top of page
Writer's picturePrasad Bharadwaj

🍀 28 - DECEMBER - 2022 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🍀

🌹🍀 28 - DECEMBER - 2022 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🍀🌹

1) 🌹 28 - DECEMBER - 2022 WEDNESDAY, బుధవారం సౌమ్య వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹 కపిల గీత - 110 / Kapila Gita - 110 🌹 సృష్టి తత్వము - 66

3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 702 / Vishnu Sahasranama Contemplation - 702 🌹 🌻702. సద్భూతిః, सद्भूतिः, Sadbhūtiḥ🌻

4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 663 / Sri Siva Maha Purana - 663 🌹 🌻. గణాలకు అధిపతిగా పట్టాభిషేకం - గణేశుని వ్రత వర్ణనము - 1 / Gaṇeśa crowned as the chief of Gaṇas - Description of Ganesha Vrata - 1 🌻

5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 284 / Osho Daily Meditations - 284 🌹 284. షరతులు లేనిది / UNCONDITIONING

6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 421 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 420 - 1 🌹 🌻 421. 'వ్యాహృతి' - 1 / 'Vyahrti' - 1🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹28, డిసెంబరు, December 2022 పంచాగము - Panchagam 🌹*

*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*

*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*

*ప్రసాద్ భరద్వాజ*


*🌺. పండుగలు మరియు పర్వదినాలు : స్కంద షష్టి, Skanda Sashti 🌺*


*🍀. శ్రీ గణేశ హృదయం - 1‌ 🍀*


*1. ఓం గణేశమేకదంతం చ చింతామణిం వినాయకమ్ |*

*ఢుంఢిరాజం మయూరేశం లంబోదరం గజాననమ్*

*2. హేరంబం వక్రతుండం చ జ్యేష్ఠరాజం నిజస్థితమ్ |*

*ఆశాపూరం తు వరదం వికటం ధరణీధరమ్*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : సాధించ వలసినది : మెలకువ యందలి పైపొరలోని నీ సంకల్పం కంటే, బుద్ధి కంటే, అడుగు పొరలోని నీ మనస్సు శక్తిమంతము, సువిశాలము, కార్య సాధకమునని తెలుసుకో. కాని, ఈ రెండిటికంటె బలవత్తరమైనది ఆత్మశక్తి. కావున, భయాందోళనలను, ఆశాప్రవృత్తులను వదలి, ఆత్మ యొక్క పరమ గంభీర ప్రశాంతినీ, సహజ ప్రాభవాన్నీ సాధించు. 🍀*


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌, హేమంత ఋతువు,

దక్షిణాయణం, పుష్య మాసం

తిథి: శుక్ల షష్టి 20:45:37 వరకు

తదుపరి శుక్ల-సప్తమి

నక్షత్రం: శతభిషం 12:46:59

వరకు తదుపరి పూర్వాభద్రపద

యోగం: సిధ్ధి 14:20:40 వరకు

తదుపరి వ్యతీపాత

కరణం: కౌలవ 09:46:44 వరకు

వర్జ్యం: 18:53:28 - 20:25:20

దుర్ముహూర్తం: 11:55:15 - 12:39:40

రాహు కాలం: 12:17:27 - 13:40:43

గుళిక కాలం: 10:54:12 - 12:17:27

యమ గండం: 08:07:41 - 09:30:56

అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:39

అమృత కాలం: 06:04:36 - 07:33:48

మరియు 28:04:40 - 29:36:32

సూర్యోదయం: 06:44:26

సూర్యాస్తమయం: 17:50:29

చంద్రోదయం: 11:08:20

చంద్రాస్తమయం: 23:07:44

సూర్య సంచార రాశి: ధనుస్సు

చంద్ర సంచార రాశి: కుంభం

యోగాలు: మానస యోగం - కార్య

లాభం 12:46:59 వరకు తదుపరి

పద్మ యోగం - ఐశ్వర్య ప్రాప్తి


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. కపిల గీత - 110 / Kapila Gita - 110🌹*

*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*

*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 66 🌴*


*66. గుదం మృత్యురపానేన నోదతిష్థత్తదా విరాట్|*

*హస్తావింద్రో బలేనైవ నోదతిష్ఠత్తదా విరాట్॥*


*మృత్యుదేవత అపానముతో గూడి గుదము నందు ప్రవేశించెను. కాని, విరాట్పురుషుడు లేవలేదు. ఇంద్రుడు బలముతో గూడి చేతుల యందును ప్రవేశించెను. కాని, అతడు మేల్కొనలేదు.*


