top of page
Writer's picturePrasad Bharadwaj

🍀 27 - AUGUST - 2022 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🍀

🌹🍀 27 - AUGUST - 2022 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🍀🌹

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 27, శనివారం, ఆగస్టు 2022 స్ధిర వాసరే Saturday 🌹

2) 🌹 కపిల గీత - 61 / Kapila Gita - 61 🌹 సృష్టి తత్వము - 17

3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 100 / Agni Maha Purana - 100 🌹

4) 🌹. శివ మహా పురాణము - 616 / Siva Maha Purana -616 🌹

5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 235 / Osho Daily Meditations - 235 🌹

6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 402 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 402 - 2 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹27, August 2022 పంచాగము - Panchagam 🌹*

*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*

*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*

*ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : శ్రావణ అమావాస్య, పితృ అమావాస్య, Sravan Amavasya🌻*


*🍀. శ్రీ శని అష్టోత్తరశతనామ స్తోత్రం - 5 🍀*


*9. గృధ్నవాహాయ గూఢాయ కూర్మాంగాయ కురూపిణే*

*కుత్సితాయ గుణాఢ్యాయ గోచరాయ నమో నమః*

*10. అవిద్యామూలనాశాయ విద్యాఽవిద్యాస్వరూపిణే*

*ఆయుష్యకారణాయాఽపదుద్ధర్త్రే చ నమో నమః*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : సాక్షాత్కారం పొందడ మంటే ప్రత్యక్షంగా చూడడం, ప్రత్యక్షంగా వినడం, దివ్యస్ఫురణచే స్మరించడం. దృష్టి, శ్రుతి, స్మృతి. అది ఒక పరమోత్కృష్టమైన అనుభవం. దానిని ఎప్పుడైనా సరే తిరిగి పొందడానికీ వీలున్నది. 🍀*


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, శ్రావణ మాసం

దక్షిణాయణం, వర్ష ఋతువు

తిథి: అమావాశ్య 13:45:42 వరకు

తదుపరి శుక్ల పాడ్యమి

నక్షత్రం: మఘ 20:27:36 వరకు

తదుపరి పూర్వ ఫల్గుణి

యోగం: శివ 26:07:59 వరకు

తదుపరి సిధ్ధ

కరణం: నాగ 13:44:42 వరకు

వర్జ్యం: 07:30:30 - 09:14:02

మరియు 28:57:00 - 30:39:00

దుర్ముహూర్తం: 07:41:38 - 08:31:48

రాహు కాలం: 09:09:25 - 10:43:28

గుళిక కాలం: 06:01:18 - 07:35:22

యమ గండం: 13:51:35 - 15:25:38

అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:42

అమృత కాలం: 17:51:42 - 19:35:14

సూర్యోదయం: 06:01:18

సూర్యాస్తమయం: 18:33:45

చంద్రోదయం: 05:50:12

చంద్రాస్తమయం: 18:50:33

సూర్య సంచార రాశి: సింహం

చంద్ర సంచార రాశి: సింహం

పద్మ యోగం - ఐశ్వర్య ప్రాప్తి 20:27:36

వరకు తదుపరి లంబ యోగం -

చికాకులు, అపశకునం


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. కపిల గీత - 61 / Kapila Gita - 61🌹*

*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*

*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 17 🌴*


*17. ప్రకృతేర్గుణసామ్యస్య నిర్విశేషస్య మానవి|*

*చేష్టా యతః స భగవాన్ కాల ఇత్యుపలక్షితః॥*


*మనురాజపుత్రీ! అమ్మా! వాస్తవముగా పురుషోత్తముడైస భగవంతుని ప్రేరణచే గుణముల యొక్క సామ్యావస్దారూపమైన నిర్విశేష ప్రకృతి యందు చైతన్యము ఉత్పన్నమగును. అట్టి భగవంతుడే కాలము అని వ్యవహరింపబడును.*


*సత్వము రజస్సు తమస్సూ, ఈ మూడు గుణాలు సమానముగా ఉన్న స్థితిలో, దేని వలన కదలిక ఏర్పడుతుందో, అది కాలము. ప్రతీ దానిలో కదలిక గలిగించేదే కాలము.*


