top of page
Writer's picturePrasad Bharadwaj

🍀 29 - NOVEMBER - 2022 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🍀

🌹🍀 29 - NOVEMBER - 2022 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🍀🌹

1) 🌹29 - NOVEMBER నవంబరు - 2022 TUESDAY మంగళవారం, భౌమ వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 289 / Bhagavad-Gita -289 - 7వ అధ్యాయము 09 జ్ఞాన విజ్ఞాన యోగము🌹

3) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 650 / Sri Siva Maha Purana - 650 🌹

4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 001 / DAILY WISDOM - 001 🌹

5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 266 🌹

6) 🌹. శివ సూత్రములు - 03 / Siva Sutras - 03 🌹. చైతన్యమాత్మా - 3 Caitanyamātmā - 3


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹29, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹*

*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*

*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*

*ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : చంపా షష్టి, Champa Shashthi🌻*


*🍀. శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం - 4 🍀*


*5. ఆధివ్యాధి మహామారీ గ్రహపీడాపహారిణే | ప్రాణాపహర్త్రేదైత్యానాం రామప్రాణాత్మనే నమః*

*6. సంసారసాగరావర్త కర్తవ్యభ్రాన్తచేతసామ్ | శరణాగతమర్త్యానాం శరణ్యాయ నమోఽస్తు తే*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : ఆధ్యాత్మిక పట్టభద్రత - ఉత్తమమైన ఆధ్యాత్మిక పట్టాలు పొందగోరే వారు అంతులేని పరీక్షలలో ఉత్తీర్ణులు కావలసి వుంటుంది. కాని, చాలమంది ఉబలాటం పరీక్షాధికారికి లంచమిచ్చి పట్టభద్రులు కావాలని మాత్రమే. 🍀*


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, హేమంత ఋతువు,

దక్షిణాయణం, మార్గశిర మాసం

తిథి: శుక్ల షష్టి 11:05:14 వరకు

తదుపరి శుక్ల-సప్తమి

నక్షత్రం: శ్రవణ 08:39:10 వరకు

తదుపరి ధనిష్ట

యోగం: ధృవ 14:52:27 వరకు

తదుపరి వ్యాఘత

కరణం: తైతిల 11:07:14 వరకు

వర్జ్యం: 12:23:40 - 13:53:56

దుర్ముహూర్తం: 08:42:49 - 09:27:34

రాహు కాలం: 14:51:58 - 16:15:52

గుళిక కాలం: 12:04:10 - 13:28:04

యమ గండం: 09:16:22 - 10:40:16

అభిజిత్ ముహూర్తం: 11:42 - 12:26

అమృత కాలం: 21:25:16 - 22:55:32

సూర్యోదయం: 06:28:34

సూర్యాస్తమయం: 17:39:46

చంద్రోదయం: 11:44:20

చంద్రాస్తమయం: 23:19:22

సూర్య సంచార రాశి: వృశ్చికం

చంద్ర సంచార రాశి: మకరం

యోగాలు : లంబ యోగం - చికాకులు, అపశకునం

08:39:10 వరకు తదుపరి ఉత్పాద యోగం -

కష్టములు, ద్రవ్య నాశనం


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



🌹. శ్రీమద్భగవద్గీత - 289 / Bhagavad-Gita - 289 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం - 09 🌴


*09. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ ।*

*జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు।।*


🌷. తాత్పర్యం :

*భూమి యొక్క ఆద్యమైన సుగంధము, అగ్ని యందు ఉష్ణమును, జీవుల యందలి ప్రాణమును, తపస్వుల యందు తపస్సును నేనైయున్నాను.*


🌷. భాష్యము :

“పుణ్యము” అనగా శిథిలము కాకుండా ఉండునదని భావము. అట్టి పుణ్యము ఆద్యమైనట్టిది. పుష్పము, భూమి, జలము, అగ్ని, వాయువు మొదలైనవానికి ఒక ప్రత్యేకమైన వాసన యున్నట్లే జగమునందు ప్రతియొక్కటియు ఒక ప్రత్యేకమైన వాసనను (గంధమును) కలిగియుండును. ఆద్యమై సర్వత్రా వ్యాపించియుండి కలుషితము గానటువంటి పరిమళము శ్రీకృష్ణుడే అయి యున్నాడు. వాసన రీతిగానే ప్రతిదియు ఒక సహజరుచిని కలిగియుండును. కాని ఆ రుచి రసాయన మిశ్రణముచే మార్పుచెందగలదు. అనగా ఆద్యమైన ప్రతిదియు ఒక వాసనను, సుగంధము, రుచిని కలిగియుండును. ఇక “విభావసౌ” యనగా అగ్ని యని భావము. ఆ అగ్ని లేనిదే కర్మాగారములను నడుపుట, వంటచేయుట వంటి కార్యములు ఏవియును మనము చేయజాలము. అట్టి అగ్ని మరియు అగ్ని యందలి ఉష్ణము శ్రీకృష్ణుడే.