*సశేషం..*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Kapila Gita - 110 🌹*

*🍀 Conversation of Kapila and Devahuti 🍀*

*📚 Prasad Bharadwaj*


*🌴 2. Fundamental Principles of Material Nature - 66 🌴*


*66. gudaṁ mṛtyur apānena nodatiṣṭhat tadā virāṭ*

*hastāv indro balenaiva nodatiṣṭhat tadā virāṭ*


*The god of death entered His anus with the organ of defecation, but the virāṭ-puruṣa could not be spurred to activity. The god Indra entered the hands with their power of grasping and dropping things, but the virāṭ-puruṣa would not get up even then.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 702 / Vishnu Sahasranama Contemplation - 702🌹*


*🌻702. సద్భూతిః, सद्भूतिः, Sadbhūtiḥ🌻*


*ఓం సద్భూతయే నమః | ॐ सद्भूतये नमः | OM Sadbhūtaye namaḥ*


*సన్నేవ పరమాత్మా చిదాత్మ బోధాత్ స్వభాసనాత్ ।*

*సాదేవ తైవ సద్భూతిర్ నేతరేత్యుచ్యతే బుధైః ॥*

*ప్రతీతేర్బాధ్యమానత్వాన్నసన్నాప్యసదేవ సః ।*

*శ్రౌతోవా యౌక్తికో బాధః ప్రపఞ్చస్య వివక్షితః ॥*


*'సన్‍' అను 'భూతి' అనగా 'అనుభూతి' ఎవని విషయమున గోచరము అగునో అట్టి పరమాత్మ సద్భూతిః అనబడుచున్నాడు.*


*సత్తా అను నామపు నిర్వచనము 'సన్‍' అను అనుభూతియే పరమాత్మ కావున పరమాత్మ త్రికాలాఽబాధితమగు అనుభూతియే - ఎన్నడును ఏ విధముగను త్రోసివేయ వీలుకాని అనుభూతి రూపమునుండు చిత్తత్త్వమే తన రూపముగా కలవాడు అని తేలుచున్నది. అనగా ఉనికి నుండి విడదీయరాని ఎరుకయే పరమాత్ముని రూపము కావున పరమాత్ముని విషయమున 'సద్భూతిః' అను నామము వర్తించదగియున్నదని భావము.*


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 702🌹*


*🌻702. Sadbhūtiḥ🌻*


*OM Sadbhūtaye namaḥ*


सन्नेव परमात्मा चिदात्म बोधात् स्वभासनात् ।

सादेव तैव सद्भूतिर् नेतरेत्युच्यते बुधैः ॥

प्रतीतेर्बाध्यमानत्वान्नसन्नाप्यसदेव सः ।

श्रौतोवा यौक्तिको बाधः प्रपञ्चस्य विवक्षितः ॥


*Sanneva paramātmā cidātma bodhāt svabhāsanāt,*

*Sādeva taiva sadbhūtir netaretyucyate budhaiḥ.*

*Pratīterbādhyamānatvānnasannāpyasadeva saḥ,*

*Śrautovā yauktiko bādhaḥ prapañcasya vivakṣitaḥ.*


*Sat is paramātmā of the nature of intelligence not being sublated and as it is shining, it is Sadbhūtiḥ. What is different from Sat i.e., Brahman, the world is not so as it appears and is sublated. As it appears, it is not asat or unreal; as it is sublated, it is not sat (Real). It is not sat nor is it asat.*



🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

सद्गतिस्सत्कृतिस्सत्ता सद्भूतिस्सत्परायणः ।शूरसेनो यदुश्रेष्ठस्सन्निवासस्सुयामुनः ॥ ७५ ॥

సద్గతిస్సత్కృతిస్సత్తా సద్భూతిస్సత్పరాయణః ।శూరసేనో యదుశ్రేష్ఠస్సన్నివాసస్సుయామునః ॥ 75 ॥

Sadgatissatkr‌tissattā sadbhūtissatparāyaṇaḥ,Śūraseno yaduśreṣṭhassannivāsassuyāmunaḥ ॥ 75 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 . శ్రీ శివ మహా పురాణము - 663 / Sri Siva Maha Purana - 663 🌹*

*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 18 🌴*

*🌻. గణాలకు అధిపతిగా పట్టాభిషేకం - గణేశుని వ్రత వర్ణనము - 1🌻*


నారదుడిట్లు పలికెను -


ఓ ప్రజాపతీ! పార్వతీ తనయుడు జీవించెను ఆమె తన పుత్రుని చూచెను. ఆ తరువాత అచట ఏమాయెను? అ విషయమును దయతో ఇప్పుడు చెప్పుము (1).


