🌹🍀 26, JANUARY 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 26, JANUARY 2023 THURSDAY,గురువారం, బృహస్పతి వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
*🍀. వసంత పంచమి, గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు, Sri Panchami, Vasantha Panchami, Republic Day Good Wishes to All 🍀*
2) 🌹 కపిల గీత - 124 / Kapila Gita - 124 🌹 🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 08 / 3. Salvation due to wisdom of Nature and Jeeva - 08 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 716 / Vishnu Sahasranama Contemplation - 716 🌹
🌻716. అపరాజితః, अपराजितः, Aparājitaḥ🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 677 / Sri Siva Maha Purana - 677 🌹 🌻. గణేశుని వివాహము - 1 / The celebration of Gaṇeśa’s marriage - 1 🌻
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 298 / Osho Daily Meditations - 298 🌹 🍀 298. శరీర లయ / BODY RHYTHM 🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 426 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 426 - 3 🌹 🌻 426. 'పంచకోశాంతర స్థితా' - 3 / Panchakoshantarah Stitha' - 3 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹26, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
*🍀. వసంత పంచమి, గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు, Sri Panchami, Vasantha Panchami, Republic Day Good Wishes to All 🍀*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌺. పండుగలు మరియు పర్వదినాలు : వసంత పంచమి, గణతంత్ర దినోత్సవం, Vasantha Panchami , Republic Day 🌺*
*🍀. శ్రీ సరస్వతి ధ్యానము 🍀*
*నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః |*
*విద్యాధరే విశాలాక్షి శుద్ధఙ్ఞానే నమో నమః *
*శుద్ధస్ఫటికరూపాయై సూక్ష్మరూపే నమో నమః |*
*శబ్దబ్రహ్మి చతుర్హస్తే సర్వసిద్ధ్యై నమో నమః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : చేసే కర్మ ఏదైనా భావం ముఖ్యం. నిష్కాముడవు, నిరహంకారుడవునై, సమచిత్తంతో, జయాపజయములకు, లాభనష్టములకూ వికారం చెందక, ఈశ్వరార్పణ బుద్ధితో ఈశ్వరుని కోసం, సమస్త కర్మమూ ఈశ్వర శక్తియే చేస్తున్న ఎరుక గలిగి చేసెడీ ఏ కర్మయైనా ఆత్మార్పణకు సాధనమే అవుతుంది. 🍀*
🌹. వసంత పంచమి విశిష్టత :- సరస్వతీదేవి మాఘ పంచమి నాడు శ్రీ పంచమి పేరిట ఆరాధిస్తారు. సర్వవిద్యలకూ ఆధారం వాగ్దేవే కనుక చిన్నపెద్ద తేడాల్లేకుండా పుస్తకాలు, కలాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత నృత్య సాహిత్యాలకు కూడా ఈ దేవీయే మూలం కనుక ఈ తల్లిని నృత్య కేళీవిలాసాలతో స్తుతిస్తారు. ఈ శ్రీ పంచమినే వసంత పంచమి అని మదన పంచమి అని అంటారు. ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవర్తపురాణం చెప్తోంది. ఈ శ్రీపంచమినాడు సరస్వతిని ఆరాధించే విధివిధానాలను నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవీ భాగవతం చెప్తోంది. ''చంద్రికా చంద్రవదనా తీవ్రా మహాభద్రా మహాబలా భోగదా భారతీ భామా గోవిందా గోమతీ శివా'' అని ప్రతిరోజూగాని, పంచమినాడు సప్తమి తిథులలో కాని సరస్వతీ జన్మనక్షత్రం రోజు గాని పూజించిన వారికి ఆ తల్లి కరుణాకటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి.🌹
🌷🌷🌷🌷🌷
శుభకృత్, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, మాఘ మాసం
