top of page
Writer's picturePrasad Bharadwaj

🍀 27 - NOVEMBER - 2022 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🍀

🌹🍀 27 - NOVEMBER - 2022 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🍀🌹

1) 🌹27 - NOVEMBER నవంబరు - 2022 SUNDAY ఆదివారం, భాను వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 288 / Bhagavad-Gita -288 - 7వ అధ్యాయము 08 జ్ఞాన విజ్ఞాన యోగము🌹

3) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 649 / Sri Siva Maha Purana - 649 🌹

4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 366 / DAILY WISDOM - 366 🌹

5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 265 🌹

6) 🌹. శివ సూత్రములు - 02 / Siva Sutras - 02 🌹. చైతన్యమాత్మా - 2 Caitanyamātmā - 2


🌹కామ శరీరము - మానసిక శరీరము 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹27, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹*

*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*

*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*

*ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : వినాయక చతుర్థి, Vinayaka Chaturthi🌻*


*🍀. ఆదిత్య స్తోత్రం - 11 🍀*


*11. ఓమిత్యుద్గీథభక్తేరవయవపదవీం ప్రాప్తవత్యక్షరేఽస్మిన్*

*యస్యోపాస్తిః సమస్తం దురితమపనయత్వర్కబింబే స్థితస్య |*

*యత్ పూజైకప్రధానాన్యఘమఖిలమపి ఘ్నన్తి కృచ్ఛ్రవ్రతాని*

*ధ్యాతః సర్వోపతాపాన్ హరతు పరశివః సోఽయమాద్యో భిషఙ్నః*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : ప్రాణ మనఃకోశముల ప్రకృతి వ్యాపారముల నుండి నీవు వేరుపడుటయే కాదు, అట్లు వేరుపడిన నీలోని పురుషుడు నిశ్చలుడూ నిర్లిప్తుడూ నైన ద్రష్ట కూడా కావాలి. 🍀*


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, హేమంత ఋతువు,

దక్షిణాయణం, మార్గశిర మాసం

తిథి: శుక్ల చవితి 16:26:47 వరకు

తదుపరి శుక్ల పంచమి

నక్షత్రం: పూర్వాషాఢ 12:39:29 వరకు

తదుపరి ఉత్తరాషాఢ

యోగం: దండ 21:33:38 వరకు

తదుపరి వృధ్ధి

కరణం: విష్టి 16:27:47 వరకు

వర్జ్యం: 19:55:40 - 21:23:00

దుర్ముహూర్తం: 16:09:58 - 16:54:47

రాహు కాలం: 16:15:34 - 17:39:35

గుళిక కాలం: 14:51:33 - 16:15:34

యమ గండం: 12:03:30 - 13:27:31

అభిజిత్ ముహూర్తం: 11:41 - 12:25

అమృత కాలం: 08:19:00 - 09:45:40

మరియు 28:39:40 - 30:07:00

సూర్యోదయం: 06:27:24

సూర్యాస్తమయం: 17:39:36

చంద్రోదయం: 09:54:56

చంద్రాస్తమయం: 21:10:43

సూర్య సంచార రాశి: వృశ్చికం

చంద్ర సంచార రాశి: ధనుస్సు

యోగాలు : శుభ యోగం - కార్య జయం

12:39:29 వరకు తదుపరి అమృత

యోగం - కార్య సిధ్ది


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 288 / Bhagavad-Gita - 288 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం - 08 🌴*


*08. రసోహమప్సు కౌన్తేయ ప్రభాస్మి శశిసూర్యయో: |*

*ప్రణవ: సర్వవేదేషు శబ్ద: ఖే పౌరుషం నృషు ||*


🌷. తాత్పర్యం :

*ఓ కుంతీపుత్రా! నీటి యందు రుచిని, సూర్యచంద్రుల యందు కాంతిని, వేదమంత్రములందు ఓంకారమును, ఆకాశము నందు శబ్దమును, నరుని యందు సామర్థ్యమును నేనే అయి యున్నాను.*


🌷. భాష్యము :

