🌹🍀 28 - OCTOBER - 2022 FRIDAY ALL MESSAGES శుక్రవారం, భృగు వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 28 - OCTOBER - 2022 TUESDAY శుక్రవారం, భృగు వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 84 / Kapila Gita - 84 🌹 సృష్టి తత్వము - 40
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 123 / Agni Maha Purana - 123 🌹 🌻. దేవాలయ నిర్మాణ ఫలము - 6🌻
4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 258 / Osho Daily Meditations - 258 🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 410 -3 / Sri Lalitha Chaitanya Vijnanam - 410 -3 🌹 'శివపరా'- 3
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹28, October అక్టోబరు 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు*
*🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -18 🍀*
*18. నిత్యం పఠామి జనని తవ నామ స్తోత్రం నిత్యం కరోమి తవ నామజపం విశుద్ధే ।*
*నిత్యం శృణోమి భజనం తవ లోకమాతః శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : పట్టరాని ఆగ్రహం చేతనో, ద్వేషం చేతనో, పగ చేతనో, మానవులు తోటి మానవులను చంపుతూ వుంటారు. దాని ప్రతిఫలాన్ని వారు ఇప్పుడో మరియొకప్పుడో అనుభవించి తీరుతారు. అట్టివారిని ఈశ్వరుడు క్షమించడు.🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, శరద్ ఋతువు,
దక్షిణాయణం, కార్తీక మాసం
తిథి: శుక్ల తదియ 10:35:21 వరకు
తదుపరి శుక్ల చవితి
నక్షత్రం: అనూరాధ 10:43:46
వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం: శోభన 25:30:31 వరకు
తదుపరి అతిగంధ్
కరణం: గార 10:33:21 వరకు
వర్జ్యం: 15:56:22 - 17:25:54
దుర్ముహూర్తం: 08:31:37 - 09:17:52
మరియు 12:22:52 - 13:09:07
రాహు కాలం: 10:33:01 - 11:59:44
గుళిక కాలం: 07:39:36 - 09:06:18
యమ గండం: 14:53:10 - 16:19:54
అభిజిత్ ముహూర్తం: 11:36 - 12:22
అమృత కాలం: 00:57:34 - 02:27:38
మరియు 24:53:34 - 26:23:06
సూర్యోదయం: 06:12:52
సూర్యాస్తమయం: 17:46:36
చంద్రోదయం: 08:54:13
చంద్రాస్తమయం: 20:13:08
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: వృశ్చికం
రాక్షస యోగం - మిత్ర కలహం
10:43:46 వరకు తదుపరి చర
యోగం - దుర్వార్త శ్రవణం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 84 / Kapila Gita - 84🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 40 🌴*
*40. ద్యోతనం పచనం పానమదనం హిమమర్ఢనమ్|*
*తేజసో వృత్తయస్త్వేతాః శోషణం క్షుత్తృదేవచ॥*
*ప్రకాశించుట, పక్వమొనర్చుట, చల్లదనమును దూరము చేయుట, ఎండింప జేయుట, దప్పిక కలిగించుట, ఆకలిదప్పుల నివారణకై భోజన, పానాదులను చేయించుట అనునవి తేజస్సు యొక్క వృత్తులు.*
*పరమాత్మే మనము తిన్న దాన్నీ, తాగిన దానినీ, అగ్ని రూపములో ఉండి స్వీకరిస్తున్నాడు (అహం వైశ్వానరో భూతవా...). జఠ్రాగ్ని బాగ పని చేయాలంటే శ్రమపడాలి. అప్పుడు తిన్నది బాగా జీర్ణమవుతుంది. పరిశ్రమ వలన అగ్నిలో వాయువులో శక్తి పెరుగుతుంది. మన పెరుగుదల, మనం తీసుకున్న ఆహారం అరుగుదల వలన. అరగాలంటే జఠరాగ్ని బాగా పని చేయాలి. శరీరములో ఏ ప్రదేశానికి ఎంత కావాలో అంత పంపాలి. అలా పంపేది వాయువూ, అగ్ని. వాటి శక్తి తగ్గితే అవి పంపవు. అగ్ని పని చేయకపోతేనే మనకి ఆయా రోగాలు వస్తాయి. అందుకే పరమాత్మని ఆయా రూపాలలో మనం ఆరాధించాలి.*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 84 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*
*🌴 2. Fundamental Principles of Material Nature - 40 🌴*
*40. dyotanaṁ pacanaṁ pānam adanaṁ hima-mardanam*