తిథి: శుక్ల పంచమి 10:29:12 వరకు
తదుపరి శుక్ల షష్టి
నక్షత్రం: ఉత్తరాభద్రపద 18:58:08
వరకు తదుపరి రేవతి
యోగం: శివ 15:28:21 వరకు
తదుపరి సిధ్ధ
కరణం: బాలవ 10:32:12 వరకు
వర్జ్యం: 05:14:24 - 06:45:48
దుర్ముహూర్తం: 10:35:23 - 11:20:38
మరియు 15:06:54 - 15:52:09
రాహు కాలం: 13:53:22 - 15:18:13
గుళిక కాలం: 09:38:49 - 11:03:40
యమ గండం: 06:49:08 - 08:13:58
అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:50
అమృత కాలం: 14:22:48 - 15:54:12
సూర్యోదయం: 06:49:08
సూర్యాస్తమయం: 18:07:55
చంద్రోదయం: 10:21:54
చంద్రాస్తమయం: 22:47:53
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు: ఛత్ర యోగం - స్త్రీ లాభం
18:58:08 వరకు తదుపరి మిత్ర
యోగం - మిత్ర లాభం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🍀. వసంత పంచమి, గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు, Sri Panchami, Vasantha Panchami, Republic Day Good Wishes to All 🍀*
*ప్రసాద్ భరధ్వాజ*
*🌹. వసంత పంచమి విశిష్టత 🌹*
*సరస్వతీదేవి మాఘ పంచమి నాడు శ్రీ పంచమి పేరిట ఆరాధిస్తారు. సర్వవిద్యలకూ ఆధారం వాగ్దేవే కనుక చిన్నపెద్ద తేడాల్లేకుండా పుస్తకాలు, కలాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత నృత్య సాహిత్యాలకు కూడా ఈ దేవీయే మూలం కనుక ఈ తల్లిని నృత్య కేళీవిలాసాలతో స్తుతిస్తారు. ఈ శ్రీ పంచమినే వసంత పంచమి అని మదన పంచమి అని అంటారు. ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవర్తపురాణం చెప్తోంది. ఈ శ్రీపంచమినాడు సరస్వతిని ఆరాధించే విధివిధానాలను నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవీ భాగవతం చెప్తోంది.*
*మాఘమాసం శిశిర ఋతువులో వసంతుని స్వాగత చిహ్నమూగా ఈ పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుని ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి అనురాగవల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటం కూడా శ్రీపంచమినాడే కనబడుతుంది. వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడుతాయి.*
*అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞానరాశులు అవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్సుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్భుద్ధినీ పొందుతారు. మేధ ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు. శరన్నవరాత్రులల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతీ రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తిథినాట సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు విశేష పూజలు చేస్తారు.*
*''చంద్రికా చంద్రవదనా తీవ్రా మహాభద్రా మహాబలా భోగదా భారతీ భామా గోవిందా గోమతీ శివా'' అని ప్రతిరోజూగాని, పంచమినాడు సప్తమి తిథులలో కాని సరస్వతీ జన్మనక్షత్రం రోజు గాని పూజించిన వారికి ఆ తల్లి కరుణాకటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి.*
*అహింసకు అధినాయిక సరస్వతిదేవి. సరః అంటే కాంతి. కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది. అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతికిరణ పుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతీ.*
