1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 28, మంగళవారం, జూన్ 2022 భౌమ వాసరే Tuesday 🌹
2) 🌹 కపిల గీత - 30 / Kapila Gita - 30🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 70 / Agni Maha Purana - 70🌹
4) 🌹. శివ మహా పురాణము - 586 / Siva Maha Purana - 586🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 205 / Osho Daily Meditations - 205🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 382 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 382-1 🌹
*🌹. ఆధ్యాత్మికుడికి జూదరి మనస్తత్వము అవసరం 🌹*
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹28, June 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*
*🍀. హనుమ భుజంగ స్తోత్రం - 8 🍀*
*14. నమస్తే మహాసత్త్వబాహాయ తుభ్యం*
*నమస్తే మహావజ్రదేహాయ తుభ్యం*
*నమస్తే పరీభూత సూర్యాయతుభ్యం*
*నమస్తే సదా పింగళాక్షాయ తుభ్యం |*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : మూడు రకములైన అడ్డంకులు వస్తూ ఉంటాయి. మన మాటలు (ఆధ్యాత్మిక) మన శరీరము (ఆది దైవిక) మన పనులు (ఆది భౌతిక). వీటిని దాటి వేస్తామనే నిర్ణయం తీసుకోండి. - మాస్టర్ ఆర్.కె.🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, జేష్ఠ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: కృష్ణ చతుర్దశి 05:53:28 వరకు
తదుపరి అమావాశ్య
నక్షత్రం: మృగశిర 19:05:01 వరకు
తదుపరి ఆర్ద్ర
యోగం: దండ 07:47:51 వరకు
తదుపరి వృధ్ధి
కరణం: శకుని 05:52:29 వరకు
వర్జ్యం: 28:33:24 - 30:21:40
దుర్ముహూర్తం: 08:22:21 - 09:15:00
రాహు కాలం: 15:36:43 - 17:15:26
గుళిక కాలం: 12:19:17 - 13:58:00
యమ గండం: 09:01:51 - 10:40:34
అభిజిత్ ముహూర్తం: 11:53 - 12:45
అమృత కాలం: 09:10:16 - 10:58:24
సూర్యోదయం: 05:44:25
సూర్యాస్తమయం: 18:54:09
చంద్రోదయం: 04:49:31
చంద్రాస్తమయం: 18:27:47
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: జెమిని
రాక్షస యోగం - మిత్ర కలహం 19:05:01
వరకు తదుపరి చర యోగం - దుర్వార్త శ్రవణం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
Join and Share
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 30 / Kapila Gita - 30🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴. 13. సమర్పణ ద్వారా సంపూర్ణ జ్ఞానం - 3 🌴*
*30. తదేతన్మే విజానీహి యథాహం మన్దధీర్హరే*
*సుఖం బుద్ధ్యేయ దుర్బోధం యోషా భవదనుగ్రహాత్*
*మందురాలినైన నాకు ఉన్నవాటన్నిటిలో ఏది నిన్ను చేరుస్తుందో అది చెప్పు. తెలియశక్యం కానివి కూడా సులభముగా చెప్పు. నేను స్త్రీని.*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 30 🌹*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*
*🌴 13. Perfect Knowledge Through Surender - 3 🌴*
*30. tad etan me vijanihi yathaham manda-dhir hare*
*sukham buddhyeya durbodham yosa bhavad-anugrahat*
*My dear son, Kapila, after all, I am a woman. It is very difficult for me to understand the Absolute Truth because my intelligence is not very great. But if You will kindly explain it to me, even though I am not very intelligent, I can understand it and thereby feel transcendental happiness.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#కపిలగీత #KapilaGita
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 70 / Agni Maha Purana - 70 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 25*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*🌻. "వాసుదేవ' 'సంకర్షణ' 'ప్రద్యుమ్న' 'అనిరుద్ధ' మంత్రముల లక్షణములు - 2 🌻*
హృదయము, శిరస్సు, శిఖ, కవచము, నేత్రము, అస్త్రము అను ఈ ఆరును బీజముల అంగములు, హృదయము, శిరస్సు, శిఖ, హస్తములు, నేత్రములు, ఉదరము, పృష్ఠభాగము, బాహువులు, ఊరువులు, మోకాళ్ళు పిక్కలు, పాదములు ఈ పండ్రెండును మాలమునకు అంగములు, క్రమముగా వీటి అన్నింటిపై న్యాసము చేయవలెను.