*tejaso vṛttayas tv etāḥ śoṣaṇaṁ kṣut tṛḍ eva ca*
*Fire is appreciated by its light and by its ability to cook, to digest, to destroy cold, to evaporate, and to give rise to hunger, thirst, eating and drinking.*
*The first symptoms of fire are distribution of light and heat, and the existence of fire is also perceived in the stomach. Without fire we cannot digest what we eat. Without digestion there is no hunger and thirst or power to eat and drink. When there is insufficient hunger and thirst, it is understood that there is a shortage of fire within the stomach, and the Āyur-vedic treatment is performed in connection with the fire element, agni-māndyam. Since fire is increased by the secretion of bile, the treatment is to increase bile secretion. The Āyur-vedic treatment thus corroborates the statements in Śrīmad-Bhāgavatam. The characteristic of fire in subduing the influence of cold is known to everyone. Severe cold can always be counteracted by fire.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 123 / Agni Maha Purana - 123 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 38*
*🌻. దేవాలయ నిర్మాణ ఫలము - 6🌻*
ప్రతిదినము యజ్ఞములు చేసి భగవదారాధన చేయువానికి లభించు ఫలమే విష్ణ్వాలయము నిర్మించినవానికి గూడ కలుగును. విష్ణ్వాలయము కట్టించినవాడు తన వంశము నందలి వెనుకటి నూరుగురిని, రాబోవు నూరుగురిని విష్ణలోకమునకు పంపును మహావిష్ణువు సప్తలోకమయుడు. అట్టి విష్ణుమూర్తికి ఆలయము కట్టించువాడు తన వంశమును తరింపచేయును.
తన వంశీయులకు అక్షయపుణ్యలోక ప్రాప్తి కలుగు నట్లు చేయును. తాను కూడ అక్షయలోకములను పొందును. దేవాలయములోని ఇటుకల కట్టుబడి ఎన్ని సంవత్సరము లుండునో అన్ని వేల సంవత్సరములపాటు ఆ దేవాలయ నిర్మాత స్వర్గలోకములో నుండును. భగవత్ప్రతిమ నిర్మించినవాడు విష్ణులోకము చేరును. దానిని స్థాపించినవాడు భగవంతునిలో లీన మగును. దేవాలయము నిర్మించు దానిలో ప్రతిమాస్థాపన చేసినవాడు సర్వదా విష్ణులోకములో నివసించును."
అగ్నిదేవుడు పలికెను.:
యమధర్మరాజు ఇచ్చిన ఈ ఆజ్ఞ ప్రకారము, యమదూతలు విష్ణస్థాపనాదిపుణ్యకార్యములు చేసినవారిని యమలోకమునకు తీసికొవివెళ్ళరు. దేవాలయాదిప్రతిష్ఠాదివిధానమును గూర్చి హయగ్రీవుడు బ్రహ్మతో విర్ణించి చప్పెను.
అగ్ని మహాపురాణము నందలి దేవాలయనిర్మాణమాహాత్మ్యదివర్ణన మను ముప్పదియెనిమిదవ అధ్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 123 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 38*
*🌻 Benefits of constructing temples - 6 🌻*
One who builds the temple of Viṣṇu gets that great benefit which (one would acquire) by doing sacrificial rites everyday. By building a temple for Viṣṇu (one) conveys hundreds of his discendants and hundreds of his ancestors to the world of Acyuta.
Viṣṇu is identical with the seven worlds. One who builds a house for him saves the endless worlds and also obtains endlessness. One who builds (a temple) for him, lives for so many years in heaven as the number of years the set up bricks would remain. The maker of the idol (would reach) the world of Viṣṇu. One who consecrates it would get absorbed in Hari.
One who builds a temple, makes an idol and installs it goes within his range.