ఆయుర్వేదము ప్రకారము ఉదరములో జఠరాగ్ని మందగించుటయే అజీర్తికి కారణము. అనగా ఆహారము పచనమగుటకు సైతము అగ్నియే అవసరము. ఈ విధముగా భూమి, జలము, అగ్ని, వాయువు, సర్వచైతన్యపదార్థములు (రసాయనములు మరియు మూలకములు) శ్రీకృష్ణుని వలననే కలుగుచున్నవి కృష్ణభక్తిరసభావన ద్వారా మనము తెలిసికొనగలము. మనుజుని ఆయు:పరిమితి కూడా కృష్ణుని చేతనే నిర్ణయింపబడుచున్నది. కనుక ఆ కృష్ణుని కరుణచే మనుజుడు తన ఆయు:పరిమితిని పెంచుకొనుట లేక తగ్గించుకొనుట చేసికొనవచ్చును. అనగా కృష్ణభక్తిరస భావనయే అన్నిరంగములందును అవసరమైనట్టిది.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 289 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj


🌴 Chapter 7 - Jnana Yoga - 09 🌴


*09. puṇyo gandhaḥ pṛthivyāṁ ca tejaś cāsmi vibhāvasau*

*jīvanaṁ sarva-bhūteṣu tapaś cāsmi tapasviṣu*


🌷 Translation :

*I am the original fragrance of the earth, and I am the heat in fire. I am the life of all that lives, and I am the penances of all ascetics.*


🌹 Purport :

Puṇya means that which is not decomposed; puṇya is original. Everything in the material world has a certain flavor or fragrance, as the flavor and fragrance in a flower, or in the earth, in water, in fire, in air, etc. The uncontaminated flavor, the original flavor, which permeates everything, is Kṛṣṇa. Similarly, everything has a particular original taste, and this taste can be changed by the mixture of chemicals. So everything original has some smell, some fragrance and some taste. Vibhāvasu means fire. Without fire we cannot run factories, we cannot cook, etc., and that fire is Kṛṣṇa. The heat in the fire is Kṛṣṇa. According to Vedic medicine, indigestion is due to a low temperature in the belly. So even for digestion fire is needed.


In Kṛṣṇa consciousness we become aware that earth, water, fire, air and every active principle, all chemicals and all material elements are due to Kṛṣṇa. The duration of man’s life is also due to Kṛṣṇa. Therefore by the grace of Kṛṣṇa, man can prolong his life or diminish it. So Kṛṣṇa consciousness is active in every sphere.

🌷🌷🌷🌷🌷


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 . శ్రీ శివ మహా పురాణము - 650 / Sri Siva Maha Purana - 650 🌹*

*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 15 🌴*

*🌻. గణేశ యుద్ధము - 5 🌻*


ఇంతలో ప్రకాశస్వరూపురాలు, జ్ఞానస్వరూపురాలు అగు జగన్మాత ఆ వృత్తాంతమునంతనూ ఎరింగి అంతులేని కోపమును పొందెను (44). ఓ మహర్షీ! అపుడామెతన గణమునకు అన్ని విధములుగా సహాయతను చేకూర్చుటకై అచట రెండు శక్తులను నిర్మించెను (45). ఓ మహర్షీ! నల్లని పర్వతమువలెనున్న ఒక శక్తి గుహవంటి నోటిని విస్తరింపజేసి భయంకరమగు ఆకారమును ధరించి నిలబడెను (46). రెండవ శక్తి విద్యు ద్రూపములో నుండెను. ఆమె అనేక హస్తములను కలిగియుండెను. దుష్టులను శిక్షించు ఆ మహాదేవి భయమును గొల్పు చుండెను (47).


దేవతలు, గణములు ప్రయోగించిన ఆయుధములనన్నిటినీ తమ నోటితో గ్రహించి ఆ శక్తులు మరల వాటిని వెంటనే వారిపై విసిరినవి (48). వజ్రాయుధమునకు ఆ గతి పట్టగా పరిఘ వంటి ఆయుధమును గురించి చెప్పునదేమున్నది? ఈ తీరున వారచట అత్యద్భుతమగు క్రియల నాచరించిరి (49). పూర్వము గొప్ప కొండ సముద్రమును అడ్డగించిన తీరున, ఒకే ఒక బాలుడు జయింప శక్యము కాని సైన్యమునంతనూ అడ్డుకొనినాడు (50). ఒకే ఒక బాలుడు ఇంద్రాది దేవతలనందరినీ ఓడించి, శంకరుని గణములను చీకాకు పరిచినాడు (51). అపుడు అతని ప్రహారములచే కలత చెందిన వారందరు అనేక పర్యాయములు నిట్టూర్చి ఒకరితో నొకరు ఇట్లు పలికిరి (52).


