virāṭ-puruṣa still would not rise.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 701 / Vishnu Sahasranama Contemplation - 701🌹*
*🌻701. సత్తా, सत्ता, Sattā🌻*
*ఓం సత్తాయై నమః | ॐ सत्तायै नमः | OM Sattāyai namaḥ*
*సజాతీయ విజాతీయ స్వగతత్వైస్త్రిధాభిదా ।*
*అనుభూతి స్తద్రహితా సత్తా సా విష్ణు దేవతా ।*
*ఏకమేవ ద్వితీయమిత్యాది శ్రుతి సమీరణాత్ ॥*
*సజాతీయ, విజాతీయ స్వగత భేదములేని అనుభూతి సత్తా అనబడును. 'ఏకమే వాఽద్వితీయకమ్' ఛాందోగ్యోపనిషత్ 6-2-1 శ్రుతి వచన ప్రమాణ్యముచే బ్రహ్మము ఒక్కటియే; రెండవది తాను అగునది మరి యేదియును లేదు.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 701🌹*
*🌻701. Sattā🌻*
*OM Sattāyai namaḥ*
सजातीय विजातीय स्वगतत्वैस्त्रिधाभिदा ।
अनुभूति स्तद्रहिता सत्ता सा विष्णु देवता ।
एकमेव द्वितीयमित्यादि श्रुति समीरणात् ॥
*Sajātīya vijātīya svagatatvaistridhābhidā,*
*Anubhūti stadrahitā sattā sā viṣṇu devatā,*
*Ekameva dvitīyamityādi śruti samīraṇāt.*
*The state of existence in which there is no difference of the same kind, of different kind or internal differences is sattā or pure existence. For the śruti (Chāndogyopaniṣat 6-2-1) says Reality i.e., Brahman is one only without a second.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सद्गतिस्सत्कृतिस्सत्ता सद्भूतिस्सत्परायणः ।शूरसेनो यदुश्रेष्ठस्सन्निवासस्सुयामुनः ॥ ७५ ॥
సద్గతిస్సత్కృతిస్సత్తా సద్భూతిస్సత్పరాయణః ।శూరసేనో యదుశ్రేష్ఠస్సన్నివాసస్సుయామునః ॥ 75 ॥
Sadgatissatkrtissattā sadbhūtissatparāyaṇaḥ,Śūraseno yaduśreṣṭhassannivāsassuyāmunaḥ ॥ 75 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 148 / Agni Maha Purana - 148 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 45*
*🌻. పిండికాది లక్షణము - 1🌻*
హయగ్రీవుడు చెప్పెను.
బ్రహ్మదేవా! ఇపుడు నేను పిండిక లక్షణము చెప్పెదను పిండిక పొడవు ప్రతిమతో సమానముగ నుండును. ఎత్తు మాత్రము ప్రతిమలో సగముండును. పిండికకు అరువది నాలుగు కోష్ఠకము లేర్పరచి, క్రింది రెండు పంక్తులు విడచి, దానిపైన ఉన్న కోష్ఠము నాలుగు వైపుల, రెండు పార్శ్వములందును, లోపలి నుండి తుడిచి వేయవలెను. అట్లే పై రెండు పంక్తులు విడచి దాని క్రిందనున్న కోష్టమును లోపలినుండి తుడిచి వేయవలెను. ఈ విధముగ రెండు పార్శ్వములందును చేయవలెను. రెండు పార్శ్వముల మధ్యనున్న రెండు రెండు చతుష్కములను గూడ తుడిచివేయవలెను.
పిమ్మట దానిని నాలుగు భాగములుగా విభజించి పై రెండు పంక్తులను మేఖలగా గ్రహించి, దాని ప్రమాణములో సగము ప్రమాణముండునట్లు దాని యందు గొయ్యి తవ్వవలెను. రెండు పార్శ్వ భాగములందును సమానముగ ఒక్కొక్క భాగము విడిచి జైటపదమును నాలి (తూము) నిర్మించుటకై విడవలెను. దానియందు తూమునిర్మింపవలెను. మూడు భాగములలోని ఒక భాగమునకు ముందు నీరు ముందుకు పోటవుటకై మార్గముండవలెను.