Agni said:
“I have not brought one who has installed Hari as told by Yama”. Hayaśiras told Brahmā for the installation of gods.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 258 / Osho Daily Meditations - 258 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀 258. ప్రతీది ఒక కల 🍀*
*🕉. మీరు నిద్రలోకి వెళ్ళినప్పుడు, మీరు నిద్రలోకి జారుకునేటప్పుడు ఒక విషయం స్పృహలో ఉండాలి - ప్రతిదీ ఒక కల, ప్రతిదీ షరతులు లేకుండా ఉన్న ఒక కల అని. 🕉*
*మీరు కళ్ళు తెరిచి చూసేది ఒక కల. మూసిన కళ్లతో మీరు చూసేది కూడా కలయే. కల అనేది జీవితం తయారు చేయబడిన వస్తువు. కాబట్టి ఈ ఆలోచనలతోనే నిద్రలోకి జారుకోండి. ఈ స్థిరమైన స్మరణతో ప్రతిదీ, మినహాయింపు లేకుండా ప్రతిదీ ఒక కల అని గుర్తించండి. అంతా కలలైతే, ఇక చింతించాల్సిన పని ఏముంది. మీరు నిద్రలోకి వెళ్ళినప్పుడు, మీరు నిద్రలోకి జారుకునేటప్పుడు ఈ విషయం స్పృహలో ఉండాలి - ప్రతిదీ ఒక కల, ప్రతిదీ షరతులు లేకుండా ఉన్న ఒక కల. అది మాయ యొక్క మొత్తం భావన - ప్రపంచం మొత్తం ఒక మాయ. ఈ సత్యం మీలో లోతుగా స్థిరపడటానికి ఇది మీకు సహాయపడే సూచన మాత్రమే. అప్పుడు ఏదీ మిమ్మల్ని అశాంతికి గురి చేయదు.*
*కానీ దీని అర్ధం ప్రపంచం భ్రమ అని కాదు. దానికి దాని స్వంత వాస్తవికత ఉంది. అంతా కల అయితే, కలవర పడటం అర్ధం లేనిది. ఒక్కసారి ఆలోచించండి, ఈ క్షణం అంతా కల అని మీరు అనుకుంటే - చెట్లు, రాత్రి, రాత్రి శబ్దం ఒక కల అయితే - అకస్మాత్తుగా మీరు వేరే ప్రపంచంలోకి రవాణా చేయబడతారు. మీరు అక్కడ ఉన్నారు, కల ఉంది, మరియు దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ రాత్రి నుండి ఈ వైఖరితో నిద్రలోకి జారుకోండి. ఉదయం కూడా, మీరు గుర్తుంచు కోవలసిన మొదటి విషయం ఏమిటంటే ప్రతిదీ ఒక కల అని. ఇది రోజులో చాలా సార్లు పునరావృతం చేయండి. అకస్మాత్తుగా మీరు శాంతిని పొందుతారు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 258 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 258. EVERYTHING IS A DREAM 🍀*
*🕉. When you go to sleep, one thing should remain in the consciousness while you are falling into sleep-that everything is a dream, everything, unconditionally, is a dream. 🕉*
*That which you see with your eyes open--that too, is a dream. That which you see with closed eyes-that too, is a dream. Dream is the stuff life is made of. So with this climate fall into sleep; with this constant remembrance that everything, everything with no exception, is a dream. When everything is a dream, there is nothing to worry about. That is the whole concept of maya--that the world is illusory. Not that the world is illusory--it has its own reality--but this is just a technique to help you settle deeply into yourself. Then nothing disturbs you.*
*If everything is a dream, then it is pointless to be disturbed. Just think, if this moment you think that everything is a dream--that the trees, the night, the sound of the night is a dream-- suddenly you are transported into a different world. You are there, the dream is there, and nothing is worth worrying about. So starting tonight just fall into sleep with this attitude. And in the morning too, the first thing you have to remember is that everything is a dream. Let this recur many times in the day, and suddenly you will feel relaxed.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 410 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 410 - 3🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 89. శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా ।*
*అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా ॥ 89 ॥ 🍀*
*🌻 410. 'శివపరా'- 3 🌻*
*అనుచరుల రూపమున తానే వున్నానని సనక సనందనాదులకు నారాయణుడు బోధించెను. అనుచరులనగా సర్వకాల సర్వావస్థల యందు తనతో కూడియుండి చరించువారు. నారాయణు నకు సనక సనందనాదు లెట్టివారో జయవిజయులు కూడ అట్టివారే. ఇట్టి రమ్యము, చిత్రము, రహస్యము అగు అభేద స్థితి తెలిసినవాడే తెలిసినవాడు. శ్రీదేవి శివుని పరము. శివుడు శ్రీదేవి పరము. వారిని భేద భావములతో చూచువారు పరమును చేరకపోగా ఇహమున కూడ ఇక్కట్ల పాలగుచుందురు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 410 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj*
*🌻 89. Shivapriya shivapara shishteshta shishta-pujita*
*Aprameya svaprakasha manovachamagochara ॥ 89 ॥ 🌻*
*🌻 410. 'Shivapara'- 3 🌻*
*Lord Vishnu taught Sanaka Sananda and their brothers that He himself is in the form of followers. As followers, they walk with him everywhere during all times. For Lord Vishnu, there is no difference between Sanaka Sananda brothers and Jayavijaya brothers. Only the one who knows this charm, beauty, and the mystery of the state of Oneness can be considered wise. Sridevi is the destination of Lord Shiva. Lord Shiva is Sridevi's destination. Those who look at them with difference do not reach the Supreme, but they also shall face difficulties in the physical realm.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
コメント