*సశేషం..*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Kapila Gita - 61 🌹*

*🍀 Conversation of Kapila and Devahuti 🍀*

*✍️ Swami Prabhupada. 📚 Prasad Bharadwaj*


*🌴 2. Fundamental Principles of Material Nature - 17 🌴*


*17. prakṛter guṇa-sāmyasya nirviśeṣasya mānavi*

*ceṣṭā yataḥ sa bhagavān kāla ity upalakṣitaḥ*


*My dear mother, O daughter of Svāyambhuva Manu, the time factor, as I have explained, is the Supreme Personality of Godhead, from whom the creation begins as a result of the agitation of the neutral, unmanifested nature.*


*When time agitates the neutral state of material nature, material nature begins to produce varieties of manifestations. Ultimately it is said that the Supreme Personality of Godhead is the cause of creation.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 100 / Agni Maha Purana - 100 🌹*

*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*

*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 33*


*🌻. పవిత్రారోపణ విధి - శ్రీధర నిత్యపూజా విధానము -1🌻*


అగ్నిదేవుడు పలికెను : మునీ! ఇపుడు నేను పవిత్రారోపణమను గూర్చి చెప్పెదను. సంత్సరమునందు ఒక మారు పవిత్రారోపణము చేసినచో, సంవత్సర మంతయు శ్రీహరి పూజ చేసిన ఫలము నిచ్చును.


ఆషాఢశుక్ల ఏకాదశి మొదలు కార్తిక శుక్లైకాదశి వరకు నున్న కాలమున పవిత్రారోపణము చేయవలెను. ప్రతిపత్తు విడువవలెను. ద్వితీయాదితిథులు క్రమముగ లక్ష్మాదిదేవతల తిథులు.


ద్వితీయ లక్ష్మికి, తృతీయ గౌరికి, చతుర్థి గణేశునికి, పంచమి సరస్వతికి, షష్ఠి కుమారస్వామికి, సప్తమి సూర్యునకు, అష్టమి మాతృదేతలకు, నవమి దుర్గకు, దశమి నాగులకు, ఏకాదశి ఋషులకు, ద్వాదశి విష్ణువునకు, త్రయోదశి మన్మథునకు, చతుర్దశి శివునకు, పౌర్ణమాస్యవాస్యలు బ్రహ్మకు సంబంధించినవి.


ఏ ఉపాసకుడు ఏ దేవతను ఉపాసించునో ఆతనికి ఆ దేవత యొక్క తిథి పవిత్ర మైనది.


పవిత్రారోపణ విధి అందరు దేవతలకును సమానమే. మంత్రాదులు మాత్రమే ఆయా దేవతలకు వేరు వేరుగా నుండును. పవిత్రకమును నిర్మించుటకై బంగారము, వెండి రాగి తీగలను నూలు దారము గాని ఉపమోగింపవలెను.


బ్రాహ్మణ స్త్రీ చేతితో వడికిన నూలు చాల శ్రేష్ఠమైనది. అది లభించనిచో ఏ దారము నైనను గ్రహించి, దానిని సంస్కరించి, ఉపమోగింపవలెను. దారమును మూడుపేటలు చేసి, మరల దానిని మూడు పేటలు చేసి, దానితో పవిత్రకమును నిర్మింపవలెను. నూట ఎనిమిది మొదలు అధికము లగు తంతువులతో నిర్మించిన పవిత్రకము ఉత్తమాదిశ్రేణికి చెందినదిగ పరిగణింపబడుచున్నది. పవిత్రరోపణమునకు ముందు ఇష్టదేవతను గూర్చి ఈ విధముగ ప్రార్థింపవలెను.


''ప్రభూ! క్రియాలోపమువలన కలిగిన దోషమును తొలగించుటకై నీవు ఏ సాధమును చెప్పినావో దానినే నేను చేయుచున్నాను. ఎక్కడ ఏ పవిత్రకము ఆవశ్యకమో అక్కడ అట్టి పవిత్రకమునే అర్పించగలను. నీ కృపచే ఈ కార్యమునందు విఘ్నబాధ లేవియు కలుగకుండుగాక. అవినాశి యైన పరమేశ్వరా! నీకు జయ మగుగాక.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Agni Maha Purana - 100 🌹*

*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *


*Chapter 33*

*🌻 Mode of investiture of the sacred thread for the deity and the installation of the deity - 1 🌻*


Agni said:


1. I shall describe the (mode of) installation of Hari and the benefits of worship for a year. The first day (of the lunar fortnight) at the commencement of (the month of) āṣāḍha and the concluding part (of the month) of Kārttika yields riches.


