top of page
Writer's picturePrasad Bharadwaj

26 - JUNE - 2022 SUNDAY MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 26, ఆదివారం, జూన్ 2022 భాను వాసరే Sunday 🌹

2) 🌹 కపిల గీత - 29 / Kapila Gita - 29🌹

3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 69 / Agni Maha Purana - 69🌹

4) 🌹. శివ మహా పురాణము - 585 / Siva Maha Purana - 585🌹

5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 204 / Osho Daily Meditations - 204🌹

6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 381 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 381-3 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. 26, June 2022 పంచాగము - Panchangam 🌹*

*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*

*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*

*ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : ప్రదోష వ్రతం, Pradosh Vrat🌻*


*🍀. శ్రీ సూర్య పంజర స్తోత్రం - 13 🍀*


*13. ధరాయ నమః ధృవాయ నమః*

*సోమాయ నమః అథర్వాయ నమః*

*అనిలాయ నమః అనలాయ నమః*

*ప్రత్యూషాయ నమః ప్రతాపాయ నమః*

*మూర్ధ్నిస్థానే మాం రక్షతు ॥*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : జ్ఞాన, కర్మల మధ్య సమన్వయం సాధించే ప్రక్రియ యజ్ఞము. ఆ యజ్ఞమును పాడు చేసే వారే రాక్షసులు. సాధనలన్నింటి లక్ష్యము ఆ రాక్షసులు సంహరించడమే.- మాస్టర్‌ ఆర్‌.కె.- మాస్టర్‌ ఆర్‌.కె. 🍀*


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, జేష్ఠ మాసం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

తిథి: కృష్ణ త్రయోదశి 27:27:41 వరకు

తదుపరి కృష్ణ చతుర్దశి

నక్షత్రం: కృత్తిక 13:06:58 వరకు

తదుపరి రోహిణి

యోగం: ధృతి 05:54:23 వరకు

తదుపరి శూల

కరణం: గార 14:17:50 వరకు

వర్జ్యం: -

దుర్ముహూర్తం: 17:08:32 - 18:01:12

రాహు కాలం: 17:15:08 - 18:53:52

గుళిక కాలం: 15:36:22 - 17:15:08

యమ గండం: 12:18:53 - 13:57:38

అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:44

అమృత కాలం: 10:25:48 - 12:12:36

సూర్యోదయం: 05:43:52

సూర్యాస్తమయం: 18:53:52

చంద్రోదయం: 03:21:05

చంద్రాస్తమయం: 16:42:37

సూర్య సంచార రాశి: జెమిని

చంద్ర సంచార రాశి: వృషభం

ధూమ్ర యోగం - కార్య భంగం, సొమ్ము

నష్టం 13:06:58 వరకు తదుపరి ధాత్రి

యోగం - కార్య జయం


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹

#పంచాగముPanchangam

Join and Share


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. కపిల గీత - 29 / Kapila Gita - 29🌹*

*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*

*📚. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌴. 13. సమర్పణ ద్వారా సంపూర్ణ జ్ఞానం - 2 🌴*


*29. యో యోగో భగవద్బాణో నిర్వాణాత్మంస్త్వయోదితః*

*కీదృశః కతి చాఙ్గాని యతస్తత్త్వావబోధనమ్*


*ఆనందస్వరూపా, భగవంతుని చేర్చగల సాధనముగా ఉండే యోగమేదో చెప్పు. నీవు చెప్పిన యోగము ఎలాంటిది, దానికి ఎన్ని అంగాలు ఉన్నాయి.*


*సశేషం..*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Kapila Gita - 29 🌹*

*✍️ Swami Prabhupada.*

*📚 Prasad Bharadwaj*


*🌴 13. Perfect Knowledge Through Surender - 2 🌴*


*29. yo yogo bhagavad-bano nirvanatmams tvayoditah*

*kidrsah kati cangani yatas tattvavabodhanam*


*The mystic yoga system, as you have explained, aims at the Supreme Personality of Godhead and is meant for completely ending material existence. Please let me know the nature of that yoga system. How many ways are there by which one can understand in truth that sublime yoga?*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹

#కపిలగీత #KapilaGita

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 69 / Agni Maha Purana - 69 🌹*

*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 25*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*


*🌻. "వాసుదేవ' 'సంకర్షణ' 'ప్రద్యుమ్న' 'అనిరుద్ధ' మంత్రముల లక్షణములు -1 🌻*


నారదుడు పలికెను:


పూజ్యములైన వాసుదేవాది మంత్రముల లక్షణము చెప్పెదను. ఆదియందు "నమో భగవతే" అను పదములో కలవి, అ, ఆ, అం, అః అను బీజాక్షరములతో కూడినవి ఓంకారము ఆది యందు కలవి, 'నమః' అనునది అంతమందు కలవి అయిన "వాసుదేవ' 'సంకర్షణ' 'ప్రద్యుమ్న' 'అనిరుద్ధ' అను పదములచే "ఓం అ నమో భగవతే వాసుదేవాయ" ఓం ఆ నమో భగవతే సంకర్షణాయ" "ఓం అం నమో భగవతే ప్రద్యుమ్నాయ" "ఓం అః నమో భగవతే అనిరుద్దాయ" అను మంత్రము లేర్పడును, పిమ్మట "ఓం నమో నారాయణాయ" అను మంత్రము.


"ఓం తత్సద్బ్రహ్మణే నమః" "ఓం నమో విష్ణవే నమః" ఓం క్షౌ ఓం నమో భగవతే నరసింహాయ నమః" "ఓం భూర్భగవతే వరాహాయ నమః" (ఇవి మంత్రములు). జపా పుష్పము వలె అరుణమైన రంగు పుసుపువంటి రంగు నీల - శ్యామల - లోహిత వర్ణములు, మేఘ - అగ్ని - మధువుల వంటి రంగులు, పింగవర్ణము గల తొమ్మండుగురు నరాధిపులు నీటికి నాయకులు, తంత్రవేత్తలు విభజించిన విధముగ స్వరరూపము లైన బీజాక్షరములకు ఆ యా మంత్రము లందలి నామములను చివర చేర్చి హృదయాద్యంగములను కల్పించవలెను. వ్యంజనాది బీజాక్షరముల లక్షణము వేరుగా ఉండును.


'నమః' అనునది అంతము నందు గల మంత్రముల మధ్య దీర్ఘ స్వరములతో గూడి యున్న వ్యంజనములు అంగము లనియు, హ్రస్వస్వరములతో కూడినవి ఉపాంగము లనియు చెప్పబడును.


దీర్ఘ హ్రస్వములతో కూడినదియు, సాంగోపాంగస్వరములతో కూడినదియు, విభజింపబడిన నామాక్షరముల అంతమునందు ఉన్నదియు అగు బీజక్షరము ఉత్తమ మైనది. హృదయాది కల్పనమునకు వ్యంజనముల క్రమ మిది - తన నామము అంతము నందు గల అంగనామములతే విభక్తములై స్వబీజాక్షరముతో కూడిన, ఐదు మొదలు పండ్రెండు వరకును ఉన్న హృదయాదులను కల్పించి సిద్ధికి అనుగుణముగా ఉండునట్లు జపించవలెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Agni Maha Purana - 69 🌹*

*✍️ N. Gangadharan*

*📚. Prasad Bharadwaj *


*Chapter 25*

*🌻 Worship regarding Vāsudeva, Saṅkarṣaṇa, Pradyumna and Aniruddha - 1 🌻*


Nārada said:


1. I shall now describe to you the characteristics of the adorable formulae related to Vāsudeva and others. Vāsudeva, Saṅkarṣaṇa, Pradyumna and Aniruddha (are the four forms).