బ్రహ్మ ఇట్లు పలికెను -


ఓ మహర్షీ! పార్వతీ తనయుడు జీవించెను. దేవి ఆతనిని చూచెను. ఆ తరువాత జరిగిన మహోత్సవమును గురించి నీకిపుడు చెప్పెదను (2).


ఓ మునీ! జీవించిన ఆ పార్వతీ పుత్రుడు చింత గాని, వికారము గాని లేకుండ నుండెను. అపుడా గజాననుని దేవతలు, గణనాయకులు అభిషేకించిరి (3). పార్వతీదేవి తన కుమారుని చూచి ఆనందముతో నిండిన మనస్సు గలదై ఆ బాలకుని చేతులతో దగ్గరకు తీసుకొని ఆ లింగనము చేసుకొనెను (4). ఆ జగన్మాత తన పుత్రుడగు ఆ గణేశునకు వివిధ వస్త్రములను, అనేక అలంకారములను ప్రీతితో ఇచ్చెను (5).


ఆ దేవి గణేశుని ఆదరించి అనేక సిద్ధులను ఇచ్చి దుఃఖములనన్నిటినీ పోగొట్టే తన చేతితో ఆతనిని స్పృశించెను(6). శాంకరీ దేవి కుమారుని ఆదరించి ముఖమును ముద్దాడి ప్రీతితో వరములనిచ్చెను. ఆమె ఇట్లు పలికెను : నాయనా! నీకు ఇపుడు పుట్టుటతోడనే ఆపద కలిగినది (7).


నీవు ధన్యుడవు కృతకృత్యుడవు. నిన్ను దేవతలందరు మున్ముందుగా పూజించెదరు. నీవు సర్వకాలముల యందు దుఃఖరహితుడవై ఉండెదవు (8). ఇపుడు నీ ముఖము నందు సిందూరము కనబడుచున్నది. కావున మానవులు నిన్ను సర్వదా సిందూరముతో పూజించెదరు (9).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 SRI SIVA MAHA PURANA - 663🌹*

*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *


*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 18 🌴*


*🌻 Gaṇeśa crowned as the chief of Gaṇas - Description of Ganesha Vrata - 1 🌻*


Nārada said:—

1. O lord of subjects, when the son of Pārvatī was resuscitated and seen by.the goddess, what happened then? Please narrate to me now.


Brahmā said:—

2. O great sage, when the son of Pārvatī was resuscitated and seen by the goddess, listen to what happened there. I shall narrate the jubilation that ensued.


3. O sage, that son of Pārvatī was resuscitated. He was free from distress and perturbation. Then he was crowned by the gods and the leaders of Gaṇas.


4. On seeing her son, Pārvatī was highly delighted. Taking him up with both her hands she embraced him joyously.


5. She then lovingly gave him different clothes and ornaments.


6. He was honoured by the goddess who bestowed all Siddhis on him and touched him with her hand that removes all distress.


7. After worshipping her son, and kissing his face, she granted him boons with affection and said—“You have had great distress since your very birth.


8. You are blessed and contented now. You will receive worship before all the gods. You will be free from distress.


9. Vermillion is visible on your face now. Hence you will be worshipped with vermillion by all men always.


Continues....

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 284 / Osho Daily Meditations - 284 🌹*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🍀 284. షరతులు లేనిది 🍀*


*🕉. ప్రేమ అనేది షరతులు లేనిది. ఇది కేవలం పాత నమూనాలను తీసివేస్తుంది మరియు మీకు కొత్త వాటిని అందించదు. 🕉*


*ప్రేమికులు చిన్నపిల్లలుగా మారడం దాదాపు ఎల్లప్పుడూ జరుగుతుంది-ఎందుకంటే ప్రేమ మిమ్మల్ని అంగీకరిస్తుంది. ఇది మీపై ఎటువంటి డిమాండ్లను చేయదు. ప్రేమ ఇలా ఉండు, అలా ఉండు అని చెప్పదు. ప్రేమ కేవలం 'మీరే ఉండండి. నువ్వంత మంచివాడివి. నువ్వెంత అందంగా ఉన్నావు.' అంటుంది. ప్రేమ మిమ్మల్ని అంగీకరిస్తుంది. అకస్మాత్తుగా మీరు మీ ఆదర్శాలు, 'తప్పక,' వ్యక్తిత్వాలను వదులుకోవడం ప్రారంభిస్తారు. మీరు మీ పాత చర్మాన్ని వదలండి, మళ్లీ మీరు పిల్లలవుతారు. ప్రేమ యువకులను చేస్తుంది.*