2-3. Commencing with the second day (of the lunar fortnight) (the installation) of Śrī, Gaurī, Gaṇeśa, Sarasvatī, Guha (son of Śiva), Mārtaṇḍa (Sun), the divine mothers, Durgā, Śiva and Brahmā are performed in order. To which deity one is devoted, the lunar day of that deity is sacred to him.


4-5. The mode of installation is the same (for all the deities). Only the sacred syllables are different. A thread spun by a brahmin woman (made of) gold, silver, copper, silk or cotton etc. or in its absence a purified one is made into nine folds. The investiture is done with that.


6-7. It is excellent if it is longer than one hundred and eight (finger-length) or half of it. “Whatever has been prescribed by you, O Lord, for the warding off of the discontinuance of the rite, that is being done by me O Lord. May there be no impediment here in the pavitraka rite. O Lord of undiminishing success! Grant me this”.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹 . శ్రీ శివ మహా పురాణము - 615 / Sri Siva Maha Purana - 615 🌹*

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 08 🌴*

*🌻. దేవాసుర యుద్ధము - 3 🌻*


వీరభద్రుడిట్లు పలికెను -


ఓ మహర్షీ! మహాప్రాజ్ఞా!నా శ్రేష్టమగు మాటను వినుము. ఇపుడు నేను తారకుని వధించెదను. నా పరాక్రమమును చూడుము (22). ఏ వీరులు తమ ప్రభువు రణరంగమునకు రాదగిన ఆవశ్యకతను కల్పించెదరో, అట్టి పాపులు నపుంసకులనబడుదురు. వారు యుద్ధరంగములో నశించెదరు (23). వారు పాపుల గతిని పొందెదరు. వారికి నరకము నిశ్చయము. వీరభద్రుడు ఏనాడైననూ నిందార్హమగు పనిని చేయడని నీవు ఎరుంగుము (24). ఎవరైతే శస్త్రములచే మరియు అస్త్రములచే శిథిలమైన దేహము గలవారైననూ భయము లేకుండా యుద్ధమును చెసెదరో, వారు ఇహపరలోకములలో ప్రశంసలనంది అద్భుత సుఖములను పొందెదరు (25).


విష్ణువు మొదలగు దేవతలు నా మాటలను వినెదరు గాక! నేనీనాడు కుమారస్వామి సహాయత లేకుండగనే భూమిపై తారకుడు లేకుండునట్లు చేసెదనను (26). ఇట్లు పలికి వీరభద్రుడు శూలమును ధరించి ప్రమథులతో గూడి మనస్సులో శంభుని స్మరించి తారకునితో యుద్దమును చేసెను (27). వృషభములనదిష్ఠించి శ్రేష్ఠమగు త్రిశూలములను ధరించినవారు, మహావీరులు, మూడు కన్నులవారు అగు గణములచే రణరంగము ప్రకాశించెను (28). అసంఖ్యాకములగు గణముల భయము లేనివారై కోలాహలమునుచేయుచూ వీరభద్రుని ముందిడు కొని రాక్షసులతో యుద్ధమును చేసిరి (29).


బలముతో గర్వించి ఉన్నవారు, మహావీరులు, తారకాసురుని అనుచరులు అగు ఆ రాక్షుసులు కూడా గణములను కోపముతో మర్దించుచూ యుద్ధమును చేసిరి (30). గణములకు దానవ వీరులతో మిక్కిలి ఉగ్రమగు యుద్ధము అనేక పర్యాయములు జరిగెను. అపుడు గొప్ప అస్త్ర విద్యావిశారదులగు ఆ గణములు విజయమును పొంది ఆనందించిరి (31). బలశాలురగు గణములచే పరాజితులైన ఆ రాక్షసులు యుద్ధమునుందు రుచిని గోల్పోయిరి. వారు దుఃఖితులై కల్లోలితమనస్కులై పలాయనమును చిత్తగించిరి (32).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 SRI SIVA MAHA PURANA - 615🌹*