"కం టం పం శం వైనతేయాయ సమః" ''ఖం ఠం ఫం, షం గదానుజాయ నమః" éగం డం బం సం పుష్టి మన్త్రాయ నమః". ఘం ఢం భం హం శ్రియై నమః'' ''వం శం మం క్షం పాఞ్చజన్యాయ నమః" "ఛం తం పం కౌస్తుభాయ నమః" "జం ఖం వం సుదర్శనాయ నమః " "సం వం దం చం లం శ్రీవత్సాయ నమః."
నామసంయుక్తములును, జత్యంతములును అగు పదములచే హృదయాది పంచకన్యాసమును చేయవలెను. ప్రణవము, పిమ్మట ఐదు హృదయాదులును చెప్పబడినవి.
ముందుగా ప్రణవముచే హృదయమును, 'పరాయ' అని శిరస్సును, పేరుతో శికను, ఆత్మచేత కవచమును, నామాస్తముతో అస్త్రమును విన్యసించవలెను.
ఓంకారము ఆదియందు గల నామాత్మక పదమునకు చివర నమః చేర్చి నామాత్మక పదమును చతుర్థ్యంతము చేసి చెప్పవలెను. ఏక వ్యూహము మొదలు ఇరువదియారవ వ్యూహము వరకును ఇది సమనము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 70 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *
*Chapter 25*
*🌻 Worship regarding Vāsudeva, Saṅkarṣaṇa, Pradyumna and Aniruddha - 2 🌻*
11. The heart, head, tuft, armour, eye, weapons (are) the six limbs of the mystic basic syllables of the basic (mystic formula) constituting twelve parts.
12. One should then assign in order to (the limbs)—the heart, head, tuft, hands, eyes, belly, back, arms, thighs, knees, shank, (and) feet, (the following syllables and gods).
13. (The letters) kam, ṭam, pam, śam are for Vainateya[2]. (The letters) kham, ṭham, pham, ṣam (are) for the brother of mace-bearer (Kṛṣṇa). (The letters) gam, ḍam, vam, sam (form) the mystic formula for the nourishment. Gham, ḍham, bham, ham salutations to Śrī (Goddess of wealth).
14. (One has to worship) Pāñcajanya[3], (with the mystic letters) vam, śam, mam, kṣam. (The mystic letters) cham, tam, pam (are for the worship of) Kaustubha (gem worn by Viṣṇu on his head), jam, kham, vam for the Sudarśana (the disc in the hands of Viṣṇu), sam, vam, dam, cam, lam for Śrīvatsa (the mark on the chest of Viṣṇu).
15. Om, dham, vam salutations to the garland of wild flowers (worn by Viṣṇu) and to the great Ananta.[4] The limbs are set forth with the words of the mystic formula consisting of words without the mystic letters.
16. Along with the names ending with the caste (names), the heart and other (limbs) (are set forth). The praṇava (letter Om) (is repeated) five times. Then the heart and other (limbs) are mentioned five times.
1 7. With the praṇava (one should adore) the heart first. (With the word) ‘for the supreme’, the head (and) the tuft and with one’s name, the armour (are adored). The end of the name would be (to worship) the weapon.
18. Om, the supreme weapon is the first. (Then) one’s own name ending in the fourth case (is to be said). Then (the word) ‘salutations’ (comes) at the end. This consists of one to twenty-six parts.
19. One should worship prakṛti (nature) at the tips of the little and other fingers of the arms in (one’s) body. (That one) consisting of prakṛti (nature) is the second form of the supreme being consisting of puruṣa (soul).
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #AgniMahaPuranam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 586 / Sri Siva Maha Purana - 586 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 02 🌴*
*🌻. కుమారస్వామి జననము - 6 🌻*
నారదుడిట్లు పలికెను-
ఓ అగ్నీ! నీ తాపమును పోగొట్టునది, శుభకరము, మిక్కిలి ఆనందమును ఇచ్చునది, రమ్యమైనది, కష్టములనన్నిటినీ నివారించునది అగు నా మాటను వినుము (52). ఓ అగ్నీ! ఈ ఉపాయమునాచరించి తాపమును పోగొట్టు కొని సుఖపడుము. వత్సా! నేనీ ఉపాయమును శివుని ఇచ్ఛచే సాదరముగా నీకు చెప్పుచున్నాను (53). ఓ అగ్నీ! ఈ గొప్ప శివతేజస్సును నీవు మాఘమాసములో తెల్లవారు జామున స్నానమును చేయు స్త్రీలయందు ఉంచుము (54).