2. (The words) salutations to the lord (are said) at first along with the mystical letters a, ā, am, aḥ. (Then) beginning with the syllable ‘Om’ (and) ending with (the word) salutations and then (the words) salutations to Nārāyaṇa (are uttered).


3. Oṃ, salutations to the eternal Brahmā, Om, salutations to Viṣṇu, Om, Kṣaum, Om, salutations to the Lord Narasiṃha (are uttered).


4-6. Oṃ, bhūḥ[1], salutations to lord Varāha. The lords of men having the colour of japā (flower) (red), brown, yellow, blue, black, red, the colour of a cloud, fire, honey, (and) tawny, (are) the nine lords of vowels (and) mystical letters. The heart and the different limbs are resolved in order along with their respective names being well divided by those proficient in the tantras (branch of literature dealing with the magical and mystical worship of different deities). The characteristics of those mystical letters which are consonants are different.


7. They are divided by long vowels ending with (the word) ‘salutation’. The limbs situated in between yoked with short (vowels) are described as minor limbs.


8. The mystic syllable situated at the end of the last letter of the name which is divided is excellent. The principal and minor limbs (are composed)of long and short vowels inorder.


9-10. This is the method (of use) of consonants for arrangement in the heart (and) other (limbs). One has to repeat according to his accomplishment (the mystic formula) divided into the mystic basic syllable and their ending names (along with) the names of limbs, after having resolved the yoked twelve (limbs) beginning with the heart etc.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹

#అగ్నిపురాణం #AgniMahaPuranam


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹 . శ్రీ శివ మహా పురాణము - 585 / Sri Siva Maha Purana - 585 🌹*

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ


*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 02 🌴*


*🌻. కుమారస్వామి జననము - 5 🌻*


అగ్ని ఇట్లు పలికెను--


దేవదేవా! మహేశ్వరా! మూఢుడనగు నేను నీ సేవకుడను. నా అపరాధమును క్షమించి, నా తపమును తొలగించుము (43). ఓ స్వామీ! నీవు దీనవత్సలుడు, పరమేశ్వరుడు అగు శంకరుడవు (44).


బ్రహ్మ ఇట్లు పలికెను-


దీనవత్సలుడు, పరమేశ్వరుడు అగు ఆ శంభుడు అగ్ని యొక్క ఈ పలుకులను విని ప్రసన్నమగు మనస్సు గలవాడై అగ్నితో నిట్లనెను (45).


శివుడిట్లు పలికెను-


నీవు నా తేజస్సును గ్రహించి తప్పు పనిచేసితివి. అధికపాపమును చేసినావు గాన, నా ఆజ్ఞచే నీకీ తాపము తొలగలేదు (46). ఓ అగ్నీ! ఇపుడు నీవు నన్ను శరణుపొందినావు గాన, నేను ప్రసన్నుడనైతిని. నీకు దుఃఖమంతయూ తొలగి సుఖము లభించ గలదు (47). నా తేజస్సును ఒక యోగ్యమగు స్త్రీ యందు నిక్షేపించుము. నీకు తాపము పూర్తిగా తొలగి, సుఖమును పొందగలవు (48).


బ్రహ్మిట్లు పలికెను-


శంభుని ఈ మాటను విని, అగ్ని చేతులు జోడించి నమస్కరించి భక్తులకు సుఖములనొసంగు శంకరునితో ప్రీతి పూర్వకముగా నిట్లనెను (49). ఓ నాథా! మహేశ్వరా! ధరింప శక్యము కాని ఈ నీ తేజస్సును ధరించ గల స్త్రీ ముల్లోకములలో శక్తి తక్క మరియొకరు లేరు (50). ఓ మహర్షీ! అగ్ని ఇట్లు పలుకగా, హృదయములో శంకరునిచే ప్రేరితుడవైన నీవు అగ్నికి ఉపకారమును చేయగోరి ఇట్లు పలికితివి (51).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 SRI SIVA MAHA PURANA - 585 🌹*

*✍️ J.L. SHASTRI*

*📚. Prasad Bharadwaj *


*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 02 🌴*


*🌻 The birth of Śiva’s son - 5 🌻*


Agni said:—

43-44. O lord of gods, I am a stupid and deluded servant of yours. Forgive me my fault. Please remove my burning sensation. O lord, you are the benefactor and sympathetic to the distressed.