భౌతికము మరియు ఆధ్యాత్మికములనెడి తన వైవిధ్యశక్తులచే శ్రీకృష్ణభగవానుడు ఏ విధముగా సర్వవ్యాపియై యుండునో ఈ శ్లోకము వివరించుచున్నది. ఈ వివిధశక్తుల ద్వారానే భగవానుడు తొలుత దర్శింపబడి నిరాకారరూపముగా అనుభవమునకు వచ్చును. సూర్యమండలము నందుండెడి సాకారుడైన సూర్యదేవుడు తన సర్వవ్యాపకశక్తి (సూర్యకాంతి) ద్వారా దర్శనీయుడైనట్లు, శ్రీకృష్ణభగవానుడు తన దామమునందు నిలిచియున్నను సర్వత్రా వ్యాపించియుండెడి తన శక్తుల ద్వారా దర్శనీయుడగును. ఉదాహరణకు రుచి యనునది నీటి యందలి ప్రధాన విషయము. లవణపూర్ణమై యున్నందున సముద్రనీటిని త్రాగుటకు ఎవ్వరును ఇచ్చగింపరు. అనగా రుచిని బట్టియే నీటి యెడ ఎవ్వరైనను ఆకర్షణను కలిగియుందురు. అట్టి రుచి శ్రీకృష్ణభగవానుని శక్తులలో ఒకటియై యున్నది. నిరాకారవాదియైనవాడు నీటి రుచి ద్వారా దాని యందు భగవానుని ఉనికిని గాంచగా, మనుజుని దాహమును తీర్చుటకు కరుణతో రుచిగల నీటి నొసగుచున్న ఆ భగవానుని సాకారవాడి కీర్తించును. భగవానుని దర్శించుటకు ఇదియే మార్గము. వాస్తవమునకు సాకారవాదమునకు మరియు నిరాకారవాదమునకు ఎట్టి విరోధము లేదు. భగవతత్త్వము నెరిగినవాడు సాకారభావనము మరియు నిరాకారభావనము అనునవి ఏకకాలమున సమస్తమునందు నెలకొనియున్నవనియు మరియు ఆ తత్త్వములందు ఎట్టి వ్యతిరేకత లేదనియు తెలిసియుండును. కనుకనే శ్రీచైతన్యమాహాప్రభువు ఏకకాలమున ఏకత్వము మరియు భిన్నత్వము తెలిపెడి “అచింత్యభేదాభేదతత్త్వము” అనెడి తమ ఉదాత్తమగు సిద్ధాంతమును స్థాపించిరి.


సూర్యచంద్రుల కాంతి సైతము శ్రీకృష్ణభగవానుని నిరాకారతేజమైన బ్రహ్మజ్యోతి నుండియే వెలువడునటువంటిది. అలాగుననే సర్వవేదమంత్రముల ఆదిపదమైన ప్రణవాము లేదా ఓంకారము దేవదేవునే సంబోధించును. నిరాకారవాదులు శ్రీకృష్ణభగవానుని అతని అసంఖ్యాక నామముల ద్వారా సంబోధించుటకు వెరగు చెందియుండుటచే దివ్యమగు ఓంకారమును పలుకుట యందు మక్కువను చూపుదురు. కాని ఓంకారము శ్రీకృష్ణుని శబ్దప్రాతినిధ్యమై యని వారు ఎరుగజాలరు. వాస్తవమునకు కృష్ణభక్తిరసభావనపు పరిధి సర్వత్రా వ్యాపించియున్నది. దాని నెరిగినవాడు ధన్యుడు కాగలడు. అనగా కృష్ణుని గూర్చి తెలియనివారు మాయలో నున్నట్టివారే. కనుకనే కృష్ణపరజ్ఞానము ముక్తియై యుండగా, కృష్ణుని గూర్చి తెలియకుండుట బంధమై యున్నది.