దేవతలు, గణములు ఇట్లు పలికిరి -


ఏమి చేయవలెను? ఎచటకు పోవలెను? దిక్కులు పది తెలియకున్నవి. ఈతడు కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి పరిఘను త్రిప్పుచున్నాడు (53).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 SRI SIVA MAHA PURANA - 650🌹*

*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *


*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 15 🌴*


*🌻 Gaṇeśa’s battle - 5 🌻*


44. In the meantime, goddess, the mother of the universe, of special knowledge, came to know of the entire incident and was very furious.


45. O great sage, the goddess created two Śaktis[1] then and there for the assistance of her own Gaṇa.


46. O great sage, one Śakti assumed a very fierce form and stood there opening her mouth as wide as the cavern of a dark mountain.


47. The other assumed the form of lightning. She wore many arms. She was a huge and terrible goddess ready to punish the wicked.


48. The weapons hurled by the gods and the Gaṇas were caught in the mouth and hurled back at them.


49. None of the weapons of the gods was seen anywhere around the iron club of Gaṇeśa. This wonderful feat was performed by them.


50. A single boy stirred and churned the vast impassable army in the same manner as great mountain[2] churned the ocean of milk formerly.


51. Indra and other gods were struck by him, singlehanded. The Gaṇas of Śiva became agitated and distressed then.


52. Gasping frequently for their breath, being utterly shaken by his blows they gathered together and spoke to one another.


The gods and Gaṇas said'.—

53. “What shall be done? Where should we go? The ten directions have become visible. He is whirling the iron club right and left.”


Continues....

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 01 / DAILY WISDOM - 01 🌹*

*🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🌻. జ్ఞానమే స్వేచ్ఛ 🌻*


*అనంతమైన జీవితాన్ని పొందడమే పరిమిత జీవితానికి పరమ ప్రయోజనం. జ్ఞానం మరియు ధ్యానం రెండూ కూడా వారి ప్రియ లక్ష్యం అయిన సంపూర్ణమైన సాక్షాత్కారం పొందడం కోసమే. మోక్షం అనేది అత్యున్నత పరిపూర్ణత యొక్క సహజమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. విముక్తి అనేది నిజ వాస్తవికత యొక్క స్పృహ; ఇంతకు ముందు లేనిది ఏదో అవడం కాదు, మరియు గొప్ప ఆనందంతో కూడిన మరొక ప్రపంచానికి ప్రయాణించడం కాాదు.*


*ఇది శాశ్వతమైన ఉనికి యొక్క జ్ఞానం, స్వచ్ఛమైన జీవి యొక్క ముఖ్యమైన స్వభావం యొక్క అవగాహన. ఇది మనం ఎల్లప్పుడూ స్వేచ్ఛగా ఉన్నామని తెలుసుకోవడం ద్వారా పొందిన స్వాతంత్య్రం. జ్ఞానం కేవలం స్వేచ్ఛకు కారణం కాదు; అదే స్వేచ్చ.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹



*🌹 DAILY WISDOM - 01 🌹*

*🍀 📖 From The Realisation of the Absolute 🍀*

📝 Swami Krishnananda, 📚. Prasad Bharadwaj


*🌻 KNOWLEDGE IS FREEDOM 🌻*


*The attainment of the Infinite Life is the supreme purpose of finite life. Knowledge and meditation have both their dear aim in the realisation of the Absolute. Moksha is the highest exaltation of the self in its pristine nature of supreme perfection. Emancipation is the Consciousness of the Reality; not becoming something which previously did not exist, not travelling to another world of greater joy.*


*It is the knowledge of eternal existence, the awareness of the essential nature of Pure Being. It is the Freedom attained by knowing that we are always free. Knowledge is not merely the cause for freedom; it is itself freedom.*


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 266 🌹*

*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*


*🍀. వ్యక్తి నిజంగా జీవించాలనుకుంటే నువ్వు అన్నిటికీ సన్నిహితంగా వుండాలి. స్పందించాలి. భయానికి దూరంగా వుండాలి. మనం భయపడాల్సిన ఒకే ఒక విషయం భయం.🍀*


*సాధారణ జనం ముడుచుకుని వుంటారు. వాళ్ళు తలుపులు, కిటికీలు మూసుకుంటారు. భయంలో జీవిస్తారు. దాక్కుంటారు. తెలియని దానికి భయపడతారు. చంద్రుణ్ణి, సూర్యున్ని గాలిని, వానను అనుమతించరు. గులాబీ మొక్కని గదిలో పెట్టి రక్షిస్తున్నావని నువ్వనుకుంటావు. కానీ అది వాడి చనిపోతుంది. గాలి, వాన, ఎండ తగలకుంటే మరణిస్తుంది.*