వివిధాకారముగల ఈ పిండికకు ''భద్ర'' అని పేరు. లక్ష్మీదేవి ప్రతిమ ప్రమాణము ఎనిమిది జానలుండవలెను. ఇతర దేవుల ప్రతిమలు కూడ ఇట్లే ఉండవలెను. రెండుకను బొమ్మలును నాసిక కంటె ఒక యవ అధికముగా ఉండవలెను. నాసిక వాటి కంటె ఒక యవ తక్కువ ఉండవలెను. ముఖ గోలకము నేత్ర గోలకముకంటె పెద్దదిగా ఉండవలెను. ఇది ఎత్తుగాను, వంకర టింకరగాను ఉండకూడదు. నేత్రములు పెద్దవిగా మూడును పావుయవల ప్రమాణములో నుండ వలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 148 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 45
*🌻Characteristics of pedestals and details relating to images - 1 🌻*
The Lord said:
1. I shall describe the characteristics of the pedestal. The length is the same as that of the image. The height (should be) half of it. It should have sixty-four folds.
2. Leaving two rows at the bottOṃ, the other parts should be polished on either side as also inside.
3. Leaving two rows at the top, the other parts are polished evenly on either side and inside.
4. The rectaṅgular space in between these should then be polished. The first two rows should be divided into four parts by a wise man.
5-6. The girdle should be equal to one such part. The indent should be half that. Leaving one such part evenly on either side a wise man should leave on the exterior a breadth of a foot. The water drains should be at the top of each one of the three-parts.
7. This auspicious and excellent pedestal (has been described) relating to its manifold ways (of construction). The (images of the)goddess Lakṣmī and other feminine forms should be made (to measure) eight tālas in length.
8. The eye brows should be more than a yava (in length). The nose (should be) less than a yava (in length). The mouth (should measure) more than a small ball well distributed above and below.
9. The eye should be made long (measuring) three parts of a yava less than three yavas. The breadth of the eyes should be made half of it.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 283 / Osho Daily Meditations - 283 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 283. కేంద్రానికి తిరిగి చేరడం 🍀*
*🕉. మీరు ఎడమ మరియు కుడి వైపులా తిరుగుతున్నట్లు అనిపిస్తే మరియు మీ కేంద్రం ఎక్కడ ఉందో మీకు తెలియకపోతే, మీరు ఇకపై మీ స్వీయ కేంద్రంతో సంబంధంలో లేరని చూపిస్తుంది, కాబట్టి మీరు ఆ పరిచయాన్ని సృష్టించాలి. 🕉*
*రాత్రి నిద్రకు ఉపక్రమించేటప్పుడు, మంచం మీద పడుకుని, మీ రెండు చేతులను నాభికి రెండు అంగుళాలు క్రిందికి ఉంచి, కొద్దిగా నొక్కండి. అప్పుడు లోతుగా ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించండి మరియు శ్వాసతో కేంద్రం పైకి క్రిందికి వస్తున్నట్లు మీరు భావిస్తారు. మీరు కుంచించుకు పోతున్నట్లు మరియు కేవలం ఒక చిన్న బిందువుగా, చాలా కేంద్రీకృత శక్తిగా ఉన్నట్లుగా మీ మొత్తం శక్తిని అక్కడ అనుభూతి చెందండి. ఇలా పది, పదిహేను నిముషాలు చేసి, తర్వాత నిద్రపోండి. ఇలా చేయడం వల్ల మీరు నిద్రపోతే, ఆ నిద్ర చాలా ఉపయోగకరంగా ఉంటుంది.*
*అప్పుడు రాత్రంతా ఆ కేంద్రీకరణ కొనసాగుతుంది. మళ్లీ మళ్లీ అపస్మారక స్థితిలోకి వెళ్లినప్పుడు అది అక్కడే కేంద్రీకృతమై ఉంటుంది. కాబట్టి మీకు తెలియకుండానే రాత్రంతా మీరు కేంద్రంతో లోతైన పరిచయంతో అనేక విధాలుగా వుంటారు. నిద్ర అయి పోయినట్లు అనిపించిన క్షణం, వెంటనే కళ్ళు తెరవకండి. మళ్ళీ మీ నాభి క్రింద మీ చేతులను ఉంచండి, కొద్దిగా నెట్టండి మరియు శ్వాస ప్రారంభించండి; మళ్ళీ స్వీయ కేంద్రం అనుభూతిని చెందండి. ఇలా పది లేదా పదిహేను నిమిషాలు చేసి లేవండి. ప్రతి రాత్రి, ప్రతి ఉదయం ఇలా చేయండి, మూడు నెలల్లో మీరు పూర్తిగా మీ స్వీయ కేంద్రంతో ఏకత్వాన్ని అనుభూతి చెందుతారు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 283 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 283. BACK TO THE CENTER 🍀*