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఆ సమయుములో అచటకు సప్తర్షుల భార్యలు వచ్చిరి. ఓ మునీ! వారు మాఘమాసములో ఉదయము మంచి నియమముతో స్నానమును చేయుటకై వచ్చిరి (55). ఆ స్త్రీలు స్నానమును చేసిరి. వారిలో ఆర్గురు వణికించే చలిచే పీడింపబడి అగ్ని వద్దకు వెళ్లవలెనని తలంచిరి. ఓ మునీ! వారు అగ్ని జ్వాల సమీపమునకు వెళ్లిరి (56). చక్కని శీలము, మంచి జ్ఞానముగల అరుంధతి శివుని ఆజ్ఞచే, విమోహితలై యున్న ఆ స్త్రీలను చూచి గట్టిగా వారించెను (57). ఓ మునీ! శివమాయచే మోహింపబడిన ఆ ఆర్గురు ముని పత్నులు మోహముచే, మొండి పట్టుదలచే చలిని తొలగించు కొనుట కొరకై అచటకు వెళ్లిరి (58).
ఓ మునీ ! శివుని తేజస్సు అంతయూ వెంటనే రోమకూపముల ద్వరా వారి దేహములో ప్రవేశించెను. అగ్నికి తాపము తొలగిపోయెను (59). జ్వాలారూపములో నున్న అగ్ని సుఖమును పొందినవాడై మనస్సులో నిన్ను ఆ శంకరుని స్మరిస్తూ వెంటనే అంతర్ధానము చెంది తన లోకమునకు వెళ్లెను (60). అపుడా స్త్రీలు గర్భవతులై తాపపీడితలై తమ గృహములకు వెళ్లిరి. కుమారా! అగ్ని చేసిన పనికి అరుంధతి దుఃఖించెను (61). ఓ వత్సా! ఆ మహర్షులు తమ భార్యలకు పట్టిన గతిని చూచి కోపమును, దుఃఖమును పొంది ఒకరితో నొకరు సంప్రదించుకొని ఆ స్త్రీలను పరిత్యజించిరి(62).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 586 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 02 🌴*
*🌻 The birth of Śiva’s son - 6 🌻*
Nārada said:—
52. “O Agni, listen to my words that will dispel your burning sensation. It will yield great pleasure and ward off your pains.
53. O Agni, taking recourse to the following expedient you will be relieved of the burning sensation and be happy. O dear, this has been explained by me well at the will of Śiva.
54. O Agni, you shall deposit this semen of Śiva in the bodies of the ladies who take their morning baths in the month of Māgha.”
Brahmā said:—
55. O sage, meanwhile the wives of the seven celestial sages came there desirous of taking their early morning bath in the month of Māgha with other observances of rites.
56. After the bath, six of them were distressed by the chillness and were desirous of going near the flame of fire.
57. Arundhatī of good conduct and perfect knowledge saw them deluded and dissuaded them at the behest of Śiva.
58. O sage, the six ladies stubbornly insisted on going there to ward off their chillness because they were deluded by Śiva’s magical art.
59. Immediately the particles of the semen entered their bodies through the pores of hairs, O sage. The fire was relieved of their burning sensation.
60. Vanishing immediately from the scene, Agni in the form of a flame, went back happily to his region, mentally remembering you and Śiva.
61. O saintly one, the women became pregnant and were distressed by the burning sensation. They went home. O dear, Arundhatī was displeased with fire.
62. O dear, the husbands on seeing the plight of their wives became furious. They consulted one another and discarded them.
Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 205 / Osho Daily Meditations - 205 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*
*🍀 205. చికిత్సకు మించి 🍀*
*🕉. చికిత్స మీరు మీ భారాన్ని నెమ్మదిగా తగ్గించుకోవాలని సూచిస్తుంది. నేను బోధిస్తున్నది చికిత్సకు మించినది, కానీ చికిత్స మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. 🕉*
*చికిత్స యొక్క పని పరిమితం: ఇది మీరు తెలివిగా ఉండటానికి సహాయపడుతుంది, అంతే. నా పని చికిత్సకు మించినది, కానీ చికిత్స ద్వారా మార్గాన్ని సిద్ధం చేయాలి. చికిత్సలు నేలను శుభ్రపరుస్తాయి; అప్పుడు నేను విత్తనాలు నాటగలను. కేవలం నేలను శుభ్రపరచడం వల్ల తోటగా మారదు. పాశ్చాత్య దేశాలలో సమగ్ర చికిత్స లేదు. మీరు థెరపిస్ట్ వద్దకు వెళ్లండి-అతను లేదా ఆమె నేలను శుభ్రపరుస్తుంది, మీకు భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది, ఆపై మీరు మళ్లీ అదే వస్తువులను సేకరించడం ప్రారంభిస్తారు. ఎందుకంటే తోట నిజంగా సిద్ధం కాలేదు.*
*శుభ్రమైన నేలతో మీరు ఏమి చేయబోతున్నారు? మీరు మళ్ళీ అన్ని రకాల చెత్తను సేకరిస్తారు. థెరపీ నేలను సిద్ధం చేస్తుంది, ఆపై గులాబీలను మీలో పెంచవచ్చు. కాబట్టి చికిత్సకుడు సరైన వాడుగా వుండాలి. దూకుడు, కోపం, విచారం, నిరాశ, ప్రేమ-- ప్రతిదీ వ్యక్తపరచాలి, అంగీకరించాలి. అప్పుడు నా పని మొదలవుతుంది; అహాన్ని ఎలా వదిలించుకోవాలో నేను మీకు చెప్పగలను. మీరు దానిని సదా మోయాల్సిన అవసరం లేదు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 205 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 205. BEYOND THERAPY 🍀*
*🕉 Therapy suggests that you slowly unburden yourself. What I am teaching is beyond therapy, but therapy does prepare you. 🕉*
*Therapy's work is limited: It helps you to be sane, that's all. My work goes beyond therapy, but therapy has to prepare the way. Therapies clean the ground; then I can sow the seeds. Just cleaning the ground is not going to make the garden. That's where therapy is missing in the West. You go to the therapist-he or she cleans the ground, helps you to unburden, and then you start accumulating the same things again, because the garden is not really prepared.*
*What are you going to do with clean ground? You will gather all kinds of rubbish again. Therapy prepares the ground, and then roses can be grown in you. So the therapist is right: aggression, anger, sadness, despair, love-- everything has to be expressed, accepted. Then my work starts; then I can tell you how to drop the ego. Now there is no need to carry it.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#ఓషోబోధనలు #OshoDiscourse
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 382-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 382-1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 83. ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ ।*
*రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83 ॥ 🍀*
*🌻 382. 'రహస్తర్పణ తర్పితా' - 1🌻*