*✍️ J.L. SHASTRI*

*📚. Prasad Bharadwaj *


*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 08 🌴*


*🌻 The battle between the gods and Asuras - 3 🌻*


Vīrabhadra said:—


22. O excellent sage, of great wisdom, listen to my weighty words. I will kill Tāraka. See my exploit today.


23. The soldiers who bring their masters to the battlefield are sinners. They are no better than eunuchs. They are doomed in the battle.


24. They will go the way of the wicked. Hell is definitely in store for them. Vīrabhadra should never be considered by you as such a despicable person.


25. Those whose bodies are rent and split with weapons and missiles, but who still fight fearlessly shall be praised here and hereafter. They derive wonderful happiness.


26. Let Viṣṇu and other gods listen to my words—I shall make the earth freed of Tāraka today even without bringing my master here.


27. Saying thus and taking up his trident, Vīrabhadra mentally meditated on Śiva and fought with Tāraka, accompanied by Pramathas.


28. With many heroic soldiers riding on bulls, wielding the tridents and possessing three eyes he shone well in the midst of that battle.


29. Keeping Vīrabhadra at their head, and shouting fearlessly jubilantly, hundreds of the Gaṇas fought with the Asuras.


30. The Asuras too, the dependants of the demon Tāraka, all equally strong and heroic, began to smash the Gaṇas furiously.


31. The terrific mutual fights between the demons and the Gaṇas happened again and again. Ultimately the Gaṇas, experts in the use of great missiles, came out victorious and were jubilant.


32. Defeated by the Gaṇas of great strength, the Asuras turned their faces and began to flee. They were distressed and agitated.


Continues....

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹





*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 235 / Osho Daily Meditations - 235 🌹*

*📚. ప్రసాద్ భరద్వాజ*


*🍀 235. అంచనాలు 🍀*


*🕉. అంచనాలు లేకపోతే, ఏమి జరగాలనే ఆలోచన మీకు లేకుంటే,

అప్పుడు విషయాలు జరుగుతాయి. 🕉*

*గొప్ప కోరికలను కలిగి ఉన్న వ్యక్తులు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉండలేరు, ఎందుకంటే వారి కోరికలతో పోలిస్తే ఏది జరిగినా అది చిన్నదే. మరియు మీరు కృతజ్ఞతగా భావించ లేనందున, జరగగలిగేది చాలా ఎక్కువ జరగదు, ఎందుకంటే ఇది కృతజ్ఞతతో మాత్రమే జరుగుతుంది. కాబట్టి మీరు ఒక దుర్మార్గపు వృత్తంలో చిక్కుకుంటారు: మీరు చాలా కోరుకుంటారు మరియు దాని కారణంగా మీరు కృతజ్ఞతతో ఉండలేరు. ఏది జరిగినా మీరు ఆ విషయాన్ని గమనించ లేరు; మీరు దానిని విస్మరిస్తారు. ఆపై మీరు మరింత మూసి వేయబడతారు. కోరిక లేకపోతే, ఏమి జరగాలనే అనే ఆలోచన మీకు లేకుంటే, విషయాలు మరింత బాగా జరుగుతాయి. మీరు వాటిని గమనించండి.*


*మీరు ఊహించకుండానే జరిగిన వాటికి మీరు చాలా ఎక్కువగా అనుభూతి చెందుతారు. మీరు ఏమీ ఊహించలేదు. మీరు రోడ్డు మీద వెళ్తే అక్కడ వెయ్యి డాలర్లు పడి ఉంటాయని, లేదా పది డాలర్ల నోటు దొరుకుతుందని మీరు ఎదురు చూస్తుంటే, ఒకవేళ దొరికినా ఇంత చిన్న దానికి 'నేను ఇక్కడ ఏమి చేస్తున్నాను?' అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. కానీ మీరు వెయ్యి డాలర్లు ఊహించకపోతే, పది డాలర్ల నోటు దొరికినా మంచిది. మీరు దానికి కృతజ్ఞతతో ఉంటే, పది డాలర్లు ఎక్కడ నుండి వచ్చాయో అదే మూలం నుండి పది మిలియన్లు రావచ్చు. కానీ అప్పుడు మీరు కృతజ్ఞతతో నిండిపోయి ఉంటారు.*