Brahmā said:—

45. On hearing the words of Agni, Śiva the great lord spoke delightedly to Agni. He is favourably disposed to His devotees.


Śiva said:—

46. An improper action has been committed by you in swallowing my semen. Hence your sin has become formidable at my bidding and the burning sensation has not been cured.


47. Now that you have sought refuge in me you are sure to be happy. I am pleased with you. All your misery will be dissolved.


48. Deposit carefully that semen in the womb of some good woman. You will become happy and particularly relieved of the burning sensation.


Brahmā said:—

49. On hearing these words of Śiva, Agni replied to Śiva, the benefactor of the devotees with pleasure and bowing down with palms joined in reverence.


50. “O lord Śiva, this splendour of yours is inaccessible and unbearable. There is no woman in the three worlds except Pārvatī to hold it in her womb.”


51. O excellent sage, when fire said like this, you, urged by Śiva, said thus in order to help Agni.


Continues....

🌹🌹🌹🌹🌹

#శివమహాపురాణము

#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 204 / Osho Daily Meditations - 204 🌹*

*📚. ప్రసాద్ భరద్వాజ్*


*🍀 204. ఇది మాత్రమే 🍀*


*🕉. ఇది ధ్యానం యొక్క సారాంశం: ఇది మాత్రమే. దీని గురించి తెలుసుకోవడం అంటే ధ్యానం-దీనిని చూడడం, దానిని గమనించడం, ఖండించడం, మూల్యాంకనం లేకుండా, అద్దంలా మిగిలిపోవడం. 🕉*

*మనస్సు గతంలో మరియు గతం ద్వారా లేదా భవిష్యత్తులో మాత్రమే జీవించగలదు. ప్రస్తుత క్షణం దాని సమాధి అవుతుంది: మనస్సు ప్రస్తుతంలో ఉండదు. మనస్సు లేని స్థితిలో ఉండటం అంటే ధ్యానంలో ఉండటం. ఇది గొప్ప రహస్యాలలో ఒకటిగా మారవచ్చు. ఇది దైవిక తలుపును తెరిచే తాళం చెవిగా కీలకం కావచ్చు. మనస్సులో ఏదైనా వెళుతున్నప్పుడు, గుర్తుంచుకోండి: ఇది మాత్రమే. ఇది మంచిదని చెప్పకు, చెడ్డదని చెప్పకు; దానిని పోల్చవద్దు. ఏదో ఒక విధంగా ఉండాలనే కోరిక లేదు. ఏది ఉన్నది మరియు ఏది లేనిది కాదు. ప్రతి ఒక్కరూ ఈ ఉద్రిక్తత నుండి చాలా కష్టాలను సృష్టిస్తారు.*


*ప్రజలు లేనిదాన్ని సాధించడానికి ప్రయత్నిస్తారు మరియు ఉన్నదాన్ని మరచిపోతారు. ఉదాహరణకు, మీరు ఏడ్చినప్పుడు, దానిని ధ్యానంగా చేయండి. లోతుగా చెప్పండి, ఇది మాత్రమే. దానిని మూల్యాంకనం చేయవద్దు, అలా ఉండకూడదు అని అనుకోవద్దు. ఇతరులు ఏమనుకుంటారో ఆలోచించవద్దు. అలా ఉండనివ్వండి మరియు మీరు కేవలం చల్లని, సుదూర వీక్షకుడిగా ఉండండి. ఏడవడం మంచిది కాదు లేదా చెడు ఏమీ ఎప్పుడూ మంచిది లేదా చెడు కాదు; విషయాలు కేవలం ఉన్నాయి. మనం తీర్పు చెప్పకపోతే, మనస్సు అదృశ్యమవుతుంది. మరియు మనస్సు లేకుండా వాస్తవాన్ని చూడటం అంటే సత్యాన్ని చూడటం.*