*మీరు ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నారో, మీరు అంత యవ్వనంగా ఉంటారు. మీరు ప్రేమించనప్పుడు మీరు వృద్ధాప్యంతో ఉంటారు. ఎందుకంటే మీరు ప్రేమించనప్పుడు మీతో మీరు సంబంధాన్ని కోల్పోతారు. ప్రేమ అనేది మరొకరి ద్వారా మిమ్మల్ని మీరు సంప్రదించడం తప్ప మరొకటి కాదు. మిమ్మల్ని అంగీకరించే వ్యక్తి, మీలాగే మిమ్మల్ని ప్రతిబింబించే వ్యక్తి. అన్ని షరతులను వదులుకోవడానికి ప్రేమ సరైన పరిస్థితి. ప్రేమ అనేది షరతులు లేనిది. ఇది కేవలం పాత నమూనాలను తీసివేస్తుంది మరియు మీకు కొత్త వాటిని అందించదు. మీకు కొత్త పంథా ఇస్తే అది ప్రేమ కాదు రాజకీయం.*

*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹



*🌹 Osho Daily Meditations - 284 🌹*

*📚. Prasad Bharadwaj*


*🍀 284. UNCONDITIONING 🍀*


*🕉. Love is an unconditioning. It simply takes away the old patterns and does not give you new ones. 🕉*


*It almost always happens that lovers become childlike-because love accepts you. It makes no demands on you. Love does not say, "Be this, be that." Love simply says, "Be yourself. You are good as you are. You are beautiful as you are." Love accepts you. Suddenly you start dropping your ideals, "shoulds," personalities. You drop your old skin, and again you become a child. Love makes people young.*


*The more you love, the younger you will remain. When you don't love you start becoming old, because when you don't love you lose contact with yourself. Love is nothing but coming in contact with yourself via the other, somebody who accepts you, who mirrors you as you are. Love can be the right situation in which to drop all conditioning. Love is an unconditioning. It simply takes away the old patterns and does not give you new ones. If it gives you a new pattern, it is not love, but politics.*

*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 421 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 421 - 1 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*


*🍀 90. చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।*

*గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥ 🍀*


*🌻 421. 'వ్యాహృతి' - 1🌻*


*ఉచ్చారణమున పుట్టునది శ్రీమాత అని అర్థము. సంకల్పము పరము నుండి కలిగినపుడు పశ్యంతి అగుచున్నది. భాష రూపమును దాల్చినపుడు మధ్యమ అగుచున్నది. ముఖము నుండి ఉచ్చరింపబడినపుడు వైఖరి యగుచున్నది. పరాస్థితి నుండి మూడు దశలలో వాక్కు ఉచ్చరింపబడు చున్నది. ఈ మూడు స్థితులను కలిపి ఉచ్చారణ అందురు. అట్లు పరావాక్కు గుహా ముఖము నుండి ఉచ్చరింపబడి వెలుగై నిలచును. గుహా ముఖ మనగా రహస్యమగు మార్గమునకు ద్వారము. ముఖద్వారమే గుహాముఖము. అవ్యక్తము నుండి వ్యక్తము లోనికిట్లు నిత్యము పరావాక్కు నిశ్వాస మార్గమున ఉచ్చరింపబడుచునే యున్నది. సృష్టి జరుగుచునే యున్నది. ఉచ్చ్వాస మార్గమున మరల ఉపసంహరింప బడుచునే యున్నది. ఈ నడుమ సృష్టి యున్నది.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 421 - 1 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻 90. Chichakti shchetanarupa jadashakti jadatmika*

*Gayatri vyahruti sandhya dvijabrunda nishemita ॥ 90 ॥🌻*


*🌻 421. 'Vyahrti' - 1🌻*


*What is born of the utterance is Srimata. When the will is from the Divine, Pasyanti is formed. When language takes form, it forms Madhyama. Vaikhari is formed when language is pronounced from the face. The speech is uttered in three stages from the Divine state. These three states are combined to form an utterance. Thus Paravakku is uttered from the secret cave and shines as light. The secret cave is the door to the secret path. The entrance itself is the secret cave. Paravakku is constantly being uttered through the breath from the unmanifest to the manifest. Creation is constantly happening. Retraction into the Divine continues to happen. This utterance from and retraction into the Divine keep on happening like inspiration and expiration. There is creation in the midst of this.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు #DailyMessages

Join and Share

Commentaires


Post: Blog2 Post
bottom of page