*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations - 235 🌹*

*📚. Prasad Bharadwaj*


*🍀 235. EXPECTATIONS 🍀*


*🕉. If there is no desire, if you have no idea what should happen,

then things happen. 🕉*

*People who have great desires can never feel grateful, because whatever happens is always tiny compared to their desires. And because you can't feel grateful, much more that could have happened cannot happen, because it happens only through gratefulness. So you get trapped in a vicious circle: You desire much, and because of that you cannot feel grateful. Whatever happens you can't take any note of; you simply ignore it. And then you become more and more closed. If there is no desire, if you have no idea what should happen, then things happen.*


*Those things are already happening, but now you take note of them. You feel tremendously thrilled because this has happened and you had not expected anything. If you are expecting that when you go on the road you will find a thousand dollars lying there, and you only find a ten-dollar bill, you will say, "What am I doing here?" But if you had not expected that thousand dollars, a ten-dollar bill is good. And if you are grateful, then from the same source from where the ten dollars have come, ten million can come. But you remain open in gratefulness.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹



🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 402 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 402 - 2 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*


*🍀 87. వ్యాపినీ, వివిధాకారా, విద్యాఽవిద్యా స్వరూపిణీ ।*

*మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ ॥ 87 ॥ 🍀*


*🌻 402. 'విద్యా అవిద్యా స్వరూపిణి' - 2 🌻*


*అష్టప్రకృతులలో బంధింపబడినపుడు అవిద్య ఆవరించును. విద్య అవిద్యలను తెలిసి జీవించువాడు అమృత స్వరూపుడు. విద్య భేద జ్ఞానము నిచ్చును. అవిద్య అభేద జ్ఞానము నిచ్చును. అదియే ఆత్మ జ్ఞానము, పరమాత్మ జ్ఞానము. జీవుడు తాను ఆత్మ యని యెఱిగి భేద జ్ఞానముతో సృష్టియందు, పరమాత్మ జ్ఞానముతో పరమాత్మ యందు ఉభయతారకముగ జీవించవలెనన్నచో విద్య అవిద్యలను తెలిసి యుండవలెను.*


*అట్టివాని జీవితమే సమగ్రము, పరిపూర్ణము. అవిద్యా స్వరూపము తెలియనివాడు సృష్టియందు సుఖించలేడు. ద్యాస్వరూపము తెలియనివాడు కూడ సృష్టియందు సుఖించలేడు. ఏకత్వము తెలిసిననూ లేక భిన్నత్వము తెలిసిననూ పూర్ణసుఖ ముండదు. సంపూర్ణ ఆనందము కలుగవలె నన్నచో భిన్నత్వ మందలి ఏకత్వము తెలియ వలెను. ఏక కాలమున రెండునూ తెలిసినప్పుడే జీవుడు పరిపూర్ణ ఆనందమును పొందగలడు.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 402 - 2 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj*


*🌻 87. Vyapini vividhakara vidya vidya svarupini*

*Mahakameshanayana kumudahlada kaomudi ॥ 87 ॥ 🌻*


*🌻 402. 'Vidya Avidya Swarupini' - 2 🌻*


*Avidya hovers when it is trapped in Ashtaprakrits. He who knows education and ignorance is an Eternal being. Vidya gives diversified knowledge whereas avidya gives the knowledge of unity. It is the knowledge of the divine or the Paramatma jnana. The Self has to master both and has to live by the knowledge of diversity in the physical creation and has to live by the knowledge of unity in the divine realm.*


*His life is then complete and perfect. He who does not know the knowledge of unity cannot enjoy creation. He who does not know the knowledge of unity too cannot be happy in creation. Knowing either oneness or diversity does not bring complete happiness. It is only if the knowledge of unity in diversity is known, that there may be complete happiness. A living being can attain perfect happiness only when he knows both at the same time.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Comments


Post: Blog2 Post
bottom of page