*ఈ అహింసామూర్తి తెల్లని పద్మములో ఆసీనురాలై వీణ, పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు. జ్ఞానకాంతిని పొందినవారికి ఆయుధాల అవసరం ఏమీ వుండదు కదా. ఈ తల్లిని తెల్లని పూవులతోను, శ్వేత వస్త్రాలతోను, శ్రీగంథముతోను, అలంకరిస్తారు. పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అర్చనాదులు చేసి క్షీరాన్నాన్ని నేతితోకూడిన వంటలను నారికేళము, అరటిపండ్లను చెరకును నివేదన చేస్తారు. ఆ తల్లి చల్లని చూపులలో అపార విజ్ఞాన రాశిని పొందవచ్చు.*
*''వాగేశ్వరీ, మహాసరస్వతి, సిద్ధసరస్వతి, నీలసరస్వతి, ధారణ సరస్వతి, పరాసరస్వతి, బాలాసరస్వతి'' ఇలా అనేక నామాలున్నప్పటికీ ''సామాంపాతు సరస్వతీ.... '' అని పూజించే వారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమపాత్రులట.*
*సరస్వతీ దేవిని ఆవాహనాది షోడశోపచారాలతో పూజించి సర్వవేళలా సర్వావ స్థలయందు నాతోనే ఉండుమని ప్రార్థిస్తారు. వ్యాసవాల్మీకాదులు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేదవిభజన చేయడం, పురాణాలు, గ్రంథాలు, కావ్యాలు రచించడం జరిగిందంటారు. పూర్వం అశ్వలాయనుడు, ఆదిశంకరాచార్యులు కూడా ఈ తల్లిని ఆరాధించి ఉన్నారు.*
*✍️. డా.యం.ఎన్.చార్య*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 124 / Kapila Gita - 124🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 08 🌴*
*08. యదృచ్ఛయోపలబ్ధేన సంతుష్టో మితభుక్ మునిః|*
*వివిక్తశరణః శాంతో మైత్రః కరుణ ఆత్మవాన్॥*
*దైవానుగ్రహమున లభించిన అన్నాదులతో తృప్తి చెందవలెను. మితముగా సాత్త్వికాహారమును భుజించు చుండవలెను. మౌనమును పాటింపవలెను. పవిత్ర స్థలమున ఏకాంతవాసము చేయవలెను. భయాదిరహితుడై శాంత స్వభావమును కలిగి యుండవలెను.*
*ఇవన్నీ కలగాలంటే, భగవంతుని సంకల్పముతో లభించిన దానితో తృప్తి పొందడం నేర్చుకోవాలి. పరమాత్మ ఏమి ఇస్తే దానితో సంతృప్తి చెందాలి. అలా కలగాలంటే, మితముగా భుజించాలి. ఆహారం కొంచెం తీసుకుంటే ఆశలు పెరగవు. మౌనముగా ఉండాలి. మౌనానికి ప్రధాన సాధనం ఒక్కడే ఉండటం. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి (శాంతః), అందరి యందు మిత్ర భావన కలిగి ఉండాలి. అది ఉండాలంటే, ఎదుటి వారి మీద కరుణ కలిగి ఉండాలి. ఇంద్రియ నిగ్రహం కలవాడు, ఆత్మ యాదాత్మ్య జ్ఞ్యానం కలవాడు (ఆత్మవాన్).*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 124 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*
*🌴 3. Salvation due to wisdom of Nature and Jeeva - 08 🌴*
*08. yadṛcchayopalabdhena santuṣṭo mita-bhuṅ muniḥ*
*vivikta-śaraṇaḥ śānto maitraḥ karuṇa ātmavān*
*For his income a devotee should be satisfied with what he earns without great difficulty. He should not eat more than what is necessary. He should live in a secluded place and always be thoughtful, peaceful, friendly, compassionate and self-realized.*
*Everyone who has accepted a material body must maintain the necessities of the body by acting or earning some livelihood. A devotee should only work for such income as is absolutely necessary. He should be satisfied always with such income and should not endeavor to earn more and more simply to accumulate the unnecessary. Kapiladeva instructs that we should not endeavor hard for things which may come automatically, without extraneous labor. The exact word used in this connection, yadṛcchayā, means that every living entity has