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 288 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 7 - Jnana Yoga - 08 🌴*


*08. raso ’ham apsu kaunteya prabhāsmi śaśi-sūryayoḥ*

*praṇavaḥ sarva-vedeṣu śabdaḥ khe pauruṣaṁ nṛṣu*


🌷 Translation :

*O son of Kuntī, I am the taste of water, the light of the sun and the moon, the syllable oṁ in the Vedic mantras; I am the sound in ether and ability in man.*


🌹 Purport :

This verse explains how the Lord is all-pervasive by His diverse material and spiritual energies. The Supreme Lord can be preliminarily perceived by His different energies, and in this way He is realized impersonally. As the demigod in the sun is a person and is perceived by his all-pervading energy, the sunshine, so the Lord, although in His eternal abode, is perceived by His all-pervading diffusive energies. The taste of water is the active principle of water. No one likes to drink sea water, because the pure taste of water is mixed with salt. Attraction for water depends on the purity of the taste, and this pure taste is one of the energies of the Lord. The impersonalist perceives the presence of the Lord in water by its taste, and the personalist also glorifies the Lord for His kindly supplying tasty water to quench man’s thirst.


That is the way of perceiving the Supreme. Practically speaking, there is no conflict between personalism and impersonalism. One who knows God knows that the impersonal conception and personal conception are simultaneously present in everything and that there is no contradiction. Therefore Lord Caitanya established His sublime doctrine: acintya bheda- and abheda-tattva – simultaneous oneness and difference.

🌷🌷🌷🌷🌷


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 . శ్రీ శివ మహా పురాణము - 649 / Sri Siva Maha Purana - 649 🌹*

*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 15 🌴*

*🌻. గణేశ యుద్ధము - 4 🌻*


మహాబలుడగు గణేశుడు పరిఘను చేతబట్టుట గాంచి నేను వెంటనే పలాయనము చిత్తగించితిని (34), 'పొండు పొండు' అని పలుకతూ ఆతడు వారిని పరిఘతో మోదెను. కొందరు వారంతట వారే క్రిందబడిరి. మరికొందరిని ఆతడు పడవైచెను (35). మరికొందరు క్షణములో శివుని దరిజేరి ఆ వృత్తాంతమును సర్వమును శివునకు విన్నవించుకొనిరి (36). లీలాపండితుడగు శివుడు వారి ఆ దురవస్థను గాంచి ఆ వృత్తాంతమును విని పట్టజాలని కోపమును పొందెను (37).


అపుడాయన ఇంద్రుడు మొదలగు దేవగణములను, షణ్ముఖుడు, మొదలగా గల గణములను, భూతప్రేత పిశాచములను అందరినీ ఆదేశించెను (38). శివునిచే ఆజ్ఞాపించబడిన ఆ వీరులందరు ఆ గణశుని సంహరించు కోరికతో ఆయుధములనెత్తి పట్టుకొని ఎవరి వీలును బట్టి వారు అన్నివైపులనుండియు ముట్టడించిరి (39). ఎవరెవరి వద్ద ఏయే ఆయుధములు గలవో వారు వారు ఆయా ఆయుధములను ఆ గణేశునిపై బలముగా ప్రయోగించిరి (40). స్థావర జంగమాత్మకమగు ముల్లోకములలో పెద్ద హాహాకారము చెలరేగెను. ముల్లోకములలోని జనులందరు సందేహమును పొందిరి (41).


బ్రహ్మ గారి ఆయుర్ధాయము పూర్తికాలేదు గదా! శివుని ఇచ్ఛచే బ్రహ్మాండము కాలము కాని కాలమందు తనంత తానుగా వినాశనమును పొందుచున్నది (42). అచటకు విచ్చేసిన షణ్ముఖుడు మొదలగు గణములు మరియు దేవతలు, తమ ఆయుధములు వ్యర్థము కాగా పరమాశ్చర్యమును పొందిరి (43).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 SRI SIVA MAHA PURANA - 649🌹*

*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *


*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 15 🌴*


*🌻 Gaṇeśa’s battle - 4 🌻*


34. On seeing the powerful Gaṇeśa seizing the iron club I began to run away immediately.


35. The others too who were shouting “Go, Go” were struck down with the iron club. Some fell themselves and some were felled by him.