*🕉. If you feel a sort of wavering left and right and you don't know where your center is, that simply shows that you are no longer in contact with your hara, so you have to create that contact. 🕉*
*In the night when you go to sleep, lie down on the bed and put both your hands two inches below the navel, and press a little. Then start breathing deeply, and you will feel that center coming up and down with the breathing. Feel your whole energy there as if you are shrinking and shrinking and shrinking and just existing there as a small center, as very concentrated energy. Just do this for ten, fifteen minutes, and then fall asleep. If you fall asleep doing this, it will be helpful.*
*Then the whole night that centering persists. Again and again the unconscious goes and centers there. So the whole night without your knowing, you will be coming in many ways in deep contact with the center. In the morning, the moment that you feel that sleep has gone, don't open your eyes right away. Again put your hands below your navel, push a little, and start breathing; again feel the hara. Do this for ten or fifteen minutes and then get up. Do this every night, every morning, within three months you will start feeling centered.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 420 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 420 - 4 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 90. చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।*
*గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥ 🍀*
*🌻 420. 'గాయత్రీ' - 4🌻*
కోటాను కోట్ల జీవులు కోటానుకోట్ల విధములుగ లేచినది మొదలు నిద్రపోవు వరకు తీరుబడి లేక తిరుగాడు చుందురు. వారియందు సంకల్పములట్లు పుట్టుచునే యుండును. సంకల్పము పుట్టిన వెనుక దాని ననుసరించి పరుగిడుటయే యుండును గాని సంకల్పములు పుట్టు చోటును గమనించువారు బహు కొద్ది. అట్లు గమనించు ప్రయత్నమే గాయత్రి మాతను దర్శించు ప్రయత్నము. ఆ ప్రయత్నమున ధీశక్తి పెరుగును. తత్కారణముగనే గాయత్రి గానము, ధ్యానము, జపము ధీశక్తిని పెంచునని పెద్దలు తెలుపుదురు. సృష్టికర్తకు నాలుగు వేదముల సారముగ సృష్టి జ్ఞానము కలిగించినది గాయత్రి. ఆమెయే వేదమాత. (గాయత్రి మాతను గూర్చిన వ్యాఖ్యానములు అనేకానేకములు గలవు. ఆమె రూప వర్ణము కూడ తత్త్వమే. విశేష వివరణములకు “గాయత్రి మంత్రము - అవగాహన” వ్యాఖ్యానము పరిశీలించుకొన వచ్చును.)
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 420 - 4 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 90. Chichakti shchetanarupa jadashakti jadatmika*
*Gayatri vyahruti sandhya dvijabrunda nishemita ॥ 90 ॥🌻*
*🌻 420. 'Gayatri' - 4 🌻*
Millions of billions of living beings move around from waking up to falling asleep. Desires keep on taking birth in them. People run after their desires, but very few people observe the place where the it is born. Such an attempt to observe is an attempt to invoke Mata Gayatri. Dhishakti will increase in that effort. Elders say that Gayatri chanting, meditation and chanting will instantly increase Dhishakti. It was Gayatri who imparted the essence of the four Vedas to the Creator. She is the Veda Mata. (There are many interpretations about Mata Gayatri. Her form is also a philosophy. For special explanations, you can check the commentary 'Gayatri Mantra - Understanding'.)
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
Comments