*ఏకాంతముగ పరమాత్మ తత్త్వము నెరింగి అంతరంగమున ప్రవేశించి రహస్యమున తనను తా నర్పించుకొని తన్మయము చెందు నది శ్రీదేవి అని అర్థము. తర్పణము అర్పణమే. అర్పణ తలమానికమగు గుణము. జీవితము తనదిగా కాక దైవమునది అని ఎఱిగి దైవమున కర్పించి జీవించుట నిజమగు సాధన. అది అత్యంత సాహసవంతము. దైవము కొరకే జీవించుట, దైవమునే ఆశ్రయించి యుండుట, దైవార్పితముగ జీవితము గడుపుట, సమస్తమునకు దైవమే ఉపాయమని భావించుట, ఆరాధించుట, దైవము దరిచేరుట, సంపూర్ణముగ తన మాన ప్రాణములతో సహా దైవమున కర్పణ చేయుట అర్పణ మార్గము.*
*సమర్పణ మనగ నిదియే. ఇట్టి సమర్పణ అత్యంత రహస్యముగ నిర్వర్తించుకొనుట రహస్యార్పణ మగును. 'రహస్తర్పణ' మగును. అట్లు అర్పించు కొన్నవారి జీవితము నిరహంకారమై, దైవమున కత్యంత చేరువై, దైవానుగ్రహము నకు పాత్రమై నిలచును. అప్పుడు దైవ మందించు సాన్నిధ్యము పరిపూర్ణానందమును కలిగించి పరితృప్తి కలిగించును.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 382 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 83. Odyana pita nilaya nindu mandala vasini*
*Rahoyaga kramaradhya rahastarpana tarpata ॥ 83 ॥ 🌻*
*🌻 382. Rahastarpaṇa-tarpitā रहस्तर्पण-तर्पिता -1 🌻*
*In the initial stage of pursuing spiritual path and in order to control the mind, recitation and repetition of mantra-s is practiced, so that the mind does not get diverted to extraneous thoughts. Such mantra-s should be recited after understanding the meaning of the mantra.*
*In the case of Pañcadaśī mantra, there are fifteen bīja-s in that mantra and each bīja has different meaning and significance. This has been dealt with in the introductory chapter. Two things are important while reciting a mantra. The first one is dhyāna verse or the meditative verse that describes the form of the god or goddess. This helps in visualizing the form of the deity.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఆధ్యాత్మికుడికి జూదరి మనస్తత్వము ఆవసరం🌹*
*ఆధ్యాత్మిక జీవనంలో అనుభవాలు' నిరర్థకమైనవని జిడ్డు కృష్ణమూర్తి గారు హెచ్చరిస్తూ ఉండేవారు. ఆఖరికి అంతర్దృష్టి ద్వారా కనిపించినదైనా శంకించి, తర్కించి, దాని నిజానిజాలు నిర్ధారించుకోమన్నారు. గుడ్డిగా దేనినీ సమ్మతించవద్దని చెప్తూ ఉండేవారు.*
*“అది ఎంత గొప్ప అనుభవమైనా, ఒక క్షణాన వచ్చి మరో క్షణాల వెళ్ళిపోయేదే కదా? అది సత్యమే అయితే, నిత్యం ఉండేదే అయి ఉండాలి కదా? వచ్చి వెళ్ళిపోయేది ఎట్లా అవుతుంది?” అనేవారు అరుణాచల రమణులు. ఈ మహనీయులు చెప్పిన మాటలే కాక, ఈ సందర్భంగా నిసర్గదత్త మహరాజ్ చెప్పిన మాటలు కూడా గమనార్హం.*
*గమ్యం అందుకోవడానికి మనిషి బలీయమైన, సుదృఢమైన కోరిక కలిగుండాలి అంటాడు ఆయన. ఆ ఉద్దేశం, తత్సంబంధమైన సంకల్పం లేకపోతే ఆ ప్రయత్నానికి తగినంత శక్తి జనించదు. ఇక రెండవది, తన ప్రయత్నంలో విజయం సాధించగలననే గ్యారంటీ లేకపోవడం. ఇక్కడ జూదరి యొక్క మనస్తత్వాన్ని ఉదహరిస్తాడు నిసర్గదత్త. అధ్యాత్మికుడికి కూడా ఈ జూదరి మనస్తత్వం అవసరమవుతుంది.*
*ఉన్నదంతా, జూదరి పందెం కాసినట్లే ఈ సాహసయాత్రలో, కలిగున్నదంతా తిరస్కరించాలి. ఊరు, పేరు, హోదా, ఆస్తి, అంతస్తు మనిషికి సంఘంలో వున్న గుర్తింపు యావత్తూ పక్కకు నెట్టేయాలి. గతమంతా తుడిచిపెట్టుకు పోవాలి. అవతల ఏమున్నదో, తన గతి ఏమి కానున్నదో తెలియకుండా అగాధమైన లోతుల్లోకి ఉరక గలిగుండాలి. అది లభిస్తుందనే దృఢ విశ్వాసంతో దూకుతున్నాడే కానీ అది దక్కి తీరుతుంది అని ఎవరూ హామీ ఇవ్వగలిగిలేరు. కానీ మహా సాహసం చేయక తప్పదు.*