36. Some of them fled to Śiva in a trice and intimated to him the details of the incident.


37. On seeing them in that plight and on hearing the news, Śiva, an adept in sports became very angry.


38. He issued directives to Indra and other gods, to the Gaṇas led by the six-faced Kumāra and to goblins, ghosts and spirits.


39. At the bidding of Śiva they all desired to kill Gaṇeśa. Lifting up their weapons in a suitable manner they came there from all directions.


40. Whatever weapon they had was hurled on Gaṇeśa with force.


41. There was a great hue and cry in all the three worlds consisting of the mobile and immobile. The inhabitants of the worlds were in a great fix and uncertainty.


42. “Brahma’s life span is not over, but the whole universe is undergoing untimely destruction. Certainly it is due to Śiva’s wish.


43. The sixfaced deity and the other gods who came there failed to use their weapons effectively. They were very much surprised.


Continues....

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹





*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 366 / DAILY WISDOM - 366 🌹*

*🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀*

*📝. ప్రసాద్ భరద్వాజ్*


*🌻31. అస్తిత్వం - చైతన్యం మరియు ఆనందం🌻*


*చైతన్యం అనే అస్తిత్వం యొక్క లక్షణం ఆనందం. ఇది ఎందుకు ఆనందం? ఎందుకంటే, మీరు అనుభవించే బాధలు, కష్టాలు, పరిమితులన్ని కూడా మీ స్వభావం యొక్క పరిమితుల నుంచి పుడతాయి. ఒక వ్యక్తి అనంతుడు అయినప్పుడు, అన్ని కోరికలు నెరవేరుతాయి. అనంతత్వంలో అన్ని కోరికలు నశిస్తాయని అందరూ అనుకుంటారు కానీ అలా కాదు. అవి నెరవేరబడతాయి. మనం ఇప్పుడు కేవలం వస్తువుల యొక్క నీడను మాత్రమే అనుభూతి చెందుతున్నాము.*


*కానీ అక్కడ, ఒకరు స్వప్నంలోనుంచి మేల్కొని వస్తువుల యొక్క వాస్తవికతను చూసినట్లుగా, ఒక వ్యక్తి వస్తువుల యొక్క మూలరూపం తానే అవుతాడు. ఈ బ్రహ్మానందం కూడా అస్తిత్వం-చైతన్యం నుండి వేరు కాదు. అస్తిత్వమే చైతన్యం. అదే ఆనందం. గాఢనిద్రలో స్వయం అస్తిత్వం-చైతన్యం-ఆనందంగా ఉంటే, అది స్వప్న మరియు జాగృత స్థితుల్లో వేరేలా ఉంటుందా? ఉండదు, ఎందుకంటే ఇది విడదీయరానిది, అందువలన, అనంతం; అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. అందువలన, ముఖ్యంగా, స్వయమే సత్-చిత్-ఆనందం. అస్తిత్వం-చైతన్యం-ఆనందం. ఇక్కడ అనంతం మరియు శాశ్వతత్వం ఒకదానిలో ఒకటి ఏకత్వంగా మిళితం అవుతాయి.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 DAILY WISDOM - 366 🌹*

*🍀 📖 from The Philosophy of Religion 🍀*

*📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj*


*🌻31. Existence Which is Consciousness is Bliss🌻*


*Existence which is Consciousness is of the character of Bliss. Why is it Bliss? Because, all suffering and finitude, every difficulty and penury of any kind, is the result of the finitude of one's nature. When one has become the Infinite, all desires are fulfilled. The desires are not abolished or destroyed in the Infinite, as people may imagine. All wishes are totally fulfilled in their reality. We enjoy at present dream objects, a shadow of the substance, as it were.*


*But there, one becomes the archetype or the original of things, as if one in dream rises into the waking life and beholds the reality of things as they are. Even this Bliss is not separate from Existence-Consciousness. Existence, which is Consciousness, itself is bliss. If the Self is Existence-Consciousness-Bliss in deep sleep, can it be otherwise in the waking and dream states? No, because it is indivisible, thus, infinite; it would be the same always. Thus, essentially, the Self is Sat-Chit-Ananda, Existence-Consciousness-Bliss. Here Infinity and Eternity get blended into All-Being.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 265 🌹*