a predestined happiness and distress in his present body; this is called the law of karma. A devotee should always remain ātmavān, or situated in his spiritual position. He should not forget that his main concern is to make advancement in spiritual consciousness, or Kṛṣṇa consciousness, and he should not ignorantly identify himself with the body or the mind. Ātmā means the body or the mind, but here the word ātmavān especially means that one should be self-possessed. He should always remain in the pure consciousness that he is spirit soul and not the material body or the mind. That will make him progress confidently in Kṛṣṇa consciousness.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 716 / Vishnu Sahasranama Contemplation - 716🌹*
*🌻716. అపరాజితః, अपराजितः, Aparājitaḥ🌻*
*ఓం అపరాజితాయ నమః | ॐ अपराजिताय नमः | OM Aparājitāya namaḥ*
*అన్తరైశ్చాపి రాగాద్యైరపి బాహ్యైశ్చ శత్రుభిః ।*
*పరాజితోనహి దుష్టైరపరాజిత ఈశ్వరః ॥*
*ఆంతరములగు రాగాదిరూప శత్రువులచే కాని, బాహిరములగు దానవాదిశత్రువులచే కాని ఓడించ బడని వాడు కనుక అపరాజితుడు.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 716🌹*
*🌻716. Aparājitaḥ🌻*
*OM Aparājitāya namaḥ*
अन्तरैश्चापि रागाद्यैरपि बाह्यैश्च शत्रुभिः ।
पराजितोनहि दुष्टैरपराजित ईश्वरः ॥
*Antaraiścāpi rāgādyairapi bāhyaiśca śatrubhiḥ,*
*Parājitonahi duṣṭairaparājita īśvaraḥ.*
*Since He is never conquered by internal enemies like attachment etc., and by the external enemies like the asuras and others, He is Aparājitaḥ.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
भूतावासो वासुदेवः सर्वासुनिलयोऽनलः ।दर्पहा दर्पदोऽदृप्तो दुर्धरोऽथापराजितः ॥ ७६ ॥
భూతావాసో వాసుదేవః సర్వాసునిలయోఽనలః ।దర్పహా దర్పదోఽదృప్తో దుర్ధరోఽథాపరాజితః ॥ 76 ॥
Bhūtāvāso vāsudevaḥ sarvāsunilayo’nalaḥ,Darpahā darpado’drpto durdharo’thāparājitaḥ ॥ 76 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 677 / Sri Siva Maha Purana - 677 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 20 🌴*
*🌻. గణేశుని వివాహము - 1 🌻*
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఇదే సమయములో విశ్వరూపుడనే ప్రజాపతి గణేశుని ప్రయత్నమును గురించి చక్కగా విచారించి ప్రసన్న మనస్కుడై సుఖమును పొందెను (1). విశ్వరూప ప్రజాపతికి దివ్యమగు రూపము గలవారు, శుభాకారము గలవారు, సర్వావయముల యందు సౌందర్యముగలవారు, సిద్ధి బుద్ధి అను పేర ప్రసిద్ధి చెందిన ఇద్దరు కుమార్తెలు గలరు (2). పార్వతీ పరమేశ్వరులు గణేశునకు వారిద్దరితో వావాహ మహోత్సవమును ఆనందముతో చేయించిరి (3). దేవతలందరు ఆనందముతో ఆ వివాహమునకు వచ్చిరి. పార్వతీ పరమేశ్వరుల మనోరథము ఈడేరెను (4).
విశ్వరూపుడు ఆ వివాహమును చేసి ఆనందించెను. ఋషులు దేవతలు కూడ పరమానందమును పొందిరి (5). గణేశుడు కూడ వారిద్దరినీ పొంది ఆ కాలములో గొప్ప సుఖమును పొందెను. ఓ మహర్షీ! ఆ సుఖమును వర్ణించుట సంభవము కాదు (6). కొంత కాలము తరువాత మహాత్ముడగు గణేశునకు ఇద్దరు భర్యలయందు ఇద్దరు దివ్యపుత్రులు జన్మించిరి (7). సిద్ధి యను గణేశుని భార్యకు క్షేముడను కుమారుడు కలిగెను. బుద్ధికి పరమ సుందరుడైన లాభుడనే కుమారుడు కలిగెను (8).