*నిసర్గ : ఆధ్యాత్మికతానుభావం ఎంత మహత్తరమైన దైనప్పటికీ అది అసలు వస్తువు కాదు. స్వభావరీత్యా అది వస్తుంటుంది. పోతుంటుంది. ఆత్మసాక్షాత్కారం, సంపాద్యంకాదు. అది అవగాహన యొక్క స్వభావాన్ని కలిగుంటుంది. ఒకసారి అది ప్రాప్తిస్తే మనిషి దాని వద్దకు చేరితే, ఇక దానిని కోల్పోయే ప్రసక్తిలేదు. ఇక చైతన్య స్రవంతి అంటావా, అది తరచూ పరివర్తన చెందుతూ వుంటుంది, ప్రవహిస్తూ వుంటుంది. క్షణక్షణం మారిపోతూ వుంటుంది. చైతన్యమూ, దానిలోనున్న విషయాలను అంటిపెట్టుకుని వుండకు. చైతన్యాన్ని పట్టుకు కూచున్నావంటే సాక్షాత్కారం ఆగిపోతుంది. అంతర్ దృష్టి యొక్కమెరుపును, లేక ఆనందాతిశయాన్ని అలాగే శాశ్వతంగా వుండేట్లు చేద్దామనుకుంటే అది దాని వినాశనానికి కారణమవుతుంది. ఏదైతే వచ్చిందో అది పోక తప్పదు. శాశ్వతమైనది, వచ్చేదీ కాదు పోయేదీ కాదు. సమస్తమైన అనుభవాలకు మూలమయిన వ్రేళ్ళ వద్దకు, అనగా నీ సత్త వద్దకు వెళ్ళు. సత్తకూ, సత్త కానిదానికి ఆవలనున్నది. ఆ బ్రహ్మాండమైన వాస్తవం. మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉండు.*
*పృచ్ఛకుడు : అలా ప్రయత్నించడానికి మనిషికి విశ్వాసం వుండాలి.*
*నిసర్గ : ముందసలు ఆ కోరిక ఉండాలి. కోరిక బలీయంగా ఉంటే ప్రయత్నించాలనే పట్టుదల వస్తుంది. గట్టిగా కోరడం జరిగితే విజయం ఖాయమనే హామీ యొక్క అవసరం వుండదు. దానితో జూదమాడేందుకు సిద్ధపడతావు.*
*పృ : నేనింతకన్న చిన్నవాణ్ణయినప్పుడు నాకేదో వింత అనుభవాలు-చిన్నవే అయినప్పటికీ, జ్ఞాపకముంచుకోదగినవి కలుగుతుండేవి. నేను ఏమీ కాదని, కేవలం ఏదో శూన్యమన్నట్లుగా వుండేది. కానీ చైతన్య స్పృహలోనే వుండేవాణ్ణి. ఇక్కడొచ్చిన ప్రమాదమల్లా ఒక్కటే. అలా చెల్లిపోయిన క్షణాలను మళ్ళీ మళ్ళీ తలచుకుని వాటిని పునఃసృష్టించు కోవాలనే కోరిక బయలుదేరడం.*
*నిసర్గ : ఇదంతా ఊహ. చైతన్యం వెలుగులో అనేకం సంభవిస్తూ ఉంటై. వాటికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. భగవంతుడి రూపదర్శనమెంతో, ఒక పుష్పం కనిపించడం కూడా అంత అద్భుతమైనదే. వాటి పాటికి వాటినలా వుండనీ. వాటిని గుర్తు తెచ్చుకోవడం దేనికి? ఆ తర్వాత జ్ఞాపకాలు ఒక సమస్యగా చేసుకోవడం ఎందుకు? వాటియెడల మార్దవంగా ఉండిపో. వాటికి ఉచ్ఛనీచాలు ఆపాదించవద్దు. గొప్పవనీ అధమమైనవనీ, అంతర్గతమైనవనీ, బాహ్యమైనవనీ, శాశ్వతమైనవనీ, తాత్కాలిక మైనవనీ విభజిస్తూ కూచోవద్దు. ఏది సంభవిస్తున్నప్పటికీ వీటన్నిటికీ మూలమైన నీ ఆత్మ వద్దకు వెళ్ళు. నువ్వీ ప్రపంచంలో పుట్టావని నీవేర్పరచుకున్న నమ్మకం, కేవలం నీ బలహీనత. నిజానికి ఈ ప్రపంచం నీలో, నీచేత ఎల్లప్పుడూ పునఃసృష్టింపబడుతున్నది. నీ సత్తకు మూలమైన వెలుగునుండే ఇవన్నీ జనిస్తున్నవనే విషయం చూడు. ఆ వెలుగులో ప్రేమ, అనంతమైన శక్తి వున్నాయని నీవే గ్రహిస్తావు.*
*నేనిక్కడ జీవించి ఉంటానికే నేను చూడాల్సిన' అవసరం ఉందంటారా?*
*నిసర్గ : నువ్వు ఏమిటిగా వున్నావో చూడు, వారినీ వీరినీ అడుగకు. నిన్ను గురించి ఇతరులను, నీవు చెప్పనివ్వకు. నీలోనికి నువ్వు చూసుకుని గ్రహించు. మార్గ దర్శకుడు చెప్పగలిగినదంతా ఇంతే. ఒకరివద్ద నుండి మరొకరి వద్దకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అన్ని బావుల్లో ఉండే నీరు ఒకటే. ఏ బావి సమీపంగా ఉంటే దాని నుండి నీరు తోడుకో, నా విషయానికొస్తే నాలో ఆ నీరు వున్నది, నేనా నీటినే.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Comments