*జనాలు అట్లా ముడుచుకుని వుంటారు. వ్యక్తి నిజంగా జీవించాలనుకుంటే నువ్వు అన్నిటికీ సన్నిహితంగా వుండాలి. స్పందించాలి. భయానికి దూరంగా వుండాలి. మనం భయపడాల్సిన ఒకే ఒక విషయం భయం. మనం దానికి తప్ప దేనికీ భయపడకూడదు. ఎందుకంటే భయం నలిపేస్తుంది. అణచివేస్తుంది.*


*సశేషం ...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. శివ సూత్రములు - 03 / Siva Sutras - 03 🌹*

*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*

1- శాంభవోపాయ

*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌻1. చైతన్యమాత్మ - 3 🌻*

*🌴. అత్యున్నత చైతన్యమే ప్రతిదానికీ వాస్తవికత. 🌴*


*విజ్ఞాన భైరవ (100వ శ్లోకం) ఇలా చెబుతోంది, “చైతన్యంగా వర్ణించబడిన బ్రాహ్మణుడు అన్ని జీవులలో ఉన్నాడు. ఇది వ్యక్తిని బట్టి మారదు. బ్రహ్మం సర్వత్రా ప్రబలంగా ఉంటుందని గ్రహించినవాడు ప్రపంచాన్ని జయిస్తాడు. ఇదే విషయాన్ని కృష్ణుడు భగవద్గీత (IV.13)లో ప్రకటించాడు. 'గుణాలు మరియు చర్యల యొక్క భేదం ప్రకారం, నేను నాలుగు కులాలను సృష్టించాను' అని అతను చెప్పాడు. సత్యాన్ని అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి ఒక నిర్దిష్ట మానసిక ప్రక్రియ ద్వారా వెళ్ళాలి. మానసిక ప్రక్రియ మూడు భాగాలను కలిగి ఉంటుంది. మొదటిది నేర్చుకోవడం మరియు రెండవది విశ్లేషించడం మరియు మూడవది అనుభవించడం.*


*శివుడు సర్వవ్యాపకుడు. అతను అంతర్గతంగా మరియు బాహ్యంగా రెండింటిలోనూ ప్రబలంగా ఉంటాడు. ఇది అభ్యాసం యొక్క ప్రధాన అంశం. ఉపనిషత్తులు మరియు ఇతర గ్రంధాలను అధ్యయనం చేయడం ద్వారా బ్రాహ్మణంపై విస్తృతమైన చర్చలు, నిరాకరణలు మరియు ధృవీకరణల ద్వారా విశ్లేషిస్తారు. అనుభవించడం అంటే ఉన్నత స్థాయి చైతన్యాన్ని పెంపొందించు కోవడం మరియు అనుభవం శివ సాక్షాత్కారంలో ముగుస్తుంది. మూలానికి చేరడంలో , ధ్యానం చివరి దశలో మాత్రమే సహాయ పడుతుంది. ఈ విషయం అర్థం చేసుకోకుండా చేసే ధ్యానం ఒకరి సమయాన్ని వృధా చేసే ప్రక్రియ. ఇది సంబంధిత

విషయంపై ప్రాథమిక పరిజ్ఞానం లేకుండా పరీక్ష రాయడం లాంటిది.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹



*🌹 Siva Sutras -03 🌹*

*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*

Part 1 - Sāmbhavopāya

*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*


*🌻1. Caitanyamātmā - 3 🌻*

*🌴 Supreme consciousness is the reality of everything.🌴*


*Vijnana Bhairava (verse 100) says, “The Brahman who is characterised as Consciousness is present in all beings. It does not vary from person to person. The one who realises that the Brahman prevails everywhere conquers the world.” The same discourse is declared by Krishna in Bhagavad Gita (IV.13). He says “According to the differentiation of attributes and actions, I have created four castes.” For understanding and realising the Truth one has to go through certain mental process. Mental process consists of three components. The first one is learning and the second one is analysing and the third one is experiencing.*


*Shiva is omnipresent and He prevails both internally and externally is the crux of learning. Study of Upanishads and other scriptures that make elaborate discussions on the Brahman, by means of negations and affirmations is analysing. Experiencing means developing higher level of consciousness and the experience culminates in Shiva realisation. Meditation is a source of help only in the last stage. Without understanding the subject, meditation is a process of wasting one’s time. It is like writing an examination without the basic knowledge of the concerned subject.*


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Comments


Post: Blog2 Post
bottom of page