*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*


*🍀. అహమెప్పుడు 'కాదు' అంటుంది. కాదు అన్నది అహానికి ఆహారం. అవును అన్నది సృజనాత్మకం. అవును' అన్నది సృజనకారుడి మార్గం. ప్రేమికుడి మార్గం. సమస్తానికి లొంగిపోవడం. అవును అంటే శరణం, కాదు అంటే యుద్ధం.🍀*


*మనిషి 'కాదు' లో లేదా 'అవును'లో జీవించవచ్చు. నువ్వు 'కాదు'లో నీ జీవితాన్ని జీవిస్తే నువ్వు యుద్ధవీరుడవుతావు. ఎప్పుడూ సంఘర్షణలో వుంటావు. అప్పుడు జీవితం కేవలం ఘర్షణ అవుతుంది. నువ్వు ప్రతిదానికీ వ్యతిరేకంగా పోట్లాడతావు. అది ఓడిపోయే యుద్ధమే కావచ్చు. నువ్వు ఓటమికి సిద్ధం కావాలి. వ్యక్తి సమస్తానికి వ్యతిరేకంగా పోరాడి గెలవలేడు. ఆ అభిప్రాయమే తప్పు. కానీ అహం అలా అంటుంది. అహమెప్పుడు 'కాదు' అంటుంది. కాదు అన్నది అహానికి ఆహారం. అవును అన్నది సృజనాత్మకం. అవును' అన్నది సృజనకారుడి మార్గం. ప్రేమికుడి మార్గం.*


*అవును అంటే శరణం, కాదు అంటే యుద్ధం, అవును' అంటే లొంగిపోవడం. సమస్తానికి లొంగిపోవడం. సమస్తానికి లొంగడంలో సంఘర్షణ లేదు. అవును'కు ఎట్లాంటి నిబంధనలూ పెట్టకు. అప్పుడు నువ్వు ఆశ్చర్యపోతావు. జీవితం సరిహద్దులు దాటి సాగుతుంది. జీవితంలో కాంతి వస్తుంది. సౌందర్యం వస్తుంది. అనూహ్యమైన దయ వస్తుంది. జీవితం అన్నది అంతం లేని పరవశ మవుతుంది. దానికి నువ్వు తలుపులు, కిటికీలు తెరవాలి. సూర్యుడికి, చంద్రుడికి, వర్షానికి, సమస్తానికి 'అవును' అని ఆమోదం తెలుపు.*


*సశేషం ...*

🌹 🌹 🌹 🌹 🌹



🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. శివ సూత్రములు - 02 / Siva Sutras - 02 🌹*

*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*

*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌻. 1. చైతన్యమాత్మా - 2 🌻*


*వ్యక్తులందరికీ వివిధ స్థాయిల స్పృహ ఉంటుంది. అత్యున్నత స్థాయి స్పృహను పొందిన వాడు జ్ఞానంతో నిండి ఉంటాడు. అయితే అది విజ్ఞానం అతనికి ప్రసాదించినది కాదు. అతను తన స్వంత ప్రయత్నాల ద్వారా ఈ జ్ఞానాన్ని పొందాడు, అంటే ఆధ్యాత్మిక గురువు నుండి నేర్చుకోవడం, అతనిని అభ్యసించడం మొదలైనవి. జ్ఞానాన్ని సంపాదించడానికి అనేక పద్ధతులు ఉన్నాయి, అయితే గురువు నుండి పొందడం సరైనదిగా పరిగణించ బడుతుంది. జ్ఞానాన్వేషకుల మదిలో తలెత్తే పనికిమాలిన సందేహాలకు సమాధానం చెప్పగలిగిన వారు ఎవరైనా ఉండాలి. ఒకరికి సందేహం రాకపోతే, అతను తన అభ్యాస ప్రక్రియలో తీవ్రంగా లేడని అర్థం.*