*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations - 204 🌹*

*📚. Prasad Bharadwaj*


*🍀 204. JUST THIS 🍀*


*🕉 It is the very essence of meditation: Just this. To remain aware of just this is meditation-watching it, observing it, with no condemnation, with no evaluation, just remaining like a mirror. 🕉*

*The mind can live only in the past and through the past, or in the future and through the future. The present moment becomes its grave: The mind cannot exist in this-ness. And to be in a no-mind state is to be in meditation. This can become one of the greatest secrets. It can become the very key that unlocks the door of the divine. When something is passing through the mind, remember: just this. Don't say it is good, don't say it is bad; don't compare it. Don't desire that something be otherwise. Whatever is, is, and whatever is not, is not.*


*Everybody creates much misery out of this tension. People try to attain that which is not and tend to forget that which is. For example, when you cry, just deep inside make it a meditation. Just say deep down, just this. Don't evaluate it, don't think it should not be. Don't think about what others will think. Let it be, and you just be a cool, distant watcher. Crying is neither good nor badnothing is ever good or bad; things simply are. If we don't judge, the mind starts disappearing. And to see reality without the mind is to see the truth.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹

#ఓషోరోజువారీధ్యానములు

#ఓషోబోధనలు #OshoDiscourse

#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 381-3 / Sri Lalitha Chaitanya Vijnanam - 381-3 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*మూల మంత్రము :*

*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*


*🍀 83. ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ ।*

*రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83 ॥ 🍀*


*🌻 381. 'రహెూయాగ క్రమారాధ్యా' - 3🌻*


*రహోూయాగము మహత్తరమగు యాగము. ఈ యాగదీక్ష ఫలమే ముందు నామమున 'బిందుమండలవాసిని' అని తెలుపబడినది. దేహము యొక్క పొరల లోపల వాని కాధారముగ నిలచియున్న వెన్నుపూసలో దారముకన్న సన్నముగా నున్న ప్రకాశవంతమైన సుషుమ్న నాడి, దాని లోపల యున్న చిత్రిణీ నాడిలో చల్లగ గమనము చేయుచు నుండు కుండలిని యందు శ్రద్ధ నిలువవలె నన్నచో ఏకాగ్రత, ధృడ వ్రతము, అనన్య చింతనము ప్రధానము.*


*ఇతరములు అప్రధానములు. సహస్రార పద్మమును క్రమముగ చేరి రహస్యముగ భర్తతో విహరించునది శ్రీమాత అని శ్రీ శంకర భగవత్పాదులు ఈ యాగ క్రమమును వివరించిరి. ఈ యాగమును సమయాచారమువారు, వామాచారము వారు కూడ అనుసరించు చుందురు.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 381 - 3 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️. Acharya Ravi Sarma *

*📚. Prasad Bharadwaj*


*🌻 83. Odyana pita nilaya nindu mandala vasini*

*Rahoyaga kramaradhya rahastarpana tarpata ॥ 83 ॥ 🌻*


*🌻 381. Rahoyāga-kramāradhyā रहोयाग-क्रमारध्या -3 🌻*


*A question may arise, being Śiva’s wife how She can sit on a couch with Śiva as its base and Sadāśiva (the higher form of Śiva) as the cushion. In scientific parlance, two objects cannot occupy the same space at the same time.*


*Therefore it becomes possible to interpret that Śiva and Śaktī are no way different from each other. That is why Śiva- Śaktī union assumes great importance. Scriptures also point out, that the state of bliss can be attained, only by those who always remain with Her thought and not by those who solely resort to materialistic living. *


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹

#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Comments


Post: Blog2 Post
bottom of page