ఈ విధముగా గణేశుడు ఈహకు అందని సుఖము ననుభవించు చుండగా, రెండవ కుమారుడు భూమిని చుట్టి తిరిగి వచ్చెను (9). అంతలో మహాత్ముడగు నారదుడు అతని ఇంటికి వచ్చి ఇట్లు చెప్పెను : నేను సత్యమును చెప్పుచున్నాను. నేను మోసపు బుద్ధితో గాని, ఈర్ష్య వలన గాని అసత్యమును చెప్పుట లేదు (10). నీ తల్లి దండ్రులగు పార్వతీ పరమేశ్వరులు నీకు చేసిన దానిని లోకములో ఇతరులెవ్వరూ తమ పుత్రులకు చేయరు. నేను ముమ్మాటికీ సత్యమును చెప్పుచున్నాను (11). భూమిని చుట్టి వచ్చుట అను మిషను కల్పించి నిన్ను ప్రయత్న పూర్వకముగా బయటకు పంపి గణశునకు మిక్కిలి శోభాకరము, శ్రేష్టము అగు వివాహము చేయబడెను (12).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 677🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 20 🌴*
*🌻 The celebration of Gaṇeśa’s marriage - 1 🌻*
Brahmā said:—
1. In the meantime Prajāpati Viśvarūpa became delighted and happy on knowing their intention.
2. Prajāpati Viśvarūpa had two daughters of divine features. They were famous as Siddhi and Buddhi.[1] They were exquisite in every part of their body.
3. The lord Śiva and Pārvatī, jubilantly celebrated the marriage of Gaṇeśa with them.
4. The delighted gods attended their marriage as desired by Śiva and Pārvatī.
5. Viśvakarman made all arrangements for the marriage. The sages and the gods were full of great joy.
6. The happiness that Gaṇeśa derived by virtue of this marriage, O sage, cannot be adequately described.
7. After some time, the noble Gaṇeśa begot two sons, one each of his wives. They were endowed with divine features.
8. The son Kṣema was born to Siddhi. The highly brilliant son Lābha was born to Buddhi.
9. While Gāṇeśa was enjoying the inconceivable happiness, the second son returned after circumambulating the earth.
10. Thereupon he was addressed by Nārada, the great soul. “I speaking the truth, no lies. I am not actuated by deception or rivalry.
11. What has been done by Śiva and Pārvatī your parents, no other person in the world will ever do. Truth. It is the truth I am speaking.
12. After driving you out under the pretext of circumambulating the earth, they have celebrated the excellent and auspicious marriage of Gaṇeśa.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 298 / Osho Daily Meditations - 298 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 298. శరీర లయ 🍀*
*🕉. శరీర లయను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మరియు అది మార్చబడదు. మీరు పుట్టిన క్షణంలో ఇది స్థిరపడుతుంది. 🕉*
*మీ లయను గమనించండి. మీకు త్వరగా పడుకోవాలని అనిపిస్తే, త్వరగా పడుకుని, ఉదయాన్నే లేవండి. మీకు ఏ సమయం సరి పోతుందో మీరు అర్థం చేసుకున్న తర్వాత, దాని గురించి క్రమం తప్పకుండా ఉండటం మంచిది. కొన్నిసార్లు అది సాధ్యం కాకపోతే, అది ఫర్వాలేదు, కానీ దాన్ని అలవాటుగా చేయవద్దు. శరీర లయపై చాలా పరిశోధనలు జరిగాయి. దానిని మార్చడానికి అవకాశం లేదు. కణాలలో ఏదో ఉంది; కణాలు అలా సృష్టించ బడ్డాయి. ఒకసారి సూర్యుడు అస్తమించేటప్పుడు నిద్రపోయే పక్షులను కృత్రిమ గదుల్లో పెట్టి మోసం చేశారు. బయట రాత్రి అయినప్పుడు గదిలో వెలుతురు, పగలు బయట ఉన్నప్పుడు గదిలో రాత్రి ఉండేది.*
*పక్షులు నెలల తరబడి ఈ గదుల్లో ఉన్నాయి. అదే మనుషుల మీద కూడా చేసారు. వారు మానసికంగా దెబ్బ తిన్నారు. - వారు ఆత్మహత్య చేసుకోవడం లేదా ఒకరినొకరు చంపుకోవడం ప్రారంభించారు - కానీ వారి శరీర లయను మార్చలేక పోయారు. గదిలో పగలు ఉన్నప్పుడు నిద్ర పోయారు, రాత్రి కాగానే మెలకువకి వచ్చేవారు. మరియు రాత్రిపూట వారి శరీరాలు మేల్కొని ఉండటం చాలా వింతగా ఉంది. వారు దీనిని ఏదో వింతగా భావించడం ప్రారంభించారు మరియు అది వారి శరీర వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపించింది. కాబట్టి ఎల్లప్పుడు మీ స్వంత లయను అనుసరించండి.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 298 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 298. BODY RHYTHM 🍀*
*🕉. Body rhythm is very important to understand. And it cannot be changed. It settles the moment you are born. 🕉*
*Just watch your rhythm. If you feel like going to bed early, then go to bed early and get up early in the morning. And once you have understood what time suits you, it is better to be regular about it. If it is possible, then be regular; if sometimes it is not possible, that's okay, but don't make irregularity a routine. Now much research has been done on body rhythm, and there seems to be no possibility to change it. It is something in the very cells; the cells are programmed. There are birds that fall asleep as the sun sets. Once these birds were put in artificial chambers and deceived.*
*When it was night outside there was light in the chamber, and when it was day outside there was night in the chamber. The birds were in these chambers for months. They became neurotic--they started committing suicide or killing one another--but their body rhythm could not be changed. They would fall asleep while it was day in the chamber and they would become awake when it was night. And of course it was very strange for their bodies to be awake in the night-- they started feeling something eerie, something weird, and that started telling on their systems. So simply follow your own rhythm.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 426 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 426 - 3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 91. తత్త్వాసనా, తత్త్వమయీ, పంచకోశాంతరస్థితా ।*
*నిస్సీమమహిమా, నిత్యయౌవనా, మదశాలినీ ॥ 91 ॥ 🍀*
*🌻 426. 'పంచకోశాంతర స్థితా' - 3 🌻*
*కోశ 'శుద్ధి గావించు కొనుచు, సత్త్వ గుణమును ఆశ్రయించి నిత్య జీవితమును దివ్యారాధనగ సాగించు వారికి చిత్ శక్తి స్వరూపము సాన్నిధ్య మిచ్చును. జీవుడు చిత్ శక్తి స్వరూపుడే. అట్టి జీవుడు పరాశక్తిని ధ్యానించుటలో బ్రహ్మా నందము పొందగలడు. శ్రీ చక్ర ఆరాధన గావించువారు జ్ఞానావరణమందు, ఐదుగురు దేవతలను ఐదు కోశములకు సంబంధించి పూజింతురు. ఈ ఐదుగురు దేవతలు వరుసగ శ్రీవిద్య, పరంజ్యోతి, పరా, నిష్కళా, శాంభవి అని పేర్కొనబడిరి. ఇందు శ్రీవిద్య మధ్యబిందువు. మిగిలిన నలుగురు దేవతలు నాలుగు స్థానముల యందు చుట్టునూ యుందురు. నలుగురునూ సృష్ట్యాది కార్యములలో పాల్గొందురు. శ్రీవిద్య బిందువు నందుండును. ఈ బిందువు శభోత్పత్తి స్థానము.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 426 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 91. Tatvasana tatvamaei panchakoshantarah sdhita*
*Nisima mahima nitya-yaovana madashalini ॥ 91 ॥ 🌻*
*🌻 426. 'Panchakoshantarah Stitha' - 3 🌻*
*For the one who constantly purifies his layers , and who lives his daily life as penance, they shall find life energy( chit Shakthi) filling them. Jiva is the embodiment of Chit Shakti. Such a living being can enjoy the eternal bliss by meditating on Parashakti. Devotees of Sri Chakra worship the five deities in relation to the five bodies( layers) in the Jnanavarana. These five deities are mentioned as Srividya, Paramjyoti, Para, Nishkala and Sambhavi respectively. In this Srividya is the middle point. The remaining four deities surround in four points. All four participate in the activities of creation. There is a point of Srividya Bindu. This point is the place of creation of bliss.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
تعليقات