*ప్రబలంగా ఉన్న అజ్ఞానం యొక్క స్థాయి కారణంగా స్పృహ స్థాయి వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటుంది. జ్ఞాన సముపార్జన ద్వారానే ఈ అజ్ఞానం తొలగిపోతుంది. ప్రస్తుత సందర్భంలో, జ్ఞానం లేదా అజ్ఞానం అంటే ఆధ్యాత్మికత స్థాయి మాత్రమే. కాబట్టి, ముఖ్యమైనది సాధన యొక్క వ్యవధి కాదు, కానీ అభ్యాసం యొక్క నాణ్యత. కొన్ని క్షణాల అధిక ఏకాగ్రత శివుడిని సాధించడానికి సరిపోతుంది. అన్ని అభ్యాసాలు ఆ కొన్ని క్షణములకు మాత్రమే దారి తీస్తాయి, ఇది ఒకరి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఏ క్షణంలోనైనా జరగవచ్చు.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Siva Sutras -02 🌹*

*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*

*✍️. Acharya Ravi Sarma*

📚 Prasad Bharadwaj*


*🌻1. Caitanyamātmā - 2 🌻*


*All the individuals have different levels of consciousness. The one who has acquired the highest level of consciousness is full of knowledge. Knowledge is not something that is gifted to him. He has acquired this knowledge through his own efforts, learning from a spiritual preceptor, or by reading him, etc. There are many methods of acquiring knowledge, though acquiring from a learned guru is considered as the right one. There should be someone who is able to answer trivial doubts that arise in the minds of the seekers of knowledge. If one does not get a doubt, then it means he is not serious in his learning process.*


*The level of consciousness varies from person to person due to the level of ignorance that prevails. This ignorance can be removed only by acquiring knowledge. In the present context, knowledge or ignorance means only the level of spirituality. So, what is important is not the duration of the practice, but the quality of the practice. A few seconds of high concentration is more than enough to attain Shiva. All the practice leads only to those few seconds, which could happen any moment in one’s spiritual journey.*


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹 Siva Sutras -02 🌹*

*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*

*✍️. Acharya Ravi Sarma*

📚 Prasad Bharadwaj*


*🌻1. Caitanyamātmā - 2 🌻*


*All the individuals have different levels of consciousness. The one who has acquired the highest level of consciousness is full of knowledge. Knowledge is not something that is gifted to him. He has acquired this knowledge through his own efforts, learning from a spiritual preceptor, or by reading him, etc. There are many methods of acquiring knowledge, though acquiring from a learned guru is considered as the right one. There should be someone who is able to answer trivial doubts that arise in the minds of the seekers of knowledge. If one does not get a doubt, then it means he is not serious in his learning process.*


*The level of consciousness varies from person to person due to the level of ignorance that prevails. This ignorance can be removed only by acquiring knowledge. In the present context, knowledge or ignorance means only the level of spirituality. So, what is important is not the duration of the practice, but the quality of the practice. A few seconds of high concentration is more than enough to attain Shiva. All the practice leads only to those few seconds, which could happen any moment in one’s spiritual journey.*


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. కామ శరీరం ~ మానసిక శరీరం 🌹*


*మనలో నిరంతరం ఎన్నో భావాలు ఆలోచనలు చెలరేగుతూ ఉంటాయి.. ఈ భావాలే భావ చిత్రాలు గా మారతాయి..( Thought Forms ).*


*ఈ భావాల్లో కోరిక ల ద్రవ్యం దానికి సంబంధించిన ఆలోచన ల ద్రవ్యం రెండు కూడా ఉంటాయి. ఈ భావ చిత్రం లో కామ మానసిక శరీరాల రెండింటి తత్త్వం ఉందని తెలుసుకోవాలి.*


*మనం సృష్టించిన ఒక భావ చిత్రం లో మన లోని కోరిక , దాని గురించిన ఆలోచన ప్రాధమికం గా ఉంటాయి.*


*మన లోని కోరిక ,దానికి సంబంధించిన ఆలోచన ఎంత గాఢంగా ఉంటే , ఆ భావ చిత్రం అంత దృఢంగా. తయారు అవుతుంది.*


*ప్రతిరోజు ఒకే కోరిక తో కూడిన ఆలోచన నిరంతరాయంగా ఒకే సమయానికి కనుక ఏర్పడితే, ఆ ఆలోచన శక్తిమంతమైన. భావచిత్రంగా మారుతుంది. ధ్యానం దీని పై కొనసాగితే అది ఇంకా శక్తిమంతం అవుతుంది.*


*దీనిని ఒకరికి ఆశీర్వచనం గా మనం పంపిస్తే, దానిని స్వీకరించే వారికి ఎంతో. ప్రయోజనం కలుగుతుంది. ఇలాంటి భావ చిత్రాల వల్ల దాని తత్త్వాన్ని బట్టి అనుకూల ప్రతికూల ప్రభావాలు రెండూ కూడా కలిగే అవకాశముంది..*


*అధ్యాత్మిక ప్రస్థానం లో వేగం గా ప్రయాణం చేద్దామనుకునే సాధకులు దీనిని చాలా చక్కగా ఉపయోగించుకో వచ్చును.*


*మనం ఒక సమయం లో కొన్ని వందల మంది మధ్య లో ఉన్నప్పుడు కొన్ని వందల మంది సృష్టించి వదిలి పెట్టే భావ చిత్రాల మధ్య లో మనం ఎంతో సమయం ఉండ వలసి వస్తుంది..*


*మనలను మనం శక్తీ మంతం గా దృఢ పరచుకోక పోతే మనవి కానీ ఈ భావ చిత్రాల ప్రభావానికి మనం లోను కాక తప్పదు..చాలామందికి దిష్టి ఇలాగే తగులుతుంది...*


*మనం ఒకసారి పొద్దుటి నుండి రాత్రి వరకు మన లో చెల రేగే భావోద్వేగాలను, మనం సృష్టించే భావ చిత్రాలను ఒకసారి పరిశీలించుకోవడం చాలా అవసరం.. నిజానికి ఇవే మన కర్మని సృష్టిస్తున్నాయి.*


*మనకు ఒక రోజు లో కొంత భాగం చిరాకుగా, మరి కొంతభాగం ఆహ్లాదంగా , చిలిపి గా, క్రూరంగా, దయగా, దుఃఖం తో ఇలా ఎన్నో భావాలతో నిండి ఉన్నట్లుగా అనిపిస్తుంది.*


*దీనికి కారణం మనం గతం లో ఇలా పరస్పర విరుద్ధ భావాలతో కూడిన భావ చిత్రాలను, దానికి సంబంధించిన కర్మని చేశామనే అర్ధం కదా.*


*ఈ విషయాల దృష్ట్యా మనం ఇంకో విషయం పై దృష్టి ఉంచాలి. ఈ భావ చిత్రాల వల్లనే మనం మన కామ మానసిక శరీరాల ను ప్రతి క్షణం మనమే తయారు చేసుకుంటున్నాము.*


*మన లో చెలరేగే కోరికలు మన కామ శరీరాన్ని, ఆలోచనలు మానసిక శరీరాన్నీ నిర్మిస్తున్నాయి. ఇది నిరంతరం సాగే ప్రక్రియ. ఈ కారణం గా ఇంద్రియ నిగ్రహం ఎంతో అవసరం. మనం ఉత్తమ ఆలోచనలు, కోరికలు పఠనం, ధ్యానం వల్ల చాలా ఉత్తమ కామ మానసిక శరీరాలు. తయారు అవుతాయి.*


*జీవితానికి ఒక లక్ష్యం, దానికి తగిన ప్రణాళిక , దానికి అవసరమైన సాధన మనం రూపొందించుకుంటే దీనికి తగిన కర్మలే చేస్తాము. నిర్లక్ష్యం గా అనాలోచితం గా సోమరితనం తో తెలువి తక్కువ గా జీవించము..*


*ఇలా ఒక యోగాభ్యాసానికి అనుగుణమైన రీతి లో మన జీవితాన్ని తీర్చి దిద్దుకుంటే, ఈ జన్మ లోను, వచ్చే జన్మ లోను కూడా మన కర్మలు మనం కోరుకున్న ఫలితాలు ఇస్తాయి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Comments


Post: Blog2